జేడీయూ నేతపై దాడి.. వీడియో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ | jdu leader Assaulted In Bihar Bhagalpur Video viral | Sakshi
Sakshi News home page

జేడీయూ నేతపై దాడి.. వీడియో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌

Published Sun, Jun 2 2024 11:16 AM | Last Updated on Sun, Jun 2 2024 11:16 AM

jdu leader Assaulted In Bihar Bhagalpur Video viral

పట్నా: జనతా దళ్‌యునైటెడ్‌ (జేడీయూ) నేత రాజ్‌దీప్‌ అలియాస్‌ రాజ్‌ యాదవ్‌పై శనివారం భాగల్‌పూర్‌లో గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడి చేశారు. పర్‌బాతీ చౌక్‌ వద్ద ఉన్న మార్కెట్‌లోకి రాజ్‌యాదవ్‌ను లాక్కెళ్లి దుండగులు కర్రలు, రాడ్లతో విక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా దాడి చేసిన అనంతరం తమ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని దుండగులు రాజ్‌యాదవ్‌ను బలవంతపెట్టారు.

 

ఈ ఘటనను రికార్డు చేసిన దుండగులు ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేవారు. దీంతో దాడికి సంబంధించిన ఈ వీడియో వైరల్‌గా మారింది. తీవ్ర గాయాల పాలైన  రాజ్‌యాదవ్‌ను  స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుల్లో ఒకడైన చందర్‌ యాదవ్‌ అనే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement