న్యూఢిల్లీ: టెల్కోలు ఇకపై ప్రధాన నెట్‌వర్క్‌లు సహా ఇతర మౌలిక సదుపాయాలను పరస్పరం పంచుకునేందుకు (షేరింగ్) వెసులుబాటు కలి్పస్తూ సంబంధిత నిబంధనలను టెలికం విభాగం (డాట్) సవరించింది. దీనితో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోల పెట్టుబడులు, నిర్వహణ వ్యయాల భారం గణనీయంగా తగ్గనుంది. ఇక, మొబైల్ నెట్‌వర్క్‌లకు అవసరమైన కనెక్టివిటీని కలి్పంచేందుకు శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించుకునే దిశగా వాణిజ్యపరమైన వీశాట్ లైసెన్స్ నిబంధనల్లో కూడా డాట్ సవరణలు చేసింది.
ఇప్పటిదాకా టెలికం సంస్థలు.. మొబైల్ టవర్లు, నెట్‌వర్క్‌లోని కొన్ని క్రియాశీలక ఎల్రక్టానిక్ విడిభాగాలను మాత్రమే షేర్ చేసుకునేందుకు అనుమతి ఉంది. యాంటెనా, ఫీడర్ కేబుల్ వంటి వాటికి ఇది పరిమితమైంది. తాజా సవరణతో ప్రధాన నెట్‌వర్క్‌లో భాగాలను కూడా పంచుకునేందుకు వీలవుతుందని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచర్ తెలిపారు. దేశీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచే క్రమంలో ఇది పురోగామి చర్యగా అభివరి్ణంచారు.
5జీ వేలంపై ట్రాయ్‌తో సంప్రదింపులు..
5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి డాట్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ధర, వేలం వేయతగిన స్పెక్ట్రం పరిమాణం, ఇతర విధి విధానాల గురించి తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment