Shabarimala Temple
-
కేరళ సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణసహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయ్యప్పస్వామి భక్తులు 40 రోజులపాటు చేసే ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష ఆ తర్వాత.. శబరిమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం హిందూ ధర్మంపట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటిమందికిపైగా భక్తులు వివిధ రాష్ట్రాలనుంచి మండలదీక్షను పూర్తిచేసుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుంది. అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. భక్తుల ద్వారా, పత్రికలు, చానళ్లలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. ఇటీవలే.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో.. దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లులేక తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధకలిగింది. శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో.. ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరని కోరుతున్నాను. శబరిమలపై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయగలరని మనవి చేస్తున్నాను. అయ్యప్పస్వామి మండల దీక్షలో ఉన్న భక్తులకు శబరిమల యాత్ర సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించడం, వారి యాత్ర భక్తిప్రద్రంగా, శుభప్రదంగా జరిగేలా చూడడం అత్యంత అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం భక్తులకు సౌకర్యార్థం అందించేందుకు సిద్ధంగా ఉంది. భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థల (NGO)ను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో మీరు వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
అయ్యప్ప మాలధారణ .. నియమాల ఆచరణ.. మండల పూజ ఎప్పటినుంచంటే?
రాజంపేట రూరల్ (వైఎస్సార్ కడప): శివకేశవుల తనయుడైన శ్రీమణికంఠుని మాలధారణ నియమాలతో కూడుకున్న ఆచరణ. హరిహరపుత్రుడైన అయ్యప్ప కొలువై ఉన్న కేరళ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వేలమంది అయ్యప్ప దీక్ష తీసుకుని మాల ధరిస్తున్నారు. శరీరాన్ని, మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్లించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. మోక్షమార్గాన్ని అన్వేశించే వారు, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారు తప్పని సరిగా జీవితంలో ఒక సారి అయినా శబరిమల యాత్ర చేయాలని ఉవ్విళ్లూరు తుంటారు. నియమాలు ఇలా.. అయ్యప్ప మాలను పవిత్రమైన ఆలయంలో గురుస్వామి వద్ద కానీ లేదా ఇంట్లో మాతృమూర్తి వద్ద వేయించుకోవచ్చును. ప్రతి రోజు సూర్యోదయంకు ముందే పూజలు, సూర్యాస్తమయం తరువాత పూజలు నిర్వహించాలి. కఠిన నియమాలను పాటిస్తూ నలుపు దుస్తులనే వాడాలి. రాత్రివేళల్లో ఆలయాలలోని నిద్రే శ్రేయస్కరం. ప్రతి రోజు ఏదో ఒక గుడిని దర్శించడం ఆనవాయితీగా చేపట్టాలి. భక్తుడే భగవంతుడు అయ్యప్ప దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశించిపోతుంది. దేహానికి ఉన్న పేరు, దేహం ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌక్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అన్నీ ఒకే ఒక దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష చేపట్టగానే ఆ వ్యక్తి పేరు అంతర్థానమై స్వామి గానే పిలువబడుతుంటారు. దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందడం మొదలవుతుంది. ఈ పరిణామక్రమం పూర్తి అయితే అప్పుడు భక్తునికి, భగవంతునికి తేడా కనిపించదు. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే అయ్యప్పదీక్ష ప్రారంభమైంది. కులమత భేదాలు, తారతమ్యాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే శబరిమల. ఇరుముడి ప్రాముఖ్యత అయ్యప్పను నవవిధ సేవలతో ప్రార్థిస్తుంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్మృతం, ఆత్మ నివేదనలతో అయ్యప్పను కొలుస్తుంటారు. అయ్యప్ప దీక్షలో ఇరుముడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో రెండు ముడులు ఉంటాయి. ముందున్న ముడిలో స్వామి అయ్యప్ప స్వరూపమైన ముద్ర, కొబ్బరికాయ, స్వామి వారికి సమర్పించే వస్తువులను ఉంచుతారు. కొబ్బరికాయను నేతితో నింపుతారు. ఈ నెయ్యి జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. కొబ్బరికాయకు బిగించే కార్క్‌ను వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూతపెడతారు. ఆ పైన కాయకు ఆత్మ అనే లక్కతో సీలు వేస్తారు. ఈ జ్ఞానం అనే నెయ్యితోనే స్వామి అయ్యప్పకు అభిషేకం చేస్తారు. మనలోని జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వామి అయ్యప్పకు నిండు మనస్సుతో అర్పించుకున్నట్లుగా భావించడమే అర్థం. దీన్నే ఆత్మ నివేదన అంటారు. స్వామి అయ్యప్ప దీక్షలో పరమార్థం కూడా ఇదే. నేను అనే అహంభావంతో ఉన్న దేహం నుంచి జ్ఞానాన్ని వేరు చేసి దాన్ని అయ్యప్పకు కైంకర్యం చేయడంతో దేహంలోని అనేకానేక సందేహాలు పటాపంచలైపోతాయి. ఓ దివ్య జ్యోతి దర్శనమవుతుంది. దానినే మకరజ్యోతిగా భావించాలి. ఆద్యంతం భక్తిపారవశ్యమే.. శబరిమలై యాత్ర ఆధ్యంతం భక్తి పారవశ్యమే. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం నుంచి ఇరుముడి కట్టుకుని బృందంతో బయలుదేరుతారు. మొదటగా వావర్‌స్వామి కొలువై ఉన్న ఎరిమేలికి చేరుకుంటారు. అక్కడ పేటతుళ్లి ఆడి వావర్‌స్వామిని, పేటశాస్త్రిలను దర్శించుకుని పంబకు బయలుదేరుతారు. పంబానదిలో పుణ్యస్నానాన్ని ఆచరించి సన్నిధానంకు ఇరుముడిని మోసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ బయలుదేరుతారు. కొండ అంచున ఉన్న అప్పాచిమేడు చేరుకుంటారు. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణిస్తే బహిరంగ ప్రదేశంలో శబరిపీఠం కనిపిస్తుంది. పంబానదికి సన్నిధానానికి మధ్య ఉన్న శరంగుత్తిఆల్కు చేరుకుంటారు. అక్కడ కన్నెస్వాములు శరంపుల్లలను ఉంచుతారు. అనంతరం స్వామి వారిని సన్నిధానానికి చేరుకుంటారు. పవిత్రమైన పదునెట్టాంబడి.. స్వామి సన్నిధానంలో ఉండే 18 పడిమెట్లను అవతార పురుషుడైన పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, రెండు యోగములైన కర్మయోగం, జ్ఞానయోగంతో పాటు విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ 18 మెట్లను ఏర్పరిచారు. సన్నిధానం చేరిన భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి ఎక్కవలెను. స్వామి వారి దర్శనార్థం ఇరుముడిని గురుస్వామి సాయంతో విప్పవలెను. అందులో ఉన్న నెయ్యిని అయ్యప్పకు అభిషేకాన్ని చేస్తారు. అనంతరం మాలిగైపుత్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరికాయలను దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కుగా చెల్లించుకుంటారు. అద్వైత మలై.. అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. హరిహరసుతుడు, శ్రీమన్నారాయణుడు మోహినీ అవతారంలో ఉండగా శివకేశవులకు జన్మించినవాడే అయ్యప్ప. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో హరిహర భేదం లేదు. అద్వైతానికి నిలువెత్తు నిదర్శనం శబరిమలై కొండ. కలియుగంలో ప్రత్యక్షదైవం తిరుమలవెంకటేశ్వరస్వామి తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన దైవం అయ్యప్పస్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. మండల కాలం (41రోజులు) ఈ దీక్ష కొనసాగుతుంది. 18 మెట్లను ఎక్కి స్వామి వారిని దర్శించుకోవడంతో దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్లీ ఎప్పుడు దీక్ష చేపడదామా, మళ్లీ అయ్యప్పను కనులారా చూస్తామా అంటూ పరితపిస్తుంటారు భక్తులు. ఈ యేడాది నవంబర్ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 3వ తేది వరకు మండల దర్శనం, జనవరి 10 నుంచి మకర సంక్రాంతి వరకు మకరజ్యోతి దర్శనంగా పరిగణిస్తారు. -
కూలీల కాళ్లు మొక్కిన ఎస్పీ బాలు!
సాక్షి, హైదరాబాద్: గాన దంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరమపదించినా పాటగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిపోయారు. తను పుట్టిందే గాత్రదానం చేయడానికని ఆయన నిరూపించారు. 50 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రయాణంలో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు ఆలపించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ప్రపంచం నలుమూలలా ఉన్న అభిమానులు ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేసిన వీడియో బాలు ఇతరులకిచ్చే గౌరవాన్ని, గొప్ప మనసును తెలియజేసిదిగా ఉంది. గతంలో ఓసారి శబరిమలకు వెళ్లిన సమయంలో కొండ ప్రాంతం కావడంతో బాలు ఎక్కువ దూరం నడవలేకపోయారు. దీంతో ఆయన్ను కొందరు కూలీలు డోలీలో ప్రధాన ఆలయం వరకు మోసుకెళ్లారు. అక్కడకు చేరుకోగానే తనను మోసుకొచ్చిన కూలీలకు బాలు కృతజ్ఞతలు తెలిపారు. దాంతోపాటు వారి పాదాలకు నమస్కారం చేశారు. గుడిపాటి చంద్రారెడ్డి అనే యూజర్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. (చదవండి: ఎస్పీ బాలు పాడిన తొలి, ఆఖరు పాట తెలుసా?) కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. యాభై రోజుల క్రితం కోవిడ్ బారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న బాలు ఫాంహౌజ్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి. 🙏 బాలసుబ్రహ్మణ్యం గారు శబరిమల కు వచ్చినప్పుడు తనను డోలీలో మోసిన కూలీల కాళ్లకు దండం పెట్టిన మహానుభావుడు🙏🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/e6ip1MWbBI — 🌹CHANDRA REDDY GUDIPATI🌹 (@GsrcgsrReddy) September 25, 2020 (చదవండి: జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం) -
శబరిమల దర్శనానికి మార్గదర్శకాలు జారీ
-
విచారణకు 10 రోజులు చాలు
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంతో సహా వివిధ మతపరమైన ప్రదేశాల్లో స్త్రీలపట్ల అనుసరిస్తోన్న వివక్షపై తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనం 10 రోజుల వ్యవధిలో విచారణ పూర్తిచేయనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. పరిష్కరించాల్సిన సమస్యలు చట్టబద్ధమైనవి కనుక విచారణను ముగించేందుకు ఎక్కువ సమయం పట్టదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఈ విచారణ పదిరోజులకు మించి పట్టదనీ, ఎవరైనా కావాలనుకున్నా అంతకు మించిన సమయమివ్వలేము’అని జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ వెల్లడించింది. బెంచ్ పరిగణనలోనికి తీసుకునే ప్రశ్నలను ఖరారు చేయలేదని సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా వెల్లడించారు. అయితే ఈ న్యాయసంబంధిత ప్రశ్నలను సుప్రీంకోర్టు తయారుచేయవచ్చునని లా ఆఫీసర్ తెలిపారు. ముస్లిం మహిళల మసీదు ప్రవేశం, దావూదీ బోహ్రా ముస్లిం సమాజంలో స్త్రీల జననేంద్రియాలను తొలగించడం, పార్శీ స్త్రీలు పార్శీయేతర పురుషులను వివాహమాడడం లాంటి పలు అంశాలను ధర్మాసనం పరిశీలించనుంది. -
శబరిమలలో భద్రత కట్టుదిట్టం
శబరిమల: సంక్రాంతి సందర్భంగా బుధవారం జరిగే మకరవిలక్కు ఉత్సవాలకు శబరిమల అయ్యప్ప ఆలయం సంసిద్ధమైంది. ఆలయ పరిసరాలన్నింటినీ కట్టుదిట్టమైన రక్షణ వలయంలోకి తీసుకొచ్చారు. భద్రత ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మండల దీక్షల తరువాత సంక్రాంతి రోజున అయ్యప్ప ఆలయంలో విశేష పూజలు, ఉత్సవాలు జరిగే విషయం తెలిసిందే. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిన భద్రత కోసం వినియోగిస్తున్నామని ఆలయ నిర్వాహకులైన ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు మంగళవారం తెలిపింది. అయ్యప్ప తన బాల్యాన్ని గడిపినట్లు చెప్పే పండలం నుంచి ఆలయానికి విచ్చేసే నగల పెట్టె ‘తిరువాభరణం’తో విచ్చేసే ఊరేగింపునకు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం స్వాగతం పలుకుతుందని బోర్డు తెలిపింది. మకరవిలక్కు దీపారాధనను దర్శించేం దుకు వేలాదిగా హాజరవుతారని అంచనా. ఉత్సవాల అనంతరం ఈ నెల 21వ తేదీన ఆలయం మూతపడనుందని అధికారులు తెలిపారు. -
‘శబరిమల’పై సుప్రీం కొత్త బెంచ్
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం, ముస్లిం, పార్సీ మతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో 9 మంది జడ్జీలు ఈ నెల 13 నుంచి ఆయా వ్యవహారాలపై వాదనలు విననున్నారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శంతనగౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఆర్‌ఎస్‌రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉన్నట్లు మంగళవారం వెల్లడించింది. శబరిమల అంశంపై గతంలో వాదనలు విన్న ఏ న్యాయమూర్తి ఇందులో లేకపోవడం గమనార్హం. అన్ని వయసుల వారిని శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ 2018లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ యువ న్యాయవాదుల అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. -
శబరిమల ఆదాయం రూ. 104 కోట్లు
శబరిమల: శబరిమల అయ్యప్ప ఆలయం ఆర్జన విషయంలో దూసుకెళ్తోంది. ఏడాదిలో రెండు నెలలే (సంవత్సర మండలం– మకరవిలక్కు) తెరిచి ఉంచే ఈ ఆలయంలో నవంబర్ 17 నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అప్పటి నుంచి గత 28 రోజుల్లో శబరిమలకు వచ్చిన ఆదాయం రూ. 104.72 కోట్లని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో ఈ సమయానికి ఆదాయం రూ. 64.16 కోట్లని టీడీబీ అధికారి ఎన్.వాసు చెప్పారు. -
శబరిమలలో పాడైన ఆహారమిస్తే చర్యలు
శబరిమల: శబరిమలలో ఉన్న హోటళ్లు తమ కస్టమర్లకు తాజాగా ఉన్న ఆహారాన్ని కాకుండా, పాడైన ఆహారాన్ని అందిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు హెచ్చరించింది. నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువకు అమ్మినా చర్యలు తప్పవని స్పష్టంచేసింది. స్థానికంగా ఉన్న హోటళ్లలోని ఉద్యోగులకు హెల్త్ కార్డులను తప్పనిసరి చేస్తూ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామని టీడీబీ అధ్యక్షుడు వాసు తెలిపారు. -
చట్టం Vs ఆచారం!
-
శబరిమల స్పెషల్ యాత్రలు
సనత్‌నగర్: అయ్యప్ప దీక్షలు షురూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల కోసం శబరిమల ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు ట్రావెల్ ఏజెన్సీలు. కొందరు గురుస్వాములు కూడా భక్తులను యాత్రలకు తీసుకెళ్తున్నారు. పల్లె మదనగోపాల్రెడ్డి గురుస్వామి (17వ పడి) ఆధ్వర్యంలో శబరిమల స్పెషల్ యాత్రలు జరగనున్నాయి. ఐదు రోజుల యాత్రలో భాగంగా 19 ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు. ఫుష్‌బ్యాక్ వీడియో కోచ్ (2 ప్లస్ 2) వాహనంలో ఈ నెల 28, డిసెంబర్ 6, 14, 28, జనవరి 9 తేదీల్లో ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. బీచుపల్లి, అలంపూర్, కాణిపాకం, అరకొండ, శ్రీపురం, అరుణాచలం, చిదంబరం, శ్రీరంగం, ఫలణి, పంబ, శబరిమల ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఐదు రోజుల యాత్రకు రూ.7200 చార్జిగా నిర్ణయించారు. వివరాలకు 98663 34040 నెంబర్లో సంప్రదించవచ్చు. ఆరు రోజుల యాత్ర ... భాస్కర్‌గురుస్వామి (23వ పడి) ఆధ్వర్యంలో శబరిమలై ప్రత్యేక యాత్రలు నిర్వహిస్తున్నారు. ఫుష్‌బ్యాక్ కలర్ వీడియో కోచ్ వాహన సౌకర్యం ఉంటుంది. నవంబర్ 24, డిసెంబర్ 1, 11, 20, 29, జనవరి 5, 9 తేదీల్లో ఈ యాత్రలు ఉంటాయి. ఈ యాత్రలో మహానంది, కాణిపాకం, భవానీ లేక ఫలణి, గురువాయూర్, ఏరిమేలి, పంపా, శబరిమల, కన్యాకుమారి, తిరుచందూర్, రామేశ్వరం, మధురై, తిరుపరన్ కుండ్రం, అరుణాచలం లేక కంచి, గోల్డెన్ టెంపుల్ ప్రదేశాలను సందర్శించవచ్చు. ఆరు రోజుల ప్యాకేజీకి గాను సిట్టింగ్ రూ.7,500, స్లీపర్ రూ.9,000 చార్జి చేస్తున్నారు. వివరాలకు 88850 99225 నెంబర్లో సంప్రదించవచ్చు. -
కేరళలో పార్టీల బలాబలాలు
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరుగనున్న 20 లోక్‌సభ స్థానాలకుగాను 18 లోక్‌సభ స్థానాల్లో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు మధ్యనే బహుముఖ పోటీ నెలకొని ఉంది. తిరువనంతపురం, పట్టణంతిట్ట లోక్‌సభ నియోజకవర్గాల్లోనే బీజేపీ బలం పుంజుకున్న కారణంగా త్రిముఖ పోటీ కనిపిస్తోంది. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోని అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడం ద్వారా ఈ రెండు నియోజక వర్గాల్లో హిందువులను బీజీపీ ఆకర్షించింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే, మార్చి 6న ఎల్డీఎఫ్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ కూటమిలో సీపీఎం 16 సీట్లకు పోటీ చేస్తుండగా, నాలుగు సీట్లకు సీపీఐ పోటీ చేస్తోంది. భాగస్వామ్య పక్షాలైన జనతాదళ్ (సెక్యులర్), లోక్తాంత్రిక్ జనతాదళ్ తరపున ఎవరూ పోటీ చేయడం లేదు. అంతర్గత కలహాల వల్ల కాంగ్రెస్ పార్టీ తన 16 మంది అభ్యర్థులను ఖరారు చేయడానికి మరో పది రోజులు పట్టింది. మిగతా నాలుగు సీట్లలో కూటమిలోని ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ రెండు సీట్లకు, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీ చెరో సీటుకు పోటీ చేస్తున్నాయి. ఈ లెక్కన సీపీఏం, కాంగ్రెస్ పార్టీలు 12 సీట్లలో ముఖాముఖి తలపడనున్నాయి. బీజేపీ కూడా సీనియర్ల పోటీ కారణంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో జాప్యం చేసింది. శబరిమల ఆలయం ఉన్న పట్టణంతిట్ట నియోజక వర్గం మినహా మిగతా 19 స్థానాలకు బీజేపీ అధిష్టానం గురువారం అభ్యర్థులను ప్రకటించింది. గెలిచే అవకాశాలున్న తిరువనంతపురం సీటుకు మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్‌ను కేటాయించారు. వాస్తవానికి 16 సీట్లకే బీజేపీ పోటీ చేస్తుండగా, నాలుగు సీట్లను తన మిత్రపక్షమైన భారత ధర్మ జన సేనకు కేటాయించారు. నాలుగింటిలో ఆ పార్టీ కేవలం రెండు సీట్లలోనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాసర్‌గఢ్, పాలక్కాడ్, అలప్పూజ, కొట్టాయం ప్రాంతాల్లోనే బీజేపీకి కాస్త పట్టుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయత్వంలోని కూటమి ఏకంగా 12 సీట్లను గెలుచుకోగా, మిగతా సీట్లను వామపక్షాల కూటమి గెలుచుకుంది. ఆ తర్వాత 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం కూటమి అధికారంలోకి వచ్చింది. కన్నూరు, వడకర, కోజికోడ్, పట్టణంతిట్ట, తిరువనంతపురం నియోజకవర్గాల్లో పోటీ నువ్వా, నేనా అన్నట్టు రసవత్తరంగా మారింది. -
శబరిమలలో ప్రవేశించిన కనకదుర్గకు మరో అవమానం
-
అయ్యప్ప భక్తుల మహా ఉపవాస దీక్ష
-
ముగిసిన వార్షిక మండల పూజలు
-
శబరిమల ఆలయంలోకి 51మంది మహిళలు ప్రవేశం
-
51 మంది మహిళలు దర్శించుకున్నారు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: రుతుస్రావ వయసులో ఉన్న 51 మంది మహిళలు ఇప్పటివరకూ శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి అఫిడవిట్‌ను సమర్పించింది. కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హన్సరియా వాదిస్తూ.. స్వామివారి దర్శనం కోసం రుతుస్రావ వయసులో ఉన్న 7,564 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 51 మంది దర్శనం చేసుకున్నారన్నారు. తప్పులతడకగా అఫిడవిట్.. కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో అయ్యప్పను దర్శించుకున్న మహిళల ఆధార్, టెలిఫోన్ నంబర్లను బహిర్గతం చేయడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తమిళనాడుకు చెందిన పరంజ్యోతి(47) అనే పురుషుడి పేరును కేరళ ప్రభుత్వం అఫిడవిట్లో చేర్చినట్లు బయపడింది. అలాగే అఫిడవిట్లో పేర్కొన్న కళావతి మనోహర్ వయస్సు 52 సంవత్సరాలనీ, 43 ఏళ్లు కాదని ఆమె కొడుకు చెప్పారు. ఆ మహిళలకు రక్షణ కల్పించండి.. అయ్యప్పస్వామిని దర్శించుకున్న బిందు(42), కనకదుర్గ(44)లకు భద్రత కల్పించాలని కేరళ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. బిందు, కనకదుర్గల భద్రత మినహా ఈ రిట్ పిటిషన్లో తాము ఇతర అంశాల జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేరళ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ బిందు ఇంటివద్ద నలుగురు అధికారులు, అత్తచేతిలో దాడికి గురై ఆసుపత్రిలో ఉన్న కనకదుర్గకు 19 మందితో రక్షణ కల్పిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బిందు కోజికోడ్‌లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా, కనకదుర్గ పౌరసరఫరాల విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
సంయమనం అవసరం
పురాతన కాలం నుంచీ మన దేశం వేదభూమి, కర్మభూమి గనుక మత విశ్వాసాలను ప్రోత్సహించడంలో తప్పులేదని వాదించేవారికీ...ఈ సెక్యులర్ దేశంలో రాజ్యాంగం చెబుతున్నట్టు ప్రభుత్వాలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలనేవారికీ మధ్య ఏళ్లతరబడి సాగుతున్న వివాదాలు మాయమై ఇప్పుడు ‘ప్రార్థించే హక్కు’ చుట్టూ గొడవ రాజుకుంది. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో 10–50 ఏళ్ల మధ్య ఉన్న ఆడవాళ్లకు ప్రవేశాన్ని నిరాకరిస్తున్న నిబంధన చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు ఈ గొడవకంతకూ మూలం. దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాదిమంది మహిళలతో ర్యాలీలు జరిగాయి. ప్రభుత్వం నుంచి ఏదైనా విధాన నిర్ణయం వెలువడినప్పుడో, న్యాయస్థానాలిచ్చిన తీర్పుల విషయంలోనో వాగ్యుద్ధాలు నడవటం వింతేమీ కాదు. అవి మన ప్రజాస్వామ్య వ్యవస్థ చలనశీలతకు నిదర్శనం. కానీ ఆ వాగ్యుద్ధాలు కాస్తా ముదిరి నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకునే వరకూ వెళ్లడం అనారోగ్యకరం. నిజానికి సంక్రాంతి ఆగమిస్తున్న ఈ సమయంలో భక్తుల శరణుఘోషతో శబరిమల మార్మోగుతుండాలి. కానీ దానికి విరుద్ధంగా అది రణఘోషతో అట్టుడుకుతోంది. ఆలయంలోకి నూతన సంవత్సర ఆరంభవేళ వేకువజామున ఇద్దరు మహిళలు ప్రవేశించి పూజలు నిర్వహించారన్న వార్త తెల్లారేసరికి గుప్పుమనడంతో కేరళ అంతటా ఉద్రిక్తతలు అలముకున్నాయి. మహిళల రాకతో అపచారం జరిగిందంటూ ఆలయ పూజారులు గర్భగుడిని శుద్ధి చేశారు. మూడో తేదీన శ్రీలంక మహిళ ఒకరు దర్శనం చేసుకున్నారని తాజాగా వెల్లడైంది. గురువారంనాడు 12 గంటల హర్తాళ్ పాటించాలన్న హిందూ సంస్థలు ఇచ్చిన పిలుపుతో అక్కడ హింస చెలరేగడం, సీపీఎం కార్యాలయాలపై దాడులు, బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు విసరడం, ఆఖరికి మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడటం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ఒక బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదన్న అభిప్రాయం ఉండటంలో తప్పులేదు. దాన్ని మర్చాల్సిందేనని డిమాండు చేయడమూ సబబే. కానీ తమకు దర్శనభాగ్యం కలిగించాలని ఆలయం వద్దకు చేరిన మహిళలపై దాడులు చేయడం, అలా వచ్చేవారికి రక్షణ కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వానిది మహాపరాధమన్నట్టు చిత్రించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆ పనే చేయాలి. మహారాష్ట్రలోని శనిసింగణాపూర్ శనీశ్వరాలయం ప్రధాన వేదికపైకి మహిళలను అనుమతించకూడదన్న ఆచారం రాజ్యాంగ విరుద్ధమని నిరుడు బొంబాయి హైకోర్టు తేల్చి చెప్పాక అక్కడున్న బీజేపీ–శివసేన సర్కారు దాన్ని శిరసావహించింది. రాజ్యాంగబద్ధంగా నడుచుకునే ఏ ప్రభుత్వమైనా ఆ పని చేయాల్సిందే. స్వామి సన్నిధిలో అమలవుతున్న విధినిషేధాల సారాంశాన్ని గ్రహించకుండా వెలువరించిన తీర్పు వల్ల అక్కడ తీరని అపచారం జరుగుతుందని అయ్యప్పభక్తులు ఆందోళన పడుతున్న మాట వాస్తవం. అదే సమయంలో తాము ఎందుకు అనర్హులమని ప్రశ్నించే మహిళా భక్తులు కూడా అంతటా ఉన్నారు. వారి సంగతలా ఉంచి సీనియర్ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి, కేరళ బీజేపీ ప్రధాన కార్యదర్శి కె. సురేంద్రన్ తీర్పు వెలువడిన వెంటనే దాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేశారు. ఆరెస్సెస్ సైతం ఆ పనే చేసింది. అయ్యప్ప భక్తుల మనోభావాలను గుర్తించి తమ వైఖరి మార్చుకున్నామని ఆ రెండు సంస్థలూ చెప్పినా సుబ్రహ్మణ్యస్వామి తీర్పును సమర్థిస్తూనే ఉన్నారు. ఇంతకూ సుప్రీంకోర్టు చెప్పిందేమిటి? శరీర ధర్మాల ఆధారంగా మహిళలను అడ్డుకోవటం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనంలోని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మరో న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం సెక్యులర్ దేశంలో ప్రజలు తమ విశ్వాసాలను అవి హేతుబద్ధమైనవైనా, కాకున్నా ఆచరిస్తారని...వాటిని కోర్టులు ప్రశ్నించజాలవని తీర్పునిచ్చారు. మెజారిటీ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై ఈ నెల 22న వాదనలు వింటానని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది. ఆలయంలోకి మహిళలు వస్తే ప్రధాన ద్వారాలు మూసేస్తానని హెచ్చరించిన ఆలయ తంత్రిపై ఆమధ్య దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌నూ, ఇప్పుడు గర్భగుడిని శుద్ధిచేసిన పూజారులపై తీసుకొచ్చిన ధిక్కార పిటిషన్‌నూ అత్యవసరంగా వినేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగా వ్యవహరించలేదనే చెప్పాలి. భక్తుల ప్రతినిధులతో అది చర్చలు జరిపి ఉంటే పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా మారేది కాదు. తీర్పు అమలు చేయడం తమ రాజ్యాంగ వి«ధ్యుక్తధర్మమని, ఆ తీర్పుతో విభేదిస్తున్నవారు శాంతియుతంగా ఉద్యమం చేస్తే అభ్యంతరం లేదని వారికి తెలియజేసి ఉండాల్సింది. శనిసింగణాపూర్లో సైతం అక్కడి గ్రామస్తులు, ఆలయ ట్రస్టు సభ్యులు మహిళల ప్రవేశం ససేమిరా కుదరదని భీష్మించుకున్నప్పుడు చర్చలే సామరస్య పరిష్కారానికి దోహదపడ్డాయి. ఆ చర్చలకు శ్రీశ్రీ రవిశంకర్ మధ్యవర్తిత్వం వహించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎలాంటి అభిప్రాయమున్నా శబరిమల ఆందోళనలో రాజకీయ జోక్యం తగదని భావిస్తున్న హిందూ మతాచార్యులు అనేకులున్నారు. భక్తులతో మాట్లాడటానికి వారి సహాయసహకారాలు తీసుకోవాల్సింది. ఏ ఆందోళనైనా హద్దులు దాటనంతవరకూ ఆహ్వానించదగ్గదే. కానీ కేరళలో సాగిన హింస, ముఖ్యంగా అక్కడి బీజేపీ అధికార పత్రికలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పదవినుంచి తప్పుకుని కులవృత్తి చేసుకు బతకాలంటూ వేసిన కార్టూన్ ఆందోళనలు హద్దు మీరిన తీరును సూచిస్తున్నాయి. ఇది ఎవరికీ మేలు చేయదు. సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యవహారంలో ఏం చెబుతుందన్న సంగతలా ఉంచి, ఈలోగా చర్చల ప్రక్రియ కొనసాగించటం అవసరం. -
మీరు భక్తురాలా... అవును అయితే ఏంటి?!
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకోవడం వెనుక కేరళ సీఎం పినరయి విజయన్ తోడ్పాటు ఉందన్నవార్తలను కనకదుర్గ, బిందులు ఖండించారు. తమకు ఉన్న హక్కును ఉపయోగించుకున్నామే తప్ప ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ.. రుతుస్రావ వయసులో ఉన్న కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు అమ్మిని(42)లు బుధవారం అయ్యప్పను దర్శించుకున్న విషయం తెలిసిందే. దీంలో కేరళ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి విజయన్ సహకారంతోనే ఆ ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించి అపచారం చేశారంటూ సంఘ్ పరివార్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కనకదుర్గ, బిందులు ఖండించారు. తాము అయ్యప్ప దర్శనం చేసుకునే క్రమంలో భక్తులెవరూ అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు వివాదాస్పదం చేస్తున్నాయని విమర్శించారు. భక్తులూ.. కార్యకర్తలు ఎవరైనా వెళ్లవచ్చు ఆలయ ప్రవేశం గురించి కనకదుర్గ మాట్లాడుతూ... ‘ ఇది నా సొంత నిర్ణయం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపయోగించుకుని పోలీసుల సహాయంతో గుడిలో అడుగుపెట్టాము. ఈ విషయంలో సీఎం మాకు సహాయం చేశారో లేదోనన్న సంగతి మాకైతే తెలియదు. ఒకే భావజాలం ఉన్న మేమిద్దరం(బిందు, నేను) స్వామిని దర్శించుకోవాలనుకున్నాం. ఇందులో పోలీసులు, రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. కొందరు బీజేపీ కార్యకర్తలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాగా సామాజిక కార్యకర్తగా ఉన్న మీరు భక్తురాలా అని విలేరులు ప్రశ్నించగా... ‘ అవును నేను కార్యకర్తను. అలాగే భక్తురాలిని కూడా. నేనే కాదు మరికొంత మంది నాలాంటి కార్యకర్తలు దేవుడిని దర్శించుకోవచ్చు. భక్తులైనా, కార్యకర్తలైనా అన్ని వయస్సుల మహిళలు గుడిలోకి వెళ్లవచ్చని కదా సుప్రీం తీర్పునిచ్చింది’ అని సమాధానమిచ్చారు.(చదవండి : ఆ ఇద్దరు మహిళలు ఎవరు?) ప్రస్తుతం ఏ పార్టీలో లేను ‘ప్రస్తుతం నేను ఏ పార్టీకి చెందినదాన్ని కాదు. గతంలో సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీలో భాగంగా ఉండేదాన్ని. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో రాజీనామా చేశారు. డిసెంబరు 24నే దర్శనం చేసుకుందామనుకున్నాం. కానీ ఆరోజు కుదరలేదు. ఒకవేళ ఇంటికి వెళ్తే మళ్లీ దేవుడిని దర్శనం చేసుకునే అవకాశం రాదని భావించాం. పంబా పోలీసులను రక్షణ కోరాం. కాలినడకన వెళ్లి.. అనుకున్నట్టుగానే అయ్యప్ప దర్శనం చేసుకున్నాం’ అని’ బిందు పేర్కొన్నారు. కాగా కేరళ యూనివర్శిటీ నుంచి మాస్టర్ లా పట్టాను సాధించిన బిందు అమ్మిని ప్రస్తుతం కన్నూరు యూనివర్శిటీలో న్యాయశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తుండగా... కేరళ పౌర సరఫరాల కార్పొరేషన్లో కనకదుర్గ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక...‘నవోతన కేరళం శబరిమలాయిలెక్కు’ అనే ఫేస్బుక్ పేజీ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. -
కేరళలో ఉద్రిక్తంగా మారిన బంద్
-
ఆ ఇద్దరు మహిళలు ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : బిందు అమ్మినికి 42 ఏళ్లు. కనకదుర్గకు 41 ఏళ్లు. వీరిరువురు బుధవారం తెల్లవారు జామున శబరిమలలోని అయ్యప్ప ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. ఇంతకు వీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీరి జీవిత నేపథ్యం ఏమిటీ? పదేళ్లకుపైగా యాభై ఏళ్లకు లోపు వయస్సున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించరాదంటూ ఆరెస్సెస్, హిందూత్వ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వీరెందుకు ఈ సాహసానికి ఒడిగట్టారు? బిందు, కనకదుర్గ డిసెంబర్ 24వ తేదీనే అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆరెస్సెస్ కార్యకర్తల ఆందోళన వల్ల అది వారికి సాధ్యం కాలేదు. దాంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ వారం రోజులు వారు కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా ఎలాంటి కాంటాక్టు పెట్టుకోలేదు. వారిలో కనకదుర్గ కుటుంబమైతే ఆమె తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయ్యప్ప ఆలయ సందర్శనానికని వెళ్లి అదృశ్యమైందని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పారు. వారు ఈ వారం రోజులపాటు పోలీసుల రక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. లింగ వివక్షను రూపుమాపాలంటూ కేరళలో 620 కిలోమీటర్ల పొడవున మహిళల మానవహారం ప్రదర్శన జరిపిన మరునాడే, అంటే మంగళవారం ఎర్నాకులం నుంచి బయల్దేరి అయ్యప్ప ప్రవేశ ద్వారమైన పంపాకు చేరుకున్నారు. వారు అక్కడి నుంచి పోలీసు ఎస్కార్ట్ సహాయంతో రాత్రి 2.30 గంటలకు కొండలపైకి బయల్దేరి వెళ్లారు. బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయంలోకి ప్రవేశించారు. 3.45 గంటలకు గర్భగుడిలోకి ప్రవేశించి ప్రార్థనలు జరిపారు. తాము ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి చాలామంది భక్తులు తమను చూశారని, అయితే ఎవరు కూడా తమను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదని బిందు అమ్మిని, కనకదుర్గలు వివరించారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17 మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. బిందు అమ్మిని కేరళ యూనివర్శిటీ నుంచి మాస్టర్ లా పట్టాను సాధించిన బిందు అమ్మిని ప్రస్తుతం కన్నూరు యూనివర్శిటీలో న్యాయశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థి రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. వామపక్ష పార్టీకి అనుబంధంగా ఉన్న కేరళ విద్యార్థి సంఘటనలో పనిచేశారు. బిందు దళిత కార్యకర్త కూడా. ఆమె సామాజిక న్యాయం కోసం, లింగ వివక్షతపై పోరాడే కార్యకర్తగా ఆమె తన మిత్రులకు, విద్యార్థినీ విద్యార్థులకు సుపరిచితం. బిందు రాజకీయ కార్యకర్త హరిహరన్ పెళ్లి చేసుకున్నారు. పూక్కడ్లో నివసిస్తున్న వారికి 11 ఏళ్ల ఓల్గా అనే కూతురు కూడా ఉంది. కనకదుర్గ నాయర్ అనే అగ్రకులానికి చెందిన కనకదుర్గ ‘నవోతన కేరళం శబరిమలాయిలెక్కు’ అనే ఫేస్బుక్ పేజీ ద్వారా బిందుకు పరిచయం అయ్యారు. అయ్యప్ప ఆలయాన్ని ఎలాగైన సందర్శించాలన్న తాపత్రయంతోనే ఈ పేజీని ఏర్పాటు చేశారు. కేరళ పౌర సరఫరాల కార్పొరేషన్లో కనకదుర్గ మేనేజర్‌గా పని చేస్తున్నారు. కృష్ణనున్ని అనే ఇంజనీర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. మలప్పురంలో నివసిస్తున్న ఆ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కనకదుర్గ ఆద్యాత్మిక చింతన కలిగిన హిందువని, ఆమె అయ్యప్ప ఆలయం ఎందుకు వెళ్లాలనుకుందో తనకు అర్థం కావడం లేదని ఆమె అన్న భరత్ భూషణ్ మీడియాతో వ్యాఖ్యానించారు. -
ఎవరిది ఒప్పు? ఎవరిది తప్పు?
-
చరిత్రాత్మకం: శబరిమల ఆలయంలోకి మహిళలు
-
శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత
-
అయ్యప్పపై మరో తీవ్ర వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ పక్క రాదాంతం జరుగుతుండగా మరో వివాదం రాజుకుంది. ఈ ఆలయం తరతరాలుగా తమదని, తమ ఆలయాన్ని తమకు అప్పగించాలని, అలా జరగక పోయినట్లయితే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి సాధించి తీరుతామని కేరళకు చెందిన మాల ఆర్యులు డిమాండ్ చేస్తున్నారు. ‘12 శతాబ్దానికి చెందిన శబరిమలలోని అయ్యప్ప ఆలయం మాల ఆర్యులది. పండలం రాజ కుటుంబం 1800లో దీన్ని ఆక్రమించుకున్నారు. ఆలయంలోని పలు దేవతా విగ్రహాలను తొలగించి వాటిని అడవుల్లో విసిరేశారు. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు. చరిత్రగతిలో అడవుల్లో పడేసిన విగ్రహాలు కరిమల, పొన్నంబాల్మేడు, కొత్తకుతితార, నీలక్కల్, తలపరమల అడవుల్లో దొరికాయి. 1904లో పండలం రాజు ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాహ్మణ వర్గానికి చెందిన తాజమన్ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రధాన పూజారి బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకు ద్రావిడ పద్ధతిలో జరిగిన పూజాది కార్యక్రమాలను మార్చివేసి బ్రాహ్మణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. గతంలో అయ్యప్పకు పూజారులుగా వ్యవహరించిన మాల ఆర్యులు తేనతోనే అభిషేకం చేసేవారు. ఆ స్థానంలో బ్రాహ్మణ పూజారులు పాలతోని అభిషేకం చేయడం ప్రారంభించారు. 1950లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆలయ పాలనా బాధ్యతలను స్వీకరించింది. ‘మాకు ఈ ఆలయాన్ని తిరిగి అప్పగించాల్సిందిగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఆ తర్వాత అవసరమైతే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి న్యాయం సాధిస్తాం. అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం మా మంచికే జరిగిందేమో! మా గొంతును కూడా ఈ ప్రపంచానికి వినిపించేందుకు అవకాశం దొరికింది. మాకు ఆలయాన్ని అప్పగించినట్లయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తాం. మా గుండెల నిండా ఎప్పుడూ గూడుకట్టుకొనే ఉండే మా అయ్యప్ప మహిళల పట్ల ఎప్పుడూ వివక్షత లేదు’ అని ఐక్య మాల ఆర్య మహా సభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీకే సజీవ్ చెప్పారు. ఆయన అయ్యప్ప ఆలయంపై విస్తృత పరిశోధనలు జరిపారు. అయ్యప్ప ఎవరి పుత్రుడు ? శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నంబాలమేడు గుహలో కందన్, కారతమ్మ దంపతులకు అయ్యప్ప జన్మించారన్నది మాల ఆర్యులు నమ్మకం. అయ్యప్ప ఆలయం మొట్టమొదటి పూజారి కరిమల ఆర్యన్ అని, ఆయన్నే ఆలయానికి శంకుస్థాపన చేశారని, ఆఖరి పూజారి కోచుకుట్టి కోచురామన్ అని, వారి బంధువులు ఇప్పటికీ కొట్టాయం జిల్లా ముండక్కయమ్‌లో నివసిస్తున్నారని సజీవ్ తెలిపారు. దక్షిణ కేరళలోని పట్టణంతిట్ట, కొట్టాయం, ఇదుక్కి ప్రాంతాల్లోని ఎత్తైన పర్వతాల వాలున దాదాపు 30 వేల మంది మాల ఆర్యులు నివసిస్తున్నారు. వారి రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలుగా పరిగణిస్తోంది. వారి ఇళ్లన్నీ విసిరేసినట్లుగా దూర, దూరంగా కొండ చెరియ వాలుకు ఆనుకొని ఉన్నాయి. అలా వాళ్ల ఊళ్లన్ని ఎత్తైన కొండ శిఖరాల వాలునే ఉండేవని, అందుకే వారికి మాల ఆర్య (కింగ్ ఆఫ్ ది మౌంటేన్) అని పేరు వచ్చిందని 1883లోనే ప్రచురించిన ‘నేచర్ లైవ్ ఇన్ ట్రావెంకోర్’ పుస్తకంలో శామ్యూల్ మతీర్ రాశారు. ఇప్పటికే కరిమల, పొన్నంబాలమేడు, నీలక్కల్ మహదేవ్ ఆలయాలపై హక్కుల కోసం పోరాడుతున్న ఐక్య మాల ఆర్య మహా సభ ఇప్పుడు అయ్యప్ప ఆలయాన్ని తమ పోరాటంలో భాగం చేసింది. కేరళలో దాదాపు వంద ఆలయాలపై ఆదివాసీ, దళిత సంఘాలు తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. బ్రాహ్మణ పూజారులకు ముందు మాల ఆర్య పూజారులు ఉండేవారని, వారు అయ్యప్పకు తేనాభిషేకం చేసేవారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 23వ తేదీన పట్టణంతిట్టలో జరిగి బహిరంగ సభలో వ్యాఖ్యానించడం గమనార్హం. చరిత్రగతిలో ఆదివాసీల ఆలయాలు అన్యాక్రాంతం అవడం, ధ్వంసమవడం తెల్సిందే. తూర్పు గోదావరి జిల్లా తలుపులమ్మా, కొడగులోని తాళకావేరి, చిక్‌మగలూరులోని బాబా బుడాన్ గిరి టెంపల్, తిరుపతిలో వేంకటేశ్వర స్వామి ఒకప్పడు గిరిజన దేవాలయాలన్న వివాదం ఉంది. తమ దేవుళ్ల పక్కన అన్య మతస్థులను పేర్కొనే సంస్కృతి ద్రవిడులదని, గిరిజనులు లేదా ఆదివాసీల సంప్రదాయం కూడా ద్రవిడ సంస్కృతికి దగ్గరగా ఉంటుందని చరిత్రకారులు చెబుతారు. అందుకేనేమో అయ్యప్ప ముస్లిం మిత్రుడు వావర్ మసీదు అయ్యప్పకు దగ్గరలోనే ఉంది. అయ్యప్పను సందర్శించే భక్తుల్లో 80 శాతం మంది 40 కిలోమీటర్ల దిగువనున్న వావర్ మసీదు సందర్శించాకే అయ్యప్ప వద్దకు వెళతారు. వేంకటేశ్వరుడి భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ అన్న విషయం తెల్సిందే. వేంకటేశ్వరుడు ఒకప్పటి చెంచుల ఆరాధ్య దైవంగా చరిత్రకారులు చెబుతారు. శబరిమల; కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు -
నేడు తెరుచుకోనున్న ‘శబరిమల’
శబరిమల: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో గత నెలలో పూజల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమ యింది. భారీగా పోలీసులను మోహరిం చడంతోపాటు ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించింది. మొత్తం 2,300 మంది పోలీసులను మోహరించింది. ఈ చర్యలపై పండాలం రాచ కుటుంబం, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆలయం వద్ద విధి నిర్వహణ నిమిత్తం యువ మహిళా జర్నలిస్టులను పంపవద్దని ‘శబరిమల కర్మ సమితి’ మీడియా సంస్థలను కోరింది. నేటి సాయంత్రం 5 గంటలకు.. ట్రావెన్కోర్ చిట్టచివరి రాజు తిరునాళ్ బలరామ వర్మ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించే శ్రీ చిత్ర అట్ట తిరునాళ్ పూజల కోసం నేటి సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. తాంత్రి కందారు రాజీవరు, ప్రధాన పూజారి ఉన్ని కృష్ణన్ నంబూద్రిలు ఆలయ ద్వారాలను తెరిచి, శ్రీకోవిల్‌లో దీపాలు వెలిగిస్తారు. మంగళవారం తిరునాళ్ పూజల అనంతరం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు. మండల పూజల కోసం తిరిగి ఈ నెల 17న ఆలయాన్ని తెరిచి మూడు నెలలపాటు దర్శనం కోసం అనుమతిస్తారు. విధి నిర్వహణలో భాగంగా ఆలయం వద్దకు రుతుక్రమం వయసున్న మహిళా జర్నలిస్టుల ను పంపొద్దని వీహెచ్‌పీ, హిందూ ఐక్యవేదిక తదితర సంస్థలతో కూడిన ‘శబరిమల కర్మ సమితి’ మీడియా నిర్వాహకులను కోరింది. 50 ఏళ్ల లోపు మహిళా జర్నలిస్టులు ఆలయంలోకి ప్రవేశించిన పక్షంలో పరిస్థితి చేయిదా టిపోతుందని హెచ్చరించింది. ఈ మేరకు మీడియా సంస్థల ఎడిటర్లకు లేఖలు పంపింది. పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. -
అయ్యప్ప భక్తులకు అండగా..
తిరువనంతపురం/కన్నూర్: సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన అయ్యప్పభక్తులకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మద్దతు ప్రకటించారు. అయ్యప్ప భక్తులను అరెస్టు చేస్తూ కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో ఎమర్జెన్సీ మాదిరి వాతావరణం సృష్టించిందని ఆరోపించారు. కన్నూర్‌లో శనివారం బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించాక అమిత్ మాట్లాడారు. ఆందోళనకారులను నిర్బంధిస్తూ కేరళ ప్రభుత్వం నిప్పుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం హిందూ సంప్రదాయాలను నాశనం చేయడానికి చూస్తోందన్నారు. 10 నుంచి 50 ఏళ్ల వయస్సు అమ్మాయిలు, మహిళల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్నారన్న కారణంతో ఆర్ఎస్ఎస్, సంఘ్‌పరివార్ కార్యకర్తలతోపాటు 2 వేల మంది భక్తులను అరెస్టు చేయడాన్ని అమిత్ ఖండించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలపై ఆంక్షలున్న అయ్యప్ప దేవాలయం ప్రత్యేకతను కాపాడుకోవాల్సి ఉందని అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలో శబరిమల అంశాన్ని పార్టీ ప్రధాన అజెండాగా తీసుకోనుందని స్పష్టం చేశారు. శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన స్వామి సందీపానంద గిరికి చెందిన ఆశ్రమంపై దాడి జరిగింది. కుండమోన్కదవు దగ్గర్లోని సాలగ్రామ ఆశ్రమంలోకి గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లు, ఒక స్కూటర్‌కు నిప్పుపెట్టారు. శనివారం సీఎం విజయన్‌తోపాటు మంత్రులు థామస్ ఇసాక్, సురేంద్రన్ ఆశ్రమాన్ని సందర్శించి స్వామీజీతో మాట్లాడారు. ఈ దాడికి బీజేపీతోపాటు, శబరిమల ఆలయ ప్రధాన పూజారులు, పండాలం రాచ కుటుంబమే కారణమని సందీపానంద ఆరోపించారు. -
‘ప్రార్థించే హక్కు’కు రక్షణ
కేరళలోని శబరిమల ఆలయంలో పదేళ్ల నుంచి 50 ఏళ్లలోపు ఆడవాళ్లకు ప్రవేశం లేదంటూ అమల వుతున్న నిబంధన చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన మెజారిటీ తీర్పు చరిత్రాత్మకమైనది. ఈ వారంలో వెలువడిన తీర్పుల పరంపరలో అత్యంత కీలకమైనది. ధర్మాసనంలోని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ రోహింటన్ నారిమన్, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లిచ్చిన తీర్పుతో అయిదో న్యాయమూర్తి జస్టిస్ ఇందూ బెనర్జీ విభేదించారు. ఏది అవసరమైన మతాచారమో, ఏది కాదో నిర్ణయించుకోవా ల్సింది మతమే తప్ప న్యాయస్థానం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సెక్యులర్ దేశంలో ప్రజలు తమ విశ్వాసాలను అవి హేతుబద్ధమైనవైనా, కాకున్నా ఆచరిస్తారని, వాటిని కోర్టులు ప్రశ్నించజాల వని... హేతుబద్ధ భావనను మత వ్యవహారాల్లోకి తీసుకురాకూడదని ఆమె భావించారు. మన రాజ్యాంగం అందరికీ సమానావకాశాలు దక్కాలంటుంది. ఏ రూపంలోనూ వివక్ష కొనసాగనీయ రాదంటుంది. కానీ నిత్యం మనచుట్టూ అన్నిచోట్లా అది కనబడుతూనే ఉంటుంది. ఏళ్లు గడిచేకొద్దీ పరిణతి చెందాల్సిన, పదునెక్కాల్సిన రాజ్యాంగ నైతికత క్షీణిస్తున్న వైనం అందరి అనుభవంలోకీ వస్తున్నది. ఇతర వివక్షలను గుర్తించటం సులభమే. వాటిని ప్రశ్నించటం కూడా తేలికే. కానీ లింగ వివక్ష బహురూపి. కుటుంబ మర్యాద, కుల కట్టుబాటు, మత విశ్వాసం, ఆచారం, సంప్రదాయం తదితర అంశాల మాటున అది అమలవుతుంటుంది. వీటిలో అత్యధికం పురుషుల కంటే మహిళ లనే నియంత్రిస్తుంటాయి. రుతుస్రావం అయ్యే వయసులోని మహిళలకు శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలో ప్రవేశాన్ని శతాబ్దాలుగా నిరాకరిస్తున్నారు. ఇది హిందూమతంలోని వైవిధ్యమే తప్ప వివక్ష కాదని ఆలయ ట్రస్టు వాదిస్తోంది. అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి గనుక ఈ నిబంధన అమలవు తున్నదని చెప్పింది. కానీ ధర్మాసనం ఈ వాదనను అంగీకరించలేదు. మహిళల ఆలయప్రవేశాన్ని అడ్డుకోవటం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. శరీర ధర్మాల ఆధారంగా మహిళల హక్కును నిరా కరించటం కుదరదని తెలిపింది. హిందూ సంప్రదాయాలకూ, ఆచార వ్యవహారాలకూ పునాదిగా భావించే వేదాలను మహిళలు కూడా అధ్యయనం చేసేవారని చెప్పడానికి అనేక ఉదాహరణలు న్నాయి. గర్గి, అదితి, ఇంద్రాణి, మైత్రేయి, లోపాముద్ర వంటి మహిళలు వేద విదుషీమణులుగా ఖ్యాతి గడించారు. ఆ కాలంలో స్త్రీలకు ఉపనయనం చేసే ఆచారం కూడా ఉండేదని చెబుతారు. అది ఎప్పుడు మారిందో, ఎందుకు మారిందో ఎవరికీ తెలియదు. ఏ సమాజంపైన అయినా మత విశ్వా సాలు, ఆచారాల ప్రభావం ప్రగాఢంగా ఉంటుంది. ఆ విశ్వాసాలు, ఆచారాలు అనూచానంగా అమ లవుతున్నాయన్న అభిప్రాయం ఉండటం దానికొక కారణం. వేద విద్యకు, ఉపనయనానికి మహి ళలు ఎప్పటినుంచి దూరంగా ఉన్నారన్నది జవాబులేని ప్రశ్న. కాలక్రమంలో ఎవరి ప్రమేయంతోనో లేదా మరే ప్రభావంతోనో వాటికి మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఆ మార్పులు కొన్నాళ్లకు ఆచారాలుగా స్థిరపడిపోతాయి. వివాదాస్పదం కాని ఆచారాల గురించి ఎవరూ ప్రశ్నించరు. కానీ వివక్షకు తావిచ్చే ఆచారాలు ఇప్పుడు కాకపోతే రేపైనా సందేహాన్ని రేకెత్తిస్తాయి. ఆ సందేహం కాలక్రమేణా చిక్కబడి ప్రశ్నించటానికి దోహదపడుతుంది. అయ్యప్ప ఆలయంలో తమకు ప్రార్ధన చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నది ఆ స్వామి పట్ల భక్తి విశ్వాసాలున్న మహిళలే. శబరిమల ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఏటా అక్కడికి లక్షలాదిమంది భక్త జనం వెళ్తుంటారు. దానికి ముందు 41 రోజులపాటు కఠోర నియమాలతో కూడిన వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఒక్క శబరిమలలో తప్ప దేశంలోని మరే ఇతర అయ్యప్ప దేవాలయాల్లోనూ మహిళల ప్రవేశంపై నిషేధం లేదు. దేశంలో 20 లక్షలకు పైగా ఆలయాలుంటే వాటిల్లో కొన్నిచోట్ల మాత్రమే ఈ మాదిరి విధి నిషేధాలు అమలవుతున్నాయి. రుతుక్రమం పేరు చెప్పి మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించే దేవాలయాలు అరడజను వరకూ ఉన్నాయి. పురుషులను దూరంగా ఉంచే ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవటాన్ని సమర్ధిస్తున్నవారు ఈ ఉదాహరణలే ఇస్తున్నారు. ఒకచోట అమలవుతున్న ఆచారాన్ని సమర్ధించటానికి మరోచోట అదే రీతిలో ఉండటాన్ని ఎత్తిచూపటం జవాబు కాబోదు. ఒకప్పుడు వేద పఠనానికి, ఆలయ పూజారిగా ఉండటానికి బ్రాహ్మణులు మాత్రమే అర్హులన్న అభిప్రాయం ఉండేది. ఇప్పుడు దళితులు, ఇతర కులాలకు చెందినవారు కూడా వేదాధ్యయనం చేస్తున్నారు. వారిని పూజారులుగా నియమిస్తున్నారు. పదేళ్లక్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. వివక్షకు తావిచ్చే ఆచారాలను, సంప్రదాయాలను సంస్కరించుకోవటం అంతిమంగా మత విస్తరణకు దోహదపడుతుందే తప్ప దానికి హాని కలి గించదు. సముద్రాలను దాటడం మహా పాపమన్న విశ్వాసం హిందువుల్లో బలంగా ఉండేది. కాల క్రమేణా దానికి ప్రాయశ్చిత్తం కూడా రూపొందింది. ఇప్పుడు ఆ నియమానికి కాలం చెల్లింది. ఎని మిదేళ్లక్రితం మహారాష్ట్రలో ఏర్పడిన భూమాత రణరంగిని బ్రిగేడ్(బీఆర్బీ) ఆ రాష్ట్రంలోని శనిసింగ నాపూర్‌లో ఉన్న శనీశ్వరాలయం ప్రధాన వేదికపైకి మహిళలను అనుమతించకూడదన్న శతాబ్దాల నాటి ఆచారానికి వ్యతిరేకంగా పోరాడింది. చివరకు బొంబాయి హైకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాక శనీశ్వరాలయం ట్రస్టు ఆ ఆచారాన్ని రద్దు చేస్తున్నట్టు రెండేళ్లక్రితం ప్రక టించింది. ఈ ప్రపంచం, అందులోని సమస్త జీవరాశులు భగవంతుని సృష్టేనని నమ్ముతున్నవారు వివక్షను, వ్యత్యాసాలను దరిచేరనీయకూడదు. అవి రాజ్యాంగవిరుద్ధమని, సమానత్వ భావనను దెబ్బతీస్తున్నాయని తెలుసుకున్నప్పుడు అసలే పాటించకూడదు. సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు ఈ విజ్ఞతను, వివేకాన్ని అందరిలో కలిగించాలి. -
శబరిమలలో ఆన్లైన్ బుకింగ్ అసాధ్యం
తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్పస్వామి దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ విధానం ప్రారంభించటం ఆచరణ సాధ్యం కాదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంబ వద్ద రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో భక్తులను నియంత్రించేందుకు తిరుమల తరహాలో ఆన్లైన్ బుకింగ్ పద్ధతిని అమలు చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వార్తలు వెలువడ్డాయి. శబరిమలలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తిరుమల మోడల్‌ను అమలు చేయటం అసాధ్యమని టీడీబీ అధ్యక్షుడు పద్మకుమార్ స్పష్టంచేశారు. ఆఖరి మకరవిలక్కు సీజన్లో రోజుకు 4 లక్షల మంది భక్తులు వస్తారని, అలాంటప్పుడు 20 వేల నుంచి 30 వేల మందినే అనుమతించటం ఎలా సాధ్యమని ఎదురు ప్రశ్నించారు. శబరిమలవిషయంలో టీడీజీ నిర్ణయమే అంతిమమని తేల్చి చెప్పారు. అయితే సౌకర్యవంతమైన దర్శనం కోసం ఎవరైనా ఆమోదయోగ్యమైన సిఫార్సులు చేస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పంబ వద్ద మౌలిక వసతుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పంబపై ‘అయ్యప్ప సేతు’పేరుతో టీడీబీ తాత్కాలిక బ్రిడ్జిని నిర్మించింది. ఇటీవలి వరదల్లో నీట మునిగిన పంబ–త్రివేణి బ్రిడ్జిని ఆదివారం పునరుద్ధరించింది. నవంబర్ నుంచి మకరవిలక్కు సీజన్ ప్రారంభంకానున్న దృష్ట్యా పంబ వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పనుల సమన్వయంపై సీనియర్ ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాన్ని నియమించాలని యోచిస్తోంది. -
శబరిమల: ఆ బంద్‌తో మాకు సంబంధం లేదు!
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలన్న కేరళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళనలో పాల్గొనడం లేదని రాష్ట్రీయ స్వయం స్వేవక్ సంఘ్(ఆరెస్సెస్) స్పష్టం చేసింది. మహిళలను ఆలయంలోని రాకుండా ఆడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 30న (సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని సంఘ్ పరివారంలో భాగమైన శ్రీ రామ సేన, హనుమాన్ సేన, శ్రీ అయ్యప్ప ధర్మసేన వంటి హిందూ సంఘాలు ప్రకటించాయి. అయితే తాము కోర్టు తీర్పును గౌరవిస్తామని, ప్రస్తుతం వీధుల్లో ఆందోళన చేయడం సరైంది కాదని భావిస్తున్నాం గనుకే బంద్‌కు దూరంగా ఉంటున్నామని ఆరెస్సెస్ పేర్కొంది. మరో హిందూ సంస్థ హిందూ ఐక్య వేదిక కూడా ఈ బంద్‌లో పాల్గొనడం లేదని తెలిపింది. సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ బంద్ కారణంగా ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగనీయమని శ్రీరామ సేన తెలిపింది. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకుల కార్యకలాపాలకు ఆటంకం సృష్టించబోమని పేర్కొంది. అదే విధంగా ప్రజా రవాణా వ్యవస్థకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగదని తెలిపింది. కాగా శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ దీపక్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆలయాలు ప్రైవేటు ఆస్తులు కావని, మహిళలను ఆలయంలోని రాకుండా ఆడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
మరో పోరాటానికి హిందూ సంఘాలు
తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరోదించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పును ఏకీభవించిన కేరళ ప్రభుత్వం మహిళల ఆలయంలోకి రావచ్చునని పేర్కింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని శ్రీ రామ సేన, హనుమాన్ సేన, శ్రీ అయ్యప్ప ధర్మసేన వంటి హిందూ సంఘాలు ప్రకటించాయి. శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశంపై దాఖలపై పిటిషన్‌ను జస్టిస్ దీపక్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తూ.. ఆలయాలు ప్రవేటు ఆస్తులు కావని, మహిళలను ఆలయంలోని రాకుండా ఆడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
శబరిమలలో తిరుమల మాదిరి సౌకర్యాలు
తిరువనంతపురం: తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాదిరి శబరిమలలో కూడా అయ్యప్ప భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ త్వరలో తిరుమల సందర్శించి అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులు, వసతుల కల్పనపై అధ్యయనం చేయనున్నట్లు దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఈ అధ్యయనానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారన్నారు. శబరిమల ఆలయం నవంబర్-జనవరి మూడు నెలలే తెరిచి ఉంటుంది. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా లక్షలమంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటారు. మళయాళ కేలండర్ ప్రకారం ఈ సీజన్లో పూజల కోసం నెలకు ఐదు రోజులు మాత్రమే ఆలయం తెరుస్తారు. ఈ సీజన్లో జనవరి 14 మకర విళక్కు వరకు ఆలయానికి రూ.225 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది గత ఏడాది ఇదే సీజన్లో లభించిన దానికంటే రూ.45 కోట్లు అధికమని మంత్రి వివరించారు. ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం మళ్లిస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఇక్కడ భక్తుల కోసం సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కోట్లలో ఖర్చు పెడుతోందన్నారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణాలకు ఈ సీజన్లో రూ.38 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. సన్నిధానం పరిధిలో ప్లాస్టిక్ బాటిల్స్‌ను నిషేధించామని, కేరళ వాటర్ అథారిటీ ఔషధపరమైన నీటిని యాత్రికులకు అందిస్తోందని మంత్రి సురేంద్రన్ చెప్పారు. -
మద్యం, తుపాకీతో శబరిమలకు..
శబరిమల: మద్యం, తుపాకీతో శబరిమల అయ్యప్ప దేవాలయానికి వెళ్తూ ఆరుగురు తెలంగాణవాసులు పోలీసులకు పట్టుబట్టారు. కేరళలోని పంపా టోల్ గేట్ వద్ద జరిపిన సాధారణ తనిఖీల్లో వారి వాహనంలో 4 బాటిళ్ల మద్యం, ఓ తుపాకీని గుర్తించిన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకొని కేరళ ఆబ్కారీ, పోలీస్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా ఆ ఆరుగురు శబరిమల వచ్చారని, వారి వద్ద తుపాకీ లైసెన్స్ ఉన్నా ఇలాంటి యాత్రా ప్రదేశాల్లో ఆయుధాలు నిషేధమని పేర్కొన్నారు. -
అయ్యప్ప స్వామి జోలపాట రీరికార్డింగ్
తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని నిద్ర పుచ్చేందుకు వినిపించే ‘హరివరాసనమ్’ పాటను మళ్లీ రికార్డు చేయాలని ఆలయాన్ని పర్యవేక్షిస్తున్న ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) నిర్ణయించింది. ఎనిమిది చరణాల సమాహారమైన ఈ గీతంలోని ప్రతీ లైనులో ‘స్వామి’ పదాన్ని చేర్చనున్నారు. ప్రముఖ గాయకుడు కె.జె ఏసుదాస్ ఆలపించిన గీతాన్నే వినియోగిస్తున్నారు. ఈ గీతంలో వచ్చే ‘అరివిమర్ధనం’ పదాన్ని ‘అరి’(శత్రువు), ‘విమర్ధనం(నాశనం)’గా విడగొట్టేందుకు నిర్ణయించినట్లు కుమార్ వెల్లడించారు. 1950 నుంచి ఈ గీతాన్ని స్వామి నిద్రా సమయంలో వినిపిస్తున్నారు. శబరిమలలో ఏపీ మహిళను అడ్డుకున్న పోలీసులు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి యత్నించిన ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్వతి(31) భర్త, పిల్లలు, మరో 11 మందితో కలిసి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. శబరిమలలో 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. -
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై..
సాక్షి, న్యూఢిల్లీ: శబరిమల ఆలయ కేసును రాజ్యంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఇచ్చింది. శబరిమల ఆలయ నిబంధనల ప్రకారం 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు ఆలయ ప్రవేశం లేదు. ఇది మహిళా హక్కులను హరించడమే కాకుండా లింగవివక్షకు తావిస్తుందని ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ సుప్రీం కోర్టులో ప్రజావ్యాజ్యం ధాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఈ కేసును ఐదుగురి జడ్జీలతో కూడిన ధర్మసనానికి బదిలీ చేసింది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా నిర్ణయం తీసుకున్న ఆలయ కమిటి నిర్ణయం సరైనదా, కాదా అనే విషయం క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉందని త్రిసభ్య బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక కేరళలోని ఎల్ఢీఎఫ్ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి మహిళల అనమతికి మద్దతిస్తుండగా.. గత యూడీఎప్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోంది. -
శబరిమలలో మహిళల ప్రవేశానికి ఓకే
⇒ సుప్రీంకోర్టుకు నివేదించిన కేరళ ప్రభుత్వం ⇒ అన్ని వయసుల మహిళలు గర్భగుడిలోకి ప్రవేశించవచ్చు ⇒ ప్రభుత్వ వైఖరితో వ్యతిరేకించిన ట్రావెన్కోర్ బోర్డు న్యూఢిల్లీ: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అన్ని వయసుల మహిళలు చారిత్రక శబరిమల ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. గత జూలైలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తూ కేరళ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్‌ను సమర్పించింది. అయితే తాజా విచారణ సందర్భంగా ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మద్దతుగా 2007లో తాము దాఖలు చేసిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నట్టు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 2007లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) నేతృత్వంలోని ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అరుుతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) ఈ నిర్ణయంతో విబేధించింది. ఈ ఏడాది అధికారాన్ని కోల్పోయే ముందు కూడా యూడీఎఫ్ ప్రభుత్వం పదేళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తూ అదనపు అఫిడవిట్‌ను సమర్పించింది. ‘శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటని వివరణ కోరాం. సీనియర్ న్యాయవాది గుప్తా కేరళ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్‌కు కాకుండా 2007 నాటి ఒరిజినల్ అఫిడవిట్‌కే కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. ఏ వయసు మహిళలైనా ఆలయంలోకి ప్రవేశించకుండా అనుమతి నిరాకరించబోమని తెలిపారు’’ అని న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే ట్రావెన్కోర్ దేశస్థాన బోర్డు తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలను సైతం ధర్మాసనం రికార్డు చేసుకుంది. బోర్డు తన వాదనలను వినిపిస్తూ ప్రభుత్వం తమ ఇష్టానుసారం వైఖరి మార్చుకోవడం తగదని పేర్కొంది. కాగా, వాదనలు విన్న న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరే చివరిది కాదని, లింగ సమానత్వానికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలతో పాటు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసింది. -
మహిళల అనుమతిపై వివాదమెందుకు?
న్యూఢిల్లీ: ఏటా సుమారు 10 కోట్ల మంది సందర్శిస్తున్న కేరళలోని అయ్యప్ప ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. శబరిమలలో 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం 18 ఎత్తై కొండల మధ్య ఉంది. సముద్రమట్టానికి 4,133 అడుగుల ఎత్తులో నిర్మితమైంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే సరైన రవాణా మార్గం లేదు. దాదాపు 50 కి.మీ. కాలినడక సాగించి అయ్యప్ప దర్శనం చేసుకోవాలి. ఏటా కార్తీక మాసంలో 40 రోజుల కఠోర దీక్షను అనుసరించి భక్తులు శబరిమలకు వెళ్తారు. అయితే ఆలయ నిబంధనల ప్రకారం 10-50 ఏళ్ల మధ్య ఉన్న (రుతుచక్రంలో ఉండే) మహిళలకు ఈ గుడిలోకి ప్రవేశం లేదు. దీనికి 1991లో కేరళ హైకోర్టు కూడా చట్టబద్ధత కల్పిస్తూ ఆయా మహిళల అనుమతిపై నిషేధం విధించింది. తర్వాత కేరళ ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించింది. అయితే వయోభేదం లేకుండా మహిళలందరినీ ఆలయంలోకి అనుమతించాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది సుప్రీంకోర్టుకు చేరింది. మహిళలందరికీ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం కల్పించి, పూజలు చేసే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేరళ ప్రభుత్వం కూడా తన వాదనపై వెనక్కి తగ్గి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుకూలమేనని తెలిపింది. -
మహిళల్ని ఆహ్వానిద్దాం...
-
శబరిమల: కేరళ చరిత్రాత్మక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రముఖమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం విషయంలో కేరళ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వయస్సుతోనిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సోమవారం వెల్లడించింది. రుతుక్రమానికి లోనయ్యే 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం స్త్రీల పట్ల వివక్ష చూపడమేనంటూ దాఖలైన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. గత విచారణ సందర్భంగా ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘దేవుణ్ణి పూజించడానికి ఫలానా భక్తులు మాత్రమే అర్హులని ఎక్కడైనా ఉంటుందా? అసలు దేవునికి భక్తుల విషయంలో తేడాలు ఉంటాయా? చిన్నాపెద్దా, కులం, మతంతోపాటు లింగబేధం కూడా ఉంటాయా?’ అని ప్రశ్నించింది. ‘ఏ విధానం ఆధారంగా ఆలయాలకు వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు? దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ, పురుష వివక్ష ఏమిట’ని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహిళల ఆలయ ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టుకు తన తాజా నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం తెలిపింది. కేరళ నిర్ణయాన్ని నమోదుచేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. కాగా, అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులకు చెందిన మహిళలను ప్రవేశం కల్పించాల్న కేరళ నిర్ణయంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
శబరిమలలో మహిళలపై నిషేధం రాజ్యాంగ విరుద్ధం
-
16న తెరుచుకోనున్నశబరిమల ఆలయం
కేరళ: శబరిమల ఆలయం నవంబర్ 16 తేదిన తెరుచుకోనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. మండల పూజను 41 రోజులపాటు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 27 తేదిన ఆలయం మూతపడుతుంది. మకర జ్యోతి కోసం తిరిగి డిసెంబర్ 30 తేదిన ఆలయం తెరుచుకుంటుంది అని నిర్వహకులు తెలిపారు. అయ్యప్పమాల ధరించడంలో కొత్త నిబంధనల్ని రూపొందించారు. పదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా ఫోటో ఐడీ కార్డులు ధరించాలని తెలిపారు. యాభై ఏళ్లకు పైబడిన మహిళలు వయసు ధృవీకరణ పత్రం సమర్పించాలని నిర్వహకులు తెలిపారు.