strict actions
-
కాలుష్య భూతం: ముందు నోటీసులు.. ఆ తర్వాత చర్యలు!
దాదర్: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వాయు నాణ్యత క్షీణిస్తుండడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం అప్రమత్తమైంది. పరిస్ధితులు మరింత చేయి దాటకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది. అందులో భాగంగా భవన నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు, బిల్డర్లకు, వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న పరిశ్రమలకు నోటీసులు జారీ చేయనుంది. అంతేగాకుండా భవన నిర్మాణాలు జరిగేచోట కూలీలు సామూహికంగా వంట చేసుకోవడం, రాత్రుళ్లు చలి కాచుకునేందకు మంటలు వేసుకోవడాన్ని కూడా నిషేధించనుంది. పరిస్థితి చేయి దాటకముందే... దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంవల్ల ఏస్థాయిలో ఉందో తెలియంది కాదు. అయితే గత కొద్దిరోజులుగా ముంబైలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కారణాలేవైనా రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో వాయు నాణ్యత క్షీణిస్తోంది. ముంబై సహా తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో అనేక చోట్ల నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని నివాస భవనాలు కాగా మిగతావి షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్‌లు వంటి నిర్మాణాలున్నాయి. ఈ నిర్మాణాల వద్ద వాయు కాలుష్య నివారణకు సంబంధించిన నియమాలు పాటించడం లేదని బీఎంసీ దృష్టికి వచ్చింది. దీంతో నియమాలు పాటించనివారికి మొదటి హెచ్చరికగా ముందుగా నోటీసులు జారీ చేయనున్నారు. ఇచ్చిన గడువులోపు తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో సైట్‌కు సీలువేసి పనులు నిలిపివేస్తారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్లు, బిల్డర్లపై తగిన చర్యలు తీసుకుంటారు. పలుకారణాలతో వాయుకాలుష్యం.. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట వేలాది మంది కూలీలు, కార్మికులు పనులు చేస్తారు. వీరంతా గ్రూపులుగా ఏర్పడి ఉదయం, రాత్రుళ్లలో అక్కడే వంట చేసుకుంటారు. ఇందుకోసం వీరు కిరోసిన్ స్టౌ లేదా వంట గ్యాస్ సిలిండర్లను వాడరు. సైటువద్ద వృథాగా పడి ఉన్న కలపను వినియోగిస్తారు. ఈ కలప నుంచి భారీగా వెలువడే పొగ కాలుష్యాన్ని సృష్టిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం చలికాలం కావడంతో ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. చలి బారి నుంచి తట్టుకునేందుకు నగరంలోని మురికివాడల్లో, ఫుట్‌పాత్‌లు, రోడ్లపక్కన నివసించే పేదలు చలిమంట కాచుకుంటారు. చెత్త కాగితాలు, నిరుపయోగంగా పడి ఉన్న వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ చెత్త, కట్టెలు, గడ్డి తదితర సామాగ్రిని ఈ మంటలో వేస్తారు. వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాకుండా వాయునాణ్యత క్షీణించేందుకు ఇవి కూడా కారణాలవుతున్నాయి. అదేవిధంగా నగరంలో దాదాపు 50 వేలకుపైగా పాత కాలం నాటి బేకరీలున్నాయి. అందులో 24 గంటలు బ్రెడ్లు, పావ్‌లు, కేక్‌లు తయారవుతూనే ఉంటాయి. వీటి తయారీకి బేకరీ నిర్వాహకులు కలపనే వినియోగిస్తారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగ గాలి స్వచ్చతను దెబ్బతీస్తోంది. ప్రతీ వార్డులో వాటర్ స్ప్రింక్లర్... ఈ నేపథ్యంలో బీఎంసీ నూతన నిర్మాణాలు జరుగుతున్న చోట దుమ్ము, ధూళీ వెలువడకుండా చూసుకునే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్లు, బిల్డర్లేదనని హెచ్చరించింది. ఇందుకోసం ప్రతీ వార్డులో 5 నుంచి 9 వేల లీటర్ల నీరు వెదజల్లే వాటర్ స్ప్రింక్ర్లను అందుబాటులో ఉంచింది. ఈ స్ప్రింక్లర్లు రోడ్లపై గాలిలో ఎగురుతున్న దుమ్ము, ధూళిని నియంత్రిస్తాయి. ఫలితంగా కొంత శాతం కాలుష్యం నియంత్రణలోకి వస్తుందని బీఎంసీ భావిస్తోంది. అంతేకాకుండా రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లను మూసివేసే యోచనలో కూడా ఉంది. వాయు కాలుష్య నివారణ కోసం కొత్తగా అమలు చేయనున్న నియమాలు నిర్మాణ పనులు జరుగుతున్న భవనం చుట్టూ 35 అడుగుల ఎత్తున్న ఇనుప రేకులతో ప్రహరీ గోడను నిర్మించాలి.భవనానికి ఏర్పాటు చేసిన వెదురు బొంగుల కంచెకు జూట్ వస్త్రం లేదా ఆకుపచ్చ బట్ట చుట్టాలి. నిర్మాణాలు జరుగుతున్న సైట్ల వద్ద వాటర్ స్ప్రింక్లర్లను కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. రోజుకు 4 లేదా5 సార్లు నీటిని స్ర్పింకిల్ చేయాలి.కూలీలు, కార్మికులు కచ్చితంగా ముఖానికి మాస్క్, కళ్లద్దాలు ధరించాలి. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట కాపలగా ఉండే సెక్యూరిటీ గార్డులు చలికాచుకునేందుకు ఎలక్ట్రిక్ గ్యాస్ పొయ్యి కొనివ్వాలి. -
పార్టీ బలోపేతం కోసం కఠిన నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇందుకోసం ముందుగా పార్టీ నేతలు ఐకమత్యంతో, జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకోవడం మానాలని హితవు పలికారు. అదేవిధంగా, ఈవీఎంల వల్లే ఎన్నికల ప్రక్రియను అనుమానించాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని ఖర్గే నొక్కి చెప్పారు. అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై ఈ సమావేశంలో ప్రధానంగా నేతలు చర్చించారు. ఈ భేటీలో ఖర్గే ప్రసంగించారు.నేతల మధ్య కలహాలతోనే పార్టీకి చేటుకాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఖర్గే మండిపడ్డారు. నేతల్లో ఐకమత్యం లేకపోవడం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పెడపోకడలు పార్టీకి చేటు తెస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఒక్కతాటిపై నిలబడకుండా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటే రాజకీయ ప్రత్యర్థులను ఎలా ఓడించగలం?అని ప్రశ్నించారు. ‘ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని, లోపాలను సరి చేసుకోవాలి. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, సరైన వ్యూహంతో ముందుకు సాగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఐకమత్యం, క్రమశిక్షణ కలిగి ఉండటం ఎంతో ముఖ్యమైంది. పార్టీ గెలుపును తమ గెలుపుగా, ఓటమిని సొంత ఓటమిగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం ఉంది. పార్టీ బలమే మన బలం’అని ఖర్గే చెప్పారు. అదే సమయంలో ఇటీవలి ఎన్నికల ఫలితాలను చూసి నిరుత్సాహ పడరాదని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ‘అట్టడుగు స్థాయి నుంచి ఏఐసీసీ స్థాయి వరకు సమూలంగా మార్పులు చేస్తూ పార్టీని బలోపేతం చేయాలి. ఈ ప్రక్రియలో ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అవి ఊహించని ఫలితాలులోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు పార్టీని ఒక్కసారిగా కుదిపేశాయని ఖర్గే అన్నారు. ‘మహా వికాస్ అఘాడీ సాధించిన ఫలితాలు రాజకీయ పండితులు సైతం ఊహించనివి. ఇలాంటి ఫలితాలు ఏ అంచనాలకూ అందనివి. నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసిన ఇండియా కూటమి పార్టీలు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ, మనం సాధించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. మన పార్టీ భవిష్యత్తుకు ఇదో సవాల్. ఈ ఫలితాలు మనకో గుణపాఠం. వీటిని బట్టి సంస్థాగతంగా మనకున్న బలహీనతలను, లోపాలను సరిచేసుకోవాలి. ఎన్నికల సమయంలో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపించినా ఆ మేరకు విజయం సాధించలేకపోయాం. అనుకూల వాతావరణాన్ని అనుకూల ఫలితాలను సాధించేలా మనం మార్చుకోలేకపోయాం.దీనిపై ఆత్మ విమర్శ చేసుకోవాలి’అని ఖర్గే తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జై రామ్ రమేశ్ పాల్గొన్నారు.ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై ఉద్యమంయావత్తూ ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత దారుణంగా దెబ్బతిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. ఈ అంశంపై త్వరలో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక తీర్మానం ఆమోదించింది. ‘సమాజంలోని అన్ని వర్గాల్లో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. ప్రజల ఆందోళనలకు కాంగ్రెస్ జాతీయ స్థాయి ఉద్యమ రూపం తీసుకువస్తుంది’అని ఆ తీర్మానం తెలిపింది. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరపాలనే రాజ్యాంగ నిర్దేశం అమలు ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో ప్రశ్నార్థకంగా మారిపోయిందని తీర్మానం పేర్కొంది.దాదాపు నాలుగున్నర గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి, తీర్మానం ఆమోదించిందని జైరాం రమేశ్, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్ మీడియాకు చెప్పారు. సంస్థాగత అంశాలు, ఎన్నికల ఫలితాలపై విశ్లేషించేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా సమావేశం నిర్ణయించిందని వివరించారు. -
నేరాలను ఉపేక్షించం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేటి నుంచి నేరాలు జరిగితే సహించబోమని.. ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. గత ఐదేళ్లలో గాడి తప్పిన శాంతి భద్రతలను గాటన పెడతానన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు, నేర చరితులకు స్థానం లేదని చెప్పారు. ప్రజలు కక్ష తీర్చుకోమని మనకు అధికారం ఇవ్వలేదని, రాజకీయ కక్షలు తీర్చుకోవాలనుకోవడం సరి కాదని సూచించారు. పోలీస్ శాఖలో మార్పు తీసుకొచ్చి కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన పెంచుతామన్నారు. 2019–24 వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయిపై గురువారం శాసనసభలో సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని, హైదరాబాద్‌లో మతకల్లోలాలను తానే అరికట్టానని చెప్పారు. 2019–24 మధ్య రాష్ట్రంలో చీకటి పాలన నడిచిందని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని ఆరోపించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారని, రామతీర్థం విషయంలో అశోక్‌గజపతిరాజుపై కేసులు పెట్టారని చెప్పారు. శస్త్ర చికిత్స చేయించుకున్న అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి 600 కి.మీ తరలించారన్నారు. ప్రశ్నపత్రం లీకైందని పొంగూరు నారాయణపై కేసు పెట్టారని, రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. సభలో ఉన్న కూటమి సభ్యుల్లో 80 శాతం మందిపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందంటూ ప్రజెంటేషన్ ఇచ్చారు. వినుకొండలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గంజాయి మత్తులో దాడులు చేసుకోగా ఒకరు హత్యకు గురైనట్లు మాజీ ఎమ్మెల్యే సైతం ఒప్పుకోగా మాజీ సీఎం మాత్రం శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రతిపక్షాలను నియంత్రించేందుకు జీవో నం.1 తెచ్చి టీడీపీ నాయకులపై 591 కేసులు, జనసేనపై 24 కేసులు పెట్టారన్నారు.అంగళ్లు, పుంగనూరు దాడుల ఘటనల్లో తిరిగి తనపైనే కేసులు పెట్టారన్నారు. ఐదేళ్లల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని, 300 మంది బీసీలు హత్యకు గురయ్యారని చెప్పారు. గత ఐదేళ్లలో ఎస్సీలపై 10,377, ఎస్టీలపై 1,768, మహిళలపై 89,875, చిన్నారులపై 8,641 ఫోక్సో కేసులు, నేరాలు జరిగాయన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. -
Public Exam Bill 2024: పేపర్ లీకేజీలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీ ఉదంతాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో పరీక్షల అక్రమార్కులపై కేంద్రం కఠిన చర్యల కొరడా ఝులిపించింది. పేపర్ లీకేజీలు, నకిలీ వెబ్సైట్లుసహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు–2024’ను తీసుకొచ్చింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఇన్నాళ్లూ ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేకపోవడంతో దీనిని తీసుకొచ్చారు. బిల్లులో ఏముంది? ► ప్రశ్నపత్రం, ప్రశ్నపత్రం కీ లీకేజీకి పాల్పడి నా, కంప్యూటర్ నెట్వర్క్/ రీసోర్స్/ సిస్టమ్‌ను ట్యాంపర్ చేసిన వ్యక్తులు/సంస్థలను కఠినంగా శిక్షిస్తారు ► నకిలీ వెబ్సైట్లు నిర్వహించడం, నకిలీ ఉద్యోగ/ప్రవేశ పరీక్షలు చేపట్టడం, నకిలీ అడ్మిట్ కార్డులు, ఆఫర్ లెటర్లు ఇవ్వడం, ఒకరి బదులు ఇంకొకరితో ఎగ్జామ్ రాయించడం వంటి అవకతవకలు చేసి నగదు వసూళ్లకు పాల్పడితే గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. ► వీటితో ప్రమేయమున్న వ్యక్తులు/సంస్థలు/ఏజెన్సీలు/వ్యాపారసంస్థలు/ సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.1 కోటి జరిమానా విధిస్తారు. ఇంకోసారి ప్రభుత్వం నుంచి సంబంధిత పనులు చేపట్టకుండా నాలుగేళ్లపాటు నిషేధం విధిస్తారు. ► యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్స్‌లో కలగజేసుకున్న అక్రమార్కులను సంబంధిత నియమాల కింద శిక్షిస్తారు. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకూ ఈ బిల్లులోని నియమాలు వర్తిస్తాయి. ► ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యతలు చూసే కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సిబ్బంది మొత్తం ఈ చట్టపరిధిలోకి వస్తారు. -
ఎంపీలకే డిజిటల్ యాక్సెస్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లోక్‌సభ సెక్రెటేరియట్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంట్ హౌజ్ పోర్టల్ లేదా పార్లమెంట్ యాప్‌ల పాస్వర్డ్లు, ఓటీపీలను ఎంపీలు ఇతరులతో షేర్ చేసుకోవడాన్ని నిషేధించింది. పార్లమెంట్ సభ్యులు మాత్రమే డిజిటల్ సంసద్ పోర్టల్ లేదా యాప్‌లను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఎంపీలు ఇకపై తమ అధికారిక ఈ–మెయిల్ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులకు కూడా షేర్ చేయడం నిషిద్ధమని స్పష్టం చేసింది. సభలో ప్రశ్నలు అడగడం కోసం ముందుగానే నోటీసులు ఇవ్వడానికి, ట్రావెల్ బిల్లులు సమర్పించడానికి పార్లమెంట్ పోర్టల్, యాప్‌లను ఎంపీలు ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించవచ్చు. ఈమెయిల్, ఫోన్ నంబర్‌తో పోర్టల్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన అధికారిక ఈమెయిల్ పాస్‌వర్డ్‌ను దుబాయి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచి్చనట్లు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారించింది. డిజిటల్ సంసద్ పోర్టల్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచి్చంది. ఈ పోర్టల్‌కు ఎలా ఉపయోగించాలో చాలామందిఎంపీలకు తెలియదు. అందుకే వారు తమ వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులపై ఆధారపడుతున్నారు. ఈమెయిల్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి అందజేస్తున్నారు. దీనివల్ల పోర్టల్ అనధికార వ్యక్తుల చేతుల్లో పడి దురి్వనియోగం అవుతున్నట్లు మహువా మొయిత్రా కేసు నిరూపించింది. ఈ నేపథ్యంలో పోర్టల్ పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులకు ఇవ్వడాన్ని నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. -
ఢిల్లీ వాసులకు అలర్ట్!
ఢిల్లీ: దేశ రాజధానిలో అనధికార ఎమర్జెన్సీ నడుస్తోంది. కొద్ది రోజులుగా కాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో ఢిల్లీ సర్కారు జీఆర్‌ఐపీ-3 నిబంధనలను కఠినతరం చేసింది. కనీసం మార్నింగ్, ఈవెనింగ్ జాగింగ్‌కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాణసంచా కాల్చొద్దని హెచ్చరికలు చేసింది. ఢిల్లీలో ఓ వైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో కమ్ముకుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ వైపు నుంచి భారీగా పొగ వస్తోంది. మరో వైపు చలి వాతావరణంతో నగరంపై పొగ నిలిచిపోయింది. ఇదే సమయంలో దీపావళి కావడంతో కాలుష్యం వీపరీతంగా పెరిగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. "బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దు. దోమలను చంపేందుకు కాయిల్స్, అగరబత్తులు కాల్చొద్దు. కలప, ఆకులు, పంట వ్యర్ధాలు దహనం చేయొద్దు. తరచూ కళ్లను నీటితో శుభ్రం చేసుకోవాలి. గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే వైద్యులను సంప్రదించాలి." అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంతటి స్థాయిలో కాలుష్యం పెరిగిపోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీకి పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. పాఠశాలలు, విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆన్ లైన్ క్లాసులు జరుపుతున్నాయి. అవసరం లేకుండా బయట తిరగొద్దని డాక్టర్ల సూచిస్తున్నారు. ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
మంగళగిరి: రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ప్రకటించిన దసరా పండుగ సెలవుల నిబంధనలను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు తప్పని సరిగా పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వ నియమ నిబంధనలును కొన్ని ప్రైవేటు, కార్పోరెట్ పాఠశాలలు పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్ ఫోన్ ద్వారా హోమ్ వర్కులు చేయమని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు లేదా ఆన్లైన్ తరగతులు లేదా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే apscpcr2018@gmail.com మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోంది: సీఎం జగన్ -
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ ఎస్పీ (సైబర్ నేరాలు) హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారు, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, నకిలీ వార్తలు, కించపరిచే వీడియోలు, వ్యాఖ్యలకు బాధ్యులు రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లోనూ ఎక్కడ ఉన్నా వారి ఆటకట్టిస్తామని చెప్పారు. ఈ నేరగాళ్లను పట్టుకొనేందుకు సీఐడీ విభాగం పరస్పర న్యాయ సహాయ ఒప్పందం ద్వారా ఇంటర్ పోల్, ఇతర దేశాలతో కలసి పనిచేస్తోందని చెప్పారు. ఆయన శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు సైబర్ భద్రత కల్పించేందుకు సీఐడీ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధమైందన్నారు. ఆన్లైన్ ద్వారా వేధింపులు, ఆర్థిక మోసాలు, జూదం/బెట్టింగులు, సైబర్ బెదిరింపులు, ఉద్యోగ మోసాలు, వైవాహిక మోసాలు, రాన్సమ్వేర్, క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ రుణ మోసాలు మొదలైన అన్ని సైబర్ నేరాలను నిరోధించేందుకు సీఐడీ పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా ఫేక్ పోస్టులు, వార్తలు, ట్రోలింగ్లు, మార్ఫింగ్ వీడియోలు వంటివి పోస్టు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నిరోధించేందుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీపీపీఎస్) ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యేకంగా 60 మంది సైబర్ వలంటీర్లను కూడా నియోగించామన్నారు. నకిలీ వార్తలు, దుష్ప్రచార పోస్టులను తొలగించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ 9071666667ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సైబర్ నేరాలు, దుష్ప్రచారాలపై రెండేళ్లలో ఏకంగా 23 వేల కేసులు నమోదు చేశామని, రూ.30 లక్షల వరకు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామని, 3 వేల మందిని మ్యాపింగ్ చేశామని తెలిపారు. ఇటువంటి నేరాలను అరికట్టడంపై గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసు విభాగం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించేందుకు విశాఖపట్నంలో అక్టోబరు 7, 8 తేదీల్లో సైబర్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు హర్షవర్థన్ రాజు చెప్పారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఫిర్యాదుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు ♦ ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్: 1930 ♦ సైబర్ మోసాలను ఆన్లైన్లో నివేదించడానికి: cybercrime.gov.in ♦ సైబర్ నేరాలపై ఇ–మెయిల్ ద్వారా ఫిర్యాదుకు: cybercrimes& cid@ap.gov.in ♦ ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదుల కోసం సీఐడీ వెబ్సైట్: cid.appolice.gov.in ♦ ఫేస్బుక్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు: itcore&cid@ap.gov.in ♦ ట్విట్టర్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు:@apcidcyber ♦ యూట్యూబ్ చానెల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు: APCID4S4U -
భారత్ అభివృద్ధే ప్రపంచాభివృద్ధి
వాషింగ్టన్: మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడంలో ‘అయితే, కానీ’లకు ఎంతమాత్రం తావులేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఉగ్రవాదాన్ని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్ డీసీలో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 60 నిమిషాలపాటు మోదీ ప్రసంగం కొనసాగింది. పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లతోపాటు సందర్శకుల గ్యాలరీల నుంచి వందలాది మంది భారతీయ–అమెరికన్లు మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అమెరికాలో 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు, భారత్‌లో 26/11 దాడులు జరిగి దశాబ్దం పూర్తయినా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచానికి ఇప్పటికీ సవాలు విసురుతూనే ఉన్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మతి తప్పిన సిద్ధాంతాలు కొత్తరూపును, కొత్త గుర్తింపును సంతరించుకుంటున్నాయని, అయినప్పటికీ వాటి ఉద్దేశాలు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ముమ్మాటికీ శత్రువేనని స్పష్టం చేశారు. ముష్కర మూకలను అణచివేయడంలో ఎవరూ రాజీ పడొద్దని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పొరుగు దేశాలను ఎగుమతి చేస్తున్న దుష్ట దేశాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఏం మాట్లాడారంటే.. భారీగానే కాదు.. వేగంగానూ అభివృద్ధి ‘‘గత దశాబ్ద కాలంలో వంద మందికిపైగా అమెరికా పార్లమెంట్ సభ్యులు భారత్‌లో పర్యటించారు. భారతదేశ అభివృద్ధిని తెలుసుకోవాలని, అక్కడి ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. భారత్ ఇప్పుడేం చేస్తోంది? ఎలా చేస్తోంది? అన్నదానిపై అందరికీ ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో నేను మొదటిసారి పర్యటించినప్పుడు భారత్ ప్రపచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. మేము భారీగానే కాదు, వేగంగానూ అభివృద్ధి సాధిస్తున్నాం. భారత్ ప్రగతి సాధిస్తే మొత్తం ప్రపంచం ప్రగతి సాధిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం .. భూగోళంపై ఆరింట ఒక వంతు జనాభా భారత్‌లోనే ఉంది. ఇండో–పసిఫిక్‌లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం.. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇతర దేశాల సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్ సూచిస్తోంది. ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) అన్ని దేశాలూ అనుసరించాలి. చార్టర్‌ను గౌరవించాలి. కానీ, ఇండో–పసిఫిక్‌పై బలప్రయోగం, ముఖాముఖి ఘర్షణ అనే నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఇది కూడా ఒక ప్రాధాన్యతాంశమే. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ఆవశ్యకతపై అమెరికాతో మా అభిప్రాయాలు పంచుకున్నాం. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ‘క్వాడ్’ వంటి కూటములు ఈ ప్రయత్నంలో ఒక భాగమే. ఇండో–పసిఫిక్ బాగు కోసం క్వాడ్ కృషి చేస్తోంది. ఉక్రెయిన్ సంఘర్షణ ఆసియా ప్రాంతంలో సమస్యలు సృష్టించిన మాట వాస్తవమే. ఇది యుద్ధాల శకం కాదని, చర్చలు, దౌత్యమార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని సూటిగా చెప్పా. ఇదొక గొప్ప గౌరవం 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ అమెరికా పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రెండుసార్లు ఈ అవకాశం దక్కడం గర్వకారణం. మనం ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్నాం. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ(ఏఐ)లో ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అదేసమయంలో మరో ఏఐ(అమెరికా, ఇండియా)లో మరిన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో రక్షణ సహకారం విషయంలో మనం(భారత్, అమెరికా) అపరిచితులమే. పెద్దగా రక్షణ సహకారం లేదు. కానీ, ఇప్పుడు భారత్‌కు అమెరికా అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామిగా మారింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్ తల్లిలాంటిది. భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా వర్ధిల్లుతున్నాయి. సమానత్వం, ప్రజల గౌరవానికి స్ఫూర్తినిచ్చేదే ప్రజాస్వామ్యం. ఆలోచనకు, వ్యక్తీకరణకు రెక్కలు తొడిగేది ప్రజాస్వామ్యం. ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్య విలువలకు భారత్ ఆయువుపట్టుగా నిలుస్తోంది. వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణాన్ని పండుగలా జరుపుకుంది. ఇది కేవలం ప్రజాస్వామ్య ఉత్సవం కాదు, వైవిధ్య వేడుక. సామాజిక సాధికారత, ఐక్యత, సమగ్రత వేడుక. డిజిటల్ చెల్లింపుల అడ్డా భారత్ యువ జనాభా అధికంగా ఉన్న ప్రాచీన దేశం భారత్. సంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్. నేటి యువత భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నారు. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీల విలువ 320 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రక్రియలో 25 బిలియన్ డాలర్లు ఆదా చేశాం. భారత్‌లో ఇప్పుడు అందరూ స్మార్ట్ఫోన్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వీధి వ్యాపారుల సైతం యూపీఐ సేవలను వాడుకుంటున్నారు. గత ఏడాది ప్రపంచంలో జరిగిన ప్రతి 100 రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 46 చెల్లింపులు భారత్‌లోనే జరిగాయి. వేలాది మైళ్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, చౌక డేటాతో భారత్‌లో సాంకేతిక విప్లవం కొనసాగుతోంది. మహిళల సారథ్యంలో అభివృద్ధి ప్రాచీన కాలం నాటి వేదాలు నేటి మానవాళికి గొప్ప నిధి లాంటివి. మహిళా రుషులు సైతం వేదాల్లో ఎన్నో శ్లోకాలు, పద్యాలు రాశారు. ఆధునిక భారతదేశంలో మహిళలు ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో మహిళల సారథ్యంలో అభివృద్ధి జరగాలన్నదే మా ఆకాంక్ష. గిరిజన తెగకు చెందిన ఓ మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 10.5 లక్షల మంది మహిళలు వివిధ పదవులు చేపట్టారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళంలోనూ విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశం భారత్. అంగారక గ్రహంపైకి మనుషులను చేర్చేందుకు చేపట్టిన మార్చ్ మిషన్‌లో మహిళామణులు పనిచేస్తున్నారు. మహిళలకు సాధికారత కలి్పసే సమూల మార్పులు రావడం ఖాయం. ఆడపిల్లల చదువులు, వారి ఎదుగుదల కోసం పెట్టుబడి పెడితే వారు మొత్తం కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. సంస్కరణల సమయమిది.. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం వచి్చంది. ప్రపంచం మారుతోంది. అంతర్జాతీయ సంస్థలూ మారాల్సిందే. భారత్–అమెరికా మరింత సన్నిహితమవుతున్నాయి. పరస్పర సంబంధాల విషయంలో నూతన ఉషోదయం కనిపిస్తోంది. భారత్–అమెరికా సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలనే కాదు, ప్రపంచ భవితవ్యాన్ని కూడా నిర్ధారిస్తాయి. మహాత్మా గాం«దీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తోపాటు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడినవారిని మేమే స్మరించుకుంటున్నాం. భారత్‌లో 2,500కు పైగా రాజకీయ పారీ్టలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పరిపాలిస్తున్నాయి. దేశంలో 22 అధికార భాషలున్నాయి. వేలాది యాసలున్నాయి. కానీ, మేమంతా ఒకే స్వరంతో మాట్లాడుతాం. ప్రపంచంలోని అన్ని నమ్మకాలు, విశ్వాసాలకు భారత్‌లో స్థానం ఉంది, వాటిని గౌరవిస్తున్నాం. వైవిధ్యం అనేది భారత్‌లో ఒక సహజ జీవన విధానం. అమెరికా పార్లమెంట్లో భారతీయ–అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సభలో సమోసా కాకస్ ఫ్లేవర్ ఉంది. ఇది మరింత విస్తరించాలి. భారత్‌లోని భిన్న రుచులు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నాను. -
మతమార్పిళ్లకు రాజకీయ రంగు పులమొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: ‘‘మతమార్పిళ్లు చాలా సీరియస్ విషయం. దీనికి రాజకీయ రంగు పులమొద్దు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టేలా కేంద్ర రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎం షా, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పి.విల్సన్ చేసిన వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ఇలా వాదించేందుకు మీకు వేరే కారణాలుండొచ్చు. అంతమాత్రాన కోర్టు విచారణను మరోలా మార్చుకునేందుకు ప్రయత్నించకండి. మీ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుతుంటే అది కచ్చితంగా తప్పే. దీన్ని రాజకీయం చేయకండి’’ అంటూ హితవు పలికింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించి ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని కోరింది. -
క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. కొత్త తరహా సాధనాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఎక్సే్ఛంజ్‌లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50–60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30–40 చిన్న ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10–15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. నియంత్రణలు.. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్సే్ఛంజ్‌ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తం మీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థించే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017–2021 మధ్య ఈక్విటీలు–క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30–40% నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. -
రష్యా రెక్కలు విరుస్తాం: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నియంతగా, యుద్ధ పిపాసిగా అభివర్ణించారు. అకారణ యుద్ధానికి దిగినందుకు ఆయన దోషిగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయమన్నారు. జీ7 దేశాల నేతలతో గంటకు పైగా వర్చువల్‌గా చర్చించాక భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా, ఇతరత్రా కూడా రష్యా రెక్కలు విరిచేస్తామన్నారు. ‘‘మరో నాలుగు అతి పెద్ద రష్యా బ్యాంకులపై, పుతిన్‌కు సన్నిహితులైన ఆ దేశ కుబేరులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాం. ఆ బ్యాంకులకు, సంపన్నులకు చెందిన అన్ని ఆస్తులనూ జప్తు చేస్తున్నాం. ఇక అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలతో రష్యాకు సంబంధాలన్నీ తెగిపోయినట్టే. చదవండి: (Vladimir Putin: రష్యా అధ్యక్షుడికి ఎక్కడిదీ బరి తెగింపు!) డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్ కరెన్సీల్లో ఇకపై రష్యా ఎలాంటి లావాదేవీలు చేయలేదు. ఆ దేశ ఎగుమతులు, దిగుమతుల సామర్థ్యం తీవ్రంగా దెబ్బ తీస్తాం. ఇవన్నీ యూరోపియన్ యూనియన్, జపాన్ తదితర దేశాలతో కలిసి అమెరికా సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలు. త్వరలో రష్యాపై మరిన్ని అతి కఠిన ఆంక్షలుంటాయి’’ అని ప్రకటించారు. తూర్పు యూరప్‌లోని నాటో స్థావరాలకు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తున్నట్టు చెప్పారు. నాటో దేశాలకు చెందిన ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటామన్నారు. ఉక్రెయిన్ క్షేమం కోసం ప్రపంచ దేశాలన్నింటితో కలిసి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆ దేశానికి నైతికంగా, మానవతా దృక్పథంతో అన్ని రకాల సాయమూ చేస్తామన్నారు. చదవండి: (Russia Ukraine War Effect: ప్రపంచం చెరి సగం.. భారత్ ఎందుకు తటస్థం?) -
లండన్‌లో కఠిన ఆంక్షలు!
లండన్: కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. లండన్‌లో ఆంక్షలను మరింత కఠినం చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లండన్‌లో కఠినమైన ‘టయర్ 3’ ఆంక్షలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నట్లు ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ పేర్కొంది. ఈ విషయంపై లండన్ ఎంపీలకు అధికారులు సమాచారమిచ్చారని తెలిపింది. అయితే, దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని, దేశ రాజధాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నిర్ణయాలు వద్దని లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. లండన్‌లో టయర్ 3 ఆంక్షలను విధించే విషయమై ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాంకాక్ ప్రతినిధుల సభలో త్వరలో ఒక ప్రకటన చేయనున్నారు. ‘టయర్ 3’లో.. ఎక్కువమంది పాల్గొనే అన్ని బహిరంగ కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. బార్లు, పబ్‌లు, కెఫేలు, రెస్టారెంట్లను మూసివేస్తారు. వాటి నుంచి ‘టేక్ అవే’కు మాత్రం అవకాశముంటుంది. థియేటర్లను మూసివేస్తారు. పౌరులు టయర్ 3 ఆంక్షలున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు ప్రయాణించకూడదు. -
కరోనా కేసులు పైపైకి...
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్య 12 వేలు దాటింది. దేశంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల్లో కొత్తగా 826 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 28 మంది కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో 9 మంది, గుజరాత్లో ఆరుగురు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు కన్నుమూశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,759కి, మొత్తం మరణాల సంఖ్య 420కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఇండియాలో యాక్టివ్‌కరోనా కేసులు 10,824 కాగా, 1,514 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. దేశంలో కరోనా బారిన పడిన వారిలో 76 మంది విదేశీయులు ఉన్నారు. దేశంలో 325 జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం చెప్పారు. ఆయా జిల్లాల్లో అమలు చేస్తున్న పటిష్టమైన నియంత్రణ చర్యల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. కరోనా సంబంధిత మరణాల్లో మహారాష్ట్రదే తొలిస్థానం. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 187 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 53 మంది, గుజరాత్లో 36, ఢిల్లీలో 32, తమిళనాడులో 14, పంజాబ్‌లో 13, ఉత్తరప్రదేశ్‌లో 13 మంది మృతిచెందారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 2,919 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ధారావిలో పాజిటివ్ కేసులు 86 దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో ప్రస్తుతం కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఇక్కడ గురువారం ఒక్కరోజే 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86కు చేరింది. ధారావిలో కరోనాతో ఇప్పటికే 9 మంది మృతిచెందారు. ముస్లిం నగర్, ముకుంద్ నగర్, సోషల్ నగర్, రాజీవ్ నగర్, సాయిరాజ్ నగర్, ట్రాన్సిట్ క్యాంప్, రామ్‌జీ ఛాల్, లక్ష్మీ ఛాల్, జనతా సొసైటీ, శివశక్తి నగర్ తదితర ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇవన్నీ ధారావి మురికివాడలో భాగమే. ఇక్కడ 15 లక్షల మంది నివసిస్తున్నారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయండి: కేంద్ర హోంశాఖ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఫేసు మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటించడం, ఒకేచోట ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడకపోవడం వంటి నిబంధనల అమలు విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉమ్మివేయకుండా చూడాలని చెప్పారు. పని ప్రదేశాల్లో చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మద్యం, గుట్కా, పొగాకు అమ్మకాలపై ప్రస్తుతం నిషేధం ఉందని, దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా విదేశాల్లో ఉంటున్న భారతీయులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు ఈ వైరస్ సోకిందని, ఇప్పటిదాకా 25 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న భారతీయులు అక్కడే ఉండాలని, ఇప్పటికిప్పుడు వారందరిని వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ కోసం 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఎగుమతి చేయాలని నిర్ణయించినట్లుప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
శబరిమలలో పాడైన ఆహారమిస్తే చర్యలు
శబరిమల: శబరిమలలో ఉన్న హోటళ్లు తమ కస్టమర్లకు తాజాగా ఉన్న ఆహారాన్ని కాకుండా, పాడైన ఆహారాన్ని అందిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు హెచ్చరించింది. నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువకు అమ్మినా చర్యలు తప్పవని స్పష్టంచేసింది. స్థానికంగా ఉన్న హోటళ్లలోని ఉద్యోగులకు హెల్త్ కార్డులను తప్పనిసరి చేస్తూ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామని టీడీబీ అధ్యక్షుడు వాసు తెలిపారు. -
11,800 దిగువకు నిఫ్టీ
మ్యూచువల్ ఫండ్స్‌పై నిబంధనలను కఠినతరం చేస్తూ సెబీ నిర్ణయాలు తీసుకోవడం ప్రతికూల ప్రభావం చూపడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. జీ–20 సమావేశం నేపథ్యంలో అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు చర్చలు జరిగే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కూడా మార్కెట్ క్షీణతకు ఒక కారణమని నిపుణులు పేర్కొన్నారు. గత నాలుగు వారాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయన్న వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు తగ్గి 39,395 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్లు పతనమై 11,789 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, కమోడిటీ షేర్లు కూడా పతనమయ్యాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు లాభపడటంతో నష్టాలు పరిమితమయ్యాయి. అయితే వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 65 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్‌చేసే లిక్విడ్ స్కీమ్స్.. తమ నిధుల్లో కనీసం 20 శాతం మేర నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి లిక్విడ్ అసెట్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని సెబీ ఆదేశించింది. అంతేకాకుండా షేర్ల తనఖాగా రుణాలిచ్చిన కంపెనీలతో తదనంతర చెల్లింపుల ఒప్పందాలు కుదుర్చుకోవడంపై నిషేధం విధించింది. మరోవైపు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్‌కంపెనీలపై మరింత నిఘా అవసరమంటూ ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక వెల్లడించింది. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముడి చమురు ధరలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పెరగడం... మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపించలేదు. సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత తేరుకొని మళ్లీ లాభాల్లోకి వచ్చింది. వెంటనే మళ్లీ నష్టాల బాట పట్టింది. ఆల్‌టైమ్ హైకి ఎస్బీఐ మొండి బకాయిల సమస్య తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని, 2020, మార్చి నాటికి మొత్తం రుణాల్లో మొండి రుణాలు 9 శాతానికి తగ్గగలవన్న తాజా ఆర్బీఐ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు 12 శాతం వరకూ పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.365ను తాకింది. చివరకు శాతం 0.3 శాతం నష్టంతో రూ.361 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐఓబీలు 1–7 శాతం రేంజ్ లాభాలతో ముగిశాయి. ఎస్బీఐతో పాటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, గోద్రేజ్ ప్రొపర్టీస్, హావెల్స్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ, ఒబెరాయ్ రియల్టీ, ట్రెంట్ తదితర షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. కాక్స్ అండ్ కింగ్స్ పతనం కొనసాగుతోంది. శుక్రవారం ఈ షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌తో రూ.36 వద్ద ముగిసింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వాయిదా వేసే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా రిలయన్స్ క్యాపిటల్ షేర్ 6 శాతం నష్టంతో రూ.66 వద్ద ముగిసింది. ఒక దశలో 89 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 224 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 313 పాయింట్ల రేంజ్లో కదలాడింది. -
బెల్టు తీయాల్సిందే
సాక్షి,గుడివాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యనిషేధంపై తీసుకున్న నిర్ణయంలో భాగంగా బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతూ తొలి అడుగు వేశారు. ఎక్కడైనా బెల్టు షాపులు నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా బృందాలు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో బెల్టు షాపులకు తావు లేకుండా పోతోంది. గత ప్రభుత్వం బెల్టుషాపుల నియంత్రణ విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవడంతో గ్రామాల్లో మద్యం ఏరులై పారింది. ప్రతి గ్రామంలో గుడి, బడి, గ్రామ శివారులో బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉండేవి. బెల్టుషాపుల వల్ల కష్టజీవులు తమ కష్టాన్ని మద్యానికి తగలేయడమే కాకుండా పచ్చని కాపురాల్లో చిచ్చు రేపి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుదేలై రోడ్డున పడ్డాయి. ఎంతోమంది అనారోగ్యం పాలై ఆస్ప్రతుల్లో చేరారు. ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తిగా... వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా అనేకమంది పేదలు మద్యం ద్వారా తమ కుటుంబాలు ఏవిధంగా నాశనం అవుతున్నాయో జగన్ వద్ద తమగోడును వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కష్టాలను కళ్లారా చూశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే మద్యం మహమ్మారిని తరిమికొడతానని మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే బెల్టుషాపులు ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి గ్రామాల్లోని బెల్టుషాపులపై దాడులు నిర్వహిస్తూ, కేసులు నమోదు చేస్తూ, వాటిని నియంత్రిస్తున్నారు. నియోజకవర్గంలో 200లకు పైగా బెల్టుషాపుల తొలగింపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు ఇప్పటికి 200లకు పైగా బెల్టుషాపులను తొలగించారు. బెల్టుషాపుల నిర్వాహకులకు కౌన్సెలింగ్ నిర్వహించి బెల్టుషాపులు నిర్వహిస్తే చట్టప్రకారం తీసుకునే చర్యలు వివరించారు. గుడివాడ మండలంలో 79, గుడ్లవల్లేరు మండలంలో 68, నందివాడ మండలంలో 53కు పైగా బెల్టుషాపులు నిర్వహించే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నారు. -
పాక్‌కు బుద్ధిచెప్పండి
బిష్కెక్/వాషింగ్టన్: కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో గురువారం ప్రారంభమైన షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు‡ పుతిన్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం మోదీ స్పందిస్తూ.. జిన్‌పింగ్‌తో భేటీ అత్యంత ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. ‘భారత్–చైనాల మధ్య వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ఈ భేటీలో చర్చించాం’ అని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని మోదీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకొచ్చారు. ఉగ్రమూకలపై పాక్ కఠినచర్యలు తీసుకునేలా చూడాలన్నారు. ఉగ్రరహిత వాతావరణంలో పాక్‌తో శాంతి చర్చల ప్రక్రియకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జిన్‌పింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మోదీని జిన్‌పింగ్ అభినందించారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని.. జూన్ 15న 66వ పుట్టినరోజు జరుపుకోనున్న జిన్‌పింగ్‌కు భారతీయులందరి తరఫున శుభాకాంక్షలు చెప్పారు. ఎస్సీవో సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా భారత్–రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. బిష్కెక్లో ఎస్సీవో భేటీ జూన్ 13 నుంచి రెండ్రోజుల పాటు సాగనుంది. మోదీ సరికొత్త నాయకుడు: పాంపియో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సులో పాంపియో మాట్లాడుతూ.. ‘సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుపొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు సరికొత్త నాయకుడిగా మోదీ అవతరించారు’ అని కితాబిచ్చారు. భారత యువతకు సుసంపన్నమైన, ఉజ్వల భవిష్యత్తును మోదీ ఇవ్వగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లతో పాటు అత్యంత భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సాయమందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. జూన్ 24 నుంచి 30 వరకూ పాంపియో భారత్, శ్రీలంక, జపాన్, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించనున్నారు. -
కార్బైడ్ వినియోగిస్తే కఠిన చర్యలే
సాక్షి, హైదరాబాద్ : వివిధ రకాల పళ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక అవసరాలు, చట్టం నిర్దేశించిన అవసరాలకు మినహా మిగిలిన వాటికి కార్బైడ్‌ను ఉపయోగించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్బైడ్ కలిగి ఉన్న వ్యక్తులపై కఠినచర్యలు తీసు కోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. దీనిపై ఓ నివేదికను తమ ముందుంచాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయి దా వేసింది. ఈ మేరకు ప్రధానన్యాయమూర్తి (సీజే) తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పళ్లను మగ్గబెట్టేందుకు కొందరు వ్యాపారులు విచ్చలవిడిగా కార్బైడ్‌ను ఉపయోగిస్తుండటంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని హైకోర్టు 2015లో సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) గా పరిగణించింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భం గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆహార భద్రత అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇం దుకు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా వచ్చిందని వివరించారు. కొత్తగా 36 ఆహార భద్రతా అధికారుల పోస్టులను సృష్టించామని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థులు, ఇతరులకు చెం దిన రిజర్వేషన్ల వ్యవహారంపై మరింత స్పష్టత అవసరం ఉందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాస నం స్పందిస్తూ అటువంటిదేమీ అవసరం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని, చట్ట నిబంధనల మేరకు ఆ ఉత్తర్వులను అమలు చేస్తే సరిపోతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఆహార భద్రతా అధికారుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్ïపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. ఆహార భద్రతారంగం ఎదుర్కొం టున్న పెద్ద సవాళ్లలో కార్బైడ్ వినియోగం ఒకటని ధర్మాసనం అభిప్రాయపడింది. -
పాక్ వస్తువులపై 200% పన్ను పెంపు
న్యూఢిల్లీ: ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై మరిన్ని కఠిన చర్యలను కేంద్రం ప్రకటించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్లు. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యంగా తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి ఖనిజాలు తదితరాలున్నాయి. తాజా చర్యతో భారత్‌లో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ‘పుల్వామా దాడికి ఆ దేశమే కారణమని భావిస్తూ అత్యంత ప్రాధాన్యం గల దేశం (ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించుకున్నాం. దీంతోపాటు పాక్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’ అని ఆర్థిక మంత్రి జైట్లీ ట్విట్టర్లో ప్రకటించారు. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానమైన తాజా పండ్లపై ప్రస్తుతం 50% వరకు, సిమెంట్‌పై 7.5% కస్టమ్స్ డ్యూటీ ఉంది. -
ఆ బాధ వాళ్లకూ తెలియాలి
జైపూర్ / ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల అనాగరిక చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ఓ బీఎస్ఎఫ్ జవాన్ గొంతును పాక్ సైనికులు కత్తితో కోయడం, కశ్మీర్లో పోలీసులను ఉగ్రవాదులు కిడ్నాప్‌చేసి హత్యచేసిన ఘటనలపై రావత్ ఈ మేరకు స్పందించారు. జైపూర్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారత జవాన్లపై పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు పాల్పడుతున్న ఇలాంటి అనాగరిక, ఆటవిక ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాక్ వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ బాధేంటో వాళ్లకూ తెలియాలి. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్ పాటించే అనారిగక, ఆటవిక విధానాలను భారత్ అనుసరించకూడదు’ అని తెలిపారు. సరిహద్దులో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను పాక్ సైన్యం తుపాకితో కాల్చి, గొంతు కోయడంపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కావనీ, దీనిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: పాక్ రావత్ వ్యాఖ్యలపై పాక్ తీవ్రంగా స్పందించింది. భారత్‌తో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే దేశ ప్రయోజనాల రీత్యా శాంతినే ఆకాంక్షిస్తున్నామని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ తెలిపారు. -
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
ఎంజీఎం : ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ హెచ్చరించా రు. గురువారం కాకతీయ మెడికల్ కళాశాల మొదటి సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో వైద్య వృత్తి గొప్పదని, దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడని పేర్కొన్నారు. అలాంటి వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రధానంగా ఇంజనీరింగ్ 33 శాతం, మెడికల్ కళాశాలల్లో 17 శాతం ర్యాగింగ్ జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ర్యాగింగ్ చట్టంపై పూర్తి స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి పడే శిక్షకాలాన్ని విద్యార్థులకు తెలిపారు. ఆయా విద్యాసంస్థల విభాగాధిపతులు ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోకపోతే వారు సైతం శిక్షార్హులేనన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని శిక్షించే క్రమంలో ఆయా విద్యా సంస్థల విభాగాధిపతులు అమలు చేసిన శిక్షను సుప్రీం కోర్టు సైతం మార్చలేదన్నారు. ర్యాగింగ్‌ను నిషేధించేలా కళాశాలలో తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థులకు మెడికల్ కళాశాలలోని బోధన, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. కేఎంసీలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారి గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్, రాంకుమార్‌రెడ్డి, రజామాలీఖాన్, పీడీ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాజస్తాన్‌లో మూక హత్య..
జైపూర్: సుప్రీం కోర్టు ఎన్ని హెచ్చరికలు చేసినా, ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా మూక హత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో శుక్రవారం రాజస్థాన్‌లో అక్బర్ ఖాన్ వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. అక్బర్ ఖాన్ (28), అతని స్నేహితుడు అస్లాం లాడ్‌పూర్‌లో రెండు ఆవులను కొనుగోలు చేసి, హరియాణాలోని కొల్గాన్‌కు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో అల్వార్ జిల్లాలోని లాలావండి అటవీ ప్రాంతం గుండా వెళుతుండగా ఐదుగురు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా అస్లాం వారి నుంచి తప్పించుకోగా అక్బర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతోనే వారిపై వారు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. బాధితుడి మరణ వాంగ్మూలం ప్రకారం ఐదుగురు వ్యక్తులు దాడి చేసినట్టు తెలుస్తోందని, వారిలో ధర్మేంద్ర యాదవ్, పరమ్‌జీత్ సింగ్ సర్దార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని జైపూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ హేమంత్ ప్రియదర్శి తెలిపారు. కఠిన చర్యలు తీసుకుంటాం: సీఎం ఈ ఘటనను సీఎం వసుంధరా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘ టనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని హోంమంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం ఈ ఘటనపై భగ్గుమంది. మూక దాడులకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించింది. ఇది దారుణ ఘటనగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అభివర్ణించారు. -
ప్రభుత్వ సహకారంతోనే చెక్: వాట్సాప్
న్యూఢిల్లీ: నకిలీ వార్తలు, వదంతుల కారణంగా భారత్‌లో తీవ్రమైన హింస చెలరేగడంపై తాము ఆందోళన చెందుతున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఇలాంటి ఘటనల్ని నివారించేందుకు పలు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. పిల్లల కిడ్నాపర్లంటూ దేశవ్యాప్తంగా పలువురిని అల్లరిమూకలు ఇటీవల కొట్టిచంపిన నేపథ్యంలో నకిలీ వార్తలు, వదంతుల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం వాట్సాప్‌ను హెచ్చరించింది. దీంతో నకిలీ వార్తల కట్టడికి తీసుకోనున్న చర్యలపై వాట్సాప్ కేంద్ర ఐటీ శాఖకు బుధవారం లేఖ రాసింది. నకిలీ వార్తలు, వదంతుల్ని ప్రభుత్వం, పౌర సమాజం సంయుక్త సహకారంతోనే టెక్నాలజీ సంస్థలు ఎదుర్కొనగలవని వాట్సాప్ తెలిపింది. ప్రజల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామనీ, అందుకు అనుగుణంగానే యాప్‌ను అభివృద్ధి చేశామని వెల్లడించింది. నకిలీ వార్తలు, వదంతుల్ని అరికట్టేందుకు ప్రొడక్ట్ కంట్రోల్, డిజిటల్ లిటరసీ, వార్తల్లోని నిజాలను తనిఖీ చేయడం వంటి పద్ధతుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ పేర్కొంది. అంతేకాకుండా విచారణ సంస్థల విజ్ఞప్తులకు అనుగుణంగా పూర్తి వివరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామంది. -
నకిలీ ఎరువులూ సృష్టించారు!
సాక్షి, రాజాపూర్ (జడ్చర్ల) : నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే అంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. సులువుగా డబ్బులు సంపాదించేందుకు మరిగిన దళారులు.. ఏకంగా నకిలీ ఎరువులనే విక్రయించేందుకు పూనుకుంటున్నారు. సాయిల్ కండీషన్ పేరుతో విక్రయించేందుకు మిక్చర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసి తెలంగాణ విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ ఎరువులను అక్రమార్కులు రైతులకు అంటగడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కో బస్తా రూ.1,200 మండలంలోని చెన్నవెల్లిలో గురువారం కొందరు దళారులు ఎలాంటి అనుమతి లేని నకిలీ ఎరువులను గ్రామాల్లోకి తీసుకువచ్చి డీఏపీ, యూరియాల పనిచేస్తాయని ఒక్కో బస్తాను రూ.1,200లకు అమ్మారు. వాస్తవంగా ఏదైనా వస్తువును మార్కెట్లో విక్రయించాలంటే ముందుగా అన్ని అనుమతులు ఉండాలి.. లైసెన్స్ ఉన్న పరిధిలోనే విక్రయించాలి. అయితే కర్నూలు జిల్లా ఆదోని శ్రీ ఎంఎస్ బాలాజీ అగ్రికెం కంపెనీ పేరుతో ఎలాంటి అనుమతి, లాట్ నంబర్ లేకుండా నకిలీ ఎరువులను ఏకంగా గ్రామాల్లో రైతులకే నేరుగా అమ్మారు. ఈ నేపథ్యంలో నకిలీ ఎరువులు అని గుర్తించిన రైతులు వెంటనే మండల వ్యవసాయాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఏఓ నరేందర్ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే కంపెనీ నకిలీ ఎరువులను విక్రయిస్తూ ప్రభుత్వానికి 18 పన్ను సైతం ఎగ్గొడుతున్నట్లు తెలిసింది. కఠిన చర్యలు తీసుకోవాలి వర్షాలు సరిగా కురవక, విత్తనాలు నాణ్యమైనవి దొరకక రైతులు పంటలు సాగు చేసి నష్టాలు చవి చూస్తున్నారు. అరకొరగా పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఇక ఎరువులు కూడా నకిలీవి వస్తే ఏం చేయాలి. ఇలాంటి వారిపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. – బచ్చిరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, రాజాపూర్