taj hotel
-
‘ముంబై’ దాడులపై నాడు స్పందనే లేదు!
ముంబై: 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై విదేశాంగ మంత్రి జై శంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ఆ దాడికి భారత్ వైపు నుంచి స్పందనే లేకపోయిందంటూ ఆక్షేపించారు. ముంబైలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ముంబై దాడి జరిగినప్పుడు భారత్ నుంచి దానిపై స్పందనే లేదు. ఆ సమయంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ సభ్య దేశం. ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధ్యక్ష స్థానంలో ఉంది. ఆ కమిటీ బేటీ కూడా ఉగ్ర దాడికి లక్ష్యంగా మారిన ముంబై తాజ్ హోటల్లోనే జరిగింది’’ అని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు పరిస్థితి మారింది. నేడున్నది నాటి భారత్ కాదు. ఉగ్ర ఘటనలపై గట్టిగా స్పందిస్తున్నాం. దుస్సాహసం చేస్తే మన సమాధానమే వేరుగా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. మనతో పగలు వ్యాపారం చేస్తాం, రాత్రిళ్లు మనపైనే ఉగ్ర దాడులు చేస్తామంటే కుదరదన్నారు. తూర్పు లద్దాఖ్‌లో 2020 నాటి పరిస్థితి నెలకొనాలంటే చైనా సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ అన్నారు. -
'గోరుముద్ద'కు తాజ్ రుచులు
సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ మరింత రుచిగా మారనుంది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి పోషకాలతో అందించాలన్న లక్ష్యంతో వంటల తయారీలో మరిన్ని మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రోజుకో మెనూ చొప్పున వారంలో ఆరు రోజులపాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల (జూన్) 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో ప్రభుత్వం మరింత దృష్టిపెట్టింది. ప్రస్తుతం అందిస్తున్న మెనూనే మరింత రుచితో పాటు పోషకాలతో అందించేందుకు తిరుపతిలోని హోటల్ తాజ్ చెఫ్‌ల సహకారం తీసుకుంది. రోజుకో మెనూ అందిస్తున్నందున అదే భోజనాన్ని ఇక ప్రత్యేకంగా ఎలా తయారుచెయ్యొచ్చో తెలిపేలా ఆరు వీడియోలను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. వీటిని మధ్యాహ్న భోజనం వండుతున్న సుమారు 85 వేల మంది సిబ్బందికి చూపించి అవగాహన కల్పి0చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా వీడియోల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంట ఎలా చేయాలో తాజ్ చెఫ్‌లు వివరించడమే కాకుండా వాటి ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేస్తారు. గోరుముద్ద యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియోలను మధ్యాహ్న భోజనం అందించే రాష్ట్రంలోని 44,190 పాఠశాలల్లో పనిచేస్తున్న మొత్తం 85 వేల మంది వంటవారు వారి స్మార్ట్ఫోన్లలో చూస్తారు. స్మార్ట్‌ఫోన్ లేకుంటే ఉన్నత పాఠశాలల్లోని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ)పైన, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీల్లోను పాఠశాల సమయం ముగిశాక సిబ్బందికి చూపిస్తారు. పిల్లల ఆరోగ్యం కోసం మెనూ రూపకల్పన.. నిజానికి.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో బాధ్యతలు చేపట్టాక పేద పిల్లల విద్య, ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టిపెట్టారు. అప్పటికే నిర్విర్యమైపోయిన ప్రభుత్వ పాఠశాల విద్యపై పలు సంస్కరణలు అమలుచేశారు. అప్పటివరకు బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్నం నీళ్ల సాంబారు, ముద్దయిపోయిన అన్నం పెడుతుండడంతో 40 శాతం మంది పిల్లలు కూడా ఆ భోజనాన్ని తినకపోవడాన్ని గుర్తించారు. దీంతో ముఖ్యమంత్రే స్వయంగా రోజుకో మెనూ చొప్పున ‘జగనన్న గోరుముద్ద’ను రూపొందించారు. వంటపై మూడంచెల పర్యవేక్షణ ఏర్పాటుచేసి ఉపాధ్యాయులు, విద్యార్థులను భాగస్వాములను చేశారు. రాష్ట్రంలోని 44,190 ప్రభుత్వ పాఠశాలల్లో ఏ రోజు ఏ మెనూ ఎలా ఉందో పరిశీలించేందుకు.. వంటలో నాణ్యతను చూసేందుకు ‘ఏఐ’ టెక్నాలజీ యాప్‌ను రూపొందించి, మండల స్థాయి నుంచి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, ముఖ్య కార్యదర్శి వరకు ఆ వివరాలు తెలిసేలా చర్యలు తీసుకున్నారు.దీంతో నాలుగేళ్లుగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య 90 శాతానికి పెరిగింది. మిగిలిన 10 శాతం మంది (ముఖ్యంగా బాలికలు) ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి బాక్సులను తెచ్చుకుంటున్నారు. జగనన్న ‘గోరుముద్ద’తో పరిపూర్ణత.. పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు రాష్ట్రంలోని 44,190 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫో ర్టి ఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం పెడుతున్నారు. రోజుకో మెనూ చొప్పున సోమవారం నుంచి శనివారం వరకు 16 రకాల పదార్థాలను గోరుముద్దలో చేర్చారు. ఏ రోజు ఏయే పదార్థాలు పెట్టాలో మెనూలో స్పష్టంగా పేర్కొన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడ్రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి చేశారు. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల లేదా విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది వచ్చి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా రక్తహీనతను తగ్గించేందుకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. మధ్యాహ్న భోజనం 100 శాతం తినేలా మార్పులు.. ప్రస్తుతం రాష్ట్రంలోని 36,612 పాఠశాలల్లో విద్యార్థులు 100 శాతం మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. మరో 5,012 పాఠశాలల్లో 95–99 శాతం మంది తింటుండగా, 885 పాఠశాలల్లో 90–95 శాతం మధ్య, 439 పాఠశాలల్లో 85–90 శాతం మధ్య, 353 పాఠశాలల్లో 80–85 శాతం మంది గోరుముద్ద తీసుకుంటున్నారు. 522 పాఠశాలల్లో 50–80 శాతం, 60 పాఠశాలల్లో 30–50 శాతం మధ్య ఉండగా, 236 పాఠశాలల్లో మాత్రమే 30 శాతంలోపు తీసుకుంటున్నారు.ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లోను 100 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకునేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బడికి వచ్చిన ప్రతి విద్యార్థీ బడిలో అందించే మధ్యాహ్న భోజనం తినేలా రుచిగా, వంటలో పిల్లల ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు ఉండేలా చర్యలు చేపట్టారు. అందుకనుగుణంగా తిరుపతిలోని హోటల్ తాజ్ చెఫ్‌లతో వంటలపై రూపొందించిన వీడియోల ద్వారా సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. గోరుముద్ద మెనూ ఇదీ.. » సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటేబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ » మంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు » బుధవారం వెజిటేబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ » గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు » శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ » శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ -
‘26/11’ కుట్రదారులు ఇంకా బయటే...
ముంబై: ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడుల కుట్రధారులు, పాత్రధారులు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారు. నిక్షేపంగా తిరుగుతున్నారు. వారికి ఏ శిక్షలూ పడడం లేదు’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు విస్తరించిందని, దానితో నష్టాల గురించి ఇతరుల కంటే భారత్‌కే ఎక్కువగా తెలుసని అన్నారు. ‘ఉగ్రవాద కార్యకలాపాలకు నూతన సాంకేతికను వాడుకోకుండా నిరోధించడం’ అనే అంశంపై 26/11 దాడులకు సాక్షిగా నిలిచిన ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు. దాడుల మృతులకు గబాన్ దేశ విదేశాంగ మంత్రి, యూఎన్ఎస్సీ అధ్యక్షుడు మైఖేల్ మౌసా–అడామో తదితరులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరో దేశం నుంచి వచ్చిన ముష్కరులు మారణహోమం సృష్టించారని పాకిస్తాన్‌పై ధ్వజమెత్తారు. కరడుగట్టిన ఉగ్రవాదుల విషయంలో రాజకీయ కారణాల వల్ల ఐరాస భద్రతా మండలి చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. పాక్ ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా చైనా çఅడ్డుకుంటోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఆ సంస్థలకు నిధులందకుండా చేయాలని సూచించారు. అలా చేస్తే వారి వెన్ను విరిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. -
రతన్‌టాటా సింప్లిసిటీ.. కోట్లు విలువ చేసే కారున్నా..
Ratan Tata Nano Car: సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే రతన్‌టాటా మరోసారి తాను నమ్ముతున్నవాటిని ఆచరణలో పెట్టి చూపించారు. భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. రతన్‌టాటా తన అభిమానులకు ఆకట్టుకున్నారు. దేశంలోనే పేరెన్నికగల టాటా గ్రూపులకు బిగ్‌బాస్‌గా ఉంటున్నా గ్రౌండ్ టూ ఎర్త్ ఉండటంలో ఆయనకు ఆయనే సాటిగా నిలుస్తున్నారు. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న ప్రముఖ తాజ్ హోటల్ టాటా గ్రూపు నిర్వాహణలోనే ఉంది. బడా పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ దురందరులు, కార్పొరేట్ బిగ్షాట్స్, విదేశీ టూరిస్టులతో ఈ హోటల్ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ హోటల్ గ్యారేజీలో ఇంపోర్టెడ్ కార్లే ఎక్కువగా కనిపిస్తాయి. కనీసం యాభై లక్షల విలువ చేయని కారు ఈ హోటల్ గేటు దాటి లోపలికి వెళ్లదని ప్రతీతి. అలాంటి హోటల్లోకి 2022 మే 17 సాయంత్రం దేశంలోనే చీపెస్ట్ కార్లలో ఒకటైన నానో ఎంటరైంది. నమ్మలేకపోయారు ది గ్రేట్ తాజ్ హోటల్‌కి మరీ చీప్‌గా నానో కారులో వచ్చిన వ్యక్తి ఎవరా అంటూ అక్కడున్న వారు వింతగా చూశారు. అప్పుడు కనిపించిన దృశ్యం చూసి వారు అవాక్కయ్యారు! ఆ కారులో వచ్చింది రతన్‌టాటా కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు! తాము చూస్తున్నది నిజమేనా అని అనుమాన పడ్డారు. తాజ్ ఎదుట నానోలో వచ్చింది సాక్షాత్తు రతన్‌టాటా అని గుర్తించారు. తేరుకుని తమ ఫోన్లను చేతుల్లోకి తీసుకున్నారు. తమ కెమెరాల్లో నానోలో వచ్చిన రతన్‌టాటాను బంధించించారు. లగ్జరీ కార్లను కాదని టాటా గ్రూపు పరిధిలోనే ల్యాండ్‌రోవర్, జాగ్వార్ వంటి లగ్జరీ హై ఎండ్ కార్లు ఉన్నాయి. అయినా సరే వాటిని పక్కన పెట్టి సామాన్యుల కోసం, ఈ దేశ మధ్యతరగతి ప్రజల కోసం ఆయన రూపొందించిన నానో కారునే రతన్‌టాటా తన ప్రయాణానికి ఎంచుకోవడం చూపరులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు లక్షల కోట్ల రూపాయల విలువైన టాటా గ్రూపును నడిపిస్తున్నా కనీసం బాడీగార్డు కూడా లేకుండా ఎటువంటి హంగామా చేయకుండా ఓ కామన్మ్యాన్లా వ్యవహరించిన రతన్‌టాటాను మెచ్చుకోలుగా చూశారు. వైరల్ వీడియో తాజ్ హోటల్‌కి నానో కారులో వచ్చిన రతన్ టాటా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లవ్ యూ రతన్‌టాటా, వీ రెస్పెక్ట్ రతన్‌టాటా, సింప్లిసిటికీ ప్రతిరూపం, హ్యాట్సాఫ్ టాటా, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నావ్.. అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్టా అని తేడా లేకుండా అంతటా రతన్‌టాటాకు జై కొడుతున్నారు. Ratan Tata arrives at Taj Mumbai in a Nano sitting in front seat with his driver. No security either. Exemplary simplicity personified. 💯👏🏾 pic.twitter.com/XAbyLLoCpt — Maya (@Sharanyashettyy) May 17, 2022 చదవండి: Ratan Tata: ‘టాటా ఎప్పుడు అలాంటి పనులు చేయదు’ -
వాహ్.. తాజ్..!
న్యూఢిల్లీ: టాటాలకు చెందిన ‘తాజ్’ ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ‘హోటల్స్ 50 2021’ పేరుతో బ్రాండ్ ఫైనాన్స్ ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా కానీ ‘తాజ్’ హోటళ్లు బలంగా నిలబడినట్టు నివేదిక అభిప్రాయపడింది. టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) కింద తాజ్ హోటళ్లు నడుస్తుండడం గమనార్హం. 2016లో తాజ్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా 38వ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత తొలిసారి ఈ జాబితాలోకి ప్రవేశించడమే కాకుండా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘ఈ అంశాల ఆధారంగా చూస్తే తాజ్ బ్రాండ్ విలువ 296 మిలియన్ డాలర్లతో (రూ.2,200 కోట్లు) ప్రపంచంలో బలమైన హోటళ్ల బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్‌లో 100కు గాను 89.3 స్కోర్‌ను సంపాదించుకుంది. ఇది ఏఏఏ బ్రాండ్ రేటింగ్‌కు సమానం’’ అని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. తాజ్ తర్వాత ప్రీమియన్ ఇన్ రెండో స్థానంలో, మెలియా హోటల్స్ ఇంటర్నేషనల్ మూడో స్థానంలో, ఎన్‌హెచ్ హోటల్ గ్రూప్, షాంగ్రి లా హోటల్స్ తర్వాతి రెండు స్థానాల్లోనూ ఉన్నాయి. -
మారుతున్న ‘5 స్టార్’ రుచులు
న్యూఢిల్లీ: మారిన పరిస్థితుల్లో 5 స్టార్ హోటళ్లు నూతన వ్యాపార అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం గతేడాది మార్చి, ఏప్రిల్‌లో విధించిన లాక్డౌన్లు స్టార్ హోటళ్లకు కొత్త మార్గాలను వెతుక్కునేలా చేశాయి. ఈ క్రమంలోనే కోరుకున్న ఆహారాన్ని కస్టమర్ల ఇంటికే డెలివరీ చేసే వ్యాపారాన్ని కొన్ని ప్రారంభించాయి. ఆ తర్వాత లాక్డౌన్లు క్రమంగా తొలగిపోయినప్పటికీ.. హోటళ్ల వ్యాపారం పెద్దగా పుంజుకున్నది లేదు. ఈలోపే కరోనా రెండో వేవ్ (దశ) వచ్చి పడింది. ఫలితంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్లు లేదా కర్ఫ్యూల పేరుతో ఆంక్షల బాట పట్టాయి. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలపై 5 స్టార్ హోటళ్లు దృష్టి సారించాయి. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల అందరిలోనూ శ్రద్ధ కొంత పెరిగిన విషయం వాస్తవం. దీన్ని ఎందుకు వ్యాపార అవకాశంగా మార్చుకోకూడదు? అన్న ఆలోచన వాటికి వచ్చింది. దీంతో మంచి పోషకాహారం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలతో సరికొత్త రుచుల మెనూ తయారీని ప్రారంభించాయి. ఆకర్షణీయమైన ధరలను నిర్ణయించడం ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఫీల్ మెనూ ఐటీసీ హోటల్స్ కూడా ఇదే విధంగా ‘ఫీల్మెనూ’ను రూపొందించింది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించాలన్న ప్రణాళికతో ఉంది. రుతువుల వారీగా స్థానికంగా లభించే ముడిసరుకులతో (వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి) ఆహారపదార్థాలను అందించాలనుకుంటోంది. ‘‘ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార రుచులను ఎన్నింటినో ఇప్పటికే అందిస్తున్నాము. ఇప్పుడు స్థానికంగా సూపర్ ఫుడ్‌గా పరిగణించే వాటిని మా జాబితాలోకి చేర్చనున్నాము’’ అని ఐటీసీ హోటల్స్ కార్పొరేట్ చెఫ్ మనీషా బాసిన్ చెప్పారు. ఇద్దరి భోజనానికి ధర రూ.1,100–1,400 మధ్య ఉంటుందని ఆమె తెలిపారు. అంటే ఐటీసీ ఆన్లైన్ హోమ్ డెలివరీ బ్రాండ్ గోర్మెట్కచ్తో పోలిస్తే ఈ ధరలు తక్కువగానే ఉన్నాయి. ఈ నెల 25న ఐటీసీ సరికొత్త ఆహారపదార్థాల మెనూను విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని ఐటీసీ హోటళ్లలో ఈ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి. తాజ్, జింజెర్ బ్రాండ్ హోటళ్లను కలిగిన ఇండియన్ హోటల్ కంపెనీ రెండు వారాల కిందటే ప్రత్యేకమైన ఆహారపదార్థాల జాబితాను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ క్యుమిన్పై ఇవి అందుబాటులో ఉన్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత కోలుకునే సమయంలో వివిధ వయసుల వారికి అవసరమైన పోషకాహార పదార్థాలు ఇందులో ఉన్నాయి. కొట్టక్కల్ ఆర్యవైద్యశాలకు చెందిన నిపుణుల సలహాల మేరకు కొత్త పదార్థాలను ఈ సంస్థ రూపొందించింది. రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలను కలిగిన మూలికలు, దినుసులు, ఇతర పదార్థాలను ఇందులో వినియోగిస్తున్నట్టు ఇండియన్ హోటల్ ‘క్యుమిన్’ కమర్షియల్ డైరెక్టర్ జహంగీర్ తెలిపారు. ఒబెరాయ్ సైతం..: ఒబెరాయ్ గ్రూపు హోటళ్లలోనూ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్‌పై కస్టమర్ల ఇంటికి డెలివరీ సైతం చేస్తున్నాయి. మునగ, ఖర్జూరం, పుట్టగొడుగులు, బ్రొక్కోలి తదితర ముడి పదార్థాలుగా ఆహార పదార్థాలను ఒబెరాయ్ గ్రూపు హోటళ్లు ఆఫర్ చేస్తున్నాయి. మూడ్ డైట్స్... మారియట్ ఇంటర్నేషనల్ ‘మూడ్ డైట్స్’ పేరుతో మెనూను పరిచయం చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ‘మారియట్ ఆన్ వీల్స్’ బ్రాండ్ కింద నిర్వహిస్తోంది. ఈ నెల చివరి నుంచి ఆహార ప్రియులకు మంచి భావనలను కల్పించే మూడ్ డైట్స్‌ను సైతం మారియట్ ఆన్ వీల్స్ వేదికగా అందించనుంది. ‘‘డార్క్ చాక్లెట్, కాఫీ, అరటి, బెర్రీలు, నట్స్, సీడ్స్ మంచి భావనలను కల్పించే ఆహార పదార్థాలు. మనకు తెలియకుండానే వీటిని తరచుగా తింటుంటాం. దీంతో ఈ ఆహార పదార్థాలనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’’ అని మారియట్ఇంటర్నేషనల్ కలినరీ డైరెక్టర్ హిమాన్షు తనేజా తెలిపారు. మంచి ఆహారం మంచి భావనలకు మధ్యనున్న అనుబంధం నుంచి తమకు ఈ ఆలోచన వచ్చినట్టు చెప్పారు. -
76 మందికి కరోనా.. ‘తాజ్’ మూసివేత
డెహ్రాడూన్: మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గతేడాది మాదిరి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఒకేసారి 76 మందికి పాజిటివ్ సోకడంతో ప్రముఖ హోటల్ ‘తాజ్’ మూతపడింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిర్వాహకులు హోటల్‌ను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాంతాలుగా ఉన్న రిశికేశ్, డెహ్రాడూన్లలో భారీగా కేసులు నమోదవుతుండడంతో కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. హోటల్‌ను శానిటైజ్ చేశామని.. ముందు జాగ్రత్తలో భాగంగా మూసివేసినట్లు ఎస్పీ తృప్తి భట్ మీడియాకు చెప్పారు. రిషికేశ్‌లోని తాజ్ రిసార్ట్ అండ్ స్పాలో గత మంగళవారం 16 మంది ఉద్యోగులకు కరోనా వ్యాపించింది. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు పరీక్షలు భారీగా చేయించారు. ఈ క్రమంలో మరికొందరి పరీక్షలు నిర్వహించగా మొత్తం కేసులు కలిపి 76 మందికి మహమ్మారి వ్యాపించింది. దీంతో మరో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసివేశారు. అయితే కొన్ని రోజుల్లో ఉత్తరాఖండ్‌లో జరగాల్సిన మహాకుంభమేళాకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమయంలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా మేళాకు వచ్చేవారు కచ్చితంగా పరీక్షలు చేసుకోవాలని.. నెగటివ్ వస్తేనే అనుమతి ఇవ్వనున్నారు. -
26/11 దాడులకు12 ఏళ్లు
ముంబై: 26/11 ముంబై ఉగ్ర దాడులకు పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ దాడుల్లో అమరులైన భద్రతా సిబ్బందికి నివాళులర్పించే కార్యక్రమాన్ని నగర పోలీసులు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో ప్రజలను మాత్రమే అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం దక్షిణ ముంబైలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో కొత్తగా నిర్మించిన స్మారక చిహ్నంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అమరులైన పోలీసు కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది హాజరవుతారని ఓ అధికారి బుధవారం తెలిపారు. రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, డీజీపీ సుభోధ్ కుమార్ జైస్వాల్, ముంబై పోలీసు కమిషనర్ పరమ్‌బిర్ సింగ్ ఇతర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు తెలిపారు. తీర ప్రాంత రహదారి ప్రాజెక్టు కొనసాగుతున్న కారణంగా మెరైన్ డ్రైవ్ వద్ద ఉన్న పోలీస్ జింఖానా వద్ద ఉన్న స్మారకాన్ని పోలీసు ప్రధాన కార్యాలయానికి మార్చారు. 2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి పది మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా వచ్చి కాల్పులు జరిపారు. 18 భద్రతా సిబ్బందితో పాటు 166 మంది ఈ దాడుల్లో మరణించారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని ఎలైట్ కమాండో ఫోర్స్ అయిన ఎన్ఎస్జీతో సహా భద్రతా దళాలు 9 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. -
బ్రాండ్స్‌కు కరోనా గండం!!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో దేశీయంగా టాప్ 100 కంపెనీల బ్రాండ్ విలువ గణనీయంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది జనవరిలోని వేల్యుయేషన్‌తో పోలిస్తే ఏకంగా 25 బిలియన్ డాలర్ల మేర విలువ పడిపోయి ఉండొచ్చని ఓ నివేదిక చెబుతోంది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా టాప్ 500 బ్రాండ్స్ విలువ జనవరితో పోలిస్తే 1 లక్ష కోట్ల డాలర్ల మేర పడిపోయింది. టాప్ బ్రాండ్స్ ఇవే..: టాటా గ్రూప్ అత్యంత విలువైన బ్రాండ్‌గా కొనసాగుతోంది. విలువ కేవలం 2% పెరిగినప్పటికీ ఈ ఏడాది తొలిసారిగా 20 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ మైలురాయిని అధిగమించింది. లగ్జరీ హోటల్ బ్రాండ్ తాజ్ దేశంలోనే అత్యంత పటిష్టమైన బ్రాండ్‌గా నిల్చింది. 100 పాయింట్ల సూచీలో 90.5 పాయింట్లు దక్కించుకుంది. ఇక, 8.1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఎల్ఐసీ రెండో స్థానంలో, 7.9 బిలియన్ డాలర్లతో రిలయన్స్ మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత 4,5 స్థానాల్లో ఇన్ఫోసిస్ (7.08 బిలియన్ డాలర్లు), ఎస్బీఐ (6.4 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరగా, మహీంద్రా ఒక స్థానం తగ్గి ఏడో ర్యాంక్‌కు పడిపోయింది. ఇండియన్ ఆయిల్ 15 ర్యాంకులు ఎగబాకి 8వ స్థానానికి చేరగా, హెచ్‌సీఎల్ ఒక ర్యాంకు తగ్గి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఎయిర్టెల్ 8 స్థానాలు పడిపోయి 10వ ర్యాంకులో నిల్చింది. కాగా, అంతర్జాతీయంగా 500 కంపెనీల్లోని టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ టాటా గ్రూప్ మాత్రమేనని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. -
తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా
ముంబై: దేశంలోనే అత్యధిక కోవిడ్-19(కరోనా వైరస్) కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ శనివారం నాటికి 1574 మంది కరోనా బారిన పడగా 110 మంది మృతి చెందారు. అయితే ఒక్క ముంబైలోనే వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదు కావడం కలవరపరిచే అంశం. తాజాగా ప్రముఖ తాజ్ హోటల్లోని ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో శనివారం వీరిని బాంబే ఆసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించింది చికిత్స అందిస్తున్నట్లు ఓ వైద్యుడు వెల్లడించారు. (ముంబై వొఖార్డ్ ఆసుపత్రి సీజ్) ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తగా వీరితోపాటు పనిచేసిన ఇతర ఉద్యోగులకు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కాగా తమ హోటల్స్ ప్రస్తుతం మూసివేసి ఉన్నాయని, కాకపోతే అక్కడి సామాగ్రిని చూసుకోవడానికి పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉన్నారని తాజ్ హోటల్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరు గాంచిన ధారవిలో మరో 15 కరోనా కేసులు వెలుగుచూశాయి. (పొంచివున్న పెనుముప్పు ‘ధారవి’) -
తాజ్ నాయిక ఇప్పుడు తాజా నాయిక
పదకొండేళ్ల క్రితం ముంబై పేలుళ్లలో తాజ్ హోటల్లో దిగినవాళ్లను అలెర్ట్ చేసి, ప్రాణాలు కాపాడిన మల్లికా జగద్.. ‘క్రైసిస్ మేనేజర్’గా మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ‘ముప్పును తప్పించు కోవడం’పై మల్లిక ఇస్తున్న మోటివేషనల్ స్పీచ్‌ల ఆడియోలు, వీడియోల కాపీలను ఇండియాలోని పెద్ద పెద్ద హోటళ్లు బస చేసేందుకు వచ్చే తమ అతిథులకు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సున్నితమైన పరిస్థితుల రీత్యా ముందు జాగ్రత్తగా మల్లిక ఇస్తున్న టిప్స్‌ని హోటళ్లు, ట్రావెలర్స్ ఫాలో అవుతున్నారు. 26 /11. ఈ తేదీ భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఈ తేదీతో పాటు దేశానికంతటికీ ఒక పేరు గుర్తొస్తుంది. అజ్మల్ కసబ్! ఆ రోజు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా టెర్రరిస్టులు దేశంలో చొరబడి ముంబైలో సృష్టించిన నరమేధాన్ని దేశం మర్చిపోవడం కష్టమే. ఉగ్రమూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన 174 మంది అభాగ్యుల లెక్క ఉంది. మూడు వందల మంది క్షతగాత్రుల లెక్క ఉంది. అయితే బతికి బయటపడిన వారి ప్రాణాల లెక్క గురించి అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత కొన్నాళ్లకు మల్లికా జగద్ అనే మహిళ వల్ల ఆ లెక్క తెలిసింది. ఉగ్రదాడి సమయంలో తాజ్ ప్యాలెస్‌లో చిక్కుకున్న అతిథులను కాపాడిన మల్లికా జగద్ ఆ హోటల్లో డైనింగ్ హాల్ నిర్వహణ బాధ్యతలు చూసుకునే అసిస్టెంట్ బాంక్వెట్ మేనేజర్. అప్పుడామె వయసు ఇరవై నాలుగేళ్లు. ఘటన జరిగింది 2008లో. భోజనాలు చేస్తున్నారు ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర. భోజనాల సమయం. ఉన్నట్లుండి తుపాకీ పేలుళ్లు వినిపించాయి. మొదట్లో ఆ శబ్దాలను తుపాకీ పేలుళ్లనుకోలేదామె. ఆమే కాదు, తాజ్ హోటల్లో హెరిటేజ్ వింగ్‌లో ఉన్న అరవైకి పైగా అతిథులు కూడా ఆ శబ్దాలను టపాకాయల శబ్దాలుగానే పొరబడ్డారు. అది పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా అందుకు కారణమే. ఆ సంఘటన మల్లిక జ్ఞాపకాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉంది. ‘‘హోటల్లో పేలుళ్లు వేగవంతమైన కొద్దిసేపటికి అవి తుపాకీ పేలుళ్లని మాకు సమాచారం వచ్చింది. ఆ వచ్చిన సమాచారం కూడా అంతవరకే. లోపలికి చొరబడిన వ్యక్తి చేతిలో ఉన్నది చిన్న తుపాకీనా, లేక మెషీన్ గన్నా అనే వివరం కూడా తెలియదు. మా డైనింగ్ హాల్లో ఆ క్షణాన అరవైకి పైగా అతిథులున్నారు. వారిని కాపాడడం మా బాధ్యత. ‘ప్రాణాలను ఫణంగా పెట్టి అయినా సరే వాళ్లను కాపాడాలి. అందుకోసం చివరి శ్వాస వరకు పోరాడుదాం’... అని మా సిబ్బందికి చెప్పాను’’ అని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు మల్లిక. పిల్లల్నీ వదలడం లేదు ‘‘డైనింగ్ హాల్ తలుపులు, కిటికీలన్నీ మూసి, మెయిన్ డోర్ లాక్ చేసి లైట్లాపి, చిన్న చప్పుడు కూడా చేయకుండా జాగ్రత్తపడుతున్నాం. హోటల్ మీద దాడి జరిగిందని వార్తల ప్రసారం మొదలైంది. గెస్ట్‌ల ఫోన్లు ఒక్కొక్కటిగా రింగవుతున్నాయి. టీవీలు చూసిన వాళ్లు తమ వాళ్ల క్షేమ సమాచారం కోసం ఆత్రుతతో చేస్తున్న ఫోన్ కాల్సే అవన్నీ. ఇప్పుడైతే చిక్కుకుపోయిన వాళ్లు తమను తాము ఫొటో తీసుకుని వాట్సప్ చేయవచ్చు. అప్పట్లో ఆ సౌకర్యం లేకపోవడంతో అవతలి వారికి వీరి క్షేమ సమాచారం తెలియాలంటే ఫోన్‌కాల్ ఒక్కటే మార్గం. రింగయితే, సైలెంట్ మోడ్‌లో లైట్ వెలిగినా ఇక్కడ మనుషులున్న సంగతి తెలిసిపోతుందని, ఫోన్లన్నింటినీ ఆఫ్ చేయించి అందరినీ నేల మీద నిశ్శబ్దంగా కూర్చోమని కోరాం. ఇంత జరుగుతున్నా తుపాకీతో కాలుస్తున్న వ్యక్తి టెర్రరిస్ట్ అని కొన్ని గంటల వరకు తెలియలేదు. వచ్చిన వ్యక్తి హోటల్లో దిగిన విఐపీలను టార్గెట్ చేసి షూట్ చేస్తున్నాడని మాత్రం తెలిసింది. ఎవరినీ పట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ కూడా చేయడం లేదు. పిల్లలు, ఆడవాళ్లు అనే తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్లు చంపేస్తున్నారు. ఒక్కొక్క గదిని డోర్ నాక్ చేస్తూ, తలుపు తీసిన వారిని అక్కడే కాల్చేస్తున్నారు. హాల్లో ఉన్న వాళ్లలో సహనం నశిస్తోంది, ఒక్కొక్కరుగా సంయమనం కోల్పోతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ మెడికల్ ఎమర్జెన్సీలు తలెత్తుతాయేమోనని భయం మొదలైంది మాలో. మన మిలటరీ రంగంలోకి దిగిన తరవాత మేము ఊపిరి పీల్చుకున్నాం. అప్పటి వరకు నాకు ఇలాంటి క్లిష్టపరిస్థితిని ఎదుర్కోవడం గురించి ఏ మాత్రం అవగాహన లేదు. ఆ సందర్భం, అతిథులకు కష్టం రాకుండా చూసుకోవడం అనే మా ఉద్యోగ బాధ్యత నన్ను నడిపించాయి’’ అన్నారు మల్లిక జగద్.ముంబయి పేలుళ్లలో మల్లిక సమయస్ఫూర్తికి, ధైర్యానికి లెక్కలేనన్ని ప్రశంసలతోపాటు టాటా ట్రస్ట్ ఆమెను నిర్వహణ స్థాయికి పదోన్నతి కల్పించింది. మోటివేషనల్ స్పీకర్‌గా ఆమె చేత సేవలను కొత్త ఉద్యోగులకు చెప్పిస్తోంది. టెడెక్స్ ప్రోగ్రామ్‌లో మల్లిక ఇచ్చిన ప్రసంగాన్ని శ్రోతలు పిన్‌డ్రాప్ సైలెన్స్‌తో విన్నారు. నాయకత్వం నేర్పిస్తే రాదు, అది మనిషిలో పుట్టుకతో వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు నిరూపించుకుంటుంది... అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. అందులో మల్లిక మాత్రం మానవత్వం నిండిన మల్లిక నిజమైన నాయిక ఆ రోజు తాజ్ హోటల్లో బస చేసి మల్లిక ధైర్యసాహసాలతో ప్రాణాలు నిలుపుకున్న అతిథులు ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. ‘‘మల్లిక గొప్ప లీడర్. ఆ రోజు మేమున్న గదంతా పొగతో నిండిపోయింది. అందరి దగ్గరకు వచ్చి నీళ్లిచ్చి శబ్దం చేయవద్దని గుర్తు చేస్తూ భుజం తట్టి ధైర్యం చెప్పింది. మమ్మల్ని రక్షించడానికి సైన్యం వచ్చారు. వాళ్లు ముందుగా లేడీస్ ఫస్ట్ అని మల్లికనే బయటకు తీసుకెళ్లబోతే ఆమె వెళ్లలేదు. ‘‘ముందు గెస్ట్‌లు, తర్వాత మా సిబ్బంది, ఆ తర్వాతనే నేను’’ అని చెప్పి మమ్మల్ని ఒక్కొక్కరిని జాగ్రత్తగా బయటకు పంపించడానికి సైన్యంతో సహకరించింది. అప్పుడా గదిలో ముప్పైకి పైగా పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్న వ్యాపార దిగ్గజాలున్నారు. మల్లిక వాళ్లందరికంటే పెద్ద లీడర్, ట్రూ లీడర్ అనిపించింది నాకా క్షణంలో. నన్ను బయటకు తీసుకెళ్తున్న క్షణంలో మల్లికతోపాటే ఉండి చివరగా ఆమెతోపాటే బయటపడదాం అనిపించింది. మేమంతా బయటపడి ఆమె చిక్కుకుపోతుందేమోనని కూడా భయం వేసింది. అలా జరగకూడదని, ఆమె క్షేమంగా బయటపడాలని మేమంతా కోరుకున్నాం. ఇప్పుడు టెడెక్స్ ప్రోగ్రామ్‌లో తన స్పీచ్ వింటుంటే ఆ భయంకరమైన క్షణాలు ఆవరించినట్లే అనిపిస్తోంది. మల్లికను ఇలా చూడడం సంతోషంగా ఉంది’’అని లీనా నాయర్ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. నాయకత్వానికి ఉదాహరణ. – మంజీర -
భాగ్యనగరంలో తాజ్
భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న అబిడ్స్‌లో ఘుమఘుమలను వెదజల్లే తాజ్ హోటల్ హైదరాబాదీల నోటికి రుచికరమైన వంటలు అందిస్తోంది. ఈ హోటల్ ప్రయాణం ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. గోల్డ్ షాపులు, పాదరక్షల దుకాణాలు, స్కూల్స్‌తో నిత్యం అబిడ్స్ప్రాంతం రద్దీగా, హడావుడిగా కనిపించేది, ఇప్పటికీ అలాగే కనిపిస్తోంది. అందుకే ఈ హోటల్ విజయ ప్రయాణం సాఫీగా సాగింది. నిత్యం జనంతో... ఈ హోటల్లోకి అడుగుపెట్టగానే గలగలమంటూ కబుర్లు వినిపిస్తాయ. నిత్యం జనాలతో నిండుగా కళకళలాడుతూ కిటకిటలాడుతూ కనిపించే ఈ హోటల్లో భోజన ప్రియులు అన్నం తింటూ, మరికొందరు గప్‌చుప్‌లు తింటూ కనిపిస్తారు. కాలేజీ విద్యార్థులు, మధ్యవయస్కులు, మహిళలు, మగవారు ఒకరేమిటి... హడావుడిగా ఉండే వృత్తి వ్యాపారుల నుంచి వృద్ధుల దాకా అందరూ ఇక్కడి భోజనం రుచి చూడాల్సిందే. ఇంటి నుంచి దూరంగా ఉండే విద్యార్థులకు తాజ్ హోటల్ అమ్మ చేతి భోజనాన్ని తలపిస్తుంది. ఆప్యాయతకు చిరునామాగా మారింది నిలిచిన అబిడ్స్ బ్రాంచి తాజ్‌లో భోజనం చేయడానికి భాగ్యనగరవాసులు ఆసక్తి చూపుతారు. పొట్ట చేత పట్టుకుని, ఉడిపి నుంచి భాగ్యనగరానికి వచ్చిన ఆనందరావు, ఫుడ్ ప్రొడక్షన్లో నైపుణ్యం సంపాదించిన బాబురావుతో కలిసి 1942లో సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం దగ్గర చిన్నప్రదేశాన్ని అద్దెకు తీసుకుని ‘అంబా భవన్’ అని పేరుపెట్టి వ్యాపారం ఆరంభించారు. కొంతకాలానికే బాబూరావు సోదరుడు సుందర్ రావు కూడా చేరడంతో ముగ్గురూ కలిసి 1948లో సికింద్రాబాద్‌లో తాజ్‌హోటల్ ప్రారంభించి, 1950 నాటికి ఆబిడ్స్‌లో మరో బ్రాంచి ప్రారంభించే స్థాయికి చేరుకుంది వ్యాపారం అంటారు సుందర్రావు కుమారుడు చంద్రశేఖర్ రావు. నాటి నుంచి నేటి వరకు... ఆదివారాలు, స్కూల్ సెలవు రోజుల్లో తండ్రితో కలిసి హోటల్‌కి వచ్చేవాడినని చంద్రశేఖరరావు బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు. మసాలాల ఘాటు లేకుండా, సాత్త్వికంగా ఉండే ఆహారం తాజ్ ప్రత్యేకత కావడంతో ఇక్కడ భోజనం చేయడానికి అందరూ ఆసక్తి చూపేవారు. అందరికీ అందుబాటులో లభించే దక్షిణాది భోజనం అందించాలన్నదే వీరి లక్ష్యం. రెడీమేడ్‌గా దొరికే మసాలాలను నేటికీ వీరు ఉపయోగించట్లేదు. నేటికీ అదే కాఫీ పొడి... మొదటి రోజు నుంచి నేటివరకు అదే కాఫీ రుచి, అదే కాఫీ పొడి. ఆరు దశాబ్దాలుగా ఒకే అమ్మకం దారు దగ్గర కాఫీ పొడి కొనుగోలు చేస్తూ, కాఫీ ప్రియులను ఆకర్షిస్తోంది తాజ్. పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం వీరి ప్రత్యేకత. హోటల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కస్టమర్లను ప్రేమగా పలకరిస్తూ, పెదవుల మీద చెక్కుచెదరని చిరునవ్వుతో కొసరి కొసరి వడ్డిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు సేవల విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఇది పుట్టిల్లు... సెలబ్రిటీలకు తాజ్ హోటల్ పుట్టింటితో సమానమంటారని చెబుతారు చంద్రశేఖరరావు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ తనకు ఇష్టమైన బటన్ ఇడ్లీ, సాంబారు కోసం ఇక్కడకు వచ్చి ఈ హోటల్లోనే సేద తీరేవారని గుర్తుచేసుకుంటారు చంద్రశేఖర్. అక్కినేని నాగేశ్వరరావు, జమున వంటి వారికి ఇక్కడకు వస్తే, సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుందని అనేవారట. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు మెథడిస్టు స్కూల్లో జరిగినప్పుడు, తాజ్ హోటల్ వారే క్యాటరింగ్ చేశారంటారు చంద్రశేఖరరావు. రెండో తరం వివాహాలూ ఇక్కడే... దశాబ్దాల క్రితం రూఫ్ గార్డెన్లో వివాహం చేసుకున్నవారు, వారిపిల్లల వివాహాలు కూడా ఇక్కడే చేయడం చాలా ఆనందం అంటారు చంద్రశేఖరరావు. హోటల్ ముందర ఉన్న చెట్టుని అదృష్ట వృక్షంగా భావిస్తారని, ఆ చెట్టు కింద నిలబడి భూ వ్యవహారాలు మాట్లాడుకున్నవారికి మంచి జరిగిందని , ఇక్కడే పెళ్లిసంబంధాలు కూడా నిశ్చయించుకున్నారని చెబుతారు వారు.ఇప్పుడు చంద్రశేఖర్ కుమారుడు ఆదిత్య, ఆదర్శ్‌లు కలిసి ఈ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేస్తున్నారు. వారి నరాలలో రక్తానికి బదులు సాంబారు ప్రవహిస్తోందని చెబుతారు వీరు. ఆ మాట నూటికి నూరు శాతం నిజం అంటారు వినియోగదారులు. -
హైదరాబాద్‌లో కర్ణాటకం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటకం హైదరాబాద్‌కు చేరింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను శుక్రవారం ఉదయం భాగ్యనగరానికి తరలించాయి. తొలుత కేరళలోని కొచ్చికి వెళ్లాలని భావించినా చివరికి హైదరాబాద్‌నే ఎంచుకున్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఇరుపార్టీల ఎమ్మెల్యేలంతా రాజధానిలోని తాజ్‌కృష్ణ, నోవాటెల్ హోటళ్లకు ప్రత్యేక బస్సుల్లో చేరిపోయారు. జేడీఎస్ పేరిట మాదాపూర్ నోవాటెల్‌లో 36 గదులను, కాంగ్రెస్ పేరిట తాజ్‌కృష్ణలో 120 గదులు బుక్ చేశారు. ఒక్కో గదిలో ఒక్కో ఎమ్మెల్యేను ఉంచారు. మిగతా గదులను ఇరుపార్టీల కీలక నేతలు, వ్యూహకర్తలు, సీనియర్ లీడర్లకు అప్పగించారు. ఓ ఇండిపెండెంట్‌తో కలిపి కాంగ్రెస్ నుంచి 77 మంది, జేడీఎస్ నుంచి 36 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. హుటాహుటిన రాష్ట్ర నేతలు.. ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించాలని కాంగ్రెస్–జేడీఎస్ గురువారం అర్ధరాత్రి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ కర్ణాటక ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా ఈ రెండు హోటళ్ల వద్దకు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తూ వారికి కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఉదయం 8 గంటల నుంచే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హోటల్‌కు చేరుకొని కర్ణాటక ఎమ్మెల్యేలకు కావాల్సిన సదుపాయాలను పర్యవేక్షించారు. అర్ధరాత్రి సమయంలోనే కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌కు చేరుకుంటారని భావించారు. కానీ తర్వాత తాజ్, నోవాటెల్ హోటళ్లను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల క్యాంపులో ఎక్కడా ఎవరూ సెల్‌ఫోన్ వాడకుండా ఇరు పార్టీలు జాగ్రత్తలు వహించాయి. బస చేస్తున్న హోటళ్లలోని ల్యాండ్‌లైన్ నుంచి కూడా ఫోన్‌కాల్ బయటకు వెళ్లే అవకాశం లేకుండా చేసినట్టు తెలిసింది. తాజ్‌కు చేరుకున్న ఎమ్మెల్యేల్లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సాయంత్రం సిద్దరామయ్య రాక.. శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన్ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఆహ్వానించి తాజ్ హోటల్‌కు తీసుకువచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో హోటల్ చేరుకున్న సిద్దరామయ్య.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, వీహెచ్, కన్నడ పార్టీ కీలక నేత డీకే శివకుమార్, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్, వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. 5.30 గంటల సమయంలో కన్నడ కాంగ్రెస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. శనివారం బలనిరూపణ సమయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సిద్దరామయ్య ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం ముగియనుండగా 5.50 గంటల సమయంలో జేడీఎస్ నేత కుమారస్వామి తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. కన్నడ పీసీసీ నేతలతో భేటీ అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఆయన నోవాటెల్‌కు వెళ్లారు. కాగా తాజ్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సిద్దరామయ్యను ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నోవాటెల్‌లో కుమారస్వామి, రేవణ్ణ ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య సమావేశం నిర్వహించగా.. అంతకుముందే జేడీఎస్ నేత కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ నోవాటెల్‌లో వారి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జేడీఎస్ నుంచి ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకునేందుకు చేస్తున్న వ్యూహాలను కుమారస్వామి వారికి వివరించారు. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తుతో ప్రభుత్వం ఏర్పడుతుందని, ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో దేవెగౌడ రేవణ్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీ నుంచి పొత్తు ప్రతిపాదన రావడం, సున్నితంగా తిరస్కరించిన అంశాలను కుమారస్వామి, రేవణ్ణకు ఆయన వివరించినట్టు తెలిసింది. గొడవ చేయొద్దు.. సస్పెండ్ చేస్తారు.. తమ ఎమ్మెల్యేలకు జేడీఎస్, కాంగ్రెస్ ముఖ్య నేతలు కీలక సూచనలు చేశారు. శనివారం అసెంబ్లీలో జరగబోయే బలనిరూపణ సమయంలో బీజేపీ... ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగి సస్పెన్షన్ ప్లాన్ వేసిందని వివరించారు. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేను నియమించడం వెనుకున్న ఆంతర్యం కూడా ఇదేనని, దీనిపైనా శుక్రవారం రాత్రి సుప్రీంకు వెళ్తున్నట్టు సిద్ద రామయ్య, కుమారస్వామి తమ పార్టీల ఎమ్మెల్యేలకు సూచించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉండాలని, సహనం పాటించాలని పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ? కాంగ్రెస్, జేడీఎస్ క్యాంపులో ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్ అయ్యారన్న ప్రచారంతో ఇరుపార్టీల నేతలు కలవరానికి గురయ్యారు. గెలిచినప్పట్నుంచే ఆనంద్‌సింగ్, ప్రతాప్‌గౌడ పాటిల్ ఇద్దరూ పార్టీకి దూరంగా ఉన్నట్టు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు. అయితే వీరిలో ఆనంద్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడని, ప్రతాపగౌడ పాటిల్ బీజేపీ అధీనంలో ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ముగ్గురిలో బీఎస్పీకి చెందిన శేఖర్ సైతం హైదరాబాద్ చేరుకున్నారని, మరో ఇద్దరు బెంగళూరులోనే ఉన్నారని సమావేశంలో ప్రకటించారు. ఈ ముగ్గురు కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మద్దతు తెలుపుతారని సిద్దరామయ్య ఎమ్మెల్యేలకు వివరించారు. బీజేపీ నెగ్గే అవకాశం లేదు: కుమారస్వామి బలపరీక్షలో బీజేపీ నెగ్గే అవకాశం లేదని కుమారస్వామి ధీమాగా చెప్పారు. శుక్రవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీకి సంఖ్యాబలం లేదన్నారు. ‘ఆపరేషన్ కమల’కు చిక్కకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారనీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఏకతాటిపై నిలబడ్డారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఒకవేళ బీజేపీ ‘ఆపరేషన్ కమల’ చేపడితే, ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తాము లాక్కుంటామని హెచ్చరించారు. సంఖ్యాబలం లేకపోయినా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నతాధికారులను బదిలీ చేశారని కుమారస్వామి ఆరోపించారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్ వద్ద మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. గవర్నర్ రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం దారుణం. మా కూటమి ఎమ్మెల్యేలంతా ఒక్క తాటిపై ఉన్నారు’ అని చెప్పారు. బస ఖర్చు భారీగానే.. హైదరాబాద్‌లో కాంగ్రెస్–జేడీఎస్ క్యాంపు ఖర్చు భారీగానే ఉంది. తాజ్‌లో అప్పటికప్పుడు రూం బుక్ చేయాలంటే కనీసం రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఖర్చవుతుంది. భోజనం, ఇతర ఖర్చులన్నీ కలిపి 24 గంటలకు రూ.30 వేల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అంటే 120 గదులకు ఒక్కరోజుకే రూ.36 లక్షలు అవుతుంది. అలాగే నోవాటెల్‌లో ఒక్కో గదికి రూ.9 వేల చొప్పున కాగా.. భోజనం, తదితర ఖర్చులు మరో రూ.6 వేలకు పైగా అయినట్టు తెలిసింది. ఇలా ఆ పార్టీ ఎమ్మెల్యేల బసకు రూ.5.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఖర్చయినట్టు తెలిసింది. ఇవి కాకుండా ప్రయాణం, మధ్యలో భోజనం, ఇతర ఖర్చులకు కూడా భారీగానే వెచ్చించినట్టు సమాచారం. ఒక్క రోజు క్యాంపు మొత్తం ఖర్చు రెండు పార్టీలకు కలిపి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా అవుతుందని టీపీసీసీ, కేపీసీసీ నేతలు చర్చించుకున్నారు. అర్ధరాత్రి బెంగళూరుకు.. తాజ్‌లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాత్రి 8.40 గంటల ప్రాంతంలో డిన్నర్ చేశారు. అర్ధరాత్రి సమయంలో హోటల్ నుంచి మూడు బస్సుల్లో బెంగళూరు శివారులోని ఈగల్ రిసార్ట్‌కు వెళ్లారు. నోవాటెల్‌లో 9.30 గంటలకు భోజనం చేసి జేడీఎస్ ఎమ్మెల్యేలు రాత్రి 10 గంటలకు రెండు బస్సులో ఈగల్ రిసార్ట్‌కు బయల్దేరారు. కుమారస్వామి కారులో.. సిద్దరామయ్య ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. మొరాయించిన బస్సు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తాజ్‌కృష్ణ వద్దకు వచ్చిన ఓ బస్సు హోటల్ లోపలికి వెళ్లేందుకు మొరాయించింది. 22 మంది ఎమ్మెల్యేలు లోపల ఉండగా బస్సు దిగేందుకు తలుపులు కూడా తెరుచుకోలేదు. దీంతో తాజ్‌కృష్ణ హోటల్ ముందు ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎలాగోలా ఎమ్మెల్యేలను బస్సు నుంచి బయటకు తీసుకొచ్చి భారీ బందోబస్తు మధ్య హోటల్ లోపలికి చేర్చారు. చెడిపోయిన బస్సు రోడ్డుపై రెండు గంటలు అలాగే ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాత్రూంలో ఎమ్మెల్యేలు.. హైరానా! సిద్దరామయ్య, కుమారస్వామి ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించలేదు. అదే సమయంలో కర్ణాటక నుంచి ఓ బీజేపీ ఎమ్మెల్యే హోటల్లోకి వచ్చాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో మధుయాష్కీని కుమారస్వామి అప్రమత్తం చేశారు. 200 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్‌ను జల్లెడ పట్టారు. మరో 200 మంది కార్యకర్తలను హోటల్ చుట్టూ మోహరించారు. చివరికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. బాత్రూంకు వెళ్లారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిందకు రాకపోవడంతో హైడ్రామా నడిచింది. గదుల్లోనూ లేకపోవడం, భోజనానికి రాకపోవడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. 20 నిమిషాల తర్వాత వారు ప్రత్యక్షం కావడంతో శాంతించారు. తాజ్‌కృష్ణలో సిద్దరామయ్య, కుమారస్వామితో జానారెడ్డి తదితరులు తాజ్‌కృష్ణ వద్ద రోడ్డుపై నిలిచిపోయిన బస్సు -
రెడీ.. యాక్షన్
26/11.. ప్రపంచం మరచిపోలేని రోజు.. 2008 నవంబర్ 26 భారతదేశ ప్రజలు భయబ్రాంతులయిన రోజు. పాకిస్తాన్‌కు చెందిన పదిమంది ముష్కరులు అరేబియా సముద్ర జలాల నుంచి భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో మారణ హోమం సృష్టించారు. ప్రతి భారతీయుడు మరిచిపోలేని ఘట్టం. 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. 304 మంది గాయాలపాలయ్యారు. ఆ మారణ హోమంలో స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా అశువులు బాశారు. అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన పది నక్షత్రాల తాజ్ మహల్ హోటల్లో జరిగిన 60 గంటలపాటు మిలటరీ ఆపరేషన్. ఇది భారతదేశ చరిత్రలో రక్తంతో రాజుకున్న పుటలు. అలాంటి పరిస్థితులు ఇక ఎన్నడూ దేశంలో ఏ ఒక్కచోట జరుగకూడదన్నది భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం. అందులో భాగంగా తీర ప్రాంతంలో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు. అప్పుడప్పుడు సాగర్ కవచ్ పేరుతో తీర ప్రాంతంలో అప్రమత్తం. నిఘా నీడలో రెండు రోజులపాటు జిల్లాలోని తీర ప్రాంతాన్ని జల్లెడ పట్టనున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక బందోబస్తు నిర్వహణకు జిల్లా పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు రెండు రోజులపాటు పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఒంగోలు క్రైం: జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం పోలీస్ నిఘా నీడలో కట్టుదిట్టమైన భద్రత నడుమ అప్రమత్తం చేస్తున్నారు. సాగర్ కవచ్ పేరుతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. అటు గుంటూరు జిల్లా సరిహద్దు మొదలుకొని ఇటు నెల్లూరు జిల్లా సరిహద్దు చేవూరు వరకు సముద్ర తీరాన్ని పోలీసులు తమ కనుసన్నల్లోకి తీసుకున్నారు. అటు పోలీసులతో పాటు తీర ప్రాంతంలోని ప్రజలను కూడా అప్రమత్తం చేసేవిధంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులపాటు తీరం వెంబడి పోలీస్ కసరత్తు ప్రారంభించారు. బుధవారం తెల్లవారు జాము 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రత్యేక పహారా, కట్టుదిట్టమైన భద్రత కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సన్నద్ధమయింది. తీరం వెంబడి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లు రెండు ఉన్నాయి. ఒకటి కొత్తపట్నం కాగా రెండోది రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లు. ఆ రెండు పోలీస్ స్టేషన్ల పోలీసులతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా పోలీస్ బృందాలను కేటాయించింది. అందుకుగాను తీరం వెంబడి ఉన్న పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు వాటికి సంబంధించిన పోలీస్ సర్కిళ్ల ఇన్స్పెక్టర్లను కూడా జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు అప్రమత్తం చేశారు. ఇటు జిల్లాకు ఈశాన్య సరిహద్దులోని చీరాల రూరల్ పోలీస్‌స్టేషన్ మొదలుకొని దక్షిణం వైపున ఉన్న కందుకూరు సర్కిల్ వరకు పోలీస్ అధికారులు మొదలుకొని సిబ్బంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని నిఘా చేపట్టనున్నారు. చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ మొదలుకొని ఈపూరు పాలెం, వేటపాలెం, చిన్నగంజాం, నాగులుప్పలపాడు, ఒంగోలు తాలూకా, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బందోబస్తు.. సాగర్ కవచ్ కోసం సముద్ర తీరం వెంబడి గ్రామాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం 160 మంది పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తీరం వెంబడి 102 కిలో మీటర్ల మేర 8 చెక్ పోస్ట్‌లు, 18 ల్యాండింగ్ పాయింట్లు, 12 పోలీస్ బీట్లు, 10 పోలీస్ పికెట్లు, ఐదు క్విక్ రీయాక్షన్ టీంలను సిద్ధం చేశారు. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలే లక్ష్యం.... ముష్కరులు ప్రజలను తద్వారా ప్రభుత్వాలను భయబ్రాంతులను చేసేందుకు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుంటారు. అందుకోసం సాగర్ కవచ్‌లో భాగంగా పోలీసులు 10 పోలస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని పరిపాలనా కేంద్రం వద్ద ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒంగోలు రైల్వే స్టేషన్ , ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, రిమ్స్ ఆస్పత్రి, సూరారెడ్డిపాలెం, అమ్మనబ్రోలు, కరవది, సింగరాయకొండ, టంగుటూరు రైల్వే స్టేషన్లు, సింగరాయకొండ బస్టాండ్‌లో పికెట్లు ఏర్పాటు చేశారు. -
నమ్మితే ఏదైనా చేస్తా: అనుష్క
చిట్‌చాట్: తాను నమ్మితే ఏదైనా చేసేస్తానంటోంది అందాల తార అనుష్క. సినిమా విషయంలో ఎలాగైతే కథ, కథనాలు విని నచ్చితేనే ఓకే చేస్తానో.. కెమెరా బాగుందంటేనే మొబైల్స్‌కు ఓకే చెప్తానంటోంది. ఫీచర్స్ నచ్చి తనకు నమ్మకం కుదిరితేనే.. ఆ సెల్‌ఫోన్ కొంటానని తెలిపింది ఈ అభినవ రుద్రవుదేవి. ఇంటెక్స్ మొబైల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అనుష్క శెట్టి శనివారం నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్లో జరిగిన ఆక్వా స్టైల్ ప్రోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనుష్క ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. టాలీవుడ్ ముచ్చట్లు చెప్పడానికి నో అన్న ఈ అమ్మడు.. ఒక కంపెనీ ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఇదేం తొలిసారి కాదని చెప్పుకొచ్చింది. ‘నా వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఇష్టపడతా. నాకు అన్నివిధాలా ఆ కంపెనీ ప్రొడక్ట్స్ నచ్చితేనే అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఓకే చెబుతా’నని అంటోంది. అభిమానుల ఆదరణతోనే తను టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకోగలిగానని ముసిముసినవ్వులు చిందించింది. - వాంకె శ్రీనివాస్ -
సైఫ్ అలీఖాన్‌పై అభియోగాలు నమోదు
ముంబై: దక్షిణాఫ్రికా వ్యాపారవేత్తపై రెండేళ్ల క్రితం నాటి దాడి కేసులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ఆయన స్నేహితులు ఇద్దరిపై ముంబైలోని స్థానిక కోర్టులో గురువారం అభియోగాలు నమోదయ్యాయి. నిందితులతోపాటు ఫిర్యాదుదారుకి నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణ మొదలవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వజీద్ షేక్ మీడియాకు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 30న జరుగుతుందని చెప్పారు. 2012 ఫిబ్రవరి 22న ముంబైలోని తాజ్ హోటల్లో దక్షిణాఫ్రికా వ్యాపారవేత్త ఇక్బాల్ మీర్శర్మ ఆయన మామయ్యపై సైఫ్ అలీఖాన్, ఆయన స్నేహితులు దాడి చేసి కొట్టారని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు సైఫ్, అతని స్నేహితులను అరెస్ట్ చేయగా, అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు.