బెంగాల్ నుంచి గుజరాత్‌కు నానో ప్లాంట్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ‘వెల్‌కమ్’ అంటూ రతన్ టాటాకు పంపించిన ఒక ఎస్‌ఎంఎస్.. సామాన్యుల కారు ‘నానో’ ప్లాంట్‌ను పశి్చమబెంగాల్‌లోని సింగూర్ నుంచి గుజరాత్‌లోని సనంద్‌కు తరలేలా చేసింది. పశి్చమబెంగాల్‌లోని సింగూర్‌లో టాటా నానో ప్లాంట్ కోసం భూసమీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుత సీఎం, నాటి ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ రైతులతో కలసి 2006లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అది ఎంతకీ పరిష్కారమయ్యేలా కనిపించకపోవడంతో రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు రతన్‌టాటా ప్రకటించారు.
ఆ సమయంలో తాను పంపిన ఎస్‌ఎంఎస్ ఎలాంటి ఫలితాన్నిచ్చందన్నది నాటి సీఎం మోదీ తర్వాత స్వయంగా ప్రకటించారు. ‘‘తాము పశి్చమబెంగాల్‌ను వీడుతున్నట్టు కోల్‌కతాలో రతన్‌టాటా మీడియా సమావేశంలో ప్రకటిస్తున్న వేళ, ‘వెల్‌కమ్’ అంటూ నేను ఒక చిన్న ఎస్‌ఎంఎస్ పంపాను. రూపాయి ఖర్చుతో పంపించిన ఎస్‌ఎంఎస్ ఏమి చేయగలదో మీరు ఇప్పుడు చూస్తున్నారు’’అంటూ గుజరాత్‌లోని సనంద్‌లో రూ.2,000 కోట్లతో టాటా ఏర్పాటు చేసిన నానో ప్లాంట్‌ను 2010లో ప్రారంభిస్తున్న వేళ నాటి సీఎం మోదీ ప్రకటించారు. దేశ పారిశ్రామిక చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment