
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ధారావిలో గురువారం 26 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ ప్రాంతంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86కు పెరిగింది. కరోనా వైరస్‌తో బాధపడుతూ ఓ వ్యక్తి చనిపోవడంతో ధారావి మురికివాడలో మృతుల సంఖ్య 9కి చేరిందని అధికారులు వెల్లడించారు. ధారావిలోని లక్ష్మీచాల్ ప్రాంతానికి చెందిన 58 సంవత్సరాల వ్యక్తి గురువారం మరణించారని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారి తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావిలో 15 లక్షల మంది నివసిస్తారు. కాగా, మహారాష్ట్రలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2919కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment