న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లోక్‌సభ సెక్రెటేరియట్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంట్ హౌజ్ పోర్టల్ లేదా పార్లమెంట్ యాప్‌ల పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను ఎంపీలు ఇతరులతో షేర్ చేసుకోవడాన్ని నిషేధించింది. పార్లమెంట్ సభ్యులు మాత్రమే డిజిటల్ సంసద్ పోర్టల్ లేదా యాప్‌లను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
ఎంపీలు ఇకపై తమ అధికారిక ఈ–మెయిల్ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులకు కూడా షేర్ చేయడం నిషిద్ధమని స్పష్టం చేసింది. సభలో ప్రశ్నలు అడగడం కోసం ముందుగానే నోటీసులు ఇవ్వడానికి, ట్రావెల్ బిల్లులు సమర్పించడానికి పార్లమెంట్ పోర్టల్, యాప్‌లను ఎంపీలు ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించవచ్చు. ఈమెయిల్, ఫోన్ నంబర్‌తో పోర్టల్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన అధికారిక ఈమెయిల్ పాస్‌వర్డ్‌ను దుబాయి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచి్చనట్లు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ గుర్తించింది.
ఆమె నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారించింది. డిజిటల్ సంసద్ పోర్టల్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచి్చంది. ఈ పోర్టల్‌కు ఎలా ఉపయోగించాలో చాలామందిఎంపీలకు తెలియదు. అందుకే వారు తమ వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులపై ఆధారపడుతున్నారు. ఈమెయిల్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు వారికి అందజేస్తున్నారు. దీనివల్ల పోర్టల్ అనధికార వ్యక్తుల చేతుల్లో పడి దురి్వనియోగం అవుతున్నట్లు మహువా మొయిత్రా కేసు నిరూపించింది. ఈ నేపథ్యంలో పోర్టల్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఇతరులకు ఇవ్వడాన్ని నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment