మార్చి నాటికి డీజిల్ నానో
న్యూఢిల్లీ: నానో మోడల్‌లో డీజిల్ వేరియంట్‌ను వచ్చే ఏడాది మార్చి కల్లా మార్కెట్లోకి తెస్తామని టాటా మోటార్స్ ఎండీ కార్ల్ సిమ్ చెప్పారు. ఈ డీజిల్ నానోతో నానో అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా మార్కెట్లోకి రాకముందే నానో హల్‌చల్ చేసింది. కానీ, ఆశించిన అమ్మకాలు సాధించలేకపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో నానో అమ్మకాలు 27% క్షీణించాయి. నానో పట్ల డిమాండ్ పెంచే చర్యల్లో భాగంగా రిమోట్ కీలెస్ ఎంట్రీ, తదితర కొత్త ఫీచర్లను నానోలో ప్రవేశ పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. దేశీయంగా తయారయ్యే విడిభాగాలనే ఎక్కువగా వినియోగిస్తామని ఫలితంగా రూపాయి పతనం తమపై పెద్దగా ప్రభావం చూపదని వివరించారు.