
అంజలి(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: తాగుడుకు బానిసైన భర్తను భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా దరూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అంజలికి 2014లో పెళ్లి జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని శ్రీరాంనగర్‌లో నివసిస్తూ కాల్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆమె భర్త నరేంద్ర రోడ్ నెం. 12లోని టీఎక్స్ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తుండేవాడు.
ఇటీవల ఉద్యోగం కూడా చేయకుండా మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటూ భార్య సంపాదనతోనే మద్యం తాగుతున్నాడు. ఈ విషయంలో ఆమె ఎన్నిసార్లు మందలించినా వినిపించుకోకపోగా సెల్‌ఫోన్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతుండటమే కాకుండా అబద్దాలు కూడా చెప్తుండేవాడు. దీంతో విసిగిపోయిన అంజలి గురువారం తెల్లవారుజామున తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: చిన్నారులపై దూసుకెళ్లిన వాహనం
Comments
Please login to add a commentAdd a comment