Reddys Laboratories
-
డాక్టర్ రెడ్డీస్ లాభం 959 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 959 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన లాభం రూ. 87.5 కోట్లతో పోలిస్తే ఇది 996 శాతం అధికం. లో బేస్ ప్రభావం ఇందుకు కారణం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 25 శాతం పెరిగి రూ. 5,437 కోట్ల నుంచి రూ. 6,297 కోట్లకు చేరింది. ఆదాయాలు, లాభాల వృద్ధిపరంగా ఇది తమకు రికార్డు సంవత్సరమని కంపెనీ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఉత్తర అమెరికా,యూరప్, భారత మార్కెట్లు పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడిందని బుధవారం ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కంపెనీ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అన్ని వ్యాపార విభాగాలు పుంజుకోవడం తదితర అంశాలు ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ. 5,000 కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు చెప్పారు. తాజా ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త ఉత్పత్తులు, ఉత్పాదకతను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ బోర్డు షేరు ఒక్కింటికి రూ. 40 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు .. ► గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు క్యూ4లో 18 శాతం పెరిగి రూ. 5,426 కోట్లకు చేరాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 2,532 కోట్లుగా నమోదైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో నాలుగో త్రైమాసికంలో ఆరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 25 ఔషధాలను ఆవిష్కరించింది. ► భారత్‌లో అమ్మకాలు 32 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలతో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు ఆదాయం సమకూరింది. ► యూరప్ మార్కెట్ ఆదాయాలు 12% పెరిగి రూ. 496 కోట్లకు, వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 7% క్షీణించి రూ. 1,114 కోట్లుగా నమోదైంది. ► ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం మూడు శాతం పెరిగి రూ. 756 కోట్ల నుంచి రూ. 778 కోట్లకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 21,439 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.24,588 కోట్లకు చేరింది. లాభం రూ. 2,357 కోట్ల నుంచి 91% ఎగిసి రూ.4,507 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కార్య కలాపాలపై రూ.1,940 కోట్లు వెచ్చించింది. ఈసారి మొత్తం అమ్మకాల్లో 8–9% వెచ్చించనుంది. -
అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ రెగాడెనొసోన్ ఇంజెక్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా అమెరికా మార్కెట్లో రెగాడెనొసోన్ ఇంజెక్షన్‌ను ప్రవేశపెట్టింది. రక్త ప్రవాహాన్ని పరీక్షించే క్రమంలో గుండె ఇమేజ్‌లను తీయడంలో ఏజంటుగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది లెక్సిస్కాన్ ఇంజెక్షన్‌కు జనరిక్ వెర్షన్. మరోవైపు, తెలంగాణలోని తమ బొల్లారం ప్లాంటులో మే 1 నుంచి 5 వరకు అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఫారం 483ని జారీ చేసినట్లు వివరించింది. నిర్దేశిత గడువులోగా దాన్ని పరిష్కరిస్తామని తెలిపింది. తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధ పరిస్థితులేమైనా కనిపిస్తే యూఎస్ఎఫ్డీఏ ఫారం 483ని జారీ చేస్తుంది. -
రాజధానిగా విశాఖ..! చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి
-
డాక్టర్ రెడ్డీస్ లాభం 30 శాతం అప్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 992 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 762 కోట్లతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. మరోవైపు, ఆదాయం రూ. 4,897 కోట్ల నుంచి రూ. 5,732 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం, అన్ని మార్కెట్లలో విక్రయాలు భారీగా పెరగడం తదితర అంశాలు కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడానికి దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇతర నిర్వహణ ఆదాయం రూ. 15 కోట్లు ఉండగా.. తాజా క్యూ2లో రూ. 170 కోట్లకు పెరిగింది. -
కోవిడ్ తొలి వాక్సిన్ భారత్ నుంచే?
-
భారత్‌కు రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి హైదరాబాద్‌కు చేరింది. భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్‌లో రెండు, మూడో విడత క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు రష్యా ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా భారత్‌లో సుమారు 2వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి రెడ్డీస్ ల్యాబ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించి... అనంతరం ట్రయల్స్ రిజల్ట్‌ను డీజీసీఐకి సమర్పించనున్నారు. కాగా.. స్పుత్నిక్ టీమ్ వ్యాక్సిన్ ఇప్పటికే 92 శాతం సక్సెస్ సాధించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. (షాకింగ్: కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో..) 2020 సెప్టెంబరులో, డాక్టర్ రెడ్డీస్, ఆర్‌ఈఐఎఫ్ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ని భారతదేశంలో పంపిణీ చేసేందుకు ఒక ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది. మొదట భారత్ లో 3వ దశ ట్రయల్ మాత్రమే నిర్వహించాలని అనుకున్నా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్కో) నిపుణుల కమిటీ (ఎస్ఇసి) ఆదేశాల మేరకు వరుసగా 2,3 దశల క్లినికల్ ట్రయల్ నిర్వహిచనుంది. 1500 మందితో అడాప్టివ్ ఫేజ్ 2,3 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు సన్నద్ధమవుతున్నామని టీకాను విదేశాలలో మార్కెటింగ్ చేస్తున్న ఆర్డిఐఎఫ్ తెలిపింది. (భారత్‌లో కొత్తగా 47,905 కరోనా కేసులు) -
రెడ్డీస్ నుంచి ఐదేళ్లలో 70 ఔషధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వచ్చే ఐదేళ్లలో చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో 70కి పైగా ఔషధాలను విడుదల చేయాలని లకి‡్ష్యంచింది. ఇప్పటికే ఆయా ఉత్పత్తుల్లో కొన్ని మందుల తయారీని స్థానిక పార్టనర్స్‌కు ఔట్ సోర్సింగ్ కూడా చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్లలో 8–10 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, వాటన్నిటికీ సంబంధించి కుష్నన్ రొట్టం రెడ్డి ఫార్మాసూటికల్స్‌తో (కేఆర్ఆర్పీ) భాగస్వామ్యం ఉందని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి తెలియజేశారు. షిజోఫ్రినియా, బైపోలార్ వంటి మానసిక పరిస్థితుల చికిత్సలో ఉపయోగించే ఓలాన్జాపైన్ ఔషధాన్ని 2020 నుంచి చైనాలో ప్రారంభిస్తామని చెప్పారాయన. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రెట్టింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,093 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 504 కోట్లతో పోలిస్తే 117 శాతం అధికం. క్యూ2లో ఆదాయం రూ. 3,798 కోట్ల నుంచి 26 శాతం పెరిగి రూ. 4,801 కోట్లకు చేరింది. పన్నులపరమైన సర్దుబాట్లు, కొన్ని ప్రాంతాలకు సంబంధించి మూడు ఉత్పత్తుల హక్కులను విక్రయించడం వంటి వన్‌టైమ్ అంశాలు.. ఆదాయాలు, లాభాలు పెరగడానికి కారణమయ్యాయని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ, సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. మూడు ఔషధాల విక్రయ హక్కుల బదలాయింపునకు గాను అప్షర్–స్మిత్ లాబరేటరీస్ నుంచి రూ. 720 కోట్లు లైసెన్సు ఫీజు కింద రాగా, సుమారు రూ. 326 కోట్ల మేర ఆదాయపు పన్నుపరమైన ప్రయోజనం లభించినట్లు చక్రవర్తి తెలిపారు. ఈ క్వార్టర్లో అత్యధిక లాభాలు, ఆదాయాలు నమోదు చేసినట్లు వివరించారు. నిర్దిష్ట మలినాల కారణంగా .. రానిటిడిన్ ఔషధాన్ని అమెరికా మార్కెట్ల నుంచి స్వచ్ఛందంగా రీకాల్ చేశామని, ప్రస్తుతం దీన్ని ఎక్కడా విక్రయించడం లేదని చక్రవర్తి వివరించారు. చైనా మార్కెట్లో క్యాన్సర్ ఔషధాలతో పాటు 70 ఉత్పత్తులు ప్రవేశపెట్టడంపై దృష్టి సారిస్తున్నామని ఇజ్రేలీ తెలిపారు. ద్వితీయార్థంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు కేటాయింపులు పెరగనున్నట్లు చెప్పారు. వృద్ధి లేని ఉత్తర అమెరికా.. యూరప్, వర్ధమాన మార్కెట్లు, భారత్ తదితర దేశాల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం వార్షికంగా 7 శాతం వృద్ధితో రూ. 3,280 కోట్లుగా నమోదైంది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో వృద్ధి లేకపోగా.. ధరలు తగ్గించాల్సి రావడం, విక్రయాలు తగ్గడం వంటి అంశాల కారణంగా సీక్వెన్షియల్‌గా చూస్తే 13 శాతం క్షీణించి రూ. 1,430 కోట్లకు పరిమితమైంది. సెపె్టంబర్ త్రైమాసికంలో ఉత్తర అమెరికా మార్కెట్లో ఎనిమిది కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టామని, ప్రస్తుతం 99 జనరిక్ ఔషధాలకు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చక్రవర్తి చెప్పారు. మెరుగ్గా యూరప్... కొత్త ఉత్పత్తులు, అమ్మకాల వృద్ధి ఊతంతో యూరప్ మార్కెట్ ద్వారా ఆదాయం 44 శాతం వృద్ధి చెంది రూ. 280 కోట్లుగా నమోదైంది. ఇక, దేశీ మార్కెట్లో ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 750 కోట్లకు చేరినట్లు చక్రవర్తి తెలిపారు. రెండో త్రైమాసికంలో భారత మార్కెట్లో కొత్తగా 5 ఉత్పత్తులు ప్రవేశపెట్టినట్లు వివరించారు. మరోవైపు వర్ధమాన మార్కెట్ల ద్వారా ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. పీఎస్‌ఏఐ విభాగం 18 శాతం అప్.. ఫార్మా సరీ్వసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం వార్షికంగా 18 శాతం, సీక్వెన్షియల్‌గా 57 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఉత్పత్తుల విక్రయాలు పెరగడం ఇందుకు దోహదపడింది. సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 370 కోట్లు వెచ్చించగా.. పెట్టుబడి వ్యయాల కింద ప్రథమార్ధంలో మొత్తం రూ. 214 కోట్లు వెచ్చించినట్లు చక్రవర్తి తెలిపారు. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేరు 1 శాతం క్షీణించి రూ. 2,755 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ ఆండాన్ సెట్రాన్ ట్యాబ్లెట్ల రీకాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శస్త్రచికిత్సలు మొదలైన వాటిల్లో వాంతుల సమస్యను నివారించేందుకు ఉపయోగించే ఆండాన్సెట్రాన్ ట్యాబ్లెట్ల 50,000 బాటిల్స్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అమెరికా మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. డిగ్రేడేషన్ ప్రమాణాల్లో వైఫల్యం ఇందుకు కారణమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఒక నివేదికలో పేర్కొంది. తాత్కాలికమైన ప్రతికూల ప్రభావాలు చూపే ఔషధాల కేటగిరీ కిందకి వచ్చే ఈ రీకాల్ మార్చి 30న మొదలైనట్లు వెల్లడించింది. -
తుదిమెరుగుల్లో...బల్క్ డ్రగ్ పాలసీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: దేశంలోనే బల్క్ డ్రగ్ రాజధానిగా వెలుగొందుతున్న హైదరాబాద్‌కు మళ్లీ పూర్వ వైభవం రానుంది. బల్క్‌డ్రగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న విద్యుత్, ఎక్సైజ్, రెగ్యులేటరీ సంబంధిత పలు సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా త్వరలో బల్క్ డ్రగ్ పాలసీని కేంద్ర ప్రభుత్వం రూపొందించనుందని బల్క్‌డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎమిరటస్ ఎం. నారాయణ రెడ్డి తెలిపారు. బల్క్డ్రగ్గా వ్యవహరించే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) తయారుచేసే డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, గ్రాన్యూల్స్, దివీస్ ల్యాబొరేటరీస్ తదితర కంపెనీలు దేశంలో అత్యధికంగా హైదరాబాద్ నగరంలో విస్తరించి ఉన్నాయి. రూ. 79,000 కోట్ల ఫార్మా మార్కెట్లో ఏపీఐల వాటా పది శాతం పైగానే ఉంటోంది. హైదరాబాద్ తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఈ పరిశ్రమ విస్తరించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ఎజెండాలో భాగంగా బల్క్ డ్రగ్ విధానంపై తొలి ముసాయిదాను రూపొందించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు నారాయణరెడ్డి చెప్పారు. ఈ ముసాయిదా రూపకల్పనలో భాగంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆరవ చివరి సమావేశంలో పాల్గొన్నప్పుడు పలు అంశాలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ (డీఓపీ) ముందుంచామని ఆయన తెలిపారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలి... బల్క్‌డ్రగ్స్ ఉత్పత్తిలో చైనా పోటీని తట్టుకొని నిలబడే విధంగా పాలసీని రూపొందించినపుడే దేశీయ కంపెనీలు మనుగడ సాగించగలవని, చైనా డంపింగ్‌కు అడ్డుకట్ట వేసే విధంగా విధాన రూపకల్పన జరగాలని తాము సూచించామన్నారు. చైనా నుండి దిగుమతి అయిన బల్క్‌డ్రగ్స్ ల్యాండెడ్ వ్యయం దేశంలో ఉత్పత్తి అయ్యే ఖర్చుతో పోలిస్తే 15-20 శాతం తక్కువగా ఉంటోందన్నారు. దీంతో చైనా ఉత్పత్తులతో మన కంపెనీలు పోటీ పడలేక పోతున్నాయని, మన కంపెనీలకు అడ్వాంటేజ్ కలిగే దిశగా కొత్త పాలసీలో ప్రభుత్వం విధాన ప్రకటన చేయాలని సూచించామన్నారు. దేశంలో 500కి పైగా వివిధ రకాల బల్క్‌డ్రగ్స్ ఉత్పత్తి అవుతున్నాయని, వీటికి పర్యావరణ అనుమతులు పొందడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఉదాహరణకు ఒక బల్క్‌డ్రగ్‌కు పర్యావరణ అనుమతి దరఖాస్తు చేసిన ఆరునెలల్లోగా మంజూరు చేయాలని నిబంధనలున్నా వాస్తవంగా దీనికి నాలుగు ఏళ్లు పడుతోందన్నారు. బల్క్‌డ్రగ్స్ రంగంలో చిన్న పరిశ్రమలు వందల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని, అయితే దీనికి అనుగుణంగా కామన్ ఎఫ్ల్యూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు
హైదరాబాద్: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు నమోదైంది. పేటెం టున్న ఔషధమైన వాసెపాకు జనరిక్ వెర్షన్‌ను తీసుకొచ్చే పనిలో రెడ్డీస్ నిమగ్నమైందంటూ డబ్లిన్‌కు చెందిన అమరిన్ ఫార్మా అమెరికా కోర్టును ఆశ్రయించింది. రెడ్డీస్ ఏఎన్‌డీఏ 16 కౌంట్లలో వాసెపా ఔషధాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. రెడ్డీస్, అనుబంధ కంపెనీ, ఇతర విభాగాలుగానీ ఈ ఔషధం తయారీ, వాడకం, విక్రయం, అమ్మజూపడం, కొనుగోలును శాశ్వతంగా నిషేధించాలని కోర్టుకు విన్నవించింది. హ్యాచ్-వాక్స్మన్ యాక్టు కింద అమరిన్ ఫార్మా ఈ దావా వేసింది. శరీరంలో ఒక రకమైన కొవ్వును (ట్రైగ్లిసెరైడ్స్) తగ్గించేందుకు ఈ ఔష దం దోహదం చేస్తుంది. వాసెపా ఔషధం పేటెం ట్లు చాలామటుకు 2030లో ముగియనున్నాయి.