![Woman Commits Suicide Due To Husband Not Eating Food At Home - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/10/rice.jpg.webp?itok=ALydJlFq)
సాక్షి, బంజారాహిల్స్: మూడు రోజులుగా తాను చేసిన వంటలు తినకుండా బయట తినడమే కాకుండా ఇదేమిటని అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం.11లోని గౌరీశంకర్ కాలనీలో నివసించే కె.సంగీత (23) వివాహం 2019లో కె.సంజీవతో జరిగింది.
డ్రైవర్‌గా పనిచేస్తున్న సంజీవ గత మూడు రోజుల నుంచి ఇంట్లో తినకపోవడంతో సంగీత ప్రశ్నించింది. ప్రతిరోజూ వంట చేస్తున్నానని, తినకపోవడంతో అవి పాడైపోతున్నాయని వెల్లడించింది. దీనికి తోడు ఆమెకు కొంత కాలంగా అనారోగ్యం కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి సంజయ్ రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అరుదైన పాము ‘కామన్‌కుక్రి’ పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment