జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌లో జిల్లా విదార్థి ప్రతిభ | Inspire district vidarthi national talent | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌లో జిల్లా విదార్థి ప్రతిభ

Published Thu, Oct 9 2014 3:54 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Inspire district vidarthi national talent

విద్యారణ్యపురి :  న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో బుధవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్‌స్పై ర్‌లో వరంగల్‌కు చెందిన విద్యార్థిని పూజిత ప్రతిభ కనబరిచారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రస్థాయి ఇన్‌స్పై ర్ వరంగల్‌లో జరిగిన విషయం విదితమే.

ఈ సందర్భంగా పది జిల్లాల నుంచి 35 ఎగ్జిబిట్లను జాతీయ స్థాయికి ఎంపిక చేయగా, ఇందులో జిల్లాకు చెందిన ఆరు ఎగ్జిబిట్లు ఉన్నాయి. వీటిని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌లో ప్రదర్శించగా, వరంగల్‌లోని సిటీ హైస్కూల్ విద్యార్థిని పూజిత సురక్షిత రైల్వే క్రాసింగ్ ఎగ్జిబిట్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి మొదటి, ద్వితీయ బహుమతులు అందజేశారు.
 
వీరిలో పూజిత ఇన్‌స్పైర్ ముగింపు సభలో మొదటి బహుమతిని ప్రముఖ శాస్త్రవేత్తల నుంచి అందుకుందని జిల్లా సైన్స్‌కేంద్రం అధికారి సిహెచ్ కేశవరావు బుధవారం సాయంత్రం వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement