assaulted
-
గచ్చిబౌలిలో దారుణం.. ప్రైవేట్ ఉద్యోగినిపై ఆటోలో లైంగికదాడి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలికి ఆటోలో యువతి వెళ్తుండగా ఆ ఘటన జరిగింది.కోడలిపై అత్త, ఆడపడుచు దాడికోడలిపై అత్త, ఆడపడుచు వేడి నీళ్లు పోవడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన నజియా బేగంకు సంతోష్‌నగర్ ఓవైసీ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్‌తో వివాహం జరిగింది. షేక్ షబ్బీర్ ప్రస్తుతం ఉద్యోగం నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. నజియా బేగంకు నలుగురు సంతానం.అత్త మహ్మదియా బేగంతో తరుచూ గొడవలు జరుగుతుండటంతో నజియాబేగం కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో పిల్లలతో కలిసి వేరుగా నివాసముంటోంది. ఆదివారం పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లడంతో వారిని తీసుకొచ్చేందుకు నజియా బేగం అత్తగారింటికి వెళ్లింది. ఈ సందర్భంగా అత్త, ఆడపడుచుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అత్త మహ్మదియా బేగం, ఆమె కుమార్తె కలిసి నజియా బేగంపై వేడి నీళ్లు పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు నజియా బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా డీఎస్పీపై ఆందోళనకారుల దాడి.. జుట్టు పట్టుకొని లాగి
చెన్నై: విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిపై కొందరు నిరసన కారులు దాడి చేశారు. ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారిణి జుట్టు పట్టుకొని లాగి కొట్టడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకింది. మహిళా అధికారిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులోని విరుద్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. రామనాథపురానికి చెందిన 35 ఏళ్ల ట్రక్ డ్రైవర్ కాళికుమార్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి సమయంలో హతమార్చారు. తిరుచ్చూరి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కాగా నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం హతుడి బంధువులు, కుటుంబీకులు తిరుచ్చూరికి చేరుకుని అందోళనకు దిగారు. అరుప్పుకోట్టై మార్గంలో బైఠాయించి ఆందోళనకు దిగారు. వీరిని బుజ్జగించేందుకు డీఎస్పీ గాయత్రి అక్కడకు వచ్చారు.క్రమంలో నిరసన చేస్తున్న వారిలో కొందరు మహిళలు ఆమెపై దాడి చేశారు. డీఎస్సీ జుట్టు పట్టుకుని లాగి కొట్టడంతో మిగిలిన పోలీ సులు అప్రమత్తమయ్యారు. నిరసన కారులను బలవంతంగా అరెస్టు చేయడానికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య భౌతిక వాగ్వాదం జరిగింది.అయితే తన మీద దాడి చేసినప్పటికీ సంయమనంతో వ్యవహరించిన డీఎస్సీ ఆందోళనకారులను స్వయంగా బుజ్జగించారు. నిందితులను నలుగురిని అరెస్టు చేశామని సూచించడంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. కాగా డీఎస్పీ గాయత్రి సంయమనం, పని తీరును స్థానికులు ప్రశంసించారు.பெண் டிஎஸ்பிக்கு நடந்தது என்ன? அருப்புக்கோட்டையில் அரங்கேறிய திடுக் சம்பவம்!#NakkheeranTV #Aruppukottai #tnpolice pic.twitter.com/iRzV1OcrfW— Nakkheeran (@nakkheeranweb) September 3, 2024 -
ఎయిరిండియా మహిళా సిబ్బందిపై దాడి
ఢిల్లీ:లండన్‌లోని ఓ హోటల్లో ఎయిరిండియాకు చెందిన మహిళా సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆదివారం ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘లండన్‌లో ఎయిరిండియా క్యాబిన్ క్రూ మెంబర్ బస చేసిన హోటల్ రూమ్‌లో గుర్తు తెలియని దుండగుడు అక్రమంగా చొరబడి దాడికి తెగబడ్డాడు. ఆమెపై దాడి చేశాడు. సమాచారం అందిన వెంటనే స్పందించాం. ఆమెకు, ఆమె సహోద్యోగులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నాం’ అని ఎయిరిండియా పేర్కొంది.Air India registers anguish over "unlawful incident of intrusion" after attack on air hostess in London, police begin probeRead @ANI Story lhttps://t.co/6IzBBBBSL0#AirIndia #London #Airhostess pic.twitter.com/MaOXaqh5YD— ANI Digital (@ani_digital) August 18, 2024గురవారం రాత్రి లండన్‌లోని రాడిసన్ రెడ్ హోటల్ రూంలో చొరబడి దాడికి తెగబడిన నిందితుడి అరెస్ట్ చేసినట్లు.. అతను నైజీరియా దేశానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటన ప్రస్తుతం లండన్ పోలీసుల విచారణలో ఉందని, సిబ్బంది గోప్యతను గౌరవించాలని అక్కడి అధికారులకు ఎయిర్ ఇండియా విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిగేలా స్థానిక అధికారులు సహకారం అందిచాలని ఎయిరిండియా కోరింది. -
జేడీయూ నేతపై దాడి.. వీడియో తీసి ఆన్లైన్లో అప్లోడ్
పట్నా: జనతా దళ్యునైటెడ్ (జేడీయూ) నేత రాజ్‌దీప్ అలియాస్ రాజ్ యాదవ్‌పై శనివారం భాగల్పూర్లో గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడి చేశారు. పర్బాతీ చౌక్ వద్ద ఉన్న మార్కెట్లోకి రాజ్‌యాదవ్‌ను లాక్కెళ్లి దుండగులు కర్రలు, రాడ్లతో విక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా దాడి చేసిన అనంతరం తమ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని దుండగులు రాజ్‌యాదవ్‌ను బలవంతపెట్టారు.VIDEO | Bihar: A local JD(U) leader Raja Yadav was thrashed by miscreants over an alleged land dispute matter in Bhagalpur on Saturday. CCTV visuals of the incident. (Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/lQftoVCXov— Press Trust of India (@PTI_News) June 2, 2024 ఈ ఘటనను రికార్డు చేసిన దుండగులు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేవారు. దీంతో దాడికి సంబంధించిన ఈ వీడియో వైరల్‌గా మారింది. తీవ్ర గాయాల పాలైన రాజ్‌యాదవ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుల్లో ఒకడైన చందర్ యాదవ్ అనే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడి
వీరవాసరం: మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీరవాసరం పోలీసులు తెలిపిన వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం పంజావేమవరానికి చెందిన జనసేన కార్యకర్త పంజా నాగేంద్ర అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై సోమవారం రాత్రి లైంగిక దాడి చేశాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న మైనర్ బాలికను కాళ్లు, చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్ సమీపంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధిత బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పి.రమేష్ తెలిపారు. చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు -
ఫ్లైట్‌లో ప్రయాణికుడి వీరంగం.. బాత్రూం డోర్ పగులగొట్టి..
ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానంలో సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విమానం టాయిలెట్ తలుపునూ పగులగొట్టాడు. టొరంటో నుంచి ఢిల్లీ వస్తోన్న విమానంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రయాణికునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేపాల్‌కు చెందిన మహేశ్ సింగ్ పండిత్ అనే ప్రయాణికుడు కెనడా నుంచి ఇండియాకు ఎయిరిండియా విమానంలో బయలుదేరాడు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే తనకు కేటాయించిన సీటులో కాకుండా పక్క సీటులో కూర్చున్నాడు. ఆ తర్వాత టాయిలెట్లో ధూమపానం చేయడంతోపాటు ఆ తలుపును పగలగొట్టాడు. అడ్డుపడిన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై ఎదురుదాడి చేశాడని విమానంలోని సిబ్బంది తెలిపారు. చాలా గొడవ చేసిన తర్వాత ఎట్టకేలకు ప్రయాణికులతో కలిసి నిందితున్ని సీట్లో కూర్చోబెట్టామని విమాన సిబ్బంది తెలిపారు. విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ తోటివారికి అసౌకర్యం కలిగిస్తున్నారు. ముంబయిలోనూ విమానంలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇదీ చదవండి: సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. వీడియో వైరల్.. -
వాహనదారుడి దాష్టికం! కారుతో కానిస్టేబుల్ కాలుని తొక్కించి...
సాక్షి, బంజారాహిల్స్: ఫ్రీ లెఫ్ట్‌లో కారును అడ్డు తొలగించాలని కోరిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై వాహనదారుడు కారుతో కాలును తొక్కించడమే కాకుండా దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని తాజ్‌కృష్ణా జంక్షన్లో ఓ కారు డ్రైవర్ ఫ్రీ లెఫ్ట్‌లో కారు నిలపడంతో అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎల్.నగేష్ అడ్డు తొలగాలని సైగలు చేశాడు. అయినాసరే సదరు వాహనదారుడు వినిపించుకోలేదు. వెంటనే కానిస్టేబుల్ ఆ కారు దగ్గరికి వెళ్ళగా ఆగ్రహంతో ఊగిపోతున్న డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్ కాలుపైకి కారును పోనిచ్చాడు. అంతే కాకుండా కిందకు దిగి పిడిగుద్దులతో దాడి చేసి చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ బట్టలు కూడా చిరిగాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
పదవ తరగతి బాలికపై లైంగిక దాడి చేసిన కీచక టీచర్
-
బంధువు కాదు.. కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): వరుసకు సోదరుడైన పి.గణేష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని రాజోలు మండలం శివకోడుకు చెందిన బాధిత మహిళ అమలాపురంలోని ఎస్పీ కార్యాలయానికి గురువారం వచ్చి ఫిర్యాదు చేసింది. దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి, మానవ హక్కుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావులతో కలిసి బాధితురాలు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఏఎస్పీ లతా మాధురికి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. చదవండి: సంతోషం.. సరదా కబుర్లు.. అంతలోనే ఘోరం.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసు స్టేషన్లో నిందితుడు గణేష్‌పై దిశ కేసు నమోదైందని రాజామణి తెలిపారు. అయిన్పటికీ రాజోలు పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోవడం లేదని వారు ఏఎస్పీకి వివరించారు. నిందితుడిపైనా... కేసు పట్ల సరిగా స్పందించని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని తాము ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రాజామణి, శ్రీనివాసరావు అమలాపురంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. -
అథ్లెట్‌పై అమానుష దాడి.. వీడియో వైరల్
జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ అండర్సన్ పీటర్స్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గ్రెనాడాలో ఓ బీచ్ పార్టీకి హాజరైన అండర్సన్ పీటర్స్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అనంతరం పడవలో నుంచి నీళ్లల్లోకి తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే గొడవ ఎందుకు జరిగింది?దాడి ఎవరు చేశారు? ఏం జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా దాడిలో స్వల్పంగా గాయపడిన అండర్సన్ పీటర్స్, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు గ్రెనాడా పోలీసులు పేర్కొన్నారు. కాగా అండర్సన్ పీటర్స్‌పై దాడిని ఒలింపిక్ కమిటీ ఖండించింది. ‘పీటర్స్‌పై దాడి అమానుష చర్య. నేషనల్ స్పోర్ట్స్ స్టార్, హీరో అయిన అండర్సన్‌పై దాడి చేసిన ఐదుగురిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. అతనిపై దాడి చేసిన వాళ్లు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లు కాదని తెలిసింది.’ అంటూ పేర్కొంది. గ్రేనడా దేశానికి చెందిన అండర్సన్ పీటర్స్.. 2019, 2022 జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్షిప్స్ టైటిల్స్ గెలిచాడు. ఈ ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో 93.07 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన అండర్సన్ పీటర్స్, ఆ తర్వాత స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. #AndersonPeters being beaten by five non-national in #Grenada pic.twitter.com/NrVBJwu2t9 — Do.Biblical.Justice. (@StGeorgesDBJ) August 11, 2022 -
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
జియాగూడ: అభం శుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి వరుసకు బంధువు అయిన వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన కులుస్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బస్తీవాసులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గురువారం కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ అశోక్‌కుమార్, ఎస్.ఐ.సత్యనారాయణ తెలిపిన మేరకు.. రాజస్థాన్‌కు చెందిన దంపతులు కుల్సుంపురా ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈ నెల 17న తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఏడేళ్ల పెద్ద కూతురు ఇంటివద్దే ఆడుకుంటోంది. చిన్నారిని అదే ప్రాంతంలో నివాసముంటున్న జితేందర్ చావ్లా సైకిల్ నేర్పిస్తానని మాయమాటలు చెప్పిపై అంతస్తులోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. అయితే సోనుచావ్లా సోదరుడు సన్నీచావ్లా అక్కడే ఉండటంతో గమనించి నిలదీయడంతో నిందితుడు పరారయ్యాడు. ఇదిలా ఉండగా పెద్దలు జాతీయ రహదారి పీలిమండప్ గుడివద్ద పంచాయితీ చేసి సదరు నిందితుడికి ఏడాదిపాటు కుల బహిష్కరణ చేశారు. అయితే గురువారం బాలిక తల్లిదండ్రులు స్థానికులతో కలిసి నిందితుడికి దేహశుద్ధి చేస్తూ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సచిన్ వీరాభిమానిపై పోలీస్ జులుం.. ప్రారంభోత్సవం చేసిన స్టేషన్లోనే..!
Sachin Die Hard Fan Beaten By Police: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి అంటే తెలియని వాళ్లు బహుశా భారత క్రికెట్ వర్గాల్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు. సచిన్ రిటైర్మెంట్ వరకు టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో అతను స్టాండ్స్‌లో దర్శనమిచ్చే వాడు. ఇంటా, బయటా అన్న తేడా లేకుండా సచిన్ ఆడిన ప్రతి మ్యాచ్‌ను చూసేందుకు అతను ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. అతనికి కొన్ని సందర్భాల్లో బీసీసీఐయే ప్రత్యేక రాయితీలు కల్పించి మ్యాచ్ వీక్షించేందుకు పంపేది. సచిన్ సైతం సుధీర్‌కి చాలా మర్యాద ఇచ్చే వాడు. చాలా సందర్భాల్లో అతన్ని సత్కరించడంతో పాటు అతని అవసరాలను కూడా తీర్చాడు. విదేశాల్లో జరిగే టోర్నీల కోసం అతని విమాన చార్జీలను కూడా సచినే స్వయంగా భరించేవాడు. సచిన్‌ను దైవంతో సమానంగా ఆరాధించే సుధీర్.. క్రికెటేతర కారణాల చేత తొలిసారి వార్తల్లోకెక్కాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ పోలీసులు తనపై దాడి చేసి హింసించారని ఆయన ఆరోపించాడు. ఓ కేసు విషయంలో సోదరుడు కిషన్ కుమార్‌ను ముజఫర్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేయగా, అతన్ని కలిసేందుకు వెళ్లిన తనను స్థానిక డ్యుటీ ఆఫీసర్ దుర్భాషలాడాడని, అంతటితో ఆగకుండా కాళ్లతో తన్ని, స్టేషన్ బయటికి గెంటేశాడని సుధీర్ ఆరోపించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనను దూషించి, గాయపరచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాడు. కాగా, రెండేళ్ల క్రితం ఇదే పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించారని సుధీర్ వెల్లడించడం విశేషం. చదవండి: రైతుగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్.. -
దారుణం.. కన్న కూతురిని గర్భవతి చేసిన కామాంధుడు
గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కాలనాగులా కాటేశాడు. కుమార్తెపై కొన్ని నెలల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగుచూసింది. గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప కథనం మేరకు.. గుంతకల్లులోని భాగ్యనగర్‌కు చెందిన పెయింటర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాగుడుకు బానిసైన ఆ వ్యక్తి పదిహేనేళ్ల వయసు గల తన పెద్ద కుమార్తెపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించాడు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..8 మంది అరెస్టు అయితే.. అనుమానం వచ్చిన బాలిక తల్లి అతన్ని మందలించగా ఆమెపైనా దాడి చేశాడు. చివరకు మూడు రోజుల క్రితం బాలికను తీసుకుని తల్లి గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం గర్భవతి అని నిర్ధారణ కావడంతో అబార్షన్ చేయాలని వైద్యులను కోరారు. ఇందుకు వారు సమ్మతించలేదు. పోలీసులకు సమాచారమిస్తామని తెలిపారు. దీంతో వారు భయపడి ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం తిరిగి సదరు బాలికను కర్నూలు పెద్దాస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. అక్కడా గర్భిణిగా నిర్ధారించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. వారు గుంతకల్లు పోలీసులకు తెలియజేయడంతో ఘటన వెలుగుచూసింది. నిందితుడిపై గుంతకల్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలిస్తామని ఎస్ఐ సురేష్‌బాబు చెప్పారు. -
కుమార్తెపై లైంగిక దాడి, గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్నకూతురిపై కన్నేశాడు. మద్యం మత్తులో ఏడు నెలలుగా శారీరక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బాలిక (14 ) ఐదు నెలల గర్భిణి. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని బాలేశ్వరపురంలో గురువారం వెలుగులోకి వచ్చింది. బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌లో బాలిక ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్సై మాధవరావు కథనం మేరకు..బేస్తవారిపేట మండలంలోని బాలేశ్వరపురానికి చెందిన ఓ వ్యక్తి (49)కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఇద్దరికి వివాహమైంది. 14 ఏళ్ల కుమార్తెతో కలిసి గ్రామానికి సమీపంలోని శింగరపల్లెలో మామిడి తోటలో కాపలాగా ఉంటున్నాడు. జనవరి నెలలో మామిడి తోట నుంచి గ్రామంలోకి సరుకుల కోసం భార్య వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న తండ్రి కుమార్తెపై లైంగికదాడి చేశాడు. ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన తల్లికి కూతురు చెప్పినా.. బయటకు చెబితే చంపేస్తానని అతను బెదిరించడంతో భయపడిన భార్య, కుమార్తెలు నోరుమెదపకుండా ఉండిపోయారు. అప్పటి నుంచి కూతురిని శారీరకంగా అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో బాలిక గర్భం దాల్చింది. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో గలిజేరుగుళ్ల వైద్యశాలలో చూపించారు. బాలిక ఐదు నెలల గర్భిణిగా ఉందని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పడంతో ఈ దారుణంవెలుగులోకి వచ్చింది. బాలిక అవ్వ, తాతలతో కలిసి బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తండ్రి చేసిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పెట్టేందుకు కూతురు వెళ్లిందనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరు సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ చేసి పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వృద్ధురాలిపై లైంగిక దాడి, 20 సార్లు కత్తితో పొడిచి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నడి బొడ్డున అమానుష ఘటన చోటు చేసుకుంది. 62ఏళ్ల వృద్దురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డంతో పాటు, ఆమెను గొంతుకోసం హత్యోందంతం కలకలం రేపింది. నిందితుడు మహిళను 20 సార్లు పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. వివరాలను పరిశీలిస్తే... బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన మహిళ ఢిల్లీలో తన మనవడితో కలిసి నివసిస్తోంది. మనవడు ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, ఆమె స్థానికంగా కూరగాయల విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. మనవడు ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లో జొరబడ్డ నిందితుడు ఆమెపై ఎటాక్ చేశాడు. లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో 20 సార్లు పొడిచి పారిపోయాడు. దీంతో వృద్దురాలు అక్కడికక్కడే మృతి చెందింది. గొంతు, కడుపులో పదునైన గాయాలున్నాయనీ, పోలీసు అధికారి ప్రియాంక కశ్యప్ చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. విచారణ సమయంలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడనీ, కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మద్యం మత్తులో ఆ అఘాయిత్యానికి పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. -
దారుణం : వివాహితపై 17 మంది అఘాయిత్యం
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. 35 ఏళ్ల వివాహితను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధిత మహిళ మార్కెటుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్ళారు. అనంతరం ఆమెపై ఏకంగా 17మంది వ్యక్తులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని దుంకా జిల్లా ముఫాస్సిల్ ప్రాంతంలో జరిగింది. బాధితురాలు, ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి, 17మంది నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని దుంకా డీఐజీ సుదర్శన్ మండల్ చెప్పారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. Jharkhand: A 35-year-old woman was allegedly gang-raped by 17 men in Mufassil area of Dumka on Tuesday evening. "The incident allegedly took place when she was returning to her home from a market. She has been sent for a medical check-up," says DIG Sudarshan Mandal. (09.12) pic.twitter.com/7Rx3AOhLwg — ANI (@ANI) December 10, 2020 -
ట్రంప్‌పై మరోసారి లైంగిక ఆరోపణలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి లైంగిక ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ మోడల్ అమీ డోరిస్ (48) ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆరోపించారు. దీంతో ఇప్పటికే ప్రముఖ అమెరికన్ కాలమిస్ట్ ఇ. జీన్ కారోల్ అత్యాచార ఆరోపణలతో పాటు అనేక లైంగిక దుష్ర్పవర్తన ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్‌పై ప్రస్తుతం డోరిస్ వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా మారాయి. (వైట్‌హౌస్‌లో ఒకరికి పాజిటివ్ : నేను ఓకే!) ది గార్డియన్ కథనం ప్రకారం 1997లో న్యూయార్క్‌లో జరిగిన యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా ట్రంప్ వీఐపీ సూట్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అమీ డోరిస్ ఆరోపించారు. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో వీఐపీ సూట్లో ఉన్న ట్రంప్. తనపట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, తనపై పట్టు సాధించి, బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని, తన శరీరాన్ని అనుచితంగా తాకారని ఆరోపించారు. అపుడు తన వయసు 24 ఏళ్లు అని, ఆ సమయంలో ట్రంప్ వయసు సుమారు 51 సంవత్సరాలు ఉండొచ్చని ఆమె చెప్పుకొచ్చారు. 2016 లోనే ఈ విషయంపై ముందుకు రావాలని భావించినప్పటికీ, కుటుంబ భద్రత, పిల్లల కోసం మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే తన టీనేజ్ కవలకుమార్తెలకు రోల్ మోడల్‌గా ఉండేందుకే ఈ వేధింపులపై ప్రపంచానికి తెలిజేయాలని తాజాగా నిర్ణయించుకున్నానని డోరిస్ చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలపై ట్రంప్ న్యాయవాదులు స్పందించారు. రాజకీయ దురుద్దేశంతో చే్స్తున్న ఆరోపణల తప్ప మరొకటి కాదని కొట్టి పారేశారు. (‘హెచ్1బీ’ కేసులో ట్రంప్‌కు ఊరట) -
అతడిపై కఠిన చర్యలు తీసుకోండి: నిర్మల
న్యూఢిల్లీ : గుజరాత్లో మహిళా బ్యాంక్ ఉద్యోగినిపై దాడి కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాగా సూరత్‌లోని కెనరా బ్యాంక్(ఒకప్పటి సిండికేట్ బ్యాంక్) మహిళా ఉద్యోగినిపై సోమవారం సాయంత్రం ఓ కానిస్టేబుల్ దాడి చేయడమే కాకుండా బ్యాంకులో నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటన అనంతరం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇలాంటి చర్యల నుంచి బ్యాంకు ఉద్యోగులను రక్షించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి బుధవారం మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి పోలీస్ కమిషనర్‌తోపాటు సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి, కేసు విచారణణు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. (కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం) ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె ‘బ్యాంకు ఉద్యోగుల భద్రత ప్రాముఖ్యత. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ బ్యాంకులు తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. బ్యాంకుకు చెందిన మహిళ సిబ్బంది దాడి ఘటనపై డాక్టర్ ధవాల్ పటేల్, సూరత్ జిల్లా కలెక్టర్, కమిషనర్ భ్రాంభట్తో మాట్లాడాను. మహిళా బ్యాంక్ ఉద్యోగి ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. ఈ కేసుపై సకాలంలో చర్యలు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే నిందితుడు కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేస్తామని పోలీస్ కమిషనర్ భ్రాంభట్ పేర్కొన్నారు’ అని నిర్మలా తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. (అక్టోబర్‌లో తారస్థాయికి.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్! ) -
ప్రేమ జంటపై దుండగులు దాడి
-
యూపీలో ఆగని నేరాలు
ముజఫర్‌నగర్/భాగపట్: ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళల మీద లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. అత్యాచార అవమానాన్ని తట్టుకోలేని యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోచోట.. ఒంటరిగా మహిళ కనిపిస్తే మృగాళ్లు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగపట్‌లోని 15 ఏళ్ల యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ యువతిపై నాలుగు నెలల కిందట ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిమీద పోలీస్ కేసు పెట్టగా.. నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు సోను, మను, రోహిత్, సాగర్, పప్పులు తరువాత తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుంచి కేస్‌ను వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపే ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు. కేసు ఉపసంహరించుకోకపోతే మళ్లీ అత్యాచారం చేస్తామని బెదిరించారు. దీంతో అవమాన భారంతో ఈ యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇక, ముజఫర్‌నగర్‌కు సమీపంలోని పచేంద అనే గ్రామంలో నివసించే ఒక దళిత బాలికపై జాట్ తెగకు చెందిన నలుగురు యువకులు ఆదివారం ఉదయం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామంలోని దళిత మైనర్ బాలిక ఆదివారం ఉదయం ఇంటికి వస్తోంది. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆమెపట్ల తొలుత అసభ్యంగా మాట్లాడి అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. దళిత యువతిపై లైంగిక దాడి జరగడంతో గ్రామంలో దళితులు, జాట్ల ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
వివాదాస్పద రచయితపై దాడి
బెంగళూరు: కర్నాటక కల్చరల్ యాక్టివిస్ట్ యోగేష్ మాస్టర్ పై కొంతమంది దుండుగులు దాడికి పాల్పడ్డారు. దావణ గిరిలోని ఆయనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంకుదాడి చేశారు. వివాదాస్పద కన్నడ రచయిత యోగేష్ పై ఆదివారం భౌతికంగా దాడికి తెగబడ్డారు పబ్లిగ్గా అందరూ చూస్తుండగానే సుమారు ఆరుగురు యువకులు ఆయన్ని కొట్టి ముఖంపై నల్ల రంగు పులిమి అవమానించడం వివాదానికి దారి తీసింది. ప్రముఖ పాత్రికేయుడు పి. లంకేష్ 82 వ జయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా ఈ దాడి జరిగింది. సంఘటన అనంతరం యోగేష విలేకరులతో మాట్లాడారు. "జై శ్రీ రామ్" నినాదాలతో బైక్ పై వచ్చిన సుమారు ఆరుగురు వ్యక్తులు, తనను కొట్టి, దాడిచేశారని, ఇంకు పోసి, చొక్కా చించివేశారని ఆరోపించారు. ఫంక్షన్ తరువాత బాపూజీ డెంటల్ కాలేజ్ రోడ్ లో ఒక టీ స్టాల్ వద్ద టీ తాగడానికి వెళ్ళినప్పుడు సంఘటన జరిగిందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పలువురు జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు స్పందించారు. జర్నలిస్టు గౌరి లంకేష్, సీపీఐ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యులు సిద్దన్న గౌడ్ పాటిల్, కార్మికనాయకులు తీవ్రంగా ఖండించారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉందంతంపై రచయిత దావణగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా యోగేష్ మాస్టర్ రచించిన ‘దుంది కరణ్యకనోబ్బ గణపతియాదే కథ’ పుస్తకం వివాదాన్ని సృష్టించింది. దీనిపై నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ పలు హిందూత్వ సంఘాలు ఆందోళనకు దిగాయి. వారి అభ్యంతరాల తర్వాత ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
మేం చెప్పేది చేయవా అంటూ దారుణం
పాలన్పూర్: గుజరాత్ లో మరోసారి గోవు వివాదం రగులుకుంది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తీసేందుకు నిరాకరించిన ఓ దళిత గర్భిణీ స్త్రీ, ఆమె భర్త, మరో వ్యక్తిపై కొందరు అగ్రకులస్తులు దాడి చేశారు. వారిని తీవ్రంగా గాయపరచడంతో ఆస్పత్రి పాలయ్యారు. గుజరాత్ లోని బనస్కంత జిల్లాలోని అమిర్ గఢ్ తాలుగా కర్జా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్జా అనే గ్రామంలో సంగీత రణవాసియా(25), నిలేశ్ రనవాసియా అనే ఇద్దరు భార్యభర్తలు. వీరు దళితులు. దర్బార్ అనే కమ్యూనిటికీ చెందిన అగ్రకులస్తులు తమ పొలంలో ఆవు చనిపోయిందని, దాని కళేబరాన్ని తీసి పారేసేందుకు రావాలని రనవాసియాను వారు అడిగారు. అయితే, ఇప్పుడు తాము ఆ పనిచేయడం లేదని బదులిచ్చారు. తాము చెప్పిన మాట వినవా అంటూ ఓ పదిమంది అతడిపై దాడి చేస్తుండగా ఐదునెలల గర్భవతి అయిన సంగీత అడ్డుపడబోయింది. దీంతో ఆమెపై కూడా చేయిచేసుకున్నారు. అడ్డొచ్చిన మరో ఆరుగురిపైనా దాడి చేశారు. దీంతో వారంతా ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. -
మూడేళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి
బెంగళూరు(బనశంకరి): మూడేళ్ల చిన్నారిపై బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన తలఘట్టపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. తలఘట్టపురలో నివాసం ఉంటున్న 13ఏళ్ల బాలుడు ఆడుకునే నెపంతో ఆ గ్రామానికి చెందిన ఓ బాలికను ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. గంట తరువాత తీవ్రమైన కడుపు నొప్పితో ఇంటికి చేరుకున్న బాలిక ఘటన గురించి తల్లికి తెలియజేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా లైంగికదాడి జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.అనంతరం బాలమందిరానికి తరలించారు. -
చిన్నారితో పాఠశాల అటెండర్ అసభ్యప్రవర్తన
ఆదిలాబాద్: నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆ పాఠశాల అటెండర్ అసభ్యంగా ప్రవర్తించటంతో ఆమె కుటుంబసభ్యులు దేహశుద్ధి చేశారు. వివరాలివీ.. మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లోని ఆల్ఫోన్సా పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థినితో ఆ పాఠశాల అటెండర్ శ్రీనివాస్ సోమవారం ఉదయం అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ బాలిక సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు ఆ విషయం తెలిపింది. దీంతో వారు కుటుంబసభ్యులతో కలసి మంగళవారం పాఠశాలకు వచ్చి, నిర్వాహకులను నిలదీశారు. అటెండర్ శ్రీనివాస్‌ను చితకబాదారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ, బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్ నాయకులు పాఠశాలకు ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాలకు తాళం వేసి ప్రై వేటు పాఠశాలలను బంద్ చేయించారు. ఎంఈవో పోచయ్య విచారణ జరిపారు. నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాకేష్ తెలిపారు. -
లైంగిక వేధింపులకు పాకిస్తాన్లో బాలుడి ఆత్మహత్య
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు 14 ఏళ్ల బాలున్ని లైంగికంగా వేధించడంతో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు..పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు చెందిన మొహ్మద్ అక్రంను ముగ్గురు వ్యక్తులు లైంగికంగా వేధించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా, కేసు నమోదు చేయడానికి 50వేలు డిమాండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు రైలు నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు.