Ratan Tata Arrives at Taj Hotel in Nano Car, Video Viral Social Media - Sakshi
Sakshi News home page

రతన్‌టాటా సింప్లిసిటీ.. కోట్లు విలువ చేసే కారున్నా..

May 19 2022 11:31 AM | Updated on May 19 2022 12:36 PM

Viral Video: Ratan Tata arrives at Taj Hotel in Nano - Sakshi

Ratan Tata Nano Car: సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే రతన్‌టాటా మరోసారి తాను నమ్ముతున్నవాటిని ఆచరణలో పెట్టి చూపించారు. భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. రతన్‌టాటా తన అభిమానులకు ఆకట్టుకున్నారు. దేశంలోనే పేరెన్నికగల టాటా గ్రూపులకు బిగ్‌బాస్‌గా ఉంటున్నా గ్రౌండ్‌ టూ ఎర్త్‌ ఉండటంలో ఆయనకు ఆయనే సాటిగా నిలుస్తున్నారు. 

ముంబైలో గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర ఉన్న ప్రముఖ తాజ్‌ హోటల్‌ టాటా గ్రూపు నిర్వాహణలోనే ఉంది. బడా పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ దురందరులు, కార్పొరేట్‌ బిగ్‌షాట్స్‌, విదేశీ టూరిస్టులతో ఈ హోటల్‌ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ హోటల్‌ గ్యారేజీలో ఇంపోర్టెడ్‌ కార్లే ఎక్కువగా కనిపిస్తాయి. కనీసం యాభై లక్షల విలువ చేయని కారు ఈ హోటల్‌ గేటు దాటి లోపలికి వెళ్లదని ప్రతీతి. అలాంటి హోటల్‌లోకి  2022 మే 17 సాయంత్రం దేశంలోనే చీపెస్ట్‌ కార్లలో ఒకటైన నానో ఎంటరైంది.

నమ్మలేకపోయారు
ది గ్రేట్‌ తాజ్‌ హోటల్‌కి మరీ చీప్‌గా నానో కారులో వచ్చిన వ్యక్తి ఎవరా అంటూ అక్కడున్న వారు వింతగా చూశారు. అప్పుడు కనిపించిన దృశ్యం చూసి వారు అవాక్కయ్యారు! ఆ కారులో వచ్చింది రతన్‌టాటా కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు! తాము చూస్తున్నది నిజమేనా అని అనుమాన పడ్డారు.  తాజ్‌ ఎదుట నానోలో వచ్చింది సాక్షాత్తు  రతన్‌టాటా అని గుర్తించారు. తేరుకుని తమ ఫోన్లను చేతుల్లోకి తీసుకున్నారు. తమ  కెమెరాల్లో నానోలో వచ్చిన రతన్‌టాటాను బంధించించారు. 

లగ్జరీ కార్లను కాదని
టాటా ‍గ్రూపు పరిధిలోనే ల్యాండ్‌రోవర్‌, జాగ్వార్‌ వంటి లగ్జరీ హై ఎండ్‌ కార్లు ఉన్నాయి. అయినా సరే వాటిని పక్కన పెట్టి సామాన్యుల కోసం, ఈ దేశ మధ్యతరగతి ప్రజల కోసం ఆయన రూపొందించిన నానో కారునే రతన్‌టాటా తన ప్రయాణానికి ఎంచుకోవడం చూపరులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు లక్షల కోట్ల రూపాయల విలువైన టాటా గ్రూపును నడిపిస్తున్నా కనీసం బాడీగార్డు కూడా లేకుండా ఎటువంటి హంగామా చేయకుండా ఓ కామన్‌మ్యాన్‌లా వ్యవహరించిన రతన్‌టాటాను మెచ్చుకోలుగా చూశారు. 

వైరల్‌ వీడియో
తాజ్‌ హోటల్‌కి నానో కారులో వచ్చిన రతన్‌ టాటా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లవ్‌ యూ రతన్‌టాటా, వీ రెస్పెక్ట్‌ రతన్‌టాటా, సింప్లిసిటికీ ప్రతిరూపం, హ్యాట్సాఫ్‌ టాటా, మమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేస్తున్నావ్‌.. అంటూ సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా అని తేడా లేకుండా అంతటా రతన్‌టాటాకు జై కొడుతున్నారు. 

చదవండి: Ratan Tata: ‘టాటా ఎప్పుడు అలాంటి పనులు చేయదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement