
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈరోజు (శనివారం) నుంచి మూడు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. జునాగఢ్ జిల్లాలోని ససాన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్‌బీడబ్ల్యుఎల్) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణ కేంద్రంను సందర్శించనున్నారు. అలాగే సోమనాథ్ ట్రస్ట్ సమావేశంలో కూడా పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ తన పర్యటనలో ఆదివారం జామ్‌నగర్‌లోని వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం జంగిల్ సఫారీ చేయనున్నారు. గుజరాత్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎపీ సింగ్ మాట్లాడుతూ మార్చి ఒకటిన సాయంత్రం ప్రధాని జామ్‌నగర్(Jamnagar) చేరుకుంటారని, రాత్రికి అక్కడి సర్క్యూట్ హౌస్‌లో బస చేస్తారని తెలిపారు. మరుసటి రోజు వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారన్నారు. తరువాత జామ్‌నగర్ నుండి బయలుదేరి సాయంత్రం ససాన్ చేరుకుంటారు. అక్కడ ఆయన సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
మార్చి 3న ప్రధాని మోదీ ఆసియా సింహాలకు నిలయమైన గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీని ఎంజాయ్ చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో పూజలు చేయనున్నారు. అలాగే అటవీ ఉద్యోగులతో మోదీ సంభాషించనున్నారు. అనంతరం సోమనాథ్ నుండి రాజ్‌కోట్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరుతారని సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉదయాన్నే వర్షం.. వీడని చలిగాలులు