food agencies
-
ఫుడ్ పార్సిళ్లపై ప్యాకింగ్ సమయమూ ఉండాలి
తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది. అమలు చేయని వారిపై చర్యలు తప్పవని ఆరోగ్య మంత్రి వీణా జార్జి హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చామన్నారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్ కార్డులు తీసుకోవాల్సిన గడువును మరో రెండు వారాలకు పొడిగించామన్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్లు ఆహార తనిఖీలను ముమ్మరం చేశారన్నారు. -
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సురక్షితమే
కరోనా వైరస్‌తో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లడంతో రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తినలేకపోతేన్నామనే భావన ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. రెండువారాలు దిగ్భంధంలో గడిపిన తరువాత కూడా పరిస్థితిలో ఏ మార్పు రాకపోవడంతో లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారీన పడకుండా ఉండాలంటే మనమంతా ఇంట్లోనే ఉంటూ, పరిశుభ్రంగా ఉండడమే ఉత్తమమైన మార్గం అని గ్రహించాము. అంతేగాక ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా మా రోజువారీ దినచర్యలను మార్చుకున్నాము.వీటిలో ఇంట్లోకి తీసుకువచ్చే బయటి వస్తువులతో పాటు, ఫుడ్ డెలివరీ విషయంలో కూడా అదనపు జాగ్రత్త వహించడం కూడా ఒకటి. ఈ అసాధారణమైన పరిస్థితులలో బయటి నుంచి తీసుకువచ్చే వస్తువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా వాటిని శుభ్రం చేయడంలో జాగ్రత్త వహించాలి. పలు ఆరోగ్య సంస్థలు నిరంతరం చేతులు కడుక్కోవాలని ప్రజలకు సూచించినప్పటికీ, ఫుడ్ డెలివవరీలను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై సమాచారం అందుబాటులో లేదు. ఫుడ్ డెలివరీ నిర్వహణ విషయంలో అనేక సందేహాలు ఉండడంతో అది అంత సురక్షితం కాదేమోనని ఫుడ్ ఆర్డర్ చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. కానీ ఫుడ్ ఆర్డర్ చేయడం సురక్షితం అని మీకు తెలియడానికి ఎటువంటి భద్రతా చర్యలను అనుసరిస్తున్నామనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాం. అంతేగాక అన్ని సమయాల్లో సూక్ష్మక్రిములు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లడం కంటే ఆహారాన్ని మీ ఇంటికే తెప్పించుకోవడం సురక్షితం అని గ్రహించండి. అయితే శానిటరీ టెక్నిక్లను ఉపయోగించి మీ ప్యాకేజీలను అన్ ప్యాకేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. రెస్టారెంట్లు, హోమ్ డెలివరీ విభాగాలు పలు ఆరోగ్య సూత్రాలను అనుసరిస్తూ తమ వినియోగదారులు సురక్షితంగా ఉండడం కోసం ముందడుగు వేశాయి. పరిశుభ్రమైన ఆహారం తయారీ, తాజాగా వండిన భోజనం, చెఫ్‌లు పాటించవలసిన ఆరోగ్య విధానాలు, కాంటాక్ట్ డెలివరీ, డోర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు జాగ్రత్త వహించేలా రెస్టారెంట్ యజమానులు చర్యలు తీసుకుంటారు. కాబట్టి వీటిలో కలుషితానికి తక్కువ ఆస్కారం ఉందని మీకు హామీ ఇస్తున్నాం. వైరస్ సోకకుండా మీ ప్యాకేజీలను సరైన పద్దతిలో ఎలా అన్ ప్యాకేజీ చేయాలనేది చూడండి ►మీరు మీ ఫుడ్ ప్యాకేజీలను తీసుకున్నపుడు మీకు, డెలివరీ సిబ్బందితో ఎటువంటి కాంటాక్ట్ ఉండదని నిర్ధారించుకోండి. ►ప్యాకేజీని తీసుకునేటపుడు చేతికి తప్పనిసరిగా గ్లౌజులు ధరించండి. ►మీరు ప్యాకేజీని టేబుల్‌పై ఉంచే ముందు క్రిమి సంహారక మందుతో ఆ ప్రదేశాన్నిశుభ్రంచేయండి. ►ప్యాకేజీని కూడా అదే వస్త్రంతో శుభ్రం చేయండి. ►ఇప్పుడు ప్యాకేజీలోని పదార్థాన్ని శుభ్రం చేసిన పాత్రలోకి మార్చి, ప్యాకేజీని చెత్తకుండీలో పడేయండి. ►తరువాత ఆ చేతులతో మీముఖాన్ని తాకకుండా 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. ►ముందు జాగ్రత్తగా ఆహారాన్ని మీ చేతులతో కాకుండా ఇంటిలోని వస్తువులను ఉపయోగించి తినడం మంచిది. ►పలు ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీలు తాజాగా వండిన, వేడి వేడి ఆహారాన్ని తినడం మంచిదని ప్రజలకు సూచించాయి ►మీ ఆహారాన్ని సుమారు 12 నిమిషాలు వేడిచేసుకోవడం మంచిది. -
శబరిమలలో పాడైన ఆహారమిస్తే చర్యలు
శబరిమల: శబరిమలలో ఉన్న హోటళ్లు తమ కస్టమర్లకు తాజాగా ఉన్న ఆహారాన్ని కాకుండా, పాడైన ఆహారాన్ని అందిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు హెచ్చరించింది. నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువకు అమ్మినా చర్యలు తప్పవని స్పష్టంచేసింది. స్థానికంగా ఉన్న హోటళ్లలోని ఉద్యోగులకు హెల్త్ కార్డులను తప్పనిసరి చేస్తూ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామని టీడీబీ అధ్యక్షుడు వాసు తెలిపారు. -
తిండిలో తొండి
ఖమ్మంవైద్యవిభాగం: శిబిరాలకు వేళకు వస్తారు.. రోగులను పరీక్షిస్తారు.. కంటి అద్దాలతోపాటు మందులు అందిస్తారు.. శస్త్ర చికిత్సలు అవసరముంటే ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు.. ఇంత సేవ చేసినా భోజన విరామంలో సమయానికి కడుపునిండా తినలేని పరిస్థితి.. ఇక్కడే ఉంది అసలు వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి.. అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం కొందరు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు వరంలా మారింది. కంటి వెలుగు సిబ్బందికి అందించే ఆహారంలో కక్కుర్తికి పాల్పడుతూ నిధులు కాజేస్తున్నారు. నాణ్యత లోపించిన సరుకులతో వండిన భోజనం సరఫరా చేస్తూ వారి కడుపుకొట్టడమే కాకుండా.. ఆహారానికి కేటాయించిన నిధులు అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారుల కక్కుర్తి విధానాల వల్ల కంటి వెలుగు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను ప్రశ్నించలేక.. వడ్డించిన భోజనాన్ని అతి కష్టంమీద తినాల్సి వస్తోందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో బృందంలో 10 మంది సిబ్బంది కంటి వెలుగు శిబిరానికి సంబంధించి ఒక్కో బృందంలో 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్, ఇద్దరు డీఈఓలు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశలు శిబిరంలో పాల్గొంటున్నారు. ఒక్కో బృందానికి ప్రతిరోజు రూ.2,500 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. సిబ్బందికి నాణ్యతతో కూడిన ఆహారం సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే.. అది కొందరు అధికారులకు వరంలా మారింది. కొందరు అధికారులు కక్కుర్తిపడి సిబ్బందికి నాసిరకమైన ఆహారం సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై బృందం సభ్యులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అయితే శిబిరాలపై దృష్టి సారించాల్సిన జిల్లా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో కిందిస్థాయి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారు ఆడిండే ఆట.. పాడిందే పాట అనే చందంగా పరిస్థితి తయారైంది. 32 బృందాలదీ అదే పరిస్థితి.. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 32 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 22 పీహెచ్‌సీలు, మూడు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించగా.. జిల్లాలో కార్యక్రమం నిర్వహించేందుకు 32 బృందాలను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అయితే అన్ని పీహెచ్‌సీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వీరికి ఆహారం సరఫరా చేసే విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమం ప్రారంభమై నాలుగు నెలలు దాటినా తమకు సదుపాయాలు కల్పించడంలో అధికారులు చిన్నచూపు చూస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తూ.. ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలు చేయడంలో వీరి పాత్రే కీలకం. శిబిరంలో పాల్గొనే ఒక్కో బృందం గ్రామీణ ప్రాంతాల్లో రోజూ 250 మంది, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు చేయాలనే నిబంధన ఉంది. నాలుగు నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 4,50,000 మందికి కంటి పరీక్షలు చేశారు. విధి నిర్వహణలో పనిభారం వీరిపైనే ఎక్కువగా ఉంటుంది. నిత్యం కష్టపడుతున్నా వీరిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కోసం నెలకు రూ.20లక్షలు.. కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనే సిబ్బందికి ప్రతిరోజూ ఉదయం టిఫిన్, టీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి శని, ఆదివారం శిబిరాలకు సెలవు. శిబిరాలు ఉన్నన్ని రోజులు సిబ్బందికి మంచి ఆహారం సరఫరా చేయాల్సి ఉండగా.. ఈ మెనూ ఎక్కడా పాటించడం లేదు. ప్రభుత్వం వీటికోసం నెలకు రూ.20,00,000 నిధులు కేటాయిస్తోంది. ప్రతిరోజూ 32 బృందాలకు కలిపి రూ.80వేలు కేటాయిస్తున్నారు. కానీ.. ఇందులో సిబ్బంది కోసం 30 శాతం నిధులు కూడా ఖర్చు చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ, నగర పరిధిలో ఉండే సిబ్బంది కోసం మధ్యాహ్నం పూట నాసిరకం ఆహారం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే కొంతమంది సిబ్బందికి స్థానిక గ్రామస్తులు భోజనం ఏర్పాటు చేస్తుండగా, మరికొందరు ఇంటి నుంచి లంచ్‌బాక్స్‌లు తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. సిబ్బంది మాత్రం నోరు మెదపలేకపోతున్నారు. ఫిర్యాదు చేస్తే తమపై చర్యలు తీసుకుంటారనే భయంతో వారు మిన్నకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది ఆహారం కోసం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా.. సక్రమంగా వినియోగించేలా చూడాలని కంటి వెలుగు సిబ్బంది కోరుతున్నారు. ఫిర్యాదులు అందలేదు.. కంటి వెలుగు సిబ్బంది ఆహారం కోసం ప్రభు త్వం రూ.2,500 చెల్లిస్తున్నట్లు జీఓ ఇచ్చినా.. రూ.1,500 చొప్పున మాత్రమే అందజేస్తున్నారు. సిబ్బందికి ఆహారం సక్రమంగానే సరఫరా చేస్తున్నాం. వారి నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటాం. కార్యక్రమం జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతోంది. – డాక్టర్ కోటిరత్నం, కంటి వెలుగు కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ -
కోడిగుడ్లకు నిధులు లేవు
రాజంపేట టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు తగ్గట్లు నిధులను కేటాయించక పోవడంతో మండలంలో ఒకటి, రెండు పాఠశాలలు మినహా ఏ పాఠశాలలో కూడా వంట ఏజెన్సీ నిర్వాహకులు వారానికి విద్యార్థులకు మూడు కోడిగుడ్లు పెట్టడం లేదు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం అరకొరగా నిధులు కేటాయించడం, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అమాంతంగా పెరగడం, దీనికి తోడు నెల, నెల బిల్లులను చెల్లించక పోవడం వల్ల వంట ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు వారానికి మూడు కోడి గుడ్లు పెట్టేందుకు గుడ్లు తేలేస్తున్నారు. రాజంపేట మండలంలో 95 ప్రాథమిక పాఠశాలలు, 7 ప్రాథమికోన్నత పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం తప్ప అందుకు తగ్గ చర్యలు తీసుకోక పోవడంతో నిర్వాహకులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తలకు మించిన భారమవుతోంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో చదివే ఒక్కొక్క విద్యార్థికి రూ.5.18, ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థికి రూ.7.36ను ప్రభుత్వం కేటాయిçస్తుంది. విద్యార్థులకు వారానికి మూడు కోడి గుడ్లు పెట్టాలంటే ఒక్కొ విద్యార్థికి కనీసం 12 రూపాయలు చెల్లిస్తే తప్ప గిట్టుబాటు కాదని వంట ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. ఇదిలావుంటే ఒక్కో విద్యార్థికి రూ.8.25 కేటాయిస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ కూడా ఇప్పటికి నెరవేరలేదని వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగదు పెంచక పోవడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు కూడా చేసేదేమి లేక పాత పద్ధతిలోనే వారానికి కేవలం రెండు కోడిగుడ్లను మాత్రమే విద్యార్థులకు పెడుతున్నారు. అమలుకు నోచుకోని గౌరవ వేతన పెంపు జీఓ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వంట చేసిపెట్టేందుకు ఒక్కో వంట మనిషికి గౌరవ వేతనంగా నెలకు వెయ్యి రూపాయిలు ఇస్తున్నారు. అయితే వీరి గౌరవ వేతనాన్ని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెయ్యి రూపాయిల నుంచి 1500కు పెంచుతున్నట్లు జీఓ విడుదల చేశారు. అయితే అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాల వల్ల గౌరవ వేతన పెంపు జీఓకు ఆర్థికశాఖ ఆమోద ముద్రపడక పోవడంతో వంట మనుషుల గౌరవవేతనం పెంపు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. ఇదిలావుంటే 25 మంది విద్యార్థులకు ఒక వంట మనిషి. 25 నుంచి 50 మంది విద్యార్థుల వరకు ఇద్దరు, 50 నుంచి 100 మంది విద్యార్థులకు ముగ్గురు, 100 మందికి పైబడి విద్యార్థులుంటే నలుగురు వంట మనుషులు మధ్యాహ్న భోజనాన్ని చేస్తారు. వీరు ఉదయం నుంచి మధ్యాçహ్నం వరకు పనిచేసినా నెలకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తుండటంతో అనేక ప్రాంతాల్లో వంట ఏజెన్సీలకు వంట మనుషులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.