మహాయుతి కూటమిని ఓడించండి
ముంబై ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి
భారీగా తరలివచ్చిన స్థానిక తెలంగాణ వాసులు
ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేకు ఏక్‌నాథ్ శిందే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అజిత్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి మిలింద్ దేవ్‌రా వెన్నుపోటు పొడిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ ముగ్గురు మోసగాళ్లకు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అక్కడి తెలుగు ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్‌పీ)ల మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ)కూటమిని గెలిపించాలని కోరారు. రేవంత్ బుధవారం సాయంత్రం ముంబైలో తెలుగు ప్రజలు నివసించే వర్లీ, ధారావి, సైన్ కోలివాడల్లో ఎంవీఏ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికార మహాయుతి కూటమిపై విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ కోడలైన వర్షా గైక్వాడ్‌ను ధారావి నుంచి భారీ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. ఇక్కడి తెలుగు ప్రజల సమస్యలన్నింటినీ ఎంవీఏ ప్రభుత్వం పరిష్కరించేలా తాను హామీగా ఉంటానని తెలిపారు. కాగా వర్లీ బీడీడీ చాల్స్‌లో నివసించే స్థానిక తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డి రోడ్డు షోకు బ్రహ్మరథం పట్టారు. దీంతో రేవంత్‌రెడ్డి కూడా తాను ముంబైలో కాకుండా నిజామాబాద్, కరీంనగర్‌లో ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. రోడ్డు షోకు ముందు రేవంత్‌రెడ్డి వర్లీ బీడీడీ చాల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ప్రజలు వారి సమస్యలు తెలుపుతూ వినతిపత్రాలు సమరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment