సాక్షి, న్యూఢిల్లీ: కోకా–కోలా సంస్థ 100 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటిరీయల్ (ఆర్‌పీఈటీ) తో రూపొందించిన కిన్లే సీసాలను తెలుగు రాష్ట్రాల మార్కెట్‌లోకి విడుదల చేసింది. 100శాతం ఆర్‌పీఈటీతో రూపొందించిన సీసాను ఆహారం/పానీయాల కోసం ఉపయోగించడం దేశంలో ఇదే మొదటిసారి అని సంస్థ ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వ్యర్థాలు లేని ప్రపంచం సృష్టించే క్రమంలో 2030 నాటికి ప్యాకేజింగ్‌లో కనీసం 50శాతం రీసైకిల్డ్ బాటిళ్లను ఉపయోగించే లక్ష్యంతో సంస్థ ఉన్నట్లు టెక్నికల్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్‌రిక్ అకర్‌మాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కోకా–కోలా ఫ్రాంచైజ్ భాగస్వామి సర్వారాయ సుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌బీపీపీ రామ్మోహన్ మాట్లాడుతూ... సంస్థ నిర్ణయం సుస్థిరమైన ప్లాస్టిక్ వాడకంపై ప్రభుత్వ దృక్పథానికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment