Aaditya Thackeray
-
మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ‘మహావికాస్ అఘాడీ’ కూటమి ఎమ్మెల్యేలు నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. దీంతో, వారి నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రతిపక్ష కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. ఈ మేరకు విషయాన్ని యూబీటీ ఎమ్మెల్యే ఆధిత్య థాక్రే వెల్లడించారు. ఈ సందర్బంగా థాక్రే మాట్లాడుతూ.. నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో యూబీటీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయడం లేదు. ఎన్నికల సందర్బంగా ఈవీఎంల విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే అందుకు నిరసనగా నేడు ప్రమాణస్వీకారం చేయడం లేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఈవీఎంల విషయంలోను తప్పు జరిగింది. ప్రజలిచ్చిన తీర్పు అయితే వారంతా సంతోషంగా ఉండేవారు. అలా జరగలేదు కాబట్టే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదని ఆరోపించారు.మరోవైపు.. ఆధిత్య థాక్రే వ్యాఖ్యలపై మహాయుతి కూటమి నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ప్రతిపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అవసరమైతే న్యాయస్థానాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలి అంటూ సూచనలు చేశారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో సహా పలువురు ప్రమాణం చేశారు. -
కీలక సమావేశానికి షిండే డుమ్మా.. మహాయుతిపై ఆదిత్య ఠాక్రే సెటైర్లు
ముంబై : ‘మహరాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు విడుదలై వారం రోజులవుతుంది. ఇంత వరకూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో స్పష్టత ఇవ్వకపోవడం దారుణం. అధికార మహాయుతి కూటమికి రాష్ట్రంపై ఉన్న అశ్రద్ధకు ఇదే నిదర్శనం’ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.మహరాష్ట్రలోని ప్రస్తుత రాజకీయాలపై ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందించారు. ఫలితాల విడుదలై వారం రోజులవుతున్నా ఓ ముఖ్యమంత్రిని నిర్ణయించలేకపోతున్నారని మహాయుతి కూటమిపై సెటైర్లు వేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. To not be able to decide on a chief minister, and form government, for more than a week after result day, is not just an insult to Maharashtra (for taking our state so lightly) but also to the assistance provided by their dearest Election Commission. It seems that rules only…— Aaditya Thackeray (@AUThackeray) December 1, 2024 ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధికార మహాయుతి కూటమి తీరు చూస్తుంటే నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు వర్తిస్తాయని, అధికార పార్టీలకు వర్తించవని తెలుస్తోంది. గవర్నర్‌కు సంఖ్యాబలం చూపకుండానే ఏకపక్షంగా ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించడం అరాచకం’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుతి కూటమి కీలక సమావేశం జరుగాల్సి ఉంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనూహ్యంగా సతారా జిల్లాలోని తన గ్రామానికి వెళ్లడం చర్చాంశనీయంగా మారింది. ఓ వైపు కీలక సమావేశం ఉన్నా ఏక్నాథ్ షిండే గైర్హాజరు కావడం మహరాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. -
నేను పిలిస్తే.. ఆయన పారిపోయారు : ఆధిత్య ఠాక్రేపై దేవ్రా సెటైర్లు
ముంబై: నేను పిలిస్తే ఆయన ఎందుకు పారిపోతున్నారో నాకు అర్ధం కావడం లేదంటూ శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేపై ఎంపీ మిలింద్ దేవ్రా సెటైర్లు వేశారు.వచ్చే వారంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు వారి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా సవాళ్లు ,విమర్శలు, ప్రతి విమర్శలతో కాకరేపుతున్నారు.ఈ తరుణంలో శివసేన (యూబీటీ) వర్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య ఠాక్రేపై పోటీ చేస్తున్న సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్లీ అభ్యర్థి మిలింద్ దేవ్రా సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మిలింద్ దేవ్రా.. కొన్ని రోజుల క్రితం, వర్లీ భవిష్యత్తు, ముంబై భవిష్యత్తు, మహారాష్ట్ర భవిష్యత్తుపై చర్చకు రావాలని ఆదిత్య ఠాక్రేని ఆహ్వానించాను. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆధిత్య ఠాక్రే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతానని, దానిని బలోపేతం చేస్తున్నానని ప్రచారం చేశారు. ఇప్పుడే అదే విషయంపై చర్చకు రమ్మనమని పిలిచా. కానీ, తాను ప్రజాస్వామ్యానికి అనుకూలమని ఆదిత్య ఠాక్రే పారిపోతున్నారు. అలా ఎందుకు పారిపోతున్నారో? అని విమర్శలు గుప్పించారు. ఓట్లకు శివసేన (యూబీటీ) డబ్బు పంచుతోందని దేవ్రా ఆరోపించారు. నిన్న, అతని ఆదిత్య ఠాక్రే పార్టీ డబ్బు పంపిణీ చేస్తుందని, ఇందుకోసం పెద్ద మొత్తంలో సీసీటీవీ పుటేజీలను అమర్చిందన్నారు. ఇదే విషయం ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే నాయకుడు ఆధిత్య ఠాక్రే’ అని దేవరా విమర్శలు గుప్పించారు. -
వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పండి
ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేకు ఏక్నాథ్ శిందే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అజిత్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి మిలింద్ దేవ్రా వెన్నుపోటు పొడిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ ముగ్గురు మోసగాళ్లకు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అక్కడి తెలుగు ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ)కూటమిని గెలిపించాలని కోరారు. రేవంత్ బుధవారం సాయంత్రం ముంబైలో తెలుగు ప్రజలు నివసించే వర్లీ, ధారావి, సైన్ కోలివాడల్లో ఎంవీఏ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార మహాయుతి కూటమిపై విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ కోడలైన వర్షా గైక్వాడ్‌ను ధారావి నుంచి భారీ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. ఇక్కడి తెలుగు ప్రజల సమస్యలన్నింటినీ ఎంవీఏ ప్రభుత్వం పరిష్కరించేలా తాను హామీగా ఉంటానని తెలిపారు. కాగా వర్లీ బీడీడీ చాల్స్‌లో నివసించే స్థానిక తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డి రోడ్డు షోకు బ్రహ్మరథం పట్టారు. దీంతో రేవంత్‌రెడ్డి కూడా తాను ముంబైలో కాకుండా నిజామాబాద్, కరీంనగర్లో ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. రోడ్డు షోకు ముందు రేవంత్‌రెడ్డి వర్లీ బీడీడీ చాల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ప్రజలు వారి సమస్యలు తెలుపుతూ వినతిపత్రాలు సమరి్పంచారు. -
Thackeray Vs Milind Deora: ‘ఆదిత్య థాక్రే నాకు తమ్ముడితో సమానం’
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక, మరో స్థానాల్లో ఇప్పటికీ ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఆదిత్య థాక్రేపై సీనియర్ నేత మిలింద్ డియోరా బరిలో నిలిచారు. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా మారింది. వీరిద్దరూ వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిచారు.వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మిలింద్ డియోరా మాట్లాడుతూ..‘ఆదిత్య థాక్రేతో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సమస్యలు లేవు. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. తన చిన్నతనం నుంచి ఆదిత్య నాకు తెలుసు. ఆదిత్య థాక్రేను నా తమ్ముడిలా భావిస్తాను. దురదృష్టవశాత్తు దేశంలో ట్రెండ్‌గా మారిన స్పీడ్ బ్రేకర్ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో ఆదిత్య ఠాక్రే రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.ఇదే సమయంలో ఆధిత్య థాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్ధవ్ థాక్రే కూటమి అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలో కీలక ప్రాజెక్టులను ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆదిత్య థాక్రే చాలా వాగ్దానాలతో వచ్చారు. కానీ 11 సంవత్సరాల క్రితం మహాలక్ష్మి రేస్ కోర్స్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించారు. రాష్ట్ర ఖజానాకు రూ. 14,000 కోట్ల నష్టం కలిగించిన మెట్రో ప్రాజెక్టును ఆలస్యం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్ట్‌ను ఆలస్యం చేశాడని తెలిపారు. ఇదిలా ఉండగా.. మాజీ కేంద్రమంత్రి మిలింద్ డియోరా ఇటీవలే లోక్‌సభ ఎన్నికలకు ముందే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. తాజాగా వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిచారు. మరోవైపు.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మంగళవారంతో ముగిసింది. కానీ దాదాపు 15 సీట్లను అధికార, ప్రతిపక్ష కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించని పరిస్థితి నెలకొంది. బీజేపీ, శివసేన( ఏక్నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అధికార కూటమి ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. అదేవిధంగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్ వర్గం), ఎన్‌న్సీపీ( ఎస్పీ వర్గం), కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. #WATCH | Mumbai: Shiv Sena candidate from Worli Assembly seat, Milind Deora holds roadshow ahead of filing his nomination for #MaharashtraElection2024 pic.twitter.com/kt5BpLWhZA— ANI (@ANI) October 29, 2024 -
సేన vs సేన.. ఆదిత్య ఠాక్రేపై మిలింద్ దేవ్రా పోటీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. గెలుపుపై అటు మహాయుతి, ఇటు మహా వికాస్ అఘాడీ కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వాలతో ఎన్నికల వేడిని పెంచాయి. ముంబైలోని వర్లీ నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఆదిత్య ఠాక్రేకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ మిలింద్ దేవ్రాను బరిలో దించాలని సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీ నిర్ణయించింది. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ అభ్యర్థిగా ఆదిత్య థాకరే నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఏక్నాథ్ షిండే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మిలింద్ దేవ్రా దక్షిణ ముంబై నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన సందీప్ దేశ్‌పాండేతో కూడా వర్లీ నుంచి తలపడనున్నారు.కాగా ఆదిత్య థాకరే గురువారం వర్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి కూడా వర్లి ప్రజలు కచ్చితంగా తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. -
అలాంటి వాళ్లతో సావాసమా?, ఆదిత్య ఠాక్రేపై విమర్శలు
ముంబై : ముంబై బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే శివసేన నేత, మాజీ కేబినేట్ మంత్రి ఆదిత్య థాకరేపై విమర్శలు చేశారు. ఓ మహిళను వేధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను ఎలా కలిశారని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తికి ఆదిత్య ఠాక్రే రక్షణ కల్పిస్తున్నారని రాణే ఆరోపించారు. రాణే మాట్లాడుతూ, ‘వార్డ్ నంబర్ 106లో యూబీటీ శివసేన నేత అమోల్ సంసారే అనే వ్యక్తి ఆస్తి కోసం మహిళలను వేధించినందుకు ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం బైయిల్‌పై ఉన్న ఆయన ఆదిత్య ఠాక్రేని కలిశారని అన్నారు. దీని బట్టి మహిళని హింసించిన అమోల్ సన్సారేకు ఆదిత్య ఠాక్రే మద్దతు పలుకుతున్నట్లే కాదా అని రాణే ప్రశ్నించారు. కాగా, నితీష్ రాణే యూబీటీ నాయకులపై విమర్శలు చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేల పేర్లను ప్రస్తావించకుండానే కోవిడ్-19 కాలంలో జరిగిన అన్నీ కుంభకోణాల వెనుక ఉన్నవారు త్వరలో కటకటాల వెనుకకు వస్తారు అని వ్యాఖ్యానించారు. అందుకు యూబీటీ నేత సంజయ్ రౌత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వచ్చే రెండు నెలల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఈడీ, సీబీఐ మూసివేసిన కేసుల్ని తిరిగి విచారణ జరిపిస్తాం. కాబట్టి అనవసర రాద్ధాంతం చేసే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని హెచ్చరించారు. #WATCH | Nitesh Rane Alleges Aaditya Thackeray Planning To Meet #ShivSenaUBT Worker Accused Of Harassing Woman#Mumbai #Maharashtra #BJP pic.twitter.com/AJc49QfmuA — Free Press Journal (@fpjindia) April 7, 2024 -
ఆదిత్య థాక్రేపై కేసు నమోదు
ముంబయి: అనుమతి లేకుండా వంతెనను ప్రారంభించారనే ఆరోపణలతో శివసేన నాయకుడు ఆదిత్య థాక్రేపై కేసు నమోదైంది. లోయర్ పరేల్ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్‌వేను అధికారిక అనుమతి లేకుండా థాక్రే గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ చర్యపై ఆందోళన వ్యక్తం చేసిన ముంబయి పోలీసులు.. కేసు నమోదు చేశారు. లోయర్ పరేల్ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్ వంతెన ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. వంతెనను వాహనదారులు వాడుకోవచ్చని అధికారిక సంస్థలు ఇంకా ధ్రువీకరించలేదు. ఇవేవీ పట్టించుకోకుండా వంతెనను ఆదిత్య థాక్రే ప్రారంభించారు. థాక్రే చర్యలపై పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సునీల్ షింద్, సచిన్ అహిర్లతో పాటు ఆదిత్య ఠాక్రేపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 143, 149, 336, 447 కింద కేసు నమోదు చేయబడింది. ఈ సెక్షన్లు చట్టవిరుద్ధంగా గుమిగూడడం, అల్లర్లు చేయడం, ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య నేరపూరిత నేరాలకు సంబంధించినవి ఉంటాయి. దక్షిణ ముంబయి లోయర్ పరేల్ మధ్య నిర్మిస్తున్న కీలకమైన లింక్ డెలిస్లే బ్రిడ్జ్‌ను జూన్‌లో పాక్షికంగా తెరిచారు. కర్రీ రోడ్ నుండి లోయర్ పరేల్‌ను కలిపే మరో దశ సెప్టెంబర్‌లో ప్రారంభించబడింది. ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ -
బీజేపీ ప్లాన్ అదేనా!.. మహారాష్ట్రలో సీఎం షిండేకు షాక్?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి కాలంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన ప్రభుత్వ కూటమిలో అజిత్ పవార్ వర్గం చేరిపోయింది. దీంతో, అజిత్ పవార్‌కి డిప్యూటీ సీఎం పదవి దక్కగా మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో అటు బీజేపీ నేతలు కూడా ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సర్కార్‌పై ఆధిత్య ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండేను సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయనను బీజేపీ హైకమాండ్ కోరినట్లు తమకు సమాచారం ఉందన్నారు. దీంతో, ఠాక్రే వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇక, అజిత్ పవార్.. షిండే కేబినెట్లో చేరినప్పటి నుంచి మహారాష్ట్రలో సీఎం మార్పు తథ్యం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్య అనుచరుడు, ఎంపీ సంజయ్ రౌత్ కూడా మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ కార్యక్రమంలో రౌత్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరినప్పటి నుండి షిండే గ్రూపులోని దాదాపు 20 మంది శివసేన ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని అన్నారు. షిండే క్యాంపు నుండి 17-18 మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని సంప్రదించారు అని వ్యాఖ్యలు చేశారు. ఇక, వీరి వ్యాఖ్యలపై షిండే వర్గం ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. #WATCH | Mumbai: "I have heard that CM (Eknath Shinde) has been asked to resign and there might be some change (in the govt), says Uddhav Thackeray faction leader Aaditya Thackeray (07.07) pic.twitter.com/IBW7HNfmoB — ANI (@ANI) July 7, 2023 ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీలోకి అజ్ఞాతవ్యక్తి.. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని.. -
‘కాషాయం జెండా.. మనదే శివసేన’
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు యువ నేత ఆదిత్య ఠాక్రే నడుం బిగించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గంలోకి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో చీలికలను అరికట్టేందుకు మూడు రోజులపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలైన భివండీ, నాసిక్, దిండోరీ, సంభాజీనగర్, షిర్డీ తదితర ప్రాంతాల్లో ఆదిత్య ఠాక్రే పర్యటించనున్నారు. ఆ తరువాత రెండో దశ పర్యటనలో మరికొన్ని నగరాలు, పట్టణాలను ఎంచుకోనున్నారు. అందుకు సంబం«ధించిన ప్రణాళికలు పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే ‘మన భగ్వా (కాశాయం జెండా)–మనదే శివసేన’ అనే నినాదంతో ప్రధాన నగరాలు, పట్టణాలను పర్యటిస్తూ ప్రజలతో సంప్రదింపులు జరుపనున్నారు. అదేవిధంగా నియోజక వర్గాలలోని శివసేన ప్రతిని«ధులు, పదాధికారులు, కార్యకర్తలతో చర్చిస్తారు. శిందే వర్గంలో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. శిండే వర్గంలో చేరికల వల్ల శివసేన రోజురోజుకూ బలహీన పడుతోంది. పదాధికారులు, కార్యకర్తలు మనోస్ధైర్యాన్ని కోల్పుతున్నారు. చీలికలను నియంత్రించేందుకు శివసేన పార్టీ ప్ర«ధాన కార్యాలయమైన సేనా భవన్లో ఉద్ధవ్ ఠాక్రే తరచూ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ పార్టీ నుంచి బయటపడే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో తండ్రి ఉద్ధవ్ ఠాక్రేపై పడుతున్న అదనపు భారాన్ని కొంతమేర తన భుజస్కందాలపై వేసుకోవాలని ఆదిత్య భావించారు. అందులో భాగంగా ఇటీవల నెలకొన్న తాజా పరిణామాలతో ఆత్మస్ధైర్యం కోల్పోయిన శివసైనికులను ఓదార్చడం, వారికి మనోధైర్యాన్ని నూరిపోసేందుకు యువనేత నడుం బిగించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ శిందే, ఆయన శిబిరంలో చేరిన మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై తీవ్ర విమర్శలు గుప్పించనున్నారు. వీరంతా శివసేనను మోసగించిన తీరును ప్రజల ముందు ఎండగట్టనున్నారు. బలహీనపడుతున్న శివసేనను తిరిగి పటిష్టం చేయడానికి తనవంతుగా ప్రయత్నం చేయనున్నారు. బాల్ ఠాక్రే బతికుండగా శివసేన పార్టీ గర్జించే సింహం లాగా కనిపించేదని, ఇప్పుడు అదేవిధంగా శివసేన పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
Shiv Sena: ఆగని ఫిరాయింపులు.. ఆదిత్య ఠాక్రే కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు యువ నేత ఆదిత్య ఠాక్రే నడుం బిగించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గంలోకి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో చీలికలను అరికట్టేందుకు మూడు రోజులపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలైన భివండీ, నాసిక్, దిండోరీ, సంభాజీనగర్, షిర్డీ తదితర ప్రాంతాల్లో ఆదిత్య ఠాక్రే పర్యటించనున్నారు. ఆ తరువాత రెండో దశ పర్యటనలో మరికొన్ని నగరాలు, పట్టణాలను ఎంచుకోనున్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే ‘మన భగ్వా (కాశాయం జెండా)–మనదే శివసేన’ అనే నినాదంతో ప్రధాన నగరాలు, పట్టణాలను పర్యటిస్తూ ప్రజలతో సంప్రదింపులు జరుపనున్నారు. అదేవిధంగా నియోజక వర్గాలలోని శివసేన ప్రతినిధులు, పదాధికారులు, కార్యకర్తలతో చర్చిస్తారు. శిందే వర్గంలో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఏక్నాథ్ శిందే తిరుగుబాటు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఊహించని విధంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం పడిపోయింది. ఆ తరువాత ఏక్నాథ్ శిందే బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని విధంగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గట్ నాయకులు, శాఖ ప్రముఖులు, విభాగ ప్రముఖులు, కార్పొరేటర్ స్ధాయి నుంచి ఎమ్మెల్యేల స్ధాయి వరకు ఇలా అనేక మంది శిందే వర్గంలో చేరుతున్నారు. తాజాగా మరో 12 మంది శివసేన ఎంపీలు శిందే వర్గంలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా దశల వారిగా కిందిస్ధాయి కార్యకర్త నుంచి పైస్ధాయి ఎంపీల వరకు శివసేనతో తెగతెంపులు చేసుకుంటున్నారు. శిందే వర్గంలో చేరికల వల్ల శివసేన రోజురోజుకూ బలహీన పడుతోంది. పదాధికారులు, కార్యకర్తలు మనోస్ధైర్యాన్ని కోల్పుతున్నారు. చీలికలను నియంత్రించేందుకు శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన సేనా భవన్లో ఉద్ధవ్ ఠాక్రే తరచూ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ పార్టీ నుంచి బయటపడే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రేపై పడుతున్న అదనపు భారాన్ని కొంతమేర తన భుజస్కందాలపై వేసుకోవాలని ఆదిత్య భావించారు. అందులో భాగంగా ఇటీవల నెలకొన్న తాజా పరిణామాలతో ఆత్మస్ధైర్యం కోల్పోయిన శివసైనికులను ఓదార్చడం, వారికి మనోధైర్యాన్ని నూరిపోసేందుకు యువనేత నడుం బిగించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ శిందే, ఆయన శిబిరంలో చేరిన మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై తీవ్ర విమర్శలు గుప్పించనున్నారు. వీరంతా శివసేనను మోసగించిన తీరును ప్రజల ముందు ఎండగట్టనున్నారు. బలహీనపడుతున్న శివసేనను తిరిగి పటిష్టం చేయడానికి తనవంతుగా ప్రయత్నం చేయనున్నారు. బాల్ ఠాక్రే బతికుండగా శివసేన పార్టీ గర్జించే సింహం లాగా కనిపించేదని, ఇప్పుడు అదేవిధంగా శివసేన పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
మాపై ఉన్న ద్వేషాన్ని ముంబై పై చూపించొద్దు: ఆదిత్య థాక్రే
ముంబై: శివసేన బీజేపీతో ఆది నుంచి వ్యతిరేకిస్తున్న ముంబైలోని వివాదాస్పదమైన మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టు పనులును ప్రారంభిస్తోంది ఏక్నాథ్ షిండే ప్రభుత్వం. దీంతో మాజీ మంత్రి ఆదిత్య థాక్రే మాపై ఉన్న ద్వేషాన్ని ముంబైపై చూపించొద్దు అంటూ అభ్యర్థించారు. మెట్రో కార్‌షెడ్ ప్రాజెక్టు కోసం పచ్చని అటవీ ప్రాంతన్ని నాశనం చేయవద్దని కోరారు. ఆరే అనే అటవీ ప్రాంతంలో ఈ మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయితే ఇది సుమారు 800ల ఎకరాలకు పైగా ఉన్న అటవీ ప్రాంతం. చుట్టు పక్కల చిరుతలు వంటి ఇతర జీవ జాతులు సంచరిస్తూ ఉండే ఆహ్లదభరితమైన ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో నాశనం చేయవద్దని థాక్రే విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ విషయమై పర్యావరణ కార్యకర్తలు భారీ నిరసనలు చేపట్టిన సంగతిని సైతం ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మెట్రో కార్ షెడ్ కోసం గుర్తించిన ప్రాంతం జీవవైవిధ్యం లేదా అటవీ భూమిగా వర్గీకరించబడలేదని, మెట్రో కార్బన్ని తగ్గిస్తుందంటూ వాదించారు. ఆ తర్వాత నిరసనకారుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని మెట్రో కార్ షెడ్‌ను కంజుర్‌మార్గ్‌కు మార్చాలని నిర్ణయించింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2020లో బాంబే హైకోర్టుకు వెళ్లింది. పైగా ఈ భూమి తమ ఉప్పు శాఖకు చెందినదని పేర్కొంది. దీంతో హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. అధికార పగ్గాలు చేపట్టంగానే ఏక్నాథ్ షిండే కక్ష్య సాధింపు చర్యలు మొదలు పెట్టారనే చెప్పాలి. అంతేకాదు ఏక్నాథ్ షిండే అధికారం చేపట్టిన వెంటనే ఆగిపోయిన ముంబై మెట్రో పనులను తిరిగి ప్రారంభమవ్వడం విశేషం. (చదవండి: మహారాష్ట్ర స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్.. థాక్రేకు షాక్) -
Aaditya Thackeray: మరాఠా రాజకీయాల్లో యువతార
మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన వంశం వారిది. అయినా మూడో తరం వరకు ప్రత్యక్షంగా పోటీ చేసిన దాఖలాలు లేవు. తాత స్థాపించిన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచి అరుదైన రికార్డు లిఖించిన ఘనత శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే సొంతం. శివసేన పార్టీ యూత్ ఐకాన్‌గా వర్తమాన రాజకీయాల్లో వెలిగిపోతున్న 32 ఏళ్ల ఆదిత్య ఠాక్రే.. తన తండ్రి కేబినెట్లో మంత్రిగా కొనసాగుతుండడం విశేషం. మహారాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. సోమవారం (జూన్ 13) ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. జననం: జూన్ 13, 1990 (బుధవారం) పుట్టిన ఊరు: ముంబై తల్లిదండ్రులు: ఉద్ధవ్, రష్మీ ఠాక్రే తమ్ముడు: తేజస్ ఠాక్రే (వన్యప్రాణుల పరిశోధకుడు) పూర్తి పేరు: ఆదిత్య రష్మీ ఉద్ధవ్ ఠాక్రే పాఠశాల విద్య: బాంబే స్కాటిష్ స్కూల్, ముంబై ఉన్నత విద్య: సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి బీఏ న్యాయ విద్య: కేజీ లా కాలేజీ నుంచి న్యాయ పట్టా ఆహారపు అలవాటు: నాన్వెజిటేరియన్ వ్యక్తిగత వివరాలు: ఇంకా పెళ్లి కాలేదు హాబీస్: కవితలు చదవడం.. రాయడం, ట్రావెలింగ్, క్రికెట్ ఆడటం ఆస్తుల విలువ: 16.05 కోట్లు (2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం) పొలిటికల్ జర్నీ: ► 2010లో రాజకీయ అరంగ్రేటం, శివసేన పార్టీలో చేరిక ► జూన్ 17, 2010లో శివసేన యూత్ విభాగం ‘యువ సేన’ స్థాపన ► యువసేన అధ్యక్షుడిగా తాత బాల్ ఠాక్రే చేతుల మీదుగా నియామకం ► రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, బిహార్, జమ్మూకశ్మీర్‌లకు యువసేన విస్తరణ ► 2018లో శివసేన జాతీయ కార్యవర్గ కమిటీలో స్థానం ► 2019 అక్టోబర్‌లో ముంబైలోని వర్లీ స్థానం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ ► 67,427 మెజారిటీతో ఎమ్మెల్యేగా ఘన విజయం ► డిసెంబర్ 30, 2019లో మహారాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం ► మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో యువ మంత్రిగా గుర్తింపు ► మహారాష్ట్ర పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణ వివాదాలు: ► రోహింటన్ మిస్త్రీ పుస్తకాన్ని ముంబై యూనివర్సిటీ సిలబస్ నుంచి తొలగించాలని 2010, అక్టోబర్‌లో ఆందోళన ► సుధీంద్ర కులకర్ణిపై 2015, అక్టోబర్ 12న శివసేన సిరా దాడి, సమర్థించిన ఆదిత్య ఠాక్రే ► 2014 మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా గుజరాతీలు, మరాఠేతరులపై ‘సామ్నా’లో వివాదాస్పద వ్యాఖ్యలు, క్షమాపణ మరికొన్ని: ► శివసేన యూత్ విభాగం యువసేన అధ్యక్షుడిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు ► ‘మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్’ పేరుతో 2007లో తన కవిత సంపుటి ప్రచురణ ► స్వంతంగా పాటలు రాసి 2008లో ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ రూపకల్పన ► బాల్ ఠాక్రే సమక్షంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మ్యూజిక్ ఆల్బమ్ విడుదల ► 2017లో ముంబై జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక చదవండి: ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది -
వంతెనను ప్రారంభించిన మహరాష్ట్ర మంత్రి.. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా
ముంబై: మహరాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన గ్రామానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నేడు సాకారమైంది. మహరాష్ట్ర టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్యఠాక్రె శుక్రవారం నాసిక్‌లోని మారుమూల గ్రామమైన షేండ్రిపాడలో నిర్మించిన వంతెనను శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వెదురుతో ఒక వంతెనను నిర్మించుకున్నారు. దీనిపై నుంచే తాగునీటి కోసం.. ఇతర పనుల కోసం రాకపోకలు చేసేవారు. ఈ క్రమంలో ఎందరో ఆ లోయలో పడి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల విన్నపం మేరకు, మహా సర్కారు తక్కువ సమయంలోనే వంతెనను నిర్మించి, శుక్రవారం ప్రారంభించింది. కాగా, వంతెన అందుబాటులోకి రావడంతో ఆ గ్రామస్థులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గిరిజనులు నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. #WATCH | Maharashtra Minister Aaditya Thackeray inaugurated a bridge and interacted with locals in Shendripada, a remote tribal village in Nashik earlier today pic.twitter.com/aPdI2iYOkN — ANI (@ANI) January 28, 2022 చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్ -
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం ఆ రాష్ట్ర మంత్రి కేంద్రానికి లేఖ..!
ముంబై: గత కొద్ది రోజుల నుంచి టెస్లా కంపెనీని తమ రాష్ట్రంలో అంటే.. తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయలని అనేక రాష్ట్రాల మంత్రులు పోటీ పడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, మహారాష్ట్రకు చెందిన ఈ మంత్రి మాత్రం.. టెస్లా కంపెనీకి అనుకూలంగా ఒక లేఖను కేంద్రం మంత్రికి రాశారు. మహారాష్ట్ర పర్యాటక & పర్యావరణ మంత్రి ఆదిత్య థాక్రే వచ్చే నెల ప్రారంభంలో సమర్పించనున్న రాబోయే కేంద్ర బడ్జెట్ 2022-23లో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను కేంద్రం తగ్గించాలని కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. థాక్రే రాసిన లేఖలో ఇలా ఉంది.. "టెస్లా, రివియన్, ఆడీ, బిఎమ్‌డబ్ల్యు వంటి దిగ్గజ సంస్థలకు రిటైల్ అమ్మకం కోసం దిగుమతి కస్టమ్స్ సుంకల మీద కాలపరిమితితో కూడిన రాయితీ రేటు ఇవ్వాలి. ఇది మార్కెట్లో డిమాండ్ పెంచడంతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సహకరిస్తుంది. అమ్మకాలు పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే, ఇలాంటి దిగ్గజ కంపెనీల నాయకత్వాన్ని అనుసరించడానికి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది" అని పేర్కొన్నారు. రాయితీ రేటు గరిష్టంగా మూడు సంవత్సరాలు ఇవ్వాలని, భారతదేశంలో ప్రపంచ ప్రమాణాలను పాటించే ఎలక్ట్రిక్ వాహనలను మాత్రమే విక్రయించాలని ఆయన సూచించారు. I have written to the Hon’ble Finance Minister of India Smt. Nirmala Sitharaman ji a few humble suggestions to give a boost to the Electric Mobility revolution in India. pic.twitter.com/MstdI20oke — Aaditya Thackeray (@AUThackeray) January 19, 2022 40 శాతం డిస్కౌంట్ కావాలి భారతదేశంలో ఇతర దేశాలలో తయారు చేసిన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకొని విక్రయించాలని టెస్లా చూస్తుంది. కానీ, మన దేశంలో దిగుమతి పన్నులు ప్రపంచంలో అత్యధికంగా ఉన్నాయని గతంలో మస్క్ చెప్పారు. టెస్లా బేసిక్ మోడల్ 3 కారు ధర $39,990(సుమారు రూ.30 లక్షలు). విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది. ఈ సుంకల వల్ల ఈ కారు ధర రూ.60 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ భావిస్తుంది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా కేంద్రంతో వాదిస్తుంది. అదనంగా 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. -
మౌనం వీడిన ఉద్ధవ్ ఠాక్రే : కంగనాపై ధ్వజం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై మరోసారి ధ్వజమెత్తారు. శివసేన దసరా ర్యాలీలో ఆయన కంగనాపై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసులో తన కుమారుడు ఆదిత్య థాకరేపై వచ్చిన ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం మౌనం వీడారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటే, బిహార్ పుత్రుడు బలవన్మరణం చెందాడని ప్రచారం చేశారంటూ ఎద్దేవా చేశారు. అలాగే కొంతమంది మహారాష్ట్ర బిడ్డలను, ముఖ్యంగా తన కుమారుడు ఆదిత్యను కూడా దుర్భాషలాడారని ఆరోపించారు. కానీ తాము మాత్రం ఎలాంటి కళంకం లేకుండా ఉన్నామని స్పష్టం చేశారు. న్యాయం తమవైపే ఉందని ఆయన పేర్కొన్నారు. బతుకు దెరువు కోసం ముంబైకి వచ్చిన కొంతమంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె) అంటూ ముంబై నగరానికి అప్రతిష్టను ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు తాము ఇంట్లో తులసి మొక్కలు పెంచుతాం, గంజాయి కాదు...ఈ విషయం వారికి తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి క్షేత్రాలు వాళ్ల రాష్ట్రంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో తిండికి గతి లేక ఇక్కడకు వచ్చి డబ్బులు సంపాదించుకుని ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చి పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నమ్మకద్రోహలుగా మిగిలిపోతారన్నారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, కంగనా ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పోకె) తో పోల్చడం వివాదం రేపింది. దీంతో ఆమె ముంబై వీడి కంగనా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ వెళ్లిపోవాలని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మండిపడ్డారు. అక్రమ నిర్మాణమంటూ కంగనా ఆఫీసును బీఎంసీ కూల్చి వేసింది. దీనికి రూ .2 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తూ కంగనా బొంబాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
నేను చేసిన పెద్ద నేరం అదే: కంగన
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బాలీవుడ్ మూవీ మాఫియా, డ్రగ్ రాకెట్ గురించి బయటపెట్టినందు వల్లే తనపై కక్షగట్టారని ఆరోపించారు. అన్నింటికీ మించి తన తనయుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం ఆయనకు పెద్ద సమస్యగా పరిణమించిందని, తాను చేసిన పెద్ద నేరం ఇదేనంటూ కంగన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి: జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు) ఈ మేరకు.. ‘‘ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు ఆదిత్య ఠాక్రేకు వినోదం పంచే మూవీ మాఫియా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హంతకులు, డ్రగ్స్ రాకెట్ గురించి నేను బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న అసలైన సమస్య, నేను చేసిన అదిపెద్ద నేరం ఇదే. అందుకే వాళ్లు నాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు, సరే చూద్దాం.. ఎవరు ఎవరిపై పగ తీర్చుకుంటారో!!!’’ అని కంగన ట్విటర్ వేదికగా సవాల్ విసిరారు. (చదవండి: వాళ్లతో స్నేహం చేయడం నేరమా: ఆదిత్య ఠాక్రే) ఆదిత్యపై కంగన విసుర్లు ఇక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే పేరును ప్రస్తావించకుండా బేబీ పెంగ్విన్ అంటూ కంగన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్ నటులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, అందుకే సుశాంత్ హంతకులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఆదిత్యపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు స్పందనగా నటులతో స్నేహం చేయడం నేరం కాదని, అనవసరంగా తనను వివాదంలోకి లాగవద్దంటూ ఆదిత్య ట్వీట్ చేశారు. నా మాటలు సరైనవే పీఓకే వ్యాఖ్యలతో కంగన- శివసేనల మధ్య తలెత్తిన మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. శివసేన ఎంపీ, ముఖ్యనేత సంజయ్ రౌత్ విమర్శలకు స్పందించిన కంగన.. భారీ భద్రత నడుమ బుధవారం ముంబైలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే బీఎంసీ అధికారులు పాలిలోని ఆమె ఆఫీసులో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూల్చివేత ప్రారంభించారు. దీంతో కంగన కోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. ఈ నేపథ్యంలో సీఎం ఠాక్రేపై ఫైర్ అయిన కంగన.. ‘‘ఈరోజు నా ఇంటిని కూల్చారు. రేపు మీ అహంకారం కుప్పకూలుతుంది’’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓ న్యాయవాది ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంకు మర్యాద ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. కంగన సోమవారం ముంబైని వీడి స్వస్థలం మనాలికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంబైని పీఓకేతో పోల్చిన తన మాటలు సరైనవే అంటూ మరోసారి సమర్థించుకోవడంతో శివసేన నేతలు ఆమెపై మండిపడ్డారు. కుక్కతోక వంకర సామెతను గుర్తు చేస్తూ కంగనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
సుశాంత్ కేసు: మనవడికి పవార్ మందలింపు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బిహార్, మహారాష్ట్రల మధ్య వివాదాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సుశాంత్ రాజ్‌పుత్ మృతి దర్యాప్తుపై స్పందించారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులకు మొదటి అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరద్ పవార్ మనవడు పార్థ్ పవార్(అజిత్ పవార్ కుమారుడు) కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై పవార్ స్పందించారు. ఇవి పరిణితి లేని వ్యాఖ్యలు అని.. వాటిని తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని మనవడిని బహిరంగంగా మందలించారు పవార్. (బాంద్రా డీసీపీ- రియా ఫోన్ కాల్స్) సుశాంత్ మృతిపై ముంబై పోలీసుల దర్యాప్తు సరిగా సాగడం లేదని.. వారి మీద తమకు నమ్మకం లేదని సుశాంత్ కుటుంబ సభ్యులు బిహార్ ముఖ్యమంత్రిని కోరిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు నితీష్ కుమార్. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బిహార్ సీఎం ఇలా చేశారని.. శివసేన ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు నాకు గత 50 ఏళ్ల నుంచి తెలుసు. వారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఆరోపణలను నేను పట్టించుకోను. ముందు వారిని లోతుగా దర్యాప్తు చేయనిద్దాం. తర్వాత కేసును సీబీఐకి లేదా ఇతర ఏజెన్సీలకు అప్పగించినా మేము వ్యతిరేకించం’ అన్నారు పవార్. (సీబీఐ దర్యాప్తు: రియా స్పందన) ఈ కేసులో రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉన్నట్లు వస్తోన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అసలు ఆదిత్య పేరును ఇందులోకి ఎందుకు లాగుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు పవార్. ఆదిత్య పేరును బీజేపీనే వివాదంలోకి లాగిందని ఆయన ఆరోపించారు. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో ఆదిత్య ఠాక్రేకు ఏం సంబంధం ఉంది. రాష్ట్రంలో మా మద్దతుతో శివసేన అధికారంలోకి రావడాన్ని ప్రతిపక్షాలు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి’ అని సీనియర్ సేన నాయకుడు సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (బాలీవుడ్‌తో సంబంధాలు నిజమే: ఆదిత్య ఠాక్రే) -
బాలీవుడ్‌తో సంబంధాలు నిజమే: ఆదిత్య ఠాక్రే
ముంబై: బాలీవుడ్ ప్రముఖులతో స్నేహం చేయడం నేరమేమీ కాదని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. తన తండ్రి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు చూసి ఓర్వలేకే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసమే కొంతమంది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత ఆరోపణలకు దిగడం సరికాదని హితవు పలికారు. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదిత్య ఠాక్రేపై కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్‌ను వేధించిన బీ-టౌన్ ప్రముఖులకు ఆయన అండగా ఉన్నారని, ఈ కేసు నుంచి వాళ్లను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ముంబై పోలీసులు, బిహార్ పోలీసులకు సహకరించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. (కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు) ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులతో ఆయన దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై ఇన్నాళ్లు మౌనం వహించిన ఆదిత్య ఠాక్రే మంగళవారం ఎట్టకేలకు ట్విటర్ వేదికగా స్పందించారు.‘‘హిందువుల హృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మనుమడిని నేను. మహారాష్ట్ర, శివసేన, ఠాక్రే కుటుంబానికి ఉన్న ప్రతిష్టకు భంగం కలిగించే పనులు ఎన్నటికీ చేయబోను. ఇవన్నీ చెత్త రాజకీయాలు. అందుకే నేను నిశ్శబ్దంగా ఉన్నాను. సినీ ఇండస్ట్రీ కూడా ముంబైలో ఒక భాగమే. వేలాది మంది ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. కొంతమంది సినీ ప్రముఖులతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది. అదేమీ నేరం కాదు కదా. కరోనా వైరస్ కట్టడికై మహారాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడుతోంది. సానుకూల ఫలితాలు సాధిస్తోంది. ఇది చూసి ఓర్వలేకే కొంత మంది సుశాంత్ కేసును రాజకీయం చేస్తున్నారు’’ అని ఆదిత్య ఠాక్రే ఓ ప్రకటన విడుదల చేశారు.(సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో ) కాగా డిప్రెషన్ కారణంగా సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ముంబై పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రాగా.. అతడిది ముమ్మాటికి హత్యేనని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ ప్రేయసిగా ప్రచారంలో ఉన్న నటి రియా చక్రవర్తిపై పట్నాలో కేసు నమోదు కావడంతో బిహార్ పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అప్పటి నుంచి మహారాష్ట్ర, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్‌వార్ ప్రారంభమైంది. ఈ క్రమంలో సుశాంత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ కోరబోమని ఉద్ధవ్ సర్కారు స్పష్టం చేయగా.. సుశాంత్ తండ్రి కేకే సింగ్ సమ్మతంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం స్పష్టం చేశారు. -
నటిపై ఆదిత్య ఠాక్రే ప్రశంసలు!
బాలీవుడ్ నటి, ప్రముఖ నిర్మాత కుమార్తె జోయా మొరానిపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రశంసలు కురిపించారు. ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కోలుకుని రెండుసార్లు ప్లాస్మా దానం చేసిన ఆమె ధైర్యాన్ని కొనియాడారు. కాగా జోయాకు కరోనా సోకినట్లు ఏప్రిల్‌లో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలోని నాయర్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొంది కోలుకున్నారు. ఇక కరోనా పేషెంట్ల చికిత్సలో.. గతంలో ఆ వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల నుంచి సేకరించిన ప్లాస్మా కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో జోయా ముందుకు వచ్చారు.(నాకు కరోనా సోకలేదు.. కానీ: నటి) ఈ నేపథ్యంలో మే తొలివారంలో ప్లాస్మా దానం చేసిన ఆమె.. మంగళవారం మరోసారి ఆ పని చేసి పెద్ద మనసు చాటుకున్నారు. ‘‘ప్లాస్మా డొనేషన్ రౌండ్ 2! గతంలో ఐసీయూలో ఉన్న ఓ రోగి కోలుకునేందుకు ప్లాస్మా ఉపయోగపడింది. కోలుకున్న కోవిడ్ రోగులు దయచేసి మందుకు వచ్చి.. మరొకరి ప్రాణాలు కాపాడండి’’ అని ట్విటర్లో తన ఫొటోలు షేర్ చేశారు. ఇందుకు స్పందించిన ఆదిత్య ఠాక్రే జోయా ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ విషయం కొందరికి ధైర్యాన్ని, ప్రోద్బలాన్ని ఇస్తుంది! ధన్యవాదాలు’’అని పేర్కొన్నారు. కాగా జోయాతో పాటు ఆమె సోదరి, తండ్రి కరీం మొరానీ సైతం కోవిడ్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. (నొప్పి కూడా ఎక్కువ ఉండదు.. దయచేసి..) That takes some courage and strength! Thank you☺️🙏🏻 https://t.co/ICKvMIHSU9 — Aaditya Thackeray (@AUThackeray) May 26, 2020 -
పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మారుస్తా: ఆదిత్య
-
పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మారుస్తా: ఆదిత్య
ముంబై: మహారాష్ట్రను పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చి ఆదాయం పెంపునకు అన్ని మార్గాల్లో ప్రయత్నించనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, రాష్ట్ర పర్యావరణం, పర్యాటక శాఖ మంత్రిగా నియమితుడైన ఆదిత్య ఠాక్రే తెలిపారు. ఠాక్రేల కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి ఓర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన ఆదిత్య.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన కేబినెట్ శాఖల కేటాయింపులో ఆయనకు పర్యావరణం, పర్యాటక శాఖ లభించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టూరిజంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని, సోమవారం జరిగే సమావేశానంతరం మంత్రిగా బాధ్యతలు చేపడతానని చెప్పారు. గతంలో శివసేన యువజన విభాగం అధ్యక్షుడుగా ఉన్న ఆదిత్య ఠాక్రే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. చదవండి: శివసేనకు చెక్.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..! శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సారథ్యంలోని 'మహా వికాస్ అఘాడి' ప్రభుత్వంలో గత డిసెంబర్ 30న కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉద్ధవ్ కోసం కేబినెట్లో కొత్త పదవిని సృష్టించబోతున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ ఆదివారం జరిగిన శాఖల కేటాయింపులో ఆయనకు పర్యావరణం, పర్యాటక శాఖలను కేటాయించారు. -
సచిన్‌కు ఎక్స్ కేటగిరి భద్రత తొలగింపు
-
ఉద్ధవ్-ఆదిత్యల అరుదైన ఘనత
ముంబై: మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన చరిత్రను సృష్టించబోతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేడు పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆరు నెలల్లో ఆయన శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక తర్వాత రాష్ట్ర శాసనసభలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకే సభలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా తొలిసారి కనిపించబోతున్నారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రకు సంబంధించినంతవరకు ఇలాంటి రికార్డు నమోదుకావడం ఇదే తొలిసారి. ‘రాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి. ఇది అరుదైన రికార్డుగా చెప్పవచ్చు’ అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ కార్యదర్శి అనంత్ కల్సే తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వర్లీ నుంచి ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే, సోదరుడు రాజ్ ఠాక్రే ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఠాక్రేల కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్య కాగా.. ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారి ఉద్ధవ్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇక, తండ్రీకొడుకులైన కాంగ్రెస్ నేతలు శంకర్రావు చవాన్, అశోక్ చవాన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి మహారాష్ట్రకు ఎక్కువమంది సీఎంలు పనిచేశారు. ఇప్పటివరకు బీజేపీ నుంచి శివసేన నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు. ఇప్పుడు ఉద్ధవ్ శివసేన నుంచి సీఎం అయిన మూడో నేత కానున్నారు. ఇక, ఎన్సీపీ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ సీఎం పగ్గాలు చేపట్టలేదు. -
‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి అత్యధిక సీట్లు దక్కించుకున్న విషయం తెలిసందే. అయితే గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్టీలకు సీట్లు తగ్గినప్పటికీ తమకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలంటూ శివసేన పట్టుబడుతోంది. మరోవైపు శివసేన డిమాండ్‌కు తలొగ్గని బీజేపీ.. సీఎం పీఠం తమదేనని స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న ఈ ప్రతిష్టంబన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా బాలీవుడ్ సుపర్ స్టార్ అనిల్ కపూర్ సీఎంగా ఉండాలంటూ ఆయన అభిమానులు ట్విటర్ ద్వారా కామెంట్లు చేస్తున్నారు. కాగా 2001లో విడుదలైన ‘నాయక్’ సినిమాలో అనిల్ కపూర్ నటించిన ఒకరోజు సీఎంగా నటించిన విషయం తెలిసిందే. దీంతో అదే తరహలో నిజ జీవితంలో కూడా మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయం తేలే వరకు ఆయనను సీఎంగా ఉండమంటూ.. ఈ విషయం గురించి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, అదిత్య ఠాక్రే ఓసారి ఆలోచించాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కోరుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన అనిల్ కపూర్.. ‘ నేను నాయక్‌లో మంచి నటుడిని మాత్రమే’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. मैं nayak ही टीक हूँ 😎@vijaymau https://t.co/zs7OPYEvCP — Anil Kapoor (@AnilKapoor) October 31, 2019 దీంతో ఆయన అభిమానులు ‘హ హ్హ హ్హా సినిమాలో కూడా మొదట నిరాకరించి ఆ తర్వాత సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారంటూ’ అప్పటి నాయక్ సినిమాలోని ఆయన పాత్రను గుర్తు చేశారు. ఇక తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో వహించిన నాయక్(ఒకే ఒక్కడు రీమేక్)లో అనిల్ కపూర్‌తో పాటు రాణి ముఖర్జీ, అమ్రిష్ పురిలు ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది అనిల్ కపూర్ ఈ ఏడాది ‘ఏక్ లడ్కీ కో దేఖా ఐసేహీ హోగా’, ‘టోటల్ ధమాల్’లో చిత్రాలలో ప్రేక్షకులను అలరించారు. అలాగే కరణ్ జోహర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తఖ్త్’లో కూడా ఆయన నటిస్తున్నారు. కాగాఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు సమాచారం.