డాక్టర్ రెడ్డీస్ ఆండాన్ సెట్రాన్ ట్యాబ్లెట్ల రీకాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శస్త్రచికిత్సలు మొదలైన వాటిల్లో వాంతుల సమస్యను నివారించేందుకు ఉపయోగించే ఆండాన్‌సెట్రాన్ ట్యాబ్లెట్ల 50,000 బాటిల్స్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అమెరికా మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. డిగ్రేడేషన్ ప్రమాణాల్లో వైఫల్యం ఇందుకు కారణమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఒక నివేదికలో పేర్కొంది. తాత్కాలికమైన ప్రతికూల ప్రభావాలు చూపే ఔషధాల కేటగిరీ కిందకి వచ్చే ఈ రీకాల్ మార్చి 30న మొదలైనట్లు వెల్లడించింది.