
శబరిమల: శబరిమలలో ఉన్న హోటళ్లు తమ కస్టమర్లకు తాజాగా ఉన్న ఆహారాన్ని కాకుండా, పాడైన ఆహారాన్ని అందిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు హెచ్చరించింది. నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువకు అమ్మినా చర్యలు తప్పవని స్పష్టంచేసింది. స్థానికంగా ఉన్న హోటళ్లలోని ఉద్యోగులకు హెల్త్ కార్డులను తప్పనిసరి చేస్తూ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామని టీడీబీ అధ్యక్షుడు వాసు తెలిపారు.