
ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. 25 శాతం ఉద్యోగులను తగ్గించుకునే అవకాశం ఉందనే వార్తలపై తాజాగా సంస్థ అధికారికంగా స్పందించింది. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇలా వస్తున్న వార్తలను ఖండించింది. ఇది అవాస్తవమని స్పష్టం చేసింది. అలాంటి చర్యలేమీ తీసుకోలేదని వివరించింది.
ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..
ఖర్చులను తగ్గుంచుకోవడంలో భాగంగానే కంపెనీ లేఆప్స్ కార్యక్రమాన్ని చేపట్టనుందని ఇటీవల వార్తలొచ్చాయి. కంపెనీలోని రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న 50 నుంచి 55 సంవత్సరాల వయసున్న ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అంతే కాకుండా వివిధ విభాగాల్లో ఏడాదికి కోటి రూపాయల జీతం పొందుతున్న అనేకమంది ఉద్యోగులను రాజీనామా చేయాలని సంస్థ ఇప్పటికే కోరినట్లు ఆయా వార్తల్లో తెలిపారు. జాతీయ మీడియా సంస్థలతో సహా చాలా ప్రాంతీయ సంస్థలు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. దీనిపై కంపెనీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. సంస్థలో సిబ్బంది తగ్గింపు వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.