ఉద్ధవ్‌ థాకరే తనయుడికి తప్పిన ప్రమాదం | Shiv Sena Leader Aaditya Thackeray Escapes Unhurt In Car Accident | Sakshi
Sakshi News home page

ఉద్ధవ్‌ థాకరే తనయుడికి తప్పిన ప్రమాదం

Published Sun, Jan 15 2017 5:51 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

ఉద్ధవ్‌ థాకరే తనయుడికి తప్పిన ప్రమాదం - Sakshi

ఉద్ధవ్‌ థాకరే తనయుడికి తప్పిన ప్రమాదం

ముంబై: శివసేన యువజన నేత ఆదిత్య థాకరే(26) కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారును మరో కారు ఢీకొనడంతోఘీ ఈ ప్రమాదం జరిగింది. ముంబైలోని కళానగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిగ్నల్ దాటుకుని వచ్చిన మారుతి కారు, తమ కారును ఢీకొట్టిందని థాకరే సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. ప్రమాదం సమయంలో థాకరే భయంతో వణికిపోయినట్టు కనిపించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి కారణమైన మారుతి కారు డ్రైవర్  పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రమాదంలో తనకేమి కాలేదని, తాను క్షేమంగా ఉన్నానని ఆదిత్య థాకరే ట్విటర్ ద్వారా వెల్లడించారు. సిగ్నల్ జంప్ చేసి వచ్చిన కారు ప్రమాదానికి కారణమని తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని, కార్లు రెండు కూడా బాగానే ఉన్నాయన్నారు. తనకోసం తపించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే కుమారుడైన ఆదిత్య పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement