
శబరిమల: మద్యం, తుపాకీతో శబరిమల అయ్యప్ప దేవాలయానికి వెళ్తూ ఆరుగురు తెలంగాణవాసులు పోలీసులకు పట్టుబట్టారు. కేరళలోని పంపా టోల్ గేట్ వద్ద జరిపిన సాధారణ తనిఖీల్లో వారి వాహనంలో 4 బాటిళ్ల మద్యం, ఓ తుపాకీని గుర్తించిన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకొని కేరళ ఆబ్కారీ, పోలీస్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా ఆ ఆరుగురు శబరిమల వచ్చారని, వారి వద్ద తుపాకీ లైసెన్స్ ఉన్నా ఇలాంటి యాత్రా ప్రదేశాల్లో ఆయుధాలు నిషేధమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment