
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మసీ రిటైల్ దిగ్గజం మెడ్‌ప్లస్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు మెడికల్ డివైజ్‌ల తయారీ అంకుర సంస్థ స్టార్‌టూన్ ల్యాబ్స్ వెల్లడించింది.
మెడ్‌ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఫీజీ పరికరంతో కండరాలు, కీళ్ల సంబంధ వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఫిజియోథెరపీ తీసుకుంటున్న పేషంట్ల రికవరీని పర్యవేక్షించేందుకు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఈ డివైజ్ తోడ్పడుతుందని తెలిపింది. కండరాలు, నరాల సంబంధ సమస్యలు ఉన్న వారు ఈ పరీక్ష చేయించుకోవచ్చని వివరించింది.