Dharavi
-
అక్కడ ఉచిత ఇళ్లు దక్కేదెవరికి? కీలక సర్వే చేపట్టనున్న అదానీ..
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబై ధారావి గురించి చాలా మంది వినే ఉంటారు. 640 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ధారవి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అదానీ గ్రూప్ దక్కించుకుంది. గౌతమ్ అదానీ ద్వారా నియమించిన ఒక కంపెనీ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఫిబ్రవరి నుంచి ముంబైలోని ధారవి స్లమ్‌లోని 10 లక్షల మంది నివాసితుల డేటా, బయోమెట్రిక్‌లను సేకరించడం ప్రారంభిస్తుంది. పునరాభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉచిత గృహాలను పొందేందుకు ధారావి నివాసితుల అర్హతను నిర్ణయించడంలో ఈ సర్వే కీలకం. వీరే అర్హులు ధారావిలో చివరి సారిగా 15 సంవత్సరాల క్రితం ఓ సర్వే నిర్వహించారు. ధారావిలో 2000 సంవత్సరానికి ముందు నుంచి నివసిస్తున్నవారు మాత్రమే ఉచిత గృహానికి అర్హులు. ఈ సర్వే ఆధారంగా దాదాపు 7 లక్షల మంది పునరాస ప్రయోజనానికి అర్హత కోల్పోయి రోడ్డున పడతారని ఇక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అదానీ నేతృత్వంలోని సంస్థ ధారవి నివాసితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఇంటింటికీ వెళ్లి పక్కాగా సర్వేను నిర్వహించనుంది. సర్వే బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ డేటా సేకరిస్తాయని ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్న ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ అధిపతి ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు రావాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ప్రయోజనం పొందకూడదని ఆయన పేర్కొన్నారు. 9 నెలల్లో సర్వే పూర్తి ధారావిలో నివాసితుల సర్వే రెండు దశల్లో జరగనుంది. మొదటగా మూడు నుంచి నాలుగు వారాల్లో కొన్ని వందల మంది నివాసితులతో సర్వే పైలట్ దశ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూర్తి సర్వే తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉచిత గృహాలు లేదా పునరావాసం కోసం నివాసితుల తుది అర్హతను ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ నిర్ణయిస్తుంది. సర్వేతోపాటు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణకు త్వరలో అదనపు సిబ్బందిని నియమిస్తామని శ్రీనివాస్ తెలిపారు. -
తాజ్‌మహల్‌ను తలదన్నేలా స్లమ్ టూరిజంనకు ఆదరణ.. మురికివాడలకు పర్యాటకుల క్యూ
ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ధారావి(ముంబై). దీనిని సుందరంగా మార్చే బాధ్యతను ఆదానీ గ్రూప్ తన చేతుల్లోకి తీసుకుంది. అయితే మహారాష్ట్రలోని రాజకీయ ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టు నుంచి అదాని గ్రూపును తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఇటీవలి కాలంలో ఈ భారీ స్లమ్ ఏరియాకు పర్యాటకులు తాకిడి మరింతగా పెరిగింది. ప్రతీయేటా వేలాదిమంది విదేశీయులు ఈ స్లమ్ ఏరియాను సందర్శించేందుకు వస్తున్నారు. ఇక్కడి పేదల దుర్భర పరిస్థితులను అసక్తిగా గమనిస్తున్నారు. దేశంలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చేవారికన్నా ఈ స్లమ్ ఏరియాకే అధికంగా పర్యాటకులు వస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. 18వ శతాబ్ధంలో కొందరు మత్స్యకారులు తమ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. కూలీనాలీ చేసుకుంటూ ఇక్కడే ఉంటూ వచ్చారు. తరువాతి కాలంలో వివిధ వృత్తుల వారు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 20 వ శతాబ్ధం నాటికి ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. స్కూళ్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆసుపత్రులు.. ఇలా అన్ని సౌకర్యాలు ఈ ప్రాంతంలో సమకూరాయి. ప్రస్తుతం ఇది ఆసియాలో అతి పెద్ద మురికివాడగా పేరొందింది. సుమారు 550 ఎకరాల్లో విస్తరించిన ధారావి.. లెక్కకుమించిన గుడిసెలు కలిగిన బస్తీలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడి ఒక్కో గుడిసెలోనూ 10 మందికిపైగా వ్యక్తులు ఉంటున్నారు. దీనిని పరిశీలించి చూస్తే ఇక్కడి జనాభా ఎంత అధికమో తెలుస్తుంది. ధారావి మురికివాడలో 10 లక్షలకుపైగా జనాభా ఉండవచ్చని అంచనా. ఇక్కడికి వచ్చే టూరిస్టులు గంటల తరబడి ఇక్కడే ఉంటూ, ఇక్కడి పరిస్థితులను గమనిస్తుంటారు. పేదలు ఎలా జీవిస్తుంటారు? వారి దినచర్య ఎలా ఉంటుందనేది వీరు గమనిస్తారు. ఈ నేపధ్యంలో పలు అంశాలకు సంబంధిచిన వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా ఇటువంటి మురికి వాడలు మనదేశంలోనే కాకుండా ఆఫ్రికాదేశాలైన యుగాండా, కెన్యా, కేప్టౌన్లలోనూ కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: నది దగ్గర తన పనిలో మునిగిన పాల వ్యాపారి.. కలెక్టర్ ఫొటోతో గుట్టు రట్టు -
డీఎల్ఎఫ్కు షాక్: అదానీ చేతికి ‘ధారావి’ ప్రాజెక్టు
ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన, ముంబైలోని ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్ట్ కాంట్రాక్టు అదానీ గ్రూప్ చేతికి వెళ్లనుంది. రూ.5,069 కోట్లను కోట్ చేసి అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ రూ.2,025 కోట్లకు కోట్ చేసింది. ఈ వివరాలను ప్రాజెక్టు సీఈవో ఎస్వీఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘259 హెక్టార్ల పరిధిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. కాంట్రాక్టు పొందిన సంస్థ ఏడేళ్లలో 6.5 లక్షల మందికి ఆవాసం సమకూర్చాల్సి ఉంటుంది. వీరంతా ఇప్పుడు ధారావిలో 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.20,000 కోట్లు. (టాటా దూకుడు: ఏవియేషన్ మార్కెట్లో సంచలనం) తొలి దశలో అదానీ గ్రూపు రూ.5,069 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించింది. దీన్ని ఏడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని శ్రీనివాస్ తెలిపారు. వివరాలను ప్రభుత్వానికి పంపిస్తున్నామని, పరిశీలన అనంతరం తుది అనుమతి ఇస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన సంస్థ 6.5 లక్షల మందికి నివాసం ఏర్పాటు చేయడంతోపాటు, మిగిలిన స్థలంలోని నివాస గృహాలను అధిక ధరలకు విక్రయించు కోవచ్చు. అలాగే, వాణిజ్య స్థలం కూడా అందుబాటులోకి వస్తుంది. (టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్పర్సన్ హఠాన్మరణం) ఇదీ చదవండి: నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్ -
వీథి నుంచి వెండి తెరకు
మతి స్థిమితం తప్పి వీధుల్లో తిరిగే వారికి ఎవరైనా ఆహారం ఇస్తారు. కొందరు బట్టలు ఇస్తారు. మరికొందరు షెల్టర్ ఏర్పాటు చేస్తారు. కాని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక దీనురాలిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెను తన కూతురిగా చూసుకున్నాడు. వైద్యం చేయించాడు. మనిషిగా మార్చాడు. ఆ మనిషి కథతో ‘మనసున్నోడు’ అనే సినిమా తయారవుతోందిప్పుడు. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. సీన్ –1 సరిగా చూస్తే తప్ప ఆ చెత్త కుప్ప దగ్గర ఆమె ఉన్నట్టు తెలియదు. ఆ చెత్త మధ్య ఆమె కూడా ఒక చెత్త కుప్పలా ఉంది. చెత్తలోనే ఏరుకు తింటోంది. అక్కడే నిదురిస్తుంది. ఏ ఊరో తెలియదు. ఏ భాషో తెలియదు. ఏమీ మాట్లాడదు. ఒక పాతికేళ్లు ఉంటాయి. కాని విధి కొట్టిన దెబ్బలకు దిమ్మరిగా మారింది. కట్ చేస్తే... సీన్ –2 కోదాడ వ్యవసాయ మార్కెట్. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె తెలుగు మాట్లాడుతోంది. స్వస్థతతో ఉంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఉద్యోగం చేస్తూ నెలకు 15 వేలు సంపాదిస్తోంది. నాడు చెత్తకుప్పల్లో తిరిగిన యువతి నేడు ప్రయోజకురాలు. అంతేనా? ఆమె కథతో సినిమా కూడా తయారవుతోంది. ఎంత ఆసక్తికరం ఈ కథ..! ఎవరీ యువతి... ?! 2001. తెలంగాణలోని కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు. చెప్పులు కుట్టుకునే పల్లే వెంకటేశ్వర్లు మధ్యాహ్నం పని పూర్తయ్యాక సామాను అంతా సర్దుకుని కూచున్నాడు. అంతలో అతని పక్కన విసురుగా వచ్చి ఓ రాయి పడింది. ఎటునుంచి పడిందా అని చూసిన అతనికి చింపిరి జుత్తు, చిరిగిన దుస్తులు, దయనీయమైన పరిస్థితిలో మతి స్థిమితం లేని ఓ యువతి కనిపించింది. మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడవేసిన ఆహారం కోసం పందులు, కుక్కలతో పోటీ పడి ఏరుకొని తింటున్న ఆమెను చూసి దగ్గరికి వెళ్లి పరిస్ధితి ఆరా తీయబోయాడు. కాని అర్థంకాని పిచ్చి మాటలు.. చేష్టలతో అతనిపైనే రాళ్లురువ్వసాగింది. ఓపికతో ఆమెకు నచ్చజెప్పి తాను తెచ్చుకున్న అన్నం పెడితే ఆబగా తినేసింది. ఎండకు ఎండుతూ.. వానకి తడుస్తూ ఉన్న ఆ యువతిని ఇలా రోడ్డు మీద వదిలి వేయడం కంటే ఇంటికి తీసుకెళ్లడం మంచిదని భావించాడు. కుటుంబంలో ఒకరిగా.. మానసిక ఆరోగ్యం కోల్పోయిన ఆ అభాగ్యురాలిని ఇంటికి తెచ్చిన వెంకటేశ్వర్లును చూసి భార్య నిరోధించలేదు. కాకుంటే ‘ఇప్పటికే ఇద్దరు పిల్లలతో పేదరికంలో ఉన్న మనం భరించగలమా!’ అని భయపడింది. కానీ మానవత్వంతో ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంది. చింపిరి జుత్తు కత్తిరించి, స్నానం చేయించి.. తమ పిల్లల బట్టలు వేసింది. పిల్లలకు ఇక నుంచి ఈ అక్క మీతోనే ఉంటుందని ఆ భార్యాభర్తలు చెప్పారు. మానసికచికిత్స చేయించమని కొంతమంది సాయమందించడంతో హైద్రాబాద్‌లోని ‘ఆశ’ మానసిక చికిత్సాలయం వద్దకు తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. ఏడాది పాటు అక్కడే ఆ యువతికి ఉచిత చికిత్సను అందించారు. దీంతో ఆమెకు పునర్జన్మ లభించింది. ముంబయ్‌కి వెళ్లిన కథ చికిత్స తరువాత తన వివరాలను ఒక్కొక్కటి చెప్పసాగిందామె. తన పేరు అముద అని, తండ్రి నారాయణ నాడర్ అని, తమది తమిళనాడులోని తిరునల్వేలి’ అని చెప్పింది. బతుకుదెరువు కోసం నలుగురు అక్కాచెల్లెళ్లం కలిసి ముంబాయిలోని ధారవికి వెళ్లామని, అక్కడ దయాసదన్ లో 10 తరగతి వరకు చదువుకొని మాంటిస్సోరీలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది. తరువాత తమిళనాడుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, భర్త వేధింపులు భరించలేక పురుగులమందు తాగానని, ఆ తరువాత ఏమైందో.. తాను కోదాడకు ఎలా వచ్చానో తెలియదని చెప్పడంతో కథ అంతటితో ఆగిపోయింది. అయినవారికి కలపాలని వెంకటేశ్వర్లు ముంబాయిలోని దయాసదన్ కు ఉత్తరం రాసి, అముద బంధువుల కోసం ఆరా తీసాడు. కాని వారు అక్కడ లేరని, ఒక చర్చిలో అముద చెల్లెలు ఉంటుందని చెప్పడంతో ఆమెను తీసుకొని ముంబయి వెళ్లాడు. అక్కను గుర్తుపట్టిన చెల్లెలు తామే ఇతరుల వద్ద బతుకుతున్నామని, ఆమెను ఆదరించలేమని చెప్పడంతో అక్కడి నుండి తిరిగి వచ్చారు. భర్త ఆచూకి కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక అముద తన కూతురే అనుకొని తన దగ్గరే ఉంచుకొని ఉన్న దాంట్లో పోషించసాగాడు. శాశ్వత ఆసరా! తనకు వయస్సు పైబడడం, చికిత్స కోసం నెలకు దాదాపు 1500 రూపాయలు అముదకు అవసరం కావడంతో ఆమెకు శాశ్వత ఆసరా కల్పించడానికి వెంకటేశ్వర్లు విశ్వప్రయత్నాలు చేశాడు. 10 సంవత్సరాల క్రితం ‘సాక్షి’ అముద గాథకు అక్షర రూపం ఇవ్వడంతో అప్పటి కలెక్టర్ అముదకు విద్యావలంటీర్‌గా అవకాశం కల్పించాడు. కాని సెలవులు వచ్చిన సమయంలో వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూనే దాదాపు 6 సంవత్సరాలు పని చేసింది. 2016వ సంవత్సరంలో మంత్రి హరీష్‌రావు చొరవతో కోదాడలోని వ్యవసాయమార్కెట్ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు 15 వేల రూపాయల వేతనం వస్తుండడంతో అముద బతుకుబండి సాఫీగా సాగుతోంది. వెండి తెరపైన అముద కథ ఎన్నో మలుపులు తిరిగిన అముద జీవితాన్ని 2008వ సంవత్సరంలో ‘సాక్షి’లో వచ్చిన కథనం చూసిన పశ్చిమగోదావరి జిల్లా వాసి వేల్పుల నాగేశ్వరరావు అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కథను ‘మళ్లీ మరో జన్మంటూ ఉంటే’ పేరుతో నాటకంగా మార్చారు. 2012 నుండి పలుచోట్ల దీన్ని ప్రదర్శించారు. తాజాగా తానే సినిమాగా వెండితెరకెక్కించాలని భావించి నాలుగు నెలల క్రితం కోదాడకు వచ్చి అముదను, ఆమెకు కొత్త జీవితాన్ని అందించిన పల్లే్ల వెంకటేశ్వర్లును కలిశారు. సినిమాలో వారి పాత్రలలో వారే నటించమని కోరారు. కాని వారు ఒప్పుకోకపోవడంతో కొత్త వారితో సినిమా షూటింగ్ ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అశ్వారావుపేట సమీపంలో పలుగ్రామాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు నాగేశ్వరరావు తెలిపారు. మతి స్వాధీనం తప్పి తిరిగే దీనులకు వెంకటేశ్వర్లు వంటి బాంధవులు దొరికితే వారి జీవితం ఇలా తప్పక బాగుపడుతుంది. చిత్రం షూటింగ్ సన్నివేశం సంరక్షకుడు పల్లే వెంకటేశ్వర్లుతో అముద – అప్పిరెడ్డి, సాక్షి, కోదాడ -
చిత్తు కాగితాల సుందర చిత్రం
ఎవరూ పట్టించుకోని.. ఎవరికీ అక్కర్లేని... చిత్తుకాగితాలు స్లమ్స్. ఆ కాగితాలను అందమైన పువ్వులుగా సీతాకోకచిలుకలుగా, పిల్లల నవ్వుల్లా కొత్తగా సింగారిస్తోంది రూబుల్నాగి. కాశ్మీర్లో పుట్టిన రూబుల్ నాగి లండన్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. శిల్పాలు, ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లో ప్రత్యేకత కలిగిన ఆమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కళతో సమాజాన్ని మార్చాలన్నది ఆమె కల. అందుకు తగినట్టుగానే రెండు దశాబ్దాలుగా పెయింటింగ్ చేస్తోంది. ఎక్కడో కాదు భారతదేశంలో చిత్తుకాగితాలుగా పరిగణించే స్లమ్స్‌ని ఆమె తన కాన్వాస్‌కు వాడుకుంది. స్లమ్స్ కలర్‌ఫుల్ దేశమంతా తిరిగి పిల్లల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఆమె ‘రూబుల్ నాగి’ ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. యువ ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న రూబుల్ జనవరి 2018 నుంచి ‘మిసాల్ ముంబై’ పేరుతో ధారవి మురికి వాడలను పెయింటింగ్ తో అలంకరిస్తోంది. ఇప్పటివరకు 30 మురికివాడల్లోని 1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది. గోడలపై చిత్రాలను రూపొందించింది. తన పెయింటింగ్‌తో స్లమ్స్ రూపురేఖలను మార్చుతోంది 40 ఏళ్ల రూబుల్ నాగి. కళతో కనెక్ట్ కళకోసమే జీవితాన్ని అంకితం చేసిన రూబుల్ రెండు దశబ్దాలలో 800 శిల్పాలు, లెక్కలేనన్ని చిత్రాలను రూపొందించింది. 62 కిండర్ గార్టెన్లను కూడా నడుపుతోంది. తద్వారా పిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తోంది. రూబుల్ నాగి సంస్థ దేశవ్యాప్తంగా పిల్లల కోసం ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఆమె తన కళను ప్రజలతో కనెక్ట్ అయ్యే మాధ్యమంగా భావిస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘సామాజిక సమస్యలను లేవనెత్తడానికి వాటి గురించి అవగాహన కల్పించడానికి ప్రజలకు సహాయపడే మార్గం ఇది’ అని చెప్పే రూబుల్ పెయింటింగ్స్‌తో సామాన్య ప్రజలూ ప్రేరణ పొందుతుంటారు. ఆమె పెయింటింగ్స్ విద్య, మహిళా సాధికారత, ఉపాధి వంటి సమస్యలను చర్చిస్తాయి. అదే సమయంలో ఆమె వర్క్‌షాప్‌లో మురికివాడల ప్రజలు పరిశుభ్రత గురించీ తెలుసుకుంటారు. కొత్త శక్తి దిశగా! రూబుల్ ఆలోచన గొప్పదనం తెలుసుకోవాలంటే ఆమెతో కాసేపు ముచ్చటించాలి. ‘ఈ ఇళ్ళపై నేను పెయింట్ చేసిన రంగులు కొన్ని ఏళ్ల తరువాత మసకబారుతాయి. కానీ ఈ రంగులు ప్రజల ఆలోచనలో సానుకూల మార్పులు వస్తాయి. అవి వారికి ఎల్లప్పుడూ కొత్త శక్తిని ఇస్తాయి’ అంటుంది అంటోంది ఈ చిత్రకారిణి. రూబుల్ ఇప్పటివరకు రాజస్థాన్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ మహారాష్ట్రతో పాటు పెయింటింగ్ ద్వారా ముంబై మురికివాడలను అభివృద్ధి చేసింది. చేస్తోంది. ఆమె పెయింటింగ్స్‌ను కార్పోరేట్ సంస్థలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, భారతప్రభుత్వం, మ్యూజియమ్‌లతో సహా ఎంతో మంది సేకరిస్తుంటారు. కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బుతో మురికివాడలకు ప్రాణం పోస్తోంది రూబుల్ నాగి. మహిళలతో రూబుల్ నాగి -
కరోనాతో ఏడాది సావాసాన్ని చూస్తే...
కంటికి కనిపించని శత్రువు మనకి సవాల్ విసిరి ఏడాదైంది. కేరళలో తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చి ఇవాళ్టికి సరిగ్గా ఏడాదైంది. జనాభాతో కిటకిటలాడే భారత్‌లో కరోనా బాంబు విధ్వంసం సృష్టిస్తుందని అందరూ అంచనా వేశారు. ఆసియాలో అతి పెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో తొలికేసు నమోదు కాగానే భారత్ పనైపోయిందని భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అగ్రరాజ్యాలే ఇంకా కరోనా పడగ నీడలో భయం భయంగా బతుకు వెళ్లదీస్తూ ఉంటే, మనం అన్నీ తట్టుకొని ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాం. కరోనా మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ పాఠాలే గుణపాఠాలుగా మార్చుకొని పడిలేచిన కడలితరంగంలా పైకి లేస్తున్నాం. కరోనాతో కలిసి చేసిన ఈఏడాది ప్రయాణాన్ని ఒక్కసారి చూద్దాం.. కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ఏడాదిలో మన జీవన చిత్రాన్ని మార్చేసింది. ఎంతలా అంటే కరోనాకి ముందు కరోనా తర్వాత అని నిర్వచించుకునేలా మారి పోయింది. అమెరికా, యూరప్ వంటి దేశాలు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌తో చిగురుటాకులా వణికిపోతూ ఇంకా ఇళ్లలోనే మగ్గిపోతూ ఉంటే మనం మాత్రం ఆర్థికంగా బలోపేతం కావడానికి అవసరమయ్యే వ్యూహరచనలో మునిగి ఉన్నాం. కరోనాపై పోరాటం తుది దశకు వచ్చేసింది. ఏడాదిలోనే దాని కొమ్ములు విరిచేసి ప్రపంచ దేశాల్లో రొమ్ము విరుచుకొని భారత్ ఠీవిగా నిలబడింది. రోజుకి దాదాపుగా లక్ష వరకు కేసులు చూసిన భారత్‌లో ఇప్పుడు రోజుకి 10 నుంచి 20 వేలు వరకు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. చైనా నుంచి కేరళకి చైనాలోని వూహాన్లో 2019 డిసెంబర్ 27న తొలిసారిగా కరోనా కేసు బట్టబయలైతే ఆ తర్వాత నెల రోజులకే అంటే జనవరి 30న చైనా నుంచి భారత్‌కి వచ్చిన కేరళ విద్యార్థినికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఆ విద్యార్థినిని క్వారంటైన్‌కి తరలించడంతో భారత్ ఒక్కసారి ఉలిక్కిపడింది. కానీ మన ఉష్ణోగ్రతలకి వైరస్ బతకదన్న ధీమాతోనే మార్చి వరకు గడిపేశాం. అంతకంతకూ కేసులు పెరుగుతూ ఉండడంతో వైరస్ ముప్పుని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మార్చి 24న హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించడంతో అందరూ మేల్కొన్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతికదూరం వంటి మాటలే కొత్తగా విన్న ప్రజలకు ఈ వైరస్‌పై అవగాహన పెంచుకోవడానికి సమయం పట్టింది. ఆ కొద్దిపాటి సమయంలోనే కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ప్రపంచ దేశాల పట్టికలో అమెరికా తర్వాత కోటి కేసులు దాటిన దేశంగా భారత్ నిలిచినప్పటికీ, జనసాంద్రత పరంగా చూస్తే కరోనా విసిరిన సవాళ్లను పకడ్బందీగా ఎదుర్కొన్నామనే చెప్పాలి. కరోనా విస్తరించిన తొలిరోజుల్లో ముంబై కరోనాకి రాజధానిగా మారింది. ఇప్పటికి కూడా మహారాష్ట్ర కోవిడ్–19 కేసుల్లో ముందు వరసలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల్లో కేరళ, మహారాష్ట్ర నుంచే 65శాతం నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 1.6శాతం మాత్రమే. సరైన సమయంలో లాక్డౌన్ వల్ల కోటి వరకు కేసులు, లక్ష వరకు మరణాలను నిరోధించగలిగామన్న అంచనాలున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామా..? పశ్చిమ దేశాలు కరోనా వైరస్‌తో ఇంకా కష్టాలు పడుతూ ఉంటే మన దేశంలో అక్టోబర్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టడం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. భారతీయుల్లో రోగనిరోధకత ఎక్కువగా ఉండడం, యువతరం ఎక్కువగా ఉండడం, చాలా మందిలోయాంటీ బాడీలు ఏర్పడడం వంటివి ఇందుకు కారణమని నిపుణుల అంచనా. భారత్‌లో ఎంత మందికి కరోనా వచ్చి తగ్గిందన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. పట్టణాల్లో థైరోకేర్ కంపెనీ నిర్వహించిన సర్వేలో 30 నుంచి 40 కోట్ల మందికి కరోనా వచ్చినట్టు తేలగా, 3నెలల క్రితం ఐసీఎంఆర్ సర్వేలో 10 కోట్ల మందికి సోకినట్టు తేలింది. దీంతో భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించి ఉంటుందని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. మరణాలు తక్కువే.! రికవరీలో భారత్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. మొత్తం కేసులు కోటీ 7 లక్షలు దాటితే మృతుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. రికవరీ అంశం భారత్‌కు మొదట్నుంచీ అతి పెద్ద రిలీఫ్. తాజాగా జాతీయ రికవరీ రేటు 96శాతంగా ఉండడం ఒక రికార్డు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మరణాల రేటు భారత్‌లో చాలా తక్కువ. 12 నెలల ప్రయాణం 2020 జనవరి 18: చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులకి విమానాశ్రయాల్లోనే థర్మల్ స్క్రీనింగ్ 30: కేరళలో తొలి కేసు నమోదు ఫిబ్రవరి 3,4: మరో రెండు కేసులువెల్లడి, వీరు కూడా చైనా నుంచి వచ్చిన విద్యార్థులే మార్చి 10: కరోనాతో తొలి మరణం 11: ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్–19న మహమ్మారిగా ప్రకటించింది. 24: భారత్‌లో 21 రోజుల లాక్డౌన్ విధింపు ఏప్రిల్ 14: లాక్డౌన్ మే 3వరకు పొడిగింపు మే1: మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగింపు 7: 50 వేలు దాటిన కరోనా కేసులు జూన్ 1: అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం 27: భారత్‌లో 5 లక్షలు దాటిన కేసులు జూలై 1 : అన్‌లాక్ 2 ప్రారంభం 17: భారత్‌లో 10 లక్షలు దాటిన కేసులు ఆగస్టు 3: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి 7:20 లక్షలు దాటిన కేసులు వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి జాతీయ నిపుణుల కమిటీ ఏర్పాటు సెప్టెంబర్ 5: కరోనా కేసుల్లో బ్రెజిల్‌ని దాటేసి రెండోస్థానంలోకి చేరుకున్న భారత్ 16 : 50 లక్షలు దాటిన కేసులు అక్టోబర్ 11: 80 లక్షలు దాటిన కేసులు నవంబర్16: భారత్ బయోటెక్ కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు ప్రారంభం డిసెంబర్ 8: ఆక్స్ఫర్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అనుమతుల్ని పరిశీలిస్తున్నట్టుగా కేంద్రం వెల్లడి డిసెంబర్ 10 : కోటి దాటిన కేసులు 2021 జనవరి 2 : భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి 16: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం. -
ధారావిలో తొలిసారిగా జీరో కేసు
ముంబై: పది లక్షల మంది జనాభా ఉండే ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో ఏప్రిల్ 1న మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి అక్కడ కరోనా ప్రవేశించిందంటే దాని వ్యాప్తిని నివారించడం అసాధ్యమేనని అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. కానీ అనూహ్యంగా ముంబైలో కేసులు ఎక్కువవుతున్నా ధారావి మాత్రం కరోనాను కట్టడి చేయగలిగింది. భారత్‌లో కరోనా ఎంటరైన తర్వాత తొలిసారిగా ధారావిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జూలై 26న ధారావిలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ కేసులు స్వల్పంగా పెరిగినప్పటికీ శుక్రవారం మాత్రం సింగిల్ కేసు కూడా వెలుగు చూడలేదు. ఈ మురికివాడలో ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్(4టీ) ఫార్ములాను పకడ్బందీగా అమలు చేశారు. (చదవండి: రోడ్డుపై గోనె సంచి కదిలింది.. ఏంటాని చూస్తే!..) కట్టుదిట్టుమైన ప్రణాళికతో కరోనాను కట్టడి చేశారని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ గతంలో ధారావిపై ప్రశంసలు కురిపించారు. కాగా మహారాష్ట్రలో కొత్తగా 3,580 మందికి పాజిటివ్ రాగా మొత్తం కేసుల సంఖ్య 19.51 లక్షలకు చేరింది. కోవిడ్ మహమ్మారి 49 వేల మందిని పొట్టన పెట్టుకుంది. (చదవండి: ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ) -
విషాదం: లిఫ్టులో ఇరుక్కొని బాలుడు మృతి
ముంబై : ముంబైలోని ధారావిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ధారావికి చెందిన మహ్మద్ హోజైఫ్ షేక్ అనే ఐదేళ్ల బాలుడు లిఫ్టు డోరులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. షాహుర్ నగర్‌లోని కోజీ షెల్టర్ అనే అపార్ట్మెంట్లో శనివారం హోజైఫ్ షేక్ తన స్నేహితులతో కలిసి కింది ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ఆ లిఫ్ట్‌కు గ్రిల్స్‌తో పాటు డోర్ కూడా ఉంది. అయితే లిఫ్ట్ కింది ఫ్లోర్ రాగానే డోరు తెరుచుకోవడంతో షేక్‌తో మినహా మిగతా పిల్లలు బయటికి వెళ్లిపోయారు. అందరికంటే చివర వచ్చిన షేక్ బయటికి వచ్చి లిఫ్టు గ్రిల్స్ వేస్తుండగా వెనుక ఉన్న డోర్ మూసుకుపోయింది. దీంతో రెండు డోర్ల మధ్య ఉండిపోయిన జోహైఫ్ షేక్‌కు బయటకు ఎలా రావాలో అర్థం కాలేదు. ఈలోగా మరొకరు లిఫ్టు బటన్ నొక్కేయడంతో కిందకు కదిలింది. దీంతో రెండు డోర్ల మధ్య ఉన్న బాలుడు లిఫ్టు గ్రిల్స్‌లో నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. -
'పాపడ్'లు తిని కరోనా నుంచి కోలుకున్నారా?
సాక్షి, ఢిల్లీ : కరోనా నియంత్రణలో మహారాష్ర్ట ప్రభుత్వం విఫలమయ్యిందన్న వ్యాఖ్యలను శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. ఒకప్పుడు రాష్ర్టంలో అత్యధిక కేసులు ప్రబలిన మురికవాడ ధారావిలో కరోనా నియంత్రణ కాలేదా అంటూ ప్రశ్నించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం ఈ విషయంలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) చేసిన ప్రయత్నాలను ప్రశంసించిందన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమయ్యిందని పలువురు పార్లమెంటు సభ్యులు మహారాష్ర్ట సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. (సరిహద్దుల్లో పంజాబీ సాంగ్స్.. చైనా మరో కుట్ర) ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ..కరోనాను అదుపు చేయకపోతే ఇంతమంది ఎలా కోలుకోగలిగారు? ఇప్పుడు కరోనాను జయించిన వాళ్లందరూ పాపడ్ తిని కరోనా నుంచి బయటపడ్డారా అంటూ వ్యంగాస్ర్తాలు సంధించారు. గతంలో పాపడ్ తింటే కరోనా పోతుందని ఉచిత సలహా ఇచ్చి విమర్శలపాలైన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కరోనాకు గురైన సంగతి తెలిసిందే. తన తల్లి, సోదరుడు సైతం కోవిడ్ బారినపడ్డరని రాష్ర్టంలో రికవరీ రేటు ఎక్కువగానే ఉందని సంజయ్ రౌత్ తెలిపారు. కరోనాను రాజకీయం కోసం వాడుకోరాదంటూ పేర్కొన్నారు. ఇక దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో మహారాష్ర్ట మొదటిస్థానంలో ఉంది. రాష్ర్టంలో కోవిడ్ తీవ్రత బుధవారం నాటికి 1.12 మిలియన్ మార్కును దాటేసింది. వీరిలో దాదాపు ఎనిమిది లక్షలమంది కరోనాను జయించారు. గత 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 51,18,254కు చేరుకుంది. (దేశంలో కొత్తగా 97,894 పాజిటివ్ కేసులు) -
‘ఛేజ్ ది వైరస్ పాలసీ’తో కరోనా కట్టడి!
ముంబై/మనీలా: పది లక్షలకు పైగా జనాభా కలిగి, ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారావిలో కరోనా కట్టడి చేసిన తీరు ఆదర్శంగా నిలుస్తోంది. అత్యధిక జన సాంద్రత గల ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని, కరోనా మహోగ్రరూపం దాలిస్తే భారీగా ప్రాణ నష్టం చవిచూడాల్సి వస్తుందని మొదట్లో అంతా భయపడ్డారు. అయితే ఆ భయాలను పటాపంచలు చేస్తూ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) మూడు నెలల్లోనే మహమ్మారి వ్యాప్తిని నియంత్రించగలిగింది. ఈ నేపథ్యంలో ధారావి మోడల్‌ను ప్రశంసిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలమనడానికి ధారావి అతి పెద్ద ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు.(కరోనా: ధారావిపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు) ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కరోనా కట్టడికై ‘ధారావి మోడల్’ను అనుసరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి.. ‘‘ఛేజ్ ది వైరస్ పాలసీ’’ బ్లూప్రింట్‌ను బీఎంసీ ఫిలిప్పీన్స్‌తో పంచుకున్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రయత్నాలకు దక్కిన గౌరవంగా దీనిని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాపించి తొలినాళ్లలో భారత్ ఇతర దేశాల కోవిడ్ కట్టడి మోడల్‌ను ఆచరిస్తే.. ఇప్పుడు విదేశాలు ధారావి మోడల్‌ను ఫాలోకావడం సంతోషంగా ఉందన్నారు. కాగా బీఎంసీ అధికారులు చెబుతున్న గణాంకాల ప్రకారం ధారావిలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి 0.8 శాతానికి తగ్గింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 81 శాతానికి చేరుకుంది. గతంతో పోలిస్తే కోవిడ్ మరణాల రేటులో కూడా తగ్గుదల నమోదైంది. -
ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ
ముంబై : వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం. 10 లక్షల మంది జనాభాతో ఆసియా లో అతి పెద్ద మురికివాడ ధారావి. ఏప్రిల్ 1న అక్కడ మొదటి కరోనా కేసు వెలుగులోకి రాగానే అందరూ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కరోనా బాం బు పేలి శవాల దిబ్బగా మారుతుందని అనుకున్నారు. కానీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేసిన కృషి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. డబ్ల్యూహెచ్ఓ ధారావిలో కరోనా కట్టడి చర్యల్ని కొనియాడింది. కోవిడ్–19ను నియంత్రించడం లో ప్రపంచ దేశాలకు ఆదర్శనీయంగా నిలిచిన ధారావి మురికివాడ మెరిసిన ముత్యం లా తళుకులీనుతోంది. ముంబైలో కేసులు విశ్వరూపం దాల్చి సినీ ప్రముఖుల్ని కూడా భయపెడుతున్న వేళ ధారావిలో కరోనా కేసులు రోజుకి రెండు లేదంటే మూడు మాత్రమే నమోదవుతున్నాయి. సామాజిక భాగస్వామ్యంతో ధారావి కరోనా చీకట్లను పారద్రోలి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. సవాళ్లు ► సుమారు 2.5 చ. కి మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో జనాభా 10 లక్షలు. ఒకే చిన్న గదిలో 8–10 మంది నివాసంతో భౌతిక దూరాన్ని పాటించడం అసాధ్యం ► కమ్యూనిటీ టాయిలెట్స్ మీద ఆధారపడిన 80% ప్రజలు ► ప్రతి రోజూ 450 కమ్యూనిటీ టాయిలెట్స్ వినియోగం ► స్ట్రీట్ ఫుడ్‌పై ఆధారపడిన అత్యధిక జనం 4 టీ ఫార్ములా ► ట్రేసింగ్ 47,500 గృహాలకు వైద్యులు స్వయంగా వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి విచారించారు. ప్రతీ ఒక్క కేసు నమోదవగానే వారితో కాంటాక్ట్ అయిన 24 మందిని గుర్తించారు. వైద్యలు ప్రతీ రోజూ వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేవారు. ఇలా 59 వేల మందిని గుర్తించారు. ► ట్రాకింగ్ 6 లక్షల మందిని స్క్రీన్ చేశారు. ప్రతీ ఒక్క పాజిటివ్ కేసుకి 5 మందిని క్వారంటైన్‌కి తరలించారు. ► టెస్టింగ్ 13,500 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ► ట్రీటింగ్ ధారావిలో ఉన్న వారు బయటకు అడుగు పెట్టకుండా విస్తృతంగా మౌలికసదుపాయాలు కల్పించారు.కేవలం 14 రోజుల్లో 200 పడకల తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించి సీరియస్ కేసులకు చికిత్స అందించారు. స్వల్ప లక్షణాలున్నవారిని క్వారంటైన్ హోమ్స్‌కి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను క్వారంటైన్ హోమ్స్‌గా మార్చారు. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి అందరి కడుపు నింపారు. కమ్యూనిటీ టాయిలెట్లను రోజుకి నాలుగైదు సార్లు శానిటైజ్ చేశారు. -
కరోనా కట్టడిలో ధారావి భేష్
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తున్న వేళ దానిని కట్టడి చేయడం సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆశాభావం వ్యక్తం చేసింది. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావి దీనికి అతి పెద్ద ఉదాహరణ అని ప్రశంసించింది. కరోనా బాంబు పేలుతుందనుకున్న ప్రాంతంలో కట్టుదిట్టమైన ప్రణాళికతో కరోనాని కట్టడి చేశారంటూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ధారావిలో తీసుకున్న చర్యల్ని కొనియాడారు. జన సాంద్రత అత్యధికంగా ఉన్న ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా మూడు నెలల్లోనే కరోనాని నియంత్రించింది. శుక్రవారం టెడ్రోస్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ సామాజిక సహకారం, జాతీయ ఐక్యత, ప్రపంచ సంఘీభావంతో తీసుకునే చర్యల ద్వారా కరోనాకు అడ్డుకట్ట వేయగలమని అన్నారు. ఇటీవల చాలా దేశాల్లో కరోనా తీవ్రత పెరిగిపోతూ ఆందోళన పెంచుతున్న సమయంలో ధారావిలో తీసుకున్న చర్యలు వైరస్‌ని నియంత్రించగలమన్న భరోసాని నింపుతున్నాయని ప్రశంసించారు. ‘కరోనాని మనం కట్టడి చేయగలం. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, «ముంబైలో జనసాంద్రత్య అత్యధికంగా ఉన్న ధారావి.. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి’అని టెడ్రోస్ పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం, వివిధ వర్గాల భాగస్వామ్యం, సమష్టి బాధ్యతతో వైరస్‌ను నియంత్రించగల మన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేటింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా కరోనా చైన్‌ను బద్దలు కొట్టవచ్చునని టెడ్రోస్ పేర్కొన్నారు. మరోవైపు కజకిస్తాన్‌లో న్యుమోనియా లక్షణాలతో వస్తున్న కేసులు కరోనా వైరస్‌కి చెందినవేనని డబ్ల్యూహెచ్ఓ అదికారి డాక్టర్ ర్యాన్ అనుమానం వ్యక్తం చేశారు. కజకిస్తాన్‌లో ఇప్పటివరకు 50 వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. -
ధారావిపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు
జెనీవా: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో మహమ్మారి కరోనా వ్యాప్తిని కట్టడి చేసిన తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాంతక వైరస్‌పై విజయం సాధించగలమని ధారావి నిరూపించిందని కొనియాడింది. కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ, వైరస్ బారిన పడిన వారికి తక్షణ చికిత్స, ఐసోలేషన్ నిబంధనల అమలు వైరస్ గొలుసును బ్రేక్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ప్రజల భాగస్వామ్యం ఉంటే వైరస్‌పై విజయం సాధించవచ్చని సూచించింది. లాక్డౌన్ నిబంధనల సడలింపుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ ఈ మేరకు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు.(గాలి ద్వారా కరోనా సాధ్యమే) జెనీవాలో నిర్వహించిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా గత ఆరు వారాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. అయితే అత్యధిక జనసాంద్రత కలిగిన కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ను కట్టడి చేసిన తీరు గమనిస్తే.. కేసులు పెరిగినా మహమ్మారిని అదుపులోకి తీసుకు రావొచ్చనే విషయం స్పష్టమైంది. ఇందుకు ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా దేశాలు సహా ముంబైలోని ధారావి వంటి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించిన తీరే నిదర్శనం. పరీక్షలు నిర్వహణ, ట్రేసింగ్, ఐసోలేషన్, అనారోగ్యంతో ఉన్న వారికి తక్షణ చికిత్స అందించడం వంటి విధానాలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేశాయి. మమమ్మారిని అణచివేయగలమని నిరూపించాయి’’ అని పేర్కొన్నారు. ధారావి విజయం పదిలక్షల మందికి పైగా నివసించే ధారావిలో కరోనా విజృంభించిన తొలినాళ్లలో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై పురపాలక సంస్థ(బీఎంసీ) సత్వర చర్యలు చేపట్టింది. కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని అక్కడికి పంపి ఈ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలిగింది. ఈ క్రమంలో శుక్రవారం నాటికి ధారావిలో మొత్తంగా 2359 కేసులు వెలుగు చూడగా.. ప్రస్తుతం కేవలం అక్కడ 166 యాక్టివ్ కేసులు మాత్రమే ఉండటం విశేషం. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో అత్యధికంగా 27 వేల కేసులు నమోదు కాగా.. ధారావిలో 35 మంది కరోనా బారిన పడ్డారు. -
డ్యాన్స్ వీడియో తొలగించమన్నందుకు..
ముంబై : ఒక యువకుడు చీర ధరించి డ్యాన్స్ చేస్తుండగా తనతో పాటు ఉన్న నలుగురు స్నేహితులు ఆ వ్యక్తి డ్యాన్స్‌ను వీడియో చిత్రీకరించారు.ఈ విషయం తెలుసుకున్నసదరు వ్యక్తి వీడియోను డిలీట్ చేయాలని అడిగినందుకు కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన ముంబైలోని ధారావి స్లమ్ ఏరియాలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కౌశిక్ సునీల్ నారాయణ్ కర్(17) అనే యువకుడు ధారవిలోని సుభాష్ నగర్లో ఉంటున్నాడు. కౌశిక్ స్నేహితులు కూడా అతను ఉంటున్న ప్రాంతంలోనే ఉంటున్నారు. (ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కేసు కొత్త మలుపు) సరదాగా గడుపదామని కౌశిక్ స్నేహితుల దగ్గరికి వెళ్లాడు. కాగా వారిని ఉత్సాహపరిచేందుకు కౌశిక్ చీర ధరించి డ్యాన్స్ చేశాడు. అయితే అతనికి తెలియకుండా మిగతా నలుగురు వారి ఫోన్లో వీడియోనూ చిత్రీకరించారు. ఈ వీడియోను అందరికి చూపించి కౌశిక్‌ను ఆటపట్టిద్దామని భావించారు. అయితే వీడియో విషయం తెలుసుకున్నకౌశిక్ తన డ్యాన్స్ వీడియో డిలీట్ చేయాలని లేకపోతే పోలీసులకు లేదా తన అంకుల్ కు చెప్తానని హెచ్చరించాడు. అయితే కౌశిక్ నిజంగానే పోలీసుల వద్దకు వెళ్తాడేమోనని అతని స్నేహితులు అనుమానించారు. దీంతో తన అంకుల్ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న కౌశిక్‌ను ఆపి కత్తితో పొడిచారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కౌశిక్ కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కౌశిక్ హత్యకు కారణమైన నలుగురు యువకులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ నలుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మైనర్లను డొంగ్రి రిమాండ్ హోమ్ కు తరలించారు. -
కరోనా చీకటిలో ధారవి
సాక్షి, హైదరాబాద్: ధారావి...ఆసియాలోనే అతిపెద్ద, అత్యధిక జనసమ్మర్దమున్న మురికివాడ ఇప్పుడు కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఒక మోడల్‌గా, ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అభివృద్ధి ర్యాంకుల్లో, ఆధునిక సాంకేతికతలో ముందున్న దేశాలు, నగరాలు కోవిడ్ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతుంటే.. 10 లక్షలకు పైగా జనాభాతో భారత్‌లోనే అతిపెద్ద మురికివాడగా పేరుపడిన, మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావి వైరస్ వ్యాప్తి కట్టడిలో వెలుగు దారి చూపుతోంది. వందరోజులకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులతో పోరాడి, ఐసోలేషన్ నుంచి విజయవంతంగా బయటికొచ్చి మళ్లీ తన కార్యకలాపాలను కొనసాగించడం మొదలెట్టింది. ఈ ప్రాంతంలోని చిన్నాచితకా ఫ్యాక్టరీలు, కుటీరపరిశ్రమలు, రకరకాల వృత్తుల్లో పనిచేసే వారు తమ రోజువారి జీవనపోరాటంలో మళ్లీ నిమగ్నమై తమ ధైర్యాన్ని, సాహసాన్ని చాటుతున్నారు. మే చివరి వరకు కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు కరోనా వైరస్ వ్యతిరేక పోరులో ముందంజలో నిలిచి కేంద్ర ప్రభుత్వ అభినందనలు కూడా పొందింది. భయోత్పాతం నుంచి ... కొన్ని నెలల క్రితం ధారావిలో మొదటి కోవిడ్ మరణం నమోదు కాగానే సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. మురికివాడల్లో, అందులోనూ కిక్కిరిసిన వీధులు, ఒక్కోగదిలో పదిమంది చొప్పున నివసించే చోటు కావడంతో అది శవాల దిబ్బగా మారడం ఖాయమనే భయాందోళనలు మిన్నం టాయి. ఈ పరిస్థితుల్లో కనిపించని శత్రువుతో పోరాటానికి ఇక్కడి వారు నడుం బిగించారు. వైరస్ వ్యాప్తి తీవ్రమై కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సందర్భంలో అక్కడి అధికారులు సైతం వ్యూహాన్ని మార్చారు. విపత్తు సంభవించే వరకు వేచి చూడకుండా, వైరస్‌ను వెన్నాడి దానిని తుదముట్టించాలనే ఆలోచనతో ముందుకు సాగారు. వీధుల్లో తిరిగి పాజిటివ్ కేసుల కోసం శోధిస్తూ వెళ్లడం కంటే ధారావిలోని వివిధ ప్రాంతాల్లో ‘ఫీవర్ క్యాంప్’లు ఏర్పాటుచేసి ప్రతీరోజు వైరస్ లక్షణాల కోసం అక్కడి ప్రజలను స్క్రీనింగ్ చేయడం మొదలుపెట్టారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్ హాళ్లు, పాఠశాలలు ఇలా ఒకటేమిటి... అందుబాటులో ఉన్న ప్రతి భవనాన్ని క్వారంటైన్ సెంటర్లుగా మార్పుచేశారు. ఈ సెంటర్లలోని వారికి ఆహారం, అవసరమైన విటమిన్లు, యోగ, ఇతర వ్యాయామాలు అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ వైరస్ హాట్స్పాట్లు ఉన్నాయో గుర్తించారు. ఆయా ఏరియాల్లో లాక్డౌన్ విధించడంతో పాటు పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రంగంలోకి దిగి ధారావిలోని ఏ ఒక్కరూ పస్తులతో పడుకోకుండా ఆహార ప్యాకెట్లను అందించారు. వైద్యపరికరాలు, సామాగ్రిని బాలీవుడ్ సినీతారలు, వ్యాపారవేత్తలు అందజేయగా, గృహనిర్మాణ కార్మికులు ఒక పార్కులో 200 పడకల ఆసుపత్రిని నిర్మించారు. మూడునెలల తర్వాత కొత్త ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ‘జనంతో కిక్కిరిసిపోయిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణ అనేది అతిపెద్ద సవాల్‌గా నిలిచింది. స్థానికంగా ఉన్న డాక్టర్లందరినీ విశ్వాసంలోకి తీసుకుని కరోనా లక్షణాలున్న వారందరినీ ముందుగా గుర్తించాము. ఎప్పటికప్పుడు వారిని ఐసోలేట్ చేయడం, పబ్లిక్ టాయ్లెట్లను రోజుకు లెక్కకు మించినన్నిసార్లు శుభ్రం చేయడం మంచి ఫలితాలనిచ్చింది’అని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో జూన్‌లో రోజుకు 16 కేసుల చొప్పున ఈ మురికివాడల్లో 489 కేసులు రికార్డయ్యాయి. మళ్లీ జీవన సమరంలోకి... వందరోజులకు పైగా అన్నిరకాల వ్యాపారాలు బందయ్యాక, వైరస్ వ్యాప్తిని కట్టడి చేశాక ధారావి ఇప్పుడు కొత్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. అన్నిరకాల పరిశ్రమలు, వృత్తులు మళ్లీ మొదలయ్యాయి. వైరస్ భయాన్ని, దాని బారిన పడితే నూకలు చెల్లుతాయనే జీవన్మరణ సమస్యలను అధిగమించి ఇప్పుడు ధైర్యంగా ముందుకు సాగుతోంది. -
ఆరు రోజులుగా ఒక్కరు మరణించలేదు..
ముంబై: ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందంటున్నారు అధికారులు. గత ఆరు రోజులలో ఇక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎమ్సీ) అధికారులు ఆదివారం వెల్లడించారు. మురికివాడలో ఇప్పటివరకు 71 మరణాలు నమోదయ్యాయని.. ఇక్కడ మరణాల రేటు 2.67 శాతంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా ముంబైలో కరోనా మరణాల రేటు 3.27 శాతంగా ఉంది. ఇదేకాక రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందన్నారు. జూన్ 1న 34 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం కొత్త కేసుల సంఖ్య 10కి పడిపోయిందని బీఎమ్సీ జీ నార్త్ వార్డ్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కిరణ్ దిఘవ్కర్ తెలిపారు. ధారావిలోని ఇరుకైన దారులు, సానిటరీ పరిస్థితులు, సామూహిక మరుగుదొడ్లు ఇతర అనేక పరిస్థితుల ఆధారంగా ఈ ప్రాంతాన్ని వర్గీకరిస్తారు. కరోనా వ్యాప్తికి ఈ ప్రాంతం ఆట స్థలంగా మారింది. ధారావిలో మొదటి కేసు ఏప్రిల్ 1న నమోదయ్యింది. మొదట్లో వైరస్ వ్యాప్తి నెమ్మదిగా ఉండటంతో కేసుల సంఖ్య 100కు చేరడానికి రెండు వారాలు పట్టింది. అయితే మే 3 నాటికి ఆ సంఖ్య 500కి పెరిగింది. తరువాతి పది రోజుల్లో కేసుల సంఖ్య ఏకంగా 1,000 మార్కును దాటి మే 23 నాటికి 1,500 కు చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా అధికారులు కరోనా వ్యాప్తిపై నియంత్రణ సాధించినట్లు తెలిపారు. కరోనా కట్టడిలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. (కరోనా కట్టడిలో యూపీ భేష్.. పాక్ మీడియా) మే 28 -30 వరకు కేవలం 18 కొత్త కేసులు నమోదయ్యాయన్నారు బీఎమ్సీ అధికారులు. జూన్ 1న కేసుల సంఖ్య రెట్టింపయినట్లు గుర్తించామన్నారు. మే మధ్యలో బీఎమ్సీ రోజుకు 50 కేసులను గుర్తించిందని.. కాని నెలాఖరు నాటికి ఆ సంఖ్య కేవలం 20కి పడిపోయిందని తెలిపారు. జూన్ 6 శనివారం నాడు కేవలం పది కొత్త కేసులు మాత్రమే వచ్చాయన్నారు. మే 31 నుంచి జూన్ 6 వరకు ఏడు రోజుల వ్యవధిలో కొత్తగా 148 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ధారావిలోని జీ నార్త్ వార్డ్‌లో బీఎమ్సీ 13 'హై రిస్క్' ప్రాంతాలను గుర్తించింది. ఇక్కడ నమోదవుతున్న కేసులలో మూడింట నాలుగు వంతుల మంది 21 నుంచి 60 సంవత్సరాల వయస్సులోపు వారే ఉన్నారని తెలిపింది. పె జూన్ 1నాటికి, హై రిస్క్ జోన్లలో 47,500 మందిని, విస్తృత కంటైనర్ జోన్లలో 1.25 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు బీఎమ్సీ గణాంకాలు చెబుతున్నాయి. కరోనా రోగులను గుర్తించడానికి.. వ్యాప్తిని అరికట్టడానికి స్థానికంగా జ్వరం క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు బీఎమ్సీ తెలిపింది. ద్ద సంఖ్యలో కుటుంబాలు దగ్గర దగ్గరగా ఉండటం.. దేశంలో అత్యధిక జనాభా సాంద్రత కలిగిన మురికివాడ కావడంతో ధారావి భారతదేశంలో ప్రమాదకర ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.(భయపెట్టి మరీ చికిత్స; భారీ ఫైన్) -
కరోనా విజృంభణ: ఉలిక్కిపడ్డ మహారాష్ట్ర
సాక్షి, ముంబై : మహమ్మారి కరోనా వైరస్ మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రాణాంతక వైరస్ ధాటికి దేశ ఆర్థిక రాజధాని చిగురుటాకులా వణుకుతోంది. ముంబైవాసులను కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2940 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యియి. రాష్ట్రంలో వైరస్ బయటపడినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో కేసులు వెలుగుచూడటం ఇది తొలిసారి. దీంతో మహారాష్ట్ర ఒక్కసారికి ఉలిక్కిపడింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 44,582కి చేరింది. (ఒక్కరోజే 6088 కరోనా కేసులు) ఇక ఆసియాలోనే అత్యంత మురికివాడల్లో ఒకటైన ధారావిలో కరోనా భయాందోళన సృష్టిస్తోంది. శుక్రవారం కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మురికివాడలో మొత్తం కేసుల సంఖ్య 1478కి చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 1460కి పెరిగింది. తాజా కేసులతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాలుగో విడత లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇక దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447కి చేరింది. (శవాల ద్వారా కరోనా వ్యాప్తి చెందదు) -
మమ్మల్ని పట్టించుకోవడం లేదు..
ముంబై: కరోనా వలస కార్మికులను ఆగం చేసింది. ఉన్న చోట తిండి లేక.. సొంత ఊరుకు వెళ్లేందుకు వీలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మీకుల కోసం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. దాంతో వేలాది మంది వలస కార్మీకులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వీరంతా కరోనా విజృంభిస్తోన్న ధారవి, కుర్లా ప్రాంతంలో నివసిస్తున్నారు. మహారాష్ట్రలో దాదాపు 5లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. వీరంతా నిర్మాణ రంగం, ఇటుకల తయారీ వంటి పరిశ్రమల్లో పనుల చేయడం కోసం వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంతో ప్రస్తుతం వీరు సొంత ఊళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు వలస కూలీలు మాట్లడుతూ.. ‘ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. బస్సులు ఏర్పాటు చేయలేదు. శ్రామిక్ రైళ్ల కోసం ఈ నెల 5న రిజిష్టర్ చేసుకుంటే.. ఈ రోజు ప్రయాణానికి కుదిరింది. క్షేమంగా ఇంటికి చేరితే చాలు.. ఊర్లోనే ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం.. మళ్లీ ముంబై రాం’ అన్నారు.(లాక్డౌన్ 4:0: నేడు కొత్త మార్గదర్శకాలు) మరి కొందరు మాత్రం ‘ముంబై నగరం మాకు ఉద్యోగాలు ఇచ్చింది, ఉపాధి కల్పించింది. పరిస్థితులు బాగాలేక ఇప్పుడు వెళ్లి పోతున్నాం. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. అప్పుడు తిరిగి వస్తా’మన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. (కరోనా వైరస్: సేఫ్ జోన్లో గిరిజనం) -
ముంబై మురికివాడలో 808కి చేరిన కేసులు
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన నగరంలోని ధారవిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ధారవిలో శుక్రవారం 25 తాజా కేసులు వెలుగుచూడటంతో ఈ ప్రాంతంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 808కి ఎగబాకింది. కాగా, ముంబైలో కరోనా కేసుల కట్టడికి కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర బృందం సూచించింది. ఇక ముంబై కరోనా మహమ్మారి కేంద్రంగా మారడంతో మహారాష్ట్ర ప్రభుత్వం బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిపై వేటు వేసింది. ప్రవీణ్ స్ధానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఐఎస్ చహల్‌కు ప్రతిష్టాత్మక బీఎంసీ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ముంబై నగరంలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసులను అదుపులోకి తేవడంలో ప్రవీణ్ విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది చదవండి : స్లమ్స్‌లో వణుకు... ఇక్కడా ఇరుకు -
ధారావిలో ఒక్కరోజే 94 కరోనా కేసులు
సాక్షి, ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే 94 కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా, ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఒక్కరోజే ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించడం వల్ల ధారావిలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పదిలక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 590 కి పైగా కోవిడ్-19 కేసులు నమోదుకాగా, మరణాల సంఖ్య 20కి పెరిగింది. (‘ధారావి’లో కరోనా విజృంభణ) ముంబై పురపాలక సంస్థ నుంచి కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ధారావిలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించారు. అయినప్పటికీ అత్యధిక జనసాంద్రత, ఇరుకు ప్రాంతం కావడంతో భౌతిక దూరం పాటించడం కష్టతరం అయ్యింది. దీంతో పరిస్థితిని అదుపు చేయడం అధికారులకుసవాల్గా మారింది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో కరోనా మహమ్మరి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 40 వేలకిపైగా కేసులు నమోదు కాగా, అత్యధికంగా మహారాష్ర్టలోనే వెలుగుచేస్తున్నాయి. -
కరోనా : పోలీస్ శాఖలో కలకలం
ముంబై : కరోనా వైరస్ ముంబై పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఇప్పటికే 100కి పైగా పోలీసులు ఈ వైరస్ భారిన పడ్డారు. తాజాగా వడాలా పోలీసు స్టేషన్ పరిధిలోని 9 మంది కానిస్టేబుల్స్‌కు కోవిడ్ సోకింది. గురువారం నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలడంతో ముంబైలోని గురునానక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక వీరి కుటుంసభ్యులను కూడా క్వారంటైన్లో ఉంచామని అధికారులు తెలిపారు. వడాలా పోలిస్ స్టేషన్ పరిధిలో మెత్తం 7రెడ్ జోన్లు ఉన్నాయని, వీటిలోనే 9 మంది పోలీస్ కానిస్టేబుల్స్ విధులు నిర్వహించడంతో కరోనా సోకిందని అనుమానిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ రష్మి కరాండికర్ తెలిపారు. (ముంబై పోలీసులకు అక్షయ్ విరాళం) ఇక ముంబైలోని ధారావిలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆంధోళన కలిగిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో గురువారం ఒక్కరోజే 25 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 369కి పెరిగింది. ఒక్క ధారావి లోనే కోవిడ్ కారణంగా ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత రెండు రోజుల్లోనే ధారావి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుగురు పోలీసులకి కరోనా సోకింది. ఇప్పటివరకు నగరంలో ముగ్గురు పోలీసులు వైరస్ ధాటికి మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో 55 ఏళ్లు పైబడిన పోలీసులు ఇళ్లలోనే ఉండాలని నగర పోలీసు చీఫ్ పరంబిర్ సింగ్ ఆదేశించారు. (‘ధారావి’లో కరోనా విజృంభణ) -
‘ధారావి’లో కరోనా విజృంభణ
సాక్షి, ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం తాజాగా 25 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 369కి పెరిగింది. ఈ ప్రాంతంలో కోవిడ్ సోకి ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత ఇరుకు ప్రాంతమైన ధారావిలో కరోనాను కట్టడి చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్డౌన్ ఉపసంహరించాక వైరస్ విజృంభణను ఏవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తుందో చూడాలి. కేంద్ర వైద్యారోగ్య తాజా గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో ఇప్పటివరకు 9915 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 432 మంది మరణించారు. కోవిడ్-19 బారిన పడిన వారిలో 1,593 మంది కోలుకున్నారు. ముంబై మహానగరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి పెరిగింది. కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు 1074 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ తరహాలో భారత్‌లో లాక్డౌన్! -
ధారావిని వీడని మహమ్మారి..
ముంబై : మహమ్మారి బారినపడి విలవిలలాడుతున్న ముంబై మహానగరంలో అధికారులు, వైద్య సిబ్బంది ప్రాణాంతక వైరస్ నిరోధానికి పోరాడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నగరంలోని ధారావిలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ధారావిలో బుధవారం 14 తాజా కేసులు నమోదయ్యాయని దీంతో ఆ ప్రాంతంలో పాజిటివ్ కేసుల సంఖ్య 344కు ఎగబాకిందని అధికారులు వెల్లడించారు. ధారావిలో ఈ రోజు ఎలాంటి కోవిడ్-19 మరణాలు చోటుచేసుకోలేదని చెప్పారు. మహీంలో 3 పాజిటివ్ కేసులు నమోదవగా, దాదర్‌లో కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. చదవండి : ముంబైలో చిక్కుకున్న మత్స్యకారులు -
ధారావిలో కరోనా కేసుల తగ్గుముఖం
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించే ధారావిలో వైరస్ వ్యాప్తి కలకలం రేపింది. భౌతిక దూరం పాటించడానికి అతికష్టమైన భౌగోళిక పరిస్థితులు కలిగిన ఇరుకైన ప్రాంతమైన ధారవిలో వ్యక్తుల కాంటాక్టుల జాడ పట్టుకోవడం కూడా చాలా కష్టమైన పని. అయితే గురువారం నమోదైన 25 కేసులతో పోలిస్తే శుక్రవారం తక్కువగా కేవలం 5కేసులు మాత్రమే కొత్తగా నమోదయ్యాయి. పదిలక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో కోవిడ్-19 రోగుల సంఖ్య 220కి చేరుకోగా, ఇప్పటి వరకు 14 మంది మృతిచెందారు. ముంబై పురపాలక సంస్థ నుంచి కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ధారావిలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించారు. శరవేగంగా భారీ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, కొత్త ఐసోలేషన్, వైద్య మౌలిక వ్యవస్థలను సిద్ధం చేసి కరోనా కట్టడి కోసం రేయింబవళ్లు తీవ్ర కృషి చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రజలను తమ ఇళ్లలోనే ఉండేలా క్వారంటైన్ చేయడం, వారి రోజువారీ రేషన్ సరుకులను ఉచితంగా అందించడం అనేది ఏకకాలంలోనే కొనసాగిస్తున్నారు. నగరంలోని వ్యాపార వర్గాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విరాళాల ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ దీన్ని నిర్వహిస్తోంది. ఐసోలేట్ చేసిన అన్ని ఇళ్లకూ బియ్యం బస్తాలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆయిల్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. పలువురు ఎన్జీవోలకు చెందిన వారు కూడా ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. 150 మంది కార్మికులతో కూడిన శానిటరీ ఇన్స్పెక్టర్లు రోజూ చెత్త ఏరివేయడం, ఇళ్లలో, రూముల్లో, భవనాల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా క్రిమిసంహారక మందులను స్ప్రే చేయడం, మురికికాలువలను క్లీన్‌గా ఉంచడం వంటి విధులను నిర్వహిస్తున్నారు. తొలి కరోనా వైరస్ బాధితుడు మృతి చెందగానే మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు చేపట్టడంతోనే కొంత మేర సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే కరోనా కేసులు పూర్తిగా తగ్గే వరకు ధారావిలో కట్టుదిట్టమైన చర్యలు కొనసాగించాలని లేకపోతే వైరస్ వ్యాప్తి సులువుగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
అక్కడ 200 దాటిన పాజిటివ్ కేసులు..
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించే ధారావిలో వైరస్ విజృంభణపై ఆందోళన వ్యక్తమవుతోంది. పదిలక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో కోవిడ్-19 రోగుల సంఖ్య 214కు చేరకుంది. ధారావిలో గురువారం 25 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి బారినపడి ఈ ప్రాంతంలో 13 మంది మరణించారని బీఎంసీ అధికారులు తెలిపారు. ధారావిలోని కుట్టినగర్, మతుంగ లేబర్ క్యాంప్, ఆజాద్ నగర్, చమదబజార్, ముకుంద్ నగర్, కళ్యాణ్వాడి వంటి పలు ప్రాంతాల్లో తాజా కేసులు గుర్తించామని చెప్పారు. ముంబైలోనే అత్యంత ఇరుకైన ప్రాంతమైన ధారావిలో వైరస్ వ్యాప్తి అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చదవండి : ముంబైలో మనోళ్లు బిక్కుబిక్కు..