ముంబై: మహారాష్ట్ర ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక, మరో స్థానాల్లో ఇప్పటికీ ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఆదిత్య థాక్రేపై సీనియర్ నేత మిలింద్ డియోరా బరిలో నిలిచారు. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా మారింది. వీరిద్దరూ వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిచారు.
వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మిలింద్ డియోరా మాట్లాడుతూ..‘ఆదిత్య థాక్రేతో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సమస్యలు లేవు. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. తన చిన్నతనం నుంచి ఆదిత్య నాకు తెలుసు. ఆదిత్య థాక్రేను నా తమ్ముడిలా భావిస్తాను. దురదృష్టవశాత్తు దేశంలో ట్రెండ్‌గా మారిన స్పీడ్ బ్రేకర్ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో ఆదిత్య ఠాక్రే రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.
ఇదే సమయంలో ఆధిత్య థాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్ధవ్ థాక్రే కూటమి అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలో కీలక ప్రాజెక్టులను ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆదిత్య థాక్రే చాలా వాగ్దానాలతో వచ్చారు. కానీ 11 సంవత్సరాల క్రితం మహాలక్ష్మి రేస్ కోర్స్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించారు. రాష్ట్ర ఖజానాకు రూ. 14,000 కోట్ల నష్టం కలిగించిన మెట్రో ప్రాజెక్టును ఆలస్యం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్ట్‌ను ఆలస్యం చేశాడని తెలిపారు. ఇదిలా ఉండగా.. మాజీ కేంద్రమంత్రి మిలింద్ డియోరా ఇటీవలే లోక్‌సభ ఎన్నికలకు ముందే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. తాజాగా వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిచారు.
మరోవైపు.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మంగళవారంతో ముగిసింది. కానీ దాదాపు 15 సీట్లను అధికార, ప్రతిపక్ష కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించని పరిస్థితి నెలకొంది. బీజేపీ, శివసేన( ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అధికార కూటమి ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. అదేవిధంగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్ వర్గం), ఎన్‌న్సీపీ( ఎస్పీ వర్గం), కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం.
#WATCH | Mumbai: Shiv Sena candidate from Worli Assembly seat, Milind Deora holds roadshow ahead of filing his nomination for #MaharashtraElection2024 pic.twitter.com/kt5BpLWhZA
— ANI (@ANI) October 29, 2024
Comments
Please login to add a commentAdd a comment