ఫైల్ ఫోటో
కేరళ: శబరిమల ఆలయం నవంబర్ 16 తేదిన తెరుచుకోనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. మండల పూజను 41 రోజులపాటు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 27 తేదిన ఆలయం మూతపడుతుంది. మకర జ్యోతి కోసం తిరిగి డిసెంబర్ 30 తేదిన ఆలయం తెరుచుకుంటుంది అని నిర్వహకులు తెలిపారు.
అయ్యప్పమాల ధరించడంలో కొత్త నిబంధనల్ని రూపొందించారు. పదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా ఫోటో ఐడీ కార్డులు ధరించాలని తెలిపారు. యాభై ఏళ్లకు పైబడిన మహిళలు వయసు ధృవీకరణ పత్రం సమర్పించాలని నిర్వహకులు తెలిపారు.