జొమాటో మహిళా డెలివరీ ఏజెంట్ల కొత్త డ్రెస్‌ చూశారా? వీడియో వైరల్‌ | Zomato Female Delivery Partners Get Kurta Couture On The Occasion Of International Womens Day, Video Goes Viral - Sakshi
Sakshi News home page

జొమాటో మహిళా డెలివరీ ఏజెంట్ల కొత్త డ్రెస్‌ చూశారా? వీడియో వైరల్‌

Published Sat, Mar 9 2024 4:06 PM | Last Updated on Sat, Mar 9 2024 4:27 PM

Zomato female delivery partners get kurta couture goes viral - Sakshi

మహిళా డెలివరీ ఏజెంట్ల కోసం   జొమాటో  కీలక నిర్ణయం

కొత్త డ్రెస్‌, వీడియో వైరల్‌ 

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో అంతర్జాతీయమ హిళా దినోత్సవం సందర్భంగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. తన మహిళా డెలివరీ సిబ్బంది కోసం కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది.  ఇకపై తమ ఫుడ్ డెలివరీ మహిళా డ్రైవర్లు  కుర్తాలు ధరిస్తారని  ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది.

చాలామంది మహిళా డెలివరీ ఉద్యోగులు జొమాటో టీ-షర్టులతో అసౌకర్యంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు  జొమాటో తెలిపింది. వారు కొత్త డ్రెస్‌ కుర్తాలు  వేసుకున్నవీడియోను  షేర్‌ చేసింది.   ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. 

ఈ కొత్త డ్రెస్‌కోడ్‌ను చాలా బావున్నాయంటూ చాలామంది ప్రశంసించారు. మరికొంతమంది మాత్రం వారి అన్యాయ మైన వేతనాలు, పని పరిస్థితుల గురించి పట్టించుకోండి అంటూ సలహా ఇచ్చారు. ఉద్యోగుల  సౌకర్యాలు, వేతనాలు,  పని వాతావరణం గురించి ఆలోచించాలని  పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement