
పట్నా: రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితే ఆ చుట్టు ఉన్న ప్రజలు అయ్యో అనుకుంటూ వారి చేతనైన సహాయం చేయడం సహజం. అయితే ఈ వీడియోలోనూ అలాంటి సీన్ కనిపిస్తుంది. కారు ప్రమాదం జరగడం ఆ ప్రాంత ప్రజలంతా హడావుడిగా కారు దగ్గరకు వచ్చి ఏదో చేస్తుంటారు. అది చూసి వాళ్లది ఎంత జాలి గుండె అనుకుంటే పొరపడినట్లే. అక్కడ జనాలు అంతగా తాపత్రయపడేది అందులోని మనుషుల కోసం కాదు మద్యం బాటిల్స్ కోసం..
అసలేం జరిగిందంటే..
బీహార్‌లోని కైమూర్‌లో మద్యం తీసుకెళ్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. కారులోని ప్రయాణిస్తున్న వారికి గాయలుకావడంతో వారి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడటంతో అందులోని ఉన్న మద్యం డబ్బాలు విరిగిపోయి రోడ్డుపై పడ్డాయి. ఇంకేముంది ఆ కారులో మద్యం ఉందని అక్కడి స్థానికులకు తెలిసింది. ఫ్రీగా లిక్కర్ వస్తుందనేసరికి చేతికి ఎంత దొరికితే అంత సర్దేసి వారి ఇళ్లకు ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు లిక్కర్ కిక్కు కోసం ఎంత కష్టపడుతున్నారోనని కామెంట్లు పెడుతున్నారు.
बिहार में शराब देखकर टूट पड़े लोग... महिलाओं ने भी नहीं छोड़ा... बिहार के कैमूर में गुरुवार की सुबह एक कार सड़क किनारे खाई में गिर गई. स्थानीय लोग पहुंचे तो शराब मिली... इसके बाद क्या था... लोग बेकाबू हो गए...कैमूर से दिलीप की रिपोर्ट pic.twitter.com/ujsTbhCaEY
— Prakash Kumar (@kumarprakash4u) March 31, 2022
చదవండి: బాహుబలి 2: ప్రభాస్ స్టైల్లో ఏనుగెక్కిన ముసలాయన.. తగ్గేదే లే.. వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment