![Maharashtra Opposition MLAs Boycott Oath Session In Assembly](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/7/UBT.jpg.webp?itok=YEJAxQSU)
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ‘మహావికాస్ అఘాడీ’ కూటమి ఎమ్మెల్యేలు నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. దీంతో, వారి నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రతిపక్ష కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. ఈ మేరకు విషయాన్ని యూబీటీ ఎమ్మెల్యే ఆధిత్య థాక్రే వెల్లడించారు. ఈ సందర్బంగా థాక్రే మాట్లాడుతూ.. నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో యూబీటీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయడం లేదు. ఎన్నికల సందర్బంగా ఈవీఎంల విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే అందుకు నిరసనగా నేడు ప్రమాణస్వీకారం చేయడం లేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఈవీఎంల విషయంలోను తప్పు జరిగింది. ప్రజలిచ్చిన తీర్పు అయితే వారంతా సంతోషంగా ఉండేవారు. అలా జరగలేదు కాబట్టే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదని ఆరోపించారు.
మరోవైపు.. ఆధిత్య థాక్రే వ్యాఖ్యలపై మహాయుతి కూటమి నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ప్రతిపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అవసరమైతే న్యాయస్థానాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలి అంటూ సూచనలు చేశారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో సహా పలువురు ప్రమాణం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment