Travancore temple board
-
రేపటి నుంచి ధనుర్మాసం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆరోజు ఉదయం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, ధనుర్మాస ఘడియలు 2021 జనవరి 14న ముగియనున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న వ్యాసరాజ మఠాధిపతి కర్ణాటకలోని ప్రముఖ ద్వైత సంస్థానం వ్యాసరాజ మఠాధిపతి విద్యా శ్రీశ తీర్థ స్వామి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ అర్చకులు, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సత్యదేవుడి కార్తీక ఆదాయం రూ. పది కోట్లు అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి దేవస్థానానికి కార్తికమాసం సిరులు కురిపించింది. భారీగా తరలివచ్చిన భక్తులు హుండీలలో సమరి్పంచిన కానుకలను సోమవారం లెక్కించారు. 1,85,71,847 ఆదాయం వచి్చంది. 33 గ్రాముల బంగారం, 630 గ్రాముల వెండి కూడా లభించిందని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాధరావు తెలిపారు. ఇది 32 రోజుల హుండీ ఆదాయం కాగా..అందులో 29 రోజులు కార్తీకమాసమని వివరించారు. ఒకేసారి హుండీ లెక్కింపులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమమని చెప్పారు. దేవస్థానంలోని వివిధ విభాగాల ద్వారా ఇప్పటికే సుమారు రూ. 8 కోట్లు పైబడి ఆదాయం వచి్చందని, ప్రస్తుత హుండీ ఆదాయం రూ.1.85 కోట్లు కలిపితే ఆదాయం సుమారు రూ. పది కోట్ల వరకు వచి్చందని అధికారులు తెలిపారు. భక్తుల ఇంటికే అయ్యప్ప ప్రసాదం హైదరాబాద్: కోవిడ్–19 నిబంధనల కారణంగా ఈసారి శబరిమలకు వెళ్లలేని భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం తపాలా శాఖ సహకారంతో భక్తుల ఇంటికే అయ్యప్ప స్వామి ప్రసాదం పంపించేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. భక్తులు తమకు సమీపంలోని తపాలా శాఖ కార్యాలయాల్లో రూ.450 చెల్లిస్తే చాలు.. పది రోజుల్లో అయ్యప్ప ప్రసాదంతో కూడిన కిట్ స్పీడ్‌పోస్ట్ ద్వారా కోరుకున్న అడ్రస్‌కు చేరుతుంది. ప్రసాదం కిట్‌లో అరవన్న పాయసంతో పాటు స్వామివారి అభిషేకం నెయ్యి, పసుపు, కుంకుమ, విబూది, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయి. పది రోజుల్లో కిట్ ఇంటికి చేరుతుంది. అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం జరిగే మకరసంక్రాంతి వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు -
ఆరో గది తెరిచే నిర్ణయం వారిదే!
తిరువనంతపురం: కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం... చాలా కాలం వరకు అంతగా గుర్తింపు పొందని ఈ ఆలయం 2011లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ గుడిలోని రహస్య తలుపులను తెరవగా అందులో లక్షల కోట్ల విలువైన నిధి నిక్షేపాలు లభ్యమయ్యాయి. దీంతో ఈ గుడి ఒక్కసారిగా దేశంలోనే అత్యంత విలువైన గుడిగా మారిపోయింది. అయితే ఆ గుడిలో అన్నినేలమాలళిగలను తెరిచిన నిపుణులు ఒక నేలమాళిగను మాత్రం తెరవలేదు. ఆ గదిని తెరవాలని కొందరు, తెరవకూడదని మరికొందరు... ఇలా ఎవరి నమ్మకాలకు అనుకూలంగా వారు వాదించారు. దానికి నాగబంధం ఉండటంతో అది తెరిస్తే ప్రళయం వస్తుందని కొందరు వాదిస్తున్నారు. చదవండి: ఇటాలియన్ మెరైన్స్ కేసు: కీలక పరిణామం అయితే ఆ తలుపు తెరవాలా వద్దా అనేది ఎవరు నిర్ణయించాలో తెలియలేదు. ఎందుకంటే 1991 లో ట్రావెన్కోర్ చివరి పాలకుడు మరణించిన తరువాత రాజ కుటుంబ హక్కులు నిలిచిపోయాయని కేరళ హైకోర్టు 2011 లో తీర్పునిచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. అదే విధంగా ఆరవ నేలమాళిగను తెరవాలని కూడా ఆదేశించింది. దీంతో ఆరవ నేలమాళిగలు తెరవడం ఇష్టం లేని ట్రావెన్కోర్ వంశీయులు ఆలయంపై హక్కులు తమకే ఉన్నయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 9 సంవత్సరాల తరువాత ఈ ఉత్తర్వులను కొట్టిపడేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. చివరి పాలకుడి మరణం వల్ల కుటుంబ హక్కులు రద్దు చేయబడవని తెలిపింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే చెందుతాయని తెలిపింది. దీంతో ఆరోగది తెరవాలా వద్దా అనేది విషయానికి సంబంధించి ట్రావెన్కోర్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకోనుంది. చదవండి: శబరిమలలో భక్తులకు నో ఎంట్రీ -
శబరిమలలో పాడైన ఆహారమిస్తే చర్యలు
శబరిమల: శబరిమలలో ఉన్న హోటళ్లు తమ కస్టమర్లకు తాజాగా ఉన్న ఆహారాన్ని కాకుండా, పాడైన ఆహారాన్ని అందిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు హెచ్చరించింది. నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువకు అమ్మినా చర్యలు తప్పవని స్పష్టంచేసింది. స్థానికంగా ఉన్న హోటళ్లలోని ఉద్యోగులకు హెల్త్ కార్డులను తప్పనిసరి చేస్తూ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామని టీడీబీ అధ్యక్షుడు వాసు తెలిపారు. -
ఆ నిషేధం కొనసాగాల్సిందే: ట్రావెన్కోర్ దేవస్థానం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప గుడిలోకి రుతుచక్రదశలో ఉన్న మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టినా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) దీన్ని సమర్థించుకుంది. నిషేధం ఆలయ సంప్రదాయాల్లో భాగమని, కొనసాగాల్సి ఉందని పేర్కొంది. ఈ కేసులో కక్షిదారుగా చేరి సుప్రీంకోర్టుకు వైఖరిని తెలియజేస్తామని టీడీబీ చీఫ్ ప్రయార్ గోపాలకృష్ణన్ తెలిపారు. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నప్పుడు 2006లో యంగ్ లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు పలు అభిప్రాయాలు వ్యక్తం చేసిందని గోపాలకృష్ణన్ పేర్కొన్నారు. ఆలయ, అయ్యప్పస్వామి విషయంలో పాటించే ఆచారాల ప్రత్యేకత గురించి అవగాహన లేకే సుప్రీంకోర్టు ఈ రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిందన్నారు. మత విశ్వాసాల ప్రకారం ఆలయాన్ని సందర్శించే భక్తులు కొన్ని ఆచార, సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సైతం ఈ కేసులో కక్షిదారుగా చేరి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సమర్థించాలనుకుంటోంది.