ప్రపంచంలోనే లగ్జరీ కార్లుగా జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లకు గుర్తింపు ఉంది. ఈ బ్రాండ్లలో హైఎండ్ మోడల్ ధర కోట్లలో ఉంటుంది. ఈ బ్రాండ్లు ప్రస్తుతం రతన్‌టాటా ఆధీనంలోనే ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి కామన్‌మ్యాన్ కోసం డిజైన్ చేసిన లక్ష రూపాయల కారు నానోను ఎంచుకున్నారు రతన్‌టాటా.
రతన్‌టాటా కోసం ప్రత్యేకంగా నానో ఈవీ వెర్షన్ కారుని తయారు చేసింది టాటా ఎలెక్ట్రా సంస్థ. రతన్ టాటా కోరిక మేరకు ఆయన అవసరాలకు తగ్గట్టుగా ఇటీవల కస్టమైజ్డ్ ఈవీ నానో కారును డెలివరీ చేసింది. రతన్‌టాటా అతని సహాయకుడు శంతను నాయుడు ఈ కారులో ప్రయాణించారు.
రతన్ టాటా కోసం తయారు చేసిన నానో 72 వీ ఎలక్ట్రిక్ కారు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రమాణాల ప్రకారం సింగిల్ ఛార్జ్‌తో 213 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండగా గ్రౌండ్ రియాలిటీలో కనీసం 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందనే అంచనాలు ఉన్నాయి. పది సెకన్ల వ్యవధిలో గంటలకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగం అందుకోగలదు. ఇందులో లిథియం ఐయాన్ బ్యాటరీ ఉపయోగించారు.
సామాన్యులకు కారు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో నానో కారుని తెచ్చారు రతన్‌టాటా. కేవలం లక్ష రూపాయల బడ్జెట్‌తో తెచ్చిన ఈ కారు మార్కెట్‌లో అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా.. మధ్యతరగతి ప్రజలకు కారును చేరువ చేసింది. టాటా గ్రూపు నుంచి లగ్జరీ కార్లతో పాటు నెక్సాన్, టిగోర్ వంటి ఈవీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐనప్పటికీ రతన్‌టాటా నానోను ఎంచుకుని అందరినీ విస్మయానికి గురి చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. నడుస్తున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా సామాన్యులకి తక్కువ ధరకే ఈవీ కారును అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో రతన్‌టాటా ఉన్నారని. అందుకే ప్రత్యేకంగా కారుని తయారు చేయించుకుని పరీక్షిస్తున్నారనే వారు ఉన్నారు.
84 ఏళ్ల వయసులోనూ కంఫర్ట్‌గా ఉండే లగ్జరీ కార్లను వదులుకుని దేశసామాన్యులకు టెక్నాలజీని దగ్గర చేసే క్రమంలో చిన్న నానో కారులో రతన్‌టాటా ప్రయణించడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. వ్యాపారానికి మానవీయ కోణాన్ని జోడించే సంప్రదాయాన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ రతన్‌టాటా కొనసాగిస్తూ ఆదర్శంగా నిలిచారు రతన్‌టాటా.
చదవండి: Ratan Tata Love Story: ఆ యుద్ధం.. వీళ్ల ప్రేమకు శాపంగా మారింది
Comments
Please login to add a commentAdd a comment