sharings
-
ఎంపీలకే డిజిటల్ యాక్సెస్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లోక్‌సభ సెక్రెటేరియట్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంట్ హౌజ్ పోర్టల్ లేదా పార్లమెంట్ యాప్‌ల పాస్వర్డ్లు, ఓటీపీలను ఎంపీలు ఇతరులతో షేర్ చేసుకోవడాన్ని నిషేధించింది. పార్లమెంట్ సభ్యులు మాత్రమే డిజిటల్ సంసద్ పోర్టల్ లేదా యాప్‌లను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఎంపీలు ఇకపై తమ అధికారిక ఈ–మెయిల్ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులకు కూడా షేర్ చేయడం నిషిద్ధమని స్పష్టం చేసింది. సభలో ప్రశ్నలు అడగడం కోసం ముందుగానే నోటీసులు ఇవ్వడానికి, ట్రావెల్ బిల్లులు సమర్పించడానికి పార్లమెంట్ పోర్టల్, యాప్‌లను ఎంపీలు ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించవచ్చు. ఈమెయిల్, ఫోన్ నంబర్‌తో పోర్టల్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన అధికారిక ఈమెయిల్ పాస్‌వర్డ్‌ను దుబాయి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచి్చనట్లు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారించింది. డిజిటల్ సంసద్ పోర్టల్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచి్చంది. ఈ పోర్టల్‌కు ఎలా ఉపయోగించాలో చాలామందిఎంపీలకు తెలియదు. అందుకే వారు తమ వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులపై ఆధారపడుతున్నారు. ఈమెయిల్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి అందజేస్తున్నారు. దీనివల్ల పోర్టల్ అనధికార వ్యక్తుల చేతుల్లో పడి దురి్వనియోగం అవుతున్నట్లు మహువా మొయిత్రా కేసు నిరూపించింది. ఈ నేపథ్యంలో పోర్టల్ పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులకు ఇవ్వడాన్ని నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. -
టెల్కోల మౌలిక సదుపాయాల షేరింగ్‌కు ఓకే
న్యూఢిల్లీ: టెల్కోలు ఇకపై ప్రధాన నెట్‌వర్క్‌లు సహా ఇతర మౌలిక సదుపాయాలను పరస్పరం పంచుకునేందుకు (షేరింగ్) వెసులుబాటు కలి్పస్తూ సంబంధిత నిబంధనలను టెలికం విభాగం (డాట్) సవరించింది. దీనితో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోల పెట్టుబడులు, నిర్వహణ వ్యయాల భారం గణనీయంగా తగ్గనుంది. ఇక, మొబైల్ నెట్‌వర్క్‌లకు అవసరమైన కనెక్టివిటీని కలి్పంచేందుకు శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించుకునే దిశగా వాణిజ్యపరమైన వీశాట్ లైసెన్స్ నిబంధనల్లో కూడా డాట్ సవరణలు చేసింది. ఇప్పటిదాకా టెలికం సంస్థలు.. మొబైల్ టవర్లు, నెట్‌వర్క్‌లోని కొన్ని క్రియాశీలక ఎల్రక్టానిక్ విడిభాగాలను మాత్రమే షేర్ చేసుకునేందుకు అనుమతి ఉంది. యాంటెనా, ఫీడర్ కేబుల్ వంటి వాటికి ఇది పరిమితమైంది. తాజా సవరణతో ప్రధాన నెట్‌వర్క్‌లో భాగాలను కూడా పంచుకునేందుకు వీలవుతుందని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. దేశీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచే క్రమంలో ఇది పురోగామి చర్యగా అభివరి్ణంచారు. 5జీ వేలంపై ట్రాయ్‌తో సంప్రదింపులు.. 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి డాట్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ధర, వేలం వేయతగిన స్పెక్ట్రం పరిమాణం, ఇతర విధి విధానాల గురించి తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని కోరింది. -
స్పెక్ట్రమ్ షేరింగ్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సంబంధించి సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన టెలికం కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్ పంపిణీ వివరాలను (షేరింగ్) ఇవ్వాలని శుక్రవారం నాటి విచారణ సందర్భంగా టెలికం శాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రిలయన్స్ జియో మధ్య స్పెక్ట్రమ్ పంపకం జరగ్గా.. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను వాడుకున్నందుకు, ఆ కంపెనీ స్పెక్ట్రమ్ బకాయిలను జియో ఎందుకు చెల్లించకూడదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లోగడ విచారణలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్ కామ్ తోపాటు, వీడియోకాన్ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న విషయం గమనార్హం. ‘‘వీడియోకాన్ స్పెక్ట్రమ్ బదలాయించాలంటే, దాని కంటే ముందు గత బకాయిలను కంపెనీ చెల్లించాలి’’ అంటూ వీడియోకాన్ విషయమై ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ వీడియోకాన్ చెల్లించకపోతే, ఆ స్పెక్ట్రమ్ ను సొంతం చేసుకున్న భారతీ ఎయిర్ టెల్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి వీడియోకాన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కార్పొరేట్ దివాలా చర్యల ప్రక్రియకు వెలుపల తాము ఎటువంటి బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కలిగిలేమని నివేదించారు. ఏజీఆర్ బకాయిలను ఐబీసీ కింద నిర్వహణ బకాయిలుగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను జియో వినియోగించుకున్నందున ఆ మొత్తానికి సంబంధించి జియో చెల్లించాల్సిన బకాయిల వివరాలను అడిగినా ఇవ్వలేదేమంటూ ధర్మాసనం టెలికం శాఖను ప్రశ్నించింది. అనంతరం దివాలా చర్యల పరిధిలో ఉన్న కంపెనీల స్పెక్ట్రమ్ పంపిణీకి సంబంధించి ఎంత మేర బకాయిలు రావాలన్న వివరాలను సమర్పించాలని టెలికం శాఖను ఆదేశించింది. 1999 నుంచి ఏ కంపెనీలు స్పెక్ట్రమ్ ను వినియోగించుకున్నదీ, వాటి మధ్య వాణిజ్య ఒప్పంద వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం కోరింది. ఏజీఆర్ బకాయిలను ఏటా కొంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించేందుకు అనుమతించాలని భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు ధర్మాసనాన్ని అభ్యర్థించాయి. ఈ రెండు కంపెనీలు కలసి రూ.లక్ష కోట్లకు పైగా ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. టెలికం శాఖ డిమాండ్ ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ.58,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.8,000 కోట్లను ఇప్పటి వరకు జమ చేయగలిగింది. భారతీ ఎయిర్ టెల్ రూ.43,000 కోట్ల బకాయిలకు గాను రూ.18,000 కోట్లను చెల్లించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షతన గల సుప్రీం ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. -
మనకు 29 టీఎంసీలు.. ఏపీకి 17.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు పంచింది. లభ్యత జలాల్లో తెలం గాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.50 టీఎంసీలను కేటాయించింది. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత, అవసరాలు, కేటాయింపులపై చర్చించేందుకు గురువారం హైదరాబాద్‌లోని జల సౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈ నరహరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ప్రాజెక్టుల్లో లభ్యత జలాలపై చర్చించారు. శ్రీశైలంలో ప్రస్తుతం కనీస నీటిమట్టం 834 అడుగులకు దిగువన 827.40 అడుగుల్లో 46.98 టీఎంసీల నీరు ఉందని, ఇందులో 800 అడుగుల దిగువ వరకు నీటిని తీసుకునేపక్షంలో 18 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కగట్టారు. ఇక సాగర్‌లో ప్రస్తుతం 524.2 అడుగుల మట్టంలో 157 టీఎంసీల నీరుండగా కనీస నీటిమట్టం 510 అడుగులకు దిగువన 505 అడుగుల వరకు కనిష్టంగా 33.71 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని తేల్చారు. మొత్తంగా 51.71 టీఎంసీలు ఉండగా వాటిని పంచాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి ఇరు రాష్ట్రాలు సమ్మతి తెలపడంతో తెలంగాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.50 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులకు వీలైనంత ఎక్కువ కాల్వ నిర్వహించేలా చూడాలని సూచించింది. ఇక ఏపీ అవసరాల కోసం ఎడమ కాల్వ కింద చేసిన కేటాయింపులను కేవలం తెలంగాణలోని పాలేరు రిజర్వాయర్ కింద అవసరాలకు విడుదల చేసిన సమయంలోనే వాడుకోవాలని తెలిపింది. ఇరు రాష్ట్రాలకు నీరు ఇలా... తెలంగాణకు కేటాయించిన నీటిలో ఆగస్టు వరకు కల్వకుర్తి కింద మిషన్ భగీరథ అవసరాలకు 3.50 టీఎంసీలను బోర్డు కేటాయించింది. అలాగే సాగర్ కింద ఆగస్టు వరకు మిషన్ భగీరథకు 5 టీఎంసీలు, హైదరాబాద్ తాగనీటికి 8.50 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) కింద చెరువులు నింపేందుకు 3 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద రబీ పంటలకు 9 టీఎంసీలను కేటాయించింది. ఇక ఏపీకి శ్రీశైలం నుంచి హంద్రీనీవాకు 3 టీఎంసీలు, సాగర్ నుంచి కుడి కాల్వకు 8 టీఎంసీలు, ఎడమ కాల్వకు 3 టీఎంసీలు, కేడీఎస్‌కు 3.50 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. -
ఐవైఆర్ పోస్టింగ్‌లు... షేరింగ్‌లు
జగన్నాథ రథచక్రం పేరుతో మే 12న ఫేస్బుక్లో అకౌంట్ పబ్లిష్ అయిన దాన్ని ఐవైఆర్ కృష్ణారావు షేర్ చేశారు. అందులో ఏముందంటే... ‘‘కమలనాథులందు కమ్మనాథులు వేరయా విశ్వదాభిరామ వినుర వేమా!!! జగన్‌ను ఎలా కలుస్తాడు అని టీడీపీ వాళ్లు పరోక్షంగా ప్రధాని మోదీని తిడుతుంటే ఎక్కడున్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభపాటి హరిబాబు చౌదరి, బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి, వెంకయ్యనాయుడు? పాచిపోయిన లడ్డూలు ఇస్తావా అని వెంకయ్యనాయుడిని అంటే రాష్ట్ర బీజేపీ అంతా పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడింది. మరి వెంకయ్య పాటి విలువ లేదా మోదీకి? అందుకే అంటారు బీజేపీ అంటే ‘బాబు జేబు పార్టీ’గా మార్చేశాడు వెంకయ్య నాయుడు అని’’ తెలుగు సినిమాల విషయంలో ప్రభుత్వ తీరుపై కృష్ణారావు ఫేస్బుక్లో ఏప్రిల్ 30న సొంతంగా ఒక పోస్ట్ పెట్టారు. ఇంగ్లీషులో ఉన్న ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే... కొన్ని నెలల క్రితం విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి, ఇప్పుడు విడుదలైన బాహుబలి–2 సినిమాలు కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కొన్ని ఎంపిక చేసిన చిత్రాలపై ప్రభుత్వాలు ఏ విధంగా పక్షపాతం చూపిస్తున్నాయో తెలుస్తోంది. ఏ కారణాలతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఆ చిత్రంలో చూపించింది వాస్తవమేనా? అంటే కాదు. మరి ఏ లెక్కన పన్ను మినహాయింపు ఇచ్చారు. చరిత్రక వాస్తవాలను వక్రీకరించి చూపించిన వారిని వాస్తవంగా శిక్షించాలి. కాని దీనికి భిన్నంగా ప్రభుత్వం వారికి రివార్డులను ఇచ్చింది. దీనిపై కోర్టులో కేసు కూడా నమోదయ్యింది. ఇప్పుడు బాహుబలి–2 వంతు. టికెట్ల ధరలను పెంచు కోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని ఆ నిర్మాతకు ముందే తెలుసా? ఇది అందరికీ వర్తింపజేస్తే రిస్క్ చేసి మరీ భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకొస్తారు. అలా కాకుండా ఈ ధరల పెంపు కేవలం కొందరికే పరిమితం చేస్తే సినిమాటోగ్రఫీ చట్టాన్ని పరిహాసం చేయడటమే.