New dress code
-
హిజాబ్ చట్టానికి బ్రేక్
ఇరాన్లో అత్యంత వివాదాస్పదమైన ‘హిజాబ్–పవిత్రత చట్టం’అమలుకు దేశ జాతీయ భద్రతా మండలి బ్రేకులు వేసింది. ఇరాన్ తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం అస్పష్టంగా ఉందని, దాన్ని సంస్కరించాల్సిన అవసరముందని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. హిజాబ్ ధరించని మహిళలకు జరిమానాలతో పాటు 15 ఏళ్ల దాకా జైలు శిక్షకు చట్టం ప్రతిపాదించింది. పలు కఠినమైన శిక్షలు సూచించింది. హిజాబ్ విషయమై ఇరాన్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పెజెష్కియాన్ గతంలోనూ అసహ నం వ్యక్తం చేశారు. ‘‘హిజాబ్‌ను బలవంతంగా తొలగించలేకపోయాం. దాన్ని ధరించాల్సిందేనంటూ మహిళల హక్కులను కాలరాసే అధికారం మాకు లేదు’’అని ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పదేపదే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల హామీని అమలు చేశారని భావిస్తున్నారు. మహిళా, కుటుంబ వ్యవహారాల మాజీ ఉపాధ్యక్షుడు మసౌమే ఎబ్టేకర్ కూడా ఈ చట్టాన్ని విమర్శించారు. ఈ చట్టాన్ని అమలు చేయడమంటే ఇరాన్లో సగం మందిపై అభియోగం మోపడమేనన్నారు. నిత్య వివాదం: హిజాబ్ వివాదం ఈనాటిది కాదు. మహిళలపై అణచివేతకు చిహ్నంగా ఉన్న హిజాబ్‌ను కొత్త తరం ధిక్కరిస్తూనే ఉంది. హిజాబ్ ధరించలేదని, వస్త్రధారణ అనుచితంగా ఉందని 2022లో మహసా అమీనీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళను ఇరాన్ నైతిక పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో కోమాలోకి వెళ్లిన ఆమె తర్వాత ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. ఆమె డాక్టర్ కావాలని కలలు కన్నారు. యూనివర్సిటీకి వెళ్లే ముందు వారం పాటు తల్లిదండ్రులతో ఉందామని వచ్చి ప్రాణాలొదిలారు. అమీనీ మరణంపై ఇరాన్‌వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. మహిళలే గాక పురుషులు కూడా వాటిలో పాల్గొన్నారు. పోలీసుల చిత్రహింసలే ఆమెను పొట్టన పెట్టుకున్నాయంటూ దుయ్యబట్టారు. బలూచ్, అజెరిస్, అరబ్బులు కూడా కుర్దులతో కలిసి రోడ్డెక్కారు. సున్నీలు, షియాలని తేడా లేకుండా నిరసనల్లో పాల్గొన్నారు. వేలాది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని ధిక్కరించిన, నిరసనల్లో పాల్గొన్న వారిలో 500 మంది మరణించారు. 120 మంది కంటి చూపు కోల్పోయారు. ఏడాదికి అలజడి తగ్గుముఖం పట్టాక దుస్తుల కోడ్ ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం కఠిన శిక్షలు ప్రకటించింది. గాయని అరెస్టుతో: హిజాబ్ ధరించకుండా పాట పాడి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీ (27)ని అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. భుజాలు కనిపించేలా స్లీవ్‌లెస్ డ్రెస్‌లో నలుగురు పురుష కళాకారుల మధ్య పాడిన ఆ వీడియో అందరినీ ఆకర్షించింది. ఆమెతో పాటు అందులో ఉన్నవారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. 300 మందికి పైగా ఇరాన్ హక్కుల కార్యకర్తలు, రచయితలు, జర్నలిస్టులు కొత్త హిజాబ్ చట్టాన్ని బహిరంగంగా ఖండించారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో అహ్మదీని మర్నాడే విడుదల చేశారు. నిరసనలు పెరిగి రెండేళ్ల నాటి పరిస్థితి పునరావృతమయ్యేలా ఉండటంతో హిజాబ్ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జొమాటో మహిళా డెలివరీ ఏజెంట్ల కొత్త డ్రెస్ చూశారా? వీడియో వైరల్
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అంతర్జాతీయమ హిళా దినోత్సవం సందర్భంగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. తన మహిళా డెలివరీ సిబ్బంది కోసం కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. ఇకపై తమ ఫుడ్ డెలివరీ మహిళా డ్రైవర్లు కుర్తాలు ధరిస్తారని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. చాలామంది మహిళా డెలివరీ ఉద్యోగులు జొమాటో టీ-షర్టులతో అసౌకర్యంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జొమాటో తెలిపింది. వారు కొత్త డ్రెస్ కుర్తాలు వేసుకున్నవీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ కొత్త డ్రెస్‌కోడ్‌ను చాలా బావున్నాయంటూ చాలామంది ప్రశంసించారు. మరికొంతమంది మాత్రం వారి అన్యాయ మైన వేతనాలు, పని పరిస్థితుల గురించి పట్టించుకోండి అంటూ సలహా ఇచ్చారు. ఉద్యోగుల సౌకర్యాలు, వేతనాలు, పని వాతావరణం గురించి ఆలోచించాలని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. View this post on Instagram A post shared by Zomato (@zomato) -
రైల్వే టీటీఈలకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: 137 ఏళ్లుగా రైల్లో తెల్ల డ్రెస్సుపై నల్ల కోటు ధరించి దగ్గరికొచ్చి టికెట్ చెక్ చేసే రైల్వే టికెట్ కలెక్టర్ రూపం కరోనా కారణంగా మారిపోనుంది. వీరికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రైల్వే బోర్డు విడుదల చేసింది. ఇకపై వారు చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించి దూరంగా నిలబడి భూతద్దం ద్వారా టికెట్లను పరిశీలించనున్నారు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 100 జంట రైళ్లలో వీరు ఈ విధంగా కనిపించే అవకాశం ఉంది. కరోనా ముప్పును తగ్గించేందుకు టై, కోటును ధరించకుండా విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అయితే పేరు కలిగిన ప్లేట్ మాత్రం ధరిస్తారని చెప్పింది. విధుల్లోకి వెళ్లే ముందు వీరికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఒకవేళ ఉద్యోగులకు శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉంటే ముందే చెప్పాల్సిందిగా కోరింది. వారికి తగిన మాస్కులు, ముఖానికి అడ్డు పెట్టుకునే కవచాలు, గ్లౌజులు, తలకు ధరించే కవర్లు, శానిటైజర్లు, సోపులు అందించనున్నట్లు చెప్పింది. టికెట్లను పరిశీలించేందుకు భూతద్దం ఇవ్వనున్నట్లు చెప్పింది. టికెట్లను తాకకుండా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సీనియర్ టికెట్ కలెక్టర్ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అవి రెగ్యులర్ రైళ్లు కాదు వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేరవేయడానికి ప్రవేశపెట్టిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లువెత్తుతున్న విమర్శలపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. అవి రెగ్యులర్ రైళ్లు కాదని, వలస కూలీల అవసరాన్ని బట్టి వాటి గమ్యస్థానాన్ని పొడిగించడం లేదా కుదించడం.. దారి మళ్లించడం వంటివి చేస్తున్నామని, అందువల్లే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 3,840 ప్రత్యేక రైళ్లు నడిపామని, వీటిలో 52 లక్షల మంది ప్రయాణించారని రైల్వేబోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు శ్రామిక్ రైళ్లలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. మే 27న ఈ రైళ్లలో మరణించిన తొమ్మిది మందికి అంతకు ముందే ఆరోగ్య సమస్యలున్నట్టు తేలిందని వెల్లడించింది. ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్లు 139, 138కు ఫోన్ చేయాలని కోరింది. -
తెల్లరంగు దుస్తులు ధరించండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేసుల విచారణకు హాజరయ్యే లాయర్లు కోట్లు, నల్లరంగు పొడవైన గౌన్లు వేసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు లాయర్లందరూ ఈ సూచనని పాటించాలని బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. లాయర్లు వేసుకొనే పొడవైన గౌన్ల ద్వారా వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ఈ గౌన్లు ధరించడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ‘వైద్యల సూచనలు, సలహాల మేరకు, కరోనాను కట్టడి చేయడానికి లాయర్లు, తెల్ల రంగు షర్టు, తెల్ల సల్వార్ కమీజ్, తెల్ల చీర, మెడచుట్టూ తెల్ల రంగు బ్యాండ్ ధరించాలి’ అని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వర్చువల్ సిస్టమ్ ద్వారా జరిగే విచారణకు హాజరయ్యే లాయర్లు తెల్ల రంగు దుస్తుల్లోనే రావాలని పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు అందే వరకు కొత్త డ్రెస్ కోడ్‌ని అనుసరించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సంజీవ్ ఎస్ కల్గోవాంకర్ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
మహిళా కండక్టర్ల ఆప్రాన్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: త్వరలో బస్సుల్లోని మహిళా కండక్టర్లు చెర్రీ రెడ్ కలర్ ఆప్రాన్ ధరించనున్నారు. మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫామ్ రంగు ఎంపిక చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ప్రస్తుతానికి ఈ నమూనా ను ఎంపిక చేశారు. ఒక్కో మహిళా కండక్టర్‌కు ఇలాంటివి రెండు ఆప్రాన్లు, లేసుల్లేని షూ జత ఇస్తారు. మహిళా అధికారి సుధ ఆధ్వర్యంలో కొందరు మహిళా కండక్టర్లతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ రంగును ఎంపిక చేసి ఎండీకి నివేదిక అందజేసింది. మరోవైపు చెర్రీ ఎరుపు రంగు వస్త్రం కోసం రేమండ్స్ షోరూమ్‌లను అధికారులు సంప్రదించారు. ఆప్రాన్ కోసం 8 వేల మీటర్ల వస్త్రం కావాల్సి ఉంది. చెర్రీ ఎరుపు అందుబాటులో లేని పక్షంలో దాన్ని మార్చే అవకాశం ఉంది. దాని బదులు ప్రత్యామ్నాయంగా నీలి రంగును ఎంపిక చేయాలని భావిస్తున్నారు. -
త్వరలో ఆర్ఎస్ఎస్ సంచలన నిర్ణయం!?
సిద్ధాంతాలు, భావజాలం పరిచయం లేనివారికి సైతం ఆర్ఎస్ఎస్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఖాకీనిక్కరు ధరించే కరసేవకులు! తెల్లచొక్కా, ఖాకీ నిక్కర్, లెదర్ బూట్లు, కాన్వాస్ బెల్టు, నల్లటోపీ, చేతిలో కర్ర.. దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా కొనసాగుతున్నఆ డ్రెస్ కోడ్ లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే మార్చిలో జరగనున్న ప్రతినిధి సభ (ఆర్ఎస్ఎస్ అత్యున్నత స్థాయీ సంఘం) లోనే డ్రస్ కోడ్ మార్పునకు సంబంధించిన నిర్ణయం ఖరారు కానుంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ శాఖల్లోకి యువకులు పెద్ద ఎత్తున చేరుతున్న క్రమంలో వారిని మరింతగా ఆకట్టుకునేలా నిక్కర్ స్థానంలో ట్రౌజర్ ప్రవేశపెట్లాలని ఆ సంస్థ భావిస్తోంది. 'కరసేవకుల డ్రస్ కోడ్ మార్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే మార్చిలో నాగౌర్ (రాజస్థాన్)లో జరగనున్న ప్రతినిధి సభలో దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది' అని ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగం బాధ్యుడు మోహన్ వైద్య తెలిపారు. మార్పులకు అంగీకారం లభిస్తే ఈ ఏడాది విజయదశమి నుంచే కొత్త డ్రెస్ కోడ్ అమలులోకి తెస్తామని వైద్య పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంస్థ సీనియర్ నాయకులు ఇప్పటికే మూడు డిజైన్లకు ఓకే చెప్పారు. తెలుపు చొక్కాకు కాంబినేషన్ గా బ్లూ, గ్రే లేదా బ్రౌన్ కలర్ ట్రౌజర్ ను కొత్త డ్రెస్ కోడ్ గా ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఫ్యాషన్ డిజైనర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. సంస్థాగతమైన మార్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించే ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్ మారిస్తే అది సంచలనాత్మకమే అవుతుంది. ఎందుకంటే గడిచిన 91 ఏళ్లలో కేవలం మూడుసార్లు మాత్రమే డ్రెస్ కోడ్ లో మార్పులు చేసిందా సంస్థ. ఆవిర్భవించిన 14 ఏళ్ల తర్వాత.. అంటే, 1939లో ఖాకీ చొక్కా స్థానంలో తెలుపు రంగు చొక్కాలను ప్రవేశపెట్టింది. మళ్లీ 1973లోగానీ సేవకులు ధరించే బూట్ల విషయం కొన్ని సడలింపులకు ఓకే చెప్పింది. 2010లో జైన మత గురువు తరుణ్ సాగర్ సూచన మేరకు లెదర్ బెల్ట్ స్థానంలో కాన్వాస్ బెల్టులు ధరించాలనే నిర్ణయమే డ్రెస్ కోడ్ విషయంలో ఆర్ఎస్ఎస్ చివరి మార్పు. అప్పటి నుంచి పలు అభ్యర్థనలు వచ్చినప్పటికీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. -
16న తెరుచుకోనున్నశబరిమల ఆలయం
కేరళ: శబరిమల ఆలయం నవంబర్ 16 తేదిన తెరుచుకోనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. మండల పూజను 41 రోజులపాటు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 27 తేదిన ఆలయం మూతపడుతుంది. మకర జ్యోతి కోసం తిరిగి డిసెంబర్ 30 తేదిన ఆలయం తెరుచుకుంటుంది అని నిర్వహకులు తెలిపారు. అయ్యప్పమాల ధరించడంలో కొత్త నిబంధనల్ని రూపొందించారు. పదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా ఫోటో ఐడీ కార్డులు ధరించాలని తెలిపారు. యాభై ఏళ్లకు పైబడిన మహిళలు వయసు ధృవీకరణ పత్రం సమర్పించాలని నిర్వహకులు తెలిపారు.