నాలుగేళ్ల చిన్నారిపై క్లాస్‌మేట్‌ దాడి | 'He Sharpened Pencil, Put It In Too': Delhi Girl, 4, Attacked By Classmate | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చిన్నారిపై క్లాస్‌మేట్‌ దాడి

Published Fri, Nov 24 2017 3:57 AM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM

'He Sharpened Pencil, Put It In Too': Delhi Girl, 4, Attacked By Classmate - Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధానిలో నాలుగేళ్ల చిన్నారిపై అదే తరగతిలోని మరో విద్యార్థి దాడికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి మాక్స్‌ఫోర్ట్‌ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి(5) బాలిక మర్మాంగంపై వేలితో, పదునైన పెన్సిల్‌తో దాడికి పాల్పడ్డాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నవంబర్‌ 17న ఈ ఘటన జరిగిన సమయంలో సీనియర్‌ విద్యార్థులు, టీచర్లు ఎవ్వరూ సమీపంలో లేకపోవడంతో ఆ విద్యార్థి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆ రోజు రాత్రి చిన్నారి నిద్రపోయేముందు తీవ్రమైన నొప్పితో ఏడుస్తుండటంతో ఆమె తల్లి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై బాలిక తల్లి మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం చోటుచేసుకుందని ఆరోపించారు. సదరు అబ్బాయిని వేరే సెక్షన్‌కు మార్చినందున బాలికను తిరిగి పాఠశాలకు పంపాల్సిందిగా పాఠశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రుల్ని కోరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement