ముంబై: దేశంలోనే అత్యధిక కోవిడ్-19(కరోనా వైరస్) కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ శనివారం నాటికి 1574 మంది కరోనా బారిన పడగా 110 మంది మృతి చెందారు. అయితే ఒక్క ముంబైలోనే వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదు కావడం కలవరపరిచే అంశం. తాజాగా ప్రముఖ తాజ్ హోటల్‌లోని ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో శనివారం వీరిని బాంబే ఆసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించింది చికిత్స అందిస్తున్నట్లు ఓ వైద్యుడు వెల్లడించారు. (ముంబై వొఖార్డ్ ఆసుపత్రి సీజ్)
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తగా వీరితోపాటు పనిచేసిన ఇతర ఉద్యోగులకు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కాగా తమ హోటల్స్ ప్రస్తుతం మూసివేసి ఉన్నాయని, కాకపోతే అక్కడి సామాగ్రిని చూసుకోవడానికి పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉన్నారని తాజ్ హోటల్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరు గాంచిన ధారవిలో మరో 15 కరోనా కేసులు వెలుగుచూశాయి. (పొంచివున్న పెనుముప్పు ‘ధారవి’)
Comments
Please login to add a commentAdd a comment