Bottles
-
వామ్మో మందుబాబుల గుండె ఆగిపోతుందేమో
-
ఏసీబీ అధికారులు గులాబీ రంగు సీసా: ఈ లాజిక్ ఏంటో తెలుసా?
సాధారణంగా కొంతమంది ప్రభుత్వ అధికారులు, కొందరు ఉద్యోగులు, సిబ్బంది లంచాలు తీసుకుంటూ పట్టుబడిన కథనాలు చూస్తూఉంటాం కదా. ఈ సమయంలో కరెన్సీ నోట్లతో పాటు పింక్ రంగులో ద్రావణం ఉండే సీసాలను కూడా ఉంచుతారు అధికారులు. అవేంటో వాటి కథ ఏంటో ఎపుడైనా ఆలోచించారా? అయితే అసలు ఆ సీసాలు ఏమిటి? అందులో పింక్ రంగులో ద్రావణం ఎందుకు ఉంటుంది ? దానికి లంచానికి సంబంధం ఏమిటి ? ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజల కోసంపనిచేయాల్సిన కొందరు అక్రమార్కులు లంచం ఇస్తేనే పని స్థాయికి దిగజారుతారు. లబ్దిదారులు, బాధితులకు అందాల్సినవి అందకుండా, చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ జలగల్లా పీడించుకు తింటారు. నిజానికి లంచం తీసుకోవడం, ఇవ్వడమూ రెండూ నేరమే. కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా, వాళ్లకు ఎంతోకొంత ముట్టజెప్పి తమ పని కానిచ్చుకుంటారు. కానీ కొంతమంది అలాకాదు. అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదిస్తారు. వారికి ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు లాంచావతార ఉద్యోగుల ఆటకట్టించేందుకు అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరప్షన్ బ్యూరో) రంగంలోకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్షించడమే ఈ శాఖ పని. ఈ క్రమంలోనే ఫిర్యాదు, లేదా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు బాధితులకు ముందుగానే కొన్ని నోట్లిచ్చి వాటిని లంచం డిమాండ్ చేస్తున్న అధికారి లేదా ఉద్యోగికి ఇవ్వమంటారు. అయితే దీనికంటే ముందే ఏసీబీ అధికారులు ఆ కరెన్సీ నోట్లకు ముందుగా ఫినాల్ఫ్తలీన్ అనే పౌడర్‌ను రాస్తారు. నిజానికి ఈ పౌడర్ కళ్లకు కనిపించదు,గుర్తించలేం.ఆ నోట్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి సదరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటారు. అనంతరం ముందుగా వేసిన వల ప్రకారం వారి దగ్గర్నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. లంచం తీసుకున్న అధికారి చేతులను సోడియం బైకార్బొనేట్ మిశ్రమంలో ముంచుతారు. అంతకుముందే లంచంగా తీసుకున్న నోట్లకు ఉండే ఫినాల్ఫ్తలీన్ పౌడర్ వారి చేతులకు అంటుకుంటుంది. ఎపుడైతే ఈ ద్రావణంలో చేతులు ముంచుతారో, సోడియం బైకార్బొనేట్ మిశ్రమం కాస్తా పింక్ రంగులోకి మారుతుంది. దీంతో వారు లంచం తీసుకున్నారని ధృవీకరించుకుంటారు. పింక్ రంగులోకి మారిన ఆ మిశ్రమమే కీలక సాక్ష్యంగా ఉంటుంది. -
100 శాతం ఆర్‌పీఈటీ బాటిళ్లు.. దేశంలో ఫస్ట్ టైమ్!
సాక్షి, న్యూఢిల్లీ: కోకా–కోలా సంస్థ 100 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటిరీయల్ (ఆర్‌పీఈటీ) తో రూపొందించిన కిన్లే సీసాలను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసింది. 100శాతం ఆర్పీఈటీతో రూపొందించిన సీసాను ఆహారం/పానీయాల కోసం ఉపయోగించడం దేశంలో ఇదే మొదటిసారి అని సంస్థ ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యర్థాలు లేని ప్రపంచం సృష్టించే క్రమంలో 2030 నాటికి ప్యాకేజింగ్‌లో కనీసం 50శాతం రీసైకిల్డ్ బాటిళ్లను ఉపయోగించే లక్ష్యంతో సంస్థ ఉన్నట్లు టెక్నికల్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్రిక్ అకర్మాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కోకా–కోలా ఫ్రాంచైజ్ భాగస్వామి సర్వారాయ సుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్బీపీపీ రామ్మోహన్ మాట్లాడుతూ... సంస్థ నిర్ణయం సుస్థిరమైన ప్లాస్టిక్ వాడకంపై ప్రభుత్వ దృక్పథానికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. -
పెట్ బాటిళ్లతో దుస్తులు.. శ్రీకారం చుట్టిన ఐవోసీ
బెంగళూరు: చమురు రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాడి పడేసిన పెట్ బాటిళ్లను ఏటా రీసైకిల్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణ అనుకూల వస్త్రాలను తయారు చేస్తారు. ఇందుకు ప్రతి సంవత్సరం 10 కోట్ల బాటిళ్లను రీసైకిల్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ పంపులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల సిబ్బందికి ఈ వస్త్రంతో అన్బాటిల్డ్ పేరుతో యూనిఫాం తయారు చేస్తారు. సౌర శక్తితో సైతం పనిచేసే వంటింటి స్టవ్‌లను ఐవోసీ రూపొందించింది. సూర్యుడు లేని సమయంలో ఎల్పీజీ, పైప్డ్ గ్యాస్‌తో స్టవ్ పనిచేస్తుంది. అన్బాటిల్డ్ యూనిఫాం, స్టవ్‌ను ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సమీప భవిష్యత్తులో 3 కోట్ల గృహాలకు ఈ స్టవ్‌లు చేరతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్బాటిల్డ్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దది అని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు విక్రయ కంపెనీల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇతర సంస్థలు, రిటైల్ విక్రయాల కోసం యూనిఫాంలు తయారు చేస్తామన్నారు. యుద్ధానికి కాకుండా ఇతర సమయాల్లో వేసుకునేలా సాయుధ దళాల కోసం దుస్తులు సైతం రూపొందిస్తారు. -
ప్లాస్టిక్ భవంతి
ప్లాస్టిక్ చెత్త ప్రపంచవ్యాప్త సమస్య. పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్తలో రీసైక్లింగ్ జరుగుతున్నది చాలా తక్కువే! రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించు కుంటున్న సందర్భాలు మరింత అరుదు.రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించుకున్న తీరుకు ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనమే ఉదాహరణ. ఇది తైవాన్ రాజధాని తైపీ నగరంలో ఉంది. ‘ఎకో ఆర్క్’ పేరిట నిర్మించిన ఈ భవంతి ముందు భాగంలోని నిర్మాణమంతా రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో చేపట్టడం విశేషం. ఏకంగా పదిహేను లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో ఈ నిర్మాణం చేపట్టారు. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను నేరుగా వాడకుండా, వాటిని కరిగించి, మళ్లీ బాటిల్స్‌గా తయారు చేసి ముందుభాగం నిర్మాణానికి ఉపయోగించారు. వీటిని ఒకేరకమైన ఆకృతిలో, ఒకే పరిమాణంలో తయారు చేశారు. దీనివల్ల వీటిని సులువుగా ఉక్కుఫ్రేమ్లో ఒకదానినొకటి జోడించి, చతురస్రాకారపు ప్యానెళ్లుగా అసెంబుల్ చేసి, పటిష్ఠంగా భవంతిని నిర్మించారు. భవనంలోని మిగిలిన భాగాలను రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించారు.ఈ భవంతికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో రాత్రివేళ వెలిగే 40వేల ఎల్ఈడీ బల్బులకు కావలసిన మొత్తం విద్యుత్తును సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ ద్వారా అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లు పారదర్శకంగా ఉండటం వల్ల పగటివేళలో వెలుతురు కోసం విద్యుత్ బల్బులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. కాబట్టి దీనివల్ల వాతావరణంలోని కర్బన ఉద్గారాల సమస్య కూడా పెద్దగా ఉండదు.కాంక్రీట్ భవంతితో పోల్చుకుంటే, దీని బరువు సగాని కంటే తక్కువగానే ఉంటుంది. అలాగని దీని దారుఢ్యాన్నేమీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటారా? తుపానులు చెలరేగినప్పుడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలులనైనా ఈ భవంతి ఇట్టే తట్టుకోగలదు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కోసం, నిప్పు తగులుకోకుండా దీనికి ప్రత్యేకమైన రసాయన కోటింగ్ కూడా పూశారు. కాబట్టి, తుపానులు, అగ్నిప్రమాదాల వల్ల ఈ భవంతికి వచ్చే ముప్పేమీ ఉండదు.తైపీలో ఏడేళ్ల కిందట జరిగిన అంతర్జాతీయ ప్రదర్శన కోసం అర్థర్ హువాంగ్ అనే డిజైనర్ ఈ భవంతిని ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. తైవాన్‌లో ఏటా చెత్తలోకి చేరుకుంటున్న 45 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను పునర్వినియోగంలోకి తెచ్చే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమతో, పట్టుదలతో ఈ భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణం కోసం 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) ఖర్చయింది. ఇస్మాయిల్ -
మద్యం బాటిళ్లతో గాజుల తయారీ... జీవనోపాధి ఇస్తూ...వ్యర్థాలకు చెక్
పట్నా: బిహార్‌లో ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడుతోంది. దీంతో స్వాధీనం చేసుకున్న బాటిళ్లను పారవేయడంలో తరుచుగా సమస్యలు ఎదుర్కొంటున్నామని బిహార్ ఎక్సైజ్ శాఖ మంత్రి సునీల్ కుమార్ అన్నారు. ఈ మద్యం బాటిళ్లను మట్టిని తొలగించే ఎర్త్ మూవర్ మిషన్లతో చితక్కొట్టడం వల్ల భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అందుకని ఈ వ్యర్థాలను తగ్గించేలా జీవనోపాధిని ఇచ్చేలా బిహార్ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అదే మద్యం బాటిళ్లతో గాజుల తయారీ. ఈ గాజుల తయారీని 'జీవిక పథకానికి' చెందిన మహిళలకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఒక తయారీ యూనిట్‌ని కూడా ఏర్పాటు చేసేందుకు బిహార్‌ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోహిబేషన్ శాఖ అందుకోసం దాదాపు కోటి రూపాయాల మొత్తాన్ని మంజూరు చేసింది. దీంతో ప్రోహిబేషన్ శాఖ గాజుల తరయారీ ముడి సరుకు కోసం జీవనోపాది కార్మికులను నియమించుకుంటుంది. ఆ కార్మికులకు పగిలిన మద్యం బాటిళ్ల పొడిని అందజేస్తారు. ఆ జీవనోపాది కార్మికులు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గాజులు తయారు చేయడంలో శిక్షణ పొందుతారు. తొలుత తయారీ యూనిట్ల సంఖ్య పరిమితంగా ఉంటుందని రానున్న నెలల్లో మరింతగా పెంచుతామని ప్రోహిబేషన్ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది ఒక కుటీర పరిశ్రమలా పనిచేస్తుందన్నారు. అంతేకాదు దీన్ని మరింతగా విస్తరించగలమా లేదా అనే దానిపై నివేదికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో పేదరిక నిర్మూలన చేయడమే 'జీవిక పథకం' లక్ష్యమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, ముఖ్యంగా మహిళలకు మరింత ఉపాధిని కల్పించడమే ఈ పథకం లక్ష్యం అని చెప్పారు. ఈ ప్రాజెక్టును పట్నాలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి బీహార్‌లో ఏప్రిల్ 2016లో మద్యం నిషేధించబడింది. దీనితో పాటు, మద్యం నిల్వ, వినియోగం, అమ్మకం, తయారీ వంటివి శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. -
సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!
అమలాపురం రూరల్: వరద నీటిలో వెళ్లేందుకు బాధితులు తాత్కాలికంగా అరటి బొందలు, కలపతో తెప్పలు తయారు చేసుకోవడం పరిపాటి. కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామ శివారు దొమ్మేటివారిపాలెంలో వరద నీటిలో చిన్న పిల్లల కోసం వారి కుటుంబీకులు ఖాళీ డ్రింక్ బాటిల్స్‌తో చిన్న తెప్పలను తయారు చేశారు. వాటిపై పిల్లలు కూర్చుని వీధుల్లోనే తిరుగుతున్నారు. వీడని ముంపు గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో కొన్ని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అయితే కొన్ని గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. వివిధ పనులపై స్థానికులు పడవల పైనే రాకపోకలు సాగిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. ప్రజారోగ్యం, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి సారించింది. వరదల కారణంగా పొలాలతో అన్ని ప్రాంతాలు నీట మునగిపోవడంతో పశువుల మేతకు ఇబ్బంది వచ్చింది. దీంతో రైతులు పడవలపైనే పశువుల కోసం గడ్డిని తరలిస్తున్నారు. (క్లిక్: నిర్విఘ్నంగా.. నిర్విరామంగా.. అర్ధరాత్రి నుంచే వంటావార్పు) -
కారు బోల్తా.. లిక్కర్ కిక్కు ఏం చేస్తున్నారో చూడండి!
పట్నా: రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితే ఆ చుట్టు ఉన్న ప్రజలు అయ్యో అనుకుంటూ వారి చేతనైన సహాయం చేయడం సహజం. అయితే ఈ వీడియోలోనూ అలాంటి సీన్ కనిపిస్తుంది. కారు ప్రమాదం జరగడం ఆ ప్రాంత ప్రజలంతా హడావుడిగా కారు దగ్గరకు వచ్చి ఏదో చేస్తుంటారు. అది చూసి వాళ్లది ఎంత జాలి గుండె అనుకుంటే పొరపడినట్లే. అక్కడ జనాలు అంతగా తాపత్రయపడేది అందులోని మనుషుల కోసం కాదు మద్యం బాటిల్స్ కోసం.. అసలేం జరిగిందంటే.. బీహార్‌లోని కైమూర్‌లో మద్యం తీసుకెళ్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. కారులోని ప్రయాణిస్తున్న వారికి గాయలుకావడంతో వారి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడటంతో అందులోని ఉన్న మద్యం డబ్బాలు విరిగిపోయి రోడ్డుపై పడ్డాయి. ఇంకేముంది ఆ కారులో మద్యం ఉందని అక్కడి స్థానికులకు తెలిసింది. ఫ్రీగా లిక్కర్ వస్తుందనేసరికి చేతికి ఎంత దొరికితే అంత సర్దేసి వారి ఇళ్లకు ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు లిక్కర్ కిక్కు కోసం ఎంత కష్టపడుతున్నారోనని కామెంట్లు పెడుతున్నారు. बिहार में शराब देखकर टूट पड़े लोग... महिलाओं ने भी नहीं छोड़ा... बिहार के कैमूर में गुरुवार की सुबह एक कार सड़क किनारे खाई में गिर गई. स्थानीय लोग पहुंचे तो शराब मिली... इसके बाद क्या था... लोग बेकाबू हो गए...कैमूर से दिलीप की रिपोर्ट pic.twitter.com/ujsTbhCaEY — Prakash Kumar (@kumarprakash4u) March 31, 2022 చదవండి: బాహుబలి 2: ప్రభాస్ స్టైల్లో ఏనుగెక్కిన ముసలాయన.. తగ్గేదే లే.. వైరల్ వీడియో -
Lara Wies: చెత్తబుట్టలో పడేసే సీసాలతో అందమైన షాండ్లియర్
కొలరాడోకు చెందిన లారా వీస్ బౌల్డర్‌లో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన ఒక నర్సు. కరోనా విజృంభించడంతో ఉద్యోగ విరమణ చేసిన వారిని సైతం విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే లారాను కూడా కోవిడ్–19 వ్యాక్సిన్లు వేయడంలో సహాయం చేయడానికి మళ్లీ విధులకు ఆహ్వనించారు. దీంతో గత ఏడు నెలలుగా లారా తన సహోద్యోగులతో కలిసి వేలమందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సందర్భంగా అందరిని గౌరవించేలా ఆమె ఏదైనా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేశాక చెత్తబుట్టలో పడేసే సీసాలతో అందమైన షాండ్లియర్ తయారు చేశారు. అలా తయారు చేసిన వ్యాక్సిన్ బాటిళ్ల షాండ్లియర్‌ను ‘లైట్ ఆఫ్ అప్రిసియేషన్’ పేరున హెల్త్ కమ్యూనిటీలో షేర్ చేసింది. అది చూసిన హెల్త్ కమ్యూనిటీ వారు ఎంతో సంతోషంతో ‘‘ఈ ఫోటోను మా ప్రతిభావంతులైన పబ్లిక్ హెల్త్ నర్సుల కోసం మా సిబ్బందిలో ఒకరైన లారావీస్, ఈ అందమైన కళాకృతిని సృష్టించారు. ఆమెకు మా అందరి తరపున కృతజ్ఞతలు’’ అంటూ బౌల్డర్ కౌంటీ పబ్లిక్ హెల్త్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దాంతో ఈ షాండ్లియర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యాక్సిన్లు వేశాక వేల సంఖ్యలో ఖాళీ బాటిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని ఏం చేస్తారో ఇప్పటిదాకా సరైన ప్రణాళిక లేకపోవడంతో ఆ బాటిల్స్‌తో ఏదైనా చేయాలనుకుంది. బాటిల్స్‌ను శుభ్రంగా కడిగి, చిన్నచిన్న రంధ్రాలు చేసి క్రిస్టల్స్ అతికించి అందమైన షాండ్లియర్‌గా మార్చేసింది. ఈ షాండ్లియర్ కోసం దాదాపు 300ల మోడ్రనా వ్యాక్సీన్ సీసాలు, అడుగు భాగంలో అందంగా అలంకరించేందుకు పది జాన్సన్ అండ్ జాన్సన్ బాటిల్స్ వాడింది. ఈ షాండ్లియర్‌ను చూసిన వారంతా ఆమె ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే గౌరవ మర్యాదలను, వ్యాక్సిన్ బాటిళ్లు వృథా కాకుండా కళాఖండాన్ని రూపొందించడాన్నీ అభినందిస్తున్నారు. ‘‘కోవిడ్ విజృంభణ నుంచి ఆరోగ్య కార్యకర్తలు తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యం అందించడం, టీకాలు వేయడంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ దీర్ఘకాల మహా యజ్ఞంలో అలుపూ సలుపూ లేకుండా కృషి చేస్తోన్న వారిని గౌరవించడంతోపాటు వినూత్న రీతిలో ప్రశంసించాలనుకున్నాను. ఈ క్రమంలోనే ఒక కళాకృతి చేయాలనుకున్నాను. కరోనా గతేడాది అంతా చీకటిలో గడిచింది. అందుకే వెలుగులోకి తీసుకు వచ్చే ఐడియాతో... టీకా సీసాలు వృథా కాకుండా వాటితో షాండ్లియర్ రూపొందించాను. బంధాల పరంగా, ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా ఎంతో కోల్పోయినప్పటికీ భవిష్యత్తును కాంతిమంతంగా మార్చేందుకు ‘లైట్ ఆఫ్ అప్రిసియేషన్’గా దీని రూపొందించాను’’ అని లారా చెప్పింది. చదవండి: Maitri Patel: ఇండియాలోనే అతిపిన్న తొలి కమర్షియల్ పైలట్.. ఇంకా -
ఒంగోలు చెన్నకేశవ కాలనీలో దారుణం
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలు చెన్నకేశవ కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో ఒక కుటుంబంపై కొంతమంది వ్యక్తులు పెట్రోల్ ఫైర్ బీర్ బాటిల్స్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. చెన్నకేశవ కాలనీకి చెందిన కుంచాల మహేష్‌కు ఒంగోలు మంగలపాలనికి చెందిన హైపర్ అలీ,అక్రమ్ అలీ,గుంటూరు మహేష్,సుమంత్, గణేష్‌లకు మధ్యఆర్థిక విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఈ గొడవ జరిగినట్లు మహేష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో ఇరువురి మధ్య జరిగిన గొడవలు నేపథ్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కేసులను ఉపసంహరించుకోవాలని మహేష్ కుటుంబంపై మిగిలిన వాళ్లు ఒత్తిడి తెచ్చారు. అయితే మహేష్ కుటుంబ సభ్యులు కేసును ఉపసంహరించుకున్నప్పటికి... పాత కక్షలను మనసులో పెట్టుకొని ఈ దాడులకు తెగ పడినట్లు మహేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
-
వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో..
సాక్షి, కోనేరు సెంటర్ (మచిలీపట్నం): గడిచిన రెండు నెలలుగా తెలంగాణ నుంచి కృష్ణాజిల్లాలోకి అక్రమంగా తరలించిన సుమారు రూ.70 లక్షల విలువ చేసే 14వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు శుక్రవారం ఇక్కడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈబీ డైరెక్టర్ సీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని జిల్లా పోలీసులు కట్టడి చేసిన తీరు అభినందనీయమన్నారు. -
కల్తీ మద్యం సీసాల పట్టివేత
కావలిరూరల్ : పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో కల్తీ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చెన్నకేశవులు తన బృందంతో దాడి చేసి గురువారం పట్టుకున్నారు. కావలిలోని పలు మద్యం దుకాణాల్లో మద్యాన్ని డైల్యూట్ చేసి విక్రయిస్తున్న ట్లుగా కొంతకాలంగా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అను వైన్స్‌పై అధికంగా ఫిర్యాదులు అందడంతో ఎక్సై జ్ అధికారులు గురువారం నిఘా పెట్టారు. ఉదయం షాపు తెరిచిన వెంటనే గుమస్తా లోపలికి వెళ్లి షట్టర్‌ను మూసివేశాడు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌ను ఓపెన్ చేసి అందులో 30 మి.లీ.ల మద్యాన్ని బయటకు తీసి అంతే పరిమాణంలో నీటిని నింపి తిరిగి సీల్‌ను యధాతథంగా బిగించి పెట్టాడు. రబ్బర్ ట్యూబ్ ముక్కతో బాటిల్ మూతను చాకచక్యంగా తీసి కల్తీ చేశాక, అంతే చాకచక్యంగా అమర్చాడు. మద్యం విక్రయించే సమయం కాగానే షాపును ఓపెన్ చేసి తొలుత కల్తీ చేసిన మద్యాన్ని విక్రయించడం మొదలు పెట్టాడు. ఎక్సైజ్ సిబ్బంది కస్టమర్లా వెళ్లి క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి హైడ్రోమీటర్‌తో పరీక్షించగా 25 శాతం ఉండాల్సిన నీటి పరిమాణం 37 శాతంగా ఉంది. దీంతో అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో షాపుపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్తీ జరిగిన ఇంపీరియల్ బ్లూ మద్యం 25 క్వార్టర్ బాటిళ్లు, ఓటీ విస్కీ 12 క్వార్టర్ బాటిళ్లు మొత్తం 37 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గుమస్తా బడెకల శ్రీనును అరెస్టు చేశారు. షాపు యజమాని మందాడి హర్షవర్ధన్‌పై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రమేష్, కావలి ఎక్సైజ్ ఎస్సై ఎస్ శ్రీని వాసులు, సిబ్బంది పాల్గొన్నారు. డైల్యూషన్ ఇలా.. మద్యంలో 25 శాతం వరకు నీటి పరిమాణం ఉంటుంది. నిబంధనల ప్రకారం అంతకు మించి ఉండరాదు. అయితే సీసాలో కొంత మేర మద్యం తీసి వేసి అందులో నీటిని ని ంపుతారు. ఇలా మద్యాన్ని నీటితో కల్తీ చేయడాన్ని డైల్యూషన్ అంటారు. అలాగే ఇంకో విధానంలో క్వార్టర్ అధికంగా ఉండే ప్రీమియం బ్రాండ్స్ మద్యంలో తక్కువ రకం మద్యాన్ని కలుపుతారు. మద్యం వ్యాపారులు లాభాల కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు మద్యం అమ్మకాలలో ఎలాం టి అవకతవకలను ఉపేక్షించమని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చెన్నకేశవులు పేర్కొన్నారు. కావలి ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపామన్నారు. ఇటీవల 59 బెల్టు దుకాణాలపై దాడులు చేశామన్నారు. మద్యం సరఫరా చేసిన మద్యం షాపు యజమానులపైన కేసులు నమోదు చేశామన్నారు. మద్యం వ్యాపారులు లాభాల కోసం అడ్డదారులు తొక్కితే ఉపేక్షించేది లేదన్నారు. ఎక్కడైనా బెల్టుషాపులు ఉన్నా, మద్యం కల్తీ జరుగుతున్నా, ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నా, సమయ పాలన పాటించకపోయినా 94409 02264 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
ఒక కంపెనీ.. 22 బ్రాండ్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్టార్టప్స్ హవా మొదలయ్యాక.. వయసు, అనుభవంతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించిన వారు చాలామందే ఉన్నారు. ప్లసెరో ఇంటర్నేషనల్ కూడా ఈ కోవలోదే. పట్టుమని పాతికేళ్లు లేని ఢిల్లీ కుర్రాడు స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించేసి.. విజయవంతంగా నడిపిస్తున్నాడు. దేశంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా తదితర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 22 బ్రాండ్లు.. నెలకు 3 లక్షల బాటిళ్లు.. రూ.2.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి కంపెనీని తీసుకెళ్లాడు. మరిన్ని వివరాలు ప్లసెరో ఇంటర్నేషనల్ సీఈఓ వేదాంత్ పాడియా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మార్కెటింగ్‌లో పలు ఆన్లైన్ కోర్సులు చేశా. తర్యాత పాకెట్ యాడ్ పేరిట ప్రకటనల విభాగంలో సేవలందించే స్టార్టప్‌ను ప్రారంభించా. సరైన వ్యాపార విధానం లేకపోవటం, అంతర్గత సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల దీన్ని మూసేశా. రెండేళ్ల తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్‌కు ప్రత్యామ్నాయం చూపించాలని సంకల్పించి.. రూ.3 కోట్లతో 2015 మార్చిలో ప్లసెరో ఇంటర్నేషనల్‌ను ప్రారంభించా. దేశంలో స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ తయారు చేసే ఏకైక సంస్థ ప్లసెరోనే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిల్టాన్, సెల్లో వంటి కంపెనీలు ఆయా ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటాయి. మేకిన్ ఇండియా ఉత్పత్తే మా ప్రత్యేకత. 22 బ్రాండ్లు... ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ కొనుగోలు ప్లసెరో నుంచి పెక్స్‌పో, డ్యూమా, క్వాన్‌టాస్, ఎన్ డ్యురా తదితర 22 బ్రాండ్ల వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్, స్పోర్ట్స్, థర్మో మూడు విభాగాల్లో బాటిల్స్ ఉంటాయి. 500 ఎంఎల్, 750 ఎంఎల్ 1,000 ఎంఎల్ సైజుల్లోని బాటిల్స్ ధరలు రూ.325 నుంచి రూ.1,999 వరకూ ఉన్నాయి. దేశంలో 102 మంది డీలర్లున్నారు. ఆన్లైన్లో విక్రయాల కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే 6 నెలల్లో సొంత ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభిస్తాం. బిగ్‌బజార్, డీమార్ట్ వంటి హైపర్‌మార్కెట్లతో పాటూ టెలిషాపింగ్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. నెలకు 3 లక్షల విక్రయాలు; 25 శాతం ఎగుమతులే ఢిల్లీ–హర్యానా సరిహద్దులోని సోనిపట్‌లో 4 ఎకరాల్లో ప్లాంట్ ఉంది. నెలకు 7 లక్షల బాటిళ్ల తయారీ సామర్థ్యం. ప్రస్తుతం 60 శాతమే వాడుతున్నాం. దేశంతో పాటూ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, దుబాయ్‌లోనూ నెలకు 3 లక్షల బాటిల్స్ విక్రయిస్తున్నాం. ప్రధాన బ్రాండ్ అయిన పెక్స్‌పో నెలకు ఆన్లైన్లో 10 వేలు, డీలర్షిప్స్ ద్వారా 85 వేలు విక్రయమవుతోంది. మొత్తం అమ్మకాల్లో ఎగుమతుల వాటా 25 శాతం వరకుంటుంది. మా విక్రయాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎక్కువ. మా మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం. గతేడాది ఈ రెండు రాష్ట్రాల్లో 62 వేల బాటిల్స్ విక్రయించాం. ప్రస్తుతం నెలకు 2.5 కోట్ల ఆదాయాన్ని సాధిస్తున్నాం. నికర లాభం 18% ఉంటుంది. గతేడాది రూ.30 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. ప్రతి నెలా 35% వృద్ధిని నమోదు చేస్తున్నాం. రూ.10 కోట్ల నిధుల సమీకరణ.. వచ్చే ఏడాది కాలంలో రూ.60 కోట్ల ఆదాయం, 50 లక్షల విక్రయాలకు చేరాలని లకి‡్ష్యంచాం. సౌదీ అరేబియా, యూఏఈ దేశాలకూ విస్తరిస్తాం. ఈ ఏడాది ముగిసేలోగా లంచ్ బాక్స్‌లు, కంటైనర్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నాం. ప్రస్తుతం సంస్థలో 225 మంది ఉద్యోగులున్నారు. తొలిసారిగా రూ.10 కోట్ల నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. చర్చలు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో ముగిస్తాం’’. -
మినరల్ బాటిళ్ల వినియోగంపై ఆంక్షలు
గ్యాంగ్‌టక్: పర్యావరణానికి అనుకూలంగా వ్యర్ధాల నిర్వహణకు సిక్కిం ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులోభాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో మినరల్ వాటర్ బాటిళ్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతోపాటు నురగతో కూడిన ఆహార కంటైనర్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఇటీవల రెండు నోటిఫికేషన్లు జారీచేసింది. -
డాక్టర్ రెడ్డీస్ ఆండాన్ సెట్రాన్ ట్యాబ్లెట్ల రీకాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శస్త్రచికిత్సలు మొదలైన వాటిల్లో వాంతుల సమస్యను నివారించేందుకు ఉపయోగించే ఆండాన్సెట్రాన్ ట్యాబ్లెట్ల 50,000 బాటిల్స్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అమెరికా మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. డిగ్రేడేషన్ ప్రమాణాల్లో వైఫల్యం ఇందుకు కారణమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఒక నివేదికలో పేర్కొంది. తాత్కాలికమైన ప్రతికూల ప్రభావాలు చూపే ఔషధాల కేటగిరీ కిందకి వచ్చే ఈ రీకాల్ మార్చి 30న మొదలైనట్లు వెల్లడించింది. -
నట్టింట్లో గెలాక్సీ!
ఇంటికి - ఒంటికి మీ ఇంట్లో పాతబడిన సీసాలున్నాయా..? అయితే మీ ఇంట్లో పాలపుంత (గెలాక్సీ) ఉన్నట్లే. ఎందుకంటే ఫొటోలో కనిపిస్తున్న గెలాక్సీ జార్లు తయారైంది ఆ పాత సీసాలతోనే. సాధారణంగా సీసాలు వాడే కొద్దీ మసగ్గా, అంద విహీనంగా కనిపిస్తుంటాయి. అలాంటివి మన ఇళ్లల్లో బోలెడన్ని ఉంటాయి. వాటిని పడేయకుండా, రీ మోడల్ చేసి... ఇలా కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే? కావలసినవి: పాత సీసాలు, వివిధ రంగుల గ్లో ఇన్ ది డార్క్ పెయింట్స్ (షాపుల్లో దొరుకుతాయి), పెయింట్ బ్రష్ తయారీ విధానం: ముందుగా సీసాలను శుభ్రం చేసుకొని, పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత పెయింట్‌ను ఓ దళసరి పేపర్ లేదా ఏదైనా మూతపై వేయాలి. బ్రష్‌తో కొద్ది కొద్దిగా పెయింట్‌ను తీసుకొని ఆ జార్‌పై చుక్కలు (చిన్నవి లేదా పెద్దవి) పెట్టుకోవాలి. అలా ఎన్ని రంగుల చుక్కలనైనా పెట్టుకోవచ్చు. చుక్కలే కాకుండా ఏవైనా డిజైన్లు కూడా వేసుకోవచ్చు. కొన్ని జార్లకు ఒకే రంగు చుక్కలు, మరి కొన్నిటికి రకరకాల రంగుల చుక్కలు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వాటిని ఎండలో కానీ బాగా వెలుతురున్న చోట రెండు గంటలపాటు ఉంచాలి. అప్పుడే ఆ పెయింట్ చార్జ్ అవుతుంది. తర్వాత వీటిని చీకట్లో పెడితే... నిజంగా పాలపుంతే మన ఇంటికి వచ్చిందా అనిపిస్తుంది. పిల్లల బెడ్రూముల్లో కనుక వీటిని బెడ్లైట్లుగా పెడితే భలే సరదా పడతారు. -
ఇప్పుడు కూడా పారేస్తారా?!
వేసవి అప్పుడే దాడి చేస్తోంది. దాహంతో చంపేస్తోంది. దాన్ని చల్లార్చుకోవడానికి మన ఫ్రిజ్‌ని కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్‌తో నింపేస్తాం. ఆపైన వాటిని ఖాళీ చేస్తాం. ఆ తర్వాత ఖాళీ అయిన ఆ సీసాలను ఏం చేస్తాం? డస్ట్ బిన్లో వేస్తాం. అలా వేయడంలో గొప్పేముంది... అందరూ చేసేది అదేగా అనుకున్నారు కొంతమంది. వాటితో ఏం చేద్దామా అని చించీ చించీ కొన్ని కొత్త వస్తువులకు రూపకల్పన చేశారు. వాడేసిన ప్లాస్టిక్ బాటిల్‌తో ఒకరు పెన్సిల్ స్టాండ్ చేస్తే, మరొకరు ఫ్లవర్‌వాజ్ చేశారు. ఇంకొకరు జ్యూయెలరీ స్టాండ్ తయారుచేస్తే... మరొకరు దాన్ని మధ్యకు కత్తిరించి, జిప్ పెట్టి, పౌచ్లా మార్చి పారేశారు. కొందరైతే వాటికి రంగులేసి తమ చిన్నారులకు ఆట వస్తువులుగా కూడా మార్చేశారు. సృజన ఉండాలే కానీ మన కంటికి ఏదీ పనికి రానిదిగా కనిపించదు. అందుకు ఇవే ఉదాహరణ. మీ ఇంట్లోనూ వాడేసిన ప్లాస్టిక్ సీసాలు ఉండి ఉంటాయి. వాటితో మీరేం చేయగలరో, ఇతర పనికిరాని వస్తువులతో కూడా కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచించండిక! -
సాస్ ఇక సీసాకు అంటుకోదు...
టొమాటో సాస్, చిల్లీ సాస్ వంటివి సీసాల్లో దొరుకుతుంటాయి. పూర్తిగా వాడేసిన తర్వాత కూడా ఇవి ఎంతో కొంత మేరకు సీసా లోపలి గోడలకు అంటుకునే ఉంటాయి. వాటిని బయటకు తీయలేక ఆ సీసాలను అలాగే పారేస్తాం. చివరి చుక్క వరకు కెచప్, సాస్ సీసాలను ఖాళీ చేద్దామనుకుంటే మనకు సాధ్యం కాదు. అయితే, ఈ సమస్యకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) విద్యార్థులు విరుగుడు కనిపెట్టారు. సాస్, కెచప్ వంటి చిక్కని ద్రావకాలను భద్రపరచే సీసాలకు లోపలిపూతగా ఉపయోగించేందుకు వీరు ‘లిక్విగ్లైడ్’ అనే పదార్థాన్ని రూపొందించారు. ఈ పూత పూసిన సీసాలలో భద్రపరచిన సాస్, కెచప్ వంటి చిక్కని ద్రవాలు చివరి చుక్క వరకు తేలికగా జారిపోయి బయటకు వచ్చేస్తాయి. సీసా ఖాళీ అయిన తర్వాత అందులో ఎలాంటి మరకలూ కనిపించవు. అయితే, ఈ ‘లిక్విగ్లైడ్’ ఒక్కో రకమైన పదార్థానికి ఒక్కో రకంగా తయారు చేయాల్సి ఉంటుందని, సాస్, కెచప్ వంటి ఆహార పదార్థాలు భద్రపరచే సీసాల కోసం ఒకరకంగా, హెయిర్ క్రీములు వంటివి భద్రపరచే ట్యూబులు, సీసాల కోసం మరో రకంగా తయారు చేయాల్సి ఉంటుందని ఎంఐటీ విద్యార్థులు చెబుతున్నారు.