సాక్షి, న్యూడిల్లీ: బడ్జెట్ ప్రసంగంలో తన రికార్డును తనే అధిగమించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ 2020 లో కొన్ని ప్రధాన కీలక రంగాలకు తీరని నిరాశే మిగిల్చారు. ముఖ్యంగా జీఎస్‌టీ భారం, అమ్మకాలు లేక విల విల్లాడుతున్న ఆటోమొబైల్ కంపెనీ పునరుజ్జీవనానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఆయా కంపెనీలకు ఎలాంటి ఊరట కల్పించకపోవడం తీరని నిరాశ మిగిల్చిందని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే టెలికం కంపెనీల గురించి కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవంటూ సంబంధిత వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అంతేకాదు ఆర్థిక రంగానికి ఎంతో కీలకమైన రియల్ ఎస్టేట్‌రంగ ప్రస్తావన లేకపోవడం గమనార‍్హం. దీనిపై పలువురు ఎనలిస్టులు నిరాశ వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్‌లో పన్ను ఉపశమనం, ఆర్థిక ఏకీకరణ, గ్రామీణ డిమాండ్ పుంజుకునే చర్యలు, సరసమైన గృహాలపై దృష్టి పెట్టడం, ఆటో రంగానికి ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల వృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ విషయంలో తీవ్ర నిరాశ ఎదురు కావడంతో స్టాక్‌మార్కెట్లో ఈ రంగ షేర్లు భారీ నష్టాలను మూట గట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment