సాక్షి, ముంబై : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కనీస కేటాయింపులు లేవని, బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా దానికి సంబందించి కేంద్రం ఎలాంటి కేటాయింపులు జరపలేదని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా అధికార బీజేపీ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుందో వేచి చూడాలి. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్)
Comments
Please login to add a commentAdd a comment