telcos
-
ఏప్రిల్ 1 నుంచి సిమ్ కార్డ్ కొనుగోలు నిబంధనల్లో మార్పులు
సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు భారతదేశం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సిమ్ కార్డుల అమ్మకాలపై కఠిన నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. ఏప్రిల్ 1, 2025 నుంచి సిమ్ కార్డుల భద్రతను పెంచుతూ, వాటి దుర్వినియోగాన్ని కట్టడి చేసి మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడం లక్ష్యంగా కొత్త నిబంధనలు అమల్లోకి తేనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను టెలికాం ఆపరేటర్లకు అందించింది.సిమ్ కార్డు అమ్మకందారులకు కఠిన నిబంధనలుభారత ప్రభుత్వం అన్ని టెలికాం ఆపరేటర్లకు సిమ్ కార్డులు విక్రయించే వ్యక్తుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించింది. టెలికాం ఆపరేటర్ల సిమ్ కార్డు అమ్మకందారులు మార్చి 31, 2025 లోగా రిజిస్టర్ అయ్యేలా చర్యలు చేపట్టాలి. ఈ నిబంధనను పాటించడంలో విఫలమైతే ఏప్రిల్ 1, 2025 నుంచి సిమ్ కార్డుల అమ్మకాలపై నిషేధం వర్తిస్తుంది.కీలక మార్పులుసిమ్ కార్డు అమ్మకందారుల రిజిస్ట్రేషన్: రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ వంటి ప్రధాన సంస్థలతో సహా అన్ని టెలికాం ఆపరేటర్లు తమ ఏజెంట్లు, ఫ్రాంచైజీలు, సిమ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇది సిమ్ జారీ ప్రక్రియలో పారదర్శకతను, భద్రతను పెంచుతుందని ప్రభుతం భావిస్తుంది.గడువు: రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి టెలికాం ఆపరేటర్లకు తగినంత సమయం ఇస్తూ ప్రభుత్వం గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించింది. అయితే ఈ ప్రక్రియలో విఫలమైతే ఏ ఆపరేటర్ అయినా ఏప్రిల్ 1, 2025 నుంచి సిమ్ కార్డులను విక్రయించకుండా నిషేధానికి గురవుతారు.సిమ్ కార్డుల పరిమితి: కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ పేరుతో అనుమతించిన తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ రిజిస్టర్ చేసిన సిమ్‌లు ఉంటే దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.ఇదీ చదవండి: పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..మార్పులకు కారణం..సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండటంతో సిమ్ కార్డుల అమ్మకాలపై నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నమోదు కాని సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు మోసపూరిత కార్యకలాపాలను అమలు చేయడానికి ఉపయోగిస్తారు. ఇటువంటి సంఘటనలను గుర్తించడం, వాటిని దర్యాప్తు చేయడం సవాలుగా మారుతుంది. సిమ్ కార్డ్ అమ్మకందారులందరూ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మరింత సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడం సాధ్యం అవుతుంది. -
బిజినెస్ మెసేజ్..టెల్కోలకు భలే ఛాన్స్!
మీకు అతి తక్కువ వడ్డీ రేటుకే ప్రీ–అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్. ఇప్పుడే దరఖాస్తు చేయండి.. మా ప్రోడక్టులపై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. వెంటనే షాపింగ్ చేసి, పండుగ చేస్కోండి.. గేమ్ స్టార్ట్ చేసేందుకు రూ. 3,000 స్పెషల్ క్యాష్‌బ్యాక్ కూపన్ రెడీగా ఉంది. యాప్ డౌన్లోడ్ చేసి, ఆటాడుకోండి.. ఫోన్లో.. వాట్సాప్‌లో ఈ మధ్య పోలోమంటూ వస్తున్న ఇలాంటి మెసేజ్‌లను గమనిస్తున్నారా? కంపెనీలు తమ ప్రొడక్టులు, సర్వీసులను నేరుగా కస్టమర్ల చెంతకు తీసుకెళ్లేందుకు ఈ కొత్త మార్కెటింగ్ రూట్‌ను ఎంచుకుంటున్నాయి. మనక్కూడా వీటి వల్ల కొన్నిసార్లు ఉపయోగం ఉన్నప్పటికీ.. పదేపదే వచ్చే ఇలాంటి అనవసర మెసేజ్‌లతో ఒక్కోసారి విసుక్కోవడం కూడా కామన్‌గా మారింది. అయితే, టెలికం కంపెనీలకు మాత్రం ఇవి కాసులు కురిపిస్తున్నాయి. దీంతో ఎంటర్ప్రైజ్ లేదా బిజినెస్ మెసేజింగ్.. టెల్కోలకు సరికొత్త ఆదాయ వనరుగా నిలుస్తోంది.వినియోగదారులతో మరింత బాగా మమేకం అయ్యేందుకు కంపెనీలు ఇప్పుడు సంప్రదాయ టెక్ట్స్ మెసేజ్‌ల స్థానంలో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్సీఎస్) బాట పట్టాయి. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం దూసుకెళ్తుండటం.. వాట్సాప్ వాడుతున్న వారు కోట్లలో ఉండడంతో బిజినెస్ మెసేజింగ్ టెల్కోలను ఊరిస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్లో వొడాఫోన్ ఐడియా (వీఐ), రిలయన్స్ జియో హవా నడుస్తోంది. త్వరలోనే భారతీ ఎయిర్టెల్ కూడా బరిలోకి దూకే సన్నాహాల్లో ఉంది. దీంతో మార్కెట్ వాటాను కొల్లగొట్టేందుకు టెలికం ఆపరేటర్ల మధ్య పోటీ పెరిగి, టారిఫ్ వార్‌కు తెరతీయనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గూగుల్, వాట్సాప్ ద్వారా... ఆర్సీఎస్ బిజినెస్ మెసేజింగ్ (ఆర్బీఎం) ద్వారా తమ బ్రాండింగ్, మార్కెటింగ్ మెసేజ్‌లను పేంపేందుకు, అలాగే చాట్‌బాట్ తరహాలో కస్టమర్లతో ఇంటరాక్ట్ అయ్యేందుకు టెల్కోల విస్తృత నెట్వర్క్ వీలు కల్పిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో సాధారణ ఎస్ఎంఎస్ చాట్ స్థానంలో గూగుల్ ఈ ఆర్‌సీఎస్‌ను ప్రమోట్ చేస్తోంది. ఇక వాట్సాప్ బిజినెస్ మెసేజింగ్ సర్వీస్ దీనికి తీవ్ర పోటీ ఇస్తోంది. ఆర్సీఎస్ మార్కెటింగ్ మెసేజ్‌లను పంపడం ద్వారా కస్టమర్లకు చేరువ కావాలనుకునే కంపెనీలకు అగ్రిగేటర్లు దన్నుగా నిలుస్తున్నారు. డాట్గో, రూట్ మొబైల్, సించ్, ఇన్ఫోబిప్ వంటి కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్ (సీపాస్) ప్రొవైడర్లు ఆర్‌సీఎస్‌కు కావలసిన సాంకేతిక సహకారం, సేవలు అందిస్తున్నాయి. అంటే జియో, వీఐ నెట్వర్క్ ద్వారా కస్టమర్లకు వివిధ కంపెనీల బ్రాండ్, మార్కెటింగ్ మెసేజ్‌లను చేరవేస్తున్నాయి. బేసిక్ టెక్ట్స్ ఆర్సీఎస్ మెసేజ్‌లకు కంపెనీల నుంచి టెల్కోలు 15 పైసలు చొప్పున వసూలు చేస్తుండగా.. షాపింగ్, యాప్ డౌన్లోడ్స్, లోన్ దరఖాస్తులకు వీలు కల్పించే ఇంటరాక్టివ్ మెసేజ్‌లకు 35 పైసల దాకా చార్జీ విధిస్తున్నాయి. వీటి ప్రత్యేకతేంటి? సాధారణ టెక్ట్స్ మెసేజ్‌లతో పోలిస్తే, ఆర్‌సీఎస్‌లు చాలా భిన్నం. కస్టమర్లు తమ మెసేజ్‌లను తెరిచారా లేదా.. తెరిచిన తర్వాత ఎలా స్పందించారు వంటివన్నీ బ్రాండ్ తెలుసుకునేందుకు ఆర్‌సీఎస్‌లు వీలు కల్పిస్తాయి. ఆర్సీఎస్ల డెలివరీ రేట్ మన దేశంలో 98% ఉందని, చదివే శాతం 40% కాగా, రెస్పాన్స్ రేట్ 6% ఉన్నట్లు అంచనా. వీటిపై వెచి్చంచే వ్యయంతో పోలిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండటంతో కంపెనీలు ఆర్సీఎస్ పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఆర్బీఎం సర్వీస్‌లో వీఐ ముందంజలో ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం మేరకు నెలకు 100 కోట్ల ఆర్సీఎస్ మెసేజ్‌లను వీఐ ఆపరేట్ చేస్తోంది. ఆర్నెల్ల క్రితం ఈ సర్వీసులను ప్రారంభించిన జియో కూడా జోరు పెంచింది. ఎయిర్టెల్ రంగంలోకి దూకితే పోటీ పెరిగి చార్జీలు తగ్గే అవకాశం ఉందని డాట్గో సీఈఓ ఇందర్‌పాల్ మమిక్ పేర్కొన్నారు. ఊరిస్తున్న మార్కెట్... దేశంలో మారుమూల పల్లెల్లో కూడా స్మార్ట్ ఫోన్ వాడకం శరవేగంగా దూసుకెళ్తోంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో 66 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ యూజర్లున్నారు. ఇందులో అత్యధికంగా ఆండ్రాయిడ్ ఫోన్లే. కాగా, స్మార్ట్ ఫోన్ల జోరుతో గత రెండేళ్లుగా ఆర్సీఎస్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందిందని రూట్ మొబైల్ వైస్ ప్రెసిడెంట్ తుషార్ అగి్నహోత్రి చెప్పారు. 2023లో 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ 2028 నాటికి 3.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ లెక్కగట్టింది. ప్రస్తుతం యాపిల్ ఐఓఎస్‌లో ఆర్సీఎస్ మెసేజ్‌లకు సపోర్ట్ లేదని, అదికూడా అందుబాటులోకి వస్తే కంపెనీల మార్కెటింగ్ ఇంకా విస్తృతం అవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.3.2 బిలియన్ డాలర్లు: 2028 నాటికి భారత్‌లో బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ అంచనా. 2023లో ఇది 1.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 100 కోట్లు: ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా నెలకు ఆపరేట్ చేస్తున్న ఆర్సీఎస్ ఎస్ఎంఎస్ల సంఖ్య15 పైసలు: బేసిక్ టెక్ట్స్ ఆర్సీఎస్లకు కంపెనీల నుంచి టెల్కోలు వసూలు చేస్తున్న టారిఫ్. ఇంటరాక్టివ్ ఆర్సీఎస్ ఎస్ఎంఎస్లకు 35 పైసలు వరకు చార్జీ విధిస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ప్రభుత్వ నిర్ణయం.. వొడాఫోన్ ఐడియాకు భారీగా ఊరట
న్యూఢిల్లీ: గత స్పెక్ట్రం కొనుగోళ్లకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం వల్ల టెల్కోలపై గణనీయంగా ఆర్థిక భారం తగ్గుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ సీవోఏఐ తెలిపింది. దీనితో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి నిధుల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొంది.2022కి ముందు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంనకు సంబంధించి టెలికం సంస్థలు బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలన్న నిబంధన నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.దీనితో ప్రధానంగా వొడాఫోన్ ఐడియాకు భారీగా ఊరట లభించనుంది. వొడాఫోన్ ఐడియా రూ. 24,747 కోట్ల బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉండగా, దానికి గడువు కూడా ముగిసిపోయింది. అటు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియోకి కూడా ఊరట లభిస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లు 30 లక్షలు అప్..
న్యూఢిల్లీ: జూలైలో మొబైల్ టారిఫ్‌లను పెంచిన ప్రభావం ప్రైవేట్ రంగ టెల్కోలపై కనిపించింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు తగ్గగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు పెరిగారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన జూలై గణాంకాల ప్రకారం బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 29.4 లక్షల మేర పెరిగింది. ఎయిర్టెల్ సబ్ర్‌స్కయిబర్స్ 16.9 లక్షలు, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు 14.1 లక్షలు, రిలయన్స్ జియో యూజర్లు 7.58 లక్షల మంది తగ్గారు. దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్ నాటి 120.56 కోట్ల నుంచి జూలైలో స్వల్పంగా క్షీణించి 120.51 కోట్లకు పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర టెలికం సర్కిల్స్‌లో మొబైల్ కనెక్షన్లు తగ్గాయి. జూలై తొలి వారంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సుమారు 10–27 శాతం శ్రేణిలో టారిఫ్‌లను పెంచడం తెలిసిందే. -
టెక్నోట్రీతో హెచ్‌సీఎల్ టెక్ జత
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా ఫిన్లాండ్ సంస్థ టెక్నోట్రీ సాఫ్ట్‌వేర్‌తో చేతులు కలిపింది. తద్వారా గ్లోబల్ టెలికం కంపెనీ(టెల్కో)ల కోసం 5జీ ఆధారిత జనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయనుంది.టెలికం రంగ దిగ్గజాలకు సేవలందించే టెక్నోట్రీ సహకారంతో క్లయింట్ల అవసరాలకు అనుగుణమైన తదుపరితరం సొల్యూషన్లకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా టెల్కోలు, కమ్యూనికేషన్ సర్వీసులందించే సంస్థ(సీఎస్పీ)లకు కొత్త అవకాశాలకు వీలు కల్పించడం, ఆవిష్కరణలకు ఊతమివ్వడం, సస్టెయినబుల్ గ్రోత్‌కు దన్నునివ్వడం వంటి సేవలను అందించనున్నాయి.తాజా భాగస్వామ్యం ఏఐ ఆధారిత డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో హెచ్‌సీఎల్ టెక్కున్న పట్టు, టెక్నోట్రీకు గల 5జీ ఏఐ ఆధారిత బీఎస్ఎస్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాలు కలగలసి క్లయింట్లకు పటిష్ట సేవలందించనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ పేర్కొంది. -
సిమ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, టెల్కోలకు తప్పదు భారీ మూల్యం
న్యూఢిల్లీ: నమోదు చేసుకోని డీలర్ల ద్వారా సిమ్ కార్డులను విక్రయించి, కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని టెల్కోలను టెలికం శాఖ (డాట్) హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనికి ఉద్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయని, టెలికాం ఆపరేటర్లు సెప్టెంబర్ 30 లోపు అన్ని ‘పాయింట్ ఆఫ్ సేల్’ (PoS) నమోదు చేసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొంది. సిమ్ కార్డుల మోసపూరిత విక్రయాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు అన్ని పాయింట్ ఆఫ్ సేల్స్‌ను (పీవోఎస్) సెప్టెంబర్ 30లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పీవోఎస్‌లు తగు పత్రాలను సమర్పించి, రిజిస్టర్ చేయించుకోవాలి. -
టెల్కోల వాయిస్ కాల్స్‌కు ఓటీటీ దెబ్బ
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో టెల్కోల ఆదాయంలో వాయిస్ కాల్స్ వాటా 80 శాతం, ఎస్ఎంఎస్ల వాటా 94 శాతం పడిపోయింది. అయితే, డేటా వాటా 10 రెట్లు పెరిగింది. ఓటీటీలను నియంత్రణ పరిధిలోకి తెచ్చే క్రమంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2013 జూన్ త్రైమాసికం – 2022 డిసెంబర్ త్రైమాసికం మధ్య కాలంలో గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం.. గత దశాబ్ద కాలంలో మెసేజింగ్, వాయిస్ కమ్యూనికేషన్ కోసం ఓటీటీ యాప్‌ల వినియోగం పెరగడం వల్ల అంతర్జాతీయంగా టెల్కోలకు వాయిస్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే ఆదాయాలు .. క్రమంగా డేటా వైపునకు మళ్లాయి. దేశీయంగా చూస్తే టెల్కోలకు సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయానికి (ఏఆర్పీయూ) సంబంధించి డేటా విభాగం తప్ప మిగతా అన్నింటి వాటా తగ్గిపోయింది. 2013 జూన్ క్వార్టర్లో టెల్కోల ఆదాయంలో డేటా వాటా 8.1 శాతంగా ఉండగా 2022 డిసెంబర్ త్రైమాసికంలో 10 రెట్లు పెరిగి 85.1 శాతానికి చేరింది. మరోవైపు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడమా లేక నిర్దిష్టంగా కొన్ని కాలింగ్, మెసేజింగ్ యాప్‌లను నిలిపివేయడమా అనే చర్చనీయాంశాన్ని కూడా చర్చాపత్రంలో ట్రాయ్ స్పృశించింది. ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్స్‌ను పూర్తిగా షట్‌డౌన్ చేయడం వల్ల ఎకానమీకే కాకుండా విద్యా, వైద్యం వంటి కీలక సేవలకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అల్లర్లు రేపేందుకు ఉగ్రవాదులు లేదా విద్రోహ శక్తులు ఉపయోగించే అవకాశమున్న నిర్దిష్ట ఓటీటీ యాప్‌లు, వెబ్సైట్లను మాత్రమే నిషేధించడం శ్రేయస్కరం కావచ్చని ట్రాయ్ పేర్కొంది. -
యూసేజ్ ఫీజు సహేతుకమే
న్యూఢిల్లీ: యూసేజీ ఫీజు అంశంపై ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీస్ సంస్థలు, టెల్కోల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ఓటీటీ సంస్థలు యూసేజీ ఫీజు కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్ ’సముచితమైనది, సహేతుకమైనదే’ అని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ స్పష్టం చేశారు. ఇది ఎకానమీ వృద్ధికి దోహదపడుతూనే డిజిటల్ ఇన్ఫ్రాను మెరుగుపర్చుకునేందుకు కూడా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. టెలికం సేవల వినియోగం ద్వారా యూజర్లను పొందుతున్నందున తమకు ఆదాయంలో వాటా ఇవ్వాలంటూ టెల్కోలు కోరడాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది నెట్ న్యూట్రాలిటీ విధానానికి విరుద్ధమని ఏఐఎంఏఐ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో కొచర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూసేజీ ఫీజుల అంశాన్ని కొన్ని శక్తులు స్వలాభం కోసం పక్కదారి పట్టిస్తున్నాయని ఏఐఎంఏఐ పేరు ప్రస్తావించకుండా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొచర్ వ్యాఖ్యానించారు. లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం టెల్కోలన్నీ నెట్ న్యూట్రాలిటీకి (ఇంటర్నెట్ సేవలందించడంలో పక్షపాతం చూపకుండా తటస్థంగా ఉండటం) కట్టుబడి ఉన్నా యని ఆయన స్పష్టం చేశారు. టెలికం సంస్థలు మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రం కోసం భారీగా వెచ్చిస్తాయని, రకరకాల పన్నులు చెల్లిస్తాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని కొచర్ చెప్పారు. దానికి విరుద్ధంగా భారీ విదేశీ కంపెనీలు నిర్వహించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు టెల్కోల నెట్వర్క్ ఉచితంగా వాడుకుంటూ, యూజర్లను పెంచుకుని, ప్రకటనల ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. ఆయా ప్లాట్‌ఫాంలు ప్రస్తుతం టెలికం చట్ట పరిధిలో లేనందున ఆదాయాలపై భారత్‌లో పన్నులు కట్టే పరిస్థితి ఉండటం లేదని చెప్పారు. -
కాల్ డ్రాప్స్, నెట్వర్క్ కాల్స్ సమస్యపై టెల్కోలతో ట్రాయ్ కీలక భేటి
న్యూఢిల్లీ: టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చడం, 5జీ సర్వీసుల ప్రమాణాలను నిర్దేశించడం తదితర అంశాలకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళికపై చర్చించేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ఫిబ్రవరి 17న టెల్కోలతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా కాల్ డ్రాప్స్, వ్యాపారాలపరమైన అవాంఛిత కాల్స్, సందేశాలు మొదలైన వాటి గురించి కూడా చర్చించనుంది. ట్రాయ్ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తరచుగా సమావేశాల నిర్వహణ, చర్చా పత్రాలు, బహిరంగ చర్చలు మొదలైన మార్గాల్లో సేవల నాణ్యతను సమీక్షిస్తూ ఉంటామని, తగు చర్యలు తీసుకుంటూ ఉంటామని పేర్కొంది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సర్వీసుల నాణ్యతను మెరుగు పర్చేందుకు తీసుకోతగిన చర్యలపై డిసెంబర్ 28న టెల్కోలతో టెలికం శాఖ సమావేశమైంది. 2022 నవంబర్ డేటా ప్రకారం 114 కోట్ల మొబైల్ సబ్‌స్క్రయిబర్స్‌తో భారత్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉంది. ఇప్పటివరకూ 200 పైచిలుకు నగరాల్లో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. -
టెలికం సేవల నాణ్యతపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో టెల్కోలతో కేంద్ర టెలికం శాఖ బుధవారం భేటీ అయ్యింది. కాల్ డ్రాప్స్, సర్వీసుల్లో నాణ్యత తదితర అంశాలపై చర్చించింది. అలాగే కాల్ నాణ్యతను మెరుగుపర్చడానికి విధానపరంగా తీసుకోతగిన చర్యలపై సమాలోచనలు జరిపింది. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టెలికం శాఖ కార్యదర్శి కె రాజారామన్ ఈ సమావేశానికి సారథ్యం వహించగా భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోల ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇది సాగింది. నిర్దేశిత ప్రమాణాలకు ప్రతిగా ప్రస్తుతం తాము అందిస్తున్న సర్వీసుల నాణ్యత గురించి టెల్కోలు వివరంగా చెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే అక్రమ బూస్టర్లలో సేవలకు అంతరాయం కలుగుతుండటం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిపాయి. సమస్యాత్మక విషయాలను గుర్తించి తమ దృష్టికి తేవాలని, కాల్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు విధానపరంగా తీసుకోతగిన చర్యలపై తగు సూచనలు చేయాలని ఆపరేటర్లను టెలికం శాఖ కోరినట్లు వివరించాయి. -
టెల్కోలు, వైఫై సంస్థలు జట్టు కట్టాలి
న్యూఢిల్లీ: డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా కొత్త వ్యాపార విధానాలను అమలు చేసేందుకు టెల్కోలు, వైఫై సంస్థలు కలిసి పని చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాట్ చైర్మన్ పి.డి. వాఘేలా సూచించారు. మొబైల్, వైఫై సాంకేతికతల సామర్థ్యాలను వెలికితీయాలని పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే డేటా వినియోగం అనేక రెట్లు పెరుగుతుందని వాఘేలా చెప్పారు. ‘5జీ బ్రాడ్కాస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ల మధ్య కమ్యూనికేషన్, రోబోటిక్స్ మొదలైన టెక్నాలజీలతో డేటా వినియోగం భారీగా పెరుగుతుంది‘ అని తెలిపారు. ప్రస్తుతం 5జీ సేవలు అందుబాటులో ఉన్న దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 4జీతో పోలిస్తే 1.7–2.7 రెట్లు ఎక్కువగా మొబైల్ డేటా వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని వాఘేలా వివరించారు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని పెంచేందుకు పబ్లిక్ వైఫై కూడా ఎంతగానో ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 2022 నాటికి 1 కోటి పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేయాలని 2018 నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీలో నిర్దేశించుకున్నట్లు వాఘేలా చెప్పారు. భవిష్యత్తులో వైఫై7 కూడా రాబోతోందని, దీనితో డేటా డౌన్లోడ్ వేగం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. -
మరో రౌండ్ టెలికాం చార్జీల బాదుడు తప్పదు!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మూడు ప్రైవేట్ టెలికం దిగ్గజాలు (జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా) మరో విడత టారిఫ్‌లు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2022–23లో టెల్కోల ఆదాయాలు 20–25 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. టెలికం సంస్థలు తమ నెట్వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్ చేయాలంటే సగటున ప్రతి యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని (ఏఆర్పీయూ) మరింత పెంచుకోవాల్సి ఉంటుందని, అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ కేవలం 5 శాతం పెరిగిందని, అయితే ఇప్పటివరకూ పెంచినది.. ద్వితీయార్ధంలో పెంచబోయేది కూడా కలిపితే యూజరుపై ఆదాయం 15-20 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో టెలికం సంస్థలు నెట్వర్క్, స్పెక్ట్రంపై భారీగా వెచ్చించనున్నాయని.. ఏఆర్పీయూ వృద్ధి, టారిఫ్‌ల పెంపుతో వాటిపై ఆర్థిక భారం కొంత తగ్గగలదని పేర్కొంది. ‘టాప్ 3 సంస్థల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 20-25% పెరిగే అవకాశం ఉంది. అలాగే నిర్వహణ లాభాల మార్జిన్ 1.80-2.20% పెరగవచ్చు‘ అని క్రిసిల్ వివరించింది. తగ్గిన యూజర్లు..: గత ఆర్థిక సంవత్సరంలో 3.70 కోట్ల ఇనాక్టివ్ యూజర్ల (పెద్దగా వినియోగంలో లేని కనెక్షన్లు) సంఖ్య తగ్గింది. యాక్టివ్ యూజర్లు (వినియోగంలో ఉన్న కనెక్షన్లు) 3 శాతం పెరిగారు. రిలయన్స్ జియో మొత్తం యూజర్ల సంఖ్య 2021 ఆగస్టు-2022 ఫిబ్రవరి మధ్య భారీగా పడిపోయినప్పటికీ యాక్టివ్ యూజర్ల వాటా 94%కి పెరిగింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్టెల్ కనెక్షన్లు 1.10 కోట్ల మేర పెరగ్గా యాక్టివ్ యూజర్ల వాటా 99%కి చేరింది. -
5జీ సర్వీసు కావాలంటే.. ఈ సవరణలు కావాలి - టెల్కోలు
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో 5జీ నెట్‌వర్క్‌ను పరిచయం చేసేందుకు భారతదేశం సన్నద్ధం అవుతున్నందున.. స్మాల్ సెల్ విస్తరణకై రైట్ ఆఫ్ వే నిబంధనలకు సవరణ చేయాలని టెలికం పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ‘స్మాల్ సెల్స్ విషయంలో నియంత్రణ వ్యవస్థ లేదు. టవర్లు, కేబుల్స్ ఏర్పాటుకు అనుమతులు దక్కించుకోవడంలో సవాళ్లు ఉన్నాయి. రాష్ట్రాన్నిబట్టి విధానాలు వేర్వేరుగా అమలవుతున్నాయి. అడ్డంకులు తొలగితేనే స్మాల్ సెల్ విస్తరణకు ఆస్కారం ఉటుంది’ అని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. 5జీ నెట్‌వర్క్స్‌లో స్మాల్ సెల్స్ (మొబైల్ బేస్ స్టేషన్స్) అత్యంత కీలకం. -
కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..
టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కాల్ రికార్డింగ్ డాటాను, ఇంటర్నెట్ యూసేజ్ డాటాను రెండేళ్ల పాటు భద్రపర్చాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. గతంలో ఈ సమయం ఏడాది పాటే ఉండేది. ఒకవేళ భద్రతా ఏజెన్సీలు కోరితే ఆ గడువును పెంచే విధంగా సవరణ వెసులుబాటు ఉండేది(గతంలో ఎన్నడూ జరగలేదు!). అయితే ఈసారి రెండేళ్లపాటు భద్రపర్చాలంటూ యునిఫైడ్ లైసెన్స్ అగ్రిమెంట్‌కు సవరణ చేయడం విశేషం. రెండేళ్లపాటు లేదంటే ప్రభుత్వం చెప్పేవరకు వివరాలను భద్రపర్చి ఉంచాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) డిసెంబర్ 21న ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టెలికామ్ కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం లైసెన్స్‌లు కలిగిన ఇతరులు.. కమర్షియల్‌తో పాటు యూజర్ల కాల్ వివరాల రికార్డ్లను భద్రపర్చాలని స్పష్టం చేసింది. భద్రతా ఏజెన్సీలు కోరినందునే ఈసారి ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రజాప్రయోజనాల దృష్ట్యా లేదంటే భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని టెల్కోస్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ విభాగం ఈ తరహా ఆదేశాల్ని జారీ చేస్తుంటుంది. కాల్ రికార్డింగులు, మెసేజ్‌ల వివరాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఈ-మెయిల్, లాగిన్, లాగ్ అవుట్.. ఇలా అన్ని వివరాలను జాగ్రత్త పర్చాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ వివరాలకు అదనంగా ఈసారి ఇంటర్నెట్ టెలిఫోనీ(యాప్‌ల ద్వారా చేసే కాల్స్, వైఫై కాల్స్ తదిరత వివరాలు) సైతం రెండు సంవత్సరాలపాటు భద్రపర్చాల్సిందే!. దర్యాప్తు, విచారణ, భద్రతా ఏజెన్సీలు ఎప్పుడు కోరితే అప్పుడు ఆ వివరాల్ని కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్.. మీరూ కుబేరులు అయిపోవచ్చు! -
టెల్కోలకు బ్యాంక్ గ్యారంటీ నిబంధన ఎత్తివేత
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ప్రకటించిన సంస్కరణలను కేంద్రం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తులో నిర్వహించబోయే స్పెక్ట్రం వేలం నిబంధనలను సడలిస్తూ టెలికం విభాగం (డాట్) సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం స్పెక్ట్రం వార్షిక చెల్లింపుల పూచీకత్తుకు సంబంధించి టెల్కోలు ఒక ఏడాది వాయిదా మొత్తానికి సరిపడేంత .. ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ (ఎఫ్‌బీజీ) ఇవ్వాలన్న నిబంధనను తొలగించింది. అలాగే సర్వీసుల విస్తరణ విషయంలో పనితీరు బ్యాంక్ గ్యారంటీ (పీబీజీ) సమర్పించాలన్న షరతును కూడా ఎత్తివేసింది. వేలంలో పాల్గొనే సంస్థలకు తగినంత ఆర్థిక స్థోమత ఉండేలా అర్హతా ప్రమాణాలను కూడా తగు రీతిలో సవరించనున్నట్లు టెలికం శాఖ పేర్కొంది. భవిష్యత్తులో స్పెక్ట్రంను 30 ఏళ్ల వ్యవధికి కేటాయించనున్నట్లు వివరించింది. గత విడతల్లో విక్రయించిన స్పెక్ట్రం కాలపరిమితిలో (20 ఏళ్లు) ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. 30 ఏళ్ల కాలపరిమితితో స్పెక్ట్రంను కేటాయించే విషయంలో ఆపరేటర్లు ముందుగా జరపాల్సిన చెల్లింపులు, ఇందుకోసం ఇవ్వతగిన మారటోరియం వ్యవధి, వాయిదాలు మొదలైన అంశాలపై తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను కోరినట్లు డాట్ పేర్కొంది. మరోవైపు, టెల్కోలు కనీసం 10 ఏళ్ల వ్యవధి తర్వాత తమ స్పెక్ట్రంను వాపసు చేయవచ్చని డాట్ తెలిపింది. అయితే, దీని గురించి ఏడాది ముందే తెలియజేయాల్సి ఉంటుందని, సరెండర్ ఫీజు వర్తిస్తుందని పేర్కొంది. సంస్కరణలతో టెల్కోలపై తగ్గనున్న భారం: సీవోఏఐ డీజీ కొచర్ టెలికం రంగంలో కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. భవిష్యత్‌లో నిర్వహించే స్పెక్ట్రం వేలానికి సంబంధించి ఎఫ్‌బీజీ, పీబీజీ నిబంధనలను తొలగించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో ఆపరేటర్లపై ఆర్థిక భారం తగ్గగలదని కొచర్ పేర్కొన్నారు. టెలికం రంగంలో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడానికి ఇవి తోడ్పడగలవని ఆయన వివరించారు. -
టెల్కో కొనుగోలుపై ప్రభుత్వానికి ఆసక్తి లేదు
న్యూఢిల్లీ: బాకీలపై వడ్డీని కంపెనీలో వాటాల రూపంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించినప్పటికీ ఏ టెల్కోనూ కొనుగోలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని భారీ బకాయిల భారంలో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) ఎండీ రవీందర్ టక్కర్ తెలిపారు. టెలికం రంగంలో కనీసం మూడు ప్రైవేట్ సంస్థలైనా ఉండాలని, అవి మార్కెట్లో పోటీపడాలన్నదే కేంద్రం అభిప్రాయమని పేర్కొన్నారు. టెలికం సంస్కరణలను కేంద్రం ప్రకటించడానికి ముందు తాను ప్రభుత్వంలోని వివిధ వర్గాలతో సంభాషించానని ఆయన చెప్పారు. ఏ టెలికం కంపెనీని కొనుగోలు చేయాలని గానీ నిర్వహించాలని గానీ ప్రభుత్వానికి ఉద్దేశమేదీ లేదని ఆయా సమావేశాల్లో స్పష్టమైందని టక్కర్ తెలిపారు. -
టెల్కోల మౌలిక సదుపాయాల షేరింగ్‌కు ఓకే
న్యూఢిల్లీ: టెల్కోలు ఇకపై ప్రధాన నెట్‌వర్క్‌లు సహా ఇతర మౌలిక సదుపాయాలను పరస్పరం పంచుకునేందుకు (షేరింగ్) వెసులుబాటు కలి్పస్తూ సంబంధిత నిబంధనలను టెలికం విభాగం (డాట్) సవరించింది. దీనితో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోల పెట్టుబడులు, నిర్వహణ వ్యయాల భారం గణనీయంగా తగ్గనుంది. ఇక, మొబైల్ నెట్‌వర్క్‌లకు అవసరమైన కనెక్టివిటీని కలి్పంచేందుకు శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించుకునే దిశగా వాణిజ్యపరమైన వీశాట్ లైసెన్స్ నిబంధనల్లో కూడా డాట్ సవరణలు చేసింది. ఇప్పటిదాకా టెలికం సంస్థలు.. మొబైల్ టవర్లు, నెట్‌వర్క్‌లోని కొన్ని క్రియాశీలక ఎల్రక్టానిక్ విడిభాగాలను మాత్రమే షేర్ చేసుకునేందుకు అనుమతి ఉంది. యాంటెనా, ఫీడర్ కేబుల్ వంటి వాటికి ఇది పరిమితమైంది. తాజా సవరణతో ప్రధాన నెట్‌వర్క్‌లో భాగాలను కూడా పంచుకునేందుకు వీలవుతుందని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. దేశీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచే క్రమంలో ఇది పురోగామి చర్యగా అభివరి్ణంచారు. 5జీ వేలంపై ట్రాయ్‌తో సంప్రదింపులు.. 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి డాట్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ధర, వేలం వేయతగిన స్పెక్ట్రం పరిమాణం, ఇతర విధి విధానాల గురించి తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని కోరింది. -
సునీల్ మిట్టల్ ప్రయత్నాలు.. ఏకతాటిపైకి టెల్కోలు
న్యూఢిల్లీ: టెలికం రంగంలో కేంద్రం భారీ సంస్కరణలు ప్రకటించిన నేపథ్యంలో భారత డిజిటల్ లక్ష్యాలను సాకారం చేసేందుకు టెల్కోలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు భారతి ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్‌తో మాట్లాడినట్లు గురువారం ఆయన తెలిపారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో కూడా మాట్లాడనున్నట్లు మిట్టల్ వెల్లడించారు. టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలను గట్టిగా తోసిపుచ్చారు. పరిశ్రమ పరిస్థితులు, మార్కెట్ పంపిణీ వ్యవస్థ వంటి అంశాలపైనే తాము చర్చిస్తామని, టారిఫ్‌ల గురించి ప్రస్తావన ఉండదని మిట్టల్ చెప్పారు. కాగా, టెలికం టారిఫ్‌లు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఒక వర్చువల్ సమావేశంలో మిట్టల్ తెలిపారు. -
టెలికం రంగంలో సంస్కరణలు తేవాలి
న్యూఢిల్లీ: సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం రంగాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రానికి టెల్కోలు విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే సుంకాలు తగ్గించాలని, వేలం వేసిన స్పెక్ట్రం హోల్డింగ్ కాలావధిని రెట్టింపు చేయాలని, స్పెక్ట్రం చెల్లింపులపై 7–10 ఏళ్ల పాటు మారటోరియం ఇవ్వాలని కోరాయి. టెల్కోల సమాఖ్య సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఈ మేరకు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌కు లేఖ రాసింది. అత్యధిక పన్నుల భారం పడే రంగాల్లో టెలికం పరిశ్రమ కూడా ఒకటని అందులో పేర్కొంది. ఆదాయాల్లో 32 శాతం భాగం పన్నులు, సుంకాల రూపంలో కట్టాల్సిన ప్రస్తుత విధానంతో కంపెనీలు మనుగడ సాగించడం కష్టంగా మారిందని వివరించింది. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల దగ్గర నిరంతరం మిగులు నిధులు ఉండే పరిస్థితి లేనందున ఇంతటి భారీ స్థాయి పన్నులనేవి పరిశ్రమ వృద్ధికి ప్రతికూలమని సీవోఏఐ తెలిపింది. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో తదితర సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లేఖ కాపీలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కూడా సీవోఏఐ పంపింది. పలు ప్రతిపాదనలు.. టెలికం రంగాన్ని తిరిగి పటిష్టమైన, నిలకడైన వృద్ధి బాట పట్టించడానికి ప్రాథమిక ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని సీవోఏఐ పేర్కొంది. ఇందులో భాగంగా తీసుకోతగిన విధానపరమైన చర్యలకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసింది. పన్నులు, సుంకాలు తగ్గించడం, స్పెక్ట్రంనకు సంబంధించి ధరను సహేతుకంగా నిర్ణయించడం, చెల్లింపులకు సులభతరమైన నిబంధనలు విధించడం, హోల్డింగ్ వ్యవధిని పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి. అలాగే, సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్) నిర్వచనాన్ని పునఃసమీక్షించడం, కనీస ధరను నిర్ణయించడం, ఆర్థిక..పనితీరుపరమైన బ్యాంక్ గ్యారంటీల నుంచి మినహాయింపునివ్వడం వంటి ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి. రుణాలు, నష్టాల భారంతో వొడాఫోన్ ఐడియా అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో సీవోఏఐ ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియాను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అది గానీ మూతబడితే పరిశ్రమలో రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆఖరు నాటికి వొడాఫోన్ ఐడియా మొత్తం రుణభారం రూ. 1,91,590 కోట్లుగా ఉంది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపు బకాయి రూ. 1,06,010 కోట్లు, ఏజీఆర్ బాకీ రూ. 62,180 కోట్లుగా ఉంది. -
కోవిడ్–19 వ్యాప్తికి 5జీ కారణమంటున్న వార్తల్లో నిజమెంత?
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాప్తికి, 5జీ సర్వీసులకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను (ఎంఈఐటీవై) టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ విజ్ఞప్తి చేసింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఇలాంటి తప్పుదోవ పట్టించే మెసేజీలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎంఈఐటీవై అదనపు కార్యదర్శి రాజేంద్ర కుమార్‌కు మే 15న సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఈ మేరకు లేఖ రాశారు. ‘దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఇలా తప్పుదోవ పట్టించే పోస్టులను సత్వరం తొలగించాలంటూ ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సూచించండి‘ అని కోరారు. భారత్‌లో ఇంకా 5జీ టెక్నాలజీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనప్పటికీ.. కోవిడ్ కేసుల పెరుగుదలకు 5జీ టవర్లే కారణమన్న ఆడియో, వీడియో మెసేజీలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఇలాంటి తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయని కొచర్ పేర్కొన్నారు. ఇలాంటి అపోహలను ప్రచారం చేయడం వల్ల దేశ ప్రయోజనాలతో పాటు టెలికం కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. వైరస్ ఉధృతి కారణంగా చాలా మటుకు కార్యకలాపాల నిర్వహణకు టెలికం, ఇంటర్నెట్పై ప్రజలు, ప్రభుత్వం ఆధారపడాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో దుష్ప్రచారంతో టెలికం సేవలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. -
పెరిగిన టెల్కోల ఆదాయం: టాప్‌లో ఎవరంటే?
సాక్షి,న్యూఢిల్లీ: టెలికం కంపెనీల ఆదాయం పెరిగింది. డిసెంబరు త్రైమాసికంలో టర్నోవరు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.27 శాతం వృద్ధితో రూ.71,588 కోట్లు నమోదైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) 16.5 శాతం అధికమై రూ.47,623 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి సమకూరిన లైసెన్స్ ఫీజు 16.49 శాతం పెరిగి రూ.3,809 కోట్లకు చేరింది. అలాగే స్పెక్ట్రం వాడినందుకు వసూలైన రుసుం 22.22 శాతం హెచ్చి రూ.1,538 కోట్లు నమోదైంది. ఈ వివరాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ గణాంకాలను వెల్లడించింది. రిలయన్స్ జియో రూ.17,181 కోట్లుతో టాప్‌లో ఉండగా, భారతి ఎయిర్టెల్ రూ.11,340 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.6,588 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.2,135 కోట్ల ఏజీఆర్ సాధించాయి. టాటా టెలిసర్వీసెస్ రూ. 584.1 కోట్లు, ఎంటిఎన్ఎల్ రూ .369.84 కోట్లును సాధించగా, మిగతా కంపెనీలు ఎజిఆర్‌ను 100 కోట్ల రూపాయల కన్నా తక్కువే సాధించాయి. ఈ గణాంకాల ప్రకారం, ఏజీఆర్ ఆధారిత ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం వార్షిక ప్రాతిపదికన 85.07 రూపాయల నుండి 108.78 రూపాయలకు పెరిగింది. చదవండి: కార్పొరేట్ వార్: సుప్రీంకోర్టుకు సైరస్ మిస్త్రీ వైర్లెస్ టెక్నాలజీ: భారీ పెట్టుబడులు -
బల్క్ ఎస్ఎంఎస్లపై మూడు రోజుల గడువు
న్యూఢిల్లీ: వినియోగదార్లకు బల్క్ ఎస్ఎంఎస్లు పంపే కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు టెలి మార్కెటింగ్ నిబంధనలకు అనుగుణంగా పేర్లు నమోదు చేసుకోవాల్సిందేనని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇందుకు మూడు రోజుల గడువు ఇస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. నమోదు చేయని పక్షంలో కస్టమర్లకు వాణిజ్యపర సమాచారం పంపకుండా నిరోధిస్తామని హెచ్చరించింది. అంతేగాక విఫలమైన కంపెనీల పేర్లను తమ వెబ్సైట్లో ఉంచుతామని వెల్లడించింది. గడువు ముగిసిన తర్వాత కూడా నియంత్రణ సంస్థకు అనుగుణంగా నమోదు కానట్టయితే టెలికం వనరులను ఉపయోగించి పెద్దమొత్తంలో సందేశాలను పంపడానికి వారిని అనుమతించరు. బ్యాంకింగ్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్ తదితర కంపెనీలన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే.. మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే కొత్త నిబంధనలను ట్రాయ్ అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం వివిధ సంస్థలు పంపే వాణిజ్యపరమైన ఎస్ఎంఎస్లను వినియోగదారులకు చేరవేయడానికి ముందు.. నిర్దిష్ట నమోదిత సందేశం నమూనాతో టెలికం కంపెనీలు సరిపోల్చి, ధృవీకరించుకోవాలి. ఇందుకోసం టెల్కోలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఇందులో నమోదైన ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రమే అధికారికమైనవిగా భావించి సమ్మతించిన కస్టమర్లకు పంపుతాయి. నమోదు చేసుకోని ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తాయి. ఈ విధానాన్ని ఎస్ఎంఎస్ స్క్రబింగ్‌గా వ్యవహరిస్తారు. కొత్త విధానంపై పరిశ్రమ వర్గాలకు ఇంకా పూర్తి అవగాహన రాకపోవడంతో సోమవారం నుంచి ఎస్ఎంఎస్లు, ఓటీపీల డెలివరీల్లో సమస్యలు తలెత్తాయి. (చదవండి: భయపడొద్దు.. సెల్ టవర్లు సురక్షితమే) -
బల్క్ కనెక్షన్లకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: బల్క్ కనెక్షన్లు తీసుకున్న సబ్స్క్రయిబర్స్కు కొత్త కనెక్షన్లు జారీ చేసే అంశానికి సంబంధించి టెలికం శాఖ (డాట్) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. జూలై 20న జారీ చేసిన ఆదేశాల ప్రకారం కొత్త కనెక్షన్ల జారీ సమయంలో టెలికం ఆపరేటర్లు భౌతికంగా సదరు బల్క్ కనెక్షన్లున్న ఆవరణకు వెళ్లి, దానికి సంబంధించిన లొకేషన్ గ్రిడ్, తనిఖీ చేసిన సమయం తదితర వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. అలాగే యూజర్ల ఆవరణలను ప్రతీ ఆరునెలలకోసారి టెల్కోలు సందర్శించి, లొకేషన్ గ్రిడ్ వివరాలను సేకరించాలి. బల్క్ కనెక్షన్లను టెలికం కంపెనీలు తప్పనిసరిగా తనిఖీ చేసేలా చూసేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక, సిమ్ కార్డులను యాక్టివేట్ చేయడానికి ముందు బల్క్ కనెక్షన్లు తీసుకున్న కంపెనీ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఈ–కేవైసీ, డిజిటల్ కేవైసీ (నో యువర్ కస్టమర్) ఆధారంగా జారీ చేసిన కనెక్షన్లకు సంబంధించిన పలు దరఖా స్తు ఫారంలలో అడ్డదిడ్డంగా రాతలు ఉంటున్నాయని, వాటిని సరిచేయాలని టెల్కోలకు డాట్ సూ చించింది. టెలికం శాఖ అనుమతుల మేరకు గతం లో ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ప్రక్రియతో టెల్కో లు కనెక్షన్లు జారీ చేసేవి. అయితే, ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీం కోర్టు 2018లో కీలక మార్గదర్శకాలు ఇవ్వడంతో అప్ప ట్నుంచీ డిజిటల్ కేవైసీ ప్రక్రియ అమలవుతోంది. -
ప్రీపెయిడ్ గడువు పెంచండి
న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఆదేశించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. ‘లాక్డౌన్ సమయంలో ప్రీపెయిడ్ యూజర్లంతా నిరంతరాయంగా సర్వీసులు పొందేందుకు... వ్యాలిడిటీని పొడిగించడం సహా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి. టెలికమ్యూనికేషన్ సేవలను నిత్యావసర సర్వీసుల కింద పరిగణించి, మినహాయింపు ఇచ్చినప్పటికీ.. లాక్డౌన్ కారణంగా కస్టమర్ సర్వీస్ సెంటర్లు, పాయింట్ ఆఫ్ సేల్స్ స్టోర్లు పనిచేయకపోవడం వల్ల సర్వీసులకు విఘాతం కలగవచ్చు. దీంతో ఆఫ్‌లైన్ విధానాల్లో ప్రీపెయిడ్ బ్యాలెన్స్‌లను టాప్ అప్ చేయించుకునేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి‘ అని ట్రాయ్ సూచించింది. వ్యాలిడిటీ పొడిగించిన ఎయిర్టెల్.. లాక్‌డౌన్‌పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అల్పాదాయ వర్గాలకు చెందిన సుమారు 8 కోట్ల పైగా ప్రీపెయిడ్ కస్టమర్ల ప్యాకేజీల వేలిడిటీని ఏప్రిల్ 17 దాకా పొడిగిస్తున్నట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. ప్లాన్ గడువు తీరిపోయినా 17 దాకా వీరంతా ఇన్కమింగ్ కాల్స్ పొందవచ్చని తెలిపింది. అలాగే, ఈ 8 కోట్ల మంది ప్రీ–పెయిడ్ అకౌంట్స్‌లోకి ఉచితంగా రూ. 10 టాక్‌టైమ్ క్రెడిట్‌గా ఇస్తున్నట్లు వివరించింది. దీన్ని టాక్‌టైమ్, ఎస్ఎంఎస్ల కోసం ఉపయోగించుకోవచ్చని, ఈ మొత్తాన్ని రికవర్ చేయబోమని ఎయిర్టెల్ పేర్కొంది. వచ్చే 48 గంటల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూడా.. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూడా ఇదే తరహాలో ఏప్రిల్ 20 దాకా ప్రీపెయిడ్ ప్యాక్‌ల వేలిడిటీ పెంచుతున్నట్లు ప్రకటించాయి. బ్యాలెన్స్ అయిపోయినప్పటికీ కనెక్టివిటీ దెబ్బతినకుండా రూ. 10 అదనపు టాక్‌టైమ్ అందిస్తున్నట్లు తెలిపాయి. -
బాకీ మొత్తం కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల విషయంలో కేంద్రం, టెల్కోలకు సుప్రీం కోర్టు తలంటింది. ఈ అంశాన్ని టెల్కోలు సాగదీస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. నిర్దేశిత బాకీలు మొత్తం కట్టి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. స్వీయ మదింపులు, బకాయిల పునఃసమీక్ష లాంటివి కుదరదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాకీల చెల్లింపునకు టెలికం సంస్థలకు 20 ఏళ్ల వ్యవధినివ్వాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా తో కూడిన బెంచ్ బుధవారం తిరస్కరించింది. రెండు వారాల తర్వాత దీన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ‘20 ఏళ్ల వ్యవధి ఇవ్వడమనేది అసమంజసం. తీర్పులో పేర్కొన్నట్లుగా టెలికం కంపెనీలు బాకీలన్నీ తీర్చాల్సిందే‘ అని స్పష్టం చేసింది. వడ్డీలు, జరిమానాలపై టెలికం కంపెనీలు, ప్రభుత్వం వాదోపవాదాలన్నీ విన్న మీదటే ఏజీఆర్ బాకీలపై తీర్పునిచ్చామని, అన్ని పక్షాలు కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. ఆ అధికారులను పిలిపిస్తాం.. ఏజీఆర్ బాకీలపై టెలికం కంపెనీలు స్వీయ మదింపు చేపట్టడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన తర్వాత కూడా ఇలాంటి వాటికి ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటివి కలలో కూడా ఊహించలేనివంటూ వ్యాఖ్యానించింది. స్వీయ మదింపు ప్రక్రియ చేపట్టేందుకు టెల్కోలను అనుమతించిన టెలికం శాఖ కార్యదర్శి, డెస్క్ ఆఫీసర్లను పిలిపిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. స్వీయ మదింపు పేరుతో టెలికం కంపెనీలు తీవ్రమైన మోసానికి పాల్పడుతున్నాయని ఆక్షేపించింది. ఏజీఆర్ బాకీల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పే అంతిమమని, దాన్ని తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. టెల్కోల చీఫ్‌లకు హెచ్చరిక.. టెల్కోలు తమకు అనుకూలంగా వార్తాపత్రికల్లో కథనాలు రాయించుకుంటున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇలాంటి కథనాలు తమ తీర్పును ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. ఏజీఆర్ బాకీలపై సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ’తప్పుడు వార్తలు’ ప్రచురిస్తే టెలికం కంపెనీల ఎండీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్వీయ మదింపుతో భారీ వ్యత్యాసం.. ఏజీఆర్ బాకీలకు సంబంధించి డాట్ చెబుతున్న దానికి టెల్కోల స్వీయ మదింపునకు మధ్య ఏకంగా రూ. 82,300 కోట్ల వ్యత్యాసం ఉంది. డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్, టెలినార్‌వి కలిపి రూ. 43,980 కోట్లు, వొడాఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్ సంస్థలు రూ. 16,798 కోట్లు చెల్లించాలి. అయితే, ఆయా టెల్కోలు జరిపిన స్వీయ మదింపు లెక్కల ప్రకారం.. భారతి గ్రూప్ రూ.13,004 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.21,533 కోట్లు, టాటా గ్రూ ప్ సంస్థలు రూ.2,197 కోట్లు కట్టాల్సి ఉంటుంది. -
టెల్కోలపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: టెలికం సంస్థలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఏజీఆర్ బకాయిల ఛార్జీల చెల్లింపుల విషయంలో ఎలాంటి ఎలాంటి పునఃసమీక్ష ఉండదని తేల్చి చెప్పింది. ఇందుకు అనుమతినిచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ)పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ను లెక్కించేందుకు మరోసారి ప్రయత్నించవద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. అసలు వీటిని ఎవరు సమీక్షించమన్నారంటూ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 24 న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు నిర్ణయించిన ఏజీఆర్ బకాయిలను స్వీయ అంచనా వేయడం లేదా తిరిగి అంచనా వేయడం ఉండదని స్పష్టం చేసింది. బకాయిలు వసూలుపై ప్రభుత్వ తీరుపై కూడా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీం పునర్స మీక్షకు గడువు ఇవ్వాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. కోర్టును ప్రభావితం చేయడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఒకవేళ మళ్లీ తిరిగి సమీక్షిస్తే కోర్టు గతంలో తప్పుచేసినట్లు అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపుల పునర్సమీక్షకు అనుమతించిన అధికారుల్ని సహించేది లేదని హెచ్చరించింది. టెలికం కంపెనీలు తప్పనిసరిగా ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిదేనని గత ఆక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బకాయిల్ని మళ్లీ సమీక్షించాలంటూ అనేకసార్లు కోర్టును ఆశ్రయించాయి టెలికాం కంపెనీఉ. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెలలోనూ సుప్రీంకోర్టు సంస్థలపైనా, ప్రభుత్వంపై విరుచుకుపడింది. దీంతో కొన్ని సంస్థలు బకాయిల్లో కొంత మొత్తాన్ని చెల్లించాయి. కానీ మరోసారి కోర్టు సమీక్షిస్తే కొంత మినహాయింపు లభించే అవకాశం ఉందని భావించిన సంస్థలు వేచిచూశాయి. కానీ తాజా మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బకాయిలే పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏజీఆర్ బకాయిల చెల్లింపులు 20 ఏళ్ల పాటు వాయిదాల రూపంలో చెల్లించేందుకు సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను రూపొందించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఏజీఆర్ చార్జీల చెల్లింపు వల్ల సంస్థ పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పేర్కొంది. లక్షలాది మంది వినియోగదారుల పైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
సాక్షి,ముంబై: భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్ బిల్లుల మోత మోగనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే చౌకైన మొబైల్ డేటాను అనుభవిస్తున్న కస్టమర్లు దాదాపు 10 రెట్ల మేర భారాన్ని భరించాల్సి వుంటుంది. టెలికాం ఆపరేటర్లు కోరిన విధంగా రేట్ల(కనీస రేట్లు)ను నిర్ణయించినట్టయితే ప్రస్తుత స్థాయి నుంచి మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరుగుతాయి. ఇది నిజంగా మొబైల్ వినియోగారుదారులకు షాకింగ్ న్యూసే. ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ చందాదారులు ఒక జీబీ కి రూ. 3.5ల చొప్పున 4జీ డేటా ను పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టెలికాం కంపెనీలు కోరినట్లు ట్రాయ్ నిర్ణయం తీసుకుంటే మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరిగే అవకాశముంది. కనీసం 1 జీబీ ధరను రూ.35 గా నిర్ణయించాలని వోడాఫోన్ ఐడియా, రూ. 30లుగా ఉండాలని, ఎయిర్టెల్, రూ. 20ల కనీస చార్జీగా వుండాలని రిలయన్స్ జియో ఇప్పటికే ట్రాయ్ కి ప్రతిపాదించాయి. తాజాగా ఈప్రతిపాదనలకు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. ఇటీవలి ఏజీఆర్ సంక్షోభం,టెలికాం రంగానికి భారీగా అప్పులు రావడం, ధరలు నిలకడగా తగ్గడం వల్ల ఇంతకుమించి వేరే మార్గం లేదని,అయితే ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పరిశ్రమ నుండి వచ్చిన అభ్యర్థన తరువాత కాల్, డేటా సేవలకు కనీస ధరను నిర్ణయించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కనీస ధరలను పెంచడం వాంఛనీయం కాదని , తిరోగమన దశ అని, ఇది మార్కెట్ పోటీపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పేర్కొంది. వినియోగదారుల జేబుకు చిల్లు రోజుకు 2 జీబీ 4జీ డేటా అందించే రూ .599 (84 రోజుల వాలిడిటీ) ప్లాన్‌లో (జీబీకి రూ .3.5 రేటు) జీబీకి రూ .20-35 పరిధిలో డేటా ధర నిర్ణయిస్తే ఇదే ప్లాన్‌కు రూ .3,360 రూ. 5,880 మధ్య బాదుడు తప్పదు. -
ఏజీఆర్ : మొత్తం బకాయిలు చెల్లించమని ఆదేశించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల చెల్లింపు విషయంలో మరోసారి కేంద్రం టెల్కోలకు ఆల్టిమేటం జారీ చేసింది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన ఇప్పటివరకు టెలికాం ఆపరేటర్ల నుండి సుమారు రూ .25,900 కోట్లను ప్రభుత్వం అందుకుందనీ, త్వరలోనే పూర్తి చెల్లింపులు చేయమని టెల్కోలను మళ్లీ ఆదేశించామని పార్లమెంటుకు అందించిన సమాచారంలో కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే వెల్లడించారు. అక్టోబర్ 24, 2019 నాటి బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో అక్టోబర్ 24, 2019 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కొన్ని చెల్లింపులు చేశాయని తెలిపారు. మార్చి 4, 2020 రాసిన లేఖలో పూర్తి చెల్లింపులు చేయాలని ఆపరేటర్లను ఆదేశించామన్నారు. అలాగే టెలికాం రంగంలో గుత్తాధిపత్యం లేదా కార్టలైజేషన్‌ను నివారించడానికి కొత్త యాంట్రీ ట్రస్ట్ లాను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని మరో ప్రశ్నకుసమాధానంగా వెల్లడించారు. భారతి ఎయిర్టెల్ ఇప్పటివరకు రూ .18,004 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ .3500 కోట్లు చెల్లించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. టాటా టెలిసర్వీసెస్ సుమారు రూ.4,197 కోట్లు చెల్లించగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.3.9 కోట్లు , రిలయన్స్ జియో సుమారు రూ .195 కోట్లు చెల్లించిందన్నారు. టెలికాం రంగంలో ఆర్థిక ఇబ్బందులపై జోక్యం చేసుకోవాలన్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఓఏఐ) అభ్యర్థన మేరకు టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించామన్నారు. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుందన్నారు. ఏజీఆర్ వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. -
టెల్కోలకు ఊరటపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల భారంతో సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగానికి సత్వరం ఊరటనిచ్చే చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర టెలికం శాఖ, ఇతర కీలక శాఖల సీనియర్ అధికారులు ఆదివారం దీనిపై అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా సాగిన సమావేశంలో నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. టెలికం పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపైనా ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద కేంద్రానికి టెలికం సంస్థలు సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉందని అంచనా. ఇందులో దాదాపు 60 శాతం పైగా భాగం ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలదే ఉంది. బాకీల చెల్లింపులో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో టెల్కోలు కొంత భాగాన్ని ఇప్పటికే జమ చేశాయి. అయితే, ఈ బాకీలు తమపై తీవ్ర భారం మోపుతాయని టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఇండియా చైర్మన్ కుమార మంగళం బిర్లా.. గతవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలతో ముమ్మరంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా అత్యున్నత స్థాయి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి : టెల్కోలకు మరిన్ని కష్టాలు) లెక్కింపు విధానం స్థిరంగా ఉండాలి: సీవోఏఐ ఏజీఆర్ బాకీల విషయంలో వ్యత్యాసాలు రాకుండా .. లెక్కింపు విధానం సర్కిళ్లవారీగా మారిపోకుండా స్థిరంగా ఉండేలా టెలికం శాఖ చూడాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ అభిప్రాయపడింది. ఏజీఆర్ బాకీల వసూలు కోసం టెల్కోల బ్యాంక్ గ్యారంటీలను కేంద్రం స్వాధీనం చేసుకుంటే .. అది పరిశ్రమ మనుగడకే ముప్పుగా పరిణమిస్తుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. బకాయిల లెక్కింపులో తేడాలేమైనా ఉన్నాయేమో పరిశీలించేందుకు టెలికం శాఖ ప్రతిపాదించిన ’టెస్ట్ చెక్’ విధానం సాధారణంగా జరిగే ఆడిటింగ్ ప్రక్రియేనని ఆయన తెలిపారు. (టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్) -
టెలికంలో అసాధారణ సంక్షోభం..
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) ప్రాతిపదికన టెల్కోలు భారీ బకాయిలు కట్టాల్సి రావడం .. టెలికం పరిశ్రమలో గతంలో ఎన్నడూ చూడని విధంగా, అసాధారణ సంక్షోభం తలెత్తిందని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బాకీలను కట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని, సాధ్యమైనంత త్వరగా మిగతా చెల్లింపులు జరుపుతామని ఆయన చెప్పారు. తమకు మార్చి 17 దాకా సమయం ఉన్నప్పటికీ.. ఈలోగానే కట్టేస్తామని వివరించారు. గురువారం కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయిన తర్వాత మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. భేటీ సందర్భం గా పరిశ్రమపై భారీ పన్నుల భారం ఉంటోందని, వీటిని తగ్గించాలని ఆయన కోరారు. మరో రూ. 1,000 కోట్లు కట్టిన వొడాఫోన్ ఏజీఆర్ బకాయిల కింద టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా గురువారం మరో రూ. 1,000 కోట్లు.. టెలికం శాఖకు (డాట్) చెల్లించింది. సోమవారమే కంపెనీ 2,500 కోట్లు కట్టిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా మొత్తం రూ. 53,000 కోట్ల బాకీలు కట్టాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, టాటా టెలీసర్వీసెస్ నుంచి మిగతా బాకీల వసూలుకు ఒకటి.. రెండు రోజుల్లో నోటీసులు పంపించనున్నట్లు వివరించాయి. డాట్ లెక్కల ప్రకారం టాటా టెలీ సర్వీసెస్ దాదాపు రూ. 14,000 కోట్లు కట్టాల్సి ఉండగా..ఆ సంస్థ సోమవారం నాడు రూ. 2,197 కోట్లు మాత్రమే కట్టింది. ఏజీఆర్ లెక్కల మదింపులో కేంద్రం.. ఇక ఏజీఆర్ బాకీలు డాట్ చెబుతున్న దానికంటే చాలా తక్కువగా ఉంటాయని టెల్కోలు చెబుతున్న నేపథ్యంలో టెలికం శాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. మార్చి 17లోగా టెల్కోల లెక్కలను టెలికం శాఖ మదింపు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని టెల్కోల గణాంకాలను టెస్ట్ చెక్ చేయనున్నప్పటికీ.. మొత్తం బాకీలు కట్టేశామంటున్న సంస్థలతో ముందుగా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు వివరించాయి. డాట్ సొంత లెక్కలు, టెల్కోల లెక్కలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను కనిపెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. టెలికం సంస్థలు కట్టాల్సిన లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను లెక్కించేందుకు టెలికంయేతర కార్యకలాపాల ద్వారా కూడా వచ్చిన ఆదాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చంటూ డాట్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు గతేడాది ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. గతంలో విధించిన జనవరి 23 డెడ్‌లైన్‌ను టెల్కోలు ఉల్లంఘించడంపై ఆగ్రహించిన సుప్రీం కోర్టు తాజాగా దీనిపై విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. అందరికీ ప్రయోజనంపై కేంద్రం దృష్టి.. ఏజీఆర్ బాకీల విషయంలో అటు సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తూనే.. ఇటు టెలికం రంగం.. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెలికం సంస్థలు ఇప్పటిదాకా రూ. 16,000 కోట్ల ఏజీఆర్ బాకీలు చెల్లించినట్లు వివరించాయి. మరో 7–8 రోజుల్లో మరిన్ని చెల్లింపులు జరుపుతామని టెల్కోలు చెప్పాయని ఓ అధికారి పేర్కొన్నారు. టెల్కోల బాకీల్లో వడ్డీ, పెనాల్టీలే అధికం.. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బాకీల కింద కట్టాల్సినది రూ. 22,589 కోట్లని.. అయితే వడ్డీ, పెనాల్టీలు కలిపితే ఇది రూ. 92,641 కోట్లకు పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు కట్టాల్సినది రూ. 16,746 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. భారతి ఎయిర్టెల్ బాకీలు రూ. 5,529 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 6,871 కోట్లు, టాటా గ్రూప్ రూ. 2,321 కోట్లు, టెలినార్ (ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో విలీనమైంది) రూ. 529 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ. 614 కోట్లు, ఎంటీఎన్ఎల్ బకాయిలు రూ. 876 కోట్లు ఉంటాయని వివరించాయి. ఈ లెక్కలను జూలైలో తయారు చేశారని, తాజాగా మరోసారి లెక్కింపు ప్రక్రియ జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. డాట్ లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజుతో పాటు టెలికం సంస్థలు దాదాపు రూ. 55,054 కోట్ల మేర స్పెక్ట్రం యూసేజి చార్జీలు కూడా కట్టాల్సి ఉంది. -
టెల్కోలకు మరిన్ని కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏజీఆర్ (సర్దుబాటు చేసిన స్థూల రాబడి) చెల్లింపుల సంక్షోభం దేశీయ టెలికాం కంపెనీల మెడకు మరింత గట్టిగా బిగుస్తోంది. ఒకవైపు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి బకాయి పడ్డ టెలికాం సంస్థలు తమ బకాయిలను క్రమంగా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే భారతి ఎయిర్టెల్ రూ. 10వేలకోట్లు, వోడాఫోన్ ఐడియా మొత్తం రూ. 3500 కోట్లు చెల్లించింది. మరోవైపు టెలీకమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఏజీఆర్ బకాయిలను పూర్తిగా చెల్లించనందుకు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలిసర్వీస్‌లకు ఈ వారం తాజా నోటీసులు జారీ చేయనుంది. అలాగే బ్యాంక్ హామీలను అంగీకరించే అవకాశం వుందని, అయితే మార్చి 17 లోపు చేయాలా వద్దా అనే దానిపై చట్టపరమైన అభిప్రాయాన్ని కోరినట్టు డాట్ వెల్లడించింది. టాటా టెలీ సర్వీసెస్ ప్రకటనపై డాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్ బకాయిలు రూ .2,197 కోట్ల 'ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్' చేసినట్టు టాటా టెలిసర్వీసెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డాట్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించాలని కోరుతూ టాటా టెలీ సర్వీసెస్‌కు ప్రత్యేక నోటీసు జారీ చేయనుంది. కంపెనీ మొత్తం బకాయిలు రూ. 14,000 కోట్లని డాట్ స్పష్టం చేసింది. మొత్తంపై వడ్డీ (పెనాల్టీతో పాటు), పెనాల్టీపై వడ్డీని చెల్లించలేదని డాట్ అధికారి తెలిపారు. పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా టాటా టెలీ సర్వీసెస్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ గురువారం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసారు. ఇంతకుముందెన్నడూ లేని ఈ అసాధారణ సంక్షోభంలో టెలికాం రంగానికి పన్నులు, సుంకాలను తగ్గించాలని కోరారు. అలాగే బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించటానికి ఎయిర్టెల్ కట్టుబడి ఉందని మిట్టల్ చెప్పారు. మిగిలిన ఏజీఆర్ బకాయిల చెల్లింపులను వేగవంతం చేశామన్నారు. మార్చి 17 వరకు సమయం ఉందని, కంపెనీ తన బకాయిలను అంతకు ముందే చెల్లిస్తుందని వెల్లడించారు. కాగా బకాయిల చెల్లింపుల ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. -
అలాగైతే వొడాఫోన్ మూతే..
సాక్షి, న్యూఢిల్లీ : గత పదేళ్లలో వొడాఫోన్ ఐడియా రూ 2 లక్షల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వానికి పేరుకుపోయిన బకాయిలను రాత్రికి రాత్రి చెల్లిస్తే కంపెనీ మూతపడుతుందని సంస్థ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు. సంస్థ మూతపడితే 10,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని, 30 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లకు అసౌకర్యం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. ఇది టెలికాం రంగంలో పోటీతత్వం కనుమరుగై రెండు సంస్థల ఆధిపత్యమే కొనసాగేందుకు దారితీస్తుందని అన్నారు. ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా రూ 7000 కోట్ల బకాయిలుండగా పెనాల్టీ, వడ్డీపై పెనాల్టీలతో కలుపుకుని ఇవి రూ 25,000 కోట్లకు ఎగబాకాయి. కంపెనీ ఇప్పటికే రూ 2150 కోట్లు చెల్లించిందని ముకుల్ రోహత్గీ చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు నష్టాలతో సతమతమవుతున్న టెల్కోలు సంక్షోభంలో కూరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలను రాత్రికిరాత్రే చెల్లించే అవకాశం లేదని టెల్కోలు టెలికాం శాఖకు తేల్చిచెప్పాయని, ప్రభుత్వం సైతం పరిస్థితికి తగినట్టు వ్యవహరించాలని లేనిపక్షంలో టెలికాం రంగంలో మోనోపలీకి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. మార్చి 17లోగా టెలికాం కంపెనీలన్నీ తమ బకాయిలను పూర్తిగా చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. భారతి ఎయిర్టెల్, టాటా గ్రూప్‌లు ఇప్పటికే తాము బకాయిపడిన మొత్తంలో వరుసగా రూ 10,000 కోట్లు రూ 2,197 కోట్లు చెల్లించాయి. ఎయిర్టెల్ ప్రభుత్వానికి ఇంకా రూ 25,585 కోట్లు బకాయిపడింది. టాటా టెలీసర్వీసెస్ మొత్తం రూ 13,800 కోట్లు చెల్లించాల్సిఉంది. చదవండి : ఆస్తుల విక్రయ ప్రయత్నాల్లో ఐడియా! -
టెల్కోలపై సుప్రీం కన్నెర్ర!
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల షెడ్యూల్‌పై ఊరట లభిస్తుందని ఆశిస్తున్న టెలికం సంస్థలకు శుక్రవారం షాకుల మీద షాకులు తగిలాయి. బాకీలు కట్టేందుకు మరికాస్త వ్యవధి లభించేలా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ టెల్కోలు వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పైగా రూ.1.47 లక్షల కోట్లు కట్టాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశించిన విధంగా బాకీలు చెల్లించకపోతే టెలికం సంస్థల అధినేతలు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. అటు టెలికం శాఖ (డాట్)కూ మొట్టికాయలు వేసింది. గత ఉత్తర్వులను పక్కన పెడుతూ బాకీల వసూలు విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దని లిఖితపూర్వక ఆదేశాలిచ్చిన డాట్ డెస్క్ ఆఫీసర్ ’తెంపరితనం’తో వ్యవహరించారని ఈ సందర్భంగా ఆక్షేపించింది. ఆ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించకపోతే సదరు అధికారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణ తేదీ మార్చి 17లోగా బాకీలు కట్టేయాలంటూ టెలికం సంస్థలను ఆదేశించింది. గత ఆదేశాల ఉల్లంఘనకు గాను కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో ఆయా టెల్కోల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, డాట్ డెస్క్ అధికారి వివరణ ఇవ్వాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా బకాయిలు కట్టని పక్షంలో .. ఆయా టెల్కోల ఎండీలు/డైరెక్టర్లతో పాటు డెస్క్ ఆఫీసర్ కూడా మార్చి 17న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏజీఆర్ సంబంధిత బాకీల చెల్లింపునకు మరింత సమయం ఇవ్వాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలీసర్వీసెస్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రూ. 2.65 లక్షల కోట్లు కట్టాలన్న డాట్ నోటీసులపై తగు కోర్టులను ఆశ్రయించాలంటూ గెయిల్ తదితర టెలికంయేతర సంస్థలకు సూచించడంతో అవి తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నాయి. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో దాదాపు రూ. 35,586 కోట్ల బకాయిల్లో సుమారు రూ.10,000 కోట్లు.. వారం రోజుల్లో డిపాజిట్ చేస్తామంటూ ఎయిర్టెల్ వెల్లడించింది. చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా.. దేశంలో చట్టాల అమలు జరిగే పరిస్థితే లేదా? అంటూ అత్యున్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఏజీఆర్‌కి సంబంధించి తమ ఉత్తర్వులను నిలుపుదల చేసేలా డెస్క్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆదేశాలివ్వడమేంటని కోర్టు ఆక్షేపించింది. సదరు అధికారికి నోటీసులు జారీ చేసింది. ‘సుప్రీం కోర్టు ఆదేశాలను నిలుపుదల చేసేలా ఒక డెస్క్ ఆఫీసరు.. ఏకంగా అకౌంటెంట్ జనరల్‌కు రాస్తారా? ఇది ధనబలం కాకపోతే మరేంటి? న్యాయస్థానాలతో వ్యవహరించే తీరు ఇదేనా? దేశంలో చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా? ఇవన్నీ చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఈ కోర్టులోనూ, ఈ వ్యవస్థలోనూ పనిచేయాలనిపించడం లేదు. నాకు చాలా ఆవేదనగా ఉంది. సాధారణంగా నేను కోపగించుకోను.. కానీ ఈ వ్యవస్థ, ఈ దేశంలో జరుగుతున్నవి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు‘ అని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. డెస్క్ ఆఫీసర్ తీరుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. అయితే, ‘ఇలాంటి ధోరణులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఒక డెస్క్ అధికారి.. ఇంత తెంపరితనంతో వ్యవహరించారంటే సుప్రీం కోర్టును మూసేద్దామా? అసలు అతనిపైనా, ఈ కంపెనీలపైనా కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? టెల్కోల రివ్యూ పిటీషన్‌ను డిస్మిస్ చేశాం. అయినా ఇప్పటిదాకా అవి పైసా కట్టలేదు. న్యాయవ్యవస్థ, దేశం ఏమై పోతుందా అని ఆందోళన కలుగుతోంది‘ అని మిశ్రా వ్యాఖ్యానించారు. మిగిలేవి రెండు సంస్థలే..: విశ్లేషకులు టెల్కోల బకాయిలపై అత్యున్నత న్యాయస్థానం గట్టి చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనివల్ల టెలికం రంగంలో ఇక రెండే సంస్థల ఆధిపత్యం ఉండే అవకాశాలు గతంలో కన్నా మరింత పెరిగాయని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీం కోర్టు తీర్పు.. నిస్సందేహంగా టెలికం పరిశ్రమకు దుర్వార్తే. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా పరిస్థితి గతంలో కన్నా దారుణంగా మారనుంది‘ అని కన్సల్టింగ్ సంస్థ కామ్ ఫస్ట్ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ తెలిపారు. లైసెన్సు ఒప్పందం ప్రకారం బాకీలు కట్టాల్సిన బాధ్యత టెల్కోలపై ఉందంటూ గడిచిన రెండు, మూడు పర్యాయాలు సుప్రీం కోర్టు చెప్పినందున .. శుక్రవారం వచ్చిన ఆదేశాలు అనూహ్యమైనవేమీ కావని ఆయన చెప్పారు. అర్ధరాత్రిలోగా కట్టండి: టెలికం శాఖ సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో టెలికం శాఖ కదిలింది. బకాయిల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దంటూ జనవరి 23న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా సత్వర చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించింది. దీనికి అనుగుణంగా.. శుక్రవారం అర్ధరాత్రిలోగా బకాయీలన్నీ కట్టేయాలంటూ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలను ఆదేశించింది. వివాదం ఏంటంటే... లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల లెక్కింపునకు టెల్కోల టెలికంయేతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని సమీక్షించాలంటూ టెల్కోలు వేసిన రివ్యూ పిటిషన్లను జనవరి 16న కొట్టి వేసింది. జనవరి 23లోగా బాకీలు కట్టేయాలంటూ సూచించింది. దీనిపై టెల్కోలు పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇది తేలేలోగా బాకీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవద్దంటూ డాట్ డెస్క్ అధికారి ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. డాట్ లెక్కల ప్రకారం మొత్తం 15 సంస్థలు.. కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్ల బాకీలు కట్టాల్సి ఉంది. వొడా–ఐడియా షేరు భారీ పతనం సుప్రీం కోర్టు ఆదేశాలతో వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) షేరు ఏకంగా 23 శాతం పతనమైంది. బీఎస్ఈలో రూ. 3.44 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 27 శాతం క్షీణించి రూ. 3.25 స్థాయిని కూడా తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ.2,988 కోట్లు తగ్గి రూ. 9,885 కోట్లకు పడిపోయింది. అటు టెలికం రంగానికి భారీగా రుణాలిచ్చిన బ్యాంకుల షేర్లపై కూడా ఈ తీర్పు ప్రతికూల ప్రభావం పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 4.38%, ఎస్బీఐ 2.41%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.77%, యాక్సిస్ బ్యాంక్ 1.5% క్షీణించాయి. క్యూ3 ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్ ఐడియా రూ. 6,439 కోట్ల నష్టాలు ప్రకటించడం తెలిసిందే. -
టెలికాం కంపెనీలకు సుప్రీం షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలకు సర్వోన్నత న్యాయస్ధానం నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్ధూల రాబడి (ఏజీఆర్)పై బకాయిల చెల్లింపుల కోసం నూతన షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరుతూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుల్లో విఫలమైన టెలికాం కంపెనీలపై కఠిన చర్యలు ఎందుకు చేపట్టలేదని టెలికాం శాఖను తీవ్రంగా మందలించింది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలపై కోర్టు ధిక్కరణ అభియోగాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. బకాయిల చెల్లింపులపై ఒత్తిడి చేయరాదని కోరుతూ అటార్నీ జనరల్‌కు లేఖ రాసిన టెలికాం శాఖ డెస్క్ అధికారిపైనా సుప్రీంకోర్టు మండిపడింది. తనపై ఎందుకు చర్య తీసుకోరాదో వివరించాలని కోరుతూ ఆ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసును జారీ చేసింది. ఏజీఆర్ చెల్లింపులపై పలుసార్లు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు చెల్లింపులు చేపట్టలేదో మార్చి 17న కోర్టుకు హాజరై వివరించాలని, వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో తెలపాలని భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా సహా టెలికాం కంపెనీల ఎండీ, డైరెక్టర్లందరికీ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. టెలికాం కంపెనీల పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీం బెంచ్ విచారణను చేపట్టింది. చదవండి : నిర్భయ: ‘సుప్రీం’ను ఆశ్రయించిన వినయ్ శర్మ -
బడ్జెట్లో ఈ రంగాల ఊసే లేదు
సాక్షి, న్యూడిల్లీ: బడ్జెట్ ప్రసంగంలో తన రికార్డును తనే అధిగమించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ 2020 లో కొన్ని ప్రధాన కీలక రంగాలకు తీరని నిరాశే మిగిల్చారు. ముఖ్యంగా జీఎస్టీ భారం, అమ్మకాలు లేక విల విల్లాడుతున్న ఆటోమొబైల్ కంపెనీ పునరుజ్జీవనానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఆయా కంపెనీలకు ఎలాంటి ఊరట కల్పించకపోవడం తీరని నిరాశ మిగిల్చిందని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే టెలికం కంపెనీల గురించి కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవంటూ సంబంధిత వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అంతేకాదు ఆర్థిక రంగానికి ఎంతో కీలకమైన రియల్ ఎస్టేట్‌రంగ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీనిపై పలువురు ఎనలిస్టులు నిరాశ వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్లో పన్ను ఉపశమనం, ఆర్థిక ఏకీకరణ, గ్రామీణ డిమాండ్ పుంజుకునే చర్యలు, సరసమైన గృహాలపై దృష్టి పెట్టడం, ఆటో రంగానికి ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల వృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ విషయంలో తీవ్ర నిరాశ ఎదురు కావడంతో స్టాక్మార్కెట్లో ఈ రంగ షేర్లు భారీ నష్టాలను మూట గట్టుకున్నాయి. -
మళ్లీ పేలనున్న మొబైల్ ఛార్జీలు
కోల్‌కతా : దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్ ఫోన్ యూజర్లపై ఈ ఏడాది అధిక చార్జీల భారం పడనుంది. యూజర్ నుంచి సగటు రాబడి ఇంకా తక్కువగానే ఉండటంతో టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌ను మరోసారి 25 నుంచి 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏజీఆర్ చెల్లింపులపై సుప్రీంకోర్టు నుంచి వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లకు ఎలాంటి ఊరట లేకపోవడంతో వనరుల సమీకరణ కోసం కాల్ చార్జీల పెంపునకు ఇవి మొగ్గుచూపనున్నాయి. యూజర్ నుంచి సగటు రాబడి రూ 180 కంటే తక్కువగా ఉండటం, ప్రపంచ దేశాలతో పోలిస్తే టెలికాంపై వినియోగదారులు వెచ్చించే మొత్తం భారత్‌లో తక్కువే కావడం వంటి అంశాలను పరిశీలిస్తే టెలికాం కంపెనీలు ఈ ఏడాది చివరిలో టారిఫ్‌లను 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ అంచనా వేశారు. కాగా గత నెలలో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, రిలయన్స్ జియో మూడేళ్లలో తొలిసారిగా కాల్ చార్జీలను 14 నుంచి 33 శాతం వరకూ పెంచిన సంగతి తెలిసిందే. టెలికాం కంపెనీలు ఇటీవల టారిఫ్‌ను పెంచినా వినియోగదారులు ఇప్పటికీ వారి కమ్యూనికేషన్ అవసరాలపై కేవలం 0.86 శాతం మాత్రమే తలసరి ఆదాయం వెచ్చిస్తున్నారని ఇది నాలుగేళ్ల కిందటి మొత్తంతో పోలిస్తే చాలా స్వల్పమని సెల్యులార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ అన్నారు. మరోవైపు డేటా అందుబాటులోకి రావడంతో మొబైల్ వినిమయం విపరీతంగా పెరిగిన క్రమంలో మొబైల్ బిల్లు కొంత అదనంగా చెల్లించేందుకు యూజర్లు వెనుకాడరని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ చెప్పుకొచ్చారు. చదవండి : జియో షాక్..కాల్ చేస్తే.. బాదుడే! -
యూజర్ల ’అన్క్లెయిమ్డ్’ మొత్తం విద్యానిధికే
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో యూజర్లు క్లెయిమ్ చేసుకోని డబ్బును నిర్దిష్ట కాలావధి తర్వాత ’టెలికం వినియోగదారుల విద్యా, రక్షణ నిధి’కి బదలాయించాలంటూ టెల్కోలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. సాధారణంగా .. అధికంగా వసూలు చేసిన చార్జీలను, సెక్యూరిటీ డిపాజిట్లు మొదలైనవి యూజర్లకు టెల్కోలు రిఫండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ కారణం వల్లనైనా రిఫండ్ చేయలేకపోయిన పక్షంలో ఆ మొత్తాన్ని టెలికం నిధికి జమ చేయాలి. కానీ, ఆపరేటర్లు డిపాజిట్ చేసే నగదు విషయంలో వ్యత్యాసాలు ఉంటున్నాయని ట్రాయ్ పరిశీలనలో తేలింది. దీనిపై టెల్కోలతో భేటీ అయింది. ఆడిటింగ్‌లో అధిక బిల్లింగ్ విషయం వెల్లడైనప్పుడు మాత్రమే కొన్ని టెల్కోలు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్లు తేలింది. అలాగే మరికొన్ని సంస్థలు లావాదేవీ ఫెయిలైన సందర్భాల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, ప్లాన్ చార్జీల వంటివి రీఫండ్ చేసేందుకు వినియోగదారుల వివరాలు సరిగ్గా దొరక్కపోయినప్పుడు, ఆ మొత్తాలను విద్యా నిధిలో జమ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై స్పష్టతనిచ్చేందుకు ట్రాయ్ తాజాగా సంబంధిత నిబంధనలను సవరించింది. అన్క్లెయిమ్డ్ మొత్తం.. ఏ కేటగిరీకి చెందినదైనా, పన్నెండు నెలల వ్యవధి లేదా చట్టబద్ధంగా నిర్దేశించిన గడువు పూర్తయిపోయిన పక్షంలో విద్యా నిధికి జమ చేయాలంటూ స్పష్టతనిచ్చింది. -
టెల్కోలకు ‘సుప్రీం’ షాక్
న్యూఢిల్లీ: దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల మేర బకాయీల భారం విషయంలో ఊరట లభించగలదని ఆశతో ఉన్న టెలికం సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీన్ని మరోసారి సమీక్షించేందుకు తగిన కారణాలేమీ లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. టెలికం కంపెనీలపై విధించిన వడ్డీ, జరిమానాలు సరైనవేనని అభిప్రాయపడింది. దీనిపై తదుపరి లిటిగేషనేదీ ఉండబోదని, టెలికం కంపెనీలు కట్టాల్సిన బకాయిల లెక్కింపు, చెల్లింపునకు నిర్దిష్ట గడువు ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడుకున్న బెంచ్ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఓపెన్ కోర్టు విధానంలో నిర్వహించాలని టెల్కోలు కోరినప్పటికీ.. ఇన్–చాంబర్ విధానంలోనే జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. తీర్పు నిరాశపర్చింది: భారతి ఎయిర్టెల్ ఏజీఆర్ బకాయీలపై పునఃసమీక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం తమను నిరాశపర్చిందని భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. దీనిపై క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ‘టెలికం పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం, స్పెక్ట్రం కొనుగోలు చేయడం, 5జీ వంటి కొంగొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం మొదలైన వాటిపై భారీగా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ఈ తీర్పు కారణంగా టెలికం పరిశ్రమ లాభదాయకత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం. అయితే దీనిపై మా నిరాశ కూడా తెలియజేదల్చుకున్నాం. ఏజీఆర్‌పై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదంపై మా వాదనలు సరైనవేనని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు వొడాఫోన్ ఐడియా కూడా క్యూరేటివ్ పిటిషన్ వేసే యోచనలో ఉంది. ఇంటర్నెట్ సంస్థలకు దెబ్బ: ఐఎస్‌పీఏఐ సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వు .. టెలికం సంస్థలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని, వాటిపై ఆధారపడిన ఇంటర్నెట్ సంస్థలకు ఇది పెద్ద దెబ్బని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌పీఏఐ) ప్రెసిడెంట్ రాజేశ్ ఛారియా వ్యాఖ్యానించారు. ‘రివ్యూ పిటిషన్ తిరస్కరణతో టెలికం రంగం మొత్తం రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వినియోగదారులకు ఎంత మాత్రం మంచిది కాదు. ఏజీఆర్ నిర్వచనాన్ని సమీక్షించే విషయంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోకపోతే చిన్న స్థాయి ఐఎస్పీల మనుగడ కష్టమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. వివాదమిదీ.. టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను మదింపు చేయడానికి ఉద్దేశించిన ఏజీఆర్ నిర్వచనం సరైనదేనంటూ గతేడాది అక్టోబర్ 24న కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల బాకీలు తడిసి మోపెడు కావడంతో టెలికం సంస్థలకు శరాఘాతంగా మారింది. దీని ప్రకారం చూస్తే వడ్డీలు, జరిమానాలు కలిపి.. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు జనవరి 23లోగా ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల మేర కట్టాల్సి రానుంది. ప్రభుత్వపరంగా మినహాయింపేదైనా లభిస్తుందేమోనని టెల్కోలు ఆశించినప్పటికీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు. టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల బకాయీలు కట్టాల్సి ఉందంటూ గతేడాది నవంబర్‌లో పార్లమెంటుకు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బకాయీల కింద రూ. 92,642 కోట్లు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) కింద రూ. 55,054 కోట్లు కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వడ్డీ, పెనాల్టీలను మాఫీ చేసే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, టెలికం శాఖ లెక్కింపు ప్రకారం.. వొడాఫోన్ ఐడియా బాకీలు రూ. 53,038 కోట్లు (రూ. 24,729 కోట్ల ఎస్‌యూసీ, రూ. 28,309 కోట్ల లైసెన్సు ఫీజు) కాగా, భారతీ ఎయిర్టెల్ బకాయీలు రూ. 35,586 కోట్ల మేర (రూ. 21,682 కోట్ల లైసెన్సు ఫీజు, రూ. 13,904 కోట్లు ఎస్‌యూసీ) ఉంటాయి. భారతి ఎయిర్‌టెల్‌లో విలీనమైన టెలినార్, టాటా టెలిసర్వీసెస్ బాకీలు విడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెలికం సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వడ్డీ, పెనాల్టీ, జరిమానాపై మళ్లీ వడ్డీ విధింపునకు సంబంధించిన అంశాలను పునఃసమీక్షించాలంటూ భారతీ ఎయిర్టెల్ కోరింది. ఈ రివ్యూ పిటిషన్లపైనే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. బాకీల విషయంలో ఊరట లభించకపోతే కంపెనీని మూసివేయక తప్పదంటూ వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా ఇప్పటికే ప్రకటించడంతో .. ప్రైవేట్ రంగంలో రెండే సంస్థలు మిగిలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. -
గంటకు దాదాపు రూ.రెండున్నర కోట్ల నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం తరచూ ఇంటర్నెట్ను నిలిపివేయడం వల్ల నెట్వర్క్ కంపెనీలు భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి. గంటకు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు నష్టపోతున్నట్టు సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ శుక్రవారం వెల్లడించారు. సీవోఏఐలో ఎయర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలు సభ్యులుగా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోనలు మరింత పెరగకుండా ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని 18 జిల్లాల్లో 24 గంటల పాటు ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో టిక్‌టాక్, ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా వదంతులు వ్యాప్తిచెందడాన్ని నిరోధించవచ్చని ప్రభుత్వ వర్గాల విశ్లేషణ. ఓ అధ్యయనం ప్రకారం ఇండియాలో సగటు ఇంటర్నెట్ వినియోగం నెలకు 10 జీబీ. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతేకాకుండా వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియా యాప్‌లకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగిన డేటా వినియోగం ప్రకారం టెల్కోలకు జరుగుతున్న నష్టాన్ని లెక్కిస్తే ఇంచుమించుగా గంటకు రెండున్నర కోట్లుగా తేలిందని రాజన్ వివరించారు. మరోవైపు సీఏఏపై వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తరచూ నెట్ సేవలను నిలిపివేయడంపై నెట్ ప్రియులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కేనన్న కేరళ హైకోర్టు తీర్పును వారు ఉటంకిస్తున్నారు. చదవండి: ఇంటర్నెట్ షట్‌డౌన్ @ 100 లోయలో ఇంటర్నెట్ ఎప్పుడు? -
ఇప్పటికీ భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక..
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కేబుల్.కో.యూకే అధ్యయనంలో ఇది వెల్లడైందని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చార్టును పోస్ట్ చేశారు. దీని ప్రకారం.. ఒక గిగాబైట్ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది. దేశీ టెల్కోలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయన్స్ జియో .. ఏకంగా 50%దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ మొబైల్ చార్జీల సమస్యంతా.. కుంభకోణాలతో అప్రతిష్ట పాలైన యూపీఏ ప్రభుత్వ ఘనతే. దాన్ని మేం సరిచేశాం. అధిక మొబైల్ ఇంటర్నెట్ చార్జీలు.. యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ట్రాయ్ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ను కూడా ప్రొఫెషనల్‌గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
టెల్కోలకు భారీ ఊరట
సాక్షి, న్యూడిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. -
ఆ టెల్కోలకు ప్యాకేజీలు అక్కర్లేదు
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ స్థాయిలో లైసెన్సు ఫీజులు బాకీలు కట్టాల్సి రానున్న పాత తరం టెల్కోలు .. ప్రభుత్వాన్ని బెయిలవుట్ ప్యాకేజీ కోరుతుండటంపై రిలయన్స్ జియో మండిపడింది. ఆ రెండు సంస్థలు (ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా) ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయని, ప్రజల సొమ్ముతో వాటికి ప్యాకేజీలేమీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా మూడు నెలల్లోగా బాకీలు కట్టేలా వాటిని ఆదేశించాలంటూ కేంద్రాన్ని కోరింది. టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు జియో ఈ మేరకు లేఖ రాసింది. ఒకవేళ ఆ రెండు సంస్థలకు ఏం జరిగినా(మూతబడినా).. ప్రభుత్వ రంగ టెల్కోలు కూడా కార్యకలాపాలు సాగిస్తున్నందున టెలికం రంగానికి నష్టమేమీ లేదని పేర్కొంది. సీవోఏఐ బ్లాక్మెయిల్... ‘రెండు సంస్థల స్వార్థ ప్రయోజనాల కోసం వాటి తరఫున వకాల్తా పుచ్చుకుని సీవోఏఐ కేంద్రానికి లేఖ రాసింది’ అని ఆక్షేపించింది. జియోపై సీవోఏఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ‘ఉద్యోగాలు పోతాయని, సేవల నాణ్యత తగ్గిపోతుందని, టెలికం రంగంలో పెట్టుబడులు ఆగిపోతాయని ప్రభుత్వానికి పంపిన లేఖలో సీవోఏఐ బెదిరింపు, బ్లాక్‌మెయిలింగ్ ధోరణి కనిపిస్తోంది. బాకీలు డిపాజిట్ చేయాలంటూ సుప్రీం కోర్టు మూడు నెలలు గడువిస్తే.. ఇలాంటివన్నీ చేయడం కోర్టు ధిక్కారానికి పాల్పడటమే అవుతుంది’ అని జియో పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ‘సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)’ లెక్కల్ని బట్టి ప్రభుత్వానికి టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రావొచ్చని అంచనా. పాత తరం టెల్కోలైన భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు, రిలయన్స్ జియో స్వల్పంగా రూ. 14 కోట్లు కట్టాల్సి రానుంది. భారత మార్కెట్ నుంచి తప్పుకోవడం లేదు: వొడాఫోన్ భారీ చెల్లింపులు జరపాల్సిన నేపథ్యంలో భారత మార్కెట్ నుంచి తప్పుకోబోతోందంటూ వచ్చిన వార్తలను బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార వదంతులేనని పేర్కొంది. అలాంటి యోచనేదీ తమకు లేదని, స్థానిక మేనేజ్మెంట్కు పూర్తి మద్దతు ఇస్తామని వొడాఫోన్ తెలిపింది. ఇప్పుడున్న గడ్డుకాలం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వ సహకారం కోరుతున్నామని వివరించింది. -
టెల్కోలకు భారీ ఊరట లభించనుందా?
సాక్షి, న్యూఢిల్లీ: టెల్కోల నుంచి భారీగా రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి సుప్రీంకోర్డు డాట్ (టెలకమ్యూనిషన్ల శాఖ)కు అనుమతించిన నేపథ్యంలో- ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులపై సమీక్షించి, తగిన సలహాలు ఇవ్వడానికి కేంద్రం మంగళవారం ఒక సెక్రటరీల కమిటీ (సీఓఎస్)ని ఏర్పాటు చేసింది. సుప్రీం రూలింగ్ నేపథ్యంలో- టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారే అవకాశం ఉందన్నజారే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. టెలికంకు భారీ బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపుతోందని, ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై సెక్రటరీల కమిటీ దృష్టి సారిస్తుందని వార్తలు వస్తున్నాయి. కమిటీకి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాల వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఎదుర్కొంటున్న ‘‘ఆర్థిక ఒత్తిడి’’ని ‘‘అన్ని కోణాల్లో’’ పరిశీలించి, తీవ్రతను తగ్గించడానికి సూచనలు ఇవ్వడానికి కమిటీ ఏర్పాటయినట్లు టెలికం వర్గాలు తెలిపాయి. ఆర్థిక, న్యాయ, టెలికం కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ త్వరలో సమావేశమై, ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో తన సిఫారసులను కేంద్రానికి సమర్పిస్తుందని సమాచారం. ప్యాకేజ్‌లో ఏముంటాయ్? స్పెక్ర్టమ్ చార్జీల తగ్గింపు ఉచిత మొబైల్ ఫోన్ కాల్స్‌కు ముగింపు చౌక డేటా టారిఫ్‌లకు సెలవు చెప్పడం నగదు లభ్యతలో ఇబ్బందులు తలెత్తకుండా 2020-21, 2021-22కు సంబంధించి స్పెక్ర్టమ్ వేలం చెల్లింపుల వాయిదా వేయడం. యూఎస్ఓఎఫ్ (యూనివర్షల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్) చార్జ్ని 3 శాతానికి తగ్గించడం. నేపథ్యం ఇదీ... కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. చదవండి : టెలికంలో భారీగా ఉద్యోగాల కోత -
టెలికంలో భారీగా ఉద్యోగాల కోత
సాక్షి, ముంబై: సవరించిన స్థూల ఆదాయం (ఏజిఆర్) పై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశీయ టెలికం కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. టెలికం సెక్టార్‌లోకి రిలయన్స్ జియో రాకతో కుదేలైన ఈ రంగానికి ఏజీఆర్‌పై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఏకీభవించిన సుప్రీం కోర్టు తీర్పు అశనిపాతంలా తగిలింది. టెలికాం (డాట్) విభాగానికి టెల్కోస్ రూ .92,641 కోట్లను వడ్డీతో సహా చెల్లించాల్సిందేనన్న సుప్రీం తీర్పు ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న టెల్కోల లాభదాయకతను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దీంతో టెలికాం కంపెనీలు తమ శ్రామిక శక్తిని 20 శాతం తగ్గించాల్సి ఉంటుంది. అంతేకాదు రానున్న కాలంలో ఉద్యోగులను తీసివేసే శాతం మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజిఆర్) వివాదంలో తాజా తీర్పు ప్రకారం టెలికం రంగం మొత్తం సుమారు రూ 1.3 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లో ప్రభుత్వానికి చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. దీంతో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే వరకు తాజా నియామకాలు చేపట్టరాదనే నిర్ణయంతోపాటు, ఉన్న ఉద్యోగాల్లో కూడా కోతలకు మొగ్గు చూపుతున్నాయి. రాబోయే ఆరు నెలల్లో భారత టెలికాం రంగంలో సుమారు 40వేల ఉద్యోగాల కోతకు దారితీయనుంది. అంతేకాదు ఆపరేటర్లలో ఎవరైనా దివాలా కోసం దాఖలు చేస్తే మరింత పెరగవచ్చు అని సీఐఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ డైరెక్టర్, సీఈఓ ఆదిత్య నారాయణ మిశ్రా చెప్పారు. టెల్కోస్, టవర్స్ కంపెనీలు ,ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎఎస్‌పీ) లను కలిగి ఉన్న ఈ రంగంలో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, చాలా ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. కొన్ని కంపెనీలు దివాలా తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో మధ్య నుండి సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని ఆయన అన్నారు. అలాగే గత మూడేళ్ళలో, నియామకం గణనీయంగా తగ్గింది. సీనియర్ స్థాయిలో పదవులు భర్తీ కావడంలేదనీ హెచ్ కన్సల్టెంట్ ఒకరు చెప్పారు. ప్రధానంగా భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి సంస్థల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కానుంది. డాట్ గణాంకాల ప్రకారం ఎయిర్టెల్ మొత్తంలో 23.4 శాతం (రూ. 21,682 కోట్లు) చెల్లించాల్సి ఉండగా, వొడాఫోన్ ఐడియా 30.55 శాతం (రూ. 28,308 కోట్లు) చెల్లించాల్సింది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను నవంబర్ 14 వరకు వాయిదా వేయవలసి వచ్చింది. ఉదాహరణకు, జూన్ 2019 తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్టెల్ 2,392.2 కోట్ల రూపాయల నికర నష్టాలను నమోదు చేసింది. వోడాఫోన్ ఐడియా త్రైమాసికంలో రూ .4,873.9 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కాగా 2016 సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో ఎంట్రీ తరువాత రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టెలినార్ లాంటి ఇతర సంస్థలు మూతతో ఈ రంగం పరిమాణం 30 శాతానికి పైగా తగ్గిపోయింది. అలాగే వొడాఫోన్, ఐడియా విలీనం తరువాత భారీ సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. మరోవైపు ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులను సమీక్షించి, తగిన సలహాలిచ్చేందుకు కేంద్రం ఒక సెక్రటరీల కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆధ్వర్యంలో ఈ కమిటి ఏర్పాటైన సంగతి తెలిసిందే. చదవండి : టెల్కోలకు భారీ ఊరట లభించనుందా? -
పెరిగిన టెల్కోల ఆదాయాలు
న్యూఢిల్లీ: గడిచిన అయిదేళ్లలో మొబైల్ డేటా చార్జీలు ఏకంగా 95 శాతం తగ్గాయి. జీబీకి రూ.11.78 స్థాయికి దిగివచ్చాయి. అయితే టెలికం ఆపరేటర్ల సంచిత ఆదాయం మాత్రం 2.5 రెట్లు పెరిగి రూ. 54,671 కోట్లకు చేరింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2014లో దేశీయంగా డేటా వినియోగం 828 మిలియన్ జీబీగా ఉండగా, 2018లో ఇది 56 రెట్లు పెరిగి 46,404 మిలియన్ జీబీకి పెరిగింది. అలాగే యూజర్లపరంగా సగటు డేటా వినియోగం 0.27 జీబీ నుంచి 7.6 జీబీ దాకా పెరిగింది. ఇక ప్రతి యూజరుపై సగటు ఆదాయం 2014లో రూ. 71.25గా ఉండగా 2018లో ఇది రూ. 90.02కి చేరింది. 2014లో వైర్లెస్ డేటా యూసేజి విభాగం ద్వారా మొత్తం ఆదాయం రూ. 22,265 కోట్లు రాగా.. గతేడాది రూ. 54,671 కోట్లకు చేరినట్లు ట్రాయ్ నివేదిక పేర్కొంది. మరోవైపు, యూజరుకు వైర్లెస్ డేటా ఖరీదు సగటున రూ. 269 (జీబీకి) నుంచి రూ. 11.78కి పడిపోయిందని వివరించింది. -
టెల్కోలకు రూపాయి దెబ్బ
ముంబై: తీవ్ర పోటీతో సతమతమవుతున్న టెలికం రంగానికి తాజాగా రూపాయి పతనం, డీజిల్ రేట్లు తలనొప్పిగా మారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి పతనం కారణంగా టెల్కోలపై రూ.4,000 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇక పెరిగే డీజిల్ రేట్ల మూలంగా నిర్వహణ వ్యయాలూ పెరిగి కంపెనీల లాభదాయకత మరో రూ.2,000 కోట్లు మేర తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల పైగా రుణభారంతో అల్లాడుతున్న టెల్కోలకు ఇది మరింత భారంగా మారనుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం మూలంగా టెల్కోల ఎబిటా (పన్నుకు ముందు ఆదాయం) 7–8 శాతం మేర తగ్గవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ హర్‡్ష జగ్నాని తెలిపారు. ఇక డీజిల్ అంశం కూడా తోడైతే ఇది మొత్తం పది శాతం దాకా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రూపాయి క్షీణత మూలంగా విదేశీ మారకంలో తీసుకున్న రుణాల రీపేమెంట్ మరింత పెరుగుతుందని, ఇక నెట్వర్క్ విస్తరణ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ వ్యయాలు కూడా పెరుగుతాయని ఆయన తెలియజేశారు. 2018 మార్చి 31 నాటికి పరిశ్రమ మొత్తం రుణ భారం రూ. 4.7 లక్షల కోట్లుగా ఉండగా... ఇందులో విదేశీ రుణం సుమారు రూ.1 లక్ష కోట్ల దాకా ఉంది. దీనిలో మళ్లీ 70 శాతం రుణాలు డాలర్ మారకంలోనే ఉన్నాయి. ఇదే టెల్కోలను కలవరపెడుతోంది. టవర్ కంపెనీలకు కూడా సెగ.. దేశీయంగా 4.7 లక్షల టెలికం టవర్లుండగా... వీటిలో సుమారు పావు శాతం టవర్లు మాత్రమే నామమాత్రపు డీజిల్ వాడకంతో నడుస్తున్నాయి. మిగతావన్నీ ప్రధానంగా డీజిల్‌పై ఆధారపడినవే. ప్రస్తుతం రేట్ల పెరుగుదల వల్ల టెలికం టవర్ సైట్ల ఇంధనాల వ్యయాలు పెరగనున్నాయి. సాధారణంగా టవర్ సైట్ల నిర్వహణకు సంబంధించి డీజిల్ వ్యయాలు పరిశ్రమకు సుమారు రూ.13,000 కోట్ల మేర ఉంటోంది. డీజిల్ రేట్లు సుమారు 15 శాతం పెరిగిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఎబిటాపై 3–4% ప్రభావం పడి... కంపెనీల ఎబిటా దాదాపు రూ. 2,000 కోట్ల మేర తగ్గనుంది. ఒకవైపు.. రిలయన్స్ జియో ప్రారంభించిన రేట్ల యుద్ధంతో భారతి ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు ఇప్పటికే నష్టాలు నమోదు చేస్తున్నాయి. ఇక దీనికి రూపాయి, డీజిల్ కూడా తోడైతే ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. డీజిల్ రేట్ల పెరుగుదల సెగ కేవలం టెలికం ఆపరేటర్లకే కాకుండా కొన్ని టవర్ కంపెనీలకు కూడా తగలనుంది. టవర్ సైటు ఇంధన వ్యయాలను కొన్ని సందర్భాల్లో టవర్ కంపెనీలు, టెల్కోలు కలిసి భరిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా టవర్ కంపెనీల నిర్వహణ వ్యయాల్లో విద్యుత్, ఇంధన వ్యయాల వాటా 30–40% ఉంటుంది. తమ ఒప్పందాలను బట్టి డీజిల్ రేట్ల పెరుగుదలలో కొంత భాగాన్నే టవర్ కంపెనీలు.. టెల్కోలకు బదలాయించగలుగుతాయి. అయితే, సౌర విద్యుత్, ఫ్యూయల్ సెల్స్ వంటి పునరుత్పాదక విద్యుత్ వనరులను వినియోగిస్తూ.. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నందున రేట్ల భారం మరీ భారీ స్థాయిలో ఉండకపోవచ్చని టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. 2011–12 లో ఒక్కో టవర్ నిర్వహణకు ఒక్కో సంస్థ రోజుకు 7.34 లీటర్ల డీజిల్ ఖర్చు పెట్టేదని, ఇది 2015–16 నాటికి 4 లీటర్లకు తగ్గిపోయిందని వివరించాయి. రూపాయికి మరింత చిల్లు డాలర్‌తో 74.39కు పతనం చమురు ధరల తాజా పెరుగుదల ప్రభావం ముంబై: రూపాయి మరింత బలహీనపడింది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో మరో 33 పైసలు కోల్పోయి నూతన జీవిత కాల కనిష్ట స్థాయి 74.39వద్ద ముగిసింది. అధిక చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం రూపాయి బలహీనతకు కారణమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో బ్యాంకులు, ఎగుమతిదారులు చేసిన డాలర్ల అమ్మకాలతో రూపాయి 18పైసలు కోలుకుని 73.88 వరకు వెళ్లింది. అయితే, బ్రెంట్ క్రూడ్ మరోసారి 84 డాలర్ల మార్కుపైకి వెళ్లడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడడంతో రూపాయి యూటర్న్ తీసుకుని నష్టాలవైపు ప్రయాణించింది. సోమవారం కూడా 30 పైసల నష్టంతో రూపాయి 74.06 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. విదేశీ నిధులు భారీగా బయటకు వెళ్లిపోవడం రూపాయిపై ప్రభావం చూపించినట్టు ఫారెక్స్ ట్రేడర్ల అభిప్రాయం. దిగుమతిదారుల నుంచి డాలర్లకు బలమైన డిమాండ్, ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళన, పెరిగే చమురు ధరలు కూడా ప్రభావం చూపించినట్టు చెప్పారు. ‘‘బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రతికూలంగా మారడంతో రూపాయి గడిచిన రెండు నెలల్లో వేగంగా బలహీనపడింది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఆసియాలో ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి డాలర్‌తో ఎక్కువగా నష్టపోయింది’’ అని నోమురా తన పరిశోధన నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ నుంచి విధానపరమైన చర్యల్లేకపోవడం రూపాయిపై ఆందోళనలను పెంచినట్టు తెలిపింది. చమురు ధరల క్షీణత ఒక్కటే రూపాయి ఈ సమయంలో స్థిరపడేందుకు సాయపడుతుందని పేర్కొంది. ‘‘అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి. పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 3.26 శాతానికి పెరిగింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకుని అమెరికా ట్రెజరీల్లో ఇన్వెస్ట్ చేస్తారన్న భయాలు ఉన్నాయి. చమురు ధరలు కూడా ఒక శాతం పెరిగి 84.7 డాలర్లకు చేరాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ వీకే శర్మ తెలిపారు. -
టెల్కోలకు భారీ జరిమానా : జియోకు ఎంతంటే?
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దేశీయ టెలికాం దిగ్గజాలకు మరోసారి షాక్ ఇచ్చింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంలో లోపాల కారణంగా భారతి ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా కంపెనీలకు ట్రాయ్ భారీ జరిమానా విధించింది. వివిధ సేవల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుందని పీటీఐ నివేదించింది. 2017, అక్టోబరు 1 నుంచి సేవల (QoS) ప్రమాణాలను నిబంధనలను కఠినతరం చేసిన రెగ్యులేటరీ జనవరి-మార్చిలో సేవాల లోపాలకు సంబంధించి ఈ పెనాల్టీ విధించింది. ముఖ్యంగా టెలికాం మార్కెట్ సంచలనం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు రూ.34 లక్షలు భారీ జరిమానా విధించింది. అలాగే భారతి ఎయిర్‌టెల్‌కు రూ.11 లక్షలు ఐడియా సెల్యులార్కు రూ.12.5 లక్షలు, వొడాఫోన్ ఇండియాకు రూ.4 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. అయితేతాజా జరిమానాపై టెల్కోలు ఇంకా స్పందించాల్సి ఉంది. -
టెలికాంకు టారిఫ్ వార్ దెబ్బ: 2018 ఆర్థిక సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని 2017-18 ఆర్థికసర్వే విశ్లేషించింది. ముఖ్యంగా టెలికాం రంగంలోకి కొత్తగా ప్రవేశించిన రిలయన్స్ జియో మార్కెట్ సంక్షోభానికి కారణమైందని పేర్కొంది. ఇతర కారణాలతోపాటు టారిఫ్ వార్ టెలికాం సేవల సంస్థలను దెబ్బతీసిందని చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త టెలికాం పాలసీ తీసుకొస్తోందని చెప్పింది. దీని రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. 2018 లో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని విడుదల చేయనుందని సర్వే వెల్లడించింది. అలాగే రెగ్యులేటరీ, లైసెన్సింగ్ విధానాలు, కనెక్టివిటీ, సేవల నాణ్యత, వ్యాపార సరళీకరణ, 5జీ సేవలు, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ లాంటి కొత్త టెక్నాలజీపై ఈ కొత్త విధానం దృష్టిపెట్టాలని సర్వే సూచించింది. భారీ అప్పులు, తారిఫ్ వార్, అసంబద్ధమైన స్పెక్ట్రం చార్జీలు టెల్కోలను దెబ్బతీశాయని వ్యాఖ్యానించింది. టెలికాం మార్కెట్లో తక్కువ ధరలతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో మార్కెట్లో సంక్షోభం ఏర్పడిందనీ, దీని కారణంగా ఇతర కంపెనీల ఆదాయం పడిపోయిందని తెలిపింది. ఈ సంక్షోభం పెట్టుబడిదారులు, రుణదాతలు, భాగస్వాములతోపాటు ఈ టెలికాం కంపెనీల వెండార్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందని సర్వే పేర్కొంది. అయితే హేతుబద్ధమైన స్పెక్ట్రం వేలం, ఇతన ఖర్చుల హేతుబద్ధీకరణ ద్వారా దీన్ని నియంత్రించాలని సర్వే సిఫార్సు చేసింది. కాగా సెప్టెంబరు 2017 ముగిసే నాటికి, మొత్తం వినియోగదారుల సంఖ్య 1,207.04 మిలియన్లుగా ఉంది. అందులో 501.99 మిలియన్ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాలు నమోదు కాగా 705.05 మిలియన్ల కనెక్షన్లు పట్టణ ప్రాంతాలవి. -
తీవ్ర పోటీ : 90వేల మంది ఉద్యోగాలు గోవింద
టెలికాం మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో ప్రవేశం అనంతరం టెలికాం కంపెనీలు తీవ్ర అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తమ రెవెన్యూలను కాపాడుకోలేక సతమతమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో కూడా భారీగా ఉద్యోగాల కోత చేపట్టనున్నాయని తాజా రిపోర్టు వెల్లడించింది. దాదాపు 80వేల నుంచి 90వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పోటీ వాతావరణం పెరుగడంతో పాటు, మార్జిన్లు తగ్గడంతో, కంపెనీలకు లాభాలు పడిపోయాయని, దీంతో భారీగా ఉద్యోగాల కోత చేపట్టనున్నాయని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ రిపోర్టు పేర్కొంది. ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారబోతుందని పేర్కొంది. 65 టెల్కోల, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి టెలికాం కంపెనీల వరకు సీనియర్, మధ్యస్థాయి ఉద్యోగులపై ఈ సర్వే చేపట్టింది. గతేడాది 40వేల మంది టెలికాం రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని, ఈ ట్రెండ్ వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు కొనసాగుతుందని, దీంతో 80వేల నుంచి 90వేల మంది ఉద్యోగాలు కోల్పోతారని పేర్కొంది. వచ్చే రెండు నుంచి మూడు క్వార్టర్ల వరకు అట్రిక్షన్ రేటు ఎక్కువగానే ఉంటుందని బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య నారాయణ్ మిశ్రా చెప్పారు. ఈ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులు తమ కెరీర్ గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. లోన్ సర్వీసింగ్‌లో ఎక్కువ వ్యయాలు, మార్కెట్ షేరులో తీవ్ర పోటీ, విలీనాలతో అనిశ్చితకర పరిస్థితులు వంటివి ఉద్యోగాల కోతపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఇతర రంగాలతో పోలిస్తే, ఈ రంగంలో వేతనాల పెంపు అంతంతమాత్రంగానే ఉందని కూడా రిపోర్టు పేర్కొంది. ఈ రంగంలో ఉద్యోగాలతో అనిశ్చిత పరిస్థితులతో ఉద్యోగులు వేరే రంగాలపై మొగ్గుచూపుతున్నారని తెలిపింది. -
టెల్కోలకు మరో షాక్ : ఆ ఛార్జీలు సగం కట్
న్యూఢిల్లీ : మొబైల్ టెర్మినేషన్ కాల్‌ఛార్జీలను భారీగా తగ్గించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెల్కోలకు మరో షాకివ్వబోతుంది. ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీలను కూడా సగం తగ్గించబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నిమిషానికి 53 పైసలుగా ఉన్న ఈ ఛార్జీలను 25 నుంచి 30 పైసలకు తగ్గించబోతున్నారని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఈ విషయంపై ట్రాయ్ నేడు ఓ ప్రకటన విడుదల చేయబోతున్నట్టు కూడా పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీలను ఓ టెలికాం ఆపరేటర్, కాల్ టర్మినేట్ చేసే సర్వీసు ప్రొవైడర్‌కు చెల్లిస్తారు. మొబైల్స్, ల్యాండ్‌లైన్ కాల్స్ అన్నింటికీ ఈ ఛార్జీలను చెల్లిస్తారు. ఈ ఛార్జీను ఇంటర్నేషనల్ ఆపరేటర్ తన సబ్‌స్క్రైబర్ నుంచి రికవరీ చేసుకుంటారు. 2015 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీలను నిమిషానికి 40 పైసల నుంచి 53 పైసలకు ట్రాయ్ పెంచింది. అదే సమయంలో మొబైల్ టర్మినేషనల్ ఛార్జీలను మాత్రం నిమిషానికి 20 పైసల నుంచి 14 పైసలకు తగ్గించింది. ప్రస్తుతం మొబైల్ టర్మినేషన్ ఛార్జీలను మరింత కిందకి 6 పైసలకు తీసుకొస్తున్నట్టు 2017 సెప్టెంబర్ 19న తెలిపింది. ఈ ఛార్జీలను జీరో చేయాలని యోచిస్తున్నట్టు ట్రాయ్ పేర్కొంది. అయితే 2017 సెప్టెంబర్ 19న మాత్రం ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీల సమీక్షను తర్వాత చేపడతామని తెలిపింది. ఈ విషయంపై ప్రత్యేక నియంత్రణ అవసరమని అథారిటీ వెల్లడించింది. అయితే తాజాగా ట్రాయ్ తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై ఇంటర్నేషనల్ టెలికాం సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజోన్ హర్షం వ్యక్తంచేస్తుండగా.. దేశీయ టెలికాం ఆపరేటర్ల మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. మరోసారి తమ రెవెన్యూలకు గండిపడబోతుందని టెల్కోలు ఆందోళనలు వ్యక్తంచేస్తున్నాయి. -
జియో వల్ల భారీగా పెట్టుబడులు రైటాఫ్
రిలయన్స్ జియో ఉచిత వాయిస్, డేటా ఆఫర్ల వెల్లువ టెలికాం కంపెనీలను భారీగా దెబ్బతీసింది. దాదాపు 50 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను టెలికాం కంపెనీలు రైటాఫ్ చేసినట్టు భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ తెలిపారు. ఇన్ని కోట్ల మేర పెట్టుబడుల రైటాఫ్‌కు ప్రధాన కారణం జియో ఉచిత కాల్స్, డేటా ఆఫర్లేనని పేర్కొన్నారు. అయితే టెలికాం ఇండస్ట్రీలో వేగంగా జరిగిన కన్సాలిడేషన్‌తో భారతీ ఎయిర్టెల్ లబ్ది చెందిందని చెప్పారు. నెంబర్ 2 వొడాఫోన్, నెంబర్3 ఐడియాలు విలీనం అపూర్వమైనదని, కానీ రెండు బలమైన కంపెనీల విలీనాన్ని మనం చూడటం లేదని మిట్టల్ అన్నారు. ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్, ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసే ప్రక్రియపై చర్చలు జరుపుతోంది. ఎయిర్‌సెల్ అంతకముందు, ఆర్‌కామ్‌లో విలీనమవ్వాలనుకుంది. కానీ ఆ విలీనం చివరి దశలో రద్దయింది. ట్రేడింగ్ డీల్ ద్వారా రూ.3,500 కోట్లకు ఎనిమిది సర్కిళ్లలో 2300 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లో ఎయిర్‌సెల్ 4జీ ప్రసారాలను ఎయిర్టెల్ గతేడాది కొనుగోలు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో జియో ప్రవేశం అనంతరం దేశీయ టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి టారిఫ్ రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జియో ఛార్జీలు విధించడం ప్రారంభించింది. అయితే వాయిస్ కాల్స్ మాత్రం జీవితకాలం ఉచితం. జియో వల్ల ఏర్పడిన ధరల యుద్ధంతో టెల్కోల రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే వొడాఫోన్, ఐడియాలు విలీనం కాబోతున్నాయి. ఆర్‌కామ్, ఎయిర్‌సెల్‌లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. -
టెల్కోలకు షాక్: జియో మరో యుద్ధం
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో మరో యుద్ధానికి తెరతీయబోతుంది. ఇప్పటికే టెల్కోలకు ముప్పు తిప్పలు పెడుతున్న జియో, తాజాగా ఇంటర్నేషనల్ కాల్స్‌పై కూడా యుద్ధానికి దిగబోతుంది. అంతర్జాతీయ కాల్ టెర్మినేషన్ రేట్ల(ఐటీఆర్)ను నిమిషానికి 6 పైసలు, తర్వాత జీరోకి తీసుకురావాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, టెలికాం రెగ్యులేటరీని కోరుతోంది. ప్రస్తుతమున్న ఛార్జీలను 53 పైసల నుంచి రూ.1కి పెంచాలని జియో ప్రత్యర్థి కంపెనీలు కోరుతున్న క్రమంలో జియో ఈ మేర అభ్యర్థనను టెలికాం రెగ్యులేటరీ ముందుంచడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే దేశీయంగా విధించే ఐయూసీ ఛార్జీలను ట్రాయ్, 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించింది. 2020 నాటికి వాటిని జీరో చేయనున్నట్టు కూడా ప్రకటించింది. దీంతో టెల్కోలు భారీ రెవెన్యూలను కోల్పోతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ కాల్ టెర్మినేషన్ రేట్లను కూడా జియో తగ్గించాలని కోరడం టెల్కోలను మరింత నష్టాల్లోకి దిగజార్చనుంది. అంతర్జాతీయ ఇన్కమింగ్ కాల్స్ ద్వారా రూ.5000 కోట్ల వరకు రెవెన్యూలు వస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు 60 శాతానికి పైగా దేశీయ వైర్లెస్ యూజర్ బేస్‌ను కలిగి ఉన్నాయి. దీంతో ఐటీఆర్ రేట్లను తగ్గించడం, టెలికాం కంపెనీలను మరోసారి భారీగా దెబ్బకొట్టనుందని తెలుస్తోంది. ఈ రేటును ఫారిన్ క్యారియర్, స్థానిక ఆపరేటర్‌కు చెల్లిస్తారు. ఓటీటీ కాల్స్(వాట్సాప్ కాల్స్, ఫేస్‌టైమ్ ఆడియో..) పాపులారిటీ పెరిగిపోతుండటంతో, జియో ఐటీఆర్ రేట్లను తగ్గించాలని కోరుతోంది. ఐటీఆర్ రేట్లు తగ్గితే, భారత్‌కు చేసే కాల్స్ రేట్లు కూడా తగ్గిపోనున్నాయి. -
ఎక్స్ క్లూజివ్ డేటా ప్యాక్: ఏడాదంతా
రోజుకో కొత్త ప్లాన్స్ తో వినియోగదారులను మురిపిస్తున్న టెల్కోలకు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఓ కొత్త సూచన చేసింది. మొబైల్ ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్న డేటా ప్లాన్స్ లో కనీసం ఒక్క డేటా ప్యాక్ అయిన ఏడాది కాలపరిమితితో తీసుకురావాలని పేర్కొంది. ఏడాది పాటు కాలపరిమితితో కూడిన డేటా ప్యాక్ లను ఆఫర్ చేసేందుకు టెల్కోలకు ట్రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, కంపెనీలు మాత్రం దీర్ఘకాల వాలిడిటీ ప్యాక్ లవైపు తగిన శ్రద్ధ చూపడం లేదు. గరిష్టంగా 90 రోజులున్న మొబైల్ డేటా ప్యాక్ ల పరిమితిని 365 రోజులకు పెంచుతూ రెగ్యులేటరి గత 10 నెలల క్రితమే తన ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపి 10నెలలు కావస్తున్నా చాలా కంపెనీలు ఏడాది ప్యాక్ లను ఆఫర్ చేయడం లేదు. ఇటీవలే దీర్ఘకాలిక మొబైల్ డేటా ప్యాక్ లు, స్పెషల్ టారిఫ్ ఓచర్లపై సమీక్ష చేపట్టిన ట్రాయ్, ఈ విషయాన్ని నోటీసు చేసింది. కొన్ని ఆపరేటర్లు మాత్రమే 365 రోజుల వాలిడిటీతో స్పెషల్ టారిఫ్ ఓచర్లు తీసుకొస్తున్నాయని, కానీ చాలా ఆపరేటర్లు ఉన్న డేటా బెనిఫిట్లనే తరువాతి రీఛార్జ్ లతో 12 నెలల వరకు పొడిగిస్తూ వెళ్తున్నాయని ట్రాయ్ గుర్తించింది. కానీ ఎలాంటి డేటా ఎస్టీవీలను 90రోజుల కంటే ఎక్కువ వ్యవధిలో తీసుకురావడం లేదని ట్రాయ్ తెలిపింది. అన్ని టెలికాం సర్వీసు ప్రొవేడర్లు ఒకే పేమెంట్ విధానంతో కనీసం ఒక ఎస్టీవీనైనా తీసుకురావాల్సిందేనని ట్రాయ్ తాజాగా వారిని ఉద్దేశించి ఓ అడ్వైజరీ జారీచేసింది. ఈ ప్యాక్ లో 365 రోజులకు ఎక్స్ క్లూజివ్ డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని పేర్కొంది. మరో నెల లేదా రెండు నెలలో దీనిపై సమీక్ష చేపడతామని, ఆపరేటర్లు స్పందించే తీరును బట్టి తదుపరిచర్యలు చేపడతామని ట్రాయ్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచడంతో పాటు తొలిసారి ఇంటర్నెట్ వినియోగించే వారిని ఆకర్షించేందుకు ట్రాయ్ దీన్ని తీసుకొచ్చింది. -
ఆల్-టైమ్ హై: టెల్కోలకు షాకిచ్చిన జియో
టెలికాం మార్కెట్ ను ఓ కుదుపు కుదిపేస్తున్న రిలయన్స్ జియో మరోసారి రికార్డు బద్దలు కొట్టింది. 4జీ నెట్ వర్క్ స్పీడులో టెల్కోలకు షాకిచ్చింది. ఆల్-టైమ్ హై డౌన్ లోడ్ స్పీడును రికార్డు చేసింది. సెకనుకు 19.12 మెగాబిట్ స్పీడుతో ఏప్రిల్ నెలలో టాప్ లో నిలిచిన రిలయన్స్ జియో, ఫాస్టెస్ట్ 4జీ నెట్ వర్క్ గా పేరుతెచ్చుకున్నట్టు ట్రాయ్ రిపోర్టు వెల్లడించింది. రియల్-టైమ్ బేసిస్ లో మై స్పీడు అప్లికేషన్ ద్వారా సేకరించిన డేటాతో డౌన్ లోడ్ స్పీడును ట్రాయ్ గణించింది. సాధారణంగా ఐతే, 16ఎంబీపీఎస్ స్పీడుతో ఒక బాలీవుడ్ సినిమాను ఐదు నిమిషాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ స్పీడు కంటే అత్యధిక మొత్తంలో జియో డౌన్ లోడ్ స్పీడు రికార్డైంది. వరుసగా నాలుగో నెలలోనూ రిలయన్స్ జియోనే ఈ స్పీడు చార్ట్ లో టాప్ లో నిలవడం విశేషం. మార్చి నెలలో జియో స్పీడు 18.48 ఎంబీపీఎస్. రిలయన్స్ జియో తర్వాత ఐడియా సెల్యులార్ నెట్ వర్క్ స్పీడు 13.70ఎంబీపీఎస్ కు పెరిగింది. వొడాఫోన్ నెట్ వర్క్ 13.38ఎంబీపీఎస్ ఉంది. నెలవారీ ట్రెండ్ ప్రకారం ట్రాయ్ పోర్టల్ లో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్ టెల్ ఏప్రిల్ నెలలో 10.15 ఎంబీపీఎస్ స్పీడును కలిగిఉంది. -
జియో ఎఫెక్ట్: చైనా ఆపరేటర్లు కూడా...
-
జియో ఎఫెక్ట్: చైనా ఆపరేటర్లు కూడా...
న్యూడిల్లీ: రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉచిత కాలింగ్ సేవలు, డేటా అంటూ తారిఫ్ వార్ ను మొదలుపెట్టిన జియో బాటలోకి మిగిలిన దేశీయదిగ్గజ టెలికాం కంపెనీలు అనివార్యంగా ఎంట్రీ ఇస్తున్నాయి. ముఖ్యంగా భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి మొబైల్ ఆపరేటర్లు తమ ఖాతాదారులను వివిధ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా చైనాకు చెందిన మూడు మొబైల్ ఆపరేటర్లు దేశీయ రోమింగ్ చార్జీలు రద్దుచేయడానికి నిర్ణయించుకున్నారు. మొబైల్ ఆపరేటర్ల సంఘమైన గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ (జీఎస్ఎంఏ) ఈ విషయాన్ని ప్రకటించింది. దేశీయ రోమింగ్ చార్జీలపై తామిచ్చిన పిలుపునకు ఈ మేరకు చైనా ప్రముఖ ఆపరేటర్ల నుండి అద్భుతమైన మద్దతు లభించిందని ప్రపంచంలో అతిపెద్ద టెలికాం మార్కెట్ అధ్యక్షుడు సునీల్ మిట్టల్ చెప్పారు. చైనా టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్, చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ కార్ప్ , చైనా యునైటెడ్ నెట్వర్క్ కమ్యునికేషన్స్ గ్రూప్ ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఇంటర్ ప్రావిన్స్ రోమింగ్ చార్జీలను రద్దుచేయనున్నట్టు ప్రకటించారు. బిల్లుల భారాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుడికి సౌలభ్యంతో పాటు ప్రోత్సాహాన్ని అందివ్వనున్నట్టు తెలిపారు. ఇతరదేశాల్లోని వివిధ ఆపరేటర్లు కూడా చైనాను ఉదాహరణగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 1 నుంచి, జియో దాని సేవలకు చార్జీలను ప్రారంభిస్తుంది. ఇవి ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ .19, పోస్ట్ పెయిడ్ వాటిని కోసం రూ 149 నుంచి ప్రారంభం. జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్ ద్వారా స్పెషల ప్యాక్‌లను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఎయిర్ టెల్ నేషనల్ రోమింగ్ చార్జీలు రద్దుకానున్నాయి. అలాగే 90 శాతం వరకు అంతర్జాతీయ రోమింగ్ ఛార్జీలు తగ్గిస్తుంది. నేషనల్ ఇన్కమింగ్ రోమింగ్ ఛార్జ్ ప్రస్తుతం ఒక నిమిషం 45పైసలుగా ఉండగా, అవుట్ గోయింగ్ కాల్స్ ఛార్జీలు రద్దుకానున్నాయి. కాగా గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య 'జీఎస్ఎంఏ' చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ దేశీయ అతి పెద్ద మొబైల్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కు చైర్మన్ గా కూడా ఉన్నారు. గత ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన సునీల్ రెండేళ్లపాటు జీఎంఎస్‌ఏ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఎస్‌ఎంఏకు చైర్మన్ అయిన తొలి భారతీయుడు మిట్టల్ కావడం విశేషం. -
వారంలోగా ప్లాన్ సిద్ధంచేయాలని టెల్కోలకు ఆదేశం
నగదు రహిత లావాదేవీల పెంపుపై ఐటీ మంత్రిత్వశాఖ దృష్టిసారించింది. నగదు రహిత లావాదేవీలు పెంపుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని మొబైల్ టెలిఫోన్ సర్వీసు కంపెనీలను ఎలక్ట్రానిక్స్ అండ్ ఎన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించారు. వారంలోగా తమ ప్రణాళికలు తయారుచేయాలని సూచించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మంత్రి శుక్రవారం నిర్వహించిన జియో, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్తో పాటు మరికొందరి టెల్కోల భేటీలో మంత్రి ఈ విషయాలు స్పష్టంచేసినట్టు అధికారులు పేర్కొన్నారు. . డిజిటల్ పేమెంట్ల ప్రకటనతో పాటు, ఫీచర్ల ఫోన్లనలో కూడా ఈ-పేమెంట్ల చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. వారంలోగా ప్రణాళికను తయారుచేసేందుకు వొడాఫోన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పలు పరిష్కార మార్గాలను కూడా టెల్కోలు సూచించాలని ఆయన కోరారు. ఈ విషయంలో తమకు సాధ్యమైనంత రీతిలో టెల్కోలకు సాయపడతామని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి చెప్పారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డిజిటలైజ్ సర్వీసులను అందించడానికి టెల్కోలు అత్యవసరంగా వారి సదుపాయాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టెల్కోలు కనెక్టివిటీ సమస్యతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. వెంటనే తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలని ప్రభుత్వ రంగ కంపెనీ బీఎస్ఎన్ఎల్ను కూడా ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సర్వీసుల ప్రారంభించడానికి అనువుగా టెలికాం కంపెనీలు సన్నద్ధమవ్వాలని ఆదేశించినట్టు అధికారులు చెప్పారు. -
13 శాతం పెరిగిన టెల్కోల ఆదాయం
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సేవల రంగ సంస్థల స్థూల ఆదాయం 13 శాతం జంప్ చేసింది. జూన్ 2016 తో ముగిసిన త్రైమాసికంలో గ్రాస్ రెవెన్యూ (జీఆర్) రూ 73,344 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. అలాగే సర్దుబాటు చేసిన నికర రాబడి (ఎడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఏజీఆర్) 9.2శాతం వృద్ధితో రూ. 53,383 కోట్లుగా ఉంది. ఈ వివరాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) త్రైమాసికపు పనితీరు సూచీ నివేదికలో తెలిపింది.గత ఏడాది జీఆర్ 12.79శాతం వృద్ధితో రూ.65,030కోట్ల ఆదాయాన్ని ఏజీఆర్13.26శాతం వృద్ధితో రూ.47,134 కోట్లను ఆర్జించినట్టు రిపోర్ట్ చేసింది. రోమింగ్ ఆదాయం, ఇంటర్ కనెక్ట్ చార్జీలతో కలిపి ఈ ఆదాయాన్ని ఆర్జించినట్టు తెలిపింది. అలాగే ఫీజు మరియు స్పెక్ట్రమ్ వాడుక ఛార్జీలు (ఎస్ యూసీ) వరుసగా 14 శాతం 12 శాతం పెరిగాయి. దీంతో టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజు ఏప్రిల్-జూన్ నాటికి రూ 4,314 కోట్లకు పెరిగింది. జీఆర్ మరియు ఏజీఆర్ (టెలికాం సేవల ద్వారా ఆదాయం మాత్రమే) అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే... ఈ త్రైమాసికంలో వరుసగా 7.33శాతం,10.34శాతం పెరిగింది .ఏజీ ఆర్ ఆధారంగా టెలికాం సేవలకు యూజర్ (ఏఆర్పీయూ) ప్రకారం నెలవారీ సగటు రాబడి త్రైమాసికంలో రూ 141 కోట్లుగా ఉంది. ఇది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ 127కోట్లుగా ఉంది. -
కాల్‌డ్రాప్ పరిస్థితిపై చర్చిద్దాం రండి!
న్యూఢిల్లీ : వినియోగదారులకు తెగ విసుగు తెప్పించిన కాల్ డ్రాప్స్ ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖా మంత్రి మనోజ్ సిన్హా, టెల్కోలతో భేటీ కానున్నారు. నవంబర్ 1న అన్ని టెలికాం కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ఆయన భేటీ నిర్వహించనున్నట్టు టెలికాం సెక్రటరీ జే.ఎస్ దీపక్ తెలిపారు. ఈ భేటీలోనే కాల్ డ్రాప్స్ ప్రస్తుత పరిస్థితితో పాటు, భవిష్యత్తు కార్యచరణపై కూడా చర్చించనున్నారు. కాల్ డ్రాప్ పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల నమోదైనట్టు ట్రాయ్ వెల్లడించినట్టు దీపక్ తెలిపారు. ఈ సమస్యపై జూన్‌లో టెలికాం కంపెనీ ఆపరేటర్లతో భేటీ నిర్వహించామని, ఆ భేటీలో టెల్కోలు 100 రోజుల ప్లాన్ హామీగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ప్రొగ్రామ్ ద్వారా కాల్ డ్రాప్స్ పరిస్థితి చక్కబరిచి, లక్ష్యాలను చేధిస్తామన్నారని వాగ్దానం చేసినట్టు చెప్పారు. జూన్10 నుంచి ఈ ప్రొగ్రామ్ ప్రారంభమైంది. అప్పటినుంచి ట్రాయ్ సమర్పిస్తున్న నివేదికల్లో కాల్ డ్రాప్స్‌లో మెరుగైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. 2015 డిసెంబర్ వరకు 54 నెట్‌వర్క్స్‌లో ఎలాంటి పనితీరు కనిపించలేదని, ప్రస్తుతం ఆ నెట్‌వర్క్‌లు 19కి తగ్గినట్టు వివరించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా టెల్కోలు 60వేల బీటీఎస్(బేస్ ట్రాన్సీవర్ స్టేషన్లను) ఏర్పరచనున్నట్టు తెలిపారు. మొదటి 45లో 48వేల స్టేషన్లను టెల్కోలు ఏర్పరిచారు. కాల్ డ్రాప్స్ సమస్య నుంచి బయటపడటానికి బీటీఎస్‌లు ఏర్పాటుకు టెల్కోలు రూ.12వేల కోట్ల మేర ఖర్చుచేస్తున్నట్టు దీపక్ తెలిపారు. -
త్వరలో ఆ సేవలందించనున్న టెల్కోస్ ?
న్యూఢిల్లీ: తరచూ కాల్ డ్రాప్ సమస్యతో విసిగిపోయిన వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్ ను ఆఫర్ చేసేందుకు టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) రంగం సిద్ధం చేస్తోంది. ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసుల ద్వారా వాట్స్ యాప్, స్కైప్ లో ఉన్న కాలింగ్ సదుపాయాన్నందించేందుకు ట్రాయ్ కసరత్తు చేస్తోంది. ఈ సేవల సాధ్యాసాధ్యాలపై టెల్కోస్ తో చర్చలు జరపనుంది. వాట్స్ యాప్, స్కైప్ లతో సమానంగా ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసుల ద్వారా వాయిస్ కాలింగ్ సేవలందించాలని యోచిస్తున్నట్టు ట్రాయ్ ఛైర్మన్ ఆర్ ఎస్ శర్మ వెల్లడించారు. ఒకవైపు ఇతర ప్రొవైటర్లు ఈ ఇంటర్నెట్ టెలిఫోనీ అందిస్తుండగా, తమ సర్వీసు ప్రొవైడర్లు లెసెన్స్ లేకుండా ఈ వాయిస్ ఓవర్ సేవలను అందించలేరనీ దీంతో రెగ్యులేటరీ అసమతుల్యత నెలకొందని శర్మ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని కొంతమేరకైనా చక్కదిద్దాలనే ప్రణాళిలో ఉన్నట్టు తెలిపారు. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇతర ప్రొవైడర్లు అందిస్తున్న సర్వీసులను తాము కూడా అనుమతించనున్నామని చెప్పారు. ప్రపంచవ్యాపితంగా ఈయూ, అమెరికా సహా పలు మార్కెట్ టెల్కోస్ లలో ఈ వాయిస్ ఓవర్ సేవలు అందించడానికి అనుమతి ఉందన్నారు. దీనిపై పరిశ్రమలో భారీ చర్చ జరుగుతోందని తెలిపారు. కాగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ డిసెంబర్ 2014 లో ఇంటర్నెట్ ఆధారిత కాల్స్ ప్రారంభించింది. దీనికి ప్రత్యేకంగా చార్జి వసూలు చేయాలని నిర్ణయంపై నిరసన వెల్లువెత్తడంతో ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.. మరి ట్రాయ్ తాజా ప్రతిపాదన ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.