Nano car
-
రతన్‌టాటాకు మోదీ ఎస్ఎంఎస్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ‘వెల్కమ్’ అంటూ రతన్ టాటాకు పంపించిన ఒక ఎస్ఎంఎస్.. సామాన్యుల కారు ‘నానో’ ప్లాంట్‌ను పశి్చమబెంగాల్‌లోని సింగూర్ నుంచి గుజరాత్‌లోని సనంద్‌కు తరలేలా చేసింది. పశి్చమబెంగాల్‌లోని సింగూర్‌లో టాటా నానో ప్లాంట్ కోసం భూసమీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుత సీఎం, నాటి ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ రైతులతో కలసి 2006లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అది ఎంతకీ పరిష్కారమయ్యేలా కనిపించకపోవడంతో రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు రతన్‌టాటా ప్రకటించారు. ఆ సమయంలో తాను పంపిన ఎస్ఎంఎస్ ఎలాంటి ఫలితాన్నిచ్చందన్నది నాటి సీఎం మోదీ తర్వాత స్వయంగా ప్రకటించారు. ‘‘తాము పశి్చమబెంగాల్ను వీడుతున్నట్టు కోల్‌కతాలో రతన్‌టాటా మీడియా సమావేశంలో ప్రకటిస్తున్న వేళ, ‘వెల్కమ్’ అంటూ నేను ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపాను. రూపాయి ఖర్చుతో పంపించిన ఎస్ఎంఎస్ ఏమి చేయగలదో మీరు ఇప్పుడు చూస్తున్నారు’’అంటూ గుజరాత్‌లోని సనంద్‌లో రూ.2,000 కోట్లతో టాటా ఏర్పాటు చేసిన నానో ప్లాంట్‌ను 2010లో ప్రారంభిస్తున్న వేళ నాటి సీఎం మోదీ ప్రకటించారు. దేశ పారిశ్రామిక చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. -
వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు భారీ ఊరట!
సింగూర్ నానో ఫ్లాంట్ వ్యవహారంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్న ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్‌కు ప్రతిఫలం దక్కింది. మధ్యవర్తిత్వ అవార్డు (arbitral award) కింద అసలు, వడ్డీ మొత్తం రూ.766 కోట్లు పొందనుంది. వెస్ట్‌బెంగాల్ సింగూర్‌లో ‘టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎల్) ఆటోమొబైల్ మ్యానిఫ్యాక్చరింగ్ ఏర్పాటు కోసం కేటాయించిన కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో నష్టపోయాం. ఈ వ్యవహారంలో ఎట్టకేలకు ఊరట లభించింది. వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూబీఐడీసీ)..టీఎంఎల్కు అసలు, వడ్డీ చెల్లించేలా ముగ్గురు సభ్యుల ఆర్బిట్రల్ ట్రిబ్యూనల్స్ బృందం తీర్పు వెల్లడించారు’ అని టాటా మోటార్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ట్రిబ్యునల్ నిర్ణయంతో.. టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా సెప్టెంబర్ 1, 2016 నుంచి అసలు, ఏడాదికి 11 శాతం వడ్డీతో రూ.765.78 కోట్ల మొత్తాన్ని అందుకోనున్నారు. టాటాకు వెయ్యి ఎకరాల భూమి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం టాటా మోటార్స్‌కు నానో కార్లను తయారు చేసుకునేందుకు సుమారు 1,000 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. అయితే, ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులు, రైతుల నుండి తీవ్ర నిరసనతో టాటా మోటార్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్‌కు అప్పటికే టాటా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. దీంతో పెట్టుబడులు విషయంలో తమకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని న్యాయ పోరాటం చేస్తుంది. ఎట్టకేలకు ఈరోజు ట్రిబ్యూనల్ టాటా మోటార్స్‌కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇక నాటి పరిస్థితుల దృష్ట్యా టాటా మోటార్స్ నానో కార్ల తయారీ ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్ నుంచి తయారీ యూనిట్‌ను గుజరాత్‌లోని సనంద్‌కు మార్చింది. అక్కడే టాటా నానో తయారైంది. -
మార్కెట్లోకి టాటా నానో ఈవీ..?
-
బీజేపీ ఆఫీస్ ఎదుట నానో కారు కలకలం.. బాంబు స్క్వాడ్‌కు ఫిర్యాదు!
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయం ఎదుట మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారు కలకలం సృష్టించింది. సోమవారం నుంచి నానో కారు బీజేపీ కార్యాలయం ఎదుటే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నానో కారులో సూట్‌కేసు ఉంది. దీంతో బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు బీజేపీ నేతలు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్స్ సైతం కారులో తనిఖీలు చేపట్టారు. అయితే, కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. కారులోని సూట్‌కేసులో దుస్తులు తప్పా ఎలాంటి ఇతర వస్తువులు లభించలేదని స్పష్టం చేశారు పోలీసులు. అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు కారును తరలించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇదీ చదవండి: విషాద ఘటన: దేశభక్తితో ప్రసంగిస్తూనే కుప్పకూలాడు -
ఇండియా@75: లక్షకే కారు.. నానో జోరు
మోటర్‌సైకిళ్లు, స్కూటర్లు నడిపేవారికి సైతం అందుబాటులోకి తెచ్చేందుకు టాటా మోటర్స్ కంపెనీ ‘నానో’ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మొత్తం అంతా కలిపి లక్ష రూపాయలకే చేతి కొచ్చే ఈ కారును కొనేందుకు భారత ప్రజలు ఉత్సాహం చూపారు. ఏడాదికి 2,50,000 కార్లు విక్రయించాలని టాటా మోటర్స్ లక్ష్యం పెట్టుకుంది. అయితే ఫ్యాక్టరీని రాజకీయ కారణాల వల్ల పశ్చిమబెంగాల్లోని సింగూరు నుంచి గుజరాత్‌లోని సనంద్‌కు మార్చవలసి రావడంలో జరిగిన జాప్యం కారణంగా లక్ష్యాన్ని సాధించలేక పోయింది. అంత తక్కువ ధర గల కారు సురక్షితం కాదేమోనని వినియోగదారులు భావించడం కూడా నానో విక్రయాలు మందగించడానికి ఒక కారణం అయింది. అయినప్పటికీ రతన్ టాటాకు ఈ బ్రాండ్‌తో ఉన్న సెంటిమెంటు వల్ల 2017 వరకు బండిని లాక్కొచ్చారు. సనంద్ ఫ్యాక్టరీ ఇప్పుడు టియాగో, టైగర్ బ్రాండ్ రెగ్యులర్ కార్లను ఉత్పత్తి చేస్తోంది. వాటి ధర సుమారు 6 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ నానో కారు నడిపేవారు రోడ్లపై కనిపిస్తారు కానీ, నానో కారు ఉత్పత్తులు 2018లోనే ఆగిపోయాయి. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, బాబా ఆమ్టే, రఘువరన్, శ్యామ్ మానెక్షా, మహేంద్ర కపూర్, వి.పి.సింగ్ కన్నుమూత. జైపూర్‌లోని మోతీ డూంగ్రీ ఫోర్ట్ వద్ద ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా తన 88 ఏళ్ల వయసులో ధర్నాకు కూర్చున్న జైపూర్ రాజమాత గాయత్రీదేవి. హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం. హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో తొక్కిసలాట. 162 మంది మృతి. ముంబైలో నవంబర్ 26 నుంచి 29 మధ్య పాక్ ప్రేరేపిత ఉగ్రవాద బాంబు పేలుళ్లు. 175 మంది పౌరులు దుర్మరణం. (చదవండి: మహోజ్వల భారతి: బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వ నిషేధం) -
రతన్‌టాటా సింప్లిసిటీ.. కోట్లు విలువ చేసే కారున్నా..
Ratan Tata Nano Car: సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే రతన్‌టాటా మరోసారి తాను నమ్ముతున్నవాటిని ఆచరణలో పెట్టి చూపించారు. భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. రతన్‌టాటా తన అభిమానులకు ఆకట్టుకున్నారు. దేశంలోనే పేరెన్నికగల టాటా గ్రూపులకు బిగ్‌బాస్‌గా ఉంటున్నా గ్రౌండ్ టూ ఎర్త్ ఉండటంలో ఆయనకు ఆయనే సాటిగా నిలుస్తున్నారు. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న ప్రముఖ తాజ్ హోటల్ టాటా గ్రూపు నిర్వాహణలోనే ఉంది. బడా పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ దురందరులు, కార్పొరేట్ బిగ్షాట్స్, విదేశీ టూరిస్టులతో ఈ హోటల్ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ హోటల్ గ్యారేజీలో ఇంపోర్టెడ్ కార్లే ఎక్కువగా కనిపిస్తాయి. కనీసం యాభై లక్షల విలువ చేయని కారు ఈ హోటల్ గేటు దాటి లోపలికి వెళ్లదని ప్రతీతి. అలాంటి హోటల్లోకి 2022 మే 17 సాయంత్రం దేశంలోనే చీపెస్ట్ కార్లలో ఒకటైన నానో ఎంటరైంది. నమ్మలేకపోయారు ది గ్రేట్ తాజ్ హోటల్‌కి మరీ చీప్‌గా నానో కారులో వచ్చిన వ్యక్తి ఎవరా అంటూ అక్కడున్న వారు వింతగా చూశారు. అప్పుడు కనిపించిన దృశ్యం చూసి వారు అవాక్కయ్యారు! ఆ కారులో వచ్చింది రతన్‌టాటా కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు! తాము చూస్తున్నది నిజమేనా అని అనుమాన పడ్డారు. తాజ్ ఎదుట నానోలో వచ్చింది సాక్షాత్తు రతన్‌టాటా అని గుర్తించారు. తేరుకుని తమ ఫోన్లను చేతుల్లోకి తీసుకున్నారు. తమ కెమెరాల్లో నానోలో వచ్చిన రతన్‌టాటాను బంధించించారు. లగ్జరీ కార్లను కాదని టాటా గ్రూపు పరిధిలోనే ల్యాండ్‌రోవర్, జాగ్వార్ వంటి లగ్జరీ హై ఎండ్ కార్లు ఉన్నాయి. అయినా సరే వాటిని పక్కన పెట్టి సామాన్యుల కోసం, ఈ దేశ మధ్యతరగతి ప్రజల కోసం ఆయన రూపొందించిన నానో కారునే రతన్‌టాటా తన ప్రయాణానికి ఎంచుకోవడం చూపరులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు లక్షల కోట్ల రూపాయల విలువైన టాటా గ్రూపును నడిపిస్తున్నా కనీసం బాడీగార్డు కూడా లేకుండా ఎటువంటి హంగామా చేయకుండా ఓ కామన్మ్యాన్లా వ్యవహరించిన రతన్‌టాటాను మెచ్చుకోలుగా చూశారు. వైరల్ వీడియో తాజ్ హోటల్‌కి నానో కారులో వచ్చిన రతన్ టాటా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లవ్ యూ రతన్‌టాటా, వీ రెస్పెక్ట్ రతన్‌టాటా, సింప్లిసిటికీ ప్రతిరూపం, హ్యాట్సాఫ్ టాటా, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నావ్.. అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్టా అని తేడా లేకుండా అంతటా రతన్‌టాటాకు జై కొడుతున్నారు. Ratan Tata arrives at Taj Mumbai in a Nano sitting in front seat with his driver. No security either. Exemplary simplicity personified. 💯👏🏾 pic.twitter.com/XAbyLLoCpt — Maya (@Sharanyashettyy) May 17, 2022 చదవండి: Ratan Tata: ‘టాటా ఎప్పుడు అలాంటి పనులు చేయదు’ -
వాళ్ల జీవితాల్లో మార్పు కోసం రతన్ టాటా ఏం చేశారంటే?
దేశంలో పారిశ్రామికవేత్తలు ఎందరున్నా.. వారిలో టాటాలది ప్రత్యేక స్థానం. వ్యాపారానికి హ్యుమన్టచ్ జోడించడమనేది ఆది నుంచి టాటాలకు ఉన్న అలవాటు. అదే ఒరవడిలో మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న బాధలను తీర్చేందుకు నడుం బిగించారు టాటా గ్రూపు చైర్మన్ రతన్‌టాటా. ఈ ప్రయత్నాల్లో నుంచి మార్కెట్లోకి వచ్చిందే టాటా నానో కారు. ఇదే కారణం టాటా నానో కారు రూపొందించాలన్న ఐడియా మదిలో ఎందుకు వచ్చింది. అది కార్యరూపం దాల్చేందుకు తాను ఎటువంటి శ్రమ చేశాననే విషయాలను ఇన్‌స్టా స్టోరీ ద్వారా రతన్ టాటా ఈ రోజు స్వయంగా తెలిపారు. ఇండియాలో మధ్య తరగతి ప్రజలు సాధారణంగా స్కూటర్లపై ప్రయాణం చేస్తుంటారు. ఇందులో ఒకేసారి స్కూటర్ మీద కుటుంబం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటారు. పిల్లలయితే శాండ్విచ్ల మాదిరి తల్లిదంద్రుల మధ్య నలిగిపోతూ ఉంటారు. గుంతలు ఉండే రోడ్లపై ఇలా ప్రయాణించం ఎంత ప్రమాదకరమో కదా అనిపించేంది. వీళ్లకు ఈ కష్టాలు దూరం చేసేందుకు నేనైమా చేయగలనా అని ఆలోచించాను. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) బగ్గీ నుంచి నానో ఆర్కిటెక్ట్ స్టూడెంట్ అవడం వలన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా రఫ్ డ్రాయింగ్ వేసుకోవడం అలవాటు. అలా స్కూటర్ ప్రమాదరహితంగా మారాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ రెండు చక్రాల స్కూటర్‌ను నాలుగు చక్రాలు చేశాను. అప్పుడు దాన్ని పరిశీలిస్తే కిటీకీలు కూడా లేకుండా ఓ సాధారణ బగ్గీలా అనిపిచింది. ఆ డిజైన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తే.. అదే నానోకు ప్రాణం పోసింది. కేవలం లక్ష రూపాయలకే సామాన్యులకు కారు అందివ్వాలనే లక్ష్యంతో ‘నానో’ ప్రాజెక్టును అమలు చేశారు రతన్ టాటా. వర్షంలో తడుస్తూనే అంతకు ముందు ఓసారి ముంబైలో జరిగిన సమావేశంలో నానో విషయంలో సీరియస్‌నెస్ పెరగడానికి కారణం వివరించారు రతన్‌టాటా. ముంబైలో ఓసారి తాను కారులో వెళ్తుండగా జోరుగా వర్షం కురుస్తోంది. అంతటి వర్షంలోనూ పిల్లలతో కలిసి భార్యభర్తలు టూవీలర్‌పై ప్రయాణం చేయడం కంటపడింది. అంతే ఇలాంటి కష్టాలు నా దేశ ప్రజలకు దూరం చేయాలని బలంగా నిర్ణయించుకున్నాను అని టాటా తెలిపారు. చదవండి: 'ఫోర్డ్' చేతులెత్తేసింది, రంగంలోకి దిగిన రతన్ టాటా! -
రతన్‌టాటా సింప్లిసిటీ.. కోట్ల రూపాయల లగ్జరీ కార్లు పక్కన పెట్టి..
ప్రపంచంలోనే లగ్జరీ కార్లుగా జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లకు గుర్తింపు ఉంది. ఈ బ్రాండ్లలో హైఎండ్ మోడల్ ధర కోట్లలో ఉంటుంది. ఈ బ్రాండ్లు ప్రస్తుతం రతన్‌టాటా ఆధీనంలోనే ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి కామన్‌మ్యాన్ కోసం డిజైన్ చేసిన లక్ష రూపాయల కారు నానోను ఎంచుకున్నారు రతన్‌టాటా. రతన్‌టాటా కోసం ప్రత్యేకంగా నానో ఈవీ వెర్షన్ కారుని తయారు చేసింది టాటా ఎలెక్ట్రా సంస్థ. రతన్ టాటా కోరిక మేరకు ఆయన అవసరాలకు తగ్గట్టుగా ఇటీవల కస్టమైజ్డ్ ఈవీ నానో కారును డెలివరీ చేసింది. రతన్‌టాటా అతని సహాయకుడు శంతను నాయుడు ఈ కారులో ప్రయాణించారు. రతన్ టాటా కోసం తయారు చేసిన నానో 72 వీ ఎలక్ట్రిక్ కారు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రమాణాల ప్రకారం సింగిల్ ఛార్జ్‌తో 213 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండగా గ్రౌండ్ రియాలిటీలో కనీసం 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందనే అంచనాలు ఉన్నాయి. పది సెకన్ల వ్యవధిలో గంటలకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగం అందుకోగలదు. ఇందులో లిథియం ఐయాన్ బ్యాటరీ ఉపయోగించారు. సామాన్యులకు కారు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో నానో కారుని తెచ్చారు రతన్‌టాటా. కేవలం లక్ష రూపాయల బడ్జెట్‌తో తెచ్చిన ఈ కారు మార్కెట్లో అనుకున్న రేంజ్లో సక్సెస్ కాకపోయినా.. మధ్యతరగతి ప్రజలకు కారును చేరువ చేసింది. టాటా గ్రూపు నుంచి లగ్జరీ కార్లతో పాటు నెక్సాన్, టిగోర్ వంటి ఈవీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐనప్పటికీ రతన్‌టాటా నానోను ఎంచుకుని అందరినీ విస్మయానికి గురి చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. నడుస్తున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా సామాన్యులకి తక్కువ ధరకే ఈవీ కారును అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో రతన్‌టాటా ఉన్నారని. అందుకే ప్రత్యేకంగా కారుని తయారు చేయించుకుని పరీక్షిస్తున్నారనే వారు ఉన్నారు. 84 ఏళ్ల వయసులోనూ కంఫర్ట్‌గా ఉండే లగ్జరీ కార్లను వదులుకుని దేశసామాన్యులకు టెక్నాలజీని దగ్గర చేసే క్రమంలో చిన్న నానో కారులో రతన్‌టాటా ప్రయణించడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. వ్యాపారానికి మానవీయ కోణాన్ని జోడించే సంప్రదాయాన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ రతన్‌టాటా కొనసాగిస్తూ ఆదర్శంగా నిలిచారు రతన్‌టాటా. చదవండి: Ratan Tata Love Story: ఆ యుద్ధం.. వీళ్ల ప్రేమకు శాపంగా మారింది -
నానో కారు కంటే చిన్న కారును లాంచ్ చేసిన టయోటా..! ధర ఎంతంటే..?
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. పరిమాణం, పార్కింగ్ స్థలం, రేంజ్ వీటన్నింటీని దృష్టిలో ఉంచుకొని టయోటా సీప్లస్ పాడ్ (C+pod) కారును లాంచ్ చేసింది. ఈ కారు నానో కారు కంటే చిన్నగా ఉండడం విశేషం. సీ+పాడ్ ప్రత్యేకతలు ఇవే..! నగరాల్లోని ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని టయోటా గత ఏడాది డిసెంబర్లోనే జపాన్‌లో సీ+పాడ్‌ను ఆవిష్కరించగా...ఇప్పుడు అన్ని దేశాల్లో ఈ కారు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టయోటా సీ+పాడ్ ఎలక్ట్రిక్ కారులో రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ కారు పూర్తిగా బ్యాటరీ అపరేటెడ్. త్రీటోన్ కలర్ ఆప్షన్స్‌తో రానుంది. సీ+పాడ్ 9.06 kWh లిథియం అయాన్ బ్యాటరీను అమర్చారు. ఈ కారు దాదాపు 150 కిమీ రేంజ్‌ను ఇవ్వనుంది. గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. స్టైలింగ్ పరంగా, టయోటా సీ+పాడ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లతో రానుంది. ఈ కారు బరువును తగ్గించేందుకుగాను బాహ్య ప్యానెల్లను పూర్తిగా ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ధర ఎంతంటే..! టయోటా సీ+పాడ్ ఎక్స్, జీ అనే రెండు వేరియంట్లలో రానుంది. ఎక్స్ ట్రిమ్ ధర 1.65 మిలియన్ యెన్ (సుమారు రూ.11.75 లక్షలు)గా ఉండగా, జీ ట్రిమ్ ధర 1.71 మిలియన్ యెన్ (సుమారు రూ. 12.15 లక్షలు)గా ఉంది. చదవండి: అదిరే లుక్స్, హై రేసింగ్ పర్ఫార్మెన్స్తో నయా టీవీఎస్ అపాచీ లిమిటెడ్ ఎడిషన్ బైక్! ధర ఎంతంటే..? -
ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్, ధర ఎంతంటే..?
త్వరలోనే 'నానో' కారు ఇన్స్పిరేషన్తో ప్రపచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు విడుదల కానుంది. దీని ధర ఆల్టో కారు కంటే తక్కువగా ఉంటుందని ఆటోమొబైల్ ప్రతినిధులు చెబుతున్నారు. చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వుల్లింగ్ హాంగ్ గ్వాంగ్ (Wuling Hongguang) గతేడాది మిని ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. విడుదలైన ఈ కారు వినియోగదారుల్ని ఆకట్టుకోవడంతో రికార్డ్ స్థాయిలో 119,255 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అదే జోరుతో మనదేశానికి చెందిన నానో కారు ఇన్స్పిరేషన్తో వుల్లింగ్ సంస్థ 'వుల్లింగ్ నానో' పేరుతో 'ఈవీ' కారును తయారు చేసింది. ఆల్టో కారు ధర 3 లక్షలు ఉండగా.. అర్బన్ ప్రాంతాల్లో వినియోగించేలా కేవలం 2 సీట్ల సామర్ధ్యంతో డిజైన్ చేసిన కారు ధర రూ.2లక్షల 30వేలని ఆటోమొబైల్ సంస్థ వుల్లింగ్ తెలిపింది. ఫీచర్లు చైనా నానో ఈవీ కారు 2,497 ఎంఎం లెంగ్త్,1526 ఎంఎం విడ్త్, 1616 ఎంఎం ఎత్తు, వీల్ బేస్ 1600 ఎంఎంగా ఉంది. నానో ఈవీ 28 kWh సామర్థ్యంతో IP67- సర్టిఫైడ్ లిథియం అయాన్ బ్యాటరీని అందిస్తుంది. అంత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 305 కిమీ ప్రయాణించవచ్చని తయారి దారులు చెబుతున్నారు. సాధారణ 220 వోల్ట్ దేశీయ సాకెట్‌తో బ్యాటరీని రీఛార్జ్ చేసేందుకు 13.5 గంటలు పడుతుండగా..6.6 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ ను వినియోగించి 4.5 గంటల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. నానో కారు స్పూర్తితో 2008 జనవరి 10న ఇండియాలో విడుదలైన టాటా నానో కారు ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. కేవలం రూ.లక్షరూపాయల విలువైన కారును టాటా మోటార్స్ ఆటోమొబైల్ సంస్థ విడుదల చేసింది. అన్నీ వర్గాల ప్రజలు కారును వినియోగించేలా టాటా సంస్థ చైర్మన్ రతన్ టాటా కారును అందుబాటులోకి తెచ్చారు. ఈ కారును ఇన్స్పిరేషన్తో చైనా ఆటోమొబైల్ సంస్థ నానో కంటే అతి చిన్న కారును తయారు చేసింది. చదవండి: అదిరే 'ఆడి'..ఇండియన్ మార్కెట్లో మరో సూపర్ ఎలక్ట్రిక్ కార్ -
ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో15 వ ఎడిషన్‌గా కొనసాగుతున్న ఆటో ఎక్స్పో 2020లో ఫ్రెంచ్ కార్ల తయారీ దారు రెనాల్ట్ ప్రేమికులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన కారును తీసుకొచ్చింది. ట్విజీ పేరుతో మైక్రో ఎలక్ట్రిక్ వాహనం ఈ వాలెంటైన్స్ డే సీజన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. యూరోపియన్ మార్కెట్లో ట్విజీకి మంచి ఆదరణ లభించిందని కంపెనీ తెలిపింది. రెనాల్ట్ ట్విజీ టాటా నానో కంటే చిన్నది. ఇద్దరు వ్యక్తులకు సరిపోతుంది. ఈ టూ సీటర్ ట్విజీలో 6.1 కిలోవాట్ బ్యాటరీని అమర్చింది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. విండ్‌స్క్రీన్, ఇరుకైన బాడీ, డోర్స్ , పనోరమిక్ సన్‌రూఫ్ ఇలా క్రేజీ లుక్స్‌తో ప్రేమికులనుఆకట్టుకోవడం ఖాయం. ఈ కారు సింగిల్ డిజిటల్ కన్సోల్‌ను అమర్చారు. ఈ కారును ఇండియాలో లాంచ్ చేసే ప్రణాళిలేవీ కంపెనీ వెల్లడించలేదు. అయితే రెండవ సీటు చాలా ఇరుకుగా వుండటంతో ఆరడుగుల బులెట్‌లాంటి అబ్బాయిలకు, పొడుగు కాళ్ల సుందరిలకు కొంచెం కష్టమే. చదవండి : ఆటో ఎక్స్పో 2020 : టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు, కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్ -
ఆయన కలల కారుకు ఇక టాటా..!!
న్యూఢిల్లీ: లక్ష రూపాయలకే అంటూ మార్కెట్లోకి వచ్చిన రతన్ టాటా కలల కారు... ప్రజల కారు.. ‘నానో’ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఒక్క నానో కూడా ఉత్పత్తి చేయలేదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ‘2019లో జీరో ప్రొడక్షన్’ అంటూ.. నానో ఉత్పత్తిపై ఎక్సే్ఛంజీలకు కంపెనీ సోమవారం సమాచారమిచ్చింది. కాకపోతే అంతకు ముందటేడాది ఉత్పత్తి చేసిన ఒక కారును 2019 ఫిబ్రవరిలో విక్రయించామని మాత్రం వెల్లడించింది. అయితే, భవిష్యత్తులో కంపెనీ మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నాయంటూ ప్రజల్లో ఉన్న ఆసక్తిని సంస్థ యాజమాన్యం కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా బీఎస్–6 ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో చౌక కారు ఉత్పత్తి దాదాపుగా అసాధ్యమేనని ఆటో పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆ ఐకానిక్ కారుకు ‘టాటా
సాక్షి, ముంబై: లక్ష రూపాయల కారుగా పేరొందిన భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తీసుకొచ్చిన నానో కారు ప్రస్థానానికి త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది. రతన్ టాటా కలల కారు నానోకు టాటా మోటార్స్ గుడ్ బై చెప్పనుంది. వాహనాల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్న భద్రత, కాలుష్య నియంత్రణపై తాజా నిబంధనల ప్రకారం ఈ కారును రూపొందించలేమన్న సంకేతాలను కంపెనీ గురువారం వెల్లడించింది. 2020 ఏప్రిల్ నాటికి ఈ కారు తయారీని పూర్తిగా నిలిపేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి పరోక్షంగా ప్రకటించారు. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా నానోను తీర్చిదిద్దడానికి తాము మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేమని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ చెప్పారు. నానోతోపాటు మరికొన్ని టాటా ప్యాసెంజర్ వెహికిల్స్ తయారీని కూడా నిలిపేయాలని భావిస్తున్నట్లు పరీక్ చెప్పారు. దేశంలోని మధ్య తరగతి ప్రజలకోసం, ఎంట్రీ లెవల్ కారుగా బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన నానో కారు అమ్మకాలు, ఉత్పత్తికి నిలిపివేయనున్నామని మయాంక్ వెల్లడించారు. ఈ కారును సనద్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నాం...జనవరిలో కొత్తగా కొన్ని భద్రతా నిబంధనలు వచ్చాయి, ఏప్రిల్‌లో మరికొన్ని రానున్నాయి. అలాగే అక్టోబర్‌లో మరికొన్ని..ఇలా 2020 ఏప్రిల్ నాటికి బీఎస్-6 ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నానో కార్ల ఉత్పత్తిని కొనసాగించలేమని పేర్కొన్నారు. ఇప్పటికే విక్రయాలు దారుణంగా పడిపోయిన నానో కారు ఆవిర్భావం 2009 సంవత్సరంలో జరిగింది. రూ.లక్ష ధరతో ఈ కారు మార్కెట్లోకి వచ్చినా వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో దాదాపు పదేళ్లలోనే ఈ కారు కథ కంచికి చేరనుంది. మరోవైపు రతన్ టాటా కలల ప్రాజెక్టు ‘నానో’ కారు మూలంగా పైసా లాభం రాకపోగా, కంపెనీకి గుదిబండగా మారిందని, వేయికోట్ల రూపాయల వరకు నష్టపోయామని టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. -
కొత్త కారు ముచ్చట తీరనే లేదు..
ఏలూరు: ఓ ఆటో డ్రైవర్ కొత్తగా కొనుకున్న కారు ముచ్చట తీరనే లేదు. అంతలోనే మృత్యువు కారు ప్రమాదం రూపంలో అతడి ప్రాణాలను మింగేసింది. ఏలూరుకు చెందిన మహేశ్ ఇటీవలే కొనుగోలు చేసిన కారులో పని నిమిత్తం వేరే ప్రాంతానికి బయలుదేరాడు. అతివేగంగా వెళుతున్న ఆ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం పాలగూడెం వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారును వేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
డీజిల్ నానో ఇప్పట్లో లేనట్లే!
పుణే: చిన్న కారు నానోలో డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టాలన్న టాటా మోటార్స్ ప్రతిపాదన ఇప్పుడప్పుడే కార్యరూపం దాల్చేట్లు లేదు. ఆర్థిక, సాంకేతికాంశాలు ఇందుకు కారణం. ఈ కారు కోసం తాము రూపొందించిన డీజిల్ ఇంజిన్‌లోని రిఫైన్మెంట్ స్థాయి (శబ్దం, వైబ్రేషన్, కాలుష్య నియంత్రణ మొదలైనవి) ప్రస్తుత కొనుగోలుదారులకు ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు టాటా మోటార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీశ్ వాఘ్ తెలిపారు. పెపైచ్చు డీజిల్ ధరల రీత్యా ఆర్థికంగా చూసుకున్నా ఇది అటు కొనుగోలుదారులకు, ఇటు తయారీదారులకూ గిట్టుబాటు కాకపోవచ్చని పేర్కొన్నారు. అయితే, అలాగని డీజిల్ నానో ప్రతిపాదన ను పూర్తిగా అటకెక్కించినట్లు కాదని, డీజిల్ ఇంజిన్‌ను మరింత మెరుగుపర్చేందుకు కసరత్తు కొనసాగుతుందని వాఘ్ పేర్కొన్నారు. యువతను ఆకట్టుకునేందుకు జెన్ఎక్స్ నానో కారును త్వరలోనే ప్రవేశపెట్టబోతున్న టాటా మోటార్స్ డీజిల్ నానో కోసం 2 సిలిండర్ 800 సీసీ ఇంజిన్‌ను తయారు చేసింది. -
ఓటు వేసి నానో కారు గెల్చుకున్న లచ్చవ్వ
-
నానో లచ్చమ్మ!
‘ఓటరుపండుగ’ డ్రాలో వరించిన నానో కారు సంగారెడ్డి, : మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం జక్కాపూర్ మదిరా గ్రామానికి చెందిన పరుస లచ్చమ్మను నానో కారు వరించింది. 95 శాతం ఓటింగ్ సాధించిన గ్రామాలకు ప్రకటించిన బహుమతుల బంపర్ డ్రాలో శనివారం కలెక్టర్ స్మితా సబర్వాల్ లచ్చమ్మకు కారును అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణులే అధిక శాతం ఓటింగ్‌లో పాల్గొన్నారని, అక్షరాస్యులుగా భావించే పట్టణ ప్రజలు ఓటింగ్ నమోదులో వెనుకబడి ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని పాటించాలని కోరారు. ఈ సందర్భంగా 106 గ్రామాలకు చెందిన ఓటర్లకు గ్రామానికి పది మందికి చొప్పున బహుమతులను అందజేశారు. వేతనంతో కూడిన సెలవు ప్రకటించి అధిక ఓటింగ్ నమోదుకు సహకరించిన పరిశ్రమల ప్రతినిధులకు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. అధిక శాతం ఓటింగ్ సాధించిన నర్సాపూర్ రిటర్నింగ్ అధికారికి రూ.50వేల నగదును, అందోల్ రిటర్నింగ్ అధికారికి రూ.25వేల నగదు బహుమతులను అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విశేష సేవలందించిన జిల్లా పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. 95 శాతం పైగా ఓటింగ్ సాధించిన 25 గ్రామాల సర్పంచ్‌లకు రూ. 2 లక్షల ప్రోత్సాహక నగదును అందజేశారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, ఏజేసీ మూర్తి, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నానో ఐడియా
బెంగళూరు డ్రైవర్ల యోచన ఆటోల స్థానంలో కార్లు టాక్సీలు, ఏసీ కార్ల కంటే తక్కువ చార్జీకే సేవలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆటోల్లో తిరిగి తిరిగి బెంగళూరు డ్రైవర్లకు మొహం వాసింది. వాటికి బదులు నానో కార్లలో ప్రయాణికులను చేరవేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నగరంలోని అనేక మంది డ్రైవర్లకు తట్టింది. వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం సాయమందిస్తే క్రమంగా ఆటోలు కనుమరుగు కానున్నాయి.ప్రభుత్వ నిబంధనల కారణంగా పాత ఆటోలను మార్చుకోవాల్సిన డ్రైవర్లు, వాటి స్థానంలో ఏకంగా నానో కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. నగరంలో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఆటో చార్జీలకే టాక్సీ సేవలను అందించడానికి ముందుకు వచ్చాయి. కనీస చార్జిని మినహాయిస్తే, ఆటోలో ఎంతవుతుందో, టాక్సీలలో కూడా అంతే అవుతోంది. కనీస చార్జిని రూ.100గా నిర్ణయించినందున, ఇంకా ఆ టాక్సీలు అంతగా ప్రజాదరణ పొందలేక పోతున్నాయి. నానో కారును కొనుగోలు చేయాలనుకుంటున్న ఆటో డ్రైవర్లు... టాక్సీలు, ఏసీ కార్ల కంటే తక్కువ చార్జీకే సేవలు అందించాలని యోచిస్తున్నారు. నలుపు రంగులోని 2 స్ట్రోక్ పాత ఆటోలను మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వం ఇదివరకే డ్రైవర్లకు సూచించింది. గ్యాస్ కిట్‌తో కూడిన ఆకు పచ్చ ఆటోలను కొనుగోలు చేయడానికి రూ.30 వేలు సబ్సిడీ కూడా ఇస్తోంది. దీనికి బదులు ఏకంగా నానో కార్లనే కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన డ్రైవర్లకు తట్టింది. ప్రస్తుతం ఓ ఆటో ధర ఆన్ రోడ్ రూ.1.60 లక్షలవుతోంది. నానో కారు ధర రూ.2 లక్షలు. పాత ఆటోలను మార్చుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, పన్ను రాయితీలను కలుపుకొంటే ఆటో ధరకే నానో కారును కొనుగోలు చేయవచ్చనేది డ్రైవర్ల యోచన. నగరంలో 1.20 లక్షల ఆటోలున్నాయని అంచనా. అనధికారికంగా తిరుగుతున్న ఆటోలను కలుపుకొంటే ఆ సంఖ్య 1.50 లక్షలు. వీటిలో 32 వేల పాత ఆటోలున్నాయి. వీటిని గ్రామాలకు తరలించి ఆకు పచ్చ ఆటోలను కొనుగోలు చేయడానికి డ్రైవర్లు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లకు మూడు చక్రాల వాహనాల లెసైన్స్‌లు ఇస్తున్నారు. దీనిని నాలుగు చక్రాల లెసైన్స్‌గా మార్చాలని డ్రైవర్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఆటో ఫైనాన్స్‌లో ప్రైవేట్ కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రభుత్వం పన్ను, సెస్ తగ్గిస్తే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదా కావడమే కాకుండా నేరుగా డీలర్ల వద్దకు వెళ్లి కార్లను కొనుగోలు చేయవచ్చని డ్రైవర్లు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఆటో కనీస చార్జి రూ.25 కాగా, తదుపరి ప్రతి కిలోమీటరుకు చార్జిని రూ.13గా నిర్ణయించారు. -
కొత్త నానో వస్తోంది...
సింగపూర్: నానో కారుకు కొత్త రూపు, ఇమేజ్‌ని ఇవ్వాలని టాటా గ్రూప్ యోచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే సరికొత్త నానోను భారత్‌లో కాకుండా వేరే దేశ (బహుశా ఇండోనేిసియా) మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయని టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా చెప్పారు. చౌక కారు అన్న ముద్ర నానోకు ఉందని, దీనిని తొలగించేలా కొత్తగా నానోను ఇండోనేషియాలో ప్రవేశపెట్టి, ఆ తర్వాత భారత మార్కెట్లోకి తెస్తామని వివరించారు. సరికొత్తగా మార్పులు, చేర్పులు చేసిన నానోను యూరప్ దేశాల్లో కూడా విక్రయిస్తామని తెలిపారు. నానో పట్ల ప్రపంచ దేశాల్లో మంచి ఆసక్తి నెలకొందని వివరించారు. సీఎన్‌బీసీ మేనేజింగ్ ఏషియా కార్యక్రమానికిచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా చెప్పారు. తప్పుగా మార్కెటింగ్: కొత్త నానో కోసం కసరత్తు జరుగుతోందని రతన్ టాటా చెప్పారు. నానో మార్కెటింగ్ విషయంలో చౌక కారు ప్రచారంతో తప్పు చేశామని ఆయన అంగీకరించారు. టూ-వీలర్ల మీద పిల్లలతో సహా ప్రయాణించే కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని, వారికి అందుబాటు ధరలో కారునందించాలనే ఉద్దేశంతో నానోను తెచ్చామని వివరించారు. అంతేకాని ఇది చౌక కారు కాదని పేర్కొన్నారు. టాటా మోటార్స్ ఎంతోగానే ఆశలు పెట్టుకున్న నానో కారు అమ్మకాలు నానాటికి తగ్గుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలానికి 43,627గా ఉన్న నానో విక్రయాలు ఈ ఏడాది ఇదే కాలానికి 72 శాతం క్షీణించి 12,322కు చేరాయి. గత నెలలో కంపెనీ నానోలో సీఎన్జీ, పెట్రోల్ బయో ఫ్యూయల్ ఆప్షన్లలో వేరియంట్లను విడుదల చేసింది. లక్ష రూపాయల కారుగా ప్రారంభంలో ప్రచారం పొందిన నానో కారు ప్రస్తుత ధరలు రూ.1.45 లక్షల నుంచి రూ.2.65 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. పౌష్టికాహార లోపం పెద్ద సమస్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యువశక్తి అధికంగా ఉన్న భారత్ వంటి దేశానికి పౌష్టికాహార లోపం అనేది అతిపెద్ద సమస్య అని, దీన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో ఇండియా పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కేవలం ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలపైనే ఆధారపడకుండా ప్రతీ ఒక్కరూ నడుంబిగించినప్పుడే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. పౌష్టికాహార సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటైన ‘ఇండియన్ ఇంపాక్ట్’ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను రతన్ టాటా, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీ.ఎం.రావులు ఇక్కడ లాంఛనంగా ప్రారంభించారు. -
మార్చి నాటికి డీజిల్ నానో
న్యూఢిల్లీ: నానో మోడల్లో డీజిల్ వేరియంట్‌ను వచ్చే ఏడాది మార్చి కల్లా మార్కెట్లోకి తెస్తామని టాటా మోటార్స్ ఎండీ కార్ల్ సిమ్ చెప్పారు. ఈ డీజిల్ నానోతో నానో అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా మార్కెట్లోకి రాకముందే నానో హల్చల్ చేసింది. కానీ, ఆశించిన అమ్మకాలు సాధించలేకపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో నానో అమ్మకాలు 27% క్షీణించాయి. నానో పట్ల డిమాండ్ పెంచే చర్యల్లో భాగంగా రిమోట్ కీలెస్ ఎంట్రీ, తదితర కొత్త ఫీచర్లను నానోలో ప్రవేశ పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. దేశీయంగా తయారయ్యే విడిభాగాలనే ఎక్కువగా వినియోగిస్తామని ఫలితంగా రూపాయి పతనం తమపై పెద్దగా ప్రభావం చూపదని వివరించారు.