లైంగికంగా వేధించారు | Family says NRI student was sexually assaulted | Sakshi
Sakshi News home page

లైంగికంగా వేధించారు

Published Sun, Sep 22 2013 11:46 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Family says NRI student was sexually assaulted

న్యూఢిల్లీ: కుటుంబ సభ్యుల ఆరోపణలతో ప్రవాస భారతీయ విద్యార్థి అన్మోల్ హత్య కేసు కొత్తమలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ బిడ్డను లైంగికంగా వే ధించి హత్య చేశారని అన్మోల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డజన్ మందికిపైగా అతని స్నేహితులతో కలిసి కల్కాజీ ఠాణా ముందు ఆదివారం ఆందోళనకు దిగారు.  శవపరీక్ష నివేదికలో కూడా అతని మర్మాంగాలపై గాయాలున్నట్లు తేలడంతో కుటుంబ సభ్యుల ఆరోపణల్లో కూడా నిజ ముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితులతో కలిసి సెప్టెంబర్ 13న పార్టీ చేసుకున్న అన్మోల్ హత్యకు గురైన విషయం తెలి సిందే. దీనిపై అతని తండ్రి అనిల్ సర్నా మాట్లాడుతూ... ‘పోలీసుల దర్యాప్తు సరైన రీతిలో సాగడం లేదు.
 
 కేవలం డ్రగ్స్ తీసుకున్నందునే అన్మోల్ మరణించినట్లు పోలీసులు చెబుతున్నా రు. అతని తలపై ఉన్న గాయం గురించి పోలీ సులు ఎందుకు ఆలోచించడంలేదు? పోస్ట్‌మార్టం తర్వాత కూడా గాయం విషయమై పోలీసులు ఎటువంటి వివరాలు సేకరించలేద’న్నారు. గాయం కారణంగా తలలోనుంచి తీవ్రమైన రక్తస్రావమవుతుండడంతో సౌత్‌పార్క్ అపార్ట్‌మెం ట్ కాంప్లెక్స్ నుంచి అన్మోల్‌ను ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న అన్మోల్ చికిత్స పొందుతూ మరణించాడు.
 
 అయితే గాయం ఎలా అయ్యిందన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగడం లేదనేది అన్మోల్ కుటుంబ సభ్యుల వాదన. డ్రగ్స్ తీసుకున్న అన్మోల్ మితిమీరి ప్రవర్తించడంతో సెక్యూరిటీ సిబ్బంది అన్మోల్‌ను కొట్టారని ఆరోపణలు వినిపించాయి. అయితే పోలీసులు ఇప్పటిదాకా సెక్యూరిటీ సిబ్బంది కొట్టారనే విషయాన్ని కూడా బయటకు వెల్లడించడంలేదు. గాయం కారణంగా జరిగిన రక్తస్రావం, షాక్ అన్మోల్ మృతికి కారణమనే విషయాన్ని పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసింది. అంతేకాక ఆయన మర్మాంగాలపై కూడా గాయాలున్నట్లు నివేదికలో పేర్కొంది. దీంతో అతణ్ని లైంగికంగా వేధించి, హత్య చేశారనే కుటుంబ సభ్యుల ఆరోపణలకు బలం చేకూరుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement