Union Budget 2020
-
‘పన్ను’ పరిష్కారాలకు ‘వివాద్ సే విశ్వాస్’
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకే వివాదాల పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’ను బడ్జెట్లో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘ఈ పథకం పన్ను వివాదాల్ని పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. పన్ను చెల్లింపుదారులు.. కేసుల పరిష్కారానికి ఎంతో సమయాన్ని, డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పథకం వాటిని ఆదా చేస్తుంది’’ అని తెలియజేస్తూ.. ‘డైరెక్ట్ ట్యాక్సెస్ వివాద్ సే విశ్వాస్, 2020’ బిల్లును సోమవారం పార్లమెంట్లో మంత్రి ప్రవేశపెట్టారు. ఎందుకు ఈ పథకం..? ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కమిషనర్, అప్పీల్స్, ఆదాయపన్ను శాఖ.. ఆదాయపన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్.. హైకోర్టు.. సుప్రీంకోర్టు వంటి పలు అప్పిలేట్ వేదికల వద్ద 4,83,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9 లక్షల కోట్లు రావాల్సి ఉంది. వీటిలో అధిక భాగాన్ని ఈ ఏడాది మార్చి చివరికి పరిష్కరించి, పన్నుల ఆదాయం పెంచుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. ఈ పథకంలో కింద... వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించినట్లయితే వారికి ఎలాంటి జరిమానాలూ ఉండవు. పైపెచ్చు క్షమాభిక్ష కల్పిస్తారు. తద్వారా భవిష్యత్తులో ఆ వివాదానికి సంబంధించి చట్టపరమైన విచారణలు లేకుండా రక్షణ పొందొచ్చు. ఎవరికి వర్తిస్తుంది.. ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది. ఎంత మేర చెల్లించాలి..? సోదా కేసులు: ఆదాయ పన్ను, వడ్డీ, పెనాల్టీల రూపంలో చెల్లించాల్సిన మొత్తానికి మరో 25 శాతం కలిపి మొత్తం 125 శాతాన్ని మార్చి చివరి నాటికి చెల్లించడం ద్వారా వివాదాలను తొలగించుకోవచ్చు. మార్చిలోపు సాధ్యం కాకపోతే, తర్వాత జూన్ 31 నాటికి 135 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సోదా జరగని కేసులు: పన్ను, పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదం ఉంటే... ఆ మొత్తాన్ని (100 శాతాన్ని) మార్చి చివరిలోపు చెల్లించడం ద్వారా వివాదాన్ని మాఫీ చేసుకోవచ్చు. ఈ గడువు దాటితే జూన్ చివరికి 110 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఆదాయపన్ను కింద రూ.1,00,000 చెల్లించగా.. ఆదాయపన్ను శాఖ మాత్రం చెల్లించాల్సిన పన్ను ఆదాయం రూ.1,50,000గా తేల్చి, దీనికి రూ.20,000 వడ్డీ కింద, రూ.1,00,000 పెనాల్టీ కింద చెల్లించాలని డిమాండ్ చేసి ఉంటే.. అప్పుడు వివాదంలో ఉన్న మొత్తం రూ.1,70,000 అవుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ పన్ను చెల్లింపుదారు అప్పీల్ కోసం దాఖలు చేసి ఉంటే.. ఈ కేసులో కేవలం రూ.50,000ను మార్చి చివరికి చెల్లించడం ద్వారా మాఫీ చేసుకోవచ్చు. మార్చి తర్వాత అయితే 10% అదనంగా రూ.55,000 చెల్లించాల్సి ఉంటుంది. ♦ ఇక కేవలం పెనాల్టీ, వడ్డీ రేటుపైనే వివాదం ఉన్నట్టయితే, చెల్లించాల్సిన మొత్తంలో మార్చి ఆఖరు నాటికి కనీసం 25% చెల్లిస్తే చాలు. ఆ తర్వాత జూన్‌లోపు అయితే చెల్లించాల్సిన మొత్తం 30 శాతం అవుతుంది. ఇవన్నీ కూడా పన్ను చెల్లింపుదారులు అప్పీలు దాఖలు చేసిన కేసులకే వర్తిస్తాయి. ఒకవేళ ఆదాయపన్ను శాఖే అప్పీల్‌కు వెళ్లి ఉంటే, చెల్లించాల్సిన మొత్తం ఇంత కంటే తక్కువగా ఉంటుంది. అందరికీ ఈ పథకం వర్తించదండోయ్.. ఈ ప్రతిపాదిత పథకం కొన్ని వివాదాలకు వర్తించదు. పన్ను చెల్లింపుదారుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆరంభమై ఉన్నా...సోదాలు జరిగి, రూ.5 కోట్లకు పైగా విలువైన స్వాధీనాలు చోటు చేసుకున్నా... బయటకు వెల్లడించని విదేశీ ఆదాయం, విదేశీ ఆస్తులు కలిగి ఉన్న కేసులైనా... భారతీయ శిక్షాస్మృతి, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్నా... అటువంటి వారు ఈ పథకం కింద వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉండదు. -
‘ఏ రాష్ట్రానికీ తగ్గించలేదు’
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో ఏ రాష్ట్రానికీ నిధులు తగ్గించలేదని, ఏ రాష్ట్రాన్ని కూడా చిన్నచూపు చూడాలన్న ఉద్దేశం తమకు లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను 42% నుంచి 41 శాతానికి తగ్గించింది తాము కాదని, ఆర్థిక సంఘం సిఫారసు మేరకే నిధులు కేటాయించామని చెప్పారు. దేశంలో ఒక రాష్ట్రం తగ్గిన కారణంగా ఆ నిధులను అన్ని రాష్ట్రా లకూ పంచామని, అదే విధంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పెరగడంతో వాటికి నిధుల కేటాయింపునకుగాను పన్నుల వాటా తగ్గించాలన్న ఆర్థిక సం ఘం సిఫారసునే అమలు చేశామ న్నారు. కేంద్ర బడ్జెట్‌పై వివిధ వర్గాలతో సమావేశ మయ్యేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చిన నిర్మలా సీతారామన్ విలే కరుల సమావేశంలో మాట్లాడారు. పన్నుల వాటా తగ్గించలేదు... ‘2011 జనాభా లెక్కల ఆధారంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. ఆర్థిక సంఘం వచ్చే ఏడాదికి సంబంధించిన సిఫారసులు మాత్రమే చేసింది. మరో నాలుగేళ్లకుగాను త్వరలోనే సిఫారసులు ఇస్తుంది’ అని నిర్మలా సీతారామన్ వివరించారు. రాష్ట్రాలకు తాము సహకరించడం లేదనేది సరికాదని, పన్నుల వాటా కేంద్రం తగ్గించలేదని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలు విన్నా...! కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ నాయకులు మాట్లా డింది తాను విన్నానని, ఓ మంత్రి మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇచ్చింది అనడం సరికాదని, అది తమ హక్కు అని వ్యాఖ్యానించడం తన దృష్టికి వచ్చిందని నిర్మలా సీతారామన్ పరోక్షంగా కేటీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దేశ ప్రగతి కోసం ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదని, అన్ని రాష్ట్రాలూ తమ వంతు కృషి చేస్తున్నాయన్నారు. కేంద్రానికి చెల్లించే పన్నుల్లో తెలంగాణ వాటా ప్రశంసనీయమని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే కేంద్రం ఇచ్చింది అనే పదం చెప్పడానికి పార్లమెంటు అనుమతి ఉందని, ఇచ్చింది అనే పదం సరైంది కాదనే భావన ఉంటే ఆ విషయం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయాలని, ఇచ్చింది అనే పదం అన్‌పార్లమెంటరీ అని స్పీకర్‌ను చెప్పమనాలని సూచించారు. అలా చేయకుండా మీరు ఇచ్చారంటారేంటి? మేం మా వాటా ఇస్తున్నాం కదా... అని అనడం ఒక రకంగా అనిపించిందని నిర్మల వ్యాఖ్యానించారు. సమాఖ్య స్ఫూర్తే ప్రధాని ఉద్దేశం... ఏ రాష్ట్రాన్నీ తగ్గించి చూడాలన్నది తమ ఉద్దేశం కాదని, సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలతో సహకారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని నిర్మలా సీతారామన్ వివరించారు. 2019–20 బడ్జెట్‌తో పోలిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క పథకానికీ నిధులు తగ్గించలేదని ఆమె చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల డిమాండ్‌ను బట్టి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపులో కొత్త విధానాన్ని తీసుకువచ్చామని, రాయితీలు లేని స్పష్టమైన, సులభతరమైన పన్ను రేటు తగ్గింపే కేంద్రం ఉద్దేశమని చెప్పారు. అయితే ఏ విధానంలో పన్ను చెల్లించాలన్నది చెల్లింపుదారుల ఇష్టమని, ఫలానా విధానం ద్వారానే ఐటీ చెల్లించాలని తాము ఒత్తిడి చేయబోమని స్పష్టం చేశారు. జీఎస్టీ పరిహారం అందరికీ నిలిపేశాం... జీఎస్టీ పరిహారం నిధులు ఒక్క తెలంగాణకే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకూ నిలిపివేశామని నిర్మలా చెప్పారు. జీఎస్టీ చట్టం ప్రకారం పరిహారం నిధులను వసూలైన పరిహారం సెస్ నుంచే చెల్లించాల్సి ఉందని, ఇప్పటివరకు తమకు వచ్చిన సెస్ మొత్తాన్ని అన్ని రాష్ట్రాలకూ పంపిణీ చేశామని, అదనంగా చెల్లించేందుకు తమ వద్ద సెస్ నిల్వ లేదని వివరించారు. సెస్ వసూళ్లను బట్టి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లిస్తామని చెప్పారు. రూ. 2 వేల నోట్లను రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, రూ. 2 వేల నోట్లు రద్దవుతున్నాయన్న విషయం తన దృష్టికి రాలేదని నిర్మల చెప్పారు. తెలంగాణకు స్పెషల్ గ్రాంట్ సిఫార్సు వాస్తవమే... తెలంగాణకు స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మాట వాస్తవమేనని, అయితే ఏ పద్దు ద్వారా చెల్లించాలి, గతంలో ఈ పద్ధతి ఉందా... చెల్లింపులకు వీలవుతుందా అనే అంశాలను పరిశీలించాలని తిరిగి ఆర్థిక సంఘానికే ఈ ప్రతిపాదన పంపినట్లు నిర్మల చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే రైల్వే పనులు నిలిచిపోయాయన్న వాదనలో నిజం లేదని, తాము నిధులు ఇస్తున్నామని, స్థానిక సమస్యల కారణంగానే రైల్వే పనులు నిలిచిపోయి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఫలానా పని ఆగిపోయిందని తన దృష్టికి తెస్తే రైల్వే శాఖకు పంపుతామని చెప్పారు. బడ్జెట్‌పై ఇప్పటివరకు పర్యటించిన మూడు నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ ఎక్కువగా ఐటీ చెల్లింపు విధానం, ఐటీ వివాదాల పరిష్కారం లాంటి అంశాలపైనే పారిశ్రామిక వర్గాలు వివరాలు అడుగుతున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా నిర్మల చెప్పారు. నాది ‘టూటా బూటా’ హిందీ విలేకరుల సమావేశంలో భాగంగా ఓ హిందీ విలేకరి, మరో తెలుగు విలేకరి కలిపి అడిగిన ప్రశ్నకు నిర్మల ఆంగ్లం, తెలుగులో జవాబిచ్చారు. ఆ తర్వాత హిందీ విలేకరిని ఉద్దేశించి ‘మీకు హిందీలో చెప్పలేదు కదా...! నాది టూటా బూటా హిందీ.... అందుకే చెప్పలేదు’ అంటూ చమత్కరించారు. అయితే విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబులు దాటవేశారు. కేంద్ర ఆర్థిక విధానాల వల్లే తెలంగాణ నష్టపోతోందని, సంక్షేమ, అభివృద్ధి పథకాలు నిలిచిపోయాయని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది కదా అని ప్రశ్నించగా, తాను సమాధానం చెప్పదల్చుకోలేదని నిర్మల పేర్కొన్నారు. రాష్ట్ర విభజన హామీలకు అనుగుణంగా నిధుల కేటాయింపు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నిధుల కోసం నీతీ ఆయోగ్ సిఫారసులు తదితర ప్రశ్నలకు కూడా ఆమె చిరునవ్వుతోనే సమాధానమిచ్చారు. తెలంగాణకు నిధులు 128 శాతం పెరిగాయి.. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వని విధంగా తెలంగాణకు కేంద్రం నిధుల కేటాయింపు చేస్తోందని కేంద్ర వ్యయ శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్ చెప్పారు. 2010–15 వరకు రాష్ట్రానికి మొత్తం రూ. 46,747 కోట్ల పన్నులు, గ్రాంట్లు, ఇతర రూపాల్లో ఇవ్వగా 2015–20 వరకు అది రూ. 1,06,606 కోట్లకు పెరిగిందన్నారు. అలాగే ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి రాష్ట్రం తీసుకొనే అప్పుల పరిమితిని కూడా 3 నుంచి 3.5 శాతానికి పెంచామన్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే తదితరులు పాల్గొన్నారు. చదవండి : బడ్జెట్ గురించి అందరికీ తెలియాలి -
బడ్జెట్ గురించి అందరికీ తెలియాలి
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి ప్రతి భారతీయుడికి తెలియాలని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ రూపకల్పనతో పాటు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మార్పుచేర్పుల కోసం నిపుణులు, ఆర్థికవేత్తల సలహాలు సూచనలు తీసుకోవడం ఎంత ముఖ్యమో బడ్జెట్‌పై సామాన్యుడికి అవగాహన ఉండటం కూడా అంతే ముఖ్య మని, అదే ప్రధాని మోదీ ఉద్దేశమని ఆమె వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆమె వాణిజ్య, పరిశ్రమ వర్గాలు, బ్యాంకర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, విద్యారంగ నిపుణులు, విధాన రూపకర్తలతో సమావేశమై కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సమాలోచనలు జరిపారు. పలు రంగాల ప్రతినిధుల సందేహాలకు ఆర్థిక శాఖ అధికారులతో కలిసి సమాధానమిచ్చారు. అంతకు ముందు ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా దేశంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ తయారీలో ముందుకెళ్లాల్సి ఉంటుం దన్నారు. బడ్జెట్ రూపకల్పన కోసం గత జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 8 నెలల పాటు సుదీర్ఘ కసరత్తు చేశామని తెలిపారు. ఆర్థిక శాఖ లోని ప్రతి కార్యదర్శి శాఖల వారీగా కసరత్తు చేశారని, అన్ని వర్గాలు, అన్ని శాఖలు, అన్ని విభాగాలను సంప్రదించి కేటాయింపులు జరిపామన్నారు. ఎంఎస్ఎంఈ కోసం పోరాడుతున్నా.. బడ్జెట్‌పై సమావేశంలో భాగంగా ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధిపై ఈ బడ్జెట్లో దృష్టి పెట్టలేదని, తమకు లాబీ చేసే శక్తి లేనందునే అలా చేశారా? అని ప్రశ్నించగా ఆ ప్రతినిధి వాదనను నిర్మల కొట్టిపారేశారు. తాను ఎంఎస్ఎంఈ కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. చదవండి : ‘ఏ రాష్ట్రానికీ తగ్గించలేదు’ -
'ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే తెలంగాణకు నిధులు'
-
త్వరలోనే తెలంగాణకు ఆ నిధులు ఇస్తాం: నిర్మల
సాక్షి, హైదరాబాద్ : 2020-21కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాదాపూర్‌లోని హోటల్ ట్రైడెంట్ లో బడ్జెట్ పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ.. 'బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరుతో పాటు అన్ని నగరాల్లో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల్ని కలవడం మొదలుపెట్టాం. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారమే తెలంగాణకు నిధులు కేటాయించాం. ఏ ఒక్క రాష్ట్రాన్ని తగ్గించి చూడాలన్నది మా ఉద్దేశం కాదు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం.. మోదీ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లానే తెలంగాణతో కూడా కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు తగ్గించాలా, పెంచాలా అనేది రాష్ట్రాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. (రుణాల ఫిర్యాదులకు ప్రత్యేక సెంటర్: నిర్మలా సీతారామన్) జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను సరిగా ఇవ్వలేకపోయాం. దీనికి కారణం అనుకున్న స్థాయిలో జీఎస్టీ వసూలు కాకపోవడమే. డిసెంబర్ లో జీఎస్టీ మీటింగ్ కు ముందు రెండు నెలల వాటాను ఇచ్చాము. ఇప్పటి వరకు ఇవ్వాల్సిన వాటాలను ఖచ్చితంగా రెండు విడతల్లో అందిస్తాం. ఇది ఇప్పుడు చెప్పడం కాదు జీఎస్టీ కౌన్సిల్ లోనే చెప్పాము. నేను కూడా రాష్ట్ర నేతలు మాట్లాడిన వాటిని విన్నాను. ఈసారి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువయ్యాయి కాబట్టే 42 నుంచి ఒక శాతం తగ్గించి 41 శాతం నిధులు కేటాయించాము. అదనంగా ఒక శాతాన్ని యూటీలకు కేటాయించాము. కేంద్రం నుంచి వచ్చే ఎలాంటి నిధులను మేం తగ్గించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం లేదు అనేది సరికాదు. ఏ ఒక్క రాష్ట్రాన్ని చిన్న చూపు చూడాలి అని మాకు లేదు. తెలంగాణకి 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న మాట అవాస్తవం. తెలంగాణ నుంచి కేంద్రానికి మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. సెస్ కలెక్షన్ తక్కువ కావడం వల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులు ఇవ్వలేకపోయము. తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు. త్వరలోనే ఈ నిధులు ఇస్తాం. సెస్ వచ్చే కొద్దీ ఇస్తూనే ఉంటామని' తెలిపారు. (బడ్జెట్లో తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం) -
వ్యవసాయంపై మళ్లీ శీతకన్ను
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి అంతర్జాతీయ కారణాలకంటే వినియోగ డిమాండ్ పడిపోవడం, పెట్టుబడులు తగ్గిపోవడమే ప్రధాన కారణమని ఆర్థికరంగ నిపుణులు చాలావరకు ఏకాభిప్రాయానికి వస్తున్నారు. పైగా దేశ స్థూల దేశీయోత్పత్తి 5 శాతంకంటే తక్కువకు పతనమైన నేపథ్యంలో గ్రామీణ జనాభాకు మరింత ఎక్కువగా డబ్బును అందించాల్సి ఉంది. వ్యవసాయానికి ఉద్దీపన ప్యాకేజీలు అందించాల్సి ఉంది. కానీ 2020 బడ్జెట్ కూడా వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో ‘కోల్పోయిన మంచి అవకాశం’ గానే మిగిలిపోయిందనిపిస్తోంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక రంగాలకు తాజా బడ్జెట్లో కేటాయింపులు పెంచడానికి కేంద్రప్రభుత్వానికి మనసొప్పలేదంటే వ్యవసాయంపై పాలకుల శీతకన్ను ఇంకా కొనసాగుతోందనే చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020 కేంద్రబడ్జెట్ ముక్కుసూటిగా చెప్పాలంటే ఒక కోల్పోయిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. గ్రామీణ వ్యయంలో పతనం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోయి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా దేశ స్థూల దేశీయోత్పత్తే (జీడీపీ) 5 శాతం కంటే తక్కువగా పతనమైపోయిన సమయంలో గ్రామీణ జనాభా చేతుల్లోకి మరింత ఎక్కువగా డబ్బును అందించాల్సి ఉంది. మన వ్యవసాయంలో ఇప్పటికీ దేశంలోని 70 శాతం గృహాలు పాలు పంచుకుంటున్నందున ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయాలంటే గ్రామీణుల చేతుల్లో మరింత అధికంగా డబ్బు పంపిణీ చేయడం అత్యుత్తమమైన మార్గం. గ్రామీణ వినియోగం ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయిన తరుణంలో పల్లెసీమల్లో ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే వ్యవసాయానికి ఉద్దీపన ప్యాకేజీలు అందించడం అత్యవసరం. భారతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి అంతర్జాతీయ కారణాల కంటే దేశీయ కారణాలే ప్రధానమన్నది అందరికీ తెలిసిన విషయమే. అవేమిటంటే డిమాండ్ పడిపోవడం, పెట్టుబడులు తగ్గిపోవడం. ఈ దుస్థితినుంచి బయటపడాలంటే వ్యవసాయదారులకు, కూలీలకు ప్రత్యక్ష నగదు మద్దతు రూపంలో మరింత డబ్బు అందేలా చూడటమే మార్గమని చాలామంది ఆర్థికవేత్తలు ఇప్పుడు సూచిస్తున్నారు. జనాభాలోని 60 శాతం మంది అధోజగత్ సహోదరుల చేతుల్లో మొత్తం జాతీయ సంపదలో 4.8 శాతం వాటా మాత్రమే ఉంటున్న స్థితిలో ప్రధానమంత్రి–కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచడం అనేది ఒక ఆదర్శపూరితమైన పంథా అవుతుంది. పీఎమ్–కిసాన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరొక రూ.1.50 లక్షల కోట్ల డబ్బును కేటాయించాలని నేను ఇప్పటికే చాలాసార్లు సూచించి ఉన్నాను. అంటే నెలకు దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి మరొక రూ. 1,500ల డబ్బు ప్రత్యక్ష నగదు మద్దతు రూపంలో అందుతుంది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు అందిస్తున్న వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ. 12,000కు రెట్టింపు చేస్తుందని నేను భావించాను. దీనికి అదనంగా జాతీయ పనికి ఆహార పథకం కింద బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుతం ఉన్న రూ. 70,000 కోట్లను కనీసం లక్ష కోట్ల రూపాయలకు పెంచినట్లయితే అది ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపిస్తుంది. పైగా వ్యవసాయ కూలీలు అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా పాలకులు గమనించాల్సి ఉండింది. కానీ ప్రధానమంత్రి కిసాన్ ప«థకాన్ని, జాతీయ పనికి ఆహార పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో ఆర్థిక మంత్రి విఫలమయ్యారు. ఈ రెండు పథకాలకు బడ్జెట్లో ఇతోధికంగా నిధులు కేటాయించి ఉంటే గ్రామీణ వినియోగంలో డిమాండును సృష్టించడం సాధ్యమయ్యేది. ఇది దానికదిగా గ్రామీణ వినియోగాన్ని పెంచి అధిక ఆర్థిక వృద్ధి రేటుకు దోహదపడేది. కానీ దురదృష్టవశాత్తూ వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక రంగాలకు తాజా బడ్జెట్లో గణనీ యంగా కేటాయింపులు పెంచడానికి కేంద్రప్రభుత్వానికి మనసొప్పినట్లు లేదు. ఈసారి వ్యవసాయరంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ. 2.83 లక్షల కోట్లు. అయితే గత సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన రూ. 2.68 లక్షల కోట్ల అంచనాతో పోలిస్తే తాజా కేటాయింపుల్లో పెద్దగా పెరుగుదల లేనట్లే. వ్యవసాయ రుణాల కల్పనకు మాత్రం గత సంవత్సరంలో కేటాయించిన రూ.13.5 లక్షల కోట్లతో పోలిస్తే ఈ దఫా కాస్త ఎక్కువగా అంటే రూ. 15 లక్షల కోట్ల మేరకు పెంచడం ముదావహం. అయితే ఈరోజుకీ దేశంలోని చిన్న, సన్నకారు రైతుల్లో దాదాపు 41 శాతంమందికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులనుంచి వ్యవసాయ రుణాలు అందడం లేదని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన కీలకమైన విషయం ఏమిటంటే ఇప్పుడు రైతులకు కావలసింది మరింత రుణం కాదు. వారికి అధిక ఆదాయాన్ని కల్పించడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం. నిజం చెప్పాలంటే ఆహార సబ్సిడీకి బడ్జెట్ కేటాయింపులు గత సంవత్సరంలోని రూ.1.84 లక్షల కోట్లతో పోలిస్తే ఈ సంవత్సరం 1.15 లక్షల కోట్ల రూపాయలకు తగ్గించివేయడం దారుణం. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ధాన్య సేకరణ కార్యకలాపాలనుంచి మొత్తంగా వైదొలగాలనే ఉద్దేశంతో ఉందా అని పలు సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు వ్యవసాయ గ్రూపులు ఈ అంశంపై తమ ఆందోళనను చాటి చెప్పాయి. దానికి తగినట్లుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే వ్యవసాయ మార్కెట్లను సరళీకరించడం గురించి మాట్లాడారు. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆహార సబ్సిడీలపై ఎన్డీఏ ప్రభుత్వం కోత విధించబోతోందన్న భయాందోళనలు వ్యవసాయదారుల్లో, రైతు సంఘాల్లో పెరిగిపోయాయి. దీనికి తగినట్లుగానే వ్యవసాయ మదుపులు, ధరల కమిషన్ (సీఏసీపీ) బహిరంగ మార్కెట్లో ధాన్య సేకరణ విధానాన్ని నిలిపివేయాలని సిఫార్సు చేసింది. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఇప్పటికే దేశ ధాన్యాగారాలుగా పేరొందిన పంజాబ్, హరియాణా రాష్ట్రాలు ధాన్య సేకరణను గణనీయంగా తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పంజాబ్ ఇప్పటికే ధాన్య సేకరణలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ చట్టాలను తదనుగుణంగా సవరించింది కూడా. అలాగే ప్రైవేట్ మండీలను కూడా ప్రారంభించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం కడుతోంది. ఆకాంక్షల భారత్‌లో భాగంగా దేశీయ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ వ్యవసాయం వైపుగా మార్చేందుకు రోడ్ మ్యాప్ అందించడం గురించి ఆర్థిక మంత్రి 16 సూత్రాల కార్యాచరణపై మాట్లాడారు. గతంలో ప్రతిపాదించిన త్రీ మోడల్ చట్టాలను అమలుపర్చిన రాష్ట్రాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఈ మూడు మోడల్ చట్టాలకు భూమి కౌలు చట్టం, మార్కెట్ సరళీకరణ, కాంట్రాక్టు వ్యవసాయంతో నేరుగా సంబంధం ఉందని గమనించాలి. వ్యవసాయరంగంలో పోటీ తత్వాన్ని పెంచాల్సిన అవసరముం దని ఆర్థిక మంత్రి చెబుతూ, 2025 నాటికి పాల ప్రాసెసింగ్‌ను రెట్టింపు చేసే పథకాలను కొన్నింటిని పేర్కొన్నారు. అలాగే 2025 నాటికి దేశీయ మత్స్య ఉత్పత్తిని 2 కోట్ల టన్నులకు పెంచడం, కమోడిటీ ట్రేడింగ్‌ని ప్రోత్సహించడానికి ఈ–నామ్‌తో వేర్‌హౌసింగ్ రిసిప్టులపై ఫైనాన్స్‌ని ప్రోత్సహించడం గురించి కూడా నిర్మల ప్రతిపాదనలుచేశారు. త్వరగా పాడైపోయే సరకులను రవాణా చేయడానికి కిసాన్ రెయిల్, కిసాన్ ఉడాన్‌ను ప్రారంభించడం వల్ల వ్యవసాయ వాణిజ్య కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. 16 సూత్రాల కార్యాచరణ పథకం గురించి ఆమె చెప్పిన అంశాలు మునుపటి బడ్జెట్లలో కూడా ప్రస్తావించారు, చర్చించారు కానీ ఈ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు జరిగినట్లు కనిపించడం లేదు. భవిష్యత్తులో వ్యవసాయరంగం పయనించాల్సిన దిశ కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించడం కచ్చితంగా సరైనదే కానీ ఈ మార్గాన్ని ఎంత సమర్థంగా రూపొందిస్తారు అనేది ముందుగా స్పష్టం కావాలి. ఇప్పటికే మన వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన చాలా సంస్కరణలు అమెరికా, యూరోపియన్ యూనియన్ల నుంచి అరువు తెచ్చుకున్నవే. అయితే ఇలా అరువు తెచ్చుకున్న విధానాలు ప్రభావవంతమైనవే అయినట్లయితే అమెరికా, ఈయూలో కూడా వ్యవసాయరంగం ఎందుకు దుస్థితికి గురవుతోందన్నది ఆలోచించాల్సిన విషయం.అమెరికాలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఆత్మహత్యలు ఆ దేశంలోని పట్టణ కేంద్రాల్లో జరుగుతున్న ఆత్మహత్యల కంటే 45 శాతం అధికంగా నమోదవుతున్నాయి. పైగా, 1960ల నుంచి అమెరికాలో నిజ వ్యవసాయ ఆదాయం పెరుగుదల క్రమంగా పతనమవుతూ వచ్చింది. అందుచేత పాశ్చాత్య నమూనాలను అనుకరించడం కంటే గ్రామీణ సౌభాగ్యాన్ని, సంపదను పెంచిపోషించేలా మన వ్యవసాయరంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
విజయసాయి రెడ్డి పనితీరుకు ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి పనితీరును రాజ్యసభ ప్రశంసించింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రశంసనీయమైన రీతిలో క్రియాశీల పాత్ర నిర్వహించారని రాజ్యసభ సెక్రెటేరియట్ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తనకు గల అవకాశాలను రాజ్యసభలోని ఇతర సభ్యుల కన్నా చాలా చక్కగా విజయసాయిరెడ్డి వినియోగించుకున్నారు. (‘రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్‌ను సవరించాలి’) విజయసాయి రెడ్డి తొమ్మిది సార్లు అవకాశాన్ని వినియోగించుకుని చర్చల్లో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని కనబరిచినట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది. జీరో అవర్ ప్రస్తావన, ప్రత్యేక ప్రస్తావన, ఒక మౌఖిక ప్రశ్న, మౌఖిక ప్రశ్నలకు నాలుగు అనుబంధ ప్రశ్నలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. ఇవి కాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా, సాధారణ బడ్జెట్‌పైనా చర్చలో కూడా సాయిరెడ్డి పాల్గొని ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకు రావడంతో పాటుగా పలు నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. కాగా రాజ్యసభ సమావేశాల్లో 155 మంది సభ్యులు జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావనలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, బడ్జెట్‌పై చర్చ, బిల్లులపై మాట్లాడారు. (‘ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదం’) -
తగ్గిన కేంద్ర పన్నుల వాటా.. రాష్ట్ర బడ్జెట్‌పై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక మాంద్యం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడులు, కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల నేపథ్యంలో ఈసారి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెలలో ప్రవేశపెడతారని భావిస్తున్న 2020–21 వార్షిక బడ్జెట్ కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేయడంతో కచ్చితమైన ఖర్చులు, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన నిధులను ప్రతిపాదించాలంటే భూములపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి తీసుకొనే అప్పులకుతోడు బడ్జెట్లో భూముల అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందన్న దానిపైనే వార్షిక బడ్జెట్ అంచనాలు ఆధారపడతాయనే చర్చ ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములతోపాటు అన్ని రకాల భూములపై వివరాల సేకరణను రెవెన్యూ శాఖ ముమ్మరం చేయడంతో భూముల అమ్మకాల విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే విధానం చర్చనీయాంశమవుతోంది. రాబడులు ఈసారీ అంతంత మాత్రమే... గత మూడేళ్ల వార్షిక రాబడులను పరిశీలిస్తే ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఆదాయం లేదని బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. రాబడులకుతోడు అప్పులు కలిపినా బడ్జెట్ అంచనాల్లో 90 శాతం మేర నిధుల సమీకరణ జరగడం లేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1.13 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం రూ. 88,711 కోట్లు మాత్రమే వచ్చింది. దీనికి అదనంగా రూ. 26,738 కోట్లను ప్రభుత్వం అప్పుల రూపంలో సమకూర్చుకుంది. 2018–19 సంవత్సరానికిగాను రూ. 1.30 లక్షల కోట్ల ఆదాయ అంచనాకు రూ. 1.01 లక్షల కోట్లు మాత్రమే సమకూరింది. ఆ ఏడాది రూ. 26,949 కోట్లను అప్పుల రూపంలో తీసుకురాగా మొత్తం ప్రతిపాదిత వార్షిక బడ్జెట్లో 92 శాతం నిధులే వచ్చాయి. ఇక ఈ ఏడాది గణాంకాలను పరిశీలిస్తే రూ. 1.13 లక్షల కోట్ల అంచనాకుగాను మూడో త్రైమాసికం ముగిసిన డిసెంబర్ నాటికి రూ. 71,187 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీనికి అప్పులు రూ. 21,715 కోట్లను కలిపితే డిసెంబర్ వరకు రావాల్సిన నిధుల్లో 90.74 శాతం నిధులు మాత్రమే సమకూరాయి. ఇక చివరి త్రైమాసికం విషయానికి వస్తే 2017–18లో చివరి మూడు నెలల ఆదాయం రూ. 29 వేల కోట్లు రాగా 2018–19లో రూ. 33,500 కోట్ల వరకు వచ్చింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే అంచనాలో 63 శాతం మేరకు ఆదాయం వచ్చింది. చివరి మూడు నెలల్లో పన్నుల రూపంలో రూ. 20 వేల కోట్లు, అప్పుల రూపంలో మరో రూ. 10 వేల కోట్లు... వెరసి రూ. 30 వేల కోట్ల వరకు నిధులు సమకూరుతాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూడేళ్ల రాబడులు, అప్పులను అంచనా వేస్తే వచ్చే ఏడాది కూడా రాబడులు (అప్పలు కాకుండా) రూ. లక్ష కోట్లు దాటే పరిస్థితులు కనిపించడం లేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం మరో ఆరునెలలపాటు కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదలతో 2020–21 సంవత్సరానికి కూడా రాబడులు అంతంత మాత్రమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో తయారీ, ఫార్మా రంగాల్లో వినియోగించే చైనా ఉత్పత్తులు తగ్గిపోతే వచ్చే ఏడాది పన్నులకు నష్టం వాటిల్లుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో స్థిరత్వం కనిపిస్తుండగా లిక్కర్ ధరలు పెంచడంతో కొంత మేరకు నిధులు సమకూరుతాయనే అంచనాలున్నాయి. ఇక జీఎస్టీ విషయంలో కేంద్రం అనుసరించే వైఖరి, ఇచ్చే పరిహారం ఏ మేరకు ఉంటాయన్నది కూడా సందేహమే కావడంతో ఆ పన్నులపైనా ఆశలు పెట్టుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వచ్చే ఏడాది నెట్టుకురావడానికి భూముల అమ్మకాలపై ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2020–21 బడ్జెట్ రూ. 1.55 లక్షల కోట్లు? 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1.46 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించింది. ఈసారి 8 శాతం వృద్ధి అంచనాతో 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1.55 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఇరిగేషన్‌కు రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ. 6 వేల కోట్లకుపైగా కేటాయింపులు చూపినా అప్పులతో కలిపి ఈ ఏడాది డిసెంబర్ వరకు రూ. 18 వేల కోట్ల వరకు ఖర్చయింది. ఈ అంచనాల నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా రూ. 20 వేల కోట్ల వరకు వ్యయం అవసరమవుతుందని సాగునీటి శాఖ వర్గాలంటున్నాయి. రుణమాఫీకి రూ. 18 వేల కోట్లు కేటాయించే చాన్స్ ఈసారి 2018 ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందనే చర్చ జరుగుతోంది. రుణమాఫీకి రూ. 24 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో పెట్టిన రూ. 6 వేల కోట్లకు తోడు వచ్చే ఏడాది బడ్జెట్లో రూ. 18 వేల కోట్లు రుణమాఫీకి కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించడంతో అదనంగా చేరిన 12 లక్షల మందికి కూడా పింఛన్లు ఇవ్వాల్సి ఉన్నందున గతేడాది కంటే రూ. 2,500 కోట్లు అదనంగా.. అంటే రూ. 12 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. దీంతోపాటు రైతుబంధు పథకం కోసం రూ. 12 వేల కోట్లు, జీతభత్యాలకు రూ. 23–25 వేల కోట్లు, సబ్సిడీలకు రూ. 9 వేల కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ. 15 వేల కోట్లు అవసరం అవుతాయి. వాటితోపాటు రైతు బీమా, ఉపకార వేతనాలు, ఆరోగ్యశ్రీ, కల్యాణ లక్ష్మికి కలిపి రూ. 8 వేల కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. విద్యుత్ రాయితీల రూపంలో మరో రూ. 9 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమాలకు రూ. 12 వేల కోట్లు, విద్యకు రూ. 10 వేల కోట్లు, హోంశాఖకు రూ. 5 వేల కోట్ల అనివార్య కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది అదనంగా పట్టణ ప్రగతి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అవి కూడా రూ. 1,500 కోట్ల వరకు అవసరమవుతాయి. ఇవన్నీ కలిపి రూ. 1.55 లక్షల కోట్ల వరకు ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలకు అవకాశం ఉందనేది ఆర్థిక శాఖ వర్గాల అంచనాగా కనిపిస్తోంది. ఇందులో కొన్ని ఖర్చులు తగ్గించుకున్నా ఇతర అవసరాలకు నిధులు కావాల్సి వస్తుందని, మొత్తం మీద ఆ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశముందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతరం పూడ్చేదెలా? బడ్జెట్ ప్రతిపాదనలు, వాస్తవిక ఆదాయం మధ్య అంతరాన్ని ఎలా పూడ్చుకోవాలన్నదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్‌గా మారనుంది. ఇందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం అనుమతించిన మేరకు అప్పులు తేవడంతోపాటు భూముల అమ్మకాలే ప్రధాన వనరుగా మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా భూమి లెక్క తేల్చే పనిలో బిజీగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, అటవీ, ఇతర భూముల వివరాలు ఇప్పటికే ఉన్నప్పటికీ అమ్మకానికి అనువుగా ఉన్న భూముల లెక్కను రెవెన్యూ శాఖ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని విలువైన భూములను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగా ఉంది. ఇజ్జత్‌నగర్‌లో 36 ఎకరాలు, తెల్లాపూర్‌లో 46 ఎకరాలు, హైటెక్స్ సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్లో 8 ఎకరాలు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి అమ్మకం ద్వారా రూ. 3 వేల కోట్లకు పైగా ఆదాయం రానుంది. వాటికితోడు సుప్రీంకోర్టులో కేసులు క్లియర్ అయిన కోకాపేటలో 146 ఎకరాలు అమ్మితే రూ. 4,380 కోట్లు, పుప్పాలగూడలోని 198 ఎకరాలకు రూ. 7 వేల కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మేడ్చల్, శంషాబాద్, రాజేంద్రనగర్‌ల పరిధిలోని ఎవాక్యూ భూములు అమ్మకానికి పెడితే రూ. వేల కోట్ల ఆదాయం రానుంది. వాటన్నింటితోపాటు అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించి పేదలను నుంచి తీసుకొని వాటిని అమ్మితే ఎలా ఉంటుందన్న దానిపై బ్లూప్రింట్ తయారవుతోంది. అందులో భాగంగానే శంషాబాద్ మండలంలోని ఆరు గ్రామాల్లో లెక్కకడితే రూ. 5,745 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తేలింది. దీనికితోడు ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓ ప్రణాళిక ప్రకారం వెళితే రూ. 25–50 వేల కోట్ల వరకు భూముల అమ్మకాల ద్వారా సమీకరించుకునే అవకాశాలున్నా ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే పెద్ద ఎత్తున భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, వచ్చే ఏడాదికి అవసరమయ్యే వరకు ప్రతిపాదనలు చేసి ఆ తర్వాతి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొనే యోచనలో ఉందని తెలుస్తోంది. -
అవసరమైతే మరిన్ని బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: అవసరమైన పక్షంలో మరిన్ని బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు.. కన్సాలిడేషన్ ద్వారా ఏర్పడే అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు తోడ్పడగలవని ఆయన చెప్పారు. భారీ బ్యాంకులతో పెద్ద సంఖ్యలతో ప్రజలకు ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం గతేడాది ఏకంగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేసే ప్రతిపాదన ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనాల కారణంగా 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గనుంది. 2017 ఏప్రిల్‌లో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)లో విలీనం చేశారు. ఎల్ఐసీ లిస్టింగ్‌తో పారదర్శకత .. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ లిస్టింగ్ చేయడం ద్వారా సంస్థలో మరింత పారదర్శకత పెరగగలదని ఠాకూర్ చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రతిపాదన చేశారు. ఎల్ఐసీలో కొన్ని వాటాలతో పాటు ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 90,000 కోట్ల దాకా సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ఎల్ఐసీలో 100 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాలు ఉన్నాయి. అటు రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటుతో గతేడాది దాదాపు అయిదు లక్షల లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ప్రయోజనం చేకూరిందని ఠాకూర్ చెప్పారు. తాజాగా రుణ పునర్వ్యవస్థీకరణ వ్యవధిని వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. -
మీ ‘పన్ను’ దారేది?
ఆదాయపన్ను రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురు చూసిన వారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన పన్ను రేట్లతో అయోమయంలో పడేశారు. ప్రస్తుత పన్ను విధానం లేదా నూతన పన్ను విధానంలో తమకు అనుకూలమైన విధానంలోనే రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని ప్రకటించారు. రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఆదాయపన్నును కొంత మేరకు తగ్గిస్తూ నూతన పన్ను రేట్లను మంత్రి ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగడం లేదా నూతన విధానానికి మారడం పన్ను చెల్లింపుదారుల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మరి నూతన పన్ను విధానానికి మారిపోవాలా..? లేక ఇప్పుడున్న విధానంలోనే కొనసాగాలా..? అని ప్రశ్నిస్తే.. అది ఒక్కో వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. తమ ఆదాయాన్ని బట్టి దీనిపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. పాత, కొత్త విధానంలో పన్ను భారంపై అవగాహన కల్పించే ప్రాఫిట్ కథనం ఇది. రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి నూతన పన్ను విధానంలో రూ.78,000ను ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఇది నిజమే. కానీ, ఎవరికి ఈ ప్రయోజనం నిజంగా అంటే.. ఎటువంటి మినహాయింపులను క్లెయిమ్ చేసుకోని వారికే నూతన పన్ను విధానంతో ప్రయోజనమని క్లుప్తంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆదాయపన్ను విధానంలో ఎన్నో మినహాయింపులు(ఎగ్జంప్షన్), తగ్గింపులు(డిడక్షన్) ఉన్నాయి. అయితే, కొందరు కొన్ని రకాల మినహాయింపులనే వినియోగించుకుంటుంటే, కొందరు అయితే అస్సలు ఏ ప్రయోజనాన్ని కూడా వాడుకోకుండా రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. ఇలా ఏ డిడక్షన్, ఎగ్జంప్షన్ వినియోగించుకోని వారికి నూతన పన్ను రేట్లు ప్రయోజనకరం. అలాగే, తీసివేతలు, మినహాయింపుల గందరగోళాన్ని అర్థం చేసుకోలేని వారు నూతన విధానానికి మారిపోవచ్చు. లేదు, చట్ట పరిధిలో అన్ని మినహాయింపులు, తగ్గింపులను ఉపయోగించుకుంటానంటే ప్రస్తుత విధానంలోనే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ‘‘ఇదొక మంచి నిర్ణయం. తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చినట్టయింది’’ అని ట్యాక్స్‌స్పానర్ సహ వ్యవస్థాపకుడు సుధీర్ కౌశిక్ పేర్కొన్నారు. ‘‘హౌస్ రెంట్ అలవెన్స్, సెక్షన్ 80సీ కింద మినహాయింపులు పొందుతున్న వారికి నూతన పన్ను విధానానికి మారిపోవడం ప్రయోజనకరం కాదు’’ అని అశోక్ మహేశ్వరి అండ్ అసోసియేట్స్ ట్యాక్స్ లీడర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. చాప్టర్ 6ఏ పరిధిలోని సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80సీసీడీ మినహాయింపులు రూ.2,50,000ను పూర్తిగా వినియోగించుకున్నట్టు అయితే రూ.7,50,000 వరకు ఆదాయం ఉన్న వారూ ప్రస్తుత విధానంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, రుణంపై ఇంటిని కొనుగోలు చేసిన వారు చాప్టర్ 6ఏకు అదనంగా సెక్షన్ 24 కింద ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2,00,000పై, స్టాండర్డ్ డిడక్షన్ 50,000ను కూడా వినియోగించుకుంటే అప్పుడు మొత్తం రూ.10,00,000 ఆదాయం ఉన్నప్పటికీ చెల్లించాల్సిన పన్ను బాధ్యత సున్నాయే అవుతుంది. ఇక సెక్షన్ 80టీటీఏ కింద డిపాజిట్లపై వడ్డీ రూ.10,000 వరకు మినహాయింపు కూడా ఉంది. నూతన పన్ను విధానానికి మారితే జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియం, ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులతోపాటు ఎల్‌టీఏ తరహా మినహాయింపులను కోల్పోవాల్సి వస్తుంది. నూతన విధానంలోనూ ఎన్పీఎస్(రిటైర్మెంట్ సాధనం) పై పన్ను ఆదా చేసుకునే ఒక అవకాశాన్ని కొనసాగించారు. అది వ్యక్తిగతంగా ఎన్‌పీఎస్‌లో చేసే పెట్టుబడులు కాకుండా.. ఉద్యోగుల తరఫున కంపెనీలు ఎన్పీఎస్కు జమ చేసే చందాలకు సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను ఆదా ప్రయోజనం వర్తిస్తుంది. మూలవేతనం, కరువు భత్యం (డీఏ)పై వార్షికంగా 10% ఎన్పీఎస్ చందాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు వార్షిక మూలవేతనం, కరువు భత్యం రూ.5 లక్షలు ఉందనుకుంటే ఇందులో 10% రూ.50,000పై పన్ను చెల్లించక్కర్లేదు. ఎన్పీఎస్ అయినా లేదా ఈపీఎఫ్ అయినా ఉద్యోగ సంస్థ చేసే చందా లకు ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఒక ఉద్యోగి తరఫున సంస్థ వార్షికంగా రూ.7.5 లక్షలకు మించి జమ చేస్తే అప్పుడు పన్ను పడుతుంది. ఒక్కసారి మారిపోతే..? ప్రస్తుత విధానంలో కొనసాగొచ్చు లేదా నూతన విధానానికి మారిపోవచ్చన్న వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే, ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఏటేటా ఉంటుందా..? లేక ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే అందులోనే మరుసటి ఏడాది నుంచి రిటర్నులు దాఖలు చేయాలా..? అన్న సందేహం రావచ్చు. ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయవచ్చన్నది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఎటువంటి వ్యాపార ఆదాయం లేకపోతే, గడిచిన ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై రిటర్నులు ఏ విధానంలో దాఖలు చేయాలన్నది ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. ఇతర కేసుల్లో అయితే, ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే ఆ తర్వాత నుంచి అదే విధానంలో కొనసాగాల్సి ఉంటుంది’’ అని బడ్జెట్ మెమొరాండం స్పష్టం చేస్తోంది. ‘‘ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు ఏ పన్ను విధానాన్ని అయినా ఎంచుకోవచ్చు. పన్ను మినహాయింపులు, తగ్గింపులతో రిటర్నులు దాఖలు చేయవచ్చు లేదా నూతన విధానంలో తక్కువ పన్ను రేట్ల ప్రకారం రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార ఆదాయం లేని వారు నూతన పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ వ్యాపార ఆదాయం ఉన్న వారు మినహాయింపులు, తగ్గింపులను వినియోగించుకుని ప్రస్తుత విధానంలో పన్ను రిటర్నులు దాఖలు చేసినట్టయితే అప్పుడు పాత విధానంలోనే కొనసాగినట్టవుతుంది. తర్వాతి సంవత్సరాల్లోనూ నూతన విధానానికి మారే అవకాశం ఉండదు’’ అని ట్యాక్స్‌మన్ డాట్ కామ్ డీజీఎం వాధ్వా తెలిపారు. వ్యాపార ఆదాయం లేని పన్ను చెల్లింపుదారుడు ప్రస్తుత విధానం లేక నూతన ప్రతిపాదిత విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, వ్యాపార ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారునికి ఈ రెండింటిలో ఎందులో కొనసాగాలన్న ఆప్షన్ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఏ విధానంలో ఎంత భారం రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారు ► స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, సెక్షన్ 80సీ సాధనాల్లో రూ.1,50,000 పెట్టుబడులతోపాటు ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ.50,000 ను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మొత్తం రూ.2,50,000 ఆదాయంపై మినహాయింపులు పొందొచ్చు. ఎన్పీఎస్ లేకపోతే సెక్షన్ 80డీ కింద తన కుటుంబానికి, తల్లిదండ్రులకు చెల్లిస్తున్న వైద్య బీమా ప్రీమియంను మినహాయింపుగా చూపించుకున్నా సరిపోతుంది. మొత్తం ఆదాయం రూ.7,50,000 నుంచి మినహాయింపులు రూ.2.5 లక్షలను తీసివేయగా మిగిలిన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 అవుతుంది. పన్ను వర్తించే ఆదాయం మినహాయింపుల తర్వాత రూ.5లక్షలు దాటనందున సెక్షన్ 87ఏ కింద పన్ను చెల్లించకుండా రిబేటు పొందొచ్చు. ► కొత్త విధానంలో ఈ మినహాయింపులు లేవుకనుక.. మొదటి రూ.2,50,001 –5,00,000పై 5% కింద రూ.12,500, తర్వాతి రూ.2.5 లక్షలపై 10% పన్ను రేటు ప్రకారం రూ.25,000.. మొత్తం రూ.37,500 పన్ను చెల్లించాలి. ► ఒకవేళ పాత విధానంలోనే కొనసాగుతూ కొన్ని మినహాయింపులనే క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. ఉదాహరణకు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయని వారు, సెక్షన్ 80సీ కింద రూ.150,000, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, సెక్షన్ 80డీ కింద వైద్య బీమా ప్రీమియంను మినహాయింపులుగా చూపించుకోవచ్చు. అలా రూ.2,00,000ను మినహాయింపుగా చూపించుకున్నారనుకుంటే.. మిగిలిన రూ.50,000పై ప్రస్తుత విధానంలో 20 శాతం పన్ను రేటు ప్రకారం రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రస్తుత విధానమే బెస్ట్. ► ఒకవేళ సెక్షన్ 80సీ కింద కేవలం రూ.1,00,000 మాత్రమే వినియోగించుకుని, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000ను కూడా క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.1,00,000 అవుతుంది. దీనిపై 20% అంటే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ ప్రయోజనమే. ► సెక్షన్ 80సీ కింద రూ.50,000 వరకూ పెట్టుబడులు ఉంటే, దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 కలుపుకోవచ్చు. వైద్య బీమా ప్రీమియం రూ.12,000 వరకు చెల్లిస్తున్న వారు చాలా మందే ఉంటారు. ఈ విధంగా చూస్తే కనీస మినహాయింపులు రూ.1,00,000–1,50,000 వరకు ఎక్కువ మందికి ఉంటుంటాయి. వీరికి ప్రస్తుత విధానమే లాభకరం. రూ.10 లక్షల ఆదాయం విషయంలో... ► వీరు కూడా స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ, 80సీసీడీ కింద పూర్తిగా రూ.3,00,000ను వినియోగించుకుంటే అప్పుడు రూ.2,00,000 మొత్తంపై ప్రస్తుత విధానంలో 20 శాతం కింద రూ.40,000 పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం తీసుకుని వడ్డీ చెల్లిస్తుంటే ఆ విధంగా మరో రూ.2,00,000పైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించాల్సిన పన్ను సున్నాయే అవుతుంది. ఇప్పటి వరకు ఇల్లు సమకూర్చుకోని వారు రుణంపై ఇంటిని తీసుకోవడం ద్వారా ఈ ఆదాయ వర్గాల వారు ఏటా రూ.40,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ► అదే నూతన విధానంలో రూ.2,50,001–5,00,000పై 5 శాతం కింద రూ.12,500, 5,00,001–7,50,000 ఆదాయంపై 10 శాతం ప్రకారం రూ.25,000వేలు, తర్వాత రూ.2,50,000పై 15 శాతం పన్ను రేటు ప్రకారం రూ.37,500 మొత్తం రూ.75,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత విధానంలో కనీసం సెక్షన్ 80సీ, 80సీసీడీ, 80డీ, స్టాండర్డ్ డిడక్షన్లు వినియోగించుకున్నా నూతన విధానంతో పోలిస్తే తక్కువ పన్ను చెల్లిస్తే చాలు. ► ప్రస్తుత విధానంలో ఏ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోని వారు, అదే సమయంలో సెక్షన్ 80సీలో కేవలం రూ.లక్ష వరకు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అప్పుడు వీరు రూ.4,00,000పై ప్రస్తుత విధానంలోనే 20 శాతం పన్ను రేటుపై రూ.80,000 చెల్లించాల్సి వస్తుంది. కనుక వీరికి కొత్త విధానం బెటర్. ► ఒకవేళ ఇంటి రుణం లేని వారికి హెచ్ఆర్ఏ మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. కనుక దాన్ని పరిగణనలోకి తీసుకుని చూడాలి. హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు మూడు విధానాలున్నాయి. వేతనంలో భాగంగా ఉద్యోగి పొందుతున్న వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం.. లేదా మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50%, అదే నాన్ మెట్రో ప్రాంతాల్లోని వారి మూల వేతనంలో 40%.. లేదా మీరు వార్షికంగా చెల్లించిన అద్దె నుంచి మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. ఈ మూడింటింలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ► 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు తమ పెట్టుబడులను అన్నింటినీ లిస్ట్ చేసుకుని, మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. -
అనుసంధానం.. అటకెక్కినట్లే!
సాక్షి, హైదరాబాద్ : లభ్యత జలాలు అధికంగా ఉన్న నదీ ప్రాం తాల నుంచి నీటి కొరతతో అల్లాడుతున్న నదులకు అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్రం అటకెక్కించినట్లే కనబడుతోంది. నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యమిస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన కేంద్రం ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో దీని ప్రస్తావననే విస్మరించింది. నదుల అనుసంధాన ప్రక్రియకు నిధుల కేటాయింపుపై కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్ర జలశక్తి శాఖకు కేటాయించిన బడ్జెట్లోనూ ఈ అంశాన్ని పేర్కొనలేదు. దీంతో అసలు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఆసక్తి కేంద్రానికి ఉందా.. అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆశలపై నీళ్లు.. దేశవ్యాప్తంగా మొత్తంగా నదుల అనుసంధానానికి 30 రకాల ప్రణాళికలను కేంద్రం రచించింది. ఇందులో ఇప్పటికే కెన్–బెట్వా, దామనగంగ–పింజాల్, పార్–తాపి–నర్మద, పార్‌బటి –కలిసింధ్–చంబల్, మహానది–గోదావరి, గోదావరి–కృష్ణా–కావేరి (గ్రాండ్ ఆనకట్) నదుల అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేసింది. నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే రాష్ట్రాల్లో ప ర్యటించి చర్చలు జరిపింది. మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల ఆమోదం మేరకు కెన్–బెట్వా నదుల అనుసంధానాన్ని చేపట్టేందుకు కేంద్రం సిద్ధ మైంది. అయితే ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణకు మేలు చేసే గోదావరి–కావేరి అనుసంధానంపైనా స్పష్టత లేదు. గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలున్న దృష్ట్యా, ఇందులో 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) కొత్తగా జనంపేట నుంచి నీటిని తరలించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్‌లైన్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్నీ తెలంగాణ తిరస్కరించడంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్‌ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సానుకూలంగా ఉంది. దీని ద్వారా రాష్ట్ర పరిధిలో కనిష్టంగా 18 నుంచి 20లక్షల ఎకరాల మేర సాగు జరుగుతుందని చెబుతోంది. దీనిపై ఇప్పటివరకు ఎన్డబ్ల్యూఏ ఎటూ తేల్చలేదు. ఇచ్చంపల్లి వీలు కాకుంటే తుపాకులగూడెం నుంచి గోదావరి నీటి ని తరలించే ప్రతిపాదనకు తెలంగాణ సమ్మతి తెలుపుతున్నా ఎన్‌డబ్ల్యూడీఏ నుంచి స్పందన లేదు. ఒకవైపు అనుసంధాన మార్గాలపై ఇంతవరకూ స్పష్టత లేకపోగా మరోవైపు కేంద్రం ఈ అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో అనుసంధాన ప్రక్రియ ఇప్పట్లో ముందుకెళ్లడం కష్టసాధ్యంగానే ఉంది. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తన ప్రసంగంలో జల రవాణాకు వీలుగా ఈ ఏడాది దుభ్రి–సాధియా జల మార్గానికి భారీ నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. 2022 నాటికి 890 కిలోమీటర్ల జలమార్గాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇది మినహా నదుల అనుసంధాన ప్రస్తావన లేకపోవడం దీనికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తోందని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. -
ఇది జాలి లేని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అసమర్థమైందే గాక... పేదల వ్యతిరేకమైందని, జాలిలేనిదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ధ్వజమెత్తారు. వారం రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలకు ఉపయోగపడే అన్ని కార్యక్రమాలకూ నిధులు తక్కువగా కేటాయిం చడం దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మఫ్కమ్ ఝా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ‘కేంద్ర బడ్జెట్.. ఆర్థిక పరిస్థితి’’అన్న అంశంపై చిదంబరం ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూ ముంగిట్లోకి చేరిందని, ఈ విషయాన్ని అంగీకరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని విమర్శించారు. బడ్జెట్లో దేశ ఆర్థిక స్థితి ఏమిటన్నది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పలేకపోయారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని అమలుతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వెనుకబడిపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు 8.2%గా ఉన్న స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో చేరేందుకు డిమాండ్ లేమి ఒక కారణమైతే... పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం రెండో కారణమని చిదంబరం అన్నారు. గత కొన్నేళ్లలో ఆటోమొబైల్ రంగంలోనే 2 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, 296 వర్క్‌షాపులు మూతపడ్డాయన్నారు. ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జీఎస్టీ, డీఆర్ఐ వంటి సంస్థల్లో తక్కువ స్థాయి అధికారులకూ విచక్షణాధికారాలు కట్టబెట్టడంతో కంపెనీలు వేధింపులు ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, సామాజిక కార్యకర్త డాక్టర్ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలు మరింత పేదరికంలోకి.. గతేడాది బడ్జెట్లో అంచనాలు... పెట్టిన ఖర్చుల్లో భారీ అంతరం ఉందని, పన్ను వసూళ్లలో రూ.లక్ష కోట్ల వరకూ తగ్గుదల ఉంటే.. పెట్టిన ఖర్చు కూడా రూ.లక్ష కోట్ల వరకూ తక్కువగా ఉండటాన్ని మాజీ ఆర్థిక మంత్రి వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ వసూళ్లు రూ.లక్షల కోట్లు తక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందనేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలని చిదంబరం తెలిపారు. వ్యవసాయానికి, ఆహార సబ్సిడీ నిధుల్లో కోత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని పేదలు మరింత పేదరికంలోకి చేరే ప్రమాదముందని హెచ్చరించారు. -
బడ్జెట్లో తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం
ముంబై: తాజాగా తాను సమర్పించిన బడ్జెట్లో వివేకంతో, జాగ్రత్తతో కూడిన ప్రోత్సాహక చర్యలను ప్రకటించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శుక్రవారం ముంబైలో పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘దశాబ్ద కనిష్టానికి వృద్ధి రేటు క్షీణించిన సమయంలో కొన్ని నియోజకవర్గాలు బడ్జెట్లో భారీ ప్రకటనలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు గుర్తించాం. గతంలో ప్రోత్సాహకాలకు సంబంధించిన అనుభవం ఆధారంగా మేము.. తగినంత జాగ్రత్తతో, వివేకంతోనే బడ్జెట్లో వ్యవహరించాం. స్థూల ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకుని.. వినియోగం పెంచేందుకు, దీర్ఘకాలం పాటు పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఆస్తుల కల్పనకు తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం’’ అని సీతారామన్ వివరించారు. ఎఫ్ఆర్డీఐ బిల్లుపై పని జరుగుతోంది.. వివాదాస్పద ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లుపై ఆర్థిక శాఖా పని కొనసాగిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ముందుకు తిరిగి ఎప్పుడు వస్తుందన్నది స్పష్టంగా చెప్పలేనన్నారు. సంక్షోభంలో ఉన్న బ్యాంకులను ఒడ్డెక్కించేందుకు డిపాజిటర్ల డబ్బులను కూడా వినియోగించుకోవచ్చన్న వివాదాస్పద క్లాజులు బిల్లులో ఉండడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడం వల్ల గతంలో ఈ బిల్లును సభ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. -
పతన ఆర్థిక వ్యవస్థ పట్టదా?
2020 బడ్జెట్ ఏమంత పెద్దగా కానీ, అసాధారణంగా గానీ లేదన్న సాధారణ భావమే మెల్లమెల్లగా ఏర్పడుతోంది. ఈ బడ్జెట్లోనూ కీలకమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. అదొక షరా మామూలు బడ్జెట్‌గానే మిగిలింది. నిర్మలా సీతారామన్ సమర్థతలను అంచనా వేయడానికి ఇది సమయం కాదు. అరుణ్ జైట్లీ తొలి అయిదేళ్లు ఆర్థికమంత్రిగా ఉండేవారు. కాని తనకు పేరు తెచ్చిపెట్టే గొప్ప అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వ్యక్తి సరసన నిలబడేందుకు, అలాంటి పేరు తెచ్చుకునేందుకు ఆర్థికమంత్రి ముందు ఇప్పుడు మంచి అవకాశం ఉంది. పైగా అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఈ కోణంలో చూస్తే 2020 బడ్జెట్ కూడా అలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్న బడ్జెట్ అనే చెప్పాల్సి ఉంటుంది. సుప్రసిద్ధ బ్రిటన్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్ 50 ఏళ్ల క్రితం.. రాజకీయాల్లో ఒక వారం రోజులు అంటే చాలా ఎక్కువ కాలం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో వారం రోజులే అధికం అనుకుంటే బడ్జెట్ విషయంలో వారం రోజులంటే మరీ ఎక్కువ కాలం అనే చెప్పాలి. ఫిబ్రవరి1న కేంద్ర బడ్జెట్‌ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించినప్పుడు చాలామంది తక్షణ స్పందనలు వ్యక్తీకరించారు. కానీ ఫిబ్రవరి 1న మనం చేసిన చాలా సరళ నిర్ధారణల విషయంలో వారం రోజుల తర్వాత, అనిశ్చితి నెలకొంది. దీంతో బడ్జెట్‌పై రెండో అభిప్రాయం ప్రకటిం చడం మొదలెడుతున్నాం. ఒకవిషయం మాత్రం మారలేదు. బడ్జెట్ ప్రసంగాలకు సంబంధించిన పాత రికార్డులన్నింటినీ నిర్మల బద్దలు గొట్టేశారు. ఆర్థిక మంత్రి 2 గంటల 45 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ప్పుడు కొంతమంది మంత్రులు నిద్రపోయారు కూడా. ఇప్పుడు సమస్య ఏమిటంటే అంత సుదీర్ఘ ప్రయత్నంలో విషయ గాఢత ఏమైనా ఉందా అన్నదే. అంత సుదీర్ఘ ప్రసంగం తర్వాత ఏర్పడిన ఉల్లాస స్థితిలో మనం ప్రతి విషయంలోనూ ముఖవిలువను మాత్రమే తీసుకుంటాం. కానీ కొంత సమయం తర్వాత వాస్తవంగా బడ్జెట్ పూర్తి భిన్నంగా ఉందని గ్రహిస్తాం. 2020 బడ్జెట్లో ఏమంత పెద్దగా కానీ, అసాధారణంగా గానీ లేదన్న సాధారణ భావమే మెల్లమెల్లగా ఏర్పడుతోంది. కీలకమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. అదొక షరా మామూలు బడ్జెట్‌గానే మిగిలింది. ఆర్థికమంత్రిని కాస్త సంప్రదాయకంగానే ఉండాలని, ఆర్థికవ్యవస్థ కుంగుబాటు సహజంగానే దాని ముగింపును చేరుకునేంతవరకు (అంటే మళ్లీ పుంజుకోవడం ప్రారంభమయ్యేంతవరకు) వేచి చూడాలని ఎవరో ఆమెకు సలహా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పతనబాట పట్టాక కొంతకాలం శిక్షను అనుభవించాక, సహజంగానే అది కోలుకుంటుందని ఆర్థిక శాస్త్రం మనకు పాఠం చెబుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ తన అత్యంత పతనస్థాయికి చేరుకుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధిబాటను చేపడుతుందనే భావన ఉంటోంది. మోదీ ప్రభుత్వ ఆశ కూడా అదేననిపిస్తోంది. 2019 అక్టోబర్ నుంచే మీడియా, విభిన్న భావాలు కలిగిన ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా 2020 బడ్జెట్ బిగ్ బ్యాంగ్ బడ్జెట్‌గా ఉంటుం దని, ఆర్థిక వ్యవస్థకు అధిక ద్రవ్యం వచ్చి చేరుతుందని, భారీ సంక్షేమ పథకాలు మొదలై ప్రజల చేతుల్లో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని కలలు కన్నారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ తాజా బడ్జెట్లో కనిపించలేదు. ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు దాంట్లోకి భారీగా డబ్బును పంపించడం ద్వారా లేక డబ్బును అధికంగా ముద్రించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని ఆర్థిక సిద్ధాంతం తెలుపుతోంది. ఇది వినియోగదారుల్లో డిమాండును సృష్టించి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడుపుతుంది. కానీ 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుతో ప్రజల చేతుల్లోని డబ్బు, సహజసిద్ధమైన వారి డిమాండ్ శక్తి మటుమాయమైపోయింది. లక్షలాదిమంది తమ ఉద్యోగాలు కోల్పోయారు, చిన్నచిన్న వ్యాపారాలు మూసివేతకు గురయ్యాయి. రైతులు పండించిన పంటకు తగిన డబ్బులు రాలేదు. దేశవ్యాప్తంగా ఆర్థిక కల్లోలం చెలరేగింది, ఆరోజు చమురు ధరలు తగ్గిన కారణంగానే ఆర్థిక వ్యవస్థ తనకు తానుగా కోలుకుని తీవ్ర కుంగుబాటు బారినుంచి తప్పించుకుంది. కానీ ఆనాటి పెద్దనోట్ల రద్దు దుష్ఫలితాలు ఇప్పటికీ దేశం అనుభవిస్తూనే ఉంది. పైగా జీడీపీ సాధారణ వృద్ధిరేటు 10 శాతంగా ఉంటుందని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. అంటే జీడీపీ వృద్ధి ప్లస్ ద్రవ్యోల్బణ రేటు అనీ ఆమె ప్రకటన అర్థం తప్ప జీడీపీ వాస్తవ వృద్ధి కాదని అర్థం. 2016 నవంబర్ 8 నాటి పెద్దనోట్ల రద్దు ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. చాలామంది ప్రజల, ఆర్థిక వేత్తల అంచనాలను ఈ బడ్జెట్ అందుకోనప్పటికీ బడ్జెట్లోని కొన్ని సానుకూల అంశాలను ఎత్తిపట్టాల్సి ఉంటుంది. 1. పన్ను వివాదాల కేసులు: దేశంలో 4.86 లక్షల పన్ను వివాదాలపై కేసులు కొనసాగుతున్నాయని ఆర్థికమంత్రి చెప్పారు. అంటే ఈ వివాదాల్లో దాదాపు రూ. 15 లక్షల కోట్లు ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇలా కేసుల రూపంలో స్తంభనకు గురైన భారీ సంపదను తప్పకుండా వెలికి తీసుకురావాలని ఆమె చెప్పారు. పన్ను కేసులు పరిష్కారమైతే ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం ఆమేరకు లాభపడతారు. భారీగా ఇరుక్కుపోయిన ఈ ఆదాయాన్ని వెలికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆర్థిక అవార్డులు, వివాదాలతో కూడిన కేసును పరిష్కరించాలనుకుంటే మరిన్ని ఆరోపణలు, న్యాయమూర్తుల పేర్లకు మరకలంటించడం చేస్తారని దానికి బదులుగా ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో 50 శాతం రాయితీని కల్పించే విషయం ఆలోచిస్తోందని ఆర్థికమంత్రి చెప్పారు. 2. భారతీయ విద్యాసంస్థల్లో విదేశీ మదుపులను అనుమతించడం చాలా సానుకూలతను కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాల నాణ్యతను ఇది పెంచుతుంది. దీనివల్ల భారతదేశంలో విదేశీ విద్యార్థులు కూడా చదువుకునే అవకాశాలను పెంచుతుంది. ఈరోజు అమెరికాలో 10 లక్షల మంది, చైనాలో 5 లక్షలమంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ రంగంలో భారత్ కూడా పోటీపడాల్సిన అవసరముంది. 3. ప్రభుత్వ ఆసుపత్రులతో వైద్య కళాశాలలను అనుసంధానిం చడం. ప్రస్తుతం ప్రతి వైద్య కళాశాలకు కనీసం 750 పడకల పెద్ద ఆసుపత్రి అనుసంధానమై ఉండాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానం కావాలని తాజా బడ్జెట్ పేర్కొంది. దీనికి ఆర్థిక సహాయం కూడా అవసరం. దేశంలో మరిన్ని వైద్య కళాశాలల అవసరం ఉంది కాబట్టి ఈ చర్య తప్పక దోహదం చేస్తుంది. 4. ఆరోగ్యరంగానికి గరిష్టంగా నిధులు పెంచారు. గత సంవత్సరం ఈ రంగానికి రూ. 65,000 కోట్లు కేటాయించగా ఈ ఏడాది దాన్ని రూ. 67,500 కోట్లకు పెంచారు. ప్రజల వినియోగ డిమాండును ఇది తప్పకుండా పెంచుతుంది. 5. భారతదేశంలో బహిరంగ మలవిసర్జన ప్రపంచంలోనే అత్యధికం కాబట్టి పారిశుధ్య కల్పన అనేది దేశంలో అత్యంత ప్రధానమైన సంక్షేమ చర్య, ఆరోగ్య పథకంగా ఉంటోంది. ఈ రంగానికి తాజా బడ్జెట్లో గణనీయంగా నిధులు పెంచారు. గతేడాది పారిశుధ్యానికి రూ. 9,600 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 12,300 కోట్లకు పెంచారు. అంటే 28 శాతం పెరుగుదల అన్నమాట. ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలుచేసి పబ్లిక్ టాయ్లెట్లను అధికంగా నిర్మించాల్సిన అవసరముంది. గత ఆరు బడ్జెట్ల ద్వారా నరేంద్రమోదీ చాలా ఆశాభంగం కలిగించారు. మోదీ విదేశీ వ్యవహారాలు, రక్షణ, అంతర్గత భద్రత, స్వచ్ఛభారత్ వంటి అనేక పథకాలను సమర్థవంతంగా నిర్వహించారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నందున మరింత మంచి బడ్జెట్‌ను దేశం కోరుకుంటోంది. కాని తాజా బడ్జెట్ కేటాయింపులు చూస్తే జరుగుతున్న పరిణామాలను అలాగే కొనసాగనిద్దాం అనే ధోరణే కనబడుతోంది కానీ నది మధ్యలో ఉన్న బోటును షేక్ చేసే దృక్పథాన్ని ఇది ప్రదర్శించడం లేదు. ప్రస్తుత బడ్జెట్ పరిస్థితి నాకు ఫ్రెంచ్ రచయిత జీన్ అల్ఫాన్స్ కార్ 130 ఏళ్ల క్రితం చెప్పిన మాటలను గుర్తుకు తెస్తోంది. పరిస్థితులు ఎంత అధికంగా మారితే, అంత ఎక్కువగా అవి అలాగే కొనసాగుతుంటాయి అని తన వ్యాఖ్య. దీనికనుగుణంగానే గత ఆరు బడ్జెట్లు యధావిధిగా కొనసాగుతూ వచ్చాయి. మార్పు అన్నదే కనిపించలేదు. ఈ ఆరేళ్లలో ఏమీ జరగని నేపథ్యంలో.. త్వరలోగానీ, తర్వాత కానీ అలాంటి అద్భుతమైన బడ్జెట్ ఏనాటికైనా వస్తుందా అనే సమస్య తలెత్తక మానదు. అరుణ్ జైట్లీ తొలి అయిదేళ్లు ఆర్థికమంత్రిగా ఉండేవారు. కాని తనకు పేరు తెచ్చిపెట్టే గొప్ప అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. నిర్మలా సీతారామన్ సమర్థతలను అంచనా వేయడానికి ఇది సమయం కాదు. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వ్యక్తి సరసన నిలబడేందుకు, అలాంటి పేరు తెచ్చుకునేందుకు ఆమెముందు ఇప్పుడు మంచి అవకాశం ఉంది. పైగా అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఈ కోణంలో చూస్తే 2020 బడ్జెట్ కూడా అలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్న బడ్జెట్ అని కూడా చెప్పాల్సి ఉంటుంది. వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావువిశ్లేషణ -
బడుగులకు ఈ బడ్జెట్‌తో ఒరిగిందేమిటి?
బ్రిటిష్‌వారి తోడ్పాటుతో దళితులకు, బలహీనవర్గాలకు అంబేడ్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, విదేశీ విద్య స్కాలర్షిప్లు రూపొందించారు. కానీ 70 ఏళ్ల తర్వాత కూడా నేటి పాలకుల విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న వెనుకబాటుతనాన్ని ఎంత మాత్రం తొలగించే స్థితిలో లేవు. ఎస్టీ విద్యార్థుల విదేశీ చదువులకు గత నాలుగేళ్ళుగా రెండు కోట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. 2 కోట్ల రూపాయల మొత్తంతో ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటారో ఆ బడ్జెట్ రూపొందించిన వారే జవాబు చెప్పాలి. ఇది ముమ్మాటికీ దళిత, బలహీన వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. దళితులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను కాలరాయడమే తప్ప మరొకటి కాదు. కానీ ఇవే ప్రభుత్వాలు ధనిక రైతులకు, పారిశ్రామిక వేత్తలకు, వేలకోట్ల అధిపతులకు ఉపకరించే ఎన్నో సబ్సిడీలను అందిస్తూండటం గమనార్హం. ‘‘సామాజిక అన్యాయం, ఇతర దోపిడీ విధానాల నుంచి బలహీన వర్గాలను ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలను, తెగలను రక్షించడానికీ, విద్య, ఆర్థిక రంగాల్లో వారిని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, అందుకుగాను ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి’’ అంటూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–46 నిర్దేశిస్తున్నది. భారత రాజ్యాంగంలోని నాలుగో భాగమైన ఆదేశిక సూత్రాలలో ఈ విషయాన్ని పొందుపరిచారు. అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలలో ఈ వర్గాల వారిని తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. దీనర్థం సమాజ ప్రగతికీ, సమాజ పురోగమనానికీ వేసే ప్రతి అడుగులో అట్టడుగున పడినలిగే వర్గం ఒకటుంటుందని గమనంతో వ్యవహరించడం ప్రభుత్వాల బాధ్యత అని నొక్కి చెప్పడమే. అదే విధంగా ఆర్టికల్–38 కూడా మరొక రకమైన ఆదేశాలను ఇచ్చింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని సాధించడానికి అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు కృషిచేయాలని, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తొలగించాలని కూడా ఆర్టికల్ – 38 ఆదేశిస్తున్నది. అంటే ప్రాంతాల మధ్య అభివృద్ధి కార్యక్రమాల్లో నిధుల కేటాయింపుల్లో వ్యత్యాసం చూపకూడదని దాని అర్థం. ఈ అంశాల్లో ఎటువంటి వివక్షా తగదని చెప్పడమే. అయితే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల మధ్య వ్యత్యాసాలను పెంచుతున్నాయ్ కానీ తగ్గించడం లేదు. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపుల్లో దీని ప్రభావం స్పష్టంగా కనపడుతున్నది. ప్రభుత్వాలకు నాయకత్వం వహించే నాయకులు మాట్లాడే మాటలకన్నా, వారు బడ్జెట్ కేటాయింపుల్లో చూపెడుతున్న విషయాలు అసలు అక్షరసత్యాలు. ఎన్ని రకాల మాటలు మాట్లాడినా చివరకు వారి చిత్తశుద్ధి తేలేది బడ్జెట్ వడ్డనలోనే అనేది సత్యం. ముందుగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికీ, వారి అభివృద్ధికీ కేటాయించిన నిధులను పరిశీలిస్తే, ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఈ రెండు వర్గాలకు కూడా విద్యాభివృద్ధిపైనే నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే వాటిపైన పెడుతున్న ఖర్చును చూస్తే మనకు అసలు విషయం తెలుస్తుంది. ఇందులో పెద్ద కేటాయింపులు పోస్ట్–మెట్రిక్ స్కాలర్‌షిప్‌లే. పదవ తరగతిపైన విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరూ ఈ స్కాలర్‌షిప్‌ల వల్లనే చదువగలుగుతున్నారు. ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కేటాయింపులు చూస్తే, 2017–18లో రూ. 3,414 కోట్లు ఖర్చు చేస్తే, 2019–20లో రూ. 2,926.82 కోట్లు కేటాయించారు. అది 2020–21 సంవత్సరానికి వచ్చేసరికి రూ. 2,987 కోట్లు కేటాయిం చారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీల సంక్షేమం కోసం ప్రత్యేకించి కేటాయించింది ఈ ఆర్థిక సంవత్సరం రూ. 7,154 కోట్లు. ఇందులో రూ. 2,987 కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లే. అయితే ఈ కేటాయింపులు ఇప్పుడు ఎస్సీ కుటుంబాల్లోని విద్యార్థుల విద్యావకాశాలను ఏవిధంగానూ తీర్చలేవు. అందువల్ల రాష్ట్రప్రభుత్వాల మీద భారం పడుతున్నది. దీనితోపాటు, కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయె¯Œ్స ప్రభుత్వం, రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌లు ప్రవేశపెట్టడం వల్ల ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరిశోధక విద్యనభ్యసించారు. కానీ గత కొన్నేళ్లుగా కేటాయింపులు బాగా తగ్గిపోయాయి. 2019–20లో రూ.360 కోట్లు ఉంటే, ప్రస్తుత సంవత్సరం రూ. 300 కోట్లకు తగ్గించారు. దీనివల్ల రీసెర్చ్ వైపు వెళ్లడానికి ఇష్టపడే విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. విదేశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా ఎటువంటి ప్రోత్సాహం లేదు. గత సంవత్సరం రూ. 20 కోట్లు ఉంటే, ఈ సంవత్సరం అదే అంకెను యథావిధిగా కొనసాగించారు. 2018–19లో దీనికోసం రూ. 15 కోట్లు కేటాయించి రూ. 5.97 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్సీలలోని బాల బాలికల హాస్టల్స్ నిర్మాణం, నిర్వహణకు అందించే మొత్తాలు కూడా ఆశ్చర్యకరంగా తగ్గిపోతున్నాయి. 2017–18 సంవత్సరంలో రూ. 74.91 కోట్లు ఖర్చు చేస్తే, 2018–19లో రూ. 160.5 కోట్లు కేటాయించి దానిని రూ. 36.56 కోట్లకు కుదించి ఖర్చు చేయడం ఎంతటి తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమో అర్థం అవుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో ఒక ముఖ్యమైన వ్యాఖ్యను మనం చూశాం. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలలో పారిశుధ్య కార్మికులను ఇక వినియోగించేది లేదని ప్రకటించారు. కానీ అందుకోసం ఆమె ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయలేదు. పదిహేనేళ్ళ క్రితం పారిశుద్ధ్య కార్మికుల వ్యవస్థను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు. కానీ దాని అమలు ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికీ ఇంకా ఒక లక్ష మంది వరకు మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఒకవేళ ఆర్థికమంత్రి ప్రకటన నిజం కావాలనుకుంటే అందుకు వారి పునరావాసానికి తగు చర్యలు తీసుకోవాలి. తగిన కార్యక్రమాలు రూపొం దించాలి. అందుకు గాను బడ్జెట్ కావాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం గత కొంతకాలంగా చేస్తోన్న కేటాయింపులు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. లక్ష మందికి పునరావాసం కల్పించడానికి దాదాపు రూ. 220 కోట్లు కావాలి. కానీ ఈ సంవత్సరం కేటాయిం చింది రూ. 110 కోట్లు మాత్రమే. ఎస్టీ విద్యార్థులు కళాశాల విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించడానికి ఇస్తున్న స్కాలర్షిప్ కింద 2019–20లో రూ. 19.5 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ.8 కోట్లకు కుదించారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఎస్టీలకు గత సంవత్సరం రూ. 440 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత సంవత్సరం దానిని రూ. 400 కోట్లకు కుదించారు. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు కూడా 1,826 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు కేటాయించి చేతులు దులుపుకున్నారు. మొత్తం ఆదివాసీల విద్య కోసం గత సంవత్సరం రూ. 2,266 కోట్లు ఉంటే ఈ సంవత్సరం నామమాత్రంగా రూ. 2,300 కోట్లకు కోత కోశారు. ఎస్టీ విద్యార్థుల విదేశాల చదువులకు గత నాలుగేళ్ళుగా రూ.2 కోట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. 2 కోట్ల రూపాయల మొత్తంతో ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటారో ఆ బడ్జెట్ రూపొందించిన వారే జవాబు చెప్పాలి. ఒక్కొక్క కోర్సుకి కనీసం 20 నుంచి 25 లక్షల ఫీజు ఉంటుందని అంచనా. ఇలా ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడంలేదు. ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి కేంద్రం అందించే నిధుల దగ్గర ఖాళీస్థలం కనిపించడం చూస్తే ఈ ప్రభుత్వ వనవాసి కళ్యాణం ఎంత అద్భుతంగా ఉందో అర్థం అవుతుంది. హిందువుల సెంటిమెంట్‌తో రాజకీయంగా బలపడాలని చూస్తున్న ప్రభుత్వం, వారిపట్ల చూపుతున్న శ్రద్ధ చాలా నిరాశను కలుగజేస్తున్నది. జాతీయ స్కాలర్‌షిప్‌ల కేటాయింపులు అంటే రీసెర్చ్ స్కాలర్స్ కోసం గత సంవత్సరం రూ. 70 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 52 కోట్ల 50 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ఇటీవల చేర్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాటా కూడా ఉంది. బీసీల విదేశీ చదువులకోసం గత సంవత్సరం రూ. 26 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 35 కోట్లకు పెంచారు. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావించిన పథకాలలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, విదేశీ విద్య స్కాలర్షిప్లు బాబా సాహెబ్ అంబేడ్కర్ చొరవతో స్వాతంత్య్రానికి ముందే 1944లో ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లోనే అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదించి ఇటువంటి పథకాలను రూపొందించారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఎంత మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న వెనుకబాటుతనాన్ని తొలగించే స్థితిలో లేవు. కానీ ఇవే ప్రభుత్వాలు ధనిక రైతులకు పారిశ్రామిక వేత్తలకు, వేలకోట్ల అధిపతులకు ఉపకరించే ఎన్నో సబ్సిడీలను అందిస్తూండటం గమనార్హం. ఇప్పటికీ 40 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదంటే, హిందువుల పట్ల, హిందూ సెంటిమెంట్‌తో రాజకీయాలు నడుపుతోన్న పార్టీకీ, ప్రభుత్వానికీ ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు రాజ్యాంగంలో పేర్కొన్న ఎన్నో విషయాలను విస్మరిస్తుంటే ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం నిర్దేశించిన సూత్రాలను కనీసం పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఇది ఎంతమాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తినికానీ, రాజ్యాంగబద్ధ పాలనను కానీ అనుసరిస్తున్నట్టుగా భావించలేం. ఇది ముమ్మాటికీ దళిత, బలహీన వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. దళితులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను కాలరాయడమే తప్ప మరొకటి కాదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
జంట నగరాల నుంచి 11 ప్రైవేట్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా వెల్లడించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ఈ రైళ్లు ప్రయాణికులకు సేవలందజేయనున్నాయి. మరోవైపు ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి-గుంటూరు మధ్య తేజాస్ రైలు ప్రవేశపెట్టనున్నారు. చర్లపల్లి టర్మినల్ విస్తరణకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయించగా, ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.40 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఘట్కేసర్-యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు కేంద్రం ఈ బడ్జెట్లో కేవలం రూ.10 లక్షలు కేటాయించడం గమనార్హం. మొత్తంగా గత నాలుగైదేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టులకు కొంతమేరకు నిధులు కేటాయించడం మినహా ఈ సారి ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించలేదు. (కిసాన్ రైలు) ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు... ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్‌రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ట్రాక్‌ల ఏర్పాటు, మరమ్మతులు, నిర్వహణ, రైళ్ల భద్రత,లొకోపైలెట్లు, గార్డులు, సిబ్బంది వంటివి మాత్రమే రైల్వే పరిధిలో ఉంటాయి. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, ఆన్‌బోర్డు సేవలు,రైళ్ల పరిశుభ్రత, వైఫై సేవలు వంటివి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తాయి. ఎయిర్‌లైన్స్ పలు ప్రాంతాలకు ఫ్లైట్ సర్వీసులను నడుపుతున్నట్లుగానే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేట్ రైళ్లు నడువనున్నాయి. టిక్కెట్ల రిజర్వేషన్లు ఆన్లైన్ పరిధిలో ఉంటాయి. రిజర్వేషన్ కేంద్రాల నిర్వహణ పై ఇంకా స్పష్టత రాలేదని జీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 150 ప్రైవేట్ రైళ్లను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారమన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరం నుంచి వివిధ మార్గాల్లో ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి టర్మినల్ నుంచి ఈ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. చర్లపల్లి-శ్రీకాకుళం, చర్లపల్లి-వారణాసి, చర్లపల్లి-పన్వేల్, లింగంపల్లి-తిరుపతి,సికింద్రాబాద్-గౌహతి, చర్లపల్లి-చెన్నై, చర్లపల్లి- షాలిమార్, విజయవాడ-విశాఖ, తిరుపతి-విశాఖ, తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. (బడ్జెట్లో కూతపెట్టని రైల్వే!) అలాగే ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి-గుంటూరు, ఔరంగాబాద్-పన్వేల్ మధ్య తేజాస్ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్లలో కొన్ని డైలీ ఎక్స్‌ప్రెస్‌లుగాను, మరి కొన్ని వారానికి రెండు సార్లు చొప్పున తిరుగుతాయి. కొన్ని రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు గా నడుపుతారు.ఈ రైళ్ల కోసం త్వరలో ఓపెన్ టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే దశలవారీగా వీటిని పట్టాలెక్కేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది. 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు చర్లపల్లి-వారణాసి లింగంపల్లి-తిరుపతి చర్లపల్లి-పర్వేలి విజయవాడ-విశాఖపట్టణం చర్లపల్లి-శాలిమార్ ఔరంగబాద్-పన్వెలి సికింద్రాబాద్-గౌహతి చర్లపల్లి-చెన్నయ్ గుంటూరు-లింగంపల్లి ఈ రూట్లలో తేజస్ రైళ్లు వచ్చే అవకాశం గుంటూరు-లింగంపల్లి ఔరంగబాద్-పన్వెలి చర్లపల్లి-శ్రీకాకుళం -
మెప్పించని విన్యాసం
ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, మందగమనంతో అది అందరినీ భయపెడుతున్న వేళ... వృద్ధి రేటు పల్టీలు కొడుతూ, ద్రవ్యోల్బణం పైపైకి పోతున్న వేళ బడ్జెట్ విన్యాసం కత్తి మీది సాము. ఖజానా రాబడి తగ్గుతూ ఎంచుకున్న లక్ష్యాల సాధనకు అవసరమైన నిధుల సమీకరణకు సమస్యలెదురైనప్పుడు అందరినీ మెప్పించేలా బడ్జెట్ ప్రతిపాదనలుండటం అసాధ్యం. మెప్పిం చడం మాట అటుంచి ఇప్పుడున్న సంక్షోభం పేట్రేగకుండా చూస్తే అదే పదివేలు. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2020–21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతి పాదనలు అందుకనుగుణంగా ఉన్నట్టు తోచదు. వినిమయాన్ని పెంచడానికి మధ్యతరగతి చేతుల్లో డబ్బులుండేలా చూడాలి. ఉపాధి అవకాశాలు పెరిగితే వారికి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయం పన్నుల రూపంలో పెద్దగా పోనప్పుడు వారు తమ అవసరాల కోసం ఖర్చు పెట్ట గలుగుతారు. అయితే ఈ క్రమంలో ఖజానా పెద్దగా నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తుంది. పన్ను వసూళ్లు తగ్గకుండావున్నప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక ప్రజల కొనుగోలు శక్తి పెంచి విని మయం బాగుండేలా తీసుకునే చర్యలకూ, ఖజానా దండిగా నిండటానికి చేసే ప్రయత్నాలకూ మధ్య వైరుధ్యం ఉంటుంది. దీన్నెంత ఒడుపుగా చేయగలుగుతారన్న దాన్నిబట్టే ఆర్థికమంత్రి చాకచక్యం వెల్లడవుతుంది. మిగిలినవాటి మాటెలావున్నా ప్రతి బడ్జెట్‌కు ముందూ మధ్యతరగతి ఆశగా ఎదురు చూసేది ఆదాయం పన్ను మినహాయింపు. కేంద్ర ఆర్థికమంత్రి కనికరించి గడిచిన సంవత్సరంకన్నా పన్ను భారం మరింత తగ్గిస్తే బాగుండునని మధ్యతరగతి జీవులు ఆశిస్తారు. ఆ విషయంలో ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. ఈసారి నిర్మలా సీతారామన్ ఆదాయం పన్ను వసూలుకు సంబం ధించి రెండు రకాల విధానాలు ప్రతిపాదించారు. ఇప్పుడున్న మూడు శ్లాబ్‌లను యధాతథంగా కొనసాగిస్తూ, దాంతోపాటు ఏడు కొత్త శ్లాబ్‌లు ప్రకటించారు. కొత్త శ్లాబుల్ని ఎంచుకుంటే కొన్ని మినహాయింపులు ఎగిరిపోతాయని ఆమె చావు కబురు చల్లగా చెప్పడంతో అందరూ నీరసపడ్డారు. ఇంతకూ కేంద్ర ఆర్థికమంత్రి చేసిందల్లా ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛ వేతన జీవులకివ్వడమే. రెండూ కత్తులే. ఏ కత్తి మెత్తగా తెగుతుందో ఎవరికి వారు తేల్చుకోవాల్సివుంటుంది. నిపుణులు చెబు తున్నదాన్నిబట్టి ఈ చర్య వల్ల ఆదాయం పన్ను గణన, రిటర్న్‌ల దాఖలు ఎంతో సంక్లిష్టంగా మారాయి. కొత్త శ్లాబుల్లోకి మారదల్చుకున్నవారికి నిరాకరిస్తున్న మినహాయింపులు హేతుబద్ధంగా అనిపించడం లేదు. రూ. 15 లక్షల వార్షిక ఆదాయం ఉండేవారికి పాత విధానంలో రూ. 2,73,000 ఆదాయం పన్ను చెల్లించాల్సివస్తే... కొత్త విధానం ప్రకారం రూ. 1,95,000 చెల్లిస్తే సరిపోతుంది. అంటే కొత్త విధానంలో రూ. 78,000 మిగులుతుంది. కానీ అదే సమయంలో వారు గృహ రుణంపై చెల్లించే వడ్డీ, బీమా ప్రీమియంలు, పిల్లల చదువులకయ్యే ఫీజులు, పీపీఎఫ్ వంటివాటిపై ఇప్పు డున్న మినహాయింపులన్నీ కోల్పోతారు. ఇవే కాదు... 80జీ కింద విరాళాలపై ఉండే మినహాయింపు, 80 జీజీ కింద నెలకు రూ. 5,000 వరకూ ఉండే మినహాయింపు మాయమవుతాయి. ఇలా దాదాపు 70కి పైగా మినహాయింపులను తొలగించారు. అయితే మున్ముందు సమీక్షించి మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సంగతలా వుంచితే... గృహ నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వర్త మానంలో ఇలా మినహాయింపులు తొలగించడం ఆ రంగానికి చేటు కలిగించదా? అలాగే బీమా ప్రీమియంలు చెల్లించేవారికిచ్చే మినహాయింపులు కూడా కొత్త విధానంలో కనుమరుగయ్యాయి. ఆదాయం పన్ను మినహాయింపు కోసం అధిక శాతంమంది ఆశ్రయించేది బీమా ప్రీమియంలు చెల్లించడం. ఆ మినహాయింపు కాస్తా ఎత్తేస్తే, ఎవరైనా బీమా జోలికి వెళ్తారా? అది ఆ వ్యాపారంపై ప్రభావం చూపదా? ఉన్నంతలో సాగురంగానికీ, గ్రామీణ రంగానికీ కేటాయింపులు మెరుగ్గానే ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచడం మంచి చర్యే. జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)లోని వాటాలను విక్రయించదల్చుకున్నట్టు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం కేంద్రానికి ఎల్ఐసీలో పది శాతం వాటావుంది. ఇందులో ఏమేరకు విక్ర యిస్తారో చూడాలి. దండిగా లాభాలు ఆర్జిస్తున్న ఎల్ఐసీలో ప్రైవేటీకరణకు వీలుకల్పించే ఈ చర్య అమలు అంత సులభం కాదు. దీన్ని ప్రతిఘటిస్తామని బీమా ఉద్యోగులు హెచ్చరించారు. కేంద్రం నిధులు సమకూరిస్తే తప్ప నడిచే అవకాశం లేని సంస్థలను వదిలిపెట్టి నిక్షేపంలా ఉండే సంస్థలను ప్రైవేటు పరం చేయడమేమిటన్నది వారి ప్రశ్న. ఎల్ఐసీ ఏ రోజూ ఆర్థికంగా ఇబ్బందుల్లోపడలేదు. ప్రభుత్వాన్ని ప్రాధేయపడలేదు. సరిగదా... నష్టాల్లో మునిగిన అనేక పబ్లిక్ రంగ సంస్థల్ని బతికిం చడానికి దాని నిధులే అక్కరకొస్తున్నాయి. బీమా రంగంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించినా, ప్రజలు ఎల్ఐసీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ ఆ సంస్థే అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ నేప థ్యంలో కేంద్రం పునరాలోచించడం ఉత్తమం. వివిధ మౌలిక సదుపాయ రంగ ప్రాజెక్టులకు అవస రమైన నిధులు సమీకరిస్తూనే, ద్రవ్యలోటు రాకుండా చూడటానికి ఎల్ఐసీలోనూ, ఐడీబీఐలోనూ ఉన్న వాటాలను కేంద్రం విక్రయించదల్చుకుంది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ. 90,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది ఏమేరకు సాధ్యమో చూడాల్సివుంది. అయితే ద్రవ్య లోటును నిర్దేశించిన పరిమితికి లోబడివుండేలా చూడాలన్న లక్ష్యంలో సంక్షేమ పథకాలకు కోత పడకుండా చూడటం ముఖ్యం. బడ్జెట్ గణాంకాలు గమనిస్తే ముగుస్తున్న సంవత్సరంలో ఆహార సబ్సిడీలో రూ. 75,532 కోట్లు, గ్రామీణ ఉపాధిలో రూ. 9,502 కోట్లు కోతపడ్డాయి. ప్రజల్లో వినిమయాన్ని పెంచి, డిమాండ్ పెరిగేలా చేసినప్పుడే తయారీ రంగం కోలుకుంటుంది. అందు కవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటేనే వృద్ధి రేటు నిర్మలా సీతారామన్ ఆశించినట్టు 10 శాతానికి చేరుతుంది. -
‘సంపద సృష్టికే బడ్జెట్ పెద్దపీట’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ వ్యయ కేటాయింపులు సంపద సృష్టించే లక్ష్యంతో చేపట్టినవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ నిధుల ప్రవాహానికి సంబంధించి బడ్జెట్‌పై అంచనాలున్నా తాము ఆచితూచి ఆస్తుల సృష్టి కోసమే వెచ్చించాలనే విధానంతో ముందుకెళ్లామని చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందని ప్రజలు అంచనాతో ఉండవచ్చని అయితే వనరులు తగినంత ఉంటే ఖర్చు చేసేందుకు తాము సిద్ధమని, గతంలో జరిగిన దుబారా వంటి పొరపాట్లను తాము తిరిగి చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. తాము ప్రస్తుతం సంపద సృష్టించే కోణంలోనే వెచ్చిస్తున్నామని చెప్పుకొచ్చారు. మౌలిక రంగంలో ప్రభుత్వ నిధులు వెచ్చిస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూరిన నిధులను రెవిన్యూ ఖర్చుల కోసం వెచ్చించమని వాటిని ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మౌలిక రంగంపై వెచ్చిస్తామని వివరించారు. బడ్జెట్లో రంగాల వారీగా ముందుకు వెళ్లలేదని, అయితే ఆర్థిక వ్యవస్థను బడ్జెట్ స్థూలంగా ఆవిష్కరించిందని చెప్పుకొచ్చారు. చదవండి : బంగారు బాతును చంపేస్తారా? -
బంగారు బాతును చంపేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2020 ప్రసంగంలో ఎల్ఐసీ ఐపీవో నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధపడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ పబ్లిక్ ఇష్యూ, ప్రత్యక్ష పెట్టుబడులు అంశాలపై ఉద్యోగులు ఆందో ళన చేపట్టనున్నారు. ఎల్ఐసి మూడు ప్రధాన కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలోపాల్గొననున్నాయి.ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయాల వద్ద సోమవారం భోజన విరామ సమయంలో ప్లకార్డ్సు, నినాదాలతో నిరసన తెలపనున్నారు. అలాగే మంగళవారం ఒక గంట నిరసన సమ్మె (వాక్-అవుట్) ను చేపట్టనున్నారు. దీంతోపాటు (ఫిబ్రవరి 3,4 తేదీల్లో నిరసనల అనంతరం) ఉమ్మడి ఫోరం ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మెను కూడా చేపట్టాలని యోచిస్తున్నారు. ఎల్ఐసీ ఐపీవోకు (ఐపిఓ ద్వారా ప్రభుత్వం ఈక్విటీ షేర్లను విక్రయించే ఆఫర్) తాము పూర్తిగా వ్యతిరేకమనీ, మంచి లాభాలతో ఉన్న సంస్థలో వాటాలను ఎందుకు విక్రయిస్తోందని సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఏడాది రూ. 2,600 కోట్ల డివిడెండ్ ఎల్ఐసీ అందజేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఎల్ఐసి క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ రాజ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వం నిధులను కోరినప్పుడల్లా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక రంగం, గృహనిర్మాణానికి నిధులు అందిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. లాభదాయకమైన ఎల్ఐసీ సంస్థను లిస్టింగ్ చేయడమంటే.. బంగారు బాతును చంపేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసీ మూడుప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం- ఎల్ఐసి క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ల సమాఖ్య, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంస్థ మొత్తం శ్రామిక శక్తిలో 90 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 2019 మార్చి చివరి నాటికి ఎల్ఐసిలో 2.85 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్‌లోని తన వాటాను ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకు విక్రయిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2020 ప్రసంగంలో వెల్లడించారు. ఐడీబీఐ బ్యాంకులో వాటాను పూర్తిగా విక్రయించడం ద్వారా మొత్తం రూ. 90,000 కోట్లు సమకూరుతాయని కేంద్రం ఆశిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా రూ. 2.10 లక్షల కోట్లను డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సేకరించాలని.. కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్రానికి 100 శాతం వాటా ఉండగా.. ఐడీబీఐలో 46.5 శాతం వాటా కేంద్రం వద్దే ఉంది. చదవండి : ఐడీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం -
‘మోదీజీ.. మాయాజాల వ్యాయామం మరింత పెంచండి’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తనదైన శైలీలో విరుచుకుపడ్డారు. క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యాయామాన్ని మరింత పెంచితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మోదీ గతంలో విడుదల చేసిన ఓ వీడియోను జత చేస్తూ ఇచ్చిన ట్వీట్లో మోదీకి కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ‘ప్రియతమ ప్రధాన మంత్రి గారూ, దయచేసి మీ రోజువారీ మాయాజాల వ్యాయామాలు (మ్యాజికల్ ఎక్సర్సైజెస్)ను మరి కాస్త పెంచండి. మీకు తెలియదు, అవి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచవచ్చు’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. (చదవండి : నిస్సారమైన బడ్జెట్: రాహుల్) కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌పై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ బడ్జెట్లో అసలు వాస్తవికతే లేదని, ఉత్తి మాటలే కనిపిస్తున్నాయని విమర్శించింది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటోందని ఆరోపిస్తోంది. ఉద్యోగాల సృష్టి, వృద్ధిని వేగవంతం చేయడం, ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం గురించి ఈ బడ్జెట్ పట్టించుకోలేదని దుయ్యబట్టింది. Dear PM, Please try your magical exercise routine a few more times. You never know, it might just start the economy. #Modinomics pic.twitter.com/T9zK58ddC0 — Rahul Gandhi (@RahulGandhi) February 2, 2020 -
బడ్జెట్ ప్రభావం, ఆర్బీఐ సమీక్షపైనే దృష్టి..
ముంబై: వారాంతాన జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 988 పాయింట్లు (2.43 శాతం)నష్టపోయి 39,736 వద్ద ముగియగా.. నిఫ్టీ 300 పాయింట్లు (2.51 శాతం) కోల్పోయి 11,662 వద్దకు పడిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. స్టాక్ మార్కెట్ వర్గాలను నిరాశపరిచిన కారణంగా గత 11 ఏళ్లలో లేనంతటి భారీ పతనాన్ని ప్రధాన సూచీలు నమోదుచేశాయి. గడిచిన 16 నెలల్లో ఎన్నడూ లేని అత్యంత భారీ పతనం శనివారం నమోదైంది. కేంద్రం బడ్జెట్ మెప్పించలేకపోయినందున అమ్మకాల ఒత్తిడి ఈ వారంలోనూ కొనసాగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అంశాలు ప్రతికూలంగా ఉండడం, ఇదే సమయంలో బడ్జెట్ ఏ మాత్రం ఆదుకోలేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో అమ్మకాలు కొనసాగే అవకాశం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. వృద్ధికి సంబంధించి చెప్పుకోదగిన చర్యలేమీ నిర్మలా సీతారామన్ ప్రకటించకపోవడం, కొత్త పన్నుల విధానం ఈక్విటీ పెట్టుబడులను నిరాశపరిచే విధంగా ఉండడం అనేవి మార్కెట్‌కు ప్రతికూల అంశాలుగా ఉన్నాయని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజన్ హజ్రా విశ్లేషించారు. బీమా రంగంపై బడ్జెట్ ప్రభావం అధికంగా ఉండనుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఆర్బీఐ పాలసీ ఆదుకునేనా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమీక్ష ఈ వారంలోనే జరగనుంది. తాజా బడ్జెట్ అంశాలు, భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ద్రవ్యపరపతి విధానాన్ని ఎంపీసీ యథాతథంగా కొనసాగించేందుకు ఆస్కారం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి సంబంధించి ఏవైన ఆశాజనక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని ఎదురుచూస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్బీఐ చేతులు కట్టేసిన కారణంగా వడ్డీ రేట్లలో మాత్రం మార్పునకు అవకాశం లేనట్లేనని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎకనామిస్ట్ దీప్తి మాథ్యూ వెల్లడించారు. 700 కంపెనీల ఫలితాలు.. భారతి ఎయిర్టెల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, టైటాన్ కంపెనీ, లుపిన్, హెచ్‌పీసీఎల్, సిప్లా, అరబిందో ఫార్మా, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టీవీఎస్ మోటార్, ఎం అండ్ ఎం, బ్రిటానియా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఉజ్జీవన్ ల్యాబ్స్ , టాటా గ్లోబల్, అదానీ పోర్ట్స్, జెఎస్‌డబ్లు్య ఎనర్జీ, గుజరాత్ గ్యాస్, డీఎల్ఎఫ్, కాడిలా హెల్త్‌కేర్, బాష్, బాటా, ఎన్ఎండీసీ, మహానగర్ గ్యాస్, యుసీఎల్, ఎసీసీ, వోల్టాస్ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. జనవరిలో రూ.1,003 కోట్ల పెట్టుబడి... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జనవరిలో ఈక్విటీ మార్కెట్లో రూ.12,122 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్ మార్కెట్ నుంచి రూ. 11,119 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వీరి నికర పెట్టుబడి రూ.1,003 కోట్లకు పరిమితమైంది. మరోవైపు వరుసగా 5వ నెల్లోనూ భారత మార్కెట్లో వీరి పెట్టుబడి కొనసాగింది. గతేడాది సెప్టెంబర్‌లో రూ .7,548 కోట్లు, అక్టోబర్‌లో రూ .12,368 కోట్లు, నవంబర్‌లో రూ .25,230 కోట్లు, డిసెంబర్లో రూ .7,338.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. -
ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అడ్రస్ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. శంషాబాద్‌కు చెందిన టీడీపీ కౌన్సిలర్ గణేష్ గుప్తాతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. తొలిస్థానంలో టీఆర్ఎస్ ఉంటే.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఇండిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. 1200 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు బీఫార్మ్ ఇస్తామన్న పోటీ చేసే అభ్యర్థులే లేరని అన్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, పురపాలికల్లో విజయం సాధిస్తే అందులో ఎక్కువ శాతం బడుగు, బలహీనవర్గాలకే కేటాయించామని గుర్తుచేశారు. చైర్మన్, వైఎస్ చైర్మన్లలో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పొత్తుపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారని.. సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయని కేటీఆర్ అన్నారు. గల్లీ ఎన్నికైనా.. ఢిల్లీ ఎన్నికైనా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిందని అన్నారు. అడ్డిమారిగుడ్డిదెబ్బలా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచిందని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అన్యాయం జరిగిందని.. దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. నీతిఆయోగ్ సిఫార్సు చేసిన కేంద్రం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ కొత్త పథకాలతో అభివృద్ధిలో ముందకు వెళ్తుందన్నారు. శంషాబాద్ వరకు మెట్రో రైలు పోడిగిస్తామని తెలిపారు. శంషాబాద్‌కు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్
-
ఏపీకి పన్నుల వాటాను తగ్గించారు
సాక్షి, విజయవాడ: ఐదేళ్లుగా పోలవరానికి నిధుల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నా బడ్జెట్లో నిధులు కేటాయించలేదని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధా నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపుల వల్ల 13 జిల్లాల ప్రజలు నిరాశలో ఉన్నారన్నారు. వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించాల్సిందని అభిప్రాయపడ్డారు. విభజన హామీల అమలు బాధ్యత కేంద్రానిది.. కానీ బడ్జెట్లో వాటి ఊసే ఎత్తలేదని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌పై ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను కూడా తగ్గించారని పేర్కొన్నారు. ‘చిన్న రాష్ట్రాలపై సానుకూలంగా ఉండే బీజేపీ.. ఏపీకి న్యాయం చేయాలి. రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించాలి. విమానాశ్రయాలు కేటాయించాలి. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున కేంద్రం నూతన పోర్టుల ఏర్పాటుకు సహకరించాలి. గతంలో టీడీపీ.. బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్నా రాష్ట్రానికి నిధులు రాబట్టలేదు. చంద్రబాబు ఓటుకు నోటుకేసులో ఇరుక్కుని కేంద్రాన్ని నిధులు అడగలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకుని రాష్ట్రానికి చంద్రబాబు అన్యాయం చేశారు. ఎన్నికల ముందు బీజేపీని విమర్శించిన టీడీపీ బడ్జెట్ అంశంలో ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు. చంద్రబాబు అవకాశవాద రాజకీయలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార’ని బుద్ధా నాగేశ్వరరావు మండిపడ్డారు. -
కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు
-
కేంద్రానికి సమస్యలు ఉంటాయి: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాగుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానమైన నిధులు కేటాయించిందని తెలిపారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం పక్షపాతం చూపిస్తుందనేది అవాస్తవమన్నారు. కేంద్రం రాష్ట్రాలకు నిధులకు కేటాయించకుండా ఎవరికి కేటాయిస్తుందని ప్రశ్నించారు. బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించారని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసరంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు సమస్యలు ఉన్నట్లే, కేంద్ర ప్రభుత్వానికి సమస్యలు ఉంటాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని, ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్.. రైతుల బడ్జెట్ అని కొనియాడారు. చదవండి: సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా.. -
ఆదిలాబాద్ జిల్లాకు వరాలివ్వని నిర్మలమ్మ
సాక్షి, ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకమేమి లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నప్పటికీ పెద్దగా ఒనగూరిందేమి లేదు. దశాబ్ధాలుగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వేలైన్ నిర్మాణంపై ఆ శలు పెట్టుకున్న జిల్లా వాసులకు ఈ బడ్జెట్లోనూ మొండి చేయ్యే ఎదురైంది. బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 2024 వరకూ వంద విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు ప్రకటించినప్ప టికీ అందులో ఆదిలాబాద్ జిల్లా ఉందో.. లేదో స్పష్టత లేదు. ఇక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేటాయింపుల్లో మనకు భాగస్వామ్యం దక్కుతుందన్న ఊరట తప్పితే ప్రత్యేకంగా జిల్లాకు ఏమి దక్కలేదు. ఆశలపై నీళ్లు... రైల్వే లైన్‌పై జిల్లా ప్రజలు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుపై పెట్టుకున్న ఆశలు మరోసారి వమ్మయ్యాయి. జిల్లా నుంచి బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఉండడంతో సర్కారు కరుణిస్తుందని ప్రజలు ఆశ పెట్టుకున్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ రైల్వే లైన్‌ను నిర్మించేందుకు అంగీకరించాయి. దీనికోసం రూ.2,700 కోట్లు అంచనాలు వేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో ఈ ప్రాజెక్టు అసలు మొదలవుతుందా.. లేదా.. ఇంకెన్ని సంవత్సరాలు వేచి చూడాలన్న మీమాంస ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుపై చిన్న ఆశ చిగురిస్తుంది. బడ్జెట్లో దేశ వ్యాప్తంగా 2024 వరకు వంద విమానాశ్రయ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం మంజూరు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ వందలో మనది ఉంటుందా.. అనే ఆశ కలిగిస్తుంది. కొంత ఊరట... వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీరు విషయాలను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి బీజేపీ సర్కార్ నిధుల కేటాయింపు జరపగా, అందులో జిల్లాకు కూడా నిధులు అందే అవకాశం ఉంది. పౌష్టికాహారానికి దేశ వ్యాప్తంగా వేల కోట్లు కేటాయించగా, జిల్లాకు అమితంగా నిధులు అందుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత కారణంగా ఇటీవల మాతాశిశు మరణాలు, పౌష్టికాహార లోపంతో అనేక మంది సతమతమవుతున్నారు. జిల్లాలో అనేక మంది యువత సరైన నైపుణ్యత లేక వివిధ అంశాల్లో వెనుకబడుతుండగా, ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు జిల్లాకు కూడా పెద్ద ఎత్తున అవకాశం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మౌలిక రంగాలు.... రవాణా, మౌలిక రంగాల అభివృద్ధికి ఈ బడ్జెట్లో కేంద్రం దృష్టి పెట్టిన దృష్ట్యా జిల్లాకు కూడా ప్రయోజనం దక్కే అవకాశాలు లేకపోలేదు. పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య రంగాల ప్రోత్సాహానికి బడ్జెట్లో కేటాయింపులు జరిపిన దృష్ట్యా జిల్లాలో ఆసక్తి ఉన్న పలువురు దీన్ని అందిపుచ్చుకుంటారన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. మహిళ సంక్షేమానికి నిధుల కేటాయింపు కూడా ప్రస్తుతం అమలవుతున్న కేంద్ర పథకాలకు దోహదపడే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన దృష్ట్యా జిల్లాలోని ఆ వర్గాల ప్ర జలకు కూడా ప్రయోజనం దక్కే ఆస్కారం ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇండ్లు నిర్మిస్తామని బడ్జెట్లో పేర్కొన్న దృష్ట్యా జిల్లాలో ఇండ్లు లేనివారికి ఈ పథకం ద్వారా స్వాంతన లభిస్తుందా అనేది వేచిచూడాల్సిందే. ఆదాయ పన్నులు... మధ్య, ఎగువ తరగతికి ఊరటనిచ్చేలా ఆదాయ పన్ను స్లాబ్‌లలో మార్పులు జిల్లాలోని అనేకమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉండనుంది. ఇప్పటివరకు 0 నుంచి రూ.5లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండగా, రూ.5లక్షలు దాటిన వారికి రూ. 2.50 లక్షల నుంచి రూ.5లక్షల వరకు 5శాతం ఆదాయ పన్ను అమలు చేసేవారు. ప్రస్తుతం కొన్ని స్లాబ్‌లను మార్చారు. రూ.5లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు 10 శాతం ఆదాయ పన్ను, అదేవిధంగా రూ.7.50 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.50లక్షల వరకు 20శాతం, 12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం, రూ.15 లక్షలు, ఆపై ఆదాయం ఉన్నవారికి 30 శాతం ఆదాయ పన్ను విధిస్తూ స్లాబ్‌లను అమలు పర్చారు. వ్యవ‘సాయం’పై... రైతుల ఆదాయాన్ని 2022 వరకు రెట్టింపు చేస్తామన్న ప్రకటనకు కట్టుబడి ఉన్నామని బీజేపీ సర్కార్ బడ్జెట్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాలు విరివిగా ఇవ్వనున్నట్లు పేర్కొనడం జరిగింది. జిల్లాలో ప్రతిఏడాది లక్ష 30వేల మంది రైతులు బ్యాంక్ రుణాలు తీసుకొని సాగు చేస్తుండటం కనిపిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీ మా యోజన కింద కోట్ల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తామని బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. జిల్లా రైతులకు కూడా ఈ ప్రయోజనం దక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే. కృషి సించాయ్ యోజన ద్వా రా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం అందిస్తామని బడ్జెట్లో ప్రకటించారు. జిల్లాలో సూక్ష్మ సాగునీటికి ఆదరణ లభించే అవకాశం లేకపోలేదు. వైద్య నిపుణుల కొరత తీర్చేందుకు ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటిది ఏర్పాటు చేస్తే పేదలకు ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రానికి మొండిచేయి కేంద్రం బడ్జెట్‌తో రాష్ట్రానికి, జిల్లాకు ఓరిగిందేమీ లేదు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే బీజేపీ.. ఈ బడ్జెట్లో రైతుల సంక్షేమానికి నిధులు నామామాత్రంగానే కేటాయించింది. విద్య, వైద్యానికి పెద్దపీట వేశామని గొప్పలు చెబుతున్నారు. ఆదిలాబాద్‌కు నయాపైసా కేటాయించలేదు. – జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే -
‘మాటలు కోటలు దాటుతున్నా.. బడ్జెట్ మాత్రం..’
న్యూఢిల్లీ : మందగమనంలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే చర్యల్ని కేంద్రం ఏ కోశానా తీసుకోలేదని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ అన్నారు. ప్రభుత్వ వ్యయాల్ని పెంచకుండా.. వృద్ధిరేటు 10 శాంత ఆశిస్తామనడం అవివేకమే అవుతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు కోటలు దాటేలా ఉన్నా.. బడ్జెట్ మాత్రం పేవలంగా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపుల్లో పెరుగుదల లేదని తెలిపారు. గ్రామీణ ఉపాధి కల్పన పథకానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.10 వేల కోట్లు తక్కువగా కేటాయించారని చెప్పారు. (చదవండి : పన్ను పోటు తగ్గినట్టేనా?) ప్రభుత్వ వ్యయాల్ని కేవలం 9 శాతమే పెంచారని, ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా మాంద్య పరిస్థితులు ఒకవైపు, కరోనా వైరస్ మరోవైపు తరుముకొస్తున్నాయని హెచ్చరించారు. మరో వారం రోజుల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేయకపోతే.. ప్రపంచ మార్కెట్లు దారుణంగా పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళపై కేంద్ర ప్రభుత్వం కత్తిగట్టిందని వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన తమపై కేంద్ర బడ్జెట్ 2020 కనికరించలేదని అన్నారు. గతంతో కేంద్ర పన్నుల్లో 3.5 శాతంగా ఉన్న కేరళ వాటాను.. పెంచాల్సింది పోయి 1.9 శాతం కోత విధించారని మండిపడ్డారు. (చదవండి : కేంద్ర పన్నుల కేటాయింపుల్లో కోత!) జీఎస్టీ కింద కేంద్రం నుంచి రూ.3500 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. జనాభా నిష్పత్రి ప్రకారం రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఉండాలనే 15వ ఆర్థిక సంఘం సూచనలు కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నష్టపోతున్నాయని చెప్పారు. కేంద్రం వైఖరి ఎలా ఉన్నా.. కేరళ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ‘మాకు వరద సాయం అందించలేదు. పన్నుల్లో కోత విధించారు. బకాయిలు చెల్లిుచలేదు. కేరళ పనర్నిర్మాణానికి రుణ సదుపాయాలు కల్పించలేదు. అయినప్పటికీ.. రాజకీయాలు, రాష్ట్ర అభివృద్దికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాం. మాకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది’అన్నారు. -
తెలుగు రాష్ట్రాలకు నిరాశే..!
-
బడ్జెట్ 2020
-
సీతమ్మ శీతకన్ను..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈసారి కేంద్ర బడ్జెట్లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. ఏ ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయింపు జరగకపోగా.. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఈసారి కూడా పచ్చజెండా ఊగలేదు. కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి నిధులు దక్కలేదు. రైల్వే డివిజన్ ఏర్పాటు అంశానికైతే బడ్జెట్లో స్థానమే లభించలేదు. ఇక వరంగల్ రూరల్ జిల్లాలో 1,200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీకి మోక్షం కలగలేదు. ఈ మేరకు పార్లమెంట్లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కథనం. దక్కని జాతీయ హోదా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కొన్నేళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది. అయినా ఫలితం లేకుండా పోయింది. భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందనే ప్రభుత్వం నమ్మకంతో ఉన్నా నిరాశే ఎదురైంది. ఇక గిరిజన కుంభమేళాగా ములుగు జిల్లాలోని మేడారం జాతరకు కూడా జాతీయ హోదా కలగానే మిగిలిపోతోంది. కొన్నేళ్లుగా జాతరకు జాతీయ హోదా కోసం కోరుతున్నా మోక్షం కలగడం లేదు. గిరిజన యూనివర్సిటీ రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి ములుగు జిల్లా అనువైన ప్రాంతం కావడంతో అక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతయేడు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.4కోట్లను మాత్రమే కేటాయించారు. ఇక యూనివర్సిటీకి అవసరమైన 500 ఎకరాల్లో 497 ఎకరాలకు పైగా గుర్తించారు. కానీ ఈసారి బడ్జెట్లో ని«ధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగేలాల లేవు. బయ్యారం ఊసేది? ఇనుపరాయి గనులు విస్తారంగా ఉన్న బయ్యారంలో ఉక్కుపరిశ్రమ నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మానుకోట జిల్లావాసులకు ఈ బడ్జెట్లో కూడా నిరాశే ఎదురైంది. రెండోసారి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఏన్డీయే ప్రభుత్వం బయ్యారం పరిశ్రమపై ఏదైనా ప్రకటన చేస్తుందనుకున్న వారికి ఎదురుచూపులే మిగిలాయి. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన ఖనిజ నిక్షేపాలు 200 టన్నులకు పైగా ఉన్నట్లు అధికారులు గతంలో సర్వే ద్వారా గుర్తించారు. పరిశ్రమకు బయ్యారం చెరువు ద్వారా నీటి సదుపాయం, రైల్వే రవాణ సౌకర్యాలు ఉన్నా కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే, జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేది. అలాగే, ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లాల్సి ఇబ్బందులు తప్పేవి. టెక్స్టైల్ పార్కు పరిస్థితీ అంతే... వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ – సంగెం మండల్లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం 22 అక్టోబర్ 2017లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. పార్కు నిర్మాణం కోసం 1200 ఎకరాల భూమి సేకరించారు. పార్కులో అంతర్గత రోడ్ల నిర్మానం ఇప్పటికే జరుగుతుండగా.. పలు కంపెనీలు ఎంఓయూ కూడా చేసుకున్నాయి. ఈ పార్కు నిర్మాణం పూర్తయితే లక్ష మందికి పైగా ఉపాధి లభించే అవకాశముంది. టెక్స్టైల్ పార్కు అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదు. ఇండస్ట్రియల్ కారిడార్.. హైదారాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండ్రస్టీయల్ కారిడార్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కో రింది. కానీ ఈసారి బడ్జెట్లో స్థానం దక్కలేదు. రైల్వే డివిజన్, వ్యాగన్ షెడ్ దశాబ్దకాలానికి పైగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం ఏర్పాటుపై బడ్జెట్లో ప్రకటన వస్తుందనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. అదేవిధంగా రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా కాజీపేటకు మంజూరైన వ్యాగన్ పీరియాడిక్ల్ ఓవర్ హాలింగ్(పీఓహెచ్) షెడ్‌కు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లా వాసులతో పాటు రైల్వే కార్మికులు నిరాశ చెందారు. అంతేకాకుండా బల్లార్షా – విజయవాడకు కాజీపేట మీదుగా వెళ్లే మూడో లైన్‌కు కూడా కేటాయింపు చేయలేదు. ఫిట్‌లైన్ ప్రస్తావన, ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్ల ఊసు ఎత్తలేదు. కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణానికి కేటాయింపులు, రైల్వే కార్మికులు, వారి పిల్లల సంక్షేమంపై ఎలాంటి ప్రకటన ఆర్థిక మంత్రి చేయలేదు. అయితే, రైల్వే ఉద్యోగులకు ఆదాయపు పన్నును కొద్దిమేర తగ్గించనున్నట్లు చెప్పడం, రైతుల కోసం కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించడం కొంత ఆశాజనకంగా కనిపించింది. తెలంగాణపై కేంద్రం వివక్ష తెలంగాణపై ఈ బడ్జెట్లోనూ కేంద్రప్రభుత్వం వివక్ష చూపింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సైతం అన్యాయం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని కోరినా పట్టించుకోలేదు. ఇతర కేటాయింపుల్లోను ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రానికి రావాలి్సన ప్రాజెక్టులకు కేటాయింపులు చేయలేదు. రైల్వే పరంగా మొండిచేయి చూపారు. – పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ -
బడ్జెట్లో మహబూబ్‌నగర్‌కు మోదం..ఖేదం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహకం..అంగన్వాడీలకు సెల్ఫోన్లు, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు, విద్యుత్, స్వచ్ఛభారత్, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు తదితర వాటిపై ఆశాజనకంగా ఉంది. అయితే హైదరాబాద్ నుంచి బెంగళూర్ హైవేకు ఇండస్ట్రీ కారిడార్ గురించి ప్రస్తావించకపోవడం.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకపోవడం నిరాశే. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా.. వారి సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు రూ.15లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరుతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.83లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 6.11కోట్ల మందికి ఫసల్ బీమా యోజన వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 8,51,385 మంది రైతుల్లో ఆశలు చిగురించాయి. మహబూబ్‌నగర్‌లో 1,78,012 మంది రైతులు ఉండగా, నారాయణపేటలో 1,28,905, నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 2,58,000, గద్వాలలో 1,44,445, వనపర్తిలో 1,42,023 మంది రైతులు ఉన్నారు. కేంద్రం కురిపించిన వరాల్లో ఏఏ జిల్లాకు ఏ మేరకు ప్రాధాన్యం లభిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. అయితే.. కేంద్ర బడ్జెట్‌పై జిల్లా రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అలాగే బంజరు, తడి భూములు కలిగిన రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేలా వారి భూముల్లో సౌర యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. సౌర విద్యుత్‌ను గ్రిడ్లకు సరఫరా చేసి.. తద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు అందజేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. యువ మత్స్య కారి్మకుల ప్రోత్సాహంలో భాగంగా ‘సాగర్ మిత్రాస్’ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే దీనితో ఎంత మంది లబి్ధపొందుతారో అనేది స్పష్టమవుతుంది. అయితే.. ప్రస్తుతం మత్స్య కారి్మకులకు బాసటగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం చెరువులను పునరుద్ధరించి అందులో చేపల పెంపకానికి చేయూతనిస్తోంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షలకు పైగా మంది ప్రస్తుతం లబి్ధపొందుతున్నారు. ‘సాగర్ మిత్రాస్’ పథకం ద్వారా మరింత మందికి లబి్ధచేకూరే అవకాశముంది. చిగురించిన ఆశలు.. దేశంలో ఆరు లక్షల మంది అంగన్వాడీలకు సెల్ఫోన్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రాజెక్టుల పరిధిలో 5,003 అంగన్వాడీ కేంద్రాలు.. అంతే మంది టీచర్లు ఉన్నారు. వీరిలో ఎంత మందికి సెల్ఫోన్లు వస్తాయో చూడాలి. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి.. పౌష్టికాహార పథకానికి రూ.35.6కోట్లు కేటాయించినట్లు వివరించారు. అయితే.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య ఉమ్మడి పాలమూరు జిల్లాలో 50వేలకు పైనే ఉంది. వీరిలో 20వేలకు పైగా మంది వివిధ రోగాలతో బాధపడుతున్నారు. మహిళా సంక్షేమ పథకాలకు రూ.28,600కోట్లు కేటాయించడంతో జిల్లాలో మరింత మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. పర్యాటక రంగ ప్రోత్సాహానికి ఈ సారి బడ్జెట్లో రూ.2,500 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌గౌడ్ సైతం మన జిల్లా పరిధిలోని మయూరి పార్కు, మన్యంకొండ, కోయిల్‌సాగర్ ప్రాంతాలతో పాటు వరంగల్‌నూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇది వరకే రూ.450 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లాకు ఏ మేరకు నిధులు వస్తాయో అనే ఆసక్తి నెలకొంది. అలాగే క్రీడల అభివృద్ధికి రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. అందులో మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్ హాస్టల్, ఇండోర్ స్టేడియం, క్రీడా మైదానాల అభివృద్ధి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో ఏ మేరకు మంజూరవుతాయో చూడాలి. ఆశలకు రెక్కలు.. వచ్చే నాలుగేళ్లలో దేశంలో వంద కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలను మళ్లీ చిగురింపజేసింది. ఇప్పటికే పాలమూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కసరత్తు మొదలైన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అడ్డాకుల మండలం గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలించారు. తర్వాత దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, హజిలాపూర్, బస్వాయపల్లి.. అలాగే భూత్పూర్ మండలంలోని పోతులమడుగు, రావులపల్లి, కప్పెట గ్రామాల పరిధిలోని భూముల్లో అనువుగా ఉన్న భూములను ఎంపికతో పాటు మ్యాప్‌ను రూపొందించి ప్రతిపాదనలు కూడ సిద్ధం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి ప్రకటనతో దేవరకద్ర నియోజకవర్గంలో ఏదో చోటా విమానాశ్రయం రాబోతుందనే ఆశలు ఉమ్మడి జిల్లా ప్రజల్లో చిగురించాయి. ఆశలకు రెక్కలు.. వచ్చే నాలుగేళ్లలో దేశంలో వంద కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలను మళ్లీ చిగురింపజేసింది. ఇప్పటికే పాలమూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కసరత్తు మొదలైన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అడ్డాకుల మండలం గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలించారు. తర్వాత దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, హజిలాపూర్, బస్వాయపల్లి.. అలాగే భూత్పూర్ మండలంలోని పోతులమడుగు, రావులపల్లి, కప్పెట గ్రామాల పరిధిలోని భూముల్లో అనువుగా ఉన్న భూములను ఎంపికతో పాటు మ్యాప్‌ను రూపొందించి ప్రతిపాదనలు కూడ సిద్ధం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి ప్రకటనతో దేవరకద్ర నియోజకవర్గంలో ఏదో చోటా విమానాశ్రయం రాబోతుందనే ఆశలు ఉమ్మడి జిల్లా ప్రజల్లో చిగురించాయి. ఏదీ ‘జాతీయ హోదా’? ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఈ సారీ జాతీయ హోదా వరించలేదు. నిధుల సమస్యతో నత్తకు నడక నేర్పుతోన్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్ల రుణం తీసుకున్నా.. ఇంకా నిధుల సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేంద్ర నిధులూ వస్తాయనే ఆశతో ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని ప్రతి ఏటా కేంద్రాన్ని అభ్యరి్థస్తూనే ఉంది. ఇటు లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ ప్రాంత ప్రజల సమస్యలు తనకు తెలుసని.. వాటిని తీరుస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈ సారైనా జాతీయ హోదా వస్తుందనే ఆశతో ఉన్న ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. జాతీయ హోదాను విస్మరించారు కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయహోదా కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాటిని పట్టించుకోకపోవడం కేంద్రం వ్యవసాయాన్ని విస్మరించడమే. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 2008 నుంచి కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినా కేవలం పశుగ్రాసం పండించే వారికి మాత్రమే ఉపాధిహామీ అనుసంధానం చేస్తామనడం సరికాదు. కూలీల కొరత వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. జిల్లాకో పంట కాలనీకి సహకారం అందిస్తామని బడ్జెట్లో కేంద్రం తెలిపింది. మరి దేశంలోని ఎన్ని జిల్లాలకు ? ఏఏ రాష్ట్రాలకు అన్న వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం పంటకాలనీల ప్రాధాన్యతను గుర్తించి ఇప్పటికే దాదాపుఓ ప్రణాళికను సిద్ధం చేసింది. దానికి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో వేచిచూడాలి. తాజా బడ్జెట్ కూడా వ్యవసాయ రంగం విషయంలో కంటితుడుపుగానే వ్యవహరించింది. – నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి జిల్లాకు ఎన్నొస్తాయో చూడాలి రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌ను పురస్కరించుకుని.. జిల్లాలో మయూరి పార్కు, మన్యంకొండ, కోయిల్‌సాగర్ తదితర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ఇది వరకే కోరాం. రాష్ట్రవ్యాప్తంగా రూ.450 కోట్లు అడిగాం. ఈ రోజు ప్రకటించిన టూరిజం ప్రోత్సాహక బడ్జెట్లో రూ.2,500 కేటాయింపులు జరిగాయి. ఇందులో మన జిల్లాకు, రాష్ట్రానికి ఎంత వస్తుందో చూడాలి. – శ్రీనివాస్‌గౌడ్, ఎౖక్సైజ్ శాఖ మంత్రి -
కిసాన్ రైలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రైళ్లు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్లు, వేగంగా పాడయ్యే పదార్థాల రవాణా.. ఇవీ రైల్వేల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు. రూ.70,000 కోట్ల బడ్జెట్‌తో వీటిని అమలు చేస్తారు. గత ఏడాది సవరించిన బడ్జెట్ రూ.69,967 కోట్లు. రిఫ్రిజిరేటర్ కోచ్‌లతో కిసాన్ రైలు రైతుల కోసం తెచ్చే ‘కిసాన్ రైల్లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పదార్థాలను తరలించడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి దేశ వ్యాప్తంగా ఆటంకాలు లేని జాతీయ సప్లయ్ చెయిన్ నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లకు కూడా రిఫ్రిజిరేటర్ కోచ్‌లను అనుసంధానిస్తారు. ఇక రైల్వే విస్తరణ ప్రణాళికలను కొనసాగించేందుకు మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్లో రూ. 1.61 లక్షల కోట్లకు పెంచారు. కొత్త లైన్లకు రూ.12 వేల కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోణంలో కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. గేజ్ మార్పునకు రూ. 2,250 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 5,786.97 కోట్లు, సిగ్నలింగ్, టెలికం వ్యవస్థకు రూ. 1,650 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల సదుపాయాల కల్పనకు రూ. 2,725.63 కోట్లు కేటాయించారు. సరుకు రవాణా 1,265 మెట్రిక్ టన్నులు ఉండవచ్చు. ప్రయాణికులు, సరుకు రవాణా ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ. 61 వేల కోట్లు, సరుకు రవాణా నుంచి రూ. 1.47 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. రెవెన్యూ ఖర్చులో జీతాలను రూ. 92,993.07 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 6 వేల కోట్లు ఎక్కువగా ఉంది. -
‘మౌలికం’ కీలకం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని, తాజాగా రవాణా రంగంలో మౌలిక వసతులు, హైవేలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో రూ.1.70 లక్షల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌరుల జీవనాన్ని సులభతరం చేసేందుకు 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. మౌలిక వసతుల రంగంలో ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లకుపైగా వెచ్చిస్తామని ప్రధాని గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్ (ఎన్ఐపీ) కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించామన్నారు. 2023కి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం, నిర్వహణ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. త్వరలోనే జాతీయ సరుకు రవాణా విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. 2023 నాటికి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వేతోపాటు మరో రెండు ప్యాకేజీలు పూర్తవుతాయన్నారు. చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రహదారి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. 27,000 కి.మీ మేర విద్యుదీకరణను పూర్తి చేసే దిశగా రైల్వేలు కృష్టి చేస్తున్నాయని చెప్పారు. ‘రహదారుల నిర్మాణంలో వేగం గణనీయంగా పెరిగింది. 2015–16లో రోజుకు 17 కి.మీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగగా 2018–19 నాటికి ఇది 29.7 కి.మీ.కి పెరిగింది’అని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్లో మౌలిక వసతులకు పెద్దపీట వేయడంతో గృహ నిర్మాణం, చౌకగా పరిశుద్ధమైన ఇంధనం, ఆరోగ్యం, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్ టెర్మినళ్లు, మెట్రో, రైల్వే రవాణా, గిడ్డంగులు, సాగునీటి ప్రాజెక్టులు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. ఉపాధి అవకాశాలు విస్తృతం: గడ్కారీ మౌలిక వసతుల రంగానికి ఈ బడ్జెట్ గట్టి ఊతం ఇచ్చిందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్ పారిశ్రామిక అభివృద్ధికి జవసత్వాలు కల్పించి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా 2 కోట్లకుపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. బడ్జెట్లో ‘మౌలిక’వరాలు... ► పర్యాటక ప్రాంతాలను అనుసంధానించేలా మరిన్ని తేజాస్ రైళ్లు. ► ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైళ్లపై చురుగ్గా పరిశీలన. ► ‘ఉడాన్’పథకం ద్వారా 2024 నాటికి మరో వంద విమానాశ్రయాల అభివృద్ధి. ► ఇంధనం, పునరుత్పాదక వనరులకు బడ్జెట్లో రూ.22,000 కోట్లు ► 9,000 కి.మీ మేర ఆర్థిక కారిడార్ ► 2,000 కి.మీ మేర తీర ప్రాంత రహదారులు, హైవేల అభివృద్ధి. రైల్వే లైన్ల పక్కన సోలార్ ప్రాజెక్టులు రైల్వే నెట్వర్క్ కోసం సౌర విద్యుత్‌ను వినియోగించుకునేలా ట్రాక్‌ల పక్కన రైల్వేకు చెందిన భూమిలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. పీపీపీ విధానంలో 150 ప్యాసింజర్ రైళ్ల ఏర్పాటు, 4 స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 18,600 కోట్లు ఖర్చయ్యే 148 కి.మీల బెంగళూరు సబర్బన్ రవాణా ప్రాజెక్టును బడ్జెట్లో ప్రతిపాదించారు. మెట్రో తరహాలో టికెట్ రేట్లు ఉంటాయి. -
‘పల్లె’కు ఓకే..!
ఆర్థిక మందగమనం నుంచి గ్రామీణ భారతాన్ని గట్టెక్కించేందుకు మోదీ సర్కారు తాజా బడ్జెట్లో దండిగానే నిధులను కేటాయించింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఖర్చుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే కొన్ని పథకాలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. గ్రామీణ ఇళ్ల నిర్మాణం, రోడ్లపై అత్యధికంగా దృష్టిపెట్టింది. ఇప్పటికే కొన్ని పథకాల లక్ష్యాలు పూర్తవడంతో తదుపరి దశలను వేగంగా అమలు చేయనున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పల్లెల్లో 2022 మార్చినాటికి అదనంగా 1.95 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు సుమారు రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు. మరో లక్ష గ్రామ పంచాయతీలకు (2020–21)లో బ్రాడ్‌బ్యాండ్(ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్)ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అటు వ్యవసాయంతో పాటు ఇటు గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గ్రామీణ సంక్షేమ పథకాలకు ఎంతంటే... 2020–21 కేటాయింపు: రూ.1,20,148 కోట్లు 2019–20 కేటాయింపు: రూ.1,17,647 కోట్లు (సవరించిన అంచనా(రూ.1.22 లక్షల కోట్లు) ‘ఉపాధి’కి హామీ... 2020–21 కేటాయింపు: రూ.61,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ. 60,000 కోట్లు (సవరించిన అంచనా రూ.71,001 కోట్లు) ► ఉపాధి హామీకి గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈసారి స్వల్పంగా 2.5 శాతం పెరిగింది. సవరించిన అంచనాలతో పోలిస్తే భారీగా తగ్గింది. ► చాలా రాష్ట్రాల్లో లక్ష్యాలను మించి ఉపాధి పనులను కల్పించడంతో అధికమొత్తంలో కేంద్రం నిధులను అందించాల్సి వచ్చింది. ► ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం. విద్యుత్తుకు మరింత ఊతం... (దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన) 2020–21 కేటాయింపు: రూ.4,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ.4,066 కోట్లు ► వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక ఫీడర్లు, డిస్కమ్‌లను అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ సబ్–ట్రాన్స్మిషన్, పంపిణీ మౌలిక సదుపాయాల పెంపు... గ్రామీణ విద్యుదీకరణ కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ► 2017లో సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్‌ను అందించారు. ► ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌కు కేటాయింపులు రూ. 3970 కోట్ల నుంచి రూ. 5280 కోట్లకు పెంచారు. ► ఉజాల స్కీమ్ కింద పేద, మధ్యతరహా కుటుంబాలకు ఉచితంగా 35 కోట్ల ఎల్ఈడీ బల్బులను ఇచ్చారు. ► ఎల్ఈడీ బల్బులతో ఏటా రూ.18,341 కోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయి. స్వచ్ఛ భారత్‌కు దన్ను... 2020–21 కేటాయింపు: రూ.12,300 కోట్లు 2019–20 కేటాయింపు (సవరించిన అంచనా): రూ. 9,638 కోట్లు. ► 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున మొదలైన ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ► బహిరంగ మలవిసర్జన(ఓడీఎఫ్) అలవాటు దాదాపు కనుమరుగైంది. ఓడీఎఫ్ రహిత గ్రామాల సంఖ్య 5.6 లక్షలకు చేరింది. ► గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్ కవరేజ్ కల్పన. ► పట్టణాల్లో 95 శాతం ఓడీఎఫ్ రహితంగా మారినట్లు అంచనా. ఇప్పుడు 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ► దేశవ్యాప్తంగా 1,700 నగరాలు, పట్టణాల్లో 45,000 ప్రజా, కమ్యూనిటీ మరుగుదొడ్లను గుర్తించేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్‌కు అనుసంధానించారు. ► పూర్తిగా ఓడీఎఫ్ రహితంగా మారిన గ్రామాలు, పట్టణాల్లో దీన్ని కచ్చితంగా అమలయ్యేవిధంగా చూడటం కూడా ఈ పథకంలో భాగమే. ► ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల(చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా ఈ స్వచ్ఛ భారత్ పథకం కిందకు తీసుకొచ్చారు. పల్లె రోడ్లు పరుగులు 2020–21 కేటాయింపు: రూ.19,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (సవరించిన అంచనా రూ.14,071 కోట్లు) ► దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,67,152 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించారు. ► పీఎంజీఎస్‌వై రెండో దశలో రోడ్లను మెరుగుపరడం, మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో కల్వర్టులు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. ► 2019 డిసెంబర్ 31 నాటికి మొత్తం రెండు దశలకింద 6,08,899 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం, అప్గ్రేడేషన్ను పూర్తి చేశారు. ► వచ్చే ఐదేళ్లలో 1,25,000 కిలోమీటర్ల రోడ్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీనికి రూ.80,250 కోట్లు వెచ్చించనున్నారు. 2019–20లో ఇందుకు 13 రాష్ట్రాలను ఎంపిక చేశారు. గ్రామీణ టెలిఫోనీ... 2020–21 కేటాయింపు: రూ.6,000 కోట్లు 2019–20 కేటాయింపు (సవరించిన అంచనా): రూ. 2,000 కోట్లు ► భారత్ నెట్ ఫేజ్1 కింద 1,21,652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ పూర్తి. 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ► దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ లభించింది. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని(పీపీపీ) జోడించనున్నారు. ► ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ధి చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్ ఏర్పాటు లక్ష్యం. ► 2020–21 ఆర్థిక సంవత్సరంలో మరో 1,00,000 గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఆఫ్టిక్ నెట్‌వర్క్‌ను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్లో ప్రకటించారు. ‘జల్ జీవన్’తో స్వచ్ఛమైన నీరు.... 2020–21 కేటాయింపులు: రూ.11,500 కోట్లు 2019–20 కేటాయింపులు: రూ. 10,001 కోట్లు ► దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని(హ్యాండ్ పంపులు, పైపులు ఇతరత్రా మార్గాల్లో) అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. ► గతేడాది బడ్జెట్లో జల్ జీవన్ మిషన్ ను ప్రకటించారు. దీనిలోభాగంగా రూ.3.6 లక్షల కోట్ల నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీతారామన్ బడ్జెట్లో తెలిపారు. ఈ ఏడాది రూ.11,500 కోట్లను కేటాయించినట్లు వివరించారు. ► స్థానిక స్థాయిలో సమీకృత డిమాండ్, సరఫరా నిర్వహణ యంత్రాంగం; వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తగిన మౌలిక వసతుల కల్పన, భూగర్భజలాల పెంపు, సముద్రపునీటిని మంచినీరుగా మార్చడం(డీశాలినేషన్) కూడా జల్‌జీవన్ మిషన్‌లో భాగమే. ► 10 లక్షల జనాభా దాటిన నగరాలన్నింటినీ దీని అమలు కు ప్రోత్సహించనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఇంటికి ఇంకాస్త ఆసరా... 2020–21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు 2019–20 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ. 18,475 కోట్లు ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో భాగంగా 2022 కల్లా దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని బలహీనవర్గాలందరికీ పక్కా ఇళ్లను కట్టివ్వాలనేది కేంద్ర ప్రభుత్వ తాజా లక్ష్యం. ► పీఎంఏవై తొలి దశను 2016–17 నుంచి 2018–19 వరకూ మూడేళ్లపాటు అమలుచేశారు. గడిచిన ఐదేళ్లలో 1.54 కోట్ల ఇళ్లను నిర్మించారు. ► ఇప్పుడు రెండో దశ కింద 2019–20 నుంచి 2021–22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు. ► అంతేకాదు ఈ ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు కూడా ఉచితంగా కల్పించనున్నారు. -
మన స్టేషన్లో రైలు ఆగలేదు..
సాక్షి, అమరావతి: ఈ బడ్జెట్లో ఏపీ మీదుగా వెళ్లే కొత్త రైళ్ల కూతలేవీ వినిపించలేదు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన రైల్వే జోన్‌కు నిధులూ కేటాయించలేదు. ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా ఏపీకి దక్కలేదు. ఇప్పటికే విశాఖపట్టణం, తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం ప్రాంతాలకు ప్రైవేటు రైళ్లను నడిపేందుకు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ తరహా రైళ్లను మరిన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం బడ్జెట్లో పేర్కొంది. ఈ బడ్జెట్లో రైల్వేలపరంగా ఏపీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తే, తీరని అన్యాయమే జరిగిందని రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పీపీపీ విధానంలో రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. గతేడాది పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2,442 కోట్ల కేటాయింపు గతేడాది (2019 ఫిబ్రవరి) ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2,442 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రసంగంలో కొత్త ప్రాజెక్టు ఏదీ ప్రకటించకున్నా.. ఈ నిధుల్ని ఆ తర్వాత కేటాయించారు. సాధారణంగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టాక దక్షిణ మధ్య రైల్వేకు ఎంత కేటాయించారన్న వివరాలపై రైల్వే బోర్డు సమాచారమిస్తుంది. ప్రతిసారీలానే ఈ దఫా బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండుమూడు రోజులకు కేటాయింపుల సమాచారాన్ని రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రకటనలో.. ఏపీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికిగాను అన్ని ప్రాంతాలను కలిపేలా తేజస్ రైళ్లు, రైల్వే వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా ప్రధాన రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సంబంధించి వివరాలపై సమాచారం అందుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ పరిపుష్టికి సంబంధించి అంశాలుంటాయని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. -
మరోసారి మొండిచేయి
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను తీవ్ర నిరుత్సాహపర్చింది. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత పడింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42 శాతం ఇవ్వాలని ఉండగా ఆ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.34,833.18 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పుడు సవరించిన అంచనా మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కేవలం రూ.28,242.39 కోట్లేనని కేంద్రం పేర్కొంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి వస్తాయనుకున్న నిధుల్లో రూ.6,590.79 కోట్ల మేర కోత పడింది. మరోపక్క.. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను 4.11 శాతానికి తగ్గించేయడం విచిత్రంగా ఉంది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక ఏడాదికి రాష్ట్రానికి రూ.32,237.68 కోట్లు వస్తాయని కేంద్రం పేర్కొంది. రెవెన్యూ లోటు భర్తీ కూడా లేదు రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వరుసగా ప్రతీ ఏడాది రెవెన్యూ లోటులో ఉంటున్న నేపథ్యంలో వచ్చే ఐదేళ్లపాటు కూడా రెవెన్యూ లోటులోనే ఉంటుందని.. ఇందుకు గ్రాంటును సిఫార్సు చేయాల్సిందిగా 15వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,897 కోట్లు మంజూరు చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. కానీ, బడ్జెట్లో ఇందుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. పలు సందర్భాల్లో ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వస్తున్నా ఈసారి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి కేంద్రం తీవ్ర నిరాశే మిగిల్చింది. పోలవరం, రాజధానికీ కేటాయింపుల్లేవు పోలవరం ప్రాజెక్టుకు గత ఆర్థిక ఏడాది (2018–19), ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. ఈ బడ్జెట్లోనూ మొండిచెయ్యే చూపింది. అలాగే.. - రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,500 కోట్లు ఇవ్వగా ఇంకా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ మొత్తాన్నీ బడ్జెట్లో పొందపర్చలేదు. - రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉండగా ఆ విషయాన్నీ బడ్జెట్లో అస్సలు ప్రస్తావించలేదు. - దుగరాజపట్నం పోర్టుకు యోగ్యత లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు అభివృద్ధి, వైఎస్సార్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ–చెన్నై కారిడార్, బెంగళూరు–చెన్నై కారిడార్‌ను కూడా కేంద్రం ఉసూరుమనిపించింది. జాతీయ విద్యా సంస్థలకు అరకొరగా.. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన జాతీయ విద్యా సంస్థలకు మాత్రం కేంద్రం అరకొరగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా.. కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ వర్సిటీకి రూ.60.35 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.26.90 కోట్లు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)కి రూ.31.82 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా నూతన ఐఐటీలకు రూ. 7,182 కోట్లు, ఐఐఎంలకు రూ. 476 కోట్లు, ఎన్ఐటీలకు రూ. 3,885 కోట్లు, ఐఐఎస్ఈఆర్ సంస్థలకు రూ. 896 కోట్లు, ఐఐఐటీలకు రూ. 226.35 కోట్లు కేటాయించారు. వీటిల్లోనే ఏపీలోని సంస్థలకు కూడా కలిసి ఉన్నాయని బడ్జెట్ అంచనాల్లో ప్రస్తావించారు. ఇక ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థలకూ నిర్ధిష్ట కేటాయింపులు చేయలేదు. అలాగే, మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి.. పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీలను ఎక్కడా ప్రస్తావించలేదు. విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం.. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు, ఎయిమ్స్‌కు నిర్ధిష్ట కేటాయింపుల్లేవు. మౌలిక ప్రాజెక్టులు రాష్ట్రానికి చేరేనా? దేశవ్యాప్తంగా మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలు లక్ష్యంగా రూ.103 లక్షల కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో ప్రకటించారు. వీటిలో రాష్ట్రాల వారీగా నిర్ధిష్ట వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అలాగే, తాజా బడ్జెట్లో రూ.1.72 లక్షల కోట్ల మేర రవాణా మౌలిక వసతుల స్థాపనకు వెచ్చిస్తామని ఆమె తెలిపారు. వీటిలో కూడా రాష్ట్రానికి ఏ మేరకు ప్రాజెక్టులు రానున్నాయో అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా 200 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సుదీర్ఘ కోస్తా తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇది మేలు చేసే అవకాశంగా ఉంది. ఇలా మొత్తం మీద ఏ విధంగా చూసినా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో తీరని అన్యాయం జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పెద్దపీట వేయడమంటే ఇలాగేనా? 2019–20లో సబ్సిడీలకు రూ.3,38,153.67 కోట్లు కేటాయిస్తే అందులో ఖర్చు చేసింది రూ.2,63,557.33 కోట్లు. 2020–21కి ఆహార, ఎరువుల సబ్సిడీలు తగ్గించి రూ.2,62,108.76 కోట్లు మాత్రమే కేటాయించారు. దృష్టి సారించాల్సిన వ్యవసాయ యాంత్రీకరణను విస్మరించారు. విధాన పరమైన కేటాయింపులు పెంచకుండా కిసాన్ రైలు వేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా 26 లక్షల సోలార్ పుంపు సెట్లు ఏర్పాటు చేస్తామనడమే వ్యవసాయానికి పెద్దపీట వెయ్యడమా? – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్ -
ఏపీపై ఇదేం వివక్ష?
సాక్షి,అమరావతి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏపీకి మొండిచెయ్యి చూపిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత రాష్ట్రంపై వివక్ష చూపడం సరైందికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని ఎదురు చూశామని అయితే ఆ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. శనివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణంలో పార్టీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు రావాల్సిన రూ.24,350 కోట్ల గురించి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆర్థిక లోటును నియంత్రించేందుకు ఆహార సబ్సిడీ, వ్యవసాయ రుణాలు మాఫీ చేయడాన్ని వీలైనంత వరకు తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోందని.. ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టి దీనిని పరిశీలించాలన్నారు. బడ్జెట్లో రూ.15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రకటించారని.. ఇందులో వివక్ష లేకుండా ఏపీ వాటా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాన్ కెమికల్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్‌ను ప్రోత్సహించాలన్నారు. జల్ జీవన్ మిషన్‌కు రూ.3.6 లక్షల కోట్లు కేటాయించడం మంచి విషయమన్నారు. పోలవరం చెల్లింపులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. తీవ్ర నీటి ఎద్దటి ఉన్న 100 జిల్లాల్లో సమగ్ర నీటి సరఫరా పథకాలు అమలు చేస్తామన్నారని.. అందులో ఏపీకి కూడా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఎంతో సాయం వస్తుందని ఎదురు చూశామని, అయితే కేంద్రం మొండిచేయి చూపిందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర హక్కులు, వాటాను సాధించుకుంటామని విజయసాయిరెడ్డి వివరించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనాయకుడు పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వంగా గీత, తలారి రంగయ్య, బీవీ సత్యవతి, లావు కృష్ణదేవరాయలు, మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్, పోచ బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు ఆన్లైన్ డిగ్రీ
న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభించనున్న నూతన విద్యావిధానంలోని పలు అంశాలను నిర్మలా సీతారామన్ వివరించారు. ఉన్నతవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. పబ్లిక్ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో జాతీయ పోలీస్ యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తారు. వాటిని జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తారు. అలాగే పేదవిద్యార్థులకు ఆన్లైన్లో డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెస్తారు, ఇండియాలో చదివేందుకు ఆసక్తి చూపే ఆసియా–ఆఫ్రికా విద్యార్థులకు ఇండ్–సాట్ పేరిట ప్రత్యేక పరీక్ష నిర్వహించి, ప్రతిభావంతులకు ఉపకార వేతనం కూడా అందించనున్నారు. ముఖ్యాంశాలు.. 1. ఉన్నత విద్య అందుబాటులో లేని బలహీన, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఆన్లైన్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలో టాప్ 100 విద్యాసంస్థల ద్వారా ఈ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీతారామన్ ప్రకటించారు. 2. 2020–21 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంగా విద్యారంగంలో ప్రవేశపెట్టబోయే నూతన విధానాలపై ఆమె ప్రసంగిం చారు. త్వరలో నూతన విద్యా విధానం తీసుకురాబోతు న్నామని వెల్లడించారు. ఇందుకోసం రూ.99,300 కోట్లు విద్యారంగానికి నిధులు కేటాయించబోతున్నామని ఆమె పేర్కొన్నారు. 3. ప్రత్యేకంగా మరో రూ.3000 కోట్లు నైపుణ్యాభివృద్ధికి వెచ్చిస్తారు. కేంద్ర ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఎంట్రప్రెన్యూర్ షిప్ శాఖల సహకారంతో స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమం చేపడతారు. తద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్య వాతావరణం సృష్టించి పౌరుల నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుస్తారు. 4. ఉన్నత విద్యాభ్యాసానికి భారత్ కేంద్రంగా మారాలన్న తలంపుతో ‘స్టడీ ఇన్ ఇండియా’ ను రూపొందించారు. ఇందులో భాగంగా ఐఎన్డీ– ఎస్ఏటీ పరీక్షను నిర్వహిస్తారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రతిభ గలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తారు. 5. కొత్త విద్యా విధానంపై అన్ని రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఇతర భాగస్వాములతో చర్చించామని తెలిపారు. దీనిపై రెండు లక్షలకుపైగా సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. త్వరలోనే నూతన విద్యా విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. 6.1 విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు పెరగాలంటూ డిమాండ్లు పెరుగుతున్న దరిమిలా.. 2021 మార్చి నెలనాటికి 150 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అప్రెంటిష్ షిప్‌తో కూడిన డిగ్రీ, డిప్లొమా కోర్సులను కూడా ప్రవేశపెట్టబోతున్నారని ప్రకటించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సంబంధిత స్థానిక సంస్థల్లో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌కి వీలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడి, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించేందుకు డిగ్రీ స్థాయిలో పూర్తిస్థాయి ఆన్లైన్ విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. 7. జాతీయ పోలీసు యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ కార్యక్రమంలో ఈ యూనివర్శిటీలను భ™ జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తామని, దీనివల్ల మెరుగైన వైద్యసేవలు లభిస్తాయి. -
కేంద్ర పన్నుల కేటాయింపుల్లో కోత!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మదింపునకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్దేశించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు ఏపీతోపాటు పలు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా పంచారు. దీని నుంచి ఏపీకి ఏటా 4.305 శాతం మేర పంచుతూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు అది 4.11 శాతానికి తగ్గిపోయింది. ఇదేకాక.. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను సైతం 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించారు. ఏడో ఆర్థిక సంఘం నుంచి 14వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వాటాలను నిర్దేశించి కేంద్రం పన్నులను పంచింది. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా పన్నుల వాటాను కేటాయిస్తోంది. మరోవైపు.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి నివేదిక సిద్ధం కానందున కేవలం 2020–21కు వర్తించేలా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీని ఆధారంగానే 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటాలను నిర్దేశిస్తూ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో బడ్జెట్లో పొందుపరిచారు. ఒకవేళ పదిహేనో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను 41 శాతం నుంచి ఇంకా తగ్గిస్తే అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు నిధుల లేమిని ఎదుర్కోవలసి వస్తుంది. జనాభాను పటిష్టంగా నియంత్రించిన ఫలితం.. కాగా, 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పన్నుల వాటాలు తేల్చేందుకు జనాభాకు 15 శాతం వెయిటేజీ ఇచ్చారు. జనాభా వృద్ధి రేటు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాలు పకడ్బందీగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించాయి. కానీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేకపోయాయి. దీని ఫలితంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడంవల్ల దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది. 2020–21కి కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా (అంచనాలు) ఇలా.. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 4.305 శాతం నుంచి 4.11కి తగ్గింది. కొత్త వాటా ప్రకారం కేంద్ర పన్నుల వాటా నుంచి ఏపీకి రూ.32,237.68 కోట్లు రానున్నట్లు కేంద్ర బడ్జెట్లో అంచనా వేశారు. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ. 9,916.22 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,220.31 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.9,757.50 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.2,012.13 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.1,314.66 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.17.19 కోట్లుగా ఉంది. అయితే, గడిచిన రెండు మూడేళ్ల కాలంలో బడ్జెట్లో పొందుపరిచిన అంచనాల మేరకు నిధులు రాలేదు. పొందుపరిచిన అంచనాల కంటే వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు తక్కువే వచ్చాయి. ఏపీకి రూ.1,521 కోట్ల నష్టం కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 4.305 శాతం నుంచి 4.11కి తగ్గడంవల్ల 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,521 కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోతుంది. 4.305 శాతం వాటా ఉంటే రూ.33,758.98 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పుడు రూ.32,237.68 కోట్లు మాత్రమే రానుంది. -
పెళ్లీడు పెరుగుతుందా?
న్యూఢిల్లీ: కేంద్రంలో పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న వేళ నరేంద్రమోదీ ప్రభుత్వం సమాజ సంక్షేమానికి 2020–21 బడ్జెట్లో పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమానికి, షెడ్యూల్ తెగలు, కులాలు, మైనార్టీల శాఖలకు నిధుల కేటాయింపులు పెరిగాయి. సామాజిక సంక్షేమాన్ని మూడు విభాగాలుగా విభజిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. స్త్రీ, శిశు సాంఘిక సంక్షేమం, సంస్కృతి మరియు పర్యాటకం, పర్యావరణం మరియు వాతావరణ మార్పు అనే మూడు విభాగాలుగా సమాజ సంక్షేమాన్ని విభాగిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు థీమ్స్‌కు అనుగుణంగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. మహిళల వివాహానికి కనీస వయసును పునఃసమీక్షించేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తున్నామని, ఈ టాస్క్‌ఫోర్స్ ఆరునెలల్లో నివేదిక అందిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బలహీన వర్గాలు, స్త్రీ, శిశు సంక్షేమంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. సంక్షేమానికి గతంతో పోలిస్తే నిధులు పెంచామని తెలిపారు. స్త్రీ, శిశు.. సాంఘిక సంక్షేమం.. బేటీ బచావో– బేటీ పడావో పథకం బాగా విజయవంతమైందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పారు. ప్రస్తుతం పాఠశాలల్లో స్థూల బాలికల నమోదు గణాంకాలు(94.32 శాతం) బాలుర గణాంకాల(89. 28 శాతం)కన్నా మెరుగయ్యాయని చెప్పారు. పసిపిల్లలు, గర్భిణులు, బాలింతల పౌష్టికత మెరుగుదలకు ప్రారంభించిన పోషన్ అభియాన్ కింద ఆరు లక్షల అంగన్వాడీలకు స్మార్ట్‌ఫోన్స్ అందించామని, వీటితో దాదాపు 10 కోట్ల కుటుంబాలకు పౌష్టికత అప్డేట్స్ అంది స్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి, మాన్యువల్ స్కావెం జింగ్ అరికట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో సాంకేతికతను వినియోగిస్తామని వివరించారు. బడ్జెట్లో సంక్షేమ కేటాయింపులు.. ►పౌష్టికాహార కార్యక్రమాల కోసం రూ. 35,600 కోట్లు, స్త్రీ సంక్షేమ పథకాలకు రూ. 28,600 కోట్లు కేటాయించారు. ►షెడ్యూల్ కులాల సంక్షే మం, ఓబీసీల సంక్షేమానికి రూ. 85 వేల కోట్లను, షెడ్యూల్ తెగల కోసం రూ. 53700 కోట్లను కేటాయించారు. ►దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ. 9,500 కోట్లు అందించనున్నారు. ►సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ. 10,103.57 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో ఈ మొత్తం రూ. 8,885 కోట్లు. ►మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. ►బాలల కోసం కేటాయింపులు గత బడ్జెట్‌తో పోలిస్తే 0.13 శాతం తగ్గాయి. -
మాటల కోటల్లో.. రక్షణకు అరకొరే..
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో దేశ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పొరుగు దేశాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రక్షణ రంగం అధిక ఆర్థిక కేటాయింపుల కోసం ఎదురుచూస్తుండగా గత యేడాదికంటే రక్షణ బడ్జెట్ కేటాయింపులను కేంద్రం ఆరుశాతం కూడా పెంచకపోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం రక్షణ రంగానికి రూ.3.18 లక్షలకోట్లు కేటాయించింది. కొత్త ఆయుధాల కొనుగోలు, యుద్ధ విమానాలూ, యుద్ధనౌకలు, ఇతర సైనిక పరికరాలు కొనుగోలు చేయడానికి మూలధన వ్యయం కోసం రూ. 1.13 లక్షల కోట్లు కేటాయించారు. 2019–20 సవరించిన రూ. 3.31 లక్షల కోట్ల అంచనా ప్రకారం అయితే ఈ పెంపుదల కేవలం 1.8 శాతం మాత్రమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చైనా–భారత్ యుద్ధం1962 తరువాత రక్షణ రంగానికి జరిపిన అతితక్కువ బడ్జెట్ కేటాయింపులు. ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణకు రూ.2.09 లక్షల కోట్లు అవుతుంది. రక్షణ రంగ ఉద్యోగులకు పెన్షన్లకు కేటాయించిన రూ.1.33 కోట్లు కలుపుకుంటే ఈ మొత్తం కేటాయింపులు 4.71 లక్షల కోట్ల రూపాయలకు చేరతాయి. చైనా తన రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేసుకుంటున్న నేపథ్యంలోనూ, మారుతున్న దేశభద్రత రీత్యా, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో రక్షణ రంగ ఆధునికీకరణకు ఇంకా ఎక్కువ నిధులు అవసరమవుతాయి. గత ఏడాది బాలకోట్ దాడుల అనంతరం బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం అయ్యింది. అయితే ఊహించిన దానికంటే భిన్నంగా తక్కువ నిధులే కేటాయించారు.అవసరాలను అనుగుణంగా కేటాయింపులు లేకపోయినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే ఈ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ‘‘రక్షణ రంగానికి కేటాయించిన ని«ధులు సరిపోక పోయినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలసిస్ కి చెందిన డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.1,03,394 కోట్లను రూ.1,13,734 కోట్లకు పెంచారు. ఇది గతం కంటే 10,340 కోట్ల రూపాయలు అధికం. ఇక ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణ విభాగాలను కలిపితే రూ.2,09,319 కోట్ల రూపాయలవుతుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం 2019–20లో వేతనాలూ, తదితరాలకు 2,01,901 కోట్ల రూపాయలు కేటాయించారు. గత పదేళ్లలో రక్షణ రంగ కేటాయింపులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతియేటా సుమారు రక్షణ రంగం నుంచి దాదాపు 60,000 మంది పదవీ విరమణ చేస్తున్నందున ఈ రంగంలో పెన్షన్లకు కేటాయించే నిధుల శాతం పెరుగుతున్నట్టు 2019లో స్టాండింగ్ కమిటీ పేర్కొన్నది. దీంతో సాయుధ దళాల ఆధునీకరణకు నిధులు తగ్గుతున్నాయి. గత పదేళ్ళలో రక్షణరంగంలోని ఉద్యోగుల పెన్షన్లకు ఖర్చు చేస్తున్న మొత్తం 12 శాతానికి పెరిగింది. ప్రభుత్వం పెన్షన్ బిల్లును, కొన్ని ఇతర పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా లేదా ముందస్తు పదవీ విరమణ ద్వారా ప్రభుత్వం పెన్షన్ బిల్లుని తగ్గిస్తుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. -
హెల్త్‌కు వెల్త్
న్యూఢిల్లీ: ‘‘ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. పౌరుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నాం’’ అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరచడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రుల సంఖ్యను పెంచనున్నారు. ఆరోగ్యం అంటే వ్యాధులు సోకితే ఆస్పత్రుల్లో చికిత్స చేయడమే కాదు, ప్రజలు రోగాల బారిన పడకుండా పూర్తి ఫిట్‌గా ఉండేలా చూడడం కూడా. ఇందుకోసం ఈ సారి ప్రజారోగ్యమే అంతిమ లక్ష్యంగా కేంద్రం కొనసాగిస్తున్న ఎన్నో పథకాలను విస్తరించాల్సిన అవసరం గురించి సీతారామన్ వివరించారు. గత బడ్జెట్‌తో పోల్చి చూస్తే ఆరోగ్య రంగ నిధుల్ని 8శాతం పెంచారు. ఆయుష్మాన్ భారత్ విస్తరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల పథకం ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) విస్తరించడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో ఆయుష్మాన్ భారత్ పథకం కింద మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ఆస్పత్రుల ఏర్పాటు ప్రైవేటు వ్యక్తులకి లాభదాయం కాకపోతే వయబిలిటీ గ్యాప్ కింద ప్రభుత్వమే నిధుల్ని సమకూరుస్తుంది. దీని కోసం దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చే ఆస్పత్రులు లేని చోట కొత్త ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా యువతకు ఎన్నో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌కి గత బడ్జెట్లో రూ.6,400 కోట్లు కేటాయిస్తే, ఈ సారీ అంతే మొత్తాన్ని కేటాయించారు. 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత్ జనాభాలో దాదాపుగా 40శాతం మందికి లబ్ధి చేకూరేలా, నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపుగా 50 కోట్ల మంది ఈ పథకం లబ్ధి దారులుగా ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019, నవంబర్ 25 నాటికి ఆయుష్మాన్ భారత్ కింద 11.4 కోట్ల మందికి ఇ–కార్డుల్ని జారీ చేశారు. ప్రతీ జిల్లాలో ఓ మెడికల్ కాలేజ్ దేశంలోని ప్రతీ జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని, దీన్ని అధిగమించడానికి ప్రైవేటు–ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతీ జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి మెడికల్ కాలేజీని అనుంబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. భూమి, మౌలిక సదుపాయాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రాష్ట్రాల్లో వీటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రోగులు– వైద్యుల నిష్పత్తిలో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ పథకం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సరిపడినంత స్థాయిలో రెసిడెంట్ డాక్టర్స్ డిప్లొమా/ ఫెలో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోర్సులను ఆఫర్ చేసే ఆసుపత్రులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యాంశాలు.. ► మిషన్ ఇంద్ర ధనుష్ (ప్రభుత్వ వాక్సినేషన్ కార్యక్రమం) కింద అయిదు వైరస్లు సహా 12 కొత్త తరహా వ్యాధుల్ని తీసుకువచ్చారు. ► ప్రజల జీవన విధానంలో వచ్చే మార్పుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఫిట్ ఇండియా ఉద్యమం, అందరికీ సురక్షిత మంచినీరు అందించడం కోసం జలజీవన్ మిషన్ , దేశంలో పారిశుద్ధ్య వ్యవస్థని మెరుగుపరిచి పరిశుభ్రంగా ఉండడం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిరుపేదలకు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. ► ఆయుష్మాన్ భారత్ కిందకి వచ్చే ఆసుపత్రుల సంఖ్యను టైర్ 2, టైర్ 3 నగరాల్లో పెంచాలని నిర్ణయం. ప్రస్తుతం ఈ పథకం కింద 20 వేలకుపైగా ఆసుపత్రులు ఉన్నాయి. మరో వెయ్యి ఆస్పత్రులు పెంచడానికి చర్యలు ► ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో మెడికల్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం. ► ప్రజలకు అందుబాటు ధరల్లో మందులు దొరికేలా అన్ని జిల్లాల్లో జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు. జనరిక్ మెడిసిన్స్‌ని విక్రయించే ఈ దుకాణాలను నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు. ► వైద్య పరికరాల దిగుమతులు, విక్రయం ద్వారా వచ్చే పన్నుల్ని ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగం. కొన్ని నిర్దిష్ట వైద్య పరికరాల దిగుమతులపై 5శాతం ఆరోగ్య సెస్ విధింపు . ప్రస్తుతం భారత వైద్య పరికరాల రంగం 80 నుంచి 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడింది. ఈ నిర్ణయంతో రెండు రకాలుగా ప్రయోజనాలున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీకి చెందిన సమన్వయకర్త రాజీవ్ నాథ్ అన్నారు. వైద్య పరికరాల రంగం మేకిన్ ఇండియాకు ఊతమిస్తుందని, మౌలిక సదుపాయాలకు ఈ నిధుల్ని వినియోగించడం వల్ల జాతీయ ఆరోగ్య రంగ భద్రతపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోయే అవకాశాలున్నాయని అన్నారు. ► ఆరోగ్య రంగ అధికారులు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వ్యాధులపై పోరాటం చేయాలి. ► క్షయ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అన్న నినాదంతో ట్యూబర్ కొలాసిస్ (టీబీ)పై పోరుబాట. 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం అడుగులు. -
మహిళల ప్రగతి.. శిశువుల వికాసం
న్యూఢిల్లీ: మహిళల అభ్యున్నతి, శిశువుల వికాసానికి 2020–21 బడ్జెట్లో కేంద్రం నిధుల కేటాయింపులను పెంచింది. గత ఏడాది కంటే ఈ పెంపు ఏకంగా 14 శాతం అధికం. 2019–20లో కేటాయింపులు రూ.26,184.50 కోట్లు కాగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.30,007.10 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో రూ.20,532.38 కోట్లను అంగన్వాడీ సేవలకే వినియోగించనున్నారు. ►నేషనల్ న్యూట్రిషన్ మిషన్‌కు(పోషణ్ అభియాన్) కేటాయింపులను రూ.3,400 కోట్ల నుంచి రూ.3,700 కోట్లకు పెంచారు. పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా.. ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న ఆరేళ్ల లోపు చిన్నారుల సంఖ్యను 2022 నాటికి 38.4 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ►సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో(ఐసీడీఎస్) భాగంగా శిశువుల రక్షణకు నిధుల కేటాయింపులను రూ.1,350 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచారు. ►వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల పథకానికి నిధుల కేటాయింపులను రూ.45 కోట్ల నుంచి ఏకంగా రూ.150 కోట్లకు పెంచేశారు. మహిళల అక్రమ రవాణా నియంత్రణ, సహాయ పునరావాసానికి ఉద్దేశించిన ఉజ్వల పథకానికి కేటాయింపులను రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెంచారు. ►నేషనల్ క్రెష్ స్కీమ్‌కు కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద.. ఉద్యోగులైన మహిళలు పని వేళల్లో తమ పిల్లలను శిశు సంరక్షణ కేంద్రాల్లో చేర్పించవచ్చు. ►లైంగిక వేధింపులు, హింస బారినపడే బాధిత మహిళలకు వైద్య సహాయం, న్యాయ, పోలీసు సహాయం, కౌన్సెలింగ్ అందించేందుకు ఉద్దేశించిన ‘వన్ స్టాప్ సెంటర్’కు కేటాయింపులను రూ.204 కోట్ల నుంచి రూ.385 కోట్లకు పెంచారు. ►ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై) పథకానికి 2019–20లో రూ.2,300 కోట్లు కేటాయించగా, 2020–21లో రూ.2,500 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద గర్భిణికి/పాలిచ్చే తల్లికి రూ.6,000 అందజేస్తారు. ►ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘బేటీ బచావో.. బేటీ పడావో’కార్యక్రమానికి రూ.220 కోట్లు కేటాయించారు. ►మహిళా శక్తి కేంద్రాలకు రూ.100 కోట్లు ఇచ్చారు. గత ఏడాది ఇచ్చింది రూ.50 కోట్లే. అంటే కేటాయింపులను ఈసారి రెట్టింపు చేశారు. ►మహిళ రక్షణ, సాధికారత మిషన్‌కు గత ఏడాది రూ.961 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,163 కోట్లు కేటాయించారు. -
రాష్ట్రానికి నిరాశ మిగిల్చింది
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020–బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించిందని, అన్యాయం జరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి మొత్తంమీద మందగమనంలో సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టాక ఆయన శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోందన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్యాకేజీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు ఎన్నో వదులుకున్నామని, అవన్నీ మనకు రాలేదన్నారు. రాష్ట్రానికి చాలా ఇబ్బందికర పరిస్థితులున్నాయని ఈ విషయమై ఎన్నోసార్లు కేంద్రానికి విన్నవిస్తూనే ఉన్నామని బుగ్గన వివరించారు. స్థూల ఉత్పత్తి 10 శాతం అంటే ప్రశ్నార్థకం రాబడి అంతా స్థూల ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటుంది.. స్థూల ఉత్పత్తి 10 శాతం అంటున్నారంటే అది ప్రశ్నార్థకంగా ఉందని తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందనడం అనుమానాస్పదమేనన్నారు. గత బడ్జెట్లోనూ ఇలాగే చెప్పారని, కానీ అంచనాలన్నీ తప్పాయ్యాయన్నారు. బడ్జెట్ పూర్తిగా ప్రశ్నార్థకంగా తయారైందని, జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం వాటా ఇవ్వాల్సిందేనని, ఏడెనిమిది రాష్ట్రాలకు తప్పితే మిగిలిన రాష్ట్రాలన్నింటికీ రీయింబర్స్ చేయాలన్నారు. 2018–19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటాను రూ.2,500 కోట్లకు తగ్గించారని, ఇది రాష్ట్రానికి పెద్ద దెబ్బని బుగ్గని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా రాలేదని అయితే అప్పు శాతం తగ్గించడం మంచి పరిణామమన్నారు. గోదాముల సామర్థ్యం పెంపు, ధాన్యలక్ష్మి, కిసాన్ రైలు ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. ‘కృషి ఉడాన్’ ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమని, వెనుకబడిన జిల్లాల్లో ఆస్పత్రుల నిర్మాణానికి ఆయుష్మాన్ భారత్ నిర్ణయం మంచిదేనన్నారు. నూతన విమానాశ్రయాల నిర్మాణం, డేటా సెంటర్ పార్కుల ఏర్పాటు, చిన్న పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ ఆహ్వానించదగ్గవేనన్నారు. డబ్బు ఆదా చేస్తే యనమలకు బాధ ఎందుకు? కేంద్ర బడ్జెట్‌పై యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తమది అవినీతి, అసమర్థ పాలన అంటున్నారని, ఏడు నెలల్లోనే తమది అసమర్థ పాలనా? అని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను సరిదిద్దేందుకు తమకు సమయం పడుతుందని.. ఐదేళ్లలో టీడీపీ చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై రివర్స్ టెండరింగ్ చేసి రూ.1,900 కోట్లు మిగల్చడం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పా? అంటూ నిలదీశారు. పోలవరంలోనూ.. బొగ్గు రవాణా మొదలు వెలిగొండ, కంప్యూటర్లు, ప్రింటర్ల వరకూ ప్రతి దాంట్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తగ్గిస్తే యనమలకు బాధెందుకని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కొన్ని కంపెనీలతో లాలూచీపడినందునే తాము సమీక్షించినట్టు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్లే వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం పడిందని.. ఆయన చేసిన పనికి ఇప్పుడు సింగపూర్‌లో అల్లకల్లోలం జరుగుతోందని, అక్కడ ఓ ఆర్థిక మంత్రి పదవి కూడా ఊడబోతోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక అసమర్థ ప్రతిపక్షం ఉందని ధ్వజమెత్తారు. టీడీపీ వారు వట్టి తుగ్లక్‌లు కాదని వారు దుర్మార్గమైన తుగ్లక్లని, పాపపు పనులు చేసి నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లులు చెల్లించడానికే తమకు ఆరు నెలలు పట్టిందని అచ్చంగా తుగ్లక్ పనులు చేసింది చంద్రబాబేనని విరుచుకుపడ్డారు. కార్యాలయాల తరలింపులో తప్పు లేదు అమరావతి నుంచి కార్యాలయాల తరలింపులో ఏ మాత్రం తప్పులేదని, ఈ విషయం శ్రీబాగ్ ఒప్పందంలో స్పష్టంగా ఉందని బుగ్గన అన్నారు. ప్రజా తీర్పును మందబలంతో టీడీపీ వారు శాసనమండలిలో అడ్డుకున్నారని, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. -
చేనుకు పోదాం.. చలో!
న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం 16 అంశాలతో కూడిన ప్రణాళికలను సిద్ధం చేశామని, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపడం, ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా తగిన మౌలిక సదుపాయాలు కలి్పంచడం ద్వారా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నది తమ ఉద్దేశమని వెల్లడించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయం కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రూ.15 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. అందులో వ్యవసాయ రంగానికి రూ.1.6 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాది రుణ పరిమితి రూ.12 లక్షల కోట్లు మాత్రమే కాగా.. ఈ ఏడాది లక్ష్యం రూ.13.5 లక్షల కోట్లు. వ్యవసాయ, అనుబంధ, సాగునీటి వ్యవస్థల కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తారని, గ్రామీణాభివృద్ధి కోసం మరో రూ.1.23 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రత్యామ్నాయ మార్గాలివీ.. ‘రైతులను విద్యుదుత్పత్తిదారులుగా మార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) కార్యక్రమం కింద 20 లక్షల మంది రైతులు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకునేందుకు సాయం అందిస్తాం. మరో 15 లక్షల మంది రైతులు ఏర్పాటు చేసుకునే సోలార్ పంపుసెట్ల నుంచి నెట్‌మీటరింగ్ పద్ధతి ద్వారా జాతీయ గ్రిడ్‌కు విద్యుత్తు సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తాం. తద్వారా రైతులు కొంత అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా.. బీడు భూముల్లో, వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్ విద్యుదుత్పత్తి చేసుకునేందుకూ రైతులకు అవకాశం కలి్పస్తాం’అని నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ భూమి లీజింగ్, మార్కెటింగ్, కాంట్రాక్ట్ ఫారి్మంగ్ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సాగునీటి లభ్యతపై ఒత్తిడి ఉన్న వంద జిల్లాలను గుర్తించి సమస్య పరిష్కారానికి సమగ్రమైన ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. సాగుకు తక్కువ నీరు, ఎరువులు, రసాయనాలను వాడేలా రైతులను ప్రోత్సహిస్తామని తద్వారా రాయితీల కోసం విచ్చలవిడిగా కృత్రిమ రసాయనాలను వాడే పరిస్థితి తొలగుతుందని మంత్రి చెప్పారు. పీఎం–కిసాన్ యోజనకు తగ్గిన కేటాయింపులు రైతులకు ఏటా మూడు దశలుగా మొత్తం రూ.6 వేలు చెల్లించేందుకు ఉద్దేశించిన పీఎం కిసాన్ పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఈ పథకం కోసం దాదాపు రూ.75 వేల కోట్లు కేటాయించారు. అయితే ఈ పథకం అమల్లో కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా బడ్జెట్లో రూ.54,300 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే కేటాయింపులు తగ్గినా రానున్న ఆర్థిక సంవత్సరపు అంచనాలను మాత్రం రూ.75 వేల కోట్లుగానే పెట్టడం గమనార్హం. గతేడాది ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 8 కోట్ల మంది రైతులకు రూ.43,000 కోట్లు పంపిణీ చేయగా.. పశి్చమ బెంగాల్లో ఈ పథకాన్ని అమలు చేయలేదు. కొన్ని ఇతర రాష్ట్రాల్లో రైతులకు సంబంధించి సరైన సమాచారం లేదని, ఫలితంగా ఈ ఏడాది ఈ పథకం సవరించిన అంచనాలను కూడా కేంద్రం తగ్గించింది. ఈ పథకం లబి్ధదారుల సంఖ్య గతంలో 14.5 కోట్లు కాగా.. తాజా అంచనాల ప్రకారం 14 కోట్ల మందికి మాత్రమే లబ్ధి చేకూరనుంది. మత్స్య ఉత్పత్తులపైనా ప్రత్యేక శ్రద్ధ.. 2020 – 23 మధ్యకాలంలో మత్స్య ఉత్పత్తులను 200 లక్షల టన్నులకు పెంచేందుకు, 2024–25 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన మత్స్య సంపదను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నీలి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా నాచు, సముద్రపు కలుపు, ప్రత్యేక నిర్మాణాల్లో చేపల పెంపకాలకూ ఊతమిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 3,477 మంది సాగర్ మిత్రలు, 500 ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లను ఏర్పాటు చేస్తామని, తద్వారా సముద్ర, జల ఉత్పత్తుల సమర్థ మార్కెటింగ్, గ్రామీణ యువతకు ఉపాధికల్పన సాధ్యమవుతుందని వివరించారు. సముద్ర మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు, పరిరక్షించేందుకు, నియంత్రించేందుకు కేంద్రం కొన్ని నిబంధనలను సిద్ధం చేస్తోందని తెలిపారు. పాడిపశువులకు వచ్చే గాలికుంటుతో పాటు గొర్రెలు, మేకలకు వచ్చే పీపీఆర్ వంటి వ్యాధులను 2025కల్లా దేశంలో లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పశుగ్రాసం పెంపకం పనులకూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలకు ‘ధాన్యలక్ష్మి గ్రామీణ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాల నిల్వకు మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశం కలి్పస్తామని, తద్వారా మహిళలను ధనలకు‡్ష్మలుగా మాత్రమే కాకుండా ధాన్యలకు‡్ష్మలుగానూ గుర్తిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ముద్రా, నాబార్డ్ సంస్థల ద్వారా శీతల గిడ్డంగుల ఏర్పాటుకు రుణాలు అందజేస్తామని తెలిపారు. జాతీయ గిడ్డంగుల సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న భూముల్లో గిడ్డంగుల నిర్మాణం చేపడతామని, నాబార్డ్‌తో 162 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గిడ్డంగులను గుర్తించి జియో ట్యాగింగ్ చేస్తామని వెల్లడించారు. విమానాల ద్వారా పంట ఉత్పత్తులను దూర ప్రాంతాలకు చేరవేసేందుకు ‘కృషి ఉడాన్’పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో శీతలీకరణ వ్యవస్థలున్న ‘కిసాన్ రైళ్ల’ను నిర్మించి తొందరగా పాడైపోయే ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. ఉద్యానవన పంటల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకూ ప్రయతి్నస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రాల్లో ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’అన్న భావనను పెంపొందించేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తగినంత వ్యవ‘సాయం’ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించారని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాటి తన బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.6 లక్షల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మధ్యతరగతి మహిళలకు ఈ బడ్జెట్ ఊరటనిస్తుందని, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి సారించిందని తోమర్ తెలిపారు. వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
నిస్సారమైన బడ్జెట్: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా చప్పగా, నిస్సారంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్లో ఏమీ లేదని పెదవి విరిచారు. దేశంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్యను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను చూస్తుంటే.. మాటలే తప్ప చేతలు చేతకాని ప్రభుత్వమని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. పన్ను శ్లాబుల్లో గారడీ చేశారని, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అసలైన పరిష్కార మార్గాలు చూపలేదని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్లో అసలు వాస్తవికతే లేదని, ఉత్తి మాటలే కనిపిస్తున్నాయని విమర్శించారు. ‘ఈ బడ్జెట్లో యువతకు ఉద్యోగం కల్పించేందుకు ఎలాంటి వాస్తవికత, వ్యూహాత్మకమైన భావన ఏమీ కన్పించట్లేదు’అని పేర్కొన్నారు. ‘ఒకే విషయాన్ని తిప్పి తిప్పి చెబుతున్నట్లు.. కొత్త సీసాలో పాత సారాయి పోసినట్లు ఉంది’అని ఆరోపించారు. ‘చాలా ఎక్కువ సేపు చదివిన బడ్జెట్ మాత్రమే కాదు.. అత్యంత నిస్తేజమైన బడ్జెట్ ఇది’అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎద్దేవా చేశారు. ‘అచ్ఛే దిన్’ను కేంద్రం ఎలా వదిలిపెట్టిందో.. ఇప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కూడా గాలికొదిలేసిందని ట్విట్టర్లో దుయ్యబట్టారు. పన్ను చెల్లింపుదారులను ఆరేళ్లుగా పీడించుకుని తిన్న కేంద్ర ప్రభుత్వం.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన విషయాన్ని ఇప్పుడు గుర్తించినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. అసలు బడ్జెట్ మొత్తంలో ఉద్యోగాల గురించి ఎక్కడా ఒక్క పదం కూడా లేకపోవడం గర్హనీయమని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మండిపడ్డారు. -
క్రియాశీలకమైన బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దార్శనికమైన, క్రియాశీలకమైన, అద్భుతమైన బడ్జెట్ అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ‘ఉద్యోగ కల్పనలో వ్యవసాయం, నిర్మాణరంగం, జౌళి, సాంకేతికత రంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నాలుగు రంగాలకు ఈ బడ్జెట్లో సముచిత స్థానం ఇచ్చాం’అని పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు 16 అంశాల కార్యాచరణ తీసుకొచ్చామని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ‘వ్యవసాయ రంగంలో సంప్రదాయ పద్ధతులకు సాంకేతికత జోడించడం ద్వారా ఉద్యాన, మత్స్య, పశుపోషణ రంగాల విలువ పెరుగుతుంది. దీంతో పాటు ఉద్యోగిత కూడా పెరుగుతుంది’అని మోదీ వెల్లడించారు. సాంకేతికత రంగంలో ఉద్యోగ కల్పన కోసం తాము ఈ బడ్జెట్లో అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీటితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ శక్తిమంతంగా తయారవుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆర్థిక సర్వేలో కూడా పేర్కొన్నట్లు గుర్తు చేశారు. డివిడెండ్ పన్ను తొలగించడంతో.. కంపెనీల చేతుల్లో దాదాపు రూ.25 వేల కోట్లు మిగులుతాయని, ఈ మొత్తాన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
క్రీడలకు రూ. 2,826 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్రీడలకు రూ. 2,826.92 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే పెరిగింది స్వల్పమే. రూ. 50 కోట్లే ఎక్కువగా కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ‘ఖేలో ఇండియా’కు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మిగతా క్రీడా సమాఖ్యలు, క్రీడా సంబంధిత రంగాలకు కేటాయింపుల్లో కోత విధించారు. గత బడ్జెట్లో ‘ఖేలో ఇండియా’కు రూ. 578 కోట్ల నిధులు ఇవ్వగా... ఈ సారి దానిని రూ.890.42 కోట్లకు పెంచారు. గతంతో పోల్చుకుంటే రూ. 312.42 కోట్ల పెరుగుదల కనిపించింది. ఒలింపిక్ ఏడాదిలో క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాల నిధుల్ని తగ్గించడం ఆశ్చర్యకరం. రూ. 111 కోట్ల నుంచి రూ. 70 కోట్లకు కుదించారు. అలాగే జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్ఎస్డీఎఫ్)కి గతంలో రూ.77.15 కోట్లు ఇవ్వగా... ఇప్పుడు రూ. 50 కోట్లతో సరిపెట్టారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యల కోసం రూ. 245 కోట్లను కేటాయించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ. 300.85 కోట్లతో పోల్చితే రూ. 55.8కోట్లు కోత పెట్టారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కీ కోత తప్పలేదు. రూ. 500 కోట్లు (గతంలో రూ. 615 కోట్లు) కేటాయించారు. కామన్వెల్త్ గేమ్స్ (2010) ‘సాయ్’ స్టేడియాల నవీకరణకు రూ.75 కోట్లు విదిల్చారు. గత మొత్తం రూ. 96 కోట్లతో పోల్చితే రూ. 21 కోట్లు తగ్గింది. క్రీడాకారుల సంక్షేమ నిధి (రూ. 2 కోట్లు)లో ఏ మార్పు లేదు. జమ్మూ కశ్మీర్లో క్రీడా సదుపాయాల కోసం గత బడ్జెట్లో కేటాయించిన రూ. 50 కోట్ల మొత్తాన్నే ఈ సారీ కొనసాగించారు. లక్ష్మీబాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు మాత్రమే కాస్త హెచ్చింపు చేశారు. రూ. 55 కోట్లకు పెంచారు. గతం కంటే రూ. 5 కోట్లు పెరిగింది. -
సీతారామన్...సుదీర్ఘ ప్రసంగం!
న్యూఢిల్లీ: కశ్మీరీ కవిత, తమిళ కవుల పలుకులు ఉటంకిస్తూ, సింధు నాగరికతను గుర్తు చేసుకుం టూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. దీంతో రికార్డు బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. శనివారం పార్లమెంట్లో నిర్మల దాదాపు 2 గంటల 42 నిమిషాల మేర బడ్జెట్ ప్రసంగం చేశారు. దీంతో గతంలో ఆమె పేరునే ఉన్న సుదీర్ఘ ప్రసంగం రికార్డును బద్దలు కొట్టారు. చివరలో కొంచెం అస్థత్వత కలగడంతో చివరి పేజీ లను చదవకుండా వదిలేశారు. లేదంటే నిర్మలమ్మ ప్రసంగం మూడు గంటలు దాటి ఉండేదే! గతేడాది జూలైలో నిర్మల తన తొలి బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆ సమయంలో ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. తిరిగి ఈ రోజు ఆమే తన రికార్డు బ్రేక్ చేశారు. గతంలో 2003లో అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ దాదాపు 2గంటల 13 నిమిషాల ప్రసంగం చేశారు. అంతకుముందు 1991లో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ చేసిన ప్రసంగం కూడా సుదీర్ఘమైనదే! తాజా ప్రసంగంలో కశ్మీర్‌కు చెందిన కవితను అటు కశ్మీరీ, ఇటు హిందీలో ఆమె ఉటంకిం చారు. దీనికితోడు కాళిదాస విరచిత రఘువంశంలోని శ్లోకాన్ని, ప్రముఖ తమిళకవి తిరువళ్లువర్ రచనలను ఆమె తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. పలు సందర్భాల్లో ప్రధాని మోదీ సహా అధికారపక్ష సభ్యులు బల్లలు చరిచి ఆమెను ప్రశంసించారు. బేటీ బచావో పథకం ప్రస్తావనతో పాటు పలు అంశాల వద్ద ప్రతిపక్షాలు ఆమె ప్రసంగానికి అడ్డుతగిలాయి. సుదీర్ఘ ప్రసంగం చివరలో అలసిన ఆమె తన మిగతా ప్రసంగం పూర్తయినట్లు భావిం చాలని స్పీకర్‌ను కోరి కూర్చుండిపోయారు. సీతారామన్ షుగర్ లెవల్స్ పడిపోవడంతో పక్కనే కూర్చున్న మంత్రి గడ్కరీ ఆమెకు చాక్లెట్ ఇచ్చారు. కాగా, ఆరోగ్యం, సంతోషం, సంపద, ఉత్పత్తి, భద్రత.. ఈ ఐదు ఒక దేశ అందమైన ఆభరణాలు’ అని ప్రఖ్యాత తమిళ కవి తిరువళ్లువార్ కవితా పం క్తులను ఆమె ఉటంకించారు. ప్రసంగం అనంతరం మోదీ నిర్మలను ప్రశంసించడం కనిపించింది. -
కాలుష్యకారక థర్మల్ ప్లాంట్ల మూత
న్యూఢిల్లీ: వాయు కాలుష్యాన్ని నివారించేందుకు, గాలిలో స్వచ్ఛతను కాపాడేందుకు బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు రూ. 4,400 కోట్లను కేంద్రం కేటాయించింది. దీనిలో భాగంగా పాతబడిన, కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండని థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లను మూసేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ ప్లాంట్ల భూమిని వేరే అవసరాలకు వాడనున్నారు. డీజిల్, కిరోసిన్‌తో పనిలేని వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రైతులు సౌర విద్యుత్‌వైపు మొగ్గుచూపడానికి ‘పీఎం కుసుమ్’ పథకాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో రైతులు 35 లక్షల సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామన్నారు. దీనిలో 20 లక్షల మంది రైతులు సొంతంగా సోలార్ పంప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు, మరో 15 లక్షల మందిని గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు సహాయం చేస్తామన్నారు. తమ నిరుపయోగ భూమిలో రైతులు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, గ్రిడ్‌కు అమ్మే పథకాన్ని మంత్రి ప్రతిపాదించారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు ఊతం పవర్, పునరుత్పాదక ఇంధన రంగానికి ఈ బడ్జెట్లో రూ. 22,000 కోట్లు కేటాయించారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు రూపంలో ప్రోత్సాహకాన్ని సమకూర్చుతామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన దేశీయ ఉత్పత్తి సంస్థలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చే నిబంధనలను గత సెప్టెంబర్‌లో తెచ్చామని, దీనిని కొత్త విద్యుత్ ప్లాంట్లకు విస్తరిస్తున్నామన్నారు. ‘10 లక్షలు దాటిన జనాభా ఉన్న పెద్ద పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి లభ్యత కష్టం. పెద్ద పట్టణాల్లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రణాళికలు రూపొందించే రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రమాణాలను ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్, క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది’ అని నిర్మల తెలిపారు. స్మార్ట్ విద్యుత్ మీటర్లు సంప్రదాయ విద్యుత్ మీటర్లను ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లుగా వచ్చే మూడేళ్లలో మార్చాలని రాష్ట్రాలను నిర్మల కోరారు. దీనివల్ల తమకు నచ్చిన సరఫరాదారును, రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ వినియోగదారులకు వస్తుందని ఆమె తెలిపారు. -
అంతా బాగుండాలి.. అందులో మీరూ ఉండాలి
అదిగో... అదిగో..! అందరూ వచ్చేశారా!! ప్రతిసారీ ఈ రోజున మనం ఎక్కడో ఓ చోట కలుసుకుంటూనే ఉన్నాం. ఈసారి ఈ రచ్చబండ దగ్గర!!. ఎన్నో కోరికలు కోరి... అవి తీరుతాయన్న ఆశతో మీరిలా రావటం... అన్నీ సాధ్యం కాకున్నా కొన్నిటినైనా నెరవేర్చడానికి నేను ప్రయత్నించటం కొత్తేమీ కాదుగా!!. ఈసారి మన ఊరి పరిస్థితులు అంత బాగాలేవు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య లంకె కుదరటం లేదు. ధరలు పెరుగుతున్నాయి. వాటి మాదిరే అప్పులు కూడా!!. అలాగని ఖర్చులు మానుకోలేం కదా? మీరంతా బాగుండాలని నా ప్రయత్నమైతే నేను చేశా.. ఇదిగో చెబుతా వినండి!!. రైతన్నా... నేనున్నా నీకు విత్తులేసే నాటికి చేతిలో పైకం ఉండాలి. బ్యాంకులకు చెప్పాంలే!! దండిగా రుణాలివ్వమని. ఓ రెండేళ్లలో నీ చేతిలోకి రెండింతల సొమ్ము వచ్చేలా చేయాలన్నదే నా కల. అందుకోసమే ఇదంతా!!. మీరు సోలార్ పంపుసెట్టు పెట్టుకోండి. దానిక్కాస్త డబ్బులిస్తాం. అంతేకాదు!! పంటతో పాటు కరెంటూ పండించండి!!. ఆ కరెంటును మేం కొని డబ్బులిస్తాం. నీటి కష్టాలు లేకుండా చేస్తాం. మరి మీరు కూడా నీళ్లు, ఎరువులు తక్కువ వాడాలి సుమా!. మీరు పండించే వస్తువులు పాడైపోకుండా రవాణా చెయ్యటానికి కోల్డ్ స్టోరేజీ రైళ్లు మరిన్ని తేవటానికి ప్రయత్నిస్తాం. మీ రైతాంగానికిచ్చే నిధులు కూడా భారీగానే పెంచాంలే!!. నేను సీతయితే... నువ్వు లక్ష్మి మరి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలంటే ధన లక్ష్ములే కాదు! ధాన్య లక్ష్ములూ కావాలి!!. అందుకే విత్తనాలు నిల్వ చేయండి. స్టోరేజీలకు కావాల్సిన అప్పులు మేం ఇప్పిస్తాం. గిడ్డంగులూ మేమే కట్టిస్తాం. మీ పంట ఉత్పత్తుల్ని ఇతర ప్రాంతాలకే కాదు... విదేశాలకూ పంపించొచ్చు. ఆడపిల్లల పెళ్లికి కనీస వయసు పెంచాలని ఉంది. దానికోసం ఓ టాస్క్‌ఫోర్స్ పెడతాం. అంగన్వాడీలకు సెల్ఫోన్లు కూడా ఇస్తున్నాం. పన్ను తగ్గింపు కావాలా.. నాయనా!! మీ ఉద్యోగులెప్పుడూ ఇంతే! పన్ను రేట్లు తగ్గించండని అడుగుతూనే ఉంటారు!!. అదెలా కుదురుతుంది? మీరు పన్నులు కడితేనేగా ఊరికి ఆదాయం వచ్చేది. అయినా సరే... మీరు అడుగుతున్నారు కనక ఏదోకటి చేశాలే!!. మీలో కొందరేమో పొదుపరులు. కొందరేమో వచ్చింది వచ్చినట్లే ఖర్చుపెట్టేస్తారు. అందుకే.. మీ ఇద్దరినీ వేరు చేసి మీకు తగ్గ పన్ను విధానాలు తెచ్చాను. మీరు పొదుపు చేసుకుంటే మీకు మునుపటిలానే పన్ను ఎలాగూ కాస్త మినహాయిస్తాం. ఖర్చు పెట్టేవాళ్లకు మినహాయింపులుండవు కనక పన్ను రేట్లు తగ్గించాం. ఇది ఎవరికి లాభమని మాత్రం నన్ను అడక్కండి. మాక్కూడా లాభం ఉండాలిగా!!. కార్పొరేట్లూ... ఇంకా ఎంత తగ్గిస్తాం? బడ్జెట్ కోసం మీరు ఎదురు చూడటమే సరికాదు. ఎందుకంటే మొన్నేగా మీ పన్ను తగ్గించింది!!. అసలు ప్రపంచం మొత్తమ్మీద కంపెనీలకు తక్కువ పన్నులున్నది ఇక్కడే తెలుసా? ఇంకా ఎంత తగ్గిస్తాం చెప్పండి!!. మీరిప్పుడు డివిడెండ్లు ఇస్తూ... వాటిపైనా పన్ను చెల్లించాల్సి వస్తోంది కదా? దాన్ని... అదే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్ను తీసేస్తున్నాం లెండి. కాకపోతే ఇకమీదట డివిడెండ్ తీసుకునే వాళ్ళు పన్ను కడతారు. ఇద్దరూ కట్టకపోతే ఎలా చెప్పండి? సురక్షితంగా దాచుకోండి... బ్యాంకుల్లో పాపం! బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు కానీ మీ భయం మీకుంటుంది!!. ఏ బ్యాంకు ఎప్పుడు బిచాణా ఎత్తేస్తుందో తెలీదు. అందుకే... ఇకపై మీరు చేసే డిపాజిట్లకు రూ.5 లక్షలవరకూ బీమా ఉండేలా చూస్తాం. ఇప్పటిదాకా ఇది లక్ష రూపాయలే కదా!!. అలాగని మీరు చేసే డిపాజిట్లన్నిటికీ 5 లక్షల చొప్పున గ్యారంటీ ఉంటుందనుకోకండి. మీరు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని డిపాజిట్లు చేసినా... ఒక మనిషికి రూ.5 లక్షల వరకే బీమా ఉంటుంది. అది కాస్తా చూసుకోండి!!. చిన్న కంపెనీకి... చింతలుండవు మరీ పెద్ద కంపెనీలు కాదుగానీ... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలన్నిటికీ ఇది మంచి వార్తే లెండి!!. మీ టర్నోవర్ రూ.5 కోట్ల లోపుంటే మీకు ఆడిటింగ్ అవసరం లేదు. ఇపుడు కోటిదాటితే ఆడిట్ చేయాల్సి వస్తోంది కదా? దీన్ని సవరించాం. ఎందుకంటే ఎకానమీ బాగుండాలంటే మీరే ముందుండి నడిపించాలి. మీకు తక్కువ వడ్డీ రేటుండే రుణాలివ్వటానికి (సబార్డినేట్) కూడా మరో పథకం తెస్తున్నాం. మీకు రుణ పునరుద్ధరణ సదుపాయ విండోను 2021 మార్చి వరకు కొనసాగించాలని ఆర్బీఐని అడిగాం. రేపో మాపో ఊ కొడుతుంది లెండి!!. విద్యార్థులూ... టూరిస్టులూ రవాణా ఎంత ముఖ్యమో మీకు తెలుసు? కొత్త హైస్పీడ్ రైళ్లు... 100 కొత్త ఎయిర్పోర్ట్లూ తెస్తాం. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే పూర్తి చేస్తాం. హరియాణా, గుజరాత్, తమిళనాడు, అసోం సహా ఐదు చారిత్రక ప్రాంతాలతో పాటు రాంచీలో ట్రైబల్ మ్యూజియం, అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్ మ్యూజియం కడతాం. ఎంచక్కా మీరు వెళ్లి చూడొచ్చు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులొస్తాయి. 150 యూనివర్సిటీల్లో కొత్త స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెడతాం. జిల్లా ఆసుపత్రులన్నీ మెడికల్ కాలేజీలుగా మారుస్తాం. పెరిగేవి.. తగ్గేవి! ఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో సిగరెట్లు, హుక్కా, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులు ఖరీదు కానున్నాయి. ఈ బాటలో సుంకాలు పెంచడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలు, ఫ్యాన్లు, టేబుళ్లు, ఫుట్‌వేర్, ఎలక్ట్రిక్ వాహనాలు, టేబుల్‌వేర్, కిచెన్వేర్, బొమ్మలు, ఫర్నిచర్ తదితర ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఈ జాబితాలో దిగుమతి చేసుకునే బటర్ నెయ్యి, పీనట్ బటర్, చ్యూయింగ్ గమ్, షెల్‌తో ఉన్న వాల్నట్స్, సోయా ప్రొటీన్ చేరాయి. దిగుమతయ్యే ఫుట్‌వేర్, షేవర్స్, వాటర్ ఫిల్టర్, గ్లాస్‌వేర్, పింగాణీ పాత్రలు, జెమ్ స్టోన్స్, వాటర్ హీటర్లు, హెయిర్ డయ్యర్స్, ఎలక్ట్రిక్ ఐరన్స్, ఒవెన్స్, కుకర్స్, గ్రైండర్స్, కాఫీ, టీ మేకర్స్ ధరలు పెరగనున్నాయి. దిగుమతి చేసుకునే పీసీబీలు, మొబైల్ ఫోన్లు, డిస్ప్లే ప్యానళ్లు, మొబైల్స్‌లో వినియోగించే ఫింగర్‌ప్రింట్ రీడర్లు, ల్యాంపులు, లైటింగ్ ఫిట్టింగ్స్, స్టేషనరీ వస్తువుల ధరలు సైతం పెరగనున్నాయి. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్, క్రీడా పరికరాలు, మైక్రోఫోన్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు చౌక కానున్నాయి. -
పన్ను పోటు తగ్గినట్టేనా?
పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం ఉన్న 4 శ్లాబులను 7 శ్లాబులుగా మారుస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ప్రతిపాదించారు. కొత్తగా ప్రతిపాదించిన 7 శ్లాబుల విధానంలో పన్ను రేట్లు మునుపటికన్నా తగ్గుతాయి. కాకపోతే మునుపటి మాదిరి ట్యూషన్ ఫీజు, హెచ్ఆర్ఏ, గృహ రుణంపై వడ్డీ, స్టాండర్డ్ డిడక్షన్, బీమా పాలసీలకు చెల్లించే మొత్తం, పీఎఫ్ వంటి మినహాయింపులేవీ ఈ విధానంలో ఉండవు. తగ్గించిన రేట్ల ప్రకారం నేరుగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే పాత విధానం ప్రకారం పన్ను చెల్లించాలా? కొత్త విధానానికి మారాలా? అన్నది పూర్తిగా పన్ను చెల్లింపుదారు ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. నిజానికి కొత్త విధానం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదన్నది పన్ను నిపుణులు చెబుతున్న మాట!!. -
పన్నుల వాటాలో రాష్ట్రానికి అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మదింపునకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ధేశించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా పంచారు. ఇందులో నుంచి తెలంగాణకు కేంద్ర పన్నుల వాటా కింద 2.437 శాతం పంచుతున్నారు. ఇప్పుడది 2.133 శాతానికి తగ్గింది. పైగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచాల్సిన వాటా 42 నుంచి 41 శాతానికి తగ్గించారు. ఏడో ఆర్థిక సంఘం నుంచి 14వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వాటాలను నిర్ధేశించి కేంద్రం పన్నులను పంచింది. కానీ ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా పన్నుల వాటాను నిర్ధేశించారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి నివేదిక సిద్ధం కానందున కేవలం 2020–21కు వర్తించేలా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వీటి ఆధారంగానే తాజాగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటాలను నిర్ధేశిస్తూ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో బడ్జెట్లో పొందుపరిచారు. ఒకవేళ 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంచాల్సిన వాటాను 41 శాతం నుంచి ఇంకా తగ్గిస్తే అప్పుడు రాష్ట్రం ఇంకా నిధుల లేమిని ఎదుర్కోవలసి వస్తుంది. 2020–21లో కేంద్రం ఇచ్చే పన్నుల వాటా (అంచనాలు) ప్రకారం తెలంగాణకు రూ.16,726.58 కోట్లు రానున్నట్టు బడ్జెట్లో అంచనా రూపొందించారు. అయితే గత రెండు మూడేళ్ల కాలంలో బడ్జెట్లో పొందుపరిచిన అంచనాల మేరకు నిధులు రాలేదు. పొందుపరిచిన అంచనాల కంటే వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు తక్కువే వచ్చాయి. ప్రభావం చూపించిన ‘జనాభా’ 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పన్నుల వాటాలు తేల్చేందుకు జనాభాకు 15 శాతం వెయిటేజీ ఇచ్చారు. దీని ఫలితంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది. తెలంగాణకు స్పెషల్ గ్రాంటు సిఫారసు తెలంగాణ, కర్ణాటక, మిజొరం రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చింది. తెలంగాణకు 2020–21కి రూ. 723 కోట్ల మేర పన్ను వాటా తగ్గుతుందని అంచనా వేసి గ్రాంటును సిఫారసు చేసింది. తెలంగాణకు పట్టణ స్థానిక సంస్థలకు రూ. 889 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1847 కోట్లు సిఫారసు చేసింది. 10 లక్షలకు పైబడి జనాభా ఉన్న హైదరాబాద్‌కు రూ.468 కోట్ల గ్రాంట్లు సిఫారసు చేసింది. గిరిజన వర్సిటీ ఒక్కటే సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి 2020–21 కేంద్ర బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. కేవలం గిరిజన వర్సిటీ కోసం మాత్రమే రూ. 26.90 కోట్ల మేర నిధులు కేటాయించింది. తెలంగాణలో ఉన్న ఇతర జాతీయ సంస్థలకు సాధారణంగా చేసే కేటాయింపులే మినహా ప్రత్యేక ప్రస్తావనేదీ లేదు. కాగా పదిహేనో ఆర్థిక సంఘం 2020–21 సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాను గతంలో ఉన్న 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గించడం వల్ల ఆదాయం కోల్పోనుంది. అయితే తెలంగాణకు ప్రత్యేక గ్రాంటు కింద రూ. 723 కోట్లు పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసు చేయడం స్వల్ప ఊరట. తెలంగాణలో ఐఐఎం, ఐఐఐటీ తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలు స్థాపించాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌కు కేంద్రం నుంచి స్పందన కనిపించలేదు. మరోవైపు ఎయిమ్స్‌కు నిర్ధిష్ట కేటాయింపులు చూపలేదు. ఏడాది తెలంగాణకు కేంద్ర పన్నుల్లో వాటా 2018–19 రూ. 17,960.01 (వాస్తవిక) 2019–20 రూ. 17,422.17 (సవరించిన అంచనాలు) 2020–21 రూ.16,726.58 కోట్లు (అంచనాలు) -
అందుబాటు తప్ప.. అందినదేమీ లేదు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ పాత పాటే పడింది. జీఎస్టీ తగ్గింపు, మౌలిక రంగ హోదా, ఇన్వెంటరీ గృహాలకు పన్ను మినహాయింపు, డెవలపర్స్ సబ్వెన్షన్, కొనుగోలుదారుల ఫిర్యాదు కోసం రెరా సింగిల్ బాడీ ఏర్పాటు వంటి వాటితో రియల్టీలో జోష్ నింపుతుందనుకున్న బడ్జెట్ నీరుగార్చింది. అందుబాటు గృహ కొనుగోలుదారులు, వాటి నిర్మాణదారులకు మినహా రియల్టీ రంగానికి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. లాజిస్టిక్ పాలసీ, కొత్త యూనివర్సీటీలు, విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీలు, డేటా సెంటర్లతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపార అవకాశాలను కల్పించారు. రవాణా, మౌలిక రంగ వసతుల కేటాయింపులతో దీర్ఘకాలంలో గృహ విభాగానికి డిమాండ్ వస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అందుబాటు గృహాల మీదే ఫోకస్.. తొలిసారి ఇల్లు కొనే వారికి అందించే రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ గడువును మరొక ఏడాది పొడిగించారు. అంటే అఫోర్డబుల్ హౌజింగ్ వడ్డీ రాయితీని 2021 మార్చి వరకు పొందే వీలుందన్నమాట. అందుబాటు గృహాల నిర్మాణదారులకు లాభాల మీద 100 శాతం పన్ను మినహాయింపు లను మరో ఏడాది పొడిగించింది. పెరిగిన ఏడాది పన్ను మినహాయింపు లాభాలను పూర్తి స్థాయిలో వినియోగిం చుకునేందుకు కొనుగోలుదారులు, డెవలపర్లు ముందుకొస్తారు కాబట్టి అఫోర్డబుల్ హౌజింగ్స్‌కు డిమాండ్ పెరుగుతుందని నరెడ్కో నేషనల్ ప్రెసిడెంట్ నిరంజన్ హిర్‌నందానీ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆదాయపన్ను శాతాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. ఇది ఆయా పన్ను చెల్లింపుదారులకు రియల్టీ పెట్టుబడులకు అవకాశమిస్తుందని టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ దత్ తెలిపారు. రియల్టీకి కొత్త ఇన్వెస్ట్మెంట్ దారులు.. డేటా సెంటర్లు, కొత్త విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీలతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అవకాశాలు మెరుగవుతాయని జేఎల్ఎల్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ అన్నారు. ఢిల్లీ–ముంబై, బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేస్, బెంగళూరు సబర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాజెక్ట్‌లతో మౌలిక రంగంలో స్కిల్ డెవలప్మెంట్ పెరగడంతో పాటూ ఆయా మార్కెట్లలో డెవలపర్లకు కొత్త పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయి. కొత్తగా వంద విమానాశ్రయాలు, ఐదు స్మార్ట్ సిటీలు, డేటా సెంటర్లతో కమర్షియల్ రియల్టీకి అవకాశాలు వస్తాయని తెలిపారు. 2024 నాటికి పరిశ్రమ ఆదాయం 3.2 బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. లాజిస్టిక్ బూస్ట్.. నేషనల్ లాజిస్టిక్ పాలసీ ప్రకటనతో వేర్‌హౌజ్, లాజిస్టిక్ రంగంలో సరఫరా పెరుగుతుంది. గతేడాది దేశంలో 21.1 కోట్ల చ.అ.లుగా ఉన్న వేర్‌హౌజ్ సప్లయి 2023 ముగింపు నాటికి 37.9 కోట్ల చ.అ.లకు చేరుతుందని అనరాక్ కన్సల్టెన్సీ అంచనా వేసింది. సింగిల్ విండో క్లియరెన్స్‌తో వేర్‌హౌజ్ అనుమతుల సమయం 6 నెలలకు తగ్గిపోతుంది. 2019లో దేశంలోని ప్రధాన నగరాల్లో 3.6 కోట్ల చ.అ. వేర్‌హౌజ్ నికర లావాదేవీలు జరిగాయి. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ యాక్ట్ (సర్ఫాసీ చట్టం) కింద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల అసెట్స్ నిర్వహణను రూ.500 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించారు. దీంతో మధ్యలోనే ఆగిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ల నిధులను రికవర్ చేయడానికి మరింత అవకాశం ఉంటుంది. ఆగిపోయిన ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించాలి. -
కొత్త విధానంలో పన్ను తగ్గుదల ఉత్తుత్తిదేనా..?
సాక్షి, అమరావతి: కొత్త పన్నుల విధానంలో పన్ను రేట్లు తగ్గించడం వల్ల పన్ను భారం భారీగా తగ్గు తుందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయం కోల్పోతుందన్న మాటల్లో వాస్తవం లేదని ట్యాక్సేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీలకమైన పన్ను మినహాయింపులను ఎత్తివేయడం వల్ల ప్రజల్లో పొదుపు అలవాటుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పన్ను భారం తగ్గించు కోవడానికి చాలామంది బీమా, పీపీఎఫ్, గృహ రుణాలు వంటివి తీసుకుంటున్నారని, ఇప్పుడు వీటిని తొలగించడం వల్ల ఈ పథకాలకు ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ట్యాక్స్ నిపుణులు ఎంఎన్ శాస్త్రి స్పష్టం చేస్తున్నారు. వృద్ధిరేటును పెంచడం కోసం పొదుపు శక్తిని తగ్గించడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచాలని ఆర్థికమంత్రి ఆలోచన కింద ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ ఇది దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఏ విధంగా చూసినా కొత్త విధానం కంటే పాత విధానమే భారం తక్కువగా ఉంటుందని ట్యాక్స్ నిపుణురాలు కె.వి.ఎల్.ఎన్ లావణ్య స్పష్టం చేస్తున్నారు.పన్ను రేటు సగానికి సగం తగ్గినా మినహాయింపులు ఎత్తివేయడం వల్ల పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుత విధానంలో రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారి వరకు మినహాయింపులను వినియోగించుకోవడం ద్వారా ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని, అదే కొత్త విధానంలో అయితే ఏకంగా రూ.37,500 పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. -
ఐటీ, పారిశ్రామిక రంగాలకు నిరాశే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిం చేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలకు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు నిరాశను మిగిల్చాయి. ఆహారశుద్ధి, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఐటీ తదితర రంగాలను ప్రోత్స హించడం ద్వారా ఆర్ధికాభి వృద్ధి, ఉద్యోగ కల్పన సాధ్యమని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సౌకర్యాలకు నిధులు, ఆహారశుద్ధి, టెక్స్టైల్ పార్కులకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, విభజన చట్టం హామీ మేరకు బయ్యారంలో స్టీల్ ప్లాంటు, ఐటీఐఆర్ ప్రాజెక్టు తదితరాల కోసం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఆశించింది. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,375 కోట్లు కాగా, మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించినా బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ ప్రస్తావన లేదు. ఐటీ రంగానికి గాను 2013లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూ.3,275 కోట్లు అవసరమవు తాయని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం ఏళ్ల తరబడి కేంద్రానికి లేఖలు రాస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో 6 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా, తొలి దశలో హైదరాబాద్–వరంగల్ కారిడార్ అభివృద్ధిని త్వరితగతిన చేపట్టాలని రాష్ట్రం భావిస్తోంది. శనివారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్–2020–21లో వీటి ఊసు లేకపోవడంపై పరిశ్రమల శాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ‘ఎలక్ట్రానిక్స్’కు ఊతం ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహించి సిలికాన్ వ్యాలీ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. తాజా కేంద్ర బడ్జెట్లో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఓ విధానం ప్రకటిస్తామన్న నేపథ్యంలో కొంత లబ్దిచేకూరనుంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో ఇప్పటికే మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేయగా, బడ్జెట్లో దానికి ఊతమిస్తామని కేంద్రం ప్రకటించింది. బడ్జెట్లో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ.1480 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదించారు. దీంతో కాకతీయ టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం నామమాత్రంగా లభించే సూచనలున్నాయి. ఆరు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి వచ్చే నాలుగేళ్లలో రూ.1.03లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్న కేంద్రం.. ఉడాన్ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని బడ్జెట్లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించింది. జక్రాన్‌పల్లి (నిజామాబాద్), అడ్డాకుల (మహబూబ్‌నగర్), పునుకుడుచెర్ల (భద్రాద్రి కొత్తగూడెం)లో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుతో పాటు బసంత్‌నగర్ (పెద్దపల్లి), మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. -
అన్నం లేదు.. ఆవకాయే
ఏ బడ్జెట్లో అయినా అందరినీ ఆకర్షించేది ఆదాయపు పన్నే!!. ఎందుకంటే అంతిమంగా తన జేబులో ఎంత మిగులుతుందన్నదే వేతనజీవి వెదుక్కుంటాడు. అలాంటి వేతనజీవికి... పన్ను రేట్లు తగ్గిస్తున్నామంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన చక్కని విందు భోజనంలా కనిపించింది. ఎంత మమకారమో... అనుకున్నాడు. కానీ... తగ్గింపు రేట్లు కావాలనుకునేవారికి పన్ను మినహాయింపులేవీ ఉండవని ఆమె చెప్పేసరికి.. అన్నం లేకుండా ఆవకాయ వడ్డించినట్లయింది. అమ్మో... కారం!!. పన్ను రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక పక్కన ప్రకటిస్తూనే.. మరో పక్క పన్ను మినహాయింపులను భారీగా తొలగించడం ద్వారా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వేతనజీవుల్ని దొంగ దెబ్బ తీశారు. కొన్ని ఆదాయవర్గాలకు సగానికి సగం పన్ను తగ్గినట్లు చూపించినా.. స్టాండర్డ్ డిడక్షన్, ఇంటి అద్దె అలవెన్స్, చాప్టర్ 6 –ఎ కింద లభించే సెక్షన్ 80–సీ వంటి మినహాయింపులు, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ వంటి కీలక మినహాయింపులను తొలగించారు. శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థికమంత్రి ఆదాయ పన్ను శ్లాబుల్లో భారీ మార్పులను ప్రతిపాదించారు. రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను రేట్లు తగ్గిస్తూ ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో ఏడు శ్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో రూ.2.5 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను ఉండదని, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి గతంలో మాదిరే 5 శాతం పన్ను ఉన్నా దానిపై పూర్తిస్థాయి పన్ను రిబేటు లభిస్తుందని సీతారామన్ తెలిపారు. ఈ కొత్త విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి... పాత విధానం ప్రకారం వివిధ సెక్షన్ల కింద లభించే మినహాయింపు ప్రయోజనాలు ఉండవని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. అయితే కొత్త విధానానికి మారాలా? లేక పాత విధానంలోనే కొనసాగాలా? అన్నది పన్ను చెల్లింపుదారుల ఇష్టమంటూ... నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా వారికే వదిలిపెట్టారు. ఆదాయపు పన్ను చట్టాన్ని సరళతరం చేసే విధానంలో భాగంగా ప్రస్తుతం ఉన్న సుమారు 100 మినహాయింపుల్లో 70 తొలగించినట్లు మంత్రి ప్రకటించారు. పన్ను రేట్లు తగ్గింపు వల్ల ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్లు తెలియజేశారు. ‘‘పన్ను మినహాయంపులు వేటినీ లెక్కించకపోతే రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారికి కొత్త పన్ను విధానంలో రూ.78,000 ప్రయోజనం లభిస్తోంది. పాత విధానంలో వారు రూ.2.73 లక్షల పన్ను కట్టాల్సి వస్తే కొత్త విధానంలో రూ.1.95 లక్షలు కడితే సరిపోతుంది’’అని నిర్మల చెప్పారు. కానీ వాస్తవంగా పాత విధానంలో మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే కొత్త విధానంలో అధిక పన్ను చెల్లించాల్సి వస్తుందని ట్యాక్సేషన్ నిపుణులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. తొలగించిన కొన్ని ముఖ్యమైన మినహాయింపులివే... వివాద్ సే విశ్వాస్ ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో ఉన్న లక్షలాది కేసులను పరిష్కరించడానికి ‘వివాద్ సే విశ్వాస్’ పేరుతో ప్రత్యేక ప్రథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆదాయ పన్నుకు సంబంధించి 4.83 లక్షల కేసులు వివాదాల్లో ఉన్నాయని, వీటిని పరిష్కరించుకోవాలనుకునే వారు ఈ పథకం కింద వివాదంలో ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే చాలునని స్పష్టంచేశారు. ‘‘మార్చి 31, 2020లోగా చెల్లించేవారికి పెనాల్టీలు, వడ్డీలు వంటివేమీ ఉండవు. అప్పటి నుంచి జూన్ 30, 2020లోగా చెల్లించే వారు మాత్రం కొంత మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరవాత మాత్రం ఈ పథకం అమల్లో ఉండదు’’అని మంత్రి స్పష్టం చేశారు. గతేడాది బడ్జెట్లో పరోక్ష పన్నుల విధానంలో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి సబ్కా వికాస్ పేరుతో ప్రవేశపెట్టిన పథకం ద్వారా 1.89 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని, వీటి ద్వారా రూ.39,000 కోట్ల బకాయిలను వసూలు చేశామని వివరించారు. ఈ–కామర్స్ లావాదేవీలపై 1% టీడీఎస్ న్యూఢిల్లీ: ఈ–కామర్స్ లావాదేవీలపై కొత్తగా 1 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విధిస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫాంను నిర్వహించే ఈ–కామర్స్ ఆపరేటరు.. విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1 శాతం టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది. అయితే, ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంపై అంతక్రితం ఏడాది సదరు విక్రేత అమ్మకాలు రూ. 5 లక్షలకన్నా తక్కువ ఉండటంతో పాటు పాన్ ఆధార్ నంబరు ధృవీకరణ ఉన్న పక్షంలో ఈ నిబంధన వర్తించదు. దీన్ని అధ్యయనం చేస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించగా .. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ స్పందించలేదు. -
కేంద్రాన్ని నమ్మితే అంతే: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతున్నదని, కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై కేసీఆర్ ప్రగతిభవన్‌లో సీనియర్ అధికారులతో నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. పురోగతికి శరాఘాతం.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని, నిధుల్లో భారీ కోత విధించడంతో రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత అందివ్వాలని కేంద్రాన్ని కోరినా, బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయలేదన్నారు. అన్ని ప్రధాన రంగాలతో పాటు రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించడం రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. జీఎస్టీ అమల్లో కేంద్రానికి చిత్తశుద్ధి లేదు ‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. జీఎస్టీ చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్రం తుంగలో తొక్కింది. చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి రంగాలకు నిధులను తగ్గించారు. ఇది దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది’ అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నిర్వహణా లోపానికి నిదర్శనం కేంద్ర పన్నుల్లో తెలంగాణకు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాలి. గతేడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణకు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ సవరించిన అంచనాల్లో దీన్ని రూ.15,987 కోట్లకు కుదించారు. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంది. కేంద్రం నిధుల్లో కోత విధించడంతో ఇది తారుమారైంది. కేంద్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే కేంద్రానికి వచ్చే పన్నుల నుంచి రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గింది. ప్రతీ సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ అరా శాతం అటూఇటూ అయిన సందర్భాలున్నాయి. కానీ, 2019–20 సంవత్సరంలో ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల నిర్వహణ లోపానికి నిదర్శనం. దీని ప్రభావం తెలంగాణపై దారుణంగా పడింది’ అని కేసీఆర్ అన్నారు. పట్టణాభివృద్ధి నిధుల్లో భారీ కోత బడ్జెట్లో పట్టణాల అభివృద్ధి నిధుల కేటాయింపుల్లోనూ 14.3 శాతం కోత విధించడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి 2019–20 బడ్జెట్లో రూ.1,037 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో గతంకంటే రూ.148 కోట్లు తగ్గించి, రూ.889 కోట్లే కేటాయించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు కేంద్ర సాయం కోరినా నిధులు కేటాయించలేదు’ అని కేసీఆర్ అన్నారు. ‘ఇంకా వ్యవసాయరంగానికి 2019–20లో 3.65% నిధులు కేటాయిస్తే, 2020–21లో 3.39% కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగానికి ఈసారి 2.13 శాతం నిధులు (గతే డాది 2.24%), గ్రామీణాభివృద్ధికి 3.94% నిధులు (గతేడాది 4.37%), విద్యా రంగానికి 3.22% నిధులు (గతేడాది 3.37%) మాత్రమే కేటాయించారు. తెలంగాణకు రెండు రకాలుగా నష్టం 2020–21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలంగాణకు వచ్చే నిధుల్లో 2 రకాలుగా నష్టం వాటిల్లింది. కేంద్రానికి వచ్చే పన్నుల్లో నుంచి రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గించడంతో మొదటి నష్టం జరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించడంతో రెండో రకంగా నష్టం వాటిల్లింది. దీంతో రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్లు తగ్గనున్నాయి. ఇంత భారీ స్థాయిలో రాష్ట్రానికి నిధులు తగ్గించడం కచ్చితంగా వివక్షే. 2019–20 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటు లో ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదించింది. అయితే ఈసారీ అంచనాలు సవరించే నాటికి ఎంత తగ్గిస్తారో తెలియని పరిస్థితి ఉంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. -
కాళేశ్వరంపై చిన్నచూపే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 70 శాతం భూభాగా నికి తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రం మరోమారు పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టుకు లేదా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానికి జాతీయ హోదా లేక కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలన్న వినతిని పెడచెవిన పెట్టింది. శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా కాళేశ్వరం ప్రస్తావన కానరాలేదు. దీనికి జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర ఎంపీలు కోరినా పట్టనట్లే వ్యవహరించింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, వాటిలో అధికభాగం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీక రించిన అప్పుల ద్వారానే పూర్తి చేస్తున్నా మని చెబు తున్నా, కేంద్రం ప్రాజెక్టుపై ఎక్కడా ప్రస్తావన చేయలేదు. జల్‌జీవన్ తెచ్చినా.. మనకు దక్కేది శూన్యమే.. దేశంలోని ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా నల్లా నీటిని అందించే లక్ష్యంతో జల్‌జీవన్ మిషన్‌కు కేంద్రం పెద్దపీట వేసింది. 2024 నాటికి సంపూర్ణ తాగునీటిని అందించే లక్ష్యంతో జల్ జీవన్‌కు ఈ ఏడాది బడ్జెట్లో రూ.11,500 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ అప్పుల తిరిగి చెల్లింపులకు కేంద్రం నిధులివ్వాలని, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇప్పటికే పూర్తయిన పథకానికి జల్ జీవన్ మిషన్‌నుంచి నిధులు కేటాయిస్తారా? అన్నది ప్రశ్నగానే ఉంది. ఇక పీఎంకేఎస్‌వై కింద బడ్జెట్లో కేంద్రం రూ.11,127 కోట్లు కేటాయించింది. అయితే గత బడ్జెట్లో రూ.9,682 కోట్లు కేటాయించినప్పటికీ దాన్ని తిరిగి రూ.7,896 కోట్లకు సర్దుబాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాది ఎంతమేర ఖర్చు ఉంటుందన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఇక పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన నిధులతో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద చేపట్టిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టు లకు మరో రూ.300 కోట్ల మేర రావాలి. క్యాడ్‌వామ్ కింద 18 ప్రాజెక్టులు గుర్తించగా, వాటికి రూ.2వేల కోట్ల మేర ఇవ్వాల్సి ఉంది.వాటికి ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. వీటిని పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన నిధుల నుంచే ఖర్చు చేయాల్సి ఉంది. వీటికి ఈ ఏడాది ఏమైనా ఖర్చు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తంగా కేంద్ర జల శక్తి శాఖకు కేటాయించిన రూ.30,478కోట్ల బడ్జెట్లో తెలంగాణకు దక్కే నిధుల వాటా అంతంతమాత్రమేనని సాగునీటి శాఖ ఇంజనీర్లు, నిపుణులు అంటున్నారు. -
అంతా భ్రాంతియేనా..!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ మళ్లీ రాష్ట్రానికి నిరాశే మిగిల్చింది. మాంద్యం నేపథ్యంలో కేంద్రం నుంచి ఉదారంగా సాయం అందుతుందని, కేంద్ర ప్రశంసలు అందుకున్న పథకాలకు నిధులు ఇస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వ ఆశలు అడియాశలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, పసుపు బోర్డు ఏర్పాటు లాంటి అంశాల ఊసే లేదు. తెలుగింటి కోడలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో లెక్కల పద్దులో ఏపీ పునర్వ్యవస్థీకరణ గురించి పట్టించుకోలేదు. రాష్ట్రం అడిగిన పథకాలకు కనీస నిధులు కూడా కేటాయించలేదు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగు, తాగు నీటి పథకాలకు నిధులు కేటాయించకపోవడంతోపాటు పన్ను వాటాలోనూ కోత పెట్టడంతో ఈసారి రాష్ట్ర బడ్జెట్ అంచనాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగులకు పీఆర్సీ అమలు, నిరుద్యోగ భృతి లాంటి వాటి అమలుకు ఆర్థిక వెసులుబాటు కష్టమేనని లెక్కలు వేస్తున్నాయి. మాంద్యం కారణంగా రాష్ట్ర ఆదాయంలో కొంత తగ్గుదల కనిపిస్తోందని, దీంతో భారీ వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర మంత్రులను కలవడంతోపాటు కేంద్రానికి లేఖలు రాశారు. మంత్రి హరీశ్‌రావు 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌తో భేటీలో కాళేశ్వరం, మిషన్ భగీరథల నిర్వహణ కోసం రూ.52 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. ఏదో అలా అలా.. పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకాయిలు, ఐజీఎస్టీ చెల్లింపులు, పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.35 వేల కోట్ల వరకు అదనపు నిధులు కేటాయిస్తారని ప్రభుత్వం ఆశించింది. కానీ తెలంగాణకు రూ.16 వేల కోట్ల పన్నుల వాటానే కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించడం గమనార్హం. దీంతో ప్రస్తుత సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు వచ్చే ఏడాది నిధుల కటకట తప్పదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక, కొత్త పథకాల అమలుకు అవకాశాల్లేవని తేల్చేస్తున్నారు. ఇక 2020–21 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లెక్కలు కూడా ఆచితూచి ఉంటాయని పేర్కొంటున్నారు. అందులోనూ కోతే.. పన్నుల వాటాలోనూ కేంద్రం రాష్ట్రానికి కోత పెట్టింది. మొత్తం పన్ను వాటాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.437 శాతం ఇవ్వగా, దాన్ని 2.133 శాతానికి కుదించింది. 2019–20లో రూ.17 వేల కోట్లకు పైగా పన్నుల వాటా అంచనాలను పెట్టిన కేంద్రం ఇప్పుడు మరో రూ.వెయ్యి కోట్లు తగ్గించి రూ.16 వేల కోట్ల పైచిలుకు చూపెట్టింది. అందులో ఎంత ఇస్తుందన్న దానిపైనా అనుమానాలున్నాయని ఆర్థిక వర్గాలు అంటు న్నాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ లాంటి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బడ్జెట్లో ప్రస్తావించనేలేదు. అయితే, బెంగళూరులో మెట్రో తరహాలో సబర్బన్ రైల్వే వ్యవస్థకు రూ.18,600 కోట్లను ప్రతిపాదించిన కేంద్రం తెలంగాణలోని గ్రామాల రూపురేఖలను మార్చే రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) లాంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రతిపాదనలపై 4 గంటల పాటు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం.. కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచారు. -
మోదీ.. అర్జునుడేనా..?
దారుణంగా పడిపోయిన వృద్ధిరేటు.. నన్నెలా ఛేదిస్తారో చూస్తానంటూ సైంధవుడిలా సవాలు విసురుతోంది!!. ఎన్ని చర్యలు తీసుకున్నా దారికి రాని మందగమనం.. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ లాంటి కురువీరులను గుర్తుకుతెస్తోంది. ఎంత ప్రయత్నించినా కట్టడికాని ద్రవ్యలోటు... ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడి వంటి చక్రవ్యూహ సూత్రధారుల్ని స్ఫురణకు తెస్తోంది. వెరసి.. అభేద్యమైన పద్మవ్యూహం లాంటి బంధంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇరుక్కు పోయింది. 5 శాతానికి పతనమైన వృద్ధిరేటు.. 7శాతానికి ఎగసిన ద్రవ్యోల్బణం.. మందగించిన అమ్మకాలు.. ఊడిపోతున్న ఉద్యోగాలు.. ఎత్తిపోతున్న బ్యాంకులు.. 10 లక్షల కోట్ల మేర పేరుకున్న బకాయిలు.. దివాలా తీస్తున్న కార్పొరేట్లు.. విస్తరిస్తున్న కరోనా వైరస్... వీటిలో ఏవీ చిన్న సమస్యలు కావు. పద్మవ్యూహానికి కాపుకాసిన రథ, గజ, తురగ, పదాతి దళాల్లాంటివే. బడ్జెట్ సాక్షిగా ఈ వ్యూహాన్ని ఛేదించ బోయారు మోదీ. కానీ!! వినియోగం పెంచాలంటే పన్నులు తగ్గాలి. అలా చేస్తే రాబడి తగ్గి లోటు పెరుగు తుంది. లోటు పెరిగితే రేటింగ్ తగ్గి అప్పులు పుట్టవు. ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థికవ్యవస్థ అతలాకుతలం. మరెలా? అందుకే ఎల్ఐసీపై ఎనలేని నమ్మకం పెట్టుకున్నారు మోదీ. దాన్లో వాటా విక్రయించి.. లోటు పెరగకుండా ఖజానా నింపి.. ఈ బంధం నుంచి భారత్‌ను బయటకు తేవాలనుకుంటున్నారు. గతేడాది కూడా ఇలాంటి లక్ష్యాలు పెట్టుకున్నా.. సాధించలేకపోయారు. ఈ సారి అనుకున్నవి అర్జునుడిలా ఛేదిస్తే.. ఎకానమీ గాడిన పడుతుంది. అభిమన్యుడిలా విఫలమైతే మాత్రం.. మరిన్ని విపరిణామాలు చూడాల్సిందే!!. బడ్జెట్ హైలైట్స్.. ►ఆదాయపు పన్ను రేట్లు, శ్లాబుల్లో భారీ మార్పులు. బ్యాంకులు దివాలాతీస్తే డిపాజిట్లపై బీమా కవరేజీ ఇప్పుడున్న రూ.1 లక్ష – రూ.5 లక్షల వరకూ పెంపు. ►ఆధార్ ప్రాతిపదికన పాన్ నంబరు కేటాయింపు. ►పబ్లిక్ ఇష్యూతో ఎల్ఐసీలో వాటా విక్రయానికి ఓకే. ►డిజిన్వెస్ట్‌మెంట్(ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా అమ్మకం) ద్వారా 2020–21లో నిధుల సమీకరణ లక్ష్యం రూ.1.2 లక్షల కోట్లు. 2019–20లో ఈ లక్ష్యం రూ.65,000 కోట్లు మాత్రమే. ►రక్షణ రంగానికి కేటాయింపులు గతేడాది రూ.3.16 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు పెంపు. ►వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.2.83 లక్షల కోట్ల నిధుల కేటాయింపు. నాబార్డ్ ద్వారా రీఫైనాన్స్ స్కీమ్‌ను మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయం. ►మహిళలకు సరైన పెళ్లి వయస్సును సూచించేందుకు వీలుగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదన. ►షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రూ.85,000 కోట్ల కేటాయింపు. షెడ్యూల్డ్ తెగలకు కేటాయింపు రూ.53,700 కోట్లు. ►ప్రస్తుత ద్రవ్యలోటును గత అంచనా 3.3%–3.8 శాతానికి సవరణ. వచ్చే ఏడాదికి 3.5 శాతానికి పెంపు. ►ఆరోగ్య రంగానికి రూ.69,000 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.12,300 కోట్ల చొప్పున నిధుల కేటాయింపు. ►త్వరలో కొత్తగా జాతీయ విద్యా విధానానికి రూపకల్పన. -
బడ్జెట్లో కూతపెట్టని రైల్వే!
సాక్షి, హైదరాబాద్: రైల్వే బడ్జెట్ అనగానే యావత్తు దేశం ఎదురుచూసేది.. ఏ ప్రాంతానికి ఏ రైలు వస్తుంది, కొత్త రైల్వే లైన్లు ఏ ప్రాంతానికి మంజూరవుతాయి అని ప్రజలు టీవీలకు అతుక్కుపోయేవారు. కానీ, శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రైల్వే ప్రస్తావనకు కేటాయించిన సమయం రెండుమూడు నిమిషాలు మాత్రమే.అందులోనే కొన్ని విషయాలు ప్రస్తావించారే తప్ప కొత్త రైళ్లు, లైన్లు, సర్వేలు వంటి వాటి ఊసే లేదు. రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టకుండా సాధారణ బడ్జెట్లో కలిపేసిన తర్వాత, రైల్వేకు చెందిన వివరాలను సంక్షిప్తంగా వెల్లడిస్తున్నారు. కానీ తాజా బడ్జెట్ ప్రసంగంలో నామమాత్రపు ప్రస్తావనతోనే సరిపుచ్చటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థూలంగా నాలుగైదు విషయాలతో సరిపుచ్చినప్పటికీ, జోన్ల వారీగా వివరాలను ఆ తర్వాత కూడా వెల్లడించలేదు. పింక్‌బుక్ పేరుతో ఉండే పూర్తి వివరాల పుస్తకాన్ని మరుసటి రోజో, ఆ తర్వాతనో విడుదల చేసేవారు. ఈసారి ఆ పింక్ బుక్‌ను ఐదో తేదీన విడుదల చేస్తారని చెబుతున్నారు. అంటే అప్పటి వరకు జోన్ల వారీగా కేటాయింపుల విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉండదు. రైల్‌నిలయానికి సమాచారం లేదు దక్షిణ మధ్య రైల్వేకు చేసిన కేటాయింపులకు సంబంధించి రైల్ నిలయంకు ఎలాంటి సమాచారం అందలేదు. ‘బడ్జెట్లో రైల్వేలకు సం బంధించి కనీస వివరాలు కూడా వెల్లడించకపోవటాన్ని తొలిసారి చూస్తున్నాం. కొన్ని ప్రధాన ప్రాజెక్టులు, చేపట్టబోయే కొత్త సంస్కరణలు, కొత్త రైళ్లు లాంటి వివరాలైనా వెల్లడించాల్సింది. ఇక జోన్ల వారీగా కేటాయింపు లు ఎప్పుడిస్తారో కూడా సమాచారం లేదు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి అడిగినా చెప్పలేదు. ఐదో తేదీన పార్లమెంటు లో పింక్‌బుక్‌ను విడుదల చేసిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది’అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ.6,100 కోట్ల మేర నిధులు కేటాయించారని, ప్రస్తుతం పనులు జరుగుతున్న మనోహరాబాద్–కొత్తపల్లి, మహబూబ్‌నగర్ డబ్లింగ్, కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ మూడో లైన్ పనులు, మెదక్–అక్కన్నపేట, భద్రాచలం–సత్తుపల్లి ప్రాజెక్టులకు రూ.1,200 కోట్ల మేర కేటాయింపులున్నాయని సమాచారం. ఓ హైస్పీడ్ కారిడార్, రెండు రైళ్ల ప్రస్తావన ఉందని చెబుతున్నారు. -
రాష్ట్రానికి నిరాశ మిగిల్చింది
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020–బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించిందని, అన్యాయం జరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టాక ఆయన శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లా డారు. ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోందన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల ఉత్పత్తి 10%అంటే ప్రశ్నార్థకం రాబడి అంతా స్థూల ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటుంది.. స్థూల ఉత్పత్తి 10 % అంటున్నారంటే అది ప్రశ్నార్థకంగా ఉందని తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆదా యం వస్తుందనడం అనుమానాస్పదమేనన్నారు. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం వాటా ఇవ్వాల్సిందేనని, ఏడెనిమిది రాష్ట్రాలకు తప్పితే మిగిలిన రాష్ట్రాలన్నింటికీ రీయింబర్స్ చేయాలన్నారు. 2018–19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటాను రూ.2,500 కోట్లకు తగ్గించారని, ఇది రాష్ట్రానికి పెద్ద దెబ్బని బుగ్గని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బు ఆదా చేస్తే యనమలకు బాధ ఎందుకు? కేంద్ర బడ్జెట్‌పై యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తమది అవినీతి, అసమర్థ పాలన అంటున్నారని, 7 నెలల్లోనే తమది అసమర్థ పాలనా? అని బుగ్గన ప్రశ్నించారు. ఐదేళ్లలో టీడీపీ చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై రివర్స్ టెండరింగ్ చేసి రూ.1,900 కోట్లు మిగల్చడం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పా? అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్లే వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం పడిందని.. ఆయన చేసిన పనికి ఇప్పుడు సింగపూర్‌లో అల్లకల్లోలం జరుగుతోందని, అక్కడ ఓ ఆర్థిక మంత్రి పదవి కూడా ఊడబోతోందన్నారు. -
మోదీ సర్కారు ‘వృద్ధి’ మంత్రం!
న్యూఢిల్లీ: భయపెడుతున్న ద్రవ్యలోటు ఒకవైపు... అంతకంతకూ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ మరో వైపు... ఇలాంటి సంకట పరిస్థితుల్లో కీలకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మోదీ సర్కారు వృద్ధిరేటుకే తన ఓటు వేసింది. ఆదాయపు పన్ను(ఐటీ) రేట్లలో కోత ద్వారా వేతనజీవులకు ఊరటతో పాటు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) భారం నుంచి కంపెనీలకు పూర్తిగా ఉపశమనం కల్పించి అటు కార్పొరేట్లను మెప్పించే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దశాబ్దకాలంలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన మందగమనాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వ వ్యయాన్ని కూడా భారీగానే పెంచుతూ ఎడాపెడా కేటా యింపులు చేశారు. ముఖ్యంగా వ్యవసా యం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యా లను కూడా పెంచేశారు. లోటును పూడ్చుకోవడానికి ‘ఎల్ఐసీ’ని తురుపు ముక్కగా ఆమె ప్రయోగించారు. మొత్తం మీద 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను శనివారం సీతా రామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో భారీస్థాయిలో మెరుపులేవీలేనప్పటికీ... అత్యంత తీవ్రం గా నిరాశపరిచే అంశాలు కూడా లేవనేది విశ్లేషకుల మాట!! వేతనజీవులకు ఊరట... మధ్య, ఎగువ మధ్య తరగతి వేతనజీవులకు ఊర టనిచ్చేందుకు ఐటీ రేట్లు, శ్లాబుల్లో కీలక మార్పు లకు మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. రూ.10 లక్షల పైబడి వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి గత పన్ను చెల్లింపుదారులకు దీనివల్ల సుమారుగా ఒక ఏడాదిలో రూ.1,820 నుంచి రూ.20,300 ఆదా అవుతుందని అంచనా. అయితే, ఇప్పుడున్న రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌తో పాటు బీమా ప్రీ మియం, భవిష్య నిధి, పిల్లల స్కూలు ఫీజులు, ఇతరత్రా అనేక మినహాయింపులన్నింటినీ వదు లుకుంటేనే ఈ కొత్త రేట్ల ప్రకారం పన్ను ప్రయో జనం లభిస్తుంది. కొత్త విధానం వద్దనుకునేవారికి పాత శ్లాబులు, రేట్లను కొనసాగించుకునే వెసులు బాటును కూడా బడ్జెట్లో సీతారామన్ కల్పించడం విశేషం. అయితే, పన్ను విధానాన్ని సరళీకరిస్తున్నా మంటూనే.. మరింత గందరగోళంగా మార్చారం టూ పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్రవ్యలోటు లక్ష్యానికి తిలోదకాలు... వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా పలు రంగాలకు భారీగా కేటాయింపులు జరపాల్సిన తరుణంలో ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) లక్ష్యాలకు కేంద్రం పూర్తిగా నీళ్లొదిలేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.3 శాతంగా నిర్దేశించిన ప్రభుత్వం... ఇప్పుడు దీన్ని 3.8 శాతానికి సడలించింది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020–21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూ డా గతంలో 3 శాతంగా అంచనావేయగా... దీన్ని ఇప్పుడు 3.5 శాతానికి పెంచేసింది. దీనివల్ల మార్కెట్ నుంచి 2020–21లో ఏకంగా రూ.5.36 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 –20) రుణ సమీకరణను కూడా రూ.4.99 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. మార్కెట్లు ‘బేర్’... ద్రవ్యలోటు లక్ష్యాలను పూర్తిగా గాలికొదిలే యడం.. ఇన్వెస్టర్లను మెప్పించే చర్యలను(దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను–ఎల్టీసీజీ తొలగిం చాలన్నది మార్కెట్ వర్గాల ప్రధాన డిమాండ్) విస్మరించడం... వృద్ధికి ఊతమిచ్చేలా నిర్దుష్ట చర్యలేవీ ప్రకటించకపోవడం వంటి కారణా లతో స్టాక్ మార్కెట్లు బడ్జెట్ పట్ల తీవ్రం గా స్పందించాయి. సెన్సెక్స్ ఏకంగా 988 పాయింట్లు కుప్ప కూలింది. దాదా పు దశాబ్దకాలంలో ఒక్క రోజులో ఇం త భారీ నష్టాన్ని చవిచూడటం గమనార్హం. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 300 పాయింట్లు క్షీణించింది. బ్యాంకు డిపాజిట్లపై ఇకపై రూ.5 లక్షల బీమా రక్షణ! బ్యాంకులేవైనా దివాలాతీస్తే ఇప్పటి వరకూ డిపాజిట్‌దారులకు రూ.లక్ష వరకూ మాత్రమే బీమా రక్షణ ఉంది. దీన్ని ఇప్పుడు ఏకంగా ఐదు రెట్లకు.. అంటే రూ.5 లక్షలకు పెంచుతూ బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతేడాది మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు స్కామ్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డిపాజిటర్లు గగ్గోలు పెట్టడం తెలిసిందే. ఈ పరిణామం నేపథ్యంలోనే డిపాజిట్లపై బీమా రక్షణను భారీగా పెంచుతున్నట్లు మోదీ సర్కారు ప్రకటించడం గమనార్హం. ఆదాయాలు, కొనుగోలు శక్తి పెంపే లక్ష్యం వరుసగా రెండో ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్... దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగానే ఉన్నాయని ఉద్ఘాటించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తిని పెంచడమే లక్ష్యంగా 2020–21 బడ్జెట్లో కీలక చర్యలను ప్రకటిం చామని ఆమె స్పష్టం చేశారు. దేశీయంగా తయారీని ప్రోత్స హించేందుకు వీలుగా వంట సామగ్రి నుంచి ఎలక్ట్రికల్ పరికరాలు, ఫర్నిచర్, స్టేషనరీ, ఆటబొమ్మలు ఇలా అనేక ఉత్పత్తుల దిగుమతులపై సుంకాన్ని పెంచారు. మరోపక్క, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంతో వ్యవసాయం... గ్రామీణాభివృద్ధికి ఏకంగా రూ.2.83 లక్షల కోట్ల ను కేటాయించారు. రైతు రుణాల లక్ష్యాన్ని 2020–21లో రూ.15 లక్షల కోట్లకు పెంచారు. రూ.1.7 లక్షల కోట్లను రవాణా మౌలిక సదుపా యాల కల్పనకు వెచ్చిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. కీలకమైన ఇంధన రంగానికి కూడా రూ.40,750 కోట్లు కుమ్మరించడం విశేషం. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో కొన్ని స్కీములకు కేటాయింపుల పెంపు ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని 2020–21లో 13 శాతం మేర పెంచేలా సీతారామన్ చర్యలు చేపట్టారు. అయితే, ప్రస్తుతం ఉన్న తీవ్ర మందగమనానికి ఐటీ ఊరట, వ్యయాల పెంపు వంటి ఈ అరకొర చర్యలు సరిపోవని.. భారీ ఉద్దీపనలు అత్యవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్లకు రూ.25,000 కోట్ల తాయిలం గతేడాది సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్నును 30 శాతం స్థాయి నుంచి ఏకంగా 22 శాతానికి తగ్గి స్తూ.. కీలక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసు కుంది. కొత్తగా ప్లాంట్లు నెలకొల్పే కంపెనీలకైతే 15 శాతం పన్నునే వర్తింపజేస్తామని కూడా ప్రకటిం చారు. ఇప్పుడు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) భారం నుంచి కూడా కార్పొరేట్లకు ఉపశ మనం కలిగించి.. మందగమనంలో ఉన్న పరిశ్ర మలకు ఊరటనిచ్చే చర్యలను కేంద్రం తీసుకుంది. డీడీటీని ఇకపై నిర్దేశిత శ్లాబులను అనుసరించి డివిడెండ్ పొందినవారే చెల్లించాల్సి ఉంటుంది. ఈ తాజా ప్రతిపాదనతో ప్రభుత్వ ఖజానాకు రూ.25,000 కోట్లు చిల్లుపడుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. మరోపక్క, ప్రభుత్వ రంగ బ్యాం కులకు ‘ఇంద్రధనుష్’ పథకంలో భాగంగా ఇప్పటికే దండిగా మూలధనం అందిం చడం.. పలు బ్యాంకులను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న నేప థ్యంలో బడ్జెట్లో ప్రత్యేకంగా వీటికి సంబంధించి ఎలాంటి ప్రకటనలూ చేయలేదు. స్టార్టప్‌లకు దన్ను... స్టార్టప్‌లకు ఊతమిచ్చే లా సీతారామన్ కీలక చర్యలు తీసుకున్నా రు. ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఎసాప్స్)పై అయిదేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. ‘ఎసాప్స్‌కి సంబం ధించి ఉద్యోగులపై తక్షణ పన్ను భారం పడకుం డా అయిదేళ్ల పాటు లేదా వారు సంస్థ నుంచి తప్పుకునే దాకా లేదా విక్రయించే దాకా (ఏది ముందైతే అది) ట్యాక్స్ హాలిడే వర్తిస్తుంది‘ అని మంత్రి పేర్కొన్నారు. శైశవ దశలో ఉన్న స్టార్టప్ సంస్థలు నిపుణులైన సిబ్బందిని ఆకర్షించేందుకు, సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోకుండా అట్టే పెట్టు కునేందుకు ఈ ఎసాప్స్ ఉపయోగపడతాయి. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. భారత్ ఇప్పుడు ప్రపంచంలో అయిదో ఆర్థిక వ్యవస్థగా(దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్లు) ఎదిగిందని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ పేర్కొన్నారు. 2014 మార్చి నాటికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 52.2 శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రుణాలు... 2019 మార్చినాటికి 48.7 శాతానికి దిగొచ్చాయని చెప్పారు. అంతేకాదు... 2014–19 మధ్యలో సగటు జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైందని... ద్రవ్యోల్బణాన్ని సగటున 4.5 శాతానికి కట్టడి చేశామని కూడా ఆర్థిక మంత్రి వివరించారు. కాగా, 2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలసిందే. ఆర్థిక క్రమశిక్షణకు సవాళ్లు: మూడీస్ భారత్‌లో జీడీపీ వృద్ధి మందగమనం ప్రభు త్వం చెబుతున్నదానికంటే చాలా ఎక్కువ కాలమే కొనసాగే అవకాశం ఉందని... దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటు కట్టడి)కు తీవ్ర మైన సవాళ్లు పొంచిఉన్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ప్రస్తుతం భారత్ సార్వభౌమ (సావ రీన్) రేటింగ్‌పై తమ ప్రతికూల దృక్పథాన్ని (నెగటివ్ అవుట్‌లుక్) ఈ రిస్కులు ప్రతిబిం బిస్తున్నాయని కూడా అభిప్రాయపడింది. ప్రస్తు తం భారత్‌కు మూడీస్ ‘బీఏఏ2 (ప్రతికూల అవుట్‌లుక్)ను కొనసాగిస్తోంది. ఈ స్థాయి రేటింగ్ ఉన్న దేశాలతో పోలిస్తే.. భారత్ రుణ భారం చాలా ఎక్కువగా ఉందని కూడా మూడీ స్ స్పష్టం చేసింది. ‘బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాలను 3.8 శాతం(2019–20 ఏడాదికి), 3.5 శాతాలకు(2020–21 సంవత్సరానికి) సడ లించడం, బలహీన వృద్ధి, పన్నుల కోతలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం స్థూల ఆదాయ లక్ష్యాలను సాధించడం కష్ట సాధ్యమే’ అని రేటింగ్ దిగ్గజం కుండబద్దలు కొట్టింది. బంగారుబాతు.. ఎల్ఐసీ! ద్రవ్యలోటును పూడ్చుకోవ డానికి మోదీ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో ప్రతిపాదనల్లోనే ఉన్న ‘ఎల్ఐసీ’ వాటా విక్రయం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)లో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది. దీనిలో కొంత వాటాను పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా విక్రయించడం ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్) ప్రక్రియలో ఎల్ఐసీ నుంచే (షేర్లను కొనిపించడం ద్వారా) ప్రభుత్వం నిధులను లాగేస్తూ వస్తోంది. ఇప్పుడు నేరుగా ఎల్ఐసీలోనే వాటాను అమ్మడం అంటే... ‘బంగారు బాతు’ సామెతను తలపిస్తోందని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మార్కెట్‌కు నచ్చలే..!
కొండంత రాగం తీసి, ఏదో... చెత్త పాట పాడాడు అని ఒక సామెత ఉంది. ఈ సామెత శనివారం జరిగిన ప్రత్యేక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు పూర్తిగా వర్తిస్తుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వడానికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటుందని అంచనాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూ పోయాయి. ఆదాయపు పన్ను, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) విషయాల్లో ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండగలవని, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)లను రద్దు చేస్తారని....ఇలా ఎన్నో ఆశలు రాజ్యమేలాయి. కరోనా వైరస్ కల్లోలంతో ప్రపంచ మార్కెట్లు కుదేలైనా, మన మార్కెట్ మాత్రం బడ్జెట్‌పై ఆశలతో పెద్దగా పడలేదు. తీరా చూస్తే, ఈ ఆశలన్నింటినీ ఆర్థిక మంత్రి సీతమ్మ వమ్ము చేశారు. బడ్జెట్ అంచనాలను తప్పడంతో మార్కెట్ నష్టపోయింది. సెన్సెక్స్ 40,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్లు దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 1,275 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 988 పాయింట్ల నష్టంతో 39,736 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 11,662 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్ 2.43 శాతం, నిఫ్టీ 2.51 శాతం మేర నష్టపోయాయి. రూ. 3.46 లక్షల కోట్ల సంపద ఆవిరి మార్కెట్ భారీ పతనం కారణంగా రూ.3.46 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3,46,257 కోట్లు హరించుకుపోయి రూ.1,53,04,725 కోట్లకు పడిపోయింది. జీడీపీ వృద్ధి పడిపోయి, వినియోగ డిమాండ్ కొరవడి గత ఏడాదికాలంగా ప్రపంచ ఈక్విటీ ర్యాలీలో బాగా వెనుకబడిన మన మార్కెట్‌ను ఆర్థిక మంత్రి సీతారామన్...బడ్జెట్‌తో పరుగులు పెట్టిస్తారంటూ ఇన్వెస్టర్లు పెట్టుకున్న భారీ అంచనాలు పటాపంచలయ్యాయి. ఫలితమే సెన్సెక్స్ 988 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల క్రాష్. నాలుగు నెలల క్రితం ఆశ్చర్యకరంగా కార్పొరేట్ పన్నును తగ్గించిన ఆర్థిక మంత్రి సీతారామన్...అదే బహుమతిని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కూడా ఇవ్వడం ఖాయమేనన్న మార్కెట్ అంచనాలు పూర్తిగా వాస్తవరూపం దాల్చలేదు. శ్లాబుల్ని విభ జించి, రూ.5 లక్షలకుపైబడి పన్ను ఆదాయం కలిగిన వారికి రేట్లు కొంత తగ్గించినప్పటికీ, మరోవైపు వివిధ సెక్షన్ల కింద లభిస్తున్న మినహాయింపుల్ని ఎత్తివేయడంతో మధ్య ఆదాయ వర్గాలకు ఒరిగేదేమీ లేకపోవడం మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది. ఆయా మినహాయింపుల ద్వారా భారీ వ్యాపారాన్ని పొందుతున్న ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు నిలువునా పతనంకావడం, వాటి మాతృ సంస్థలైన పెద్ద ఫైనాన్షియల్ సంస్థల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడం ఇందుకు నిదర్శనం. డీడీటీపై డబుల్‌గేమ్... అలాగే మరోవైపు డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ) పూర్తిగా ఎత్తివేస్తారన్న గట్టి అంచనాలు మార్కెట్లో వున్నాయి. ఈ పన్నును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినా, వాస్తవానికి పన్ను చెల్లింపు బాధ్యతను కంపెనీల నుంచి ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి మళ్లించారు. ఇప్పటివరకూ 20 శాతం డీడీటీని కంపెనీలు చెల్లిస్తుండగా, ఇకనుంచి ఇన్వెస్టర్లు వారి వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్ని అనుసరించి, డివిడెండ్ల రూపేణా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి. అధిక ట్యాక్స్ శ్లాబ్ రేట్లలో వుండే సంపన్నులు, ఆయా కంపెనీల ప్రమోటర్లు 43 శాతం పన్నును ఈ డివిడెండ్ ఆదాయంపై చెల్లించాల్సివుంటుంది. అలాంటప్పుడు ప్రమోటర్లు... ఆయా కంపెనీలు భారీ డివిడెండ్లు చెల్లించేందుకు ఎందుకు అంగీకరిస్తారు? బైబ్యాకో, మరో పద్ధతో అనుసరిస్తారు. ఈ కారణంగా ఆర్థిక మంత్రి ప్రకటించిన డీడీటీ ఎత్తివేత ప్రతిపాదన కూడా మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఇక అంచనాలకు అనుగుణంగా లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)పై పన్ను ఎత్తివేతా జరగలేదు. కేటాయింపుల సంగతేంటి? వ్యవసాయ, మౌలిక రంగాలకు భారీ కేటాయింపులు జరపడం దీర్ఘకాలికంగా మేలు చేకూర్చేదే అయినా, ముఖ్యంగా మౌలిక రంగానికి ప్రతిపాదించిన రూ. లక్ష కోట్ల కేటాయింపులకు సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళికలు ఏవీ వెల్లడికాలేదు. ద్రవ్యలోటు ఆందోళనలు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గత బడ్జెట్లో నిర్దేశించుకున్న 3.3% ద్రవ్యలోటు మించిపోయిందని, అది 3.8 శాతానికి చేరుతుందని స్వయానా ఆర్థిక మంత్రే తన తాజా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3.5% ద్రవ్యలోటును ప్రతిపాదించారు. బ్యాంకులు బెంబేలు... ప్రభుత్వ రంగ బ్యాంకులకు గత కొన్నాళ్లుగా లక్షల కోట్ల మూలధనాన్ని సమకూరుస్తూ, వాటిని ఆదుకుంటున్న కేంద్రం ఈ బడ్జెట్లో తాజా మూలధన కల్పన ప్రకటించకపోగా, క్యాపిటల్ మార్కెట్ నుంచి అవి నిధుల్ని సమీకరించుకోవాలంటూ ఘంటాపథంగా చెప్పడం మార్కెట్‌కు మరో పెద్ద షాక్. -
అంచనాలు అందుకోగలమా?
తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకోదగ్గ భారీ చర్యలేమీ ప్రకటించలేదు. అందుకు బదులు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులను కొత్త విధానంతో బుజ్జగించే పనికి పూనుకున్నారు. అయితే ఈ విధానం ఆచరణలో ఎలావుం టుందో, దీనివల్ల కలిగే మేలేమిటో ఇంకా చూడాల్సేవుంది. మరోపక్క భారీయెత్తున పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని ద్రవ్య లోటును అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు మందగించిన పర్యవసానంగా ఏర్పడ్డ లోటును సహేతుకమైన 3.8 శాతానికి కట్టడి చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. నిరుటి బడ్జె ట్లో పెట్టుకున్న లక్ష్యంకన్నా ఇది 0.5 శాతం మాత్రమే ఎక్కువ. కానీ ఇది ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించు కోవడం వల్ల (పీఎం కిసాన్ యోజన, మరికొన్ని ఇతర కార్యక్రమాల్లో నిధులు ఖర్చు చేయకపోవడంద్వారా), రిజర్వ్ బ్యాంకు తన దగ్గరున్న ‘మిగులు నిధులు’ బదిలీ చేయడం, జాతీయ పొదుపు నిధులనుంచి రూ. 2.4 లక్షల కోట్లు రుణం తీసుకోవడం వల్ల మాత్రమే సాధ్యమైంది. దీంతో మొత్తంగా గత సంవత్సరం స్థూల రుణాలు రూ. 7.4 లక్షల కోట్లకు పరిమితం చేయడం సాధ్యమైంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 10 శాతం వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. కానీ పన్ను వసూళ్ల ఆదాయం ప్రాతిపదికగా ఈ అంచనా వేయడం కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఉదాహరణకు రాగల సంవత్సరంలో స్థూలంగా పన్ను ఆదాయం రూ. 24.23 లక్షల కోట్లు ఉండొచ్చని కేంద్రం ఆశలు పెట్టుకుంది. గడిచిన సంవత్సరం ఆదాయంతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. చూడటానికిది సహేతుకంగానే కనిపిస్తుంది. నిరుడు పెట్టుకున్న లక్ష్యం 18 శాతాన్ని చేరడం కష్ట మైన నేపథ్యంలో, వచ్చే ఏడాది 12 శాతం పెంపుదల లక్ష్యాన్ని అందుకోవడం కూడా కష్టమే. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సరిచేయడానికి ఈ బడ్జెట్లో తీసుకున్న అతి పెద్ద చర్య పన్నులు తగ్గే అవకాశంవున్న నూతన ఆదాయం పన్ను వ్యవస్థను ప్రకటించడమే. ఈ కొత్త విధానం వల్ల రూ. 40,000 కోట్ల మేర ఆదాయం కోల్పోవచ్చునని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. ఈ మిగులును వినియోగదారులు ఖర్చు చేస్తే డిమాండ్ పునరుద్ధరణ సాధ్యమవుతుందన్న విశ్వాసం ప్రభు త్వానికి ఉన్నట్టుంది. కానీ అలాగే జరగొచ్చునని చెప్పడం తొందర పాటవుతుంది. వివిధ మంత్రిత్వ శాఖలకు చేసిన కేటాయింపులు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. వ్యవ సాయం, గ్రామీణాభివృద్ధి కూడా కలిసి వున్న గ్రామీణ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు కేటాయించారు. ఇది ముగు స్తున్న సంవత్సరం కన్నా 5.5 శాతం అధికం. అలాగే విద్యా శాఖ కేటాయిం పులు కూడా ఇతోధికంగా పెరిగాయి. కానీ ఇచ్చిన సొమ్మును ఖర్చు చేయక పోవడంలో ఆ శాఖ ఆరితేరింది. ఈసారి ద్రవ్య లోటు లక్ష్యం 3.5 శాతం సందేహాస్పదమైనదే. కొత్త ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం అత్యాశలా కన బడుతోంది. ప్రధానమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాను అమ్మడం ద్వారా రూ. 2.1 లక్షల కోట్లు రాబట్టవచ్చునని సర్కారు ఆశిస్తోంది. ఇందులో రూ. 90,000 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభిస్తాయని అంచనా. అయితే ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం రాజకీయంగా సవాళ్లను ఎదుర్కొనక తప్పదు. పన్నేతర వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం 2.16 లక్షల కోట్లకు పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. నిజానికి నిరుడు టెలికాం సంస్థల నుంచి రూ. 59,000 కోట్లు ఆదాయం రాగా, ఈసారి అది రూ. 1,33,000 కోట్లు ఉండొచ్చ న్నది అంచనా. ఇంత భారీ మొత్తం అదనంగా వస్తుందని ప్రభు త్వం భావించడానికి కారణం ఉంది. సవరించిన స్థూల రెవెన్యూ బకాయిలు చెల్లించాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల వచ్చిపడే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ అంచనాకొచ్చినట్టు కనబడుతోంది. కానీ అలా చెల్లించాల్సివస్తే అది తమకు చావు బాజా మోగించినట్టేనని టెలికాం సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. గత సెప్టెంబర్‌లో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడం పేరిట ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేటును భారీగా తగ్గించింది. దీంతో కార్పొరేట్ సంస్థలకు కలిసొచ్చిన మొత్తం రూ. 1,50,000 కోట్లు. కానీ వృద్ధి రేటుకు తోడ్పడిందేమీ లేదు. బడ్జెట్ ముగింపులో ఆమె వినియోగ, పారిశ్రామిక వస్తువు లపై పన్నుల మోత మోగించారు (మొత్తం 22 వస్తువులపై 2.5 నుంచి 70 శాతం వరకూ ఈ పెంపుదలలున్నాయి). వీటన్నిటి ద్వారా ఎక్సైజ్ సుంకాల రూపంలో ప్రభుత్వానికి రూ. 20,000 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇది తప్పుడు సంకేతం పంపు తుందా? అదే జరిగే అవకాశంవుంది. అయితే ప్రభుత్వం లెక్క చేస్తుందా లేదా అన్నది చూడాలి. మొత్తానికి అటు ప్రైవేటు మదు పునుగానీ, ఇటు వినిమయాన్నిగానీ భారీగా పెంచే నిర్దిష్టమైన చర్యలు ఈ బడ్జెట్లో లేవు. ఏతావాతా దేశ ఆర్థిక వ్యవస్థ మదుపు భారాన్ని తానే మోసే పాత్రను ప్రభుత్వం కొనసాగించకతప్పదని దీన్ని చూస్తే అర్ధమవుతుంది. (‘ది వైర్’ సౌజన్యంతో) అనూజ్ శ్రీనివాస్ వ్యాసకర్త ఆర్థిక వ్యవహారాల నిపుణుడు -
ద్రవ్యలోటు లోగుట్టు కీలకం!
పెట్టుబడుల ఉపసంహరణ పట్ల అత్యాశ, పన్నేతర రాబడుల వృద్ధి, రక్షణరంగంతో సహా సబ్సిడీలపై గట్టి నియంత్రణ వంటి అంశాలపై స్వారీ చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆర్థికరంగ పటిషీ్టకరణ పథకాన్ని మళ్లీ పట్టాలమీదికి ఎక్కిస్తానంటూ శనివారం పార్లమెంటులో హామీ ఇచ్చారు. 2020–21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ, స్థూల దేశీయోత్పత్తిలో ప్రస్తుత సంవత్సరం ద్రవ్యలోటు 3.8కి దిగజారిపోయిందని అంగీకరించారు. వచ్చే సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 3.5 శాతానికి తగ్గిస్తానని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు. అలాగే ద్రవ్యలోటును 3.3 శాతానికి తగ్గించడానికి సవరించిన ద్రవ్యపటిషీ్టకరణ పథకం అమలు చేస్తామని కూడా మంత్రి చెప్పారు. ద్రవ్యలోటు 2021–22లో 3.3 శాతానికి 2022–23లో 3.1కి పడిపోతుందని సెలవిచ్చారు. అయితే ఇవి ద్రవ్యలోటుకు సంబంధించి పైకి కనిపించే లెక్కలు మాత్రమే కానీ ప్రభుత్వం చేస్తున్న అదనపు బడ్జెట్ రుణాల పూర్తి ప్రభావాన్ని ఇది బయటపెట్టడం లేదు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అదనపు బడ్జెట్ రుణాలు (ప్రభుత్వం బాధ్యతపడే బాండ్ల జారీ ద్వారా కూడగట్టినవి, జాతీయ చిన్నమొత్తాల పొదుపుల నిధి నుంచి తీసుకున్న రుణాలకు కూడా ఆర్థిక మద్దతు లభించినవి) మొత్తం రూ. 1.73 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ తరహా రుణాలు 8 శాతం పెరిగి రూ. 1.86 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా. ఈ బడ్జెట్‌కు అవతల చేసే రుణాలు కేంద్రం మొత్తం రుణాల్లో కలిపేటట్లయితే, జీడీపీలో వాస్తవ ద్రవ్య లోటు 2019–20లో 4.5 శాతానికి, 2020–21లో 4.36 శాతానికి చేరుతుంది. ఆర్థికమంత్రి ఇలాంటి అద్భుతాన్ని సాధిస్తానని ఎలా సూచించారు అనేది ప్రశ్న. అయితే మొదటగా, 2019–20లో ద్రవ్యలోటును 3.3 శాతంకి తగ్గిస్తామని వాగ్దానం చేసిన ఆర్థిక మంత్రి కేవలం 0.5 శాతం తేడాతో దాన్ని 3.8 శాతానికి ఎలా నిర్వహించారు? ఈ క్రమంలో నికర పన్ను రాబడిలో రూ. 1.45 లక్షల కోట్లు తగ్గిందనీ, పెట్టుబడుల ఉపసంహరణ అంచనాలు దాదాపు రూ. 40 వేల కోట్లమేరకు తగ్గిపోయాయన్న విషయాన్ని ఆమె అంగీకరించాల్సి వచ్చింది. దీంతో బడ్జెట్ ముందస్తు అంచనాలో ఆమె ప్రతిపాదించిన మొత్తంలో రూ. 1.85 లక్షల కోట్ల రాబడి తగ్గిపోయింది. అదేక్రమంలో ఆర్థిక మంత్రి ప్రభుత్వ వ్యయాన్ని రూ. 88,000 కోట్ల మేరకు కుదించేశారు. దీంట్లో నాలుగింట ఒకవంతు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కుదించడం ద్వారా వచ్చిందేనని గుర్తుంచుకోవాలి. అలాగే ఆర్బీఐ నుంచి అదనపు మూలధనం బదిలీ కూడా ప్రభుత్వానికి కాస్త దోహదపడింది. ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో రూ. 36,000 కోట్లు వచ్చింది. దీంతో మొత్తం ప్రభుత్వ వ్యయంలో తగ్గుదల రూ. 61,000కు పరిమితం అయింది. బడ్జెట్ లోటుకు సంబంధించి 2020–21 సంవత్సరంలో అతిపెద్ద అద్భుతం చోటు చేసుకుందనే చెప్పాలి. తాజా బడ్జెట్లో రూ. 1,20,000 కోట్ల మేరకు పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిపాదించారు. అయితే గత సంవత్సరం బడ్జెట్లో అంచనా వేసుకున్న రూ.1,05,000 కోట్లనే ప్రభుత్వం సేకరించలేకపోయింది. తాజా బడ్జెట్లో రూ. 1,20,000 కోట్ల విలువైన పెట్టుబడుల ఉపసంహరణ చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించడం అత్యాశే కావచ్చు. ప్రభుత్వ రంగంలోని భారీ సంస్థలలో ప్రైవేటీకరణను పూర్తి చేయడంలో వైఫల్యం కారణంగానే పెట్టుబడుల ఉపసంహరణలో అంచనాలు తప్పాయి. దీనికి మించి ప్రభుత్వరంగ బ్యాంకులు, ద్రవ్య సంస్థలలో కేంద్రప్రభుత్వానికి ఉన్న ఈక్విటీ మొత్తంలో అదనంగా రూ. 90,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరిస్తానంటూ ప్రభుత్వం మరొక అత్యాశతో కూడిన ప్రకటన చేసింది. ఇక వ్యయం విషయానికి వస్తే 2020–21 బడ్జెట్లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై వ్యయాన్ని భారీగా అంటే రూ. 2.28 ట్రిలియన్ల మేరకు తగ్గించనున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఈ విభాగాలకింద రూ. 2.27 లక్షల కోట్ల మేరకు సబ్సిడీలను అందిస్తున్నారు. అయితే ఈ సబ్సిడీలను ఎలా ఎంతమేరకు కుదిస్తారన్నది బడ్జెట్ స్పష్టం చేయలేదు. ఎరువులపై సబ్సిడీలు నిజానికి తగ్గుముఖం పట్టాయి. సబ్సిడీల హేతుబద్ధీకరణ పథకం ఏదైనా ఉంటే వచ్చే సంవత్సరం దాన్ని అమలు పర్చవచ్చు. రక్షణరంగ వ్యయంలో రెండు శాతం పెంచడంద్వారా రక్షణ బడ్జెట్ రూ.3.23 లక్షల కోట్లకు చేరుతుంది. ఇది ద్రవ్యలోటును అడ్డుకోవడంలో తోడ్పడుతుంది కానీ పెరుగుతున్న దేశ రక్షణ అవసరాలను ఇది తీర్చలేదు. చాలా సంవత్సరాలుగా రక్షణ రంగ వ్యయాన్ని అతి తక్కువగా మాత్రమే పెంచుతూ వస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 6,000 కోట్లు ఇస్తున్నారు. 2019–20లో ఈ పథకంలో భాగంగా రూ. 57,370 కోట్లు వెచ్చించగా ఈ సంవత్సరం దీన్ని రూ. 75,000లకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. (‘ది వైర్’ సౌజన్యంతో) ఎ.కె. భట్టాచార్య వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
చిన్నపరిశ్రమ ఆశలకు గండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో బడ్జెట్‌ని మొదటిసారి పరికిస్తే, ఆర్థిక వ్యవస్థ అనే వృషభాన్ని లొంగదీసుకుని ఇప్పుడున్న ఆర్థిక మందగమనాన్ని నిలువరించి, దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. దీర్ఘకాలం ఆర్థికమాంద్యం కొనసాగితే అది మరింత పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. ఆదాయ పన్ను రేటును తగ్గించడం, భారీ పెట్టుబడులు అవసరమయ్యే ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రయత్నించడం, రైతులపై దృష్టిపెట్టి, రైతుల ఆదాయాన్ని వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేస్తామని నొక్కి చెప్పడం వంటి చర్యల ద్వారా ప్రజలకు మరింతగా నగదును అందజేయడం ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రయత్నించారు. ఆమె చేసిన ప్రతిపాదనలను ఎవరూ తప్పుపట్టలేరు. ఇటీవలి కాలం వరకు దేశంలో ఆర్థిక సంక్షోభం ఉందని అంగీకరించడానికి కూడా కేంద్రప్రభుత్వం సిద్ధపడలేదు. అయితే గత కొద్దినెలలుగా ఆర్థిక వ్యవస్థ సజావుగా లేదని నెమ్మదిగా అర్థం చేసుకోవడంతో తాజా బడ్జెట్‌ను ప్రభుత్వం సరైన దిశలో తీసుకొచ్చిందనే చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ స్వస్థతను పునరుద్ధరించడం కోసం ఆమె పూనుకున్న చికిత్సకు వివిధ దృక్ప«థాలకు చెందిన ఆర్థికవేత్తల సూచనలే ప్రాతిపదిక అని అర్థమవుతోంది. కానీ సంక్షోభం పరిమాణం, దాని లోతు బట్టి చూస్తే ఆర్థిక మంత్రి ప్రయత్నం ఫలితాలను ఇవ్వనుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. తాజా బడ్జెట్ వృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటున్నప్పటికీ, స్టాక్ మార్కెట్ కుప్పగూలడాన్ని చూస్తే నిర్మల బడ్జెట్ అంచనాలను అందుకోలేదని తెలుస్తుంది. వివిధ వాణిజ్యమండళ్లు, లాబీ గ్రూపులు ఈ బడ్జెట్‌ని స్వాగతించినా, వాటి సభ్యులు మాత్రం అంతర్గతంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా లేదన్నది వారి అభిప్రాయం. గత సంవత్సరం సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్ను రేటును భారీగా తగ్గించడంతో బడ్జెట్‌కు ముందే తాము కోరుకున్నది పొందామని బడా పరిశ్రమ వర్గాలు సంతృప్తి చెందాయి. కానీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ బడ్జెట్‌వల్ల బాగా ఆశాభంగం చెందాయి. కార్పొరేట్ వర్గాలకు మల్లే తమకు కూడా కార్పొరేట్ పన్నును మినహాయిస్తారని వీరు ఆశలు పెంచుకున్నారు కానీ వారి ఆశలు నిరాశలయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దేశం స్థూల ఆదాయంలో 32 శాతం వరకు దోహదపడుతున్నాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 11 కోట్ల 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దేశ ఎగుమతుల్లో దాదాపు సగభాగం వీటి నుంచే జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ సమగ్ర సంక్షేమానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పునరుద్ధరణ కీలకమైనదని మనకు సులభంగా అర్థమవుతుంది. ప్రత్యేకించి 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ కలిగించిన ప్రకంపనలతో ఈ రంగానికి ఊపిరాడటం లేదు. తాము కోల్పోయిన వైభవాన్ని ఇవి ఇంకా సాధించడం లేదు. ఆనాటి నుంచి వందలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి కూడా. పన్ను వివాదాలు, వివాదాస్పదంగా మారిన పన్ను చెల్లింపు మొత్తాలకు సంబంధించి ప్రభుత్వ సహా యాన్ని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కోరుకుంటూ ఎదురు చూస్తున్నాయి. ఆర్థిక మంత్రి పన్ను వివాద పరిష్కార పథకాన్ని ప్రారంభించారు కానీ 2020 మార్చి 31లోగా చెల్లించని బకాయిలపై అపరాధరుసుం, వడ్డీరేటును తగ్గిస్తానని హామీ ఇవ్వడం తప్పితే మరే ఇతర రాయితీలనూ ఇవ్వడానికి తిరస్కరించారు. ఈ సంవత్సరం మార్చి 31 తర్వాత చెల్లించే బకాయిలకు ఈ రంగం య«థాప్రకారం అపరాధరుసుం, వడ్డీరేటును చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం కూడా జూన్ 30 వరకే అందుబాటులో ఉంటుంది. అందుకే చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఈ షరతుపట్ల తీవ్రంగా ఆశాభంగం చెందిఉన్నాయి. చిన్నతరహా పరిశ్రమలకు జీఎస్టీ వివాదాలు మరొక శిరోభారంగా మారాయి. రాబడి ఫైలింగ్ వ్యవధిని మరో సంవత్సరం పాటు ప్రభుత్వం పొడిగించిందంటే, ప్రారంభించి రెండున్నర సంవత్సరాలు పూర్తయినప్పటికీ నూతన పన్ను వ్యవస్థ ఇంకా సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని స్పష్టమవుతోంది. ఈ ఏప్రిల్ నుంచి ఆదాయ రిటర్నులను మరింత సరళీకరిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటిం చారు. అంటే జీఎస్టీ వ్యవస్థలో తలెత్తిన పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదనే అర్థం. పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్లను సకాలంలో పొందనట్లయితే అది నిరుపయోగమే అవుతుంది. పన్నుల రూపంలోని ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించడం స్వాగతించదగినదే. పన్నువసూళ్ల రంగంలోని పాలనాధికారులను ఆమె కట్టడి చేసినట్లయితే దేశం మొత్తానికి పెద్ద సేవ చేసినవారవుతారు. జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ పూర్తిగా జీఎస్టీ కౌన్సిల్‌కి సంబంధించిందే అయినప్పటికీ బడ్జెట్లో పేర్కొన్నట్లుగా దాని హేతుబద్దీకరణ సాధ్యం కావడంలేదు. పాత, కొత్త పన్నుల వ్యవస్థ పక్కపక్కనే కొనసాగించడం వల్ల మరింత గందరగోళం పెరిగి కల్లోలానికి దారి తీస్తోంది. ఆదాయపన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంచడం, 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదనీ, 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను చెల్లించాలని, రూ. 5–7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు ఉంటుందని, రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్ను 20 నుంచి 15 శాతానికి తగ్గింపు ఉంటుందని, రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను, రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలని ఆదాయపన్నులో మినహాయింపు ఇవ్వడం కాస్త ఊరటనిచ్చేదే. పైగా ఆర్థిక వ్యవస్థలో డిమాండును ఇది ప్రోత్సహిస్తుంది కూడా. లక్ష్మణ వెంకట్ కూచి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కేంద్ర బడ్జెట్‌పై ఎంవీఎస్ నాగిరెడ్డి అసంతృప్తి
సాక్షి, అమరావతి: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బడ్జెట్లో చెబుతారు కానీ, ఎలా చేస్తారో స్పష్టత ఉండదంటూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు పెద్ద పీట ఎక్కడ వేశారో అర్ధం కావటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. 2019-20లో సబ్సిడీలకు రూ. 3,38,153.67 కోట్లు కేటాయించి రూ. 2,63,557.33 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2020-21కి ఆహార, ఎరువుల సబ్సిడీలు తగ్గించి రూ. 2,62,108.76 కోట్లు మాత్రమే కేటాయించి, అత్యధికంగా దృష్టి పెట్టవలసిన వ్యవసాయ యాంత్రీకరణ మీద దృష్టి పెట్టకుండా విధానపరమైన కేటాయింపులు పెంచకుండా ‘కిసాన్ రైలు’ వేస్తామని చెప్పారన్నారు. దేశవ్యాప్తంగా 26 లక్షల సొలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పడమే వ్యవసాయానికి పెద్దపీట వెయ్యడమా అని ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
కేంద్ర బడ్జెట్ 2020
-
ఇకపై ఆ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా విద్యా విధానం, ఉద్యోగ కల్పనలో మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ఇక నుంచి నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు రాబోయే రోజుల్లో ఒకటే పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు గానూ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) ఈ ఏజెన్సీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పడుతున్న నాన్ గెజిటెడ్ పోస్టుల ఖాళీలను గుర్తిస్తూ.. వాటిని సమన్వయం చేసుకుంటూ అన్నింటికీ ఒకటే పరీక్ష నిర్వహించనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన విధానం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు రకరకాల పరీక్షలు రాయాల్సి వచ్చేది. కానీ రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగాలకు కలిపి ఒకటే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. (స్వచ్ఛమైన గాలి కోసం భారీగా కేటాయింపు) -
ఈనాటి ముఖ్యాంశాలు
-
జై కిసాన్
-
బడ్జెట్ 2020 : కేసీఆర్ తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020-21బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని మండి పడ్డారు. నిధుల్లో భారీ కోతలు విధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సీనియర్ అధికారులతో దాదాపు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్ పై ఈ క్రింది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. (బడ్జెట్ : తెలంగాణకు దక్కినవేంటి?) కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉంది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. కానీ సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారు మారు అయింది. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసి, రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది. ప్రతీ సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ అరా శాతం అటూ ఇటు అయిన సందర్భాలున్నాయి కానీ, 2019-20 సంవత్సరంలో ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల నిర్వహణలో లోపానికి నిదర్శనం. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై దారుణంగా పడింది. (ఏపీకి అందని సీతమ్మ వరాలు) 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లింది. ఒకటి.. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. రెండు.. తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్ల రూపాయలు తగ్గనున్నాయి. ఇంత భారీగా తెలంగాణకు నిధులు తగ్గించడం ఖచ్చితంగా వివక్షే. ఈ తగ్గుదల ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రణాళికలపై పడుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటులో ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తున్నది. ఈ సారి కూడా అంచనాలు సవరించే నాటికి చెప్పిన దాంట్లో ఎంత తగ్గిస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతున్నది. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) జీఎస్టీ విషయంలో కూడా కేంద్రం పెద్ద మోసం, దగా చేస్తున్నది. 14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా ఇంకా రూ.1,137 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర బడ్జెట్లో పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోత పెట్టారు. దీనివల్ల శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుంది. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి 2019-20 బడ్జెట్లో రూ.1,037 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్ వచ్చే సరికి గత ఏడాదికన్నా 148 కోట్ల రూపాయలు తగ్గించి, కేవలం 889 కోట్లు మాత్రమే కేటాయించారు. పట్టణాభివృద్దికి ఇచ్చే నిధుల్లో 14.3 శాతం కోత పెట్టారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల సహాయం తెలంగాణ రాష్ట్రానికి అందివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులు అమలు చేయాలని కేంద్రానికి అనేక సార్లు విన్నవించాం. అయినా వారు పట్టించుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా దాని ఊసులేదు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించాం. దాని నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించాం. కానీ కేంద్రం నిధులు కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత అందివ్వాలని కేంద్రాన్ని కోరినా, బడ్జెట్లో ఎక్కడా తగిన కేటాయింపులు చేయలేదు. అన్ని ప్రధాన రంగాలకు కోతలు : కేసీఆర్ రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారనుందన్నారు. ‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. జిఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదు. 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్రం తీసుకోలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, తదితర రంగాలకు నిధులను తగ్గించారు. ఇది దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. (బడ్జెట్లో తెలంగాణకు దక్కని కేటాయింపులు!) వ్యవసాయరంగానికి 2019-20 సంవత్సరంలో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.39 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగానికి గత ఏడాది 2.24 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 2.13 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి గత ఏడాది 4.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.94 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. విద్యా రంగానికి గత ఏడాది 3.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.22 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్
-
బడ్జెట్ : తెలంగాణకు దక్కినవేంటి?
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్ఎస్ సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవని ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించకపోగా.. కనీసం విభజన హామీలను సైతం నెరవేర్చలేదని పెదవి విరిశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి విజ్క్షప్తి చేసిన విషయం తెలిసిందే. దాదాపు లక్ష కోట్లతో నిర్మించిన ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. కానీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో దాని ప్రస్తావనే లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తీవ్ర నిరాశ చెందారు. (బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం) గత లోక్‌సభ ఎన్నికల సమయంలో నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇచ్చిన హామీని విస్మరిస్తూ.. రెండు బడ్జెట్ సమావేశాలు ముగిసినా.. కేంద్రం నుంచి ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నా.. ముందడుగు మాత్రం పడలేదు. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ.. కేంద్రం విడుదల చేయడంలేదని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, తమపై ఇంత వివక్ష చూపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (ఏపీకి అందని సీతమ్మ వరాలు..) అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్ సమావేశాల్లో పలు అంశాలను కేంద్రానికి ప్రతిపాదిస్తోంది. వాటిలో కాజీపేట్ రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నిజామాబాద్ పసుపు బోర్డుతో పాటు కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి అంశాలను ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. గత బడ్జెట్లో వీటికి మొండిచేయి చూపడంతో.. ఈ సారైనా కేంద్ర కరునిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ విత్తమంత్రి ప్రసంగంలో మాత్రం వాటి ప్రస్తవన లేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర నుంచి నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు కూడా బడ్జెట్లో కేటాయింపులు పెద్దగా లేకపోవడంతో.. తెలుగు ప్రజలు పూర్తి నిరాశలో ఉన్నారు. (కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి) -
బడ్జెట్ ప్రసంగం.. నాకేదీ గుర్తు లేదు!
న్యూఢిల్లీ : బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం వ్యంగంగా స్పందించారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు రేటింగ్ ఇవ్వమని విలేకర్లు అడగ్గా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. మీరు బడ్జెట్‌కు 1 నుంచి 10 వరకు ఎంత రేటింగ్ ఇస్తారన్న ప్రశ్నకు.. 1,0.. ఈ రెండు నెంబర్లలో ఏదైనా తీసుకోవచ్చంటూ సమాధానమిచ్చారు. అనంతరం బడ్జెట్ కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ..160 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో తనకు ఏదీ గుర్తు లేదని అన్నారు. దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, గత ఆరు త్రైమాసికాలలో వృద్ధి రేటు క్షీణించిందని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇంత సుధీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని తాను వినలేదంటూ ఎద్దేవా చేశారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
పోలవరంకు బడ్జెట్‌తో సంబంధం లేదు : జీవీఎల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రాల అంశాల ప్రతిపాదికన బడ్జెట్‌ను చూడటం సరికాదని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదాయపన్ను వ్యవస్థను సరళీకృతం చేసేలా బడ్జెట్ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదాయపన్ను శాతాన్ని తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్‌ను అమరావతిలో పెట్టాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. పోలవరం ప్రాజక్టుకు కేంద్ర బడ్జెట్‌కు సంబంధం లేదని చెప్పారు. అందుకు నాబార్డ్ ద్వారా కేంద్రం నిధులిస్తుందన్నారు. పెద్ద మొత్తంలో నిధులను రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు మౌలిక వసతుల కల్పనకు సమాకూర్చానున్నామని తెలిపారు. -
‘10 శాతం పెరుగుదలనేది ప్రశ్నార్థకంగా ఉంది’
-
‘10 శాతం పెరుగుదలనేది ప్రశ్నార్థకంగా ఉంది’
సాక్షి, హైదరాబాద్ : దేశ స్థూల ఉత్పత్తి 10 శాతం పెరుగుదలతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అయితే 10 శాతం పెరుగుదల అనేది ప్రశ్నార్థకంగా ఉందని బుగ్గన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బడ్జెట్ నిరాశజనకంగా ఉందన్నారు. రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్షం ఉందని.. కేంద్ర బడ్జెట్‌పై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే అజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని బుగ్గన స్పష్టం చేశారు. కొన్ని ప్రభుత్వ ఆఫీసులను కర్నూలకు తరలించడంలో తప్పేముందన్నారు. చంద్రబాబు చెప్పినట్టు అభివృద్ధి అంతా అమరావతిలోనే జరిగితే.. శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు. బుగ్గన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 2లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. 2018-19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటా రూ. 2,500 కోట్లు తగ్గించారు. ఈ బడ్జెట్లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వ్యవసాయానికి గోదాములు కెపాసిటీ పెంచే ఏర్పాటు, రాజ్యలక్ష్మి గ్రూప్‌లకు ఆర్థిక సాయం, కిసాన్ రైతు పథకాలు బాగున్నాయి. కృషి ఉడాన్ ఏర్పాటు కూడా స్వాగతించ తగిన అంశం. వెనకబడిన జిల్లాల్లో ఆస్పత్రులకు ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్ నిర్ణయం మంచిదే. గత బడ్జెట్‌తో పోలిస్తే విద్య కోసం మార్జినల్‌గా స్వల్ప కేటాయింపులు ఉన్నాయి. ఎంఎస్ఎంఈ సెక్టార్లో రుణ విధాన తరలింపును పొడిగించారు. బ్యాంక్ డిపాజిట్లను భద్రతను రూ. 5లక్షకు పెంచారు. రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ తగ్గించారు. అయితే కొన్ని నిబంధనలను ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ నిరాశజనకంగా ఉంది. 2014లో రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా విభజన జరిగింది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు పూర్తికాలేదు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు.. కానీ ఇప్పటివరకు ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలాంటి హామీ లేదు. వెనకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్ ఇస్తామని చెప్పారు.. కానీ అవి కూడా ఇప్పటివరకు పూర్తిగా రాలేదు. పోలవరానికి సంబంధించిన నిధుల విడుదల కూడా ఆలస్యం అవుతుంది. దుగ్గరాజపట్నం సాంకేతికంగా ఆలస్యమయితే రామాయపట్నం ఇవ్వాలని కోరాం. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రత్యేక హోదా కోసం గత ఐదేళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. కానీ రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్షం ఉంది. కేంద్ర బడ్జెట్‌పై స్పందించకుండా.. ప్రభుత్వంపై విమర్శలు చేయడమే టీడీపీ నేతలు అజెండాగా పెట్టుకున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు రూ. 1900 కోట్లు ఆదా చేశాం. ఒక్క పోలవరంలోనే రూ. 782 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయింది. టీడీపీలా దోచుకోకపోవడం మా అసమర్థతా?. దీనికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పాలి. 2014లో రైట్ టైమ్‌లో నిధులు రాకుండా టీడీపీ ప్రభుత్వం కక్కుర్తి పడింది. ఆ తర్వాత డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది. నీతులు చెప్పే టీడీపీ.. రెండేళ్లపాటు ఎందకు పోలవరాన్ని వదిలేసినట్టు?. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పారిపోయారు. పుష్కరాల్లో పంపిణీ చేసిన మంచినీళ్ల ప్యాకెట్లలోనూ అవినీతి చేశారు. ఎన్నికలకు 45 రోజులకు ముందు చేసుకున్న పీపీఏలను మాత్రమే మేము రద్దు చేశాం. 45 రోజుల్లో 41 పీపీఏలను 25 ఏళ్లకు ఎలా చేస్తారు?. టీడీపీ చేసిన తప్పులను ప్రశ్నించినవారు చెడ్డవాళ్లా?. టీడీపీ చేసిన అవినీతి వల్ల.. రాష్ట్రంలో కరెంట్ బిల్లు కట్టే ప్రతి ఒక్కరిపై భారం పడుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన విజ్ఞప్తిని మదిలో పెట్టుకుని అనంతపురంలో ప్లాంట్ పెట్టామని కియా మోటార్స్ సంస్థ అధినేత లేఖ రాశారు. లులు కంపెనీతో ఎలాంటి లాలుచీ లేకుండానే రూ. 20 కోట్ల విలువైన స్థలాన్ని రూ. 20లక్షలకు ఇచ్చారా? రాజధాని సెంటర్లో ఉండాలని చెప్పిన వ్యక్తి తుగ్లక్.. ఆయనను ఆదర్శంగా తీసుకునే టీడీపీ పనిచేస్తోంది. అందుకే చంద్రబాబు రాజధానిని సెంటర్లో పెట్టాలని అంటున్నారు. తుగ్లక్ తర్వాత రాజధానిని సెంటర్లో పెట్టాలని చెప్పింది చంద్రబాబే. చంద్రబాబు హయాంలో అత్యధికంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం నేనే పెద్ద రైతును అని బీరాలు పలుకుతున్నారు. తుగ్లక్ పనులు చేసేది చంద్రబాబే. అధికారంలో ఉన్నవారు ఎప్పుడైనా ధర్నాలు చేయడం చూశామా?. పరోక్షంగా చంద్రబాబును దెబ్బకొట్టడానికే యనమల మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేసిన రూ. 60 వేల కోట్ల అప్పును తీర్చడానికి 6 నెలలుగా కష్టపడుతున్నాం. యనమలకు ఈ విషయం తెలియదా?. దుర్మార్గమైన పాలన చేసిన టీడీపీ.. ఇప్పుడు ఏమీ ఎరగనట్లు మాట్లాడటం హాస్యాస్పదం. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన మండలిలో శాసనసభ చేసిన చట్టాలను అడ్డుకుంటున్నారు. ఇది మంచి సంప్రాదాయం కాద’ని అన్నారు. -
బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఊహించిన దాని కంటే భిన్నంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం కేంద్ర బడ్జెట్ కేటాయింపుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పథకంతో తెలంగాణ రైతులకు సహాయం చేస్తోందని తాజా ఆర్థిక సర్వే తెలిపిందని, కానీ బడ్జెట్లో ఆ పథకానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని, విభజన హామీలకు బడ్జెట్లో కేటాయింపులు లేవని అన్నారు. దేశంలోనే గొప్ప ప్రాజెక్టైన కాళేశ్వరానికి కూడా నిధులు కేటాయించలేదని, ఇండస్ట్రీయల్ కారిడర్ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణకు ట్రైబల్ మ్యూజియం కేటాయించాలని కోరామన్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లె విధంగా బడ్జెట్ లేదని అభిప్రాయపడ్డారు. గతంలో 18 శాతం వృద్ధి రేటు ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కేంద్ర విధానాల వల్ల వృద్ధి రేటు 9శాతానికి పడిపోయిందని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా తెలంగాణ దేశంలోనే మెదటి స్థానంలో ఉందని అన్నారు. మెదక్ ఎంపీ, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్లో తాము కోరిన 22 అంశాలకు కేటాయింపులు ఉంటాయని అనుకున్నామన్నారు. బడ్జెట్లో హర్ ఘర్ జల్ అన్నారని, తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ ముందే అమలు చేశారని తెలిపారు. రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి రైతుల కోసం పనిచేస్తున్నామనడం చోద్యంగా ఉందని అన్నారు. జాతీయ రహదారులు, ప్రాజెక్టుల అంశాలు మాటే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణ నదీ ప్రాజెక్టులు, నీటి నిల్వలపై చేపల పెంపకం చేపట్టామని..ఆ కార్యక్రమం మంచిగా కొనసాగుతోందని అన్నారు. సాగర మిత్ర అనేది కేసీఆర్ ఎప్పుడో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. పురాతన కట్టడాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని, పర్యాటక రంగానికి సంబంధించి నిధులు కేటాయించలేదని అన్నారు. విభజన హామీల ప్రస్తావనే లేదని, పాత సీసాలో కొత్త సారా పోసినట్టు బడ్జెట్ ఉందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. రాజ్యసభ సభ్యులు, బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని, రైతులను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో జీఎస్టీ బకాయిల అంశం లేదని ,తెలంగాణలోని అనేక సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరామని, విభజన హామీల ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుందన్నారు. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా పోరాడాలని కోరారు. చెవెళ్ల ఎంపీ, రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికే తెలంగాణ సంపద సృష్టిస్తోందని కేంద్రం చెప్పిందని, అన్ని రంగాల వారిగా వృద్ధి రేటులో తెలంగాణ ముందుందని అన్నారు. ప్రభుత్వం ఆర్ధిక మందగమనం నుంచి ఏ విధంగా బయట పడాలో ఆలోచన చేయడం లేదని, పక్క దేశాలు అవలంభిస్తున్న విధానాలు అవలంభించాలని తెలిపారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలంటే చాలా డబ్బులు కావాలని, కేంద్రం లెక్కల గారడి చేస్తోందని విమర్శించారు. పథకాల అమలులో తెలంగాణ ముందుందని తెలిపారు. అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా సాధ్యమని, బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని రంజిత్ రెడ్డి అన్నారు. -
ఏపీకి అందని సీతమ్మ వరాలు..
సాక్షి, అమరావతి : కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. దేశంలో నెలకొన్న ప్రత్యేక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి మొండిచేయి చూపింది. ముఖ్యంగా విభజన అనంతరం రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయి పీకల్లోతు ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. ఐదు కోట్ల ఆంధ్రుల జీవనాడిగా భావిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై స్పష్టత లేదు. ప్రాజెక్టుల వారిగా నిధుల కేటాయింపు జాబిత ప్రకటించకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. బడ్జెట్‌కు ముందు జరిగి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రం ముందు పలు ప్రతిపాదనలు పెట్టిన విషయం తెలిసిందే. (బడ్జెట్ నిరుత్సాహ పరిచింది: విజయసాయి రెడ్డి) ఇక విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నంను ప్రత్యేక రైల్వేజోన్‌గా గత ఏడాది గుర్తించినప్పటికీ.. దానికి సంబంధించి పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తేజాస్ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లును ప్రవేశపెడతామని నిర్మలా ప్రకటించినా.. ఏపీకి మాత్రం ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా కేటాయించినట్టు ప్రసంగంలో లేదు. విభజన చట్టం ప్రకారం విశాఖ-విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. కేంద్ర నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసినట్లే కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి.. రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రమే భరిస్తుందని ఏపీ విభజన చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ గడిచిన ఐదేళ్లుగా దానికి తగ్గ కేటాయింపులు లేవు. నిధుల సంగతి పక్కనపెడితే.. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పదేపదే డిమాండ్ చేస్తున్నా కేంద్రం మాత్రం మౌనం వహిస్తోంది. రాజధాని నిమిత్తం రాజ్ భవన్, సెక్రటేరియట్, హైకోర్టు సహా మౌలిక వసతుల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇక దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఊసేలేకపోవడం ఆంధ్రులను ఆగ్రహానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో వెనకబడిన 7 జిల్లాలకు సంబంధించి మొత్తం రూ.24,350 కోట్లు రావాల్సి ఉన్నా, వాటిపై విభజన చట్టంలో స్పష్టంగా చెప్పినా, ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు. (టీడీపీ ఔట్.. వైఎస్సార్సీపీ ఇన్) కేంద్రం ఏపీకి మొండిచేయి చూపింది.. శనివారం లోక్‌సభలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఏపీకి మొండిచేయి చూపిందని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ నిరుపయోగమని పెదవి విరిచారు. ఈ బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలు అందిన తర్వాత, సమగ్రంగా విశ్లేషించి మళ్లీ స్పందిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. బడ్జెట్ నిరాశజనకంగా ఉంది : బుగ్గన కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ నిరాశజనకంగా ఉందన్నారు.ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కుని.. కానీ ఇప్పటివరకు ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర నుంచి ఎలాంటి హామీ రాకపోవడం దురదృష్టకరమన్నారు. ‘వెనకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్ ఇస్తామని చెప్పారు.. కానీ అవి కూడా ఇప్పటివరకు పూర్తిగా రాలేదు. పోలవరానికి సంబంధించిన నిధుల విడుదల కూడా ఆలస్యం అవుతుంది. దుగ్గరాజపట్నం సాంకేతికంగా ఆలస్యమయితే రామాయపట్నం ఇవ్వాలని కోరాం. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రత్యేక హోదా కోసం గత ఐదేళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది’ అని అన్నారు. -
బడ్జెట్ 2020: ప్రధాని మోదీ స్పందన
న్యూఢిల్లీ: నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్ పెట్టుబడులు, ఆదాయం, డిమాండ్‌ను పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజల అవసరాలను, దశాబ్దపు ఆర్థిక అంచనాలను పరిపూర్ణం చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ద్వారా అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని.. ఈ దశాబ్దపు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని పేర్కొన్నారు. వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, జౌళి పరిశ్రమ, సాంకేతిక రంగాల్లో ఉపాధి కల్పనకు దోహదపడుతుందన్నారు. ఆదాయాన్ని పెంచేందుకు 16 కీలక అంశాలపై దృష్టి సారించామని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మోదీ మాట్లాడుతూ... దేశం నుంచి ఎగుమతులు పెంచేందుకు బడ్జెట్లో ప్రోత్సహకాలు కల్పించామన్నారు. యువతకు ఉపాధి, పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్థుల కోసం ఆన్లైన్ కోర్సులు, ఇంటర్న్‌షిప్ విధానాలు విదేశాలకు వెళ్లే వారి కోసం బ్రిడ్జ్ కోర్సులు ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. నీలి విప్లవంతో మత్స్య పరిశ్రమలో విస్త్రృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్ భారత్ కొత్త దశను నిర్దేశిస్తుందని వెల్లడించారు. దేశంలో వైద్య పరికరాల తయారీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. బడ్జెట్లో స్మార్ట్‌సిటీలు, డేటా సెంటర్ పార్కులు వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఇక కొత్తగా 100 ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయడం, రవాణా రంగంలో మౌలిక వసతుల కల్పన ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగ కల్పన పెరుగుతుందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఇక ఈ వాహనాలు ఖరీదే
సాక్షి, న్యూఢిల్లీ: "మేక్ ఇన్ ఇండియా" చొరవలో భాగంగా స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వివిధ రకాల వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2020 - 21 ప్రసంగంలో శనివారం ప్రకటించారు. పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) పై కస్టమ్స్ సుంకాన్ని 40 శాతానికి పెంతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 25 శాతం మాత్రమే. 2020 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. దీంతో దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవిగా మారనున్నాయి. అయితే ఈ మేరకు దేశీయ కంపెనీలకు కాస్త ఊరట లభించనుంది. ప్రయాణీకుల సెమీ నాక్-డౌన్ (ఎస్కెడి) పాసింజర్ వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 30 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అదేవిధంగా, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సాంప్రదాయ వాణిజ్య వాహనాల సీబీయూల కస్టమ్స్ సుంకాన్ని 30 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని సీతారామన్ ప్రతిపాదించారు. ఉత్ప్రేరక (కెటాలిక్) కన్వర్టర్లను తయారు చేయడానికి ఉపయోగించే భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతం నుండి 7.5 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాకుండా, ప్రయాణీకుల ఈవీలు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనాలు, బస్సు మరియు ట్రక్కుల యొక్క పూర్తిగా నాక్-డౌన్ (సికెడి) రూపాలపై కస్టమ్స్ సుంకం ప్రస్తుత 10 శాతం నుండి 15 శాతం వరకు పెంచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. కాలుష్య ఉద్గారాలు అదుపులేని స్థాయికి పెరగడంతో గ్రీన్మొబిలిటీపై ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో, వివిధ కార్ల తయారీదారులు గత కొన్నేళ్లుగా దేశంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్, ఎంజి మోటార్ ఇండియా కూడా ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టాయి. అదేవిధంగా మెర్సిడెస్ బెంజ్, ఆడి, జెఎల్ఆర్ లాంటి కంపెనీలు కూడా దేశంలో ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
ఇంత అన్యాయమా?.. బడ్జెట్‌పై ఉద్ధవ్ ఠాక్రే
సాక్షి, ముంబై : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కనీస కేటాయింపులు లేవని, బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా దానికి సంబందించి కేంద్రం ఎలాంటి కేటాయింపులు జరపలేదని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై పార్లమెంట్లో చర్చ సందర్భంగా అధికార బీజేపీ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుందో వేచి చూడాలి. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
బడ్జెట్ 2020 : ధరలకు చెక్ పెడతారిలా..!
సాక్షి, న్యూఢిల్లీ : ఉల్లిగడ్డలు, టమాట వంటి ధరలు కొండెక్కడంతో పాటు నిత్యావసరాల ధరలు నింగినంటుతూ ద్రవ్యోల్బణం చుక్కలు చూపుతున్న వేళ వీటిని కిందికి దించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో పలు చర్యలు ప్రకటించారు. ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు ఆయా పంటల దిగుబడులను పెద్ద ఎత్తున చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సాహక చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ధరలను నియంత్రించేలా ఆహారోత్పత్తులను పెంచేందుకు ఉత్పాదకత మెరుగయ్యేలా రైతులకు కనీస మద్దతు ధర వంటి రాయితీలను ప్రకటించామని చెప్పారు. ఉద్యానవన పంటల మిషన్ (ఎంఐడీహెచ్), ఆయిల్‌సీడ్స్ జాతీయ మిషన్ (ఎన్‌ఎంఓఓపీ) వంటి ప్రత్యేక చర్యల ద్వారా నిత్యావసరాలు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిని పెంపొందిస్తామని తెలిపారు. చదవండి : పాత విధానమా? కొత్త విధానమా? మీ ఇష్టం! -
రక్షణ రంగానికి భారీ కేటాయింపులు!
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్లో ఆవిష్కరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం పరిపాలనలో విస్తృతమైన సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌పై ప్రసంగించిన నిర్మలా సీతారామన్.. రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, గత ఏడాది కంటే రక్షణ రంగానికి 5.8 శాతం మాత్రమే ఎక్కువ కేటాయింపులు జరపడం గమనార్హం. పోయిన సంవత్సరం రక్షణ రంగానికి కేంద్రం రూ.3.18 లక్షల కోట్లు కేటాయించింది. కాగా బడ్జెట్లో గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశామని నిర్మల తెలిపిన విషయం తెలిసిందే. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచినట్లు ఆమె వెల్లడించారు. జీఎస్టీ అమలుతో ఆర్థిక రంగంలో చారిత్రక సంస్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అదే విధంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి రూ.85 వేల కోట్లు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి రూ.53 వేల 700 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగుల సంక్షేమానికి రూ. 9500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. న్యూ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని నిర్మల తెలిపారు. -
స్వచ్ఛమైన గాలి కోసం భారీగా కేటాయింపు
న్యూఢిల్లీ: మెట్రోపాలిటన్ సిటీల్లో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరగిపోయింది. కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని స్థితిలో ఈ నగరాల ప్రజలు బతుకుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ అయితే గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు అనేక సార్లు కామెంట్ చేసింది. వాయు కాలుష్యం దెబ్బకి స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాయు కాలుష్యాన్ని తగ్గింఏందుకు సరి బేసి లాంటి విధానాలతో రోడ్లపైకి వస్తున్న వాహనాలను నియంత్రిస్తున్నారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కాలుష్య నివారణ, స్వచ్ఛమైన గాలి కోసం బడ్జెట్లో ఒక పథకాన్ని ప్రకటించారు. మెట్రోపాలిటన్ నగరాల్లో 'క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్' కోసం రూ.4,400 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. పెద్ద పెద్ద నగరాల్లో కాలుష్యం కోరలు చాచడం వల్ల.. ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చుకోలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ నిధులను అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కల పెంపుతో పాటు కొత్త విధానాల రూపకల్పనకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. బడ్జెట్ 2020 : సేద్యం.. వైద్యంపై దృష్టి -
విద్యామూలం.. ఇదం జగత్
-
బడ్జెట్లో మాకు ఉపశమనం లేదు: కాయ్
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో ఉన్న టెలికాం పరిశ్రమకు బడ్జెట్లో ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కాయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ విమర్శించారు. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా టెలికాం రంగాన్ని చేర్చకపోవడం మరింత అసంతృప్తి కలిగించిందని మాథ్యూస్ అన్నారు. రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయి భారంతో ఇబ్బందులు పడుతున్న టెలికాం రంగానికి ఉపశమనం లభిస్తుందని ఆశించిన తమకు నిరాశే మిగిలిందన్నారు. దీనిపై మరింత వివరాలను పరిశీలించాల్సి వుందని పేర్కొన్నారు.స్మార్ట్ మీటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారనీ అది తమ రంగానికి ఎలా ఉపయోగపడుతుందో చూడాలన్నారు. మరోవైపు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన ఆదాయ అంచనాను రెట్టింపు చేసి రూ .1.33 లక్షల కోట్లకు చేర్చింది. అప్పుల బారిన పడిన టెలికం రంగం నుంచి వచ్చే ఆదాయ అంచనాను ప్రభుత్వం రెండు రెట్లు పెంచింది. ప్రధానంగా సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ బకాయిల (ఏజీఆర్) ద్వారా ఈ ఆదాయాన్ని అందుకోవాలని ప్లాన్ . కాగా ఏజీఆర్ చెల్లింపులు, లైసెన్స్ ఫీజు, అధిక స్పెక్ట్రం ఛార్జీలు (అంతర్జాతీయ ధరలతో పోల్చితే 30-40 శాతం అధికమని) టెల్కోలు వాదిస్తున్నాయి. లైసెన్స్ ఫీజు,ఎస్యూపీ లెవీలపై కొంత ఊరట లభిస్తుందని టెలికాం పరిశ్రమ కేంద్ర బడ్జెట్‌పై ఆశలు పెట్టుకుంది. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
టీడీపీ ఔట్.. వైఎస్సార్సీపీ ఇన్
-
ఏపీకి తప్పకుండా న్యాయం జరుగుతుంది
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ రెండూ వేరువేరు అంశాలన్నారు. ఆర్టికల్ 371 రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ను యూటిగా చేశామని పేర్కొన్నారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ చాలా బాగుందన్నారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఈ దశబ్దానికి తొలి బడ్జెట్ అంటూ కొనియాడారు. కేంద్ర బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే భీమాను రూ. 5లక్షలకి పెంచడం సామాన్యులకు ఇచ్చిన బహుమతిగా పేర్కొన్నారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) చదవండి : కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి -
పాత విధానమా? కొత్త విధానమా? మీ ఇష్టం!
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపు కోసం ఇకపై రెండు విధానాలు అమల్లోకి ఉంటాయని, పాతవిధానంలో కొనసాగితే ఇప్పటివరకు ఉన్న మినహాయింపులు యథాతథంగా అమల్లో ఉంటాయని, కొత్త విధానంలోకి మారితే మినహాయింపులు ఏవీ ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఆదాయపన్నుకు సంబంధించి పాత విధానమా? కొత్త విధానమా? అనేది పన్ను చెల్లింపుదారుడే నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. కొత్త విధానంలో రూ. 5 లక్షల నుంచి 7 లక్షల ఆదాయానికి 10శాతం పన్ను, రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయానికి 15శాతం పన్ను, రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల ఆదాయానికి 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల ఆదాయానికి 25శాతం పన్ను, రూ. 15 లక్షలకుపైగా ఆదాయానికి 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు. పన్నురేట్లు తగ్గించేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని ఆమె వివరించారు. ఆదాయపన్ను విధానాన్ని సరళీకరించాలనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కొత్త విధానంలో 80సీ, 80డీ, ఎల్టీసీ, హెచ్చార్ఏ మినహాయింపులు ఉండవని తెలిపారు. ఇక, దీర్ఘకాలంలో ఆదాయపన్ను మినహాయింపులన్నీ తొలగిస్తామని, వాటి స్థానంలో తక్కువ పన్నురేటు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేట్ పన్నుల విధానంలో మార్పులు తీసుకొచ్చినవిధంగానే ఆదాయపన్నుల్లోనూ మార్పులు తెస్తామని అన్నారు. ఆదాయపన్ను చెల్లింపు సరళీకృతంగా ఉండాలని కోరుకునేవారు కొత్త విధానంలోకి మారొచ్చునని, కొత్త విధానంలో ఆదాయపన్ను చెల్లింపు ఎంతో సులువుగా ఉంటుందని తెలిపారు. -
స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్
ముంబై : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరాశపరచడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3 శాతం నుంచి 3.8 శాతానికి సవరించడం, కీలక రంగాలకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించకపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. బడ్జెట్ నిరాశపరచడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఓ దశలో వేయిపాయింట్లు పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరికి 988 పాయింట్ల నష్టంతో 39,736 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక భారీగా పతనమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,650 పాయింట్ల దిగువన ముగిసింది. చదవండి : బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ -
‘బడ్జెట్ కేటాయింపులు లేనపుడు ఓటెందుకెయ్యాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిరాశ వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఢిల్లీపై సవతి తల్లి ప్రేమ చూపించారంటూ విమర్శించారు. ఢిల్లీ ప్రజలు బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని కానీ బీజేపీ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఢిల్లీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదని.. అలాంటపుడు బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటూ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. -
బడ్జెట్ నిరుత్సాహ పరిచింది: విజయసాయి రెడ్డి
-
బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్
-
టీడీపీ ఔట్.. వైఎస్సార్సీపీ ఇన్
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యాలయాన్ని కేటాయించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 22 మంది ఎంపీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎంపీల విజ్ఞప్తి మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. గ్రౌండ్ ఫ్లోర్‌లోని 5వ నెంబర్ గదిని కేటాయించారు. ఈ గదిలో గత 30 ఏళ్లుగా టీడీపీ కార్యాలయం కొనసాగుతోంది. సరైన సంఖ్యలో సభ్యులు లేనప్పటికీ బయటిశక్తుల ఒత్తిడి మేరకు అదే కార్యాలయంలో టీడీపీ తిష్టవేసింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 22 మంది ఎంపీలు గెలవడంతో ఆ కార్యాలయాన్ని వారికి కేటాయిస్తున్నట్లు స్పీకర్ శనివారం తెలిపారు. (కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి) మూడో అంతస్తులోని 118 నెంబర్ గదికి టీడీపీ కార్యాలయం తరలించారు. మూడు నెలల కిందటే అయిదో నెంబర్ గది కేటాయించినా ఖాళీ చేయలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. మరోసారి ఓం బిర్లాను కలవడంతో లేఖపై స్పందించారు. ఆయన ఆదేశాలతో పార్లమెంట్ సిబ్బంది.. గ్రౌండ్ ఫ్లోర్‌లోని 5వ నెంబర్ గదికి టీడీపీ బోర్డును తొలగించి.. వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చారు. ఈ కార్యాలయానికి సమీపంలోని ప్రధానమంత్రి మోదీ (పదో నెంబర్ గది), హోం మంత్రి అమిత్ షా కార్యాలయం కూడా ఉంది. -
కేంద్ర బడ్జెట్ : రూపాయి రాక.. పోక..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రెండున్నర గంటలకుపైగా బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు.న్యూ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాని ఏయే మార్గాల ద్వారా ఎంత శాతం ఆదాయం వస్తుంది.. ఏయే పథకాలకు ఎంత శాతం ఖర్చు చేస్తున్నామనేది వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదాయం(రూపాయి రాక) రుణాలు- 20 శాతం జీఎస్టీ, ఇతర పన్నులు- 18 శాతం కార్పొరేట్ ట్యాక్స్- 18 శాతం ఆదాయపు పన్ను- 17 శాతం పన్నేతర ఆదాయం- 10 శాతం కస్టమ్స్ సుంకాలు- 4 శాతం కేంద్ర ఎక్సైజ్ పన్ను- 7 శాతం రుణేతర మూలధన వసూళ్లు- 6 శాతం (చదవండి : కేంద్ర బడ్జెట్ 2020 హైలైట్స్) ఖర్చులు(రూపాయి పోక) కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా- 20 శాతం కేంద్ర ప్రాయోజిక పథకాలు- 9 శాతం సబ్సీడీలు- 6 శాతం వడ్డీ చెల్లింపులు- 18 శాతం రక్షణ రంగం- 8 శాతం కేంద్ర పథకాలు- 13 శాతం పింఛన్లు- 6 శాతం ఆర్థికసంఘం, ఇతర కేటాయింపులు- 10 శాతం ఇతర ఖర్చులు- 10 శాతం -
ట్రావెల్ యూజ్ యు లైక్
-
బడ్జెట్ 2020 : సేద్యం.. వైద్యంపై దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల రంగాలకు పెద్దపీట వేస్తూ గ్రామీణ భారతాన్ని వృద్ధి దిశగా పరుగులు పెట్టించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నినాదాన్ని మరోసారి వినిపించిన ఆర్థిక మంత్రి ఆ దిశగా సాగు రంగానికి నిధుల కేటాయింపులు జరిపే ప్రయత్నం చేశారు. రైతుల సంక్షేమానికి 16 సూత్రాలతో కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించి 100 కరువు జిల్లాల కోసం ప్రత్యేక సాయం కోసం ప్రణాళిక రూపొందిస్తామన్నారు. జీరో బడ్జెట్ ఫార్మింగ్‌కు చేయూత ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. 20 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు అందచేస్తామని వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలోనే తమ తొలి ప్రాధాన్యం వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి అంటూ ప్రజారోగ్యం, పారిశుద్ధ్యానికి మలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఆ దిశగానే సాగు రంగం బాగు కోసం పలు చర్యలు ప్రకటించారు. బ్యాంకుల ద్వారా రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాల జారీకి చర్యలు చేపడతామని చెబుతూ బడ్జెట్లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లను కేటాయించారు. పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు, పైప్డ్ వాటర్ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు కేటాయించారు. ఇక ఆరోగ్యరంగానికి రూ 69,000 కోట్లు కేటాయించడంతో పాటు ప్రధాని జనారోగ్య యోజనకు రూ 6400 కోట్లు ప్రకటించారు. (చదవండి: రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమా!?) -
రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమా!?
సాక్షి, న్యూఢిల్లీ : 2022 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం 2020వ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రధానాంశం. అందుకోసం సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫామింగ్) చేసే రైతులను ప్రోత్సహించడంతోపాటు పైసా ఖర్చు లేకుండా ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్) ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి (ఐదు శాతానికి) చేరుకున్న నేటి పరిస్థితుల్లో అందులో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాల వృద్ధి రేటు కేవలం 2.8 శాతానికి పరిమితం అయినప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా? దేశంలో దాదాపు 60 కోట్ల మంది వ్యవసాయం ఆధారపడి బతుకుతున్నప్పటికీ జీడీపీలో వ్యవసాయం వాటా 18 శాతానికి మించనప్పుడు మరెలా సాధ్యం? దేశంలోని సాధారణ రైతులకు ఎరువులపై, విత్తనాలపై గత ప్రభుత్వాలు సబ్సిడీలు మంజూరు చేయగా, ఆ సబ్సిడీలు ఆశించిన రీతిలో రైతులకు చేరడం లేదని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం డీబీటీ పథకం కింద రైతులకు హెక్టార్‌కు ఐదువేల రూపాయల చొప్పున నేరుగా నగదు బదిలీ చేస్తూ వస్తోంది. అలాగే ఐదెకరాలు భూమి మించని రైతులకు ఏటా ఆరు వేల రూపాయల నగదు బహుమతిని గత ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత భూమి పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ఓ పత్రికా ప్రకటన చేసింది. ఈ నగదు బహుమతి వల్ల వ్యవసాయ భూమి కలిగిన రైతులు లాభపడ్డారుగానీ, కౌలుదారులెవరికీ నయా పైసా లాభం చేకూరలేదు. పదెకరాలలోపు వ్యవసాయం చేసే భూముల్లో ఎక్కువ మంది కౌలుదారులే ఉన్నారు. దేశంలో ఎంత మంది కౌలుదారులున్నారో లెక్కించేందుకు దేశంలో ఇంత వరకు ఏ కసరత్తు జరగతేదు కనుక వారి సంఖ్యను చెప్పలేం. సేంద్రీయ వ్యవసాయదారులను కూడా ప్రోత్సాహిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారంటే సాధారణ రైతులకు హెక్టారుకు ఐదువేల రూపాయల నగదును బదిలీ చేసినట్లే వారికి కూడా ఆ నగదును బదిలీ చేస్తారని ఆశించవచ్చు. ఎందుకంటే ఇంతవరకు వారికి అలాంటి సాయం చేయడం లేదు. నయా పైసా ఖర్చు లేకుండా ప్రకృతిపరంగా చేసే వ్యవసాయాన్ని కూడా ప్రోత్సాహిస్తామని చెప్పారు. అదెలాగో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తేగానీ తెలియదు. ఇదే బీజేపీ ప్రభుత్వం హయాంలో 2018లో పండించిన పంటలకు కనీస మద్ధతు ధరలు లభించక దేశంలోని రైతులు పలుసార్లు ఆందోళనలు, ఆ ఏడాది నవంబర్ నెల ఆఖరి వారం రోజుల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాలకు రైతులు భారీ ప్రదర్శనలు జరిపారు. వారు నిరసనగా కూరగాయలను, పాలను రోడ్ల మీద పారబోసారు. ఆ నేపథ్యంలో 2019 వార్షిక బడ్జెట్లో పైసా ఖర్చులేకుండా ప్రకతిబద్ధంగా వ్యవసాయం చేసే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఆ దిశగా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వ్యవసాయం అనేది రాజ్యాంగపరంగా ఇప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన అంశం. రైతులకు సంబంధించి ఏ హామీనైనా చిత్తశుద్ధితో అమలు చేయాలన్నా కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం, సహకారం ఉండాలి. అందుకు పథకం ప్రవేశపెట్టే దశలోనే రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమంటే ముందుగా వారికి గిట్టుబాటు ధర అందేలా చూడాలి. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండడం వల్ల రైతులకు సరైన న్యాయం చేయలేక పోతున్నామని భావించిన మోదీ ప్రభుత్వం ‘ఎన్ఏఎం (నామ్)’ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రాల పరిధిలో ఉన్న ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్’ కమిటీలను నామ్లో విలీనం చేయాల్సిందిగా మోదీ ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా 2,500 కమిటీలు ఉండగా 2019, నవంబర్ 12వ తేదీ నాటికి వాటిలో 16 రాష్ట్రాల్లోని 585 కమిటీలు మాత్రమే కేంద్ర కమిటీలో విలీనమయ్యాయి. కేంద్ర కమిటీ ఏర్పడినప్పటికీ దాని ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, వాటికి అనుగుణంగా శీతల గిడ్డంగి కేంద్రాలు విస్తరించాలి. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు శీతల వాహనాలను ప్రవేశపెట్టాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలతో నాణ్యమైన ఎరువుల అందేలా చూడాలి. ఇలా ఎన్నో చర్యలు అవసరం. నగదు బదిలీ వల్ల తమకు లాభం చేకూరడం లేదని, ఇంటి అవసరాలకు వాటిని వాడుకోవడం వల్ల విత్తనాలు, ఎరువులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని, ఆ స్కీమ్‌ను రద్దు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నీతి ఆయోగ్’ 2019, అక్టోబర్‌లో నిర్వహించిన ఓ సర్వేలో రైతులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యమేనా? ఇప్పుడు రైతులకు వస్తోన్న ఆదాయం ‘జీరో’ కనుక వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమంటే మరో జీరో చేర్చడం కాదుకదా! ఆ దిశగా నిజంగా చర్యలు తీసుకోవాలంటే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు మొదట వ్యవసాయ సంస్కరణలు తీసుకురావాలి. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
బడ్జెట్లో ప్రాధాన్యతా రంగాలు
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్ర మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. ►రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి పలు సంస్కరణలను చేశారు. ►2019-20 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ జీడీపీలో ద్రవ్యలోటుకు 3.3శాతం కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్ (2020-21)ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంశంలో ప్రభుత్వం సరళీకృత విధానం అవలంభించే అవకాశాలు ఉన్నట్లు బడ్జెట్ స్పష్టం చేస్తుంది. ►ప్రభుత్వం కాలుష్య నివారణ, డిజిటల్ ఇండియా, మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ, నదులను శుభ్రపరచడం తదితర అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చింది. ►ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తు ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండించడంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా కృషి చేస్తున్నట్లు బడ్జెట్ స్పష్టం చేస్తుంది ►దేశం బాగుండాలంటే అందరి ఆరోగ్యాలు బాగుండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ను మరింత మెరుగుపరుచే విధంగా కృషి చేసస్తామని బడ్జెట్ స్పష్టం చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా మహిళలు, శిశువులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ►బడ్జెట్లో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, రక్షణ శాఖ, తయారీ రంగం, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, వైద్య పరికరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. -
మధ్యలోనే ముగించిన బడ్జెట్ ప్రసంగం
-
ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరుగనున్నాయి. వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్ సెస్, ఆటో మెబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది. ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు కస్టమ్స్ పన్నును సైతం తగ్గించింది.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) ధరలు పెరిగేవి ఫర్నీచర్ చెప్పులు సిగరెట్లు పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు కిచెన్‌లో వాడే వస్తువులు క్లే ఐరన్ స్టీలు కాపర్ సోయా ఫైబర్, సోయా ప్రోటీన్ కమర్షియల్ వాహనాల విడిభాగాలు స్కిమ్డ్ మిల్క్ వాల్ ఫ్యాన్స్ టేబుల్‌వేర్ ధరలు తగ్గేవి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్ ఎలక్ట్రిక్ వాహనాలు మొబైల్ ఫోన్ల విడిభాగాలు ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు -
కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ నిరుపయోగమని ఆయన పెదవి విరిచారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన శనివారం పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదు. బడ్జెట్లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. డిపాజిటర్ల బీమ లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం మంచి పరిణామం. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇవ్వాలి. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఆ విధానంలో స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన నిధులు కేటాయించాలి. అలాగే రాష్ట్రానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి. నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది. పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివపక్షతతో చూడటం మంచిది కాదు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను ప్రస్తావించలేదు. ఆన్లైన్లో విద్య పై జీఎస్టీ 18% చాలా ఎక్కువ. మౌలిక వసతులకు బడ్జెట్ ఎలా సమకూరుస్తారనే దానిపై వివరణ ఇవ్వాలి. ఏపీకి ఒక కొత్త రైలు ప్రాజెక్టు కూడా ఇచ్చినట్లు మాకు సమాచారం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ పోర్టులను అభివృద్ధికి సరిపడ నిధులు ఇవ్వాలి.’ అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దవ్యోల్బణం 3.3 శాతం నుంచి 7.35 శాతానికి పెరగడం మంచిది కాదని, వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి స్థూల జాతీయ ఆదాయం (జీఏవీ) వరసగా పడిపోతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఇవాళ్టికి కూడా దాదాపు 70 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్న విషయం మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా 2020–21లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని 6.5 శాతంగా అంచనా వేస్తున్నారని, ద్రవ్యలోటును నియంత్రించడం కోసం ఆహార సబ్సిడీని, వ్యవసాయ రుణాల మాఫీని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం జరుగుతన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని, ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, అందువల్ల వాటిపై ఆలోచన చేయాల్సి ఉందని కేంద్రాన్ని కోరారు. ఇక ఎగుమతుల ప్రోత్సాహం కోసం ఆర్థిక సర్వేలో నెట్వర్క్ ఉత్పత్తులనే ప్రస్తావించారని, వాటితో పాటు సంప్రదాయ ఉత్పత్తులు.. కాఫీ, టీ, స్పైసెస్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. క్షేత్రస్థాయిలో సంపద సృష్టిపై దృష్టి పెట్టారని, ఆ ప్రక్రియలో భాగంగా ఏపీ వంటి రాష్ట్రాలలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించి, వాటిని కేంద్రం ప్రకటించాలని సూచించారు. బడ్జెట్ ఎలా ఉంది? ఈ బడ్జెట్లో కొన్ని సానుకూలం గానూ, మరి కొన్ని ప్రతికూలంగానూ ఉన్నాయని శ్రీ వి.విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో డిపాజిటర్ల ఇన్సూరెన్స్ కవరేజీని (డీజీసీసీ) లక్ష రూపాయల నుంచి 5 లక్షలకు పెంచారని, దీని వల్ల చిన్న డిపాజిటర్లకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇంకా ఈ బడ్జెట్లో ద్రవ్య లోటును 3.8 శాతంగా అంచనా వేశారని, కానీ ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం 3 శాతమే ఉండాలన్న ఆయన, ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. రాష్ట్ర వాటా ఇవ్వాలి వ్యవసాయ రుణాలను రూ.15 లక్షల కోట్లుగా ప్రతిపాదించారని గుర్తు చేసిన వైయస్సార్సీపీ పీపీ నేత, ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి, నిష్పాక్షికంగా రాష్ట్రానికి చెందవలసిన వాటా ఇవ్వాలని కోరారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేస్తామని ప్రధానిగా మోదీ తొలిసారిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారని శ్రీ వి.విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. అయితే ఇప్పటికే మనం 2020లోకి వచ్చామన్న ఆయన, మరి వచ్చే రెండేళ్లలో దాన్ని ఎలా సాధిస్తారని ప్రస్తావించారు. ఇన్నేళ్లు గడిచినా ఎంత వరకు సాధించామన్న ఆయన, ఆ లక్ష్య సాధనకు సంబంధించి విధి విధానాలు ఏవి అని ప్రశ్నించారు. జీఎస్టీ తగ్గాలి విద్య, శిక్షణ రంగాలలో మానవ వనరుల అభివృద్ధి ఇంకా జరగాలన్న వైయస్సార్సీపీ పీపీ నేత, గల్ఫ్ దేశాలకు కూడా అవి తోడ్పడాలని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు కూడా ఆన్లైన్ విద్యపై 18 శాతం జీఎస్టీ ఉందని, కాబట్టి దాన్ని తగ్గించాలని సూచించారు. ఇంకా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారానే నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ నిర్ణయం అభినందనీయమని, కామర్స్ రంగానికి రూ.22 వేల కోట్లు కేటాయింపు మంచిదని చెప్పారు. కొత్తగా 6 న్యూ నెట్వర్క్ సైట్స్ అన్నది మంచి నిర్ణయమన్న శ్రీ వి.విజయసాయిరెడ్డి, అయితే వాటిలో మొబైల్ రంగంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, కాబట్టి ఇప్పటికే ఉన్న వాటిపైనా దృష్టి పెట్టాలని కోరారు. అంత బడ్జెట్ సాధ్యమా? ‘రూ.100 లక్షల కోట్లు మౌలిక వసతులు, సంబంధిత రంగాలపై ఖర్చు చేస్తామన్నారు. హౌసింగ్, మెట్రో, విద్య, విమానాశ్రయాల వంటి రంగాలపై ఆ మొత్తం ఖర్చు చేస్తామన్నారు. కానీ మన పూర్తి బడ్జెట్ చూస్తే కేవలం రూ.24 లక్షల కోట్ల నుంచి రూ.28 లక్షల కోట్లు మాత్రమే ఉంది. మరి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ఎలా ఖర్చు చేస్తారు’ అని సూటిగా ప్రశ్నించారు. ఏపీకి కూడా వాటా రావాలి ఇంకా రైల్వే బడ్జెట్లో ఏపీకి ఒక్క కొత్త ప్రాజెక్టు ఇచ్చినట్లు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా అభివృద్ధి చేయనున్న 100 విమానాశ్రయాలలో ఏపీకి కూడా వాటా రావాలని కోరారు. ‘బేటీ బచావో–బేటీ పడావో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఓ)లో బాలుర కంటే బాలికలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇది సంతోషకర విషయం. అదే విధంగా రూ.28,600 కోట్లు మహిళా సంక్షేమానికి, ఎస్సీ, ఎస్టీ లకు కేటాయింపులు అభినందనీయం’ అని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా-రాయితీలు ఇస్తారని ఎదురు చూశాం.. ‘ఏపీకి సంబంధించి చాలా ఆశించాము. కానీ కేంద్రం మొండిచెయ్యి చూపింది. కేంద్రం పక్షపాత ధోరణి చూపకుండా, దేశమంతా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ అన్న కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకుని, పథకాలు సమానంగా పంచాలని.. కానీ, పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివక్షతో చూడడం అభినందించే విషయం కాదన్నది కేంద్రం గుర్తించాలి. ప్రత్యేక హోదా ఇస్తారని ఎదురుచూశాం. వైయస్సార్సీపీ ఎప్పటి నుంచో దాని కోసం పోరాడుతోంది. ఇంకా పలు రాయితీలు ఇస్తారని చూశాం. ఆదాయపన్ను కానీ, జీఎస్టీ కానీ, బీమాలో కానీ ఎన్నో వస్తాయని చూశాం. కానీ ఏదీ లేదు’ అని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. వెనుకబడిన జిల్లాల నిధుల ఊసే లేదు రాష్ట్రంలో వెనకబడిన 7 జిల్లాలకు సంబంధించి మొత్తం రూ.24,350 కోట్లు రావాల్సి ఉందని, వాటిపై విభజన చట్టంలో స్పష్టంగా చెప్పినా, ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదని అన్నారు. చివరకు కనీసం రూ.2100 కోట్లు కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. పోలవరం ప్రాజెక్టుకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉందన్న విజయసాయిరెడ్డి, ఈ బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలు అందిన తర్వాత, సమగ్రంగా విశ్లేషించి మళ్లీ స్పందిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
‘మోదీ, నిర్మలా సీతారామన్‌కు అభినందనలు’
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 2020-21పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఇది వ్యూహాత్మక బడ్జెట్ అని కొనియాడారు. ప్రజల అంచనాలను నిజం చేస్తూ.. జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి, ప్రాధాన్యతాంశాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మన దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక ఏడాది వరకల్లా మనం చేరాలనుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని తాజా బడ్జెట్ నిర్దేశించిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. (చదవండి : బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, నీటి పారుదల, పారిశుద్ధ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాలకు 2020-21 బడ్జెట్లో వ్యూహాత్మకంగా కేటాయింపులు చేశారని అన్నారు. నూతన టెక్సాలజీ ఆధారిత ఆర్థికవ్యవస్థలో కేంద్రం పాలసీ ఆహ్వానించదగిందని అన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు నవీన భారత నిర్మాణానికి బలాన్నిస్తాయని చెప్పారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ వృద్ధిని పునరుద్ధరించడం, డిమాండ్ పెరగడానికి ఊతమివ్వడం వంటి చర్యలు చేపట్టారని అన్నారు. ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. (చదవండి : కార్పొరేట్ వర్గాలకు, పన్ను చెల్లింపుదారులకు ఊరట!) I must congratulate the Prime Minister Shri Narendra Modi and the Finance Minister Smt. @nsitharaman for giving the country an excellent Budget by addressing the aspirations of the people and at the same time clearly underling our national goals and priorities. — Rajnath Singh (@rajnathsingh) February 1, 2020 -
బడ్జెట్లో ఈ రంగాల ఊసే లేదు
సాక్షి, న్యూడిల్లీ: బడ్జెట్ ప్రసంగంలో తన రికార్డును తనే అధిగమించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ 2020 లో కొన్ని ప్రధాన కీలక రంగాలకు తీరని నిరాశే మిగిల్చారు. ముఖ్యంగా జీఎస్టీ భారం, అమ్మకాలు లేక విల విల్లాడుతున్న ఆటోమొబైల్ కంపెనీ పునరుజ్జీవనానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఆయా కంపెనీలకు ఎలాంటి ఊరట కల్పించకపోవడం తీరని నిరాశ మిగిల్చిందని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే టెలికం కంపెనీల గురించి కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవంటూ సంబంధిత వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అంతేకాదు ఆర్థిక రంగానికి ఎంతో కీలకమైన రియల్ ఎస్టేట్‌రంగ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీనిపై పలువురు ఎనలిస్టులు నిరాశ వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్లో పన్ను ఉపశమనం, ఆర్థిక ఏకీకరణ, గ్రామీణ డిమాండ్ పుంజుకునే చర్యలు, సరసమైన గృహాలపై దృష్టి పెట్టడం, ఆటో రంగానికి ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల వృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ విషయంలో తీవ్ర నిరాశ ఎదురు కావడంతో స్టాక్మార్కెట్లో ఈ రంగ షేర్లు భారీ నష్టాలను మూట గట్టుకున్నాయి. -
బడ్జెట్‌పై రాహుల్ ఏమన్నారంటే...
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ బడ్జెట్లో ఏ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయిందని ఆయన ఆరోపించారు. బడ్జెట్లో నిరుద్యోగుల ప్రస్తావనే లేదని పెదవి విరిచారు. ఉద్యోగ కల్పన కోసం ఏం చేస్తారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. (చదవండి : బడ్జెట్ నిరుత్సాహ పరిచింది: విజయసాయి రెడ్డి) పన్ను చెల్లింపు విధానాన్ని సరళతరం చేస్తామని చెప్పిన ప్రభుత్వం... రెండు మూడు ఆప్షన్లు ఇచ్చి ఈ విధానాన్ని మరింత కఠినతరం చేసిందని మండిపడ్డారు.‘దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఉద్యోగ కల్పన కోసం ఏం చేస్తారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం లేదని ఈ బడ్జెట్‌తో తెలిసిపోయింది’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. (చదవండి : బడ్జెట్లో ఈ రంగాల ఊసే లేదు) కాగా 2020-21బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. లోక్‌సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు. చదవండి : డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్ డిగ్రీ స్థాయిలోనే ఆన్లైన్ కోర్సులు కొత్తగా 5 స్మార్ట్ నగరాలు -
అనారోగ్యం.. మధ్యలోనే ముగించిన బడ్జెట్ ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విత్తమంత్రి ప్రసంగం ఆద్యంతం అధికారపక్ష సభ్యుల కరతాళధ్వనుల మధ్య సాగింది. సుదీర్ఘంగా కొనసాగిన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా షుగర్ లెవల్స్ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే తన ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి ముగించారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో 160 నిమిషాలకుపైగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు బడ్జెట్ ప్రసంగం కావడం విశేషం. గతంలో ఆమె 2017-18 తొలి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. దీంతో తన రికార్డును తానే స్వయంగా అధిగమించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత లోక్‌సభ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
కార్పొరేట్ వర్గాలకు ఊరట!
-
జమ్మూకశ్మీర్‌పై వరాల జల్లు..
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన జమ్మూకశ్మీర్, లదాఖ్‌లపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. 2020-21 సంవత్సరానికి గాను జమ్మూకశ్మీర్‌కు రూ. 30,757 కోట్లు, లదాఖ్‌కు రూ. 5,958 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే దేశంలోని ఐదు పురావస్తు కేంద్రాల అభివృద్దికి, ఆధునీకరణకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై నిర్మల మాట్లాడుతూ.. హరియాణాలోని రాఖీగర్, ఉత్తరప్రదేశ్‌లోని హస్తినాపూర్, అసోంలోని శివసాగర్, గుజరాత్‌లోని ధలోవిరా, తమిళనాడులోని ఆదిచానాల్లురు ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. రాంచీలో ట్రైబల్ మ్యూజియం.. అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు నిర్మల ప్రకటించారు. పారిస్ పర్యావరణ ఒడంబడికకు కట్టుబడి ఉన్నాం... పర్యావరణ రక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న నిర్మల.. పారిస్ పర్యావరణ ఒడంబడికకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 10 లక్షలు జనాభా దాటిన పెద్ద నగరాల్లో పరిశుభ్రమైన గాలి లభించడం సమస్యగా మారిందని నిర్మల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయా నగరాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడం కోసం మొక్కలు నాటనున్నట్టు నిర్మల చెప్పారు. నగరాల్లో కాలుష్య నివారణ కోసం రూ. రూ. 4400 కోట్టు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. జాతీయ భద్రత అనేది తమ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గ్రామీణ భారతానికి శుద్ధమైన తాగునీటిని అందించడానికి జల్ జీవన్ మిషన్‌కు రూ. 3.6 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్ట ప్రకటించారు. రవాణా రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. రవాణా రంగం అభివృద్ధికి ప్రత్యేక వ్యుహాలను సిద్దం చేసినట్టు నిర్మల చెప్పారు. రైల్వేల్లో ప్రైవేటీకరణను మరింతగా పెంచనున్నుట్టు తెలిపారు. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లను నడపనున్నట్టు వెల్లడించారు. అలాగే వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస హైవే పూర్తి చేస్తామన్నారు. పెద్ద సంఖ్యలో తేజాస్ తరహా రైళ్లు, సెమీ హైస్పీడు రైళ్లను తీసుకురావడం ద్వారా రవాణా రంగాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. -
రైతులకు సోలార్ పంపు సెట్లు
-
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు
-
మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు...
-
నూతన వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు ఇవే...
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. శనివారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఈ మేరకు... 0 నుంచి 2.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదని, 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం అలాగే ఉంటుందని తెలిపారు. అదే విధంగా.. రూ. 5-7.5 లక్షల వార్షిక ఆదాయంపై ఇప్పటి వరకు ఉన్న పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి, రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్నును 20 నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు.. అదే విధంగా రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను, రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) అయితే, ఆదాయం పన్నును సరళీకరించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ఏడు స్లాబుల విధానాన్ని ప్రతిపాదించారు. గతంలో ఐదు స్లాబులు మాత్రమే ఉన్న విషయం తెల్సిందే. ఆదాయం పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త స్లాబుల్లో ఏదోఒక స్లాబును ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి ఐదు లక్షల రూపాయల ఆదాయం వరకు వచ్చేవారు ఏ స్లాబును ఎంపిక చేసుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే రెండింటిలోను వారికి తేడా లేదు. ఏడు స్లాబులు గల కొత్త విధానాన్ని ఎంపిక చేసుకునేవారు 80 సీ, 80 డీ కింద వచ్చే మినహాయింపులను వదులు కోవాల్సి ఉంటుంది. వాటిని వదులుకున్నప్పుడే కొత్త విధానం వర్తిస్తుంది. పన్ను మినహాయింపులు వదులుకోదల్చుకోలేని వారు పాత స్లాబులోనే కొనసాగవచ్చు. ఏది ఏమైనా అది వారి ఐచ్ఛికం. అదే విధంగా... కార్పొరేట్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఈ మేరకు కార్పొరేట్ ట్యాక్స్‌లను 15 శాతం తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కార్పొరేట్ ట్యాక్సులను తగ్గించడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి తక్కువ కార్పొరేట్ పన్నులు ఉన్న దేశం భారత్ అని పేర్కొన్నారు. కొత్తగా అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డివిడెండ్ డిస్ర్టిబ్యూషన్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్షియల్ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు చేస్తామని తెలిపారు. -
రుచించని బడ్జెట్, మార్కెట్లు ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 680 పాయింట్లు కుప్పకూలి 40043 వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 11748 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. హెచ్‌యూఎల్, టీసీఎస్, నెస్లే, ఏసియన్ పెయింట్స్ మాత్రమే స్వల్పంగా లాభపడుతున్నాయి. కేంద్ర బడ్జెట్ కారణంగా శనివారం సాధారణ సెలవు అయినప్పటికీ ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో బలహీనంగా ఉన్న మార్కెట్లు తరువాత దాదాపు 120 పాయింట్లకు పైగా పుంజుకున్నాయి. బడ్జెట్ ప్రసంగం మొదలైనప్పటినుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. చివరకు వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ టాక్స్, ఆటో రంగం పై జీఎస్టీ తగ్గింపు లాంటి ఆశాజనక వార్తలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. (మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు...) డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్ ఐడీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం -
బడ్జెట్ ప్రతులతో నిర్మాలా సీతారామన్
-
డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు డిపాజిట్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. డిపాజిట్ దారులకు ఇచ్చే బీమాను రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతానికి బడ్జెట్లో రూ.3,50లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా రెండోసారి ఆమె శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మాలా సీతారామన్ ప్రసంగిస్తూ...బ్యాంకింగ్ రంగంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణ పునరుద్ధరణ గడువును 2021వరకు పొడగించినట్లు ప్రకటించారు. దీని ద్వారా 5లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లబ్ది చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. వేధింపులను కేంద్రం ఉపేక్షించదు స్వచ్ఛమైన, అవినీతరహిత పాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్షమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పన్నుల పేరుతో వేధింపులను కేంద్రం ఉపేక్షించదన్నారు. ‘అవినీతి రహిత భారత్’ తమ ప్రభుత్వ నినాదమని మంత్రి తెలిపారు. పారిస్ పర్యావరణ ఒడంబికకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. నగరాల్లో పరిశుభ్రతమైన గాలి కోసం రూ.4400 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామన్నారు. 2020లో జీ20 సదస్సుకు రూ.100 కోట్లను ప్రకటించారు. లఢక్ అభివృద్ధికి రూ.5958 కోట్లు, జమ్మూకశ్మీర్ కోసం రూ.38,757 కోట్లు కేటాయించారు. చదవండి : విద్యారంగానికి భారీ కేటాయింపు డీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం కొత్తగా 5 స్మార్ట్ నగరాలు.. -
ఐడీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయానికి సిద్ధమవుతోంది. ఆర్థిక బడ్జెట్ 2020లో ఈ మేరకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ప్రభుత్వ పెట్టుబడుల చొరవలో భాగంగా తన వాటాలను విక్రయించనుందని ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీప్రయివేటీకరణ క్రమంలో వాటాను అమ్మకానికి పెట్టింది. అటు ఐడీబీఐ వాటాల విక్రయానికి నిర్ణయం. త్వరలో ఎల్ఐసీ స్టాక్మార్కెట్లో లిస్టింగ్ చేయనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)లో తన హోల్డింగ్‌లో కొంత భాగాన్ని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. ప్రస్తుతం, ఎల్ఐసీలో ప్రభుత్వం 100 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ప్రకటనతో ఐడీబీఐబ్యాంక్ షేర్లు బీఎస్ఈలో 17.4 శాతం పెరిగి 39.8 వద్ద ట్రేడ్ అవుతోంది. ( బడ్జెట్ 2020: ‘ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు’) -
బడ్జెట్ 2020: ‘ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు’
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 2020-21లో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి రూ.85 వేల కోట్లు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి రూ.53 వేల 700 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగుల సంక్షేమానికి రూ. 9500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆమె పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది -
వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..
న్యూఢిల్లీ: రవాణా రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో రూ. 1.7 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం నిర్మల పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 2023 కల్లా ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పూర్తి చేస్తామని.. చెన్నె- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముంబై- అహ్మదాబాద్ మధ్య త్వరలో హైస్పీడ్ రైలు ప్రారంభం కానుందన్నారు. రైల్వేల్లో సోలార్ విద్యుత్ వినియోగం పెంచి.. రైల్వే లైన్ విద్యుదీకరణ చేపడతామని తెలిపారు. అదే విధంగా బెంగళూరులో సబర్బన్ రైల్వే ప్రాజెక్టు కోసం రూ. 1800 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధికై తేజాస్ వంటి మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని... ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో 150 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.(మరింత ఈజీగా జీఎస్టీ...) అదే విధంగా ఉడాన్ పథకం కింద 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నేషనల్ గ్యాస్ గ్రిడ్‌ను విస్తరిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని.. లక్ష గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ అందుబాటులోకి రానుందని తెలిపారు. విద్యుత్ రంగానికి రూ. 22, 000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొత్తగా 5 స్మార్ట్ నగరాలు..
న్యూఢిల్లీ : ఈ ఏడాది కొత్తగా 5 స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం నిర్మల పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టెక్స్టైల్ రంగానికి మరింత ప్రోత్సహం అందిస్తామని చెప్పారు. మొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సహం అందజేస్తామన్నారు. నేషనల్ టెక్స్టైల్ మిషన్‌కు రూ.1480 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అలాగే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి కొత్త పథకానికి తీసుకురానున్నట్టు చెప్పారు. గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్దికి తోడ్పాటు అందిస్తామన్నారు. ల్యాండ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మౌలిక వసతులు అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం తీసుకోస్తున్నట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. (మరింత ఈజీగా జీఎస్టీ: నిర్మలా సీతారామన్) -
అమ్మాయిల వివాహ వయసు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా, శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా తాము తీసుకొచ్చిన బేటీ బచావ్, బేటీ పడావ్ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. మహిళా,శిశు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలపై కేంద్ర బడ్జెట్ 2020 లో రూ .28,600 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు. (బడ్జెట్ 2020 : డిగ్రీ స్థాయిలోనే ఆన్లైన్ కోర్సులు) ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం కోసం ప్రవేశ నమోదులో అబ్బాయిలకన్నా అమ్మాయిల నమోదు ఎక్కువగా ఉందని మంత్రి వెల్లడించారు. బాలికలు ముందు వరుసలో ఉన్నారని, బాలురకన్నా 5 శాతం ఎక్కువ ఉన్నారని తెలిపారు. అలాగే పౌష్టికాహారం, ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కోసం భారీ నిధులను కేటాయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కీలకమైన అంశాన్ని మంత్రి ప్రతిపాదించారు. దేశంలో మహిళ వివాహం చేసుకోవడానికి కనీన వయస్సును 18 సంవత్సరాలు కాగా ఇప్పుడు ఆ వయస్సును పెంచాలని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. అయితే, దీనిపై సమగ్రమైన అధ్యయనం జరగాలని, అందుకోసం ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వచ్చే ఆరు నెలల్లో ఈ టాస్క్‌ఫోర్స్ తన నివేదికను అందిస్తుందని వెల్లడించారు. 6 లక్షల మంది అంగన్వాడీలకు సెల్ఫోన్లు పౌష్టికాహారం, ఆరోగ్యం ప్రత్యేక శ్రధ్ద 2020-21కి నూట్రిషన్ సంబంధిత కార్యక్రమానికి రూ. 35600 కోట్లు 6 నెలలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ చదవండి : బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ -
బడ్జెట్ 2020 : విద్యారంగానికి భారీ కేటాయింపు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. విద్యారంగ అభివృద్ధికి రూ.99,300 కోట్లను కేటాయించారు. స్కిల్ డెవలప్మెంట్కు రూ.3000 కోట్లను కేటాయించామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రిగా రెండోసారి ఆమె శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మాలా సీతారామన్ ప్రసంగిస్తూ.. విద్య, స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. (చదవండి : బడ్జెట్ 2020 : వ్యవసాయానికి పెద్దపీట) 2026 నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం కొత్త కోర్సులు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్లైన్ డిగ్రీ కోర్సులు తీసుకువస్తామన్నారు. విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సీటీని ప్రారంభిస్తామని తెలిపారు. భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి జిల్లా ఆస్పత్రికి ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. -
బడ్జెట్ 2020 : ‘జల్ జీవన్ మిషన్‌కు రూ.3.6 లక్షల కోట్లు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 2020-21లో ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామీణ భారతానికి రక్షిత మంచి నీరు అందించే పథకం ‘జల్ జీవన్ మిషన్’కు పత్యేక ప్రాధాన్యత కల్పించిన కేంద్రం రూ.3.6 లక్షల కోట్లు కేటాయించింది. వ్యవసాయ అనుబంధ రంగాలు, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపులు చేసింది. దీంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.12,300 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆమె పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. (చదవండి : బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) 20 వేల ఆస్పత్రులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రైతుల కోసం కిసాన్ రైల్వే-కిసాన్ ఉడాన్ పథకాలను తీసుకొస్తున్నామని చెప్పారు. పళ్లు, పూలు, కూరగాయల ఎగుమతులకు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ జనరిక్ మందులు లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టీబీని దేశం నుంచి తరిమి కొట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, దానికోసం విసృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రధాని జన ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. -
విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
-
కవితను చదివి వినిపించిన నిర్మల
-
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం
-
బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తనదైన శైలిలో బడ్జెట్ ప్రసంగంలో దూసుకుపోతున్నారు. తమిళ కవితలు, దానికి అర్థాలు చెబుతో సభలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కేంద్ర బడ్జెట్ 2020 లో భాగంగా వ్యవసాయానికి పెద్ద పీట వేసినట్టు చెప్పారు. బడ్జెట్ థీమ్స్‌లో ఆకాంక్ష, ఆర్థికాభివృద్ది, సంక్షేమం ఇవే బడ్జెట్ థీమ్స్ అని ఆర్థికమంత్రి వెల్లడించారు. మొదటి ఆకాంక్షలో భాగంగా ... నైపుణ్యాలు, విద్య, వ్యవసాయం ఉంటాయన్నారు. ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధికి 16 అంశాలతో కార్యచరణ ప్రణాళికలను ప్రకటించారు. తద్వారా అత్యాధునిక వ్యవసాయానిక తోడ్పాటు నిస్తాంమని తెలిపారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తామనీ, 6.11 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యాన్ని అందిస్తామని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమన్నారు. వ్యవసాయానికి సంబంధి 3 కొత్త చట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు. అలాగే కరువు ప్రాంత రైతులను ఆదుకునేందుక చర్యలు తీసుకుంటామని తెలిపారు.నాబార్డు ద్వారా రీఫైనాన్స్ పునురుద్దరిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. వ్యవసాయ వస్తువులను దేశవ్యాప్తంగా త్వరగా రవాణా చేయడానికి వీలుగా కిసాన్ రైలును ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. (మరింత ఈజీగా జీఎస్టీ: నిర్మలా సీతారామన్) వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 2.83 లక్షల కోట్లు గ్రామీణాభివృద్ది రంగాలు రూ. 1.23 లక్షల కోట్లు, స్వచ్ఛభారత్‌కు రూ.12300 కోట్లు సముద్ర మత్స్య వనరుల అభివృద్ధి, నిర్వహణ మరియు పరిరక్షణకు ముసాయిదా 2022-23 నాటికి చేపల ఉత్పత్తిని 200 లక్షల టన్నులకు పెంచనున్నాం. ఫిషరీస్ విస్తరణ పనుల్లో సాగర్ మిత్రాస్ పేరుతో గ్రామీణ యువతకు ప్రోత్సాహం వ్యవసాయ మార్కెట్లను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయాన్ని మరింత పోటీగా మార్చాల్సిన అవసరం ఉంది, వ్యవసాయ-ఆధారిత కార్యకలాపాలను అందిపుచ్చుకోవాలి. స్థిరమైన పంట పద్ధతులకు మరింత సాంకేతిక పరిజ్ఞానం అవసరం బంజరు / తడి భూములలో సౌర యూనిట్లను ఏర్పాటు చేయడానికి రైతులను అనుమతి, గ్రిడ్లకు విద్యుత్ సరఫరా 100 నీటి పీడన జిల్లాలకు సమగ్ర చర్యలు ప్రతిపాదన -
ఆసక్తికరంగా నిర్మల ప్రసంగం..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై ఆమె ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. తన ప్రసంగం ప్రారంభంలో మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీని నిర్మల గుర్తుచేసుకున్నారు. జీఎస్టీ తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని తెలిపారు. జీఎస్టీని తీసుకురావడం చారిత్రత్మకమైన నిర్ణయమని పేర్కొన్న నిర్మల.. శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగిందన్నారు. న్యూ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. (మరింత ఈజీగా జీఎస్టీ: నిర్మలా సీతారామన్) (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇలా కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ సాగుతున్న నిర్మల ప్రసంగం.. ఆకట్టుకునేలా ఉంది. మధ్యలో ఆమె ఓ కవితను కూడా చదివి వినిపించారు. ‘నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం మా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది’ అని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. గతంలో మాదిరిగానే నిర్మల ఈసారి కూడా ఎర్రనీ వస్త్రంతో కూడిన సంచిలో బడ్జెట్ ప్రతులును తీసుకునివచ్చారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం వినేందుకు ఆమె కుమార్తె వాఙ్మయి, ఇతర కుటుంబభ్యులు పార్లమెంట్‌కు వచ్చారు. (జీఎస్టీ : అరుణ్ జైట్లీ ముందు చూపు) -
జీఎస్టీ చరిత్రాత్మకమైనది
-
ఏప్రిల్ 1 నుంచి మరింత ఈజీగా జీఎస్టీ..
సాక్షి, న్యూఢిల్లీ: అన్ని వర్గాల కొనుగోలు శక్తి పెంచే విధంగా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజల ఆదాయం పెంచడమే బడ్జెట్ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె రెండోసారి లోక్‌సభలో బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ... 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం పరిపాలనలో విస్తృతమైన సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా జీఎస్టీ అమలైందని పేర్కొన్నారు. ఇదొక చరిత్రాత్మక సంస్కరణ అన్నారు. అదే విధంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశామన్నారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక భారత్‌లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయన్న నిర్మల... అన్ని రంగాల్లో వృద్ధి రేటు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పెరిగారని తెలిపారు.14 కోట్ల జీఎస్టీ రిటర్న్స్ నమోదైనట్లు వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ నమోదు మరింత సరళతరం కానుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో లబ్దిదారులకు అందడం లేదని.. రూపాయిలో 15 పైసలు మాత్రమే నిజమైన లబ్దిదారులకు వెళ్తున్నాయని.. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు.(బడ్జెట్ 2020: బయోకాన్ చీఫ్ ఆసక్తికర ట్వీట్) -
బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్
-
జీఎస్టీ : అరుణ్ జైట్లీ ముందు చూపు
సాక్షి, న్యూడిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీసుకొస్తున్న యూనియన్ బడ్జెట్ 2020పై భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 1 శనివారం నిర్మలా సీతారామన్ ఆర్థికమంత్రిగా రెండసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దీనికి ముందు ఆమె 15వ ఆర్థిక సంఘం రిపోర్టును సభ ముందు ఉంచారు. రాజకీయ స్థిరత్వంతోపాటు, ఆర్థిక పురోగతిని కాంక్షిస్తూ ప్రజలు తమకు అధికారాన్నిచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ది పథంలో నడిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆర్థికమంత్రి చెప్పారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అన్ని రంగాల్లో వృద్ది రేటు పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఈ క్రమంలో తాము తీసుకొచ్చిన జీఎస్టీ చాలా కీలకమైందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి ఊతమిచ్చేలా ,కొనుగోలు శక్తి పుంజుకునేలా బడ్జెట్ వుంటుందని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. జీఎస్టీ చారిత్రాత్మక నిర్ణయమని, పన్ను రేట్ల శ్లాబుల వల్ల సామాన్యుల నెలవారీ ఖర్చులు తగ్గాయి, తద్వారా వారికి భారీ ప్రయోజనం చేకూరిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్థికమంత్రికి అరుణ్ జైట్లీకి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలో చాలా కీలకమైన జీఎస్టీ విషయంలో జైట్లీ చాలా ముందు చూపుతో వ్యవహరించారంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. (ఐ యామ్ వెయిటింగ్: కిరణ్ ముజుందార్ షా) -
బడ్జెట్ 2020: బయోకాన్ చీఫ్ ఆసక్తికర ట్వీట్
న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోదీ సర్కారు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆవిష్కరించింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్ చీఫ్ కిరణ్ ముజుందార్ షా నూతన బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను కాన్యర్‌తో పోలుస్తూ వైద్య పరిభాషలో ఆసక్తికర ట్వీట్ చేశారు.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ మేరకు... ‘‘మన ఆర్థిక క్యాన్సర్‌కు కీమోథెరపీ కాదు.. ఇమ్యూనోథెరపీ కావాలి. మనం గాయాల గురించి కాదు... దానికి కారణమైన వాటి గురించి ఆలోచించాలి. బడ్జెట్ 2020 ఇలాంటి విధానాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నా. మన ఆర్థిక నిరోధక వ్యవ్యస్థలో సంపద సృష్టి అనేది కీలకమైనది! ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చెబుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆర్థిక క్యాన్సర్‌పై ద్రవ్య విధానం కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలు ఇమ్యూనోథెరపీలో టీ సెల్స్ వంటివి’’ అని కిరణ్ ముజుందార్ షా ట్విటర్లో పేర్కొన్నారు. Fiscal incentives are like CART-Cells to specifically target the economic cancer. Govt investments in infra, healthcare, education etc are like T-Cells to address the malaise broadly. https://t.co/E34R62pGMj — Kiran Mazumdar Shaw (@kiranshaw) February 1, 2020 -
బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్
సాక్షి, న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. లోక్‌సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2020-21 లైవ్ అప్డేట్స్ ఇవి.. 2020-21 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. ధరలు పెరిగేవి ఫర్నీచర్, చెప్పులు ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరేట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు వైద్య పరికరాలపై ఐదు శాతం సెస్ ఆటో మొబైల్ విడిభాగాలకు పెరిగిన కస్టమ్స్ సుంకం ధరలు తగ్గేవి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్కు పన్ను తగ్గింపు ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గింపు ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకుపై కస్టమ్స్ పన్ను తగ్గింపు టెక్స్టైల్ సెక్టార్‌పై ప్రస్తుతమున్న యాంటీ డంపింగ్ డ్యుటీ రద్దు పాన్‌కార్డు, ఆధార్ కార్డు లేకుంటే పాన్‌కార్డు, ఆధార్ కార్డు లేకుంటే లావాదేవీలపై పన్ను వడ్డన పాన్, ఆధార్‌తో లావాదేవీలు జరిపితే ఒక శాతం పన్ను పాన్, ఆధార్ లేకుండా లావాదేవీలు జరిపితే ఐదుశాతం పన్ను రెండున్నర గంటల ప్రసంగం రికార్డుస్థాయిలో రెండున్నర గంటలకుపైగా కొనసాగిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా కొనసాగిన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా షుగర్ లెవల్స్ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే తన ప్రసంగాన్ని ముగించిన ఆర్థిక మంత్రి నిర్మల నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత లోక్‌సభ సోమవారానికి వాయిదా నూతన వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు మధ్య, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు ఆదాయపన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంపు 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను రూ. 5-7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్ను 20 నుంచి 15 శాతానికి తగ్గింపు రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను కార్పొరేట్ ట్యాక్స్ 15శాతం తగ్గింపు కార్పొరేట్ పన్నుల తగ్గింపు విప్లవాత్మక నిర్ణయం ప్రపంచంలో అతితక్కువ కార్పొరేట్ పన్నులు ఉన్న దేశం భారత్ కొత్తగా అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు కార్పొరేట్ ట్యాక్స్ 15శాతం తగ్గింపు కార్పొరేట్ ట్యాక్స్‌లు తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయం డివిడెండ్ డిస్ర్టిబ్యూషన్ ట్యాక్స్ రద్దు బ్యాంకింగ్ రంగంలో మరింత పారదర్శకత రావాల్సిన అవసరముంది చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాల పునరుద్ధరణ గడువు 2021 వరకు పెంపు ఫైనాన్షియల్ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు బ్యాంకుల్లో డిపాజిటర్ల సొమ్ము సురక్షితం డిపాజిట్ భీమా పరిధి రూ లక్ష నుంచి రూ 5 లక్షలకు పెంపు పన్ను అధికారుల వేధింపులను సహించం కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ సహకార బ్యాంకుల పరిపుష్టి గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ షేర్ల అమ్మకం ద్వారా ఎల్ఐసీలోప్రభుత్వ వాటా పాక్షిక విక్రయం ఐడీబీఐ బ్యాంకులోని ప్రభుత్వ వాటా అమ్మకం 2021లో జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుందని ఆశాభావం వచ్చే సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 10శాతం వరకు పెరుగుతుందని ఆశాభావం 2022లో భారత్‌లో జీ 20 సదస్సు పన్ను అధికారుల వేధింపులను సహించం కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ 2022లో భారత్‌లో జీ 20 సదస్సు.. రూ 100 కోట్లతో సన్నాహక ఏర్పాట్లు ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి రవాణారంగ అభివృద్ధికి బడ్జెట్లో కొత్త వ్యూహాలు ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి రాంచీలో ట్రైబల్ మ్యూజియం అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్ మ్యూజియం పర్యాటక అభివృద్ధికి తేజాస్ రైళ్లు రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ.. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లు వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే పూర్తి ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు పెద్దసంఖ్యలో తేజాస్ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లు కరెంటు బిల్లుల స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ ఇ కనుంచి యంత్రాలతో సెప్టిక్ ట్యాంకుల క్లినింగ్ ప్రైవేటు రంగంలో డేటా సెంటర్ పార్క్‌లు ఏర్పాటు కరెంటు బిల్లుల స్థానంలో త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు ఆప్టికల్ ఫైబర్ లింక్‌తో లక్షగ్రామపంచాయతీల అనుసంధానం వివాహ వయస్సు పెంపుపై టాస్క్‌ఫోర్స్ ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయమై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు పాఠశాల స్థాయి ఉన్నత విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారు బేటీ బచావో బేటీ పఢావో గొప్ప విజయం సాధించింది ప్రాథమిక స్థాయి విద్యలో బాలుర కంటే బాలికలే ఐదు శాతం ఎక్కువ ఉన్నారు ఆరు లక్షలమంది అంగన్వాడీలకు సెల్ఫోన్లు పౌష్టికాహారం, హెల్త్‌కేర్‌పై ప్రత్యేక దృష్టి మహిళా సంక్షేమ పథకాల రూ. 28,600 కోట్లు పౌష్టికాహార పథకానికి రూ. 35.6 కోట్లు పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలు నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుంది భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఈ ప్రభుత్వ లక్ష్యం ఎఫ్‌డీఐలు 284 బిలియన్ డాలర్లకు చేరాయి వర్షాభావ జిల్లాలకు అదనపు నిధులు విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి విద్య, స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి 2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం కొత్త కోర్సులు ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్లైన్లో డిగ్రీ కోర్సులు నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్ పరీక్షలు ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీ కొత్తగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ సెల్.. యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ఏర్పాటు ల్యాండ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం ఎలక్ట్రానిక్, మాన్యుఫాక్చరింగ్పై ప్రత్యేక దృష్టి మొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం రంగాలవారీగా కేటాయింపులివే.. జల్‌జీవన్ మిషన్‌కు రూ 11,500 కోట్లు విద్యారంగానికి రూ 99.300 కోట్లు నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు కొత్తగా ఐదు స్మార్ట్ సిటీల అభివృద్ధి నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ ఏర్పాటుకు రూ1480 కోట్లు పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ 9500 కోట్లు టూరిజం ప్రోత్సాహానికి రూ 2500 కోట్లు సాంస్కృతిక శాఖకు రూ 3150 కోట్లు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ 12,300 కోట్లు పైప్డ్ వాటర్ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి ముద్ర స్కీమ్ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం నాబార్డు ద్వారా రీఫైనాన్స్ పునరుద్ధరిస్తాం ఆన్లైన్లో ఆర్గానిక్ ఉత్పత్తులు 16 లక్షలమంది రైతులకు గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు ఈ సారి బడ్జెట్ మూడు రంగాల వృద్ధికి ఊతమివ్వనుంది ఒకటి ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది ఉద్యోగ కల్పన రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్‌తో కూడిన కిసాన్ రైలు ఏర్పాటు సివిల్ ఏవియేషన్ ద్వారా కూరగాయల సరఫరాకు కృషి ఉదాన్ పథకం జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్‌కు చేయూత ఆన్లైన్లో ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయం మా ప్రాధాన్యతా అంశాలు ఇవే తొలి ప్రాధాన్యం : వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి ద్వితీయ ప్రాధాన్యాంశం : ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు మూడో ప్రాధాన్యాంశం : విద్య, చిన్నారుల సంక్షేమం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్ లక్ష్యం రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు 100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు 26 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాం ఇక నుంచి ఇన్‌కం టాక్స్ రిటర్న్‌ల ఫైలింగ్ మరింత సులభతరం చేస్తాం ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కవితను చదివి వినిపించిన నిర్మల నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం మా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రూ లక్ష కోట్ల వరకూ జీఎస్టీ ప్రయోజనాలు సామాన్యులకు మళ్లింపు 40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయి జీఎస్టీ సమస్యల పరిష్కారానికి జీఎస్టీ మండలి చొరవ జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగింది జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయి అదుపులో ద్రవ్యోల్బణం ఎకానమీని సంఘటితపరిచేందుకు చర్యలు ఆరోగ్యకరమైన వాణిజ్య వృద్ధికి తోడ్పాటు ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపట్టింది ద్రవ్యోల్బణం అదుపులో ఉంది జీఎస్టీతో సామాన్యులకు నెలకు 4 శాతం వరకూ ఆదా జీఎస్టీ చరిత్రాత్మకమైనది దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి ఈ బడ్జెట్ దేశ ప్రజల ఆర్థిక స్థోమతను పెంచుతుంది కేంద్రం చేపట్టిన సంస్కరణల్లో జీఎస్టీ చరిత్రాత్మకమైనది ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ కీలకమైనది అందరికీ ఇళ్లు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదు రూపాయిలో 15పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం భారత్‌లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాం ప్రజల ఆదాయాలను మెరుగుపరచడమే బడ్జెట్ లక్ష్యం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ప్రజల్లో కొనుగోలు శక్తిని ముమ్మరం చేస్తాం దివంగత నేత అరుణ్ జైట్లీని గుర్తుచేసిన నిర్మల స్టాక్ మార్కెట్లో బడ్జెట్ జోష్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో పార్లమెంటుకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు వాఙ్మయి, ఇతర కుటుంబసభ్యులు ప్రారంభమైన కేంద్ర కేబినెట్ సమావేశం.. బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ పార్లమెంటు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా పార్లమెంటుకు చేరుకున్న బడ్జెట్ ప్రతులు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో మంత్రులు నిర్మాలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్ శనివారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరుతారు. ఉదయం 10.15గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది. ఈసారి బడ్జెట్‌పై ప్రజలతోపాటు కంపెనీలు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. వేతన జీవులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి. -
బడ్జెట్ 2020 : కేబినెట్ సమావేశం ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మరికొన్ని గంటల్లో ఆవిష్కరించబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు మంత్రులు నిర్మాలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్ శనివారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరుతారు. ఉదయం 10.15గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రివర్గం బడ్జెట్‌ను లాంఛనంగా ఆమోదించనుంది. అనంతరం కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది. ఈసారి బడ్జెట్‌పై ప్రజలతోపాటు కంపెనీలు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. వేతన జీవులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి. -
2020 బడ్జెట్ కేంద్రానికి పెద్ద సవాలే
-
‘లోటు’ పెరిగినా.. వృద్ధికే ఓటు!
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం 2020–21లో 6–6.5 శాతానికి పుంజుకోవచ్చని 2019–20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యాల విషయంలో పట్టువిడుపుగా వెళ్లాలని.. ప్రజలు ఓటుతో ఇచ్చిన బలమైన తీర్పును సంస్కరణలను వేగంగా అమలు చేసేందుకు వినియోగించుకోవాలని.. భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా (అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్) మార్చాలని.. ఆహార సబ్సిడీలను తగ్గించుకోవాలని.. నాణ్యమైన మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడులు అవసరమని.. సంపద, ఉద్యోగ సృష్టికర్తలు అయిన వ్యాపారస్తులను గౌరవంగా చూడాలనే సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 ఆర్థిక బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్చు సమర్పించనున్న విషయం తెలిసిందే. దీనికి ఒక రోజు ముందు శుక్రవారం ఆర్థిక సర్వే నివేదికను ఆమె పార్లమెంటు ముందుంచారు. ద్రవ్యలోటు పరంగా.. 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతానికి పరిమితం చేస్తామని గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. కానీ, కార్పొరేట్ పన్ను కోత, ఇతర పన్నుల వసూళ్లు తక్కువగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటు 3.8 శాతానికి చేరుతుందన్నది నిపుణుల అంచనాగా ఉంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధి రేటును బలంగా పైకి తీసుకురావడమే ప్రాధాన్యమైన అంశంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్య సవరణను పరిశీలించొచ్చని సూచించింది. రూ.1.84 లక్షల కోట్ల మేర ఉన్న ఆహార సబ్సిడీలను తగ్గించుకోగలిగితే ద్రవ్యలోటు విషయంలో ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నాక ప్రభుత్వం తన ఖర్చులను స్థీరీకరించుకోవచ్చని, పలు దేశాలు గతంలో ఇదే మార్గాన్ని అనుసరించాయని పేర్కొంది. మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు.. రెవెన్యూ వ్యయాలను తగ్గించుకోవడంతోపాటు మూలధన వ్యయాలను పెంచుకోవడం ద్వారా ఆస్తులను సృష్టించుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. పెద్ద ఎత్తున పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పునరుద్ధరణకు సాయంగా నిలవడం ద్వారా పెట్టుబడుల ఆధారిత వృద్ధి సాధ్యపడుతుందని అంచనా వేసింది. వ్యాపార నిర్వహణను సులభంగా చేసేందుకు వీలుగా.. పోర్టుల్లో ఎగుమతులు పెంచేందుకు రెడ్ టేపిజం (అధిక నియంత్రణలతో కూడిన విధానాలు)ను తొలగించాలని సూచించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరేందుకు మౌలిక రంగంలో కనీసం 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపింది. ‘‘మౌలిక రంగంలో పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరం. విద్యుత్ కోతలు, చాలీ చాలని రవాణా సదుపాయాలు అధిక వృద్ధి సాధన దిశగ అవరోధంగా నిలుస్తాయి. సాఫీగా, వేగవంతమైన వృద్ధి కోసం భారత్ నాణ్యమైన సదుపాయాల కల్పనకు సకాలంలో తగినన్ని పెట్టుబడులు పెట్టాలి’’ అని ఆర్థిక సర్వే తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు పటిష్టం కావాలి.. అధిక మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) దేశ ఆర్థిక వ్యవస్థలో పరిణామ పరంగా చిన్నగా ఉండడాన్ని సర్వే ప్రస్తావించింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థాయికి వాటిని పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పీఎస్‌బీలు మరింత సమర్థవంతంగా మారడం ద్వారా ఆర్థిక వృద్ధికి చేయూతగా నిలవాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్థంగా లేకపోతే అది ఆర్థిక వ్యవస్థను వినూత్నమైన అవకాశాలను అందుకోలేని వైకల్యంగా మార్చేస్తుందని హెచ్చరించింది. బ్యాంకుల్లో అన్ని కార్యకలాపాలకు ఫైనాన్షియల్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు (ఈసాప్) ఇవ్వడం ద్వారా సమర్థతను పెంచొచ్చని అభిప్రాయపడింది. ‘‘రుణాలకు సంబంధించి నిర్ణయాల్లో, ముఖ్యంగా పెద్ద రుణాల జారీలో బిగ్ డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ను వినియోగించుకునేందుకు జీఎస్టీఎన్ తరహా సంస్థను ఏర్పాటు చేయాలి. రుణ గ్రహీతలను సమగ్రంగా తెలుసుకునేందుకు పీఎస్బీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి’’ అని సర్వే సిఫారసు చేసింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో మెరుగైన ఫలితాలు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సీపీఎస్ఈలు) పెట్టుబడుల ఉపసంహరణను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. గతంలో ప్రైవటీకరించిన సీపీఎస్ఈల పనితీరు ఆదాయం, లాభాలు, నికర విలువ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేసింది. గతంలో ప్రైవేటీకరించిన సీపీఎస్ఈల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ముందు పదేళ్లు, ఆ తర్వాత పదేళ్ల కాలంలో వాటి పనితీరును సర్వే అధ్యయనం చేసింది. హిందుస్తాన్ టెలీ ప్రింటర్స్, ఎంఎఫ్ఐఎల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి కొన్ని కంపెనీలు మినహా మిగిలిన వాటి నికర విలువ, స్థూల ఆదాయం, నికర లాభాల మార్జిన్, ఆదాయాల వృద్ధి అన్నది ప్రైవేటీకరణకు ముందు నాటి కాలంలో పోలిస్తే ప్రైవేటీకరణ అనంతరం కాలంలో ఎంతో మెరుగుపడినట్టు సర్వే వెల్లడించింది. పెట్టుబడుల ఉపసంహరణ అన్నది మొత్తానికి వాటి పనితీరు, ఉత్పాదకతను గణనీయంగా మార్చేసినట్టు తెలిపింది. అధిక లాభదాయకత, సమర్థత పెంపు, మరింత పోటీతత్వం కోసం వేగంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంరహరణను చేపట్టాలని సూచించింది. పన్ను కోతతో లాభం పెద్ద కంపెనీలకే.. కార్పొరేట్ పన్నులో గణనీయమైన తగ్గింపుతో ఎక్కువ ప్రయోజనం పెద్ద కంపెనీలకేనని, చిన్న కంపెనీలు అప్పటికే తక్కువ పన్ను రేటు చెల్లిస్తున్న విషయాన్ని ఆర్థిక సర్వే పేర్కొంది. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. ఈ నిర్ణయం తీసుకునే నాటికే రూ.400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు (దేశంలో 99.1 శాతం ఈ పరిధిలోనివే) 25 శాతం కార్పొరేట్ పన్ను పరిధిలో ఉన్న విషయాన్ని సర్వే ప్రస్తావించింది. అంటే కేవలం 0.9 శాతం కంపెనీలు (4,698 కంపెనీలు) రూ.400 కోట్ల టర్నోవర్ పైగా ఉన్నవి. ఇవి చెల్లించే రేటు 30.9 నుంచి 34.61 శాతం మధ్య (సెస్సులు కూడా కలుపుకుని) ఉంది. దీంతో కార్పొరేట్ పన్ను తగ్గింపు చిన్న కంపెనీలకు 3.2 శాతం నుంచి 13.5 శాతం మేర ప్రయోజనం కలిగిస్తే, పెద్ద కంపెనీలకు 18.5 శాతం నుంచి 27.3 శాతం మధ్య లాభం చేకూర్చినట్టు ఆర్థిక సర్వే వివరించింది. ఇళ్ల ధరలను తగ్గించడం పరిష్కారం! అమ్ముడుపోని ఇళ్లు అధిక సంఖ్యలో ఉండడంతో వీటిని తగ్గించుకునేందుకు నిర్మాణదారులు కొంత మేర ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. రియల్ఎస్టేట్ డెవలపర్లు కొంత మేర హేర్‌కట్ (నష్టం) భరించి ధరలను తగ్గిస్తే త్వరగా అమ్ముడుపోతాయని పేర్కొంది. బిల్డర్లు ఈ విధంగా చేసినట్టయితే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్ షీట్లు సానుకూలంగా మారతాయని తెలిపింది. 2015–16 నుంచి వృద్ధి నిలిచిపోయినప్పటికీ, ఇళ్ల ధరలు అధిక స్థాయిల్లోనే ఉన్నట్లు పేర్కొంది. సంపద సృష్టి ద్వారానే.. సంపదను సృష్టించినప్పుడే దాన్ని పంచడం సాధ్యపడుతుందని ఆర్థిక సర్వే రూపకల్పన బృందానికి నేతృత్వం వహించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు. అనుమానంగా చూడడం, సంపద సృష్టికర్తలను (వ్యాపారవేత్తలు) అమర్యాదగా చూడడం మంచిది కాదన్నారు. జీడీపీ వృద్ధి నిదానించడాన్ని వృద్ధి సైకిల్లో భాగంగానే చూడా లన్నారు. 2011 తర్వాత జీడీపీ రేటును 2.7 శాతం అధికం చేసి చూపిస్తున్నారన్న మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. బలమైన సంస్కరణలు కావాలి 2019–20లో జీడీపీ అంచనా వృద్ధి రేటు 5 శాతం నుంచి 2020–21లో 6–6.5 శాతానికి బలంగా పుంజకుంటుందని తాజా ఆర్థిక సర్వే అంచనా వేసింది. సరైన మోతాదులో సంస్కరణలు, ప్రభుత్వ పెట్టుబడులతో ఈ లక్ష్యం సాధించతగినదే. ఆర్థిక సర్వే అన్నది యూనియన్బడ్జెట్కు ముందస్తు సూచిక. కనుక బలమైన సంస్కరణల చర్యలను ఈసారి బడ్జెట్లో అంచనా వేస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ 6–6.5 శాతం వృద్ధి రేటు సవాలే... డిమాండ్ సైకిల్ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. కరోనా వైరస్ ప్రభావం భారత్ సహా అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. ఇందుకు గతంలో సార్స్ వైరస్ ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని చూడాలి. – రణేన్ బెనర్జీ, పీడబ్ల్యూసీ ఇండియా రికవరీ ఆవశ్యకతను చెప్పింది.. బలమైన ఆర్థిక మందగమనం నుంచి వ్యవస్థ రికవరీ అయ్యేందుకు బలమైన సంస్కరణలను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరాన్ని సర్వే ప్రస్తావించింది. –నిరంజన్ హిరనందాని, అసోచామ్ ప్రెసిడెంట్ -
సంపన్నుల సేవ ఇంకెంతకాలం?
ప్రభుత్వరంగ సంస్థల్లో అధిక పెట్టుబడులు పెట్టడానికి బదులుగా తరుగుతున్న రాబడులకు పరిష్కారంగా భారత ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణే ఏకైక మార్గం అనే మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ ప్రక్రియలో ఉన్న ప్రమాదాలు వెనువెంటనే అవగతం కాకపోవచ్చు కానీ దేశంలో సంపన్నులకు, పేదలకు మధ్య అంతరం మరింత పెరగడం మాత్రం ఖాయం. సమాజంలో అశాంతికి, ఆందోళనలకు సంపదల మధ్య అగాథ పూరితమైన అంతరమే కారణమని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని ఒక శాతం సంపన్న భారతీయులు సమాజంలో అట్టడుగున ఉన్న 95.3 కోట్లమంది లేక మొత్తం జనాభాలో 70 శాతం మంది నిర్భాగ్యుల సంపద కంటే నాలుగు రెట్లు అధిక సంపద పోగేసుకున్నారు. మన దేశంలో 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద 2018–19 కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అతికొద్దిమంది సంపన్నులకు మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడికీ ప్రయోజనం కలిగించే ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నేటి బడ్జెట్ పరీక్షగా మిగలనుంది. భారతీయ ఆర్థిక వ్యవస్థకి 2019 కలిసిరాని సంవత్సరం. కానీ ఈ సంవత్సరం కూడా భారతీయ అతి సంపన్నుల సంపద భారీగా పెరగడం విశేషం. దేశంలోని ఒక శాతం సంపన్న భారతీయులు సమాజంలో అట్టడుగున ఉన్న 95.3 కోట్లమంది లేక మొత్తం జనాభాలో 70 శాతం మంది నిర్భాగ్యుల సంపద కంటే నాలుగు రెట్లు అధిక సంపద పోగేసుకున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన దేశంలో 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద 2018–19 కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టులాడుతోందని ప్రతి సూచి కూడా సూచిస్తోంది. కాగా, 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రులుగా పనిచేసిన వారు అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాలు సృష్టించడం పేరిట కార్పొరేట్ పన్నులను తగ్గిస్తూ వస్తున్నారు. కానీ పన్నుల రాయితీ పొందిన సమయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్పొరేట్ రంగం ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాకుండా పోయాయి. దేశంలో సులభతర వ్యాపార అనుమతుల విషయంలో ర్యాంకులు పైపైకి వెళుతున్నాయి. కార్మిక చట్టాలు, పర్యావరణ సంబంధ క్రమబద్ధీకరణలు బలహీనపడుతున్నాయి కానీ అభివృద్ధి మాత్రం చోటు చేసుకోవడం లేదు. దీనికి బదులుగా ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచిక ప్రకారం, దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో దారిద్ర్యం, ఆకలి పెరుగుతున్నాయి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టి మదుపులు పెంచడానికి బదులుగా మీడియా తాజా వార్తలు సూచించినట్లుగా తగ్గిన ప్రభుత్వ రాబడుల నేపథ్యంలో ఈ సంవత్సరం బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయల వరకు కోత విధించనున్నారు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదంటే ఆశ్చర్యం కలిగించదు. వినియోగదారుల్లో డిమాండ్ తగ్గుముఖం పట్టడం, పెరుగుతున్న నిరుద్యోగం, కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ వంటి తీవ్ర సమస్యలకు పరిష్కారం ఏమిటంటే ప్రభుత్వ వ్యయాన్ని ప్రత్యేకించి కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడమేనని కీన్సియన్ ఆర్థిక సిద్ధాంతం నిర్దేశిస్తోంది. ప్రభుత్వవ్యయం పెంచడమన్నది మొత్తం ఆర్థిక వ్యవస్థకు జీవం పోయడమే కాకుండా మరిన్ని ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న సరకులకు వినియోగదారుల నుంచి డిమాండ్ బలహీనపడినప్పుడు కార్పొరేట్ రంగ పన్నులను తగ్గించడం అనేది ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోయే ఉత్పత్తిలో మదుపు చేసే విషయంలో కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలనూ అందించలేదు. కార్పొరేట్ పన్నులను తగ్గించిన పక్షంలో కంపెనీలు అపార లాభాలను వెనకేసుకుంటాయి. పైగా దేశంలో పేరుకుపోయిన ఆర్థిక అసమానతలను మరింతగా పెంచుతాయి. అంతే తప్ప ఉద్దీపనలు, కార్పొరేట్ రంగానికి పన్ను రాయితీలు ఆర్థిక పెరుగుదలకు ఎంతమాత్రం దోహదపడవు. మొత్తంమీద ఆర్థిక వ్యవస్థకు సరైన చికిత్స ప్రభుత్వ ఖర్చును తగ్గించడమే అని భారత్ ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు చెందిన సంస్థాగత బలహీనతలను ఎవరూ పట్టించుకోరు. అవేమిటంటే పేలవమైన మౌలిక సదుపాయాల కల్పన, మానవ సామర్థ్యాలు తగినంతగా లేకపోవడం, సరకుల ఉత్పత్తిని పెంపొందించగలిగే పొందికైన పారిశ్రామిక విధానం లోపించడం. పన్నులను ఎగ్గొట్టడానికి అనుమతించే కేంద్ర పన్నుల వ్యవస్థలోని చిల్లులను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో వస్తున్న కలెక్షన్లను మరింతగా మెరుగుపర్చవలసి ఉంది. భారతదేశం తన పొరుగుదేశమైన చైనా ఉదాహరణ నుంచి నేర్చుకోవలసిన అవసరముంది. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల్లో భారీ పెట్టుబడులు పెట్టడం, పారిశ్రామికీకరణకు సంబంధించి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రయత్నాలను అత్యంత నిర్దిష్టంగా చేపట్టడం, ప్రత్యేకించి విద్యపై మదుపును చైతన్యవంతంగా పెంచుతూ పోవడం అనేవి దశాబ్దాలుగా చైనా ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటును సాధిస్తూ రావడానికి ప్రధాన కారణాలు. బలిష్టంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో అధిక పెట్టుబడులు పెట్టడానికి బదులుగా తరుగుతున్న రాబడులకు పరిష్కారంగా భారత ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణే ఏకైక మార్గం అనే మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ ప్రక్రియలో ఉన్న ప్రమాదాలు వెనువెంటనే అవగతం కాకపోవచ్చు కానీ దేశంలో సంపన్నులకు, పేదలకు మధ్య అంతరం మరింత పెరగడం మాత్రం ఖాయం. సమాజంలో అశాంతికి, ఆందోళనలకు సంపదల మధ్య అగాథ పూరితమైన అంతరమే కారణమని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పంథాను నిశితంగా గమనించినట్లయితే సామాజిక సంక్షేమరంగాలపై మదుపులో భారీ కోతలు ఖాయమని అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక్క పాఠశాల విద్యలోనే దాదాపు రూ.3,000 కోట్ల వరకు కోత విధించనున్నారు. హాస్యాస్పదమైన అంశం ఏమిటంటే, ఈ సంవత్సరమే భారతీయ బిలియనీర్ల సంపద రోజుకు రూ. 1,710 కోట్లవరకు పెరుగుతూ పోయింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యపై ఇంత భారీ కోత వల్ల విద్యారంగంలో ఇప్పటికే తగినన్ని నిధుల కేటాయింపు లేక కునారిల్లుతున్న పథకాలు తీవ్రంగా దెబ్బతిననున్నాయి. పైగా విద్యా బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించి రూపొందించిన నూతన విద్యా విధానం ముసాయిదా కూడా ముందంజ వేయని పరిస్థితి ఏర్పడింది. దేశంలో 31 కోట్లమంది వయోజనులు నిరక్షరాస్యులుగా ఉంటున్నప్పుడు భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా అవుతుందని ఎలా ఊహించగలం? బహుశా భారతీయ ఆర్థిక విధానంలో అసమానత్వం పట్ల అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శించిన కారణంగానే మన అభివృద్ధి రేటు తగ్గుముఖం పడుతోంది. ప్రపంచ అసమానత్వంపై 2015 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చేసిన విశ్లేషణ చూపుతున్నట్లుగా, 20 శాతం అతి సంపన్నుల ఆదాయ వాటా ప్రతి సంవత్సరం పెరుగుతుండగా, స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) తగ్గుముఖం పడుతోంది. సమాజంలో అట్టడుగున ఉంటున్న 20 శాతం మంది నిరుపేదల ఆదాయం పెరిగినప్పుడే జీడీపీలో పెరుగుదల సాధ్యపడుతుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలతో పరస్పరం ముడిపడివున్న అభివృద్ధి చట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనదని ఐఎమ్ఎఫ్ అధ్యయనకారులు చెబుతున్నారు. అందుకే దశాబ్దాలుగా బలపడుతూ వచ్చిన భారతీయ సంపన్న వర్గం పన్నుల రూపంలో తన న్యాయమైన వాటాను చెల్లించవలసిన సమయం ఆసన్నమైంది. భారతీయ అత్యంత సంపన్నవర్గంపై సంపదపన్నును తిరిగి ప్రవేశపెట్టడం, వారసత్వ పన్ను, సంపద పన్ను వంటివాటిని పటిష్టంగా అమలు చేయడం ద్వారా మాత్రమే భారతదేశం సంపన్నదేశంగా మారగలదు. లాభాలపై డివిడెండ్లను ప్రకటించే రంగాలపై మరింత చురుకైన పన్నుల విధానాన్ని అమలు పర్చడానికి కేంద్రప్రభుత్వం డివిడెండ్ పన్నుపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కొన్నేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న తన దార్శనికతను కేంద్రప్రభుత్వం ఫలవంతం చేయాలంటే, చైనాను అధిగమించాలనే కలను సాకారం చేసుకోవాలంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను వెనక్కు లాగుతున్న సంస్థాగత అవరోధాలను పరిష్కరించాల్సి ఉంది. పైగా దాదాపు వందకోట్లమంది నిరుపేదలు, మధ్యతరగతి, బలహీన వర్గాల సమాధులపై దేశంలోని ఒక్క శాతం సంపన్నులు పునాదులు నిర్మించుకునే క్రమం ఇంకా కొనసాగినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ ముందంజ వేయడం అసాధ్యం. అసంభవం కూడా. అందుకే అతికొద్దిమంది సంపన్నులకు మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడికీ ప్రయోజనం కలిగించే ఆర్థిక వ్యవస్థ రూపకల్పన సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించగలుగుతుందా అనే విషయానికి వస్తే ఈ ఏడాది బడ్జెట్ ప్రభుత్వ చిత్తశుద్ధికి పరీక్షగా మిగిలిపోనుంది. అంజెలా తనేజా (ది వైర్ సౌజన్యంతో) వ్యాసకర్త కేంపెయిన్ లీడ్, ఇనీక్వాలిటీ, ఆక్స్‌ఫామ్ ఇండియా -
ఆర్థిక సర్వే : కొన్ని ముఖ్య విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని సూచించే ఆర్థిక సర్వే 2020ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దేశ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2020-21) 6- 6.5 శాతంగా నమోదు కావొచ్చని సర్వే అంచనా వేసింది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఆర్థిక సర్వే విడుదలయిన నేపథ్యంలో.. కొన్ని ముఖ్య విషయాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సడలించాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది ప్రభుత్వం ఆహారానికి సంబంధించిన సబ్సిడీలను హేతుబద్దీకరించాలని సర్వే అభిప్రాయపడింది. ప్రభుత్వం ధరలను కట్టడి చేయడానికి ఆహార ధాన్యాలను మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు పంపిణి చేసిందని సర్వే తెలిపింది. గత ఏడాది (2019-20) బడ్జెట్లో ఆహార రాయితీల కోసం ప్రభుత్వం రూ .1.84 లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని సర్వే తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యానికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనుందని, పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోనుందని తెలిపారు. మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేసిందుకు ప్రభుత్వం అధికంగా నిధులు సమకూరుస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. రియల్ ఎస్టెట్ కంపెనీలు అమ్ముడుపోని ఇళ్ల ధరలను తగ్గించాలని సర్వే తెలిపింది. ఇళ్ల ధరలను తగ్గించడం ద్వారా అమ్మకాలు పెరిగి బ్యాంకులలో తీసుకున్న రుణాలను చెల్లిస్తారని సర్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమనం దేశ ఎగుమతులపై ప్రభావం చూపించిందని సర్వే తెలిపింది. దశాబ్దకాలంగా ఎన్నడూ లేని విధంగా జులై సెప్టెంబర్‌లో తక్కువ వృద్ధి రేటు (4.5శాతం) నమోదయిందని, చదువు పూర్తయి లక్షలాది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపింది. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి(2019-20) వృద్ధి రేటు 5 శాతానికి అంచనా వేసినా అంతర్జాతీయ మందగమనం కారణంగా అనుకున్న లక్ష్యాలను సాధించలేదని తెలిపింది. -
హోటల్ కంటే.. తుపాకీ కొనడం సులువు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2020 ఆర్థిక వృద్ధిని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 6-6.5 శాతంగా అంచనా వేసింది.2020సంవత్సరానికి ఇది 5 శాతంగా ఉంది. లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాలకు అధ్యక్షుడు రామనాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తరువాత 2019-2020 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అనతరం సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సభ ముందు ఉంచనున్నారు. మరోవైపు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి వి సుబ్రమణియన్ ఎకనామిక్ సర్వే వివరాలను మీడియాకు వివరించారు. రుపాయి నోటు భారత సంపదకు చిహ్నం. అందుకే, సర్వే కవర్ పేజీని వంద రూపాయల నోటు పాత, కొత్త రంగుల మేళవింపుతో వంకాయ రంగులో రూపొందించినట్టు చెప్పారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టికి మార్కెట్ అదృశ్య హస్తం, విశ్వాసం అనేవి రెండు స్తంభాలని సుబ్రమణియన్ అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన మార్కెట్ అదృశ్య హస్తం, నమ్మకంతో మద్దతు ఇవ్వడంపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. భారతదేశం చైనా మధ్య ఎగుమతి పనితీరులో వ్యత్యాసాన్ని స్పెషలైజేషన్ ద్వారా వివరించాలని సుబ్రమణియన్ చెప్పారు. చైనా శ్రమతో కూడిన కారకాలలో ప్రత్యేకత కలిగి ఉంది. భారతదేశం కూడా దీన్ని అనుసరించాల్సిన అవసరం వుంది. దేశంలో ఒక హోటల్‌ను ప్రారంభించడం కంటే, ఒక తుపాకీ లైసెన్సు సంపాదించడం చాలా సులువు అని సర్వే పేర్కొంది. ఒక పిస్తోల్ కలిగి వుండేందుకు కావల్సిన పత్రాల కంటే ఢిల్లీలో ఒక హోటెల్ తెరవాలంటే ఎక్కువ డాక్యుమెంట్లు కావాలని తెలిపింది. ఎకనామిక్ సర్వే 2020 అంచనాలు ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం ప్రభావం మనదేశంపై పడిందని, దానివల్లే పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల ఆర్థిక రంగంలో తిరోగమన సంకేతాలు కనిపించాయని, దశాబ్ద కాలం నాటి పరిస్థితులు ఆర్థిక రంగంలో చోటు చేసుకున్నాయని అంచనా వేసింది. జులై నుంచి సెప్టెంబర్ మధ్య ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ మందగించిందనే విషయాన్ని కేంద్రం అంగీకరించింది. ఆరేళ్ల తరువాత తొలిసారిగా 4.5 శాతానికి క్షీణించిందని పేర్కొంది. అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి ఆర్థిక అంతర లక్ష్యాన్ని సడలించాల్సిన అవసరం ఉందని ఎకనామిక్ సర్వే 2020 తెలిపింది. ప్రస్తుత సంవత్సరానికి ఆర్థిక లోటు లక్ష్యాన్ని సడలించాల్సి ఉంటుందని తెలిపింది. సంపద సృష్టిని పెంచడానికి,మార్కెట్లకు మేలు చేసే ఆర్థిక సర్వేలో పది కొత్త ఆలోచనలను సూచించింది. వచ్చే ఏడాది వృద్ది పుంజుకోవాలంటే సంస్కరణల సరళిని బలంగా అనుసరించాలని సూచించింది. సంపద పంచాలంటే ముందు సంపద సృష్టి జరగాలని తెలిపింది. ఉల్లిపాయల్లాంటి కమోడిటీల ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రయోజనం ఇవ్వలేదని తెలిపింది. వృద్ధికి ఊతమివ్వాలంటే ‘‘అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్’’ సూత్రాన్ని పాటించాలని, తద్వారా నూతన ఉద్యోగాలను సృష్టించాలని సూచించింది. పెట్టుబడుల కోసం విస్తృత అవకాశాలను కల్పిస్తామని తెలిపింది. మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత అవకాశాలను కల్పించడం ద్వారా జీడీపీ రేటును పెంచాలని భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ప్రధానంగా వ్యవసాయ, ఉత్పాదక, సేవ రంగాల పరిధిని విస్తృతం చేస్తామని, ఫలితంగా జీడీపీలో వాటి వాటాను పెంచడానికి అవసరమైన చర్యలను చేపట్టబోతున్నట్టు తెలిపింది. ఆటోమొబైల్ వంటి ఉత్పాదక రంగాల్లో నెలకొన్న మందగమనానికి చెక్ పెట్టడంతోపాటు, వాటి పునరుజ్జీవన దిశగా తమ చర్యలు ఉండబోతున్నాయని సర్వే పేర్కొంది. ఉత్పాదక, పారిశ్రామిక రంగాల్లో నెలకొన్న రెడ్ టేపిజాన్ని తొలగించడానికి పూర్తిస్థాయి చర్యలు చేపడతామని కేంద్రం వెల్లడించింది. పెట్టుబడులను ఆహ్వానించడానికి అవసరమైన అడ్డంకులను నివారిస్తామని, భారత్ పెట్టుబడులు పెట్టడాన్ని, భారత్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని తమ ఆర్థిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తామని, పబ్లిక్ రంగంలో కొనసాగుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు. #EcoSurvey2020 #WealthCreation: Pro-business policies to strengthen the invisible hand: (iii) enable trade for job creation (iv) efficiently scale up the banking sector to be proportionate to the size of the Indian economy. (5/5) @FinMinIndia @PIB_India @nsitharamanoffc pic.twitter.com/LSIvbWGS3B — K V Subramanian (@SubramanianKri) January 31, 2020 -
వృద్ధి రేటు 6 - 6.5శాతం : ఆర్థిక సర్వే
సాక్షి, న్యూడిల్లీ: దేశ వృద్ధి రేటు రానున్న ఆర్థిక సంవత్సరం (2020-21)కు 6నుంచి 6.5శాతం నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2025 సంవత్సారానికల్లా దేశం నిర్దేశించుకున్న5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సర్వే పై రాషష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. రేపు (శనివారం) ఉదయం 11.గంటలకు ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఆర్థిక సర్వే హేతుబద్ద పరిష్కార మార్గాలు సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు సంబంధించిన స్థితిగతులను తెలుసుకోవడంలో ఆర్థిక సర్వే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని సర్వే అభిప్రాయపడింది. తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తే దేశంలో ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందని తెలిపింది. -
అవాంతరాలు అధిగమిస్తేనే 2022 నాటికి రైల్వేకూత
కోనసీమలో రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు దండిగా ఉన్నా అడుగడుగునా అవాంతరాలే ఏర్పడుతున్నాయి. ఒకవైపు నిధుల కేటాయింపు ఆశాజనకంగా ఉంది. ప్రధాన వంతెన పనులు చురుగ్గా సాగుతున్నాయి.రెండొంతుల భూసేకరణ పూర్తయింది. కాని అమలాపురం మండలం భట్నవల్లి నుంచి మలికిపురం మండలం దిండి వరకు భూసేకరణ పూర్తి కాకపోవడంతో రైల్వే నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని కోనసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకునిధుల కేటాయింపుపై జిల్లా వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అమలాపురం: దశాబ్దకాలం నాటి కోనసీమ రైల్వేలైన్‌కు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత భారీగా నిధుల కేటాయింపు జరిగింది. గడిచిన నాలుగు బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.1,030 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.126 కోట్లు కేటాయించాయి. మొత్తం రూ.1,156 కోట్ల నిధులు ఈ ప్రాజెక్టుకు మంజూరయ్యాయి. మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం తొలి అంచనా రూ.1,045.20 కోట్లు కాగా, అది ఇప్పుడు రూ.2,120 కోట్లకు చేరింది. ఇంతవరకు రూ.667.11 కోట్ల విలువ చేసే మూడు ప్రధాన వంతెనల నిర్మాణాలు మొదలయ్యాయి. దీనిలో గౌతమీ మీద వంతెనకు రూ.346.87 కోట్లు, వైనతేయ, వశిష్ఠ నదులపై రూ.320.24 కోట్లకు టెండర్లు ఖరారై పనులు వేగంగా సాగుతున్నాయి. గౌతమీ పనులు వేగంగా సాగుతుండగా, వైనతేయ, వశిష్ఠ పనులు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. మంజూరైన నిధుల్లో వంతెనలకు కేటాయించిన నిధులు పోగా, ఇంకా రూ.488.89 కోట్ల పనులు మొదలు కావాల్సి ఉంది. ప్రధాన వంతెనల నిర్మాణాలు పూర్తయిన తరువాత ట్రాక్ పనులు జరిగే అవకాశముంటుంది. పూర్తికాని భూసేకరణ ప్రధాన వంతెనల నిర్మాణం సంతృప్తికరంగా సాగుతున్నా ట్రాక్ నిర్మాణ పనులకు ఇంతవరకు టెండర్ల ప్రక్రియ మొదలు కాలేదు. ఇందుకు భూసేకరణ పూర్తిస్థాయిలో జరగకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఈ రైల్వే నిర్మాణానికి కోటిపల్లి నుంచి అయినవిల్లి మండలం మాగాం మీదుగా అమలాపురం మండలం భట్నవల్లి వరకు సుమారు 154 ఎకరాల భూసేకరణ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో చించినాడ నుంచి నరసాపురం వరకు దాదాపుగా భూసేకరణ పూర్తయింది. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ వంతెనకు అవసరమైన 14.87 ఎకరాల భూసేకరణ సైతం పూర్తయ్యింది. పాశర్లపూడి వైపు వంతెన నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న మత్స్యకారుల కోసం 3.6 ఎకరాలను సమీపంలోని పాశర్లపూడి బాడవలో రెవెన్యూ అధికారులు సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే వారికి పునరావాసం కల్పించనున్నారు. కాని అమలాపురం మండలం భట్నవల్లి నుంచి రోళ్లపాలెం, పేరమ్మ అగ్రహారం, పేరూరు, తోట్లపాలెం, మామిడికుదురు మండలం పాశర్లపూడి, జగ్గంపేట, రాజోలు నుంచి దిండి వరకు భూసేకరణ పూర్తి కాలేదు. ఇందుకు రైల్వే శాఖ నుంచి భూమికి అవసరమైన ప్రతిపాదన రెవెన్యూ అధికారులకు అందలేదు. దీంతో ఇక్కడ భూసేకరణ ముందుకు సాగడం లేదు. రైల్వే ప్రధాన వంతెనల నిర్మాణం పూర్తయిన తరువాత శాఖ ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతుందని, ఇందుకు సమయం పడుతున్నందునే రైల్వేశాఖ రాజోలు దీవిలో భూసేకరణ ప్రతిపాదనలు వేగంగా చేయడం లేదని పలువురు అంటున్నారు. ట్రాక్ నిర్మాణం వేగవంతం చేస్తేనే లక్ష్యానికి చేరేది నిధులున్నందున ప్రధాన వంతెనలతోపాటు ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టాలని కోనసీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. డెల్టాలో కీలకమైన కోనసీమలో పంట, మురుగునీటి ప్రధాన పంట కాలువలు, చానల్స్, పంట బోదెల వ్యవస్థ ఎక్కువ కావడం వల్ల పెద్ద ఎత్తున వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ రైల్వేట్రాక్‌లో మూడు నదీపాయలపై ప్రధాన వంతెనలు మాత్రమే కాకుండా ఇంకా 185 వరకు వంతెనలు నిర్మించాల్సి ఉంది. దీనిలో 15 పెద్దవి కాగా, 170 వరకు చిన్నవి ఉన్నాయి. ఒక వంతెన మాత్రం రోడ్డుపై నిర్మించాల్సి ఉండగా, రోడ్డుకు దిగువన 48 వంతెనలు నిర్మించాల్సి ఉంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2022 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఆ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కావాలని అనుకుంటే ఇంకా 35 నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచి పెద్ద, చిన్న వంతెనల నిర్మాణాలు మొదలు పెడితే నిర్ణీత షెడ్యూలు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని కోనసీమవాసులు అంటున్నారు. పైగా ఈ ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో రూ.488.89 కోట్లు ఉండనే ఉన్నాయి. అయితే రైల్వేశాఖ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే కోనసీమవాసులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఈ ఏడాది ఎంత? కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్లో కోనసీమ రైల్వేలైన్‌కు కేటాయించే నిధులపై ఈ ప్రాంత వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గత నాలుగు బడ్జెట్లలో కేంద్రం భారీగా నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు 2001–02 నుంచి 2015–16 వరకు కేటాయించిన నిధులు కేవలం రూ.90.2 కోట్లు మాత్రమే. 2016–17 నుంచి నిధులు కేటాయింపు భారీగా పెరిగింది. ఆ ఏడాది రూ.200 కోట్లు, 2017–18లో రూ.430 కోట్లు, 2018–19లో రూ.200 కోట్లు, 2019–20లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కేటాయింపు భారీగా ఉంటుందని కోనసీమ వాసులు ఆశతో ఉన్నారు. త్వరలోనే భూసేకరణ కోనసీమ రైల్వేలైన్‌కు త్వరలోనే భూసేకరణ పూర్తవుతుంది. మత్స్యకారులకు పునరావాసం కల్పించేందుకు 3.6 ఎకరాలను సేకరించాం. రైల్వేశాఖ నుంచి ప్రతిపాదనలు అందగానే భూసేకరణ పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉంది. – బీహెచ్ భవానీశంకర్,ఆర్డీవో, అమలాపురం సమాంతరంగా ట్రాక్‌నిర్మాణం చేయాలి రైల్వే ప్రాజెక్టు నిర్ణీత షెడ్యూలు ప్రకారం పూర్తి కావాలంటే ప్రధాన వంతెనల నిర్మాణాలతోపాటు సమాంతరంగా ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. వంతెనలు ఎక్కువగా నిర్మించాల్సి ఉన్నందున వెంటనే ఆ పనులకు టెండర్లు పిలవాలి. అప్పుడు ఇది 2022 నాటికి పూర్తవుతుంది.– బండారు రామ్మోహన్, కోనసీమరైల్వేసాధన సమితి సభ్యుడు -
ఎన్ఆర్ఐ పాలసీపై ముందడుగు
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): తెలంగాణ ప్రవాసీ విధానం(ఎన్ఆర్ఐ పాలసీ) సమగ్ర రూపకల్పనకు ప్రభుత్వం ముందడుగు వేసింది. మన రాష్ట్రం నుంచి గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వారికి వివిధ రకాల ప్రయోజనాలను అందించడానికి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. ఈ విధానం అమలు ప్రక్రియ తుది దశకు చేరిందని వెలువడుతున్న వార్తలు ప్రవాసుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రవాసీ విధానం అమలు చేస్తామని 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన విషయం విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ఆర్ఐ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎన్ఆర్ఐ పాలసీ ఎలా ఉండాలనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రవాసీ విధానం అమలు చేస్తున్నందన ఆ రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం ఆదేశాలతో ఉన్నతస్థాయి అధికారుల బృందం కేరళ రాజధాని తిరువనంతపురానికి వెళ్లింది. ఆ రాష్ట్ర ప్రవాసీ, సంక్షేమ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇళంగోవన్, నోర్కా రూట్స్ సంస్థ సీఈవో హరికృష్ణ నంబూద్రితో మన అధికారుల బృందం విస్తృతంగా చర్చించింది. అధికారుల కేరళ పర్యటన అనతరం ఎన్ఆర్ఐ పాలసీపై మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం ప్రకటనతో గల్ఫ్ ప్రవాసుల్లో ఉత్సాహం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని, దీని కోసం ఎమ్మెల్యేల బృందాన్ని గల్ఫ్ దేశాలకు పంపి అధ్యయనం చేయిస్తామని చెప్పారు. తాను కూడా గల్ఫ్ దేశాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటానని చెప్పారు. దీంతో ఎన్ఆర్ఐ పాలసీ అమలుకు మార్గం సుమగం అవుతుందని గల్ఫ్ వలస కార్మికులు భావిస్తున్నారు. ఎన్ఆర్ఐ పాలసీకి తుది రూపు తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయించడంపై దృష్టిసారించాల్సి ఉంది. నిధులు కేటాయించడంతో పాటు ఈ నిధుల వినియోగం కోసం మార్గదర్శకాలను జారీచేయాలి. గల్ఫ్ వలసదారులకే ఎక్కువ ప్రయోజనం.. తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు ఉపాధి, ఉన్నత విద్య కోసం వలస వెళ్లిన వారికి ఎన్ఆర్ఐ పాలసీ అండగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రవాసీ విధానంతో గల్ఫ్ వలసదారులకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తున్నారు. సౌదీ అరేబియా, ఒమాన్, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్ దేశాలకు మన వారు అనేక మంది వలసవెళ్లారు. గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న మన రాష్ట్రానికి చెందిన వారు సుమారు 13లక్షల మంది ఉంటారని అంచనా. వీరందరిలో ఎన్ఆర్ఐ పాలసీపై ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలి. ఈ పాలసీ అమలైతే వలస కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అలాగే, 15 సంవత్సరాల పాటు విదేశాల్లో ఉపాధి పొంది ఇంటికి వచ్చిన వారికి ప్రతి నెలా పింఛన్ అందించాలి. వలస కార్మికులు మోసపోకుండా ఉండటానికి నకిలీ ఏజెంట్లను అరికట్టాలి. విజిట్ వీసాల ద్వారా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లకుండా అడ్డుకోవాలి. – గాజుల సంపత్‌కుమార్, అధ్యక్షుడు, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక, సిద్దిపేట జిల్లా వలస కార్మికుల సంక్షేమంపై దృష్టిసారించాలి ఎన్నో ఏళ్లుగా వలసలు కొనసాగుతున్నాయి. వలస కార్మికుల వల్ల మన రాష్ట్రానికి, దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. కానీ, వలస కార్మికుల శ్రేయస్సు కోసం ఎలాంటి పథకాలూ అమలు చేయడం లేదు. ఎవరైనా అనుకోని పరిస్థితిలో గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలను ఇంటికి చేర్చడం ఎంతో ఇబ్బంది అవుతుంది. ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేసి కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు, సేవలు అందించాలి.– కుంట శివారెడ్డి, నిజామాబాద్ జిల్లా(దుబాయి) ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఎన్ఆర్ఐ పాలసీ అమలులో భాగంగా ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఎన్ఆర్ఐ పాలసీ అమలులో ఇప్పటికే జాప్యం జరిగింది. అందువల్ల ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా స్పందించి ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులను కేటాయించాలి. ప్రవాస కార్మికులు ఇంటి వద్ద స్థిరపడాలని అనుకుంటే వారికి రాయితీపై రుణాలు ఇవ్వాలి. ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలి. – దీకొండ కిరణ్‌కుమార్, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ ఎన్ఆర్ఐ పాలసీ అమలైతే ఎన్నో ప్రయోజనాలు ఎన్ఆర్ఐ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తే మన వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఎన్ఆర్ఐ పాల సీని అమలు చేస్తామని గతంలోనే సీఎం చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. కేరళ తరహా విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.– నందిని అబ్బగౌని,జాగృతి అధ్యక్షురాలు, ఖతార్(షామీర్పేట్) -
సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగదు
-
అదిగదిగో.. ఆశల బండి కూత
వైఎస్ఆర్ జిల్లా,రాజంపేట: కేంద్ర ప్రభుత్వం రేపు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఏటా మాదిరిగానే జిల్లా ప్రజానీకం ఈ బడ్జెట్ అయినా తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతుందో..తీపి కబురు చెబుతుందో తెలియడానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. గతేడాది రైల్వేబడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశ పరిచింది. నిధుల కేటాయింపులో కోతలు విధించింది. జిల్లాలో రైల్వేపరమైన అభివృద్ధి విషయంలో వివక్ష కొనసాగుతోందనేది జనం భావన. ఏళ్లతరబడి ప్రాజెక్టులు పెండింగులోనే కొనసాగుతూనే ఉన్నాయి. మూడుదశాబ్దాల తర్వాత నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైన్ అందుబాటులోకి వచ్చినా కొత్తరైళ్లు జిల్లా వైపు కన్నెత్తి చూడటంలేదు. కడప, రాజంపేట, నందలూరు, ఎర్రగుంట్ల, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి. పలురైళ్లు జిల్లాలో ఆగకుండానే వెళుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు రాజధానికి లింక్‌గా డీఎంయు రైళ్లను నడిపించాల్సిన అవసరముందనేది దీర్ఘకాలిక కోరిక. అదీ నెరవేరడం లేదు. వీక్లీ, బైవీక్లీ లాంటి రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలన్న వినతులు రైల్వే ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో ఆర్‌యూబీలునిర్మాణంలో జాప్యం కొనసాగుతోంది. కొన్ని రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు లేవు. ప్రయాణీకుల సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. జిల్లా కు రైల్వేపరిశ్రమ కలేనా.. నందలూరు రైల్వేకేంద్రంలో ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలింది. ఎన్డీఏ హయాంలో ఇది కార్యరూపం దాల్చుతుందని జిల్లా వాసులు ఆశించారు. కేంద్రంలో ప్రభు త్వాలేవి మారినా ఈ పరిశ్రమ ఊసెత్తడంలేదు. నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటుచేయాలని కొన్నేళ్లుగా నానుతు న్న విషయం. రాజంపేట ఎంపీ మిధునరెడ్డి లోక్‌సభలో దీనిపై ప్రస్తావించారు. 250 క్వార్టర్స్‌తో పాటు 150 ఎకరాలు రైల్వేభూమి ఉంది. భూమి విషయంలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. గతంలో రైల్వేమంత్రిగా పనిచేసిన లాలు ప్రసాద్‌యాదవ్ వ్యాగన్ రిపేరువర్క్‌షాపు పెడతామని ప్రకటించారు. కానీ తర్వాత విస్మరించారు. బెంగళూరు లైన్ నిర్మాణం ముందుకెళ్లేదెపుడో... 2008–09 రైల్వేబడ్జెట్‌లో కడప–బెంగళూరు రైల్వేలైను రైలుమార్గాన్ని ప్రకటించారు. ఈ మార్గం పూర్తికావడానికి అంచనా రూ.2050 కోట్లకు చేరుకుంది. 2010 సెప్టెంబరులో అప్పటి రైల్వేమంత్రి మునియప్ప శంకుస్ధాపన చేశారు. 21.8కిలోమీటర్ల మేర తొలిదశపనులు పూర్తయ్యాయి. అక్కడి వరకు డెమోరైలు నడిపిస్తున్నారు. రెండో వదశలో పెండ్లిమర్రి నుంచి రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మీదుగా చిత్తూరు జిల్లా వాయల్పాడువరకు పనులు చేయాల్సి ఉంది. 102వ లైను చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈమార్గంలో పదిశాతం పనులే జరిగాయి. ప్రయాణీకుల రవాణకు నోచుకోనికృష్ణపట్నం రైల్వేలైన్ వైఎస్సార్ జిల్లా, నెల్లూరు జిల్లాలను కలిపే కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్ సరకు రవాణకే పరిమితమైంది. ప్రయాణీకులకు ఈ మార్గంలో వెళ్లే అవకాశం లెేఛీజీ ఈ రైల్వేలైన్‌కు ఇప్పటి వరకు రూ.1186కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అంచనా రూ.1646కోట్లకు చేరుకుంది. వెంకటాచలం–ఓబులవారిపల్లె మధ్య మార్గం పూర్తయి గూడ్స్‌రైళ్లకే పరిమితమైంది. సర్వేలకే రైలుమార్గాలు ♦ కంభం–ప్రొద్దుటూరు రైల్వేలైన్ సర్వే కు గతబడ్జెట్‌లో.1లక్ష మాత్రమే కేటాయించారు. ఈ లైన్ సర్వే దశను దాట ♦ భాకరాపేట–గిద్దలూరు రైల్వేలైన్ గురించి గత బడ్జెట్లో ప్రస్తావనే లేదు. జిల్లాలో రెండు కొత్త రైలుమార్గాలు సర్వేలకే పరిమితమైయ్యాయి. ♦ కడప–గుంతకల్లు–బళ్లారి రైల్వేలైన్ సర్వేకు బడ్జెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే కడప–గుంతకల్లు మధ్య డబుల్‌లైన్ నిర్మితమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఈ లైను అనువుగా ఉంటుంది. సర్వే చేపట్టేందుకు ఆమోదం లభించినా అడుగు ముందుకు పడలేదు. ♦ భాకరాపేట–గిద్దలూరు రైల్వేలైన్ కూడా సర్వేలకే పరిమితమైంది. ఈ కొత్త రైలుమార్గం పురోగతి ప్రశ్నార్ధకరంగా మారింది. ♦ జిల్లా కేంద్రంతో సంబంధం లేకుండా ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్‌లో రాజధానికి రైలునడుస్తోంది. ♦ జిల్లా కేంద్రం నుంచి రాజధానికి రేణిగుంట మీదుగా వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కటే దిక్కయింది. నంద్యాల రైల్వేలైన్విద్యుద్దీకరణ ఎప్పుడో.. ♦ కర్నూలు, వైఎస్సార్జిల్లాలను కలుపుతూఏర్పాటైన ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్నువిద్యుద్దీకరణ (ట్రాక్షన్) చేయనున్నారు. రూ.20కోట్లు కేటాయించారు. 123 కిలోమీటర్ల మార్గంలో దీనివల్ల కరెంటురైలింజన్లు నడిచే అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. ట్రాక్షన్ పూర్తి కావాలంటే రూ111.48కోట్లు వ్యయం చేయాలి. ఇంకా సర్వేదశలోఈ మార్గం విద్యుద్దీకరణ పనులున్నాయి.