మంగళగిరి: రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ప్రకటించిన దసరా పండుగ సెలవుల నిబంధనలను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు తప్పని సరిగా పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వ నియమ నిబంధనలును కొన్ని ప్రైవేటు, కార్పోరెట్ పాఠశాలలు పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్ ఫోన్ ద్వారా హోమ్ వర్కులు చేయమని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు లేదా ఆన్లైన్ తరగతులు లేదా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే apscpcr2018@gmail.com మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోంది: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment