
గాంధీ నగర్ : ప్రధాని మోదీ ఇవాళ తన సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటించారు. అయితే, ఈ పర్యటనకు ముందు రోజు అంటే నిన్న ప్రధాని మోదీ ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహించారు అధికారులు. అంత వరకు బాగానే ఉన్నా.. కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.
ప్రధాని మోదీ రాక నేపథ్యంలో సెక్యూరిటీ రిత్యా ఆయా ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. గుజరాత్ పర్యటన వేళ గుజారత్‌లోని రతన్ చౌక్ వద్ద పోలీస్ ఉన్నతాధికారులు మోదీ కాన్వాయ్‌తో రిహారాల్స్ నిర్వహించారు. ఆ సమయంలో 17ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుకుంటూ పొరపాటున రిహార్సల్స్ జరిగే ప్రాంతం వైపు వచ్చాడు. వెంటనే రెప్పపాటులో సైకిల్‌ను వెనక్కి తిప్పాడు.
అదే సమయంలో పక్కనే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి ఎస్ బీఎస్ గాధ్వీ సదరు బాలుడిని జుట్టు పట్టుకుని లాగారు. ఆపై చెంప చెల్లు మనిపించాడు. దీంతో బాలుడు వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే, బాలుడిపై సదరు పోలీస్ అధికారి దాడి సమయంలో స్థానికంగా పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి.
సంబంధిత వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. వైరలైన వీడియోలపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ వానాని స్పందించారు. గాధ్వీ తీరు క్షమించరానిది. ప్రస్తుతం,మ్రోబి జిల్లాలో పోలీస్‌స్టేషన్‌లో విధిలు నిర్వహిస్తున్న ఆయన్ను కంట్రోల్ రూంకి ట్రాన్స్‌ఫర్
చేసినట్లు తెలిపారు. అంతేకాదు, ఏడాదిపాటు శాలరీ ఇంక్రిమెంట్ సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది.
This Gujarat Police officer brutally thrashed a harmless kid on a cycle just for coming in between the convoy of Police VVIP movement rehearsal.
Look at how he makes a fist and punches the kid.
NAME AND SHAME THIS COP UNITL HE IS SUSPENDED!
pic.twitter.com/5a08yvdUVd— Roshan Rai (@RoshanKrRaii) March 7, 2025