తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప గుడిలోకి రుతుచక్రదశలో ఉన్న మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టినా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) దీన్ని సమర్థించుకుంది. నిషేధం ఆలయ సంప్రదాయాల్లో భాగమని, కొనసాగాల్సి ఉందని పేర్కొంది. ఈ కేసులో కక్షిదారుగా చేరి సుప్రీంకోర్టుకు వైఖరిని తెలియజేస్తామని టీడీబీ చీఫ్ ప్రయార్ గోపాలకృష్ణన్ తెలిపారు. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నప్పుడు 2006లో యంగ్ లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు పలు అభిప్రాయాలు వ్యక్తం చేసిందని గోపాలకృష్ణన్ పేర్కొన్నారు.
ఆలయ, అయ్యప్పస్వామి విషయంలో పాటించే ఆచారాల ప్రత్యేకత గురించి అవగాహన లేకే సుప్రీంకోర్టు ఈ రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిందన్నారు. మత విశ్వాసాల ప్రకారం ఆలయాన్ని సందర్శించే భక్తులు కొన్ని ఆచార, సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సైతం ఈ కేసులో కక్షిదారుగా చేరి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సమర్థించాలనుకుంటోంది.
ఆ నిషేధం కొనసాగాల్సిందే: ట్రావెన్‌కోర్ దేవస్థానం
Published Wed, Jan 13 2016 1:39 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement