
మినరల్ బాటిళ్ల వినియోగంపై ఆంక్షలు
గ్యాంగ్‌టక్: పర్యావరణానికి అనుకూలంగా వ్యర్ధాల నిర్వహణకు సిక్కిం ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులోభాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో మినరల్ వాటర్ బాటిళ్ల వినియోగంపై ఆంక్షలు విధించింది.
దీంతోపాటు నురగతో కూడిన ఆహార కంటైనర్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఇటీవల రెండు నోటిఫికేషన్లు జారీచేసింది.