
తెలంగాణ నుంచి అక్రమంగా తరలించిన 14వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు.
సాక్షి, కోనేరు సెంటర్ (మచిలీపట్నం): గడిచిన రెండు నెలలుగా తెలంగాణ నుంచి కృష్ణాజిల్లాలోకి అక్రమంగా తరలించిన సుమారు రూ.70 లక్షల విలువ చేసే 14వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు శుక్రవారం ఇక్కడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈబీ డైరెక్టర్ సీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని జిల్లా పోలీసులు కట్టడి చేసిన తీరు అభినందనీయమన్నారు.